Showing posts with label usefull. Show all posts
Showing posts with label usefull. Show all posts

Tuesday, January 9, 2024

2023 సంవత్సరం అత్యధిక మంది డౌన్ లోడ్ చేసుకున్న యాప్స్ ఇవే..

 

ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం భారీగా పెరిగిపోయింది. దాదాపు అందరి వద్ద ఫోన్లు ఉన్నాయి. అయితే మనం స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నట్లయితే ఎక్కువగా యాప్స్ వాడతాం. గూగుల్ ప్లే స్టోర్ లో నిమిషాని ఒక యాప్ షేర్ అవుతుందంటే.. అర్థం చేసుకోవచ్చు.. ఏ రేంజ్ లో యాప్స్ డౌన్ లోడ్ చేసుకుంటున్నారో. 2023లో అత్యధిక మంది డౌన్ లోడ్ చేసుకున్న 5 ఆండ్రాయిడ్ యాప్స్ ఇవే..

రీల్సీ రీల్ మేకర్ యాప్. ఇది ఈ డిజిటల్ జనరేషన్ లో రీల్స్ మేకింగ్ అనేది ఒక్కోసారి కెరీర్ ను కూడా సెట్ చేస్తోంది. కంటెంట్ క్రియేషన్ కోసం ఇప్పటికే వచ్చిన ఎన్నో యాప్‌లు మార్కెట్‌లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నాయి. ఇక ఇటీవలి కాలంలో వచ్చిన ఈ రీల్సీ రీల్ మేకర్ కూడా యూజర్ ఫ్రెండ్లీగా మారడంతో భారీగా డౌన్ లోడ్స్ వచ్చాయి. ఇన్‌స్టాగ్రామ్ లో రీల్స్‌ పోస్ట్ చేసేందుకు యూజర్స్ కు ఇది ఉపయోగపడడంతో భారీగా స్పందన వచ్చింది.

 

రీల్సీ రేటింగ్ యాప్ ఇది జెడ్ ఇటాలియా యాప్‌లచే డెవలప్ చేసింది. ఈ యాప్‌ పర్చేస్ బేస్ లో అంటే కొనుగోలు ప్రక్రియ ద్వారా పని చేస్తుంది. దాదాపు 15వేల రివ్యూస్ తో 3.9 రేట్ ఉన్న ఈ యాప్ ను 5లక్షల డౌన్‌లోడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మూడిస్టోరీ - మూడ్ ట్రాకర్ యాప్.. ఇది
మూడ్ ట్రాకర్ అండ్ ఎమోషన్ ట్రాకర్ యాప్ గా మంచి గుర్తింపు పొందింది. ఇది ఒక్క పదం కూడా రాయకుండా 5 సెకన్లలోపు మూడ్ ట్రాకింగ్ ఎంట్రీలను క్రియేట్ చేయడానికి అవకాశం కల్పిస్తుంది. 4.3 రేటింగ్ తో 10వేల కంటే ఎక్కువ డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.

వాయిడ్‌పెట్‌ గార్డెన్ మెంటల్ హెల్త్ యాప్. ఇది మానసిక ఆరోగ్యానికి సంబంధించిన యాప్ గా పేరు పొందింది. యూజర్స్ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. 9400 రివ్యూస్ తో 4.4 రేటింగ్ ఉండడంతో పాటు ఈ యాప్ ను 1లక్ష మందికి పైగా డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. థ్రెడ్స్ యాప్.. దీన్ని ఫేస్ బుక్ మెటా యాజమాన్యం తీసుకొచ్చారు. దీన్ని X(ట్విట్టర్)కి పోటీగా తీసుకొచ్చారు. ఈ యాప్ ను 100 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఇన్ సైట్ జర్నల్ యాప్ AI- పవర్డ్ ప్రాంప్ట్‌లతో పని చేస్తుంది. అందులో వచ్చే సమస్యలను పరిష్కరించడంలో యూజర్స్ కు ఉపయోగపుతుంది. దీన్ని 10వేల కంటే ఎక్కువ మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.


 

G
M
T
Y
Text-to-speech function is limited to 200 characters

Saturday, August 5, 2023

Usefull Websites

 1. YouTube Download mp 4

 

2. toonme : Images AI Edited

 

3.Goolge Bard

 


 4. YouTube mp3

 

5.Web Apps by 123apps

 

6.symbols

 

7.play2048.co/

 


 

 

 

 

 

Saturday, June 17, 2023

యూట్యూబ్ నిబంధనల సడలింపు.. యూట్యూబ్ నుండి డబ్బు ఇప్పుడు ఈజీగా సంపాదించండి

 


ఆన్ లైన్ వీడియో షేరింగ్ ఫ్లాట్ ఫార్మ్  యూట్యూబ్ నుండి డబ్బు ఎలా సంపాదించాలా అని ఆలోచించేవారు మన చుట్టూ చాల మంది ఉండే ఉంటారు. అలాంటి వారి కోసం యూట్యూబ్ ఒక కొత్త నోటిఫికేషన్ ద్వారా  గుడ్ న్యూస్ అందించింది. యూట్యూబ్ అకౌంట్  క్రియేట్ చేసి వీడియోలను అప్‌లోడ్ చేసిన తర్వాత దాని ద్వారా ఆదాయాన్ని సంపాదించడానికి కొన్ని షరతులు ఉన్నాయి. అయితే యూట్యూబ్ ఈ నిబంధనలను సడలించింది.

ప్రస్తుతం, YouTube కంటెంట్ క్రియేటర్ పేమెంట్ పొందడానికి 1000 మంది సబ్‌స్క్రైబర్‌లు, సంవత్సరంలో 4000 గంటల వ్యూస్  లేదా 90 రోజుల్లో 1 కోటి యూట్యూబ్  షార్ట్స్ వ్యూస్  అవసరం. కానీ యూట్యూబ్ ఉత్తర అమెరికాలో ఈ నిబంధనలను కొద్దిగా మార్చింది. దీని ప్రకారం, పేమెంట్  పొందడానికి ఛానెల్‌లో కనీసం మూడు వీడియోలు తప్పనిసరిగా ఒక సంవత్సరంలో 3000 గంటల వ్యూస్ లేదా 90 రోజుల్లో 30 లక్షల షార్ట్స్ వ్యూలను లేదా 1000 మంది సబ్‌స్క్రైబర్‌లకు బదులు 500 సబ్‌స్క్రైబర్‌లను పొందాలి.

 యుఎస్ అండ్ కెనడాలో ఉన్న ఈ షరతులు భారతదేశం వంటి మార్కెట్లకు దగ్గరగా రావచ్చని నివేదించబడింది. అయితే యూట్యూబ్ వీడియోలు అండ్ క్రియేటర్లు భారీగా పెరిగిన భారతీయ మార్కెట్లో యూట్యూబ్ త్వరిత రాయితీని ఇస్తుందనే సందేహాలు ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో Tik Tok లేదా InstaReels వంటి చిన్న వీడియో ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి ఇంకా బెస్ట్  కంటెంట్ క్రియేటర్స్ ని ఆకర్షించడానికి YouTube  ఈ మార్పు ప్రధానంగా ఉందని నివేదించబడింది.

అంటే ఛానెల్‌లో కనీసం మూడు  వీడియోలు సంవత్సరంలో 3000 గంటల వ్యూస్ క్కి సరిపోతాయి. గొప్ప కంటెంట్‌ను కనుగొనడానికి క్రియేటర్లకు సమయం ఇవ్వాలని YouTube భావిస్తోంది. దీని వల్ల కంటెంట్ నాణ్యత పెరుగుతుందని యూట్యూబ్ కూడా విశ్వసిస్తోంది.

అదే సమయంలో, చిన్న వీడియో ప్లాట్‌ఫారమ్‌ల ఛాలెంజ్‌కి పోటీగా 90 రోజుల్లో 30 లక్షల తీర వీక్షణలు సెట్ చేయబడ్డాయి. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ కింద పనిచేసే యూట్యూబ్ ఇలాంటి  వీడియోల సంఖ్యను పెంచుతుందని అభిప్రాయపడింది. 

 Tags : Youtube

Thursday, June 8, 2023

Top Websites Education In Telugu

 

 


Top Websites  Education In Telugu

Sunday, July 24, 2022

వాట్సప్ ద్వారా బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు. SBI వాట్సప్ బ్యాంకింగ్ సర్వీస్‌కు ఎలా రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకోండి

 


 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు గుడ్ న్యూస్. ఎస్‌బీఐ వాట్సప్ బ్యాంకింగ్ (WhatsApp Banking) సేవల్ని ప్రారంభించింది. వాట్సప్ ద్వారా బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు. ఎస్‌బీఐ వాట్సప్ బ్యాంకింగ్ సర్వీస్‌కు ఎలా రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకోండి.

SBI WHATSAPP BANKING KNOW HOW TO REGISTER FOR STATE BANK OF INDIA WHATSAPP BANKING SERVICE

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మరో సర్వీస్ ప్రారంభించింది. తొలిసారి వాట్సప్ బ్యాంకింగ్ (WhatsApp Banking) సేవల్ని ప్రారంభించింది. ఎస్‌బీఐ ఖాతాదారులు చాలాకాలంగా ఈ సర్వీస్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఎస్‌బీఐ వాట్సప్ బ్యాంకింగ్ (SBI WhatsApp Banking) సేవల్ని త్వరలో ప్రారంభిస్తామని ఇటీవల ఎస్‌బీఐ ఛైర్మెన్ దినేష్ ఖారా తెలిపారు.

ఎస్‌బీఐ ఛైర్మెన్ దినేష్ ఖారా ప్రకటించిన మూడువారాల్లో ఎస్‌బీ వాట్సప్ బ్యాంకింగ్ సేవలు ప్రారంభమయ్యాయి. ఎస్‌బీఐ ఖాతాదారులు వాట్సప్ ద్వారా బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు. ఎస్‌బీఐ అందించే సర్వీసుల కోసం బ్రాంచ్‌కు లేదా ఏటీఎంకు వెళ్లాల్సిన అవసరం లేదు. చాలావరకు సేవలు వాట్సప్ ద్వారా లభిస్తాయి.

ఇందుకోసం SMS WAREG అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి అకౌంట్ నెంబర్ టైప్ చేసి 917208933148 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. కస్టమర్లు తమ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచే ఎస్ఎంఎస్ పంపాల్సి ఉంటుంది. ఎస్‌బీఐ వాట్సప్ బ్యాంకింగ్ సేవల కోసం రిజిస్టర్ చేసిన కస్టమర్లు +919022690226 నెంబర్‌కు Hi అని టైప్ చేస్తే ఈ కింది మెసేజ్ వస్తుంది.

 

ఎస్‌బీఐ కస్టమర్లు వాట్సప్ బ్యాంకింగ్ సేవల్ని పొందాలనుకుంటే ముందుగా +919022690226 నెంబర్‌ను తమ స్మార్ట్‌ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ నెంబర్‌కు Hi అని టైప్ చేసి మెసేజ్ చేయాలి. ఆ తర్వాత వచ్చే ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు. అయితే అంతకన్నా ముందు కస్టమర్లు వాట్సప్ బ్యాంకింగ్ సేవల కోసం రిజిస్టర్ చేసుకోవాల్సి వస్తుంది.  

+919022690226 నెంబర్‌కు Hi అని టైప్ చేస్తే ఈ కింది మెసేజ్ వస్తుంది.

Dear Customer, Welcome to SBI Whatsapp Banking Services! Please choose from any of the options below.
1. Account Balance
2. Mini Statement
3. De-register from WhatsApp Banking
You may also type your query to get started

వీటిలో మీకు కావాల్సిన సర్వీస్‌కు సూచించిన ఆప్షన్ ఎంచుకోవాలి. మొదటి ఆప్షన్ ఎంచుకుంటే అకౌంట్ బ్యాలెన్స్ తెలుస్తుంది. రెండో ఆప్షన్ ఎంచుకుంటే ఐదు ట్రాన్సాక్షన్స్‌తో మినీ స్టేట్‌మెంట్ వస్తుంది. మూడో ఆప్షన్ ఎంచుకుంటే ఎస్‌బీఐ వాట్సప్ బ్యాంకింగ్ సేవల నుంచి డీ-రిజిస్టర్ చేయొచ్చు.

వాట్సప్ ఉపయోగిస్తున్న ఎస్‌బీఐ కస్టమర్లందరూ ఈ సేవలు ఉపయోగించుకోవచ్చు. అయితే ఎస్‌బీఐ అకౌంట్‌తో రిజిస్టర్ అయి ఉన్న మొబైల్ నెంబర్‌తో మాత్రమే వాట్సప్ బ్యాంకింగ్ సేవలు లభిస్తాయి. ఇప్పటికే ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు వాట్సప్ ద్వారా సేవలు లభిస్తున్నాయి. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ అకౌంట్ వివరాలు, రివార్డ్ పాయింట్స్, ఔట్‌స్టాండింగ్ బ్యాలెన్స్, కార్డ్ పేమెంట్స్ లాంటి సేవల్ని వాట్సప్ ద్వారా పొందుతున్నారు.

Sunday, July 10, 2022

Ration Card మీరు కొత్త రేషన్‌కార్డు కోసం అప్లై చేసుకున్నారా.. అయితే లిస్టులో మీ పేరు ఉందో చెక్‌ చేసుకోండి

 


మీరు కొత్త రేషన్‌కార్డు కోసం అప్లై చేసుకున్నారా.. అయితే లిస్టులో మీ పేరు ఉందో చెక్‌ చేసుకోండి. ఇందుకోసం ఆహార శాఖ అధికారిక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంట్లో కూర్చున్న ప్రతి వ్యక్తి తన మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా కొత్త రేషన్ కార్డు గురించి తెలుసుకోవచ్చు. కానీ ఆన్‌లైన్ జాబితాలో పేరును తనిఖీ చేసే విధానం చాలా మందికి తెలియదు. ఇది ఏ విధంగా తనిఖీ చేయాలో తెలుసుకుందాం.

కొత్త రేషన్ కార్డు ఎవరికి వచ్చిందో ఎలా చెక్ చేసుకోవాలి?

1. ముందుగా రేషన్ కార్డ్ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేయండి. దీని కోసం గూగుల్ సెర్చ్ బాక్స్‌లో nfsa.gov.in అని టైప్ చేయడం ద్వారా సెర్చ్‌ చేయండి.

2. తర్వాత మీరు స్క్రీన్‌పై విభిన్న సేవల ఎంపికను చూస్తారు. ఇక్కడ మెనులో రేషన్ కార్డ్స్ ఆప్షన్‌ని ఎంచుకోండి. తర్వాత రేషన్ కార్డు వివరాలు ఆన్ స్టేట్ పోర్టల్స్ ఎంపికను ఎంచుకోండి.

3. తర్వాత అన్ని రాష్ట్రాల జాబితా స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఇక్కడ మీరు మీ రాష్ట్రం పేరు కోసం వెతకాల్సి ఉంటుంది.

4. తర్వాత రాష్ట్రంలోని అన్ని జిల్లాల పేర్లు కనిపిస్తాయి. ఇందులో మీ జిల్లా పేరుని ఎంచుకోవాలి.

5. తర్వాత ఆ జిల్లాలోని అన్ని బ్లాక్‌ల జాబితా కనిపిస్తుంది. ఇక్కడ మీరు మీ బ్లాక్ పేరును కనుగొని దానిని ఎంచుకోవాలి.

6. తర్వాత ఆ బ్లాక్‌లో అన్ని గ్రామ పంచాయతీల జాబితా ఓపెన్‌ అవుతుంది. ఇక్కడ మీరు మీ పంచాయతీ పేరును ఎంచుకోవాలి.

7. తర్వాత, మీరు ఎంచుకున్న పంచాయతీలో నిర్వహిస్తున్న రేషన్ దుకాణం పేరు, రేషన్ కార్డు రకం స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఇక్కడ రేషన్ కార్డు రకాన్ని ఎంచుకోండి.

8. మీరు రేషన్ కార్డు రకాన్ని ఎంచుకున్న వెంటనే రేషన్ కార్డు లబ్ధిదారులందరి జాబితా తెరపై కనిపిస్తుంది. ఇక్కడ రేషన్ కార్డ్ నంబర్, హోల్డర్ పేరు, తండ్రి/భర్త పేరు, యూనిట్ నంబర్ మొదలైన వివరాలు కనిపిస్తాయి. కొత్త రేషన్ కార్డు ఎవరికి వచ్చిందో ఇక్కడ తెలుసుకోవచ్చు.

 

 

Tuesday, May 10, 2022

కొన్ని సులభమైన మార్గాల ద్వారా ఆధార్‌ నంబర్‌ను తెలుసుకోవచ్చు.

 


Aadhaar Number: ప్రస్తుతం ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్‌ ఒకటి. ఇది లేనిది ఏ పనులు జరగవు. ప్రభుత్వ, ప్రైవేటు పథకాల నుంచి చిన్న పాటి పనులకు ఆధార్‌ కార్డు తప్పనిసరి కావాల్సిందే. అయితే ఆధార్‌ కార్డును ఎప్పుడు వెంట ఉంచుకోము. కొన్ని సందర్భాలలో ఆధార్‌ నంబర్‌ మర్చిపోతుంటాము. అయితే కొన్ని సులభమైన మార్గాల ద్వారా ఆధార్‌ నంబర్‌ను తెలుసుకోవచ్చు. ఒక విషయం ఏంటంటే ఆధార్ కార్డుకు మీ ఫోన్ నెంబ‌ర్ లింక్ (Mobile Number Link) అయ్యి ఉండాలి. అప్పుడు ఆధార్‌ నంబర్‌ను తెలుసుకునేందుకు సాధ్యమవుతుంది.

☛ ముందుగా స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూట‌ర్‌లో బ్రౌజ‌ర్ ఓపెన్ చేసి యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

☛ అనంత‌రం వెబ్‌సైట్‌లోని ‘మై ఆధార్’ సెక్షన్‌లోని ‘ఆధార్ స‌ర్వీసెస్’పై క్లిక్ చేసి.. అందులో ఉన్న ‘రిట్రైవ్ లాస్ట్ ఆర్ ఫర్గాటెన్ ఈఐడీ/యూఐడీ’ అనేదానిపై క్లిక్ చేయాలి.

☛ త‌ర్వాత ఓపెన్ అయిన కొత్త పేజీలో ఆధార్ నంబ‌ర్ (యూఐడీ)ని సెల‌క్ట్ చేసుకోవాలి.

☛ అనంత‌రం మీ రిజిస్టర్ మొబైల్ నెంబ‌ర్ లేదా ఈమెయిల్ ఐడీని నమోదు చేయాలి.

☛ ఇక అక్కడే ఉన్న క్యాప్చా కోడ్‌ను ఎంట‌ర్ చేసి.. సెండ్ ఓటీపీపై క్లిక్ చేయాలి.

☛ మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌కు వ‌చ్చిన ఓటీపీని ఎంట‌ర్ చేసి ఎంట‌ర్ నొక్కాలి. దీంతో మొబైల్ నెంబ‌ర్‌కు ఆధార్ నెంబ‌ర్ మెసేజ్ రూపంలో వ‌స్తుంది. ఇలా సింపుల్‌గా మర్చిపోయిన ఆధార్‌ నంబర్‌ను తెలుసుకోవచ్చు.

 

 

 

Tuesday, March 22, 2022

ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కోసం ఆన్‌లైన్‌లో

 


అనారోగ్య కారణంగా ఆసుపత్రి ఖర్చుల కోసం ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ.5 లక్షల వరకు బీమా కవరేజీతో కూడిన ఉత్తమ ఆరోగ్య సంరక్షణ సేవలను పొందడంలో కుటుంబాలకు సహాయం చేయడానికి PMJAY సెట్ చేయబడింది. ఈ పథకం ప్రభుత్వ ఆసుపత్రులు మరియు నెట్‌వర్క్ ప్రైవేట్ ఆసుపత్రులలో నగదు రహిత చికిత్సను చేయించుకోవడానికి అందిస్తుంది. ఈ పథకం యొక్క ప్రాథమిక ప్రయోజనం విషయానికి వస్తే ఇందులో దాదాపు 1,400పైగా చికిత్సలు ఉచితంగా చేయించుకోవడానికి అనుమతిస్తుంది

 

ఈ పథకం క్రింద లభించే ఇతర ప్రయోజనాల విషయానికి వస్తే PMJAY క్రింద చికిత్స మరియు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు దేశవ్యాప్తంగా ఉచితంగా లభిస్తాయి. ఇది పోస్ట్-హాస్పిటలైజేషన్ ఖర్చులను కవర్ చేస్తుంది మరియు బహుళ శస్త్రచికిత్సల విషయంలో, అత్యధిక ప్యాకేజీ ఖర్చు కూడా కవర్ చేయబడుతుంది. మీరు ఆన్‌లైన్‌లోనే ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే కనుక కింద గల గైడ్ లైన్ ను అనుసరించండి.

 

PMJAY స్కీమ్ SEC 2011 జాబితా కింద గుర్తించబడిన మరియు RSBY పథకంలో భాగమైన లబ్ధిదారులందరికీ వర్తిస్తుంది. మీరు PMJAY కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలనుకుంటే మీరు అనుసరించాల్సిన దశలు.. ** ముందుగా https://www.pmjay.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి

 
** తర్వాత మీ మొబైల్ నంబర్ మరియు స్క్రీన్‌పై కనిపించే క్యాప్చా కోడ్‌ను నమోదు చేయండి.
 
 ** మీరు మీ నమోదిత మొబైల్ నంబర్‌లో OTPని అందుకుంటారు.
 
 అది మిమ్మల్ని PMJAY లాగిన్ పోర్టల్‌కు తీసుకెళ్తుంది.
 
 ** తర్వాత మీరు PMJAY స్కీమ్ లో చేరడం కోసం దరఖాస్తు చేసుకోవడానికి మీ యొక్క రాష్ట్రాన్ని ఎంచుకోండి. 
 
 ** తర్వాత మొబైల్ నంబర్, పేరు, రేషన్ కార్డ్ నంబర్ లేదా RSBY URN నంబర్ వంటి ఎంపికలలో దేనిలోని వివరాలను నమోదు చేయడం ద్వారా మీ అర్హతను ఎంచుకోండి. 
 
 ** మీరు అర్హత కలిగి ఉంటే కనుక మీ యొక్క పేరు పేజీ యొక్క కుడి వైపున ప్రతిబింబిస్తుంది.
 
 ** లబ్ధిదారుల వివరాలను తనిఖీ చేయడానికి మీరు 'కుటుంబ సభ్యుల' ట్యాబ్‌పై క్లిక్ చేయవచ్చు

PMJAY స్కీమ్ కోసం దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాల విషయానికి వస్తే మొదటిది మీ వయస్సు మరియు గుర్తింపు రుజువు, సంప్రదింపు వివరాలు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం మరియు కుటుంబం యొక్క ప్రస్తుత స్థితికి సంబంధించిన డాక్యుమెంట్ రుజువు (ఉమ్మడి లేదా అణు) కోసం ఆధార్ లేదా పాన్ కార్డ్ అవసరం ఉంటుంది

 

 

 

Friday, March 18, 2022

మీ బాడీ ఫ్యాట్ ను కరిగించాలనుకుంటున్నారా..?

 


 

మీ బాడీ ఫ్యాట్ ను కరిగించాలనుకుంటున్నారా?అయితే రాత్రిపూట దీన్ని తినకూడదు.

 మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా? అలాంటప్పుడు మొదటగా మీ ఆహారపు అలవాట్లపై దృష్టి పెట్టాలి. మీరు కొన్ని ఆహారాలను తినడం మరియు ఇతరులకు దూరంగా ఉండటం ద్వారా ఆహార ప్రణాళికను అనుసరించడం ద్వారా బరువు తగ్గవచ్చు. బరువు తగ్గాలంటే తేలికైన రాత్రి భోజనం చేయడమే. మన శరీరం గడియారం ప్రకారం పనిచేస్తుంది. ప్రతి ఒక్కరి జీర్ణవ్యవస్థ ఉదయం మరియు రాత్రి బలహీనంగా ఉంటుంది.

 

అందుకే నిద్రవేళకు ముందు కార్బోహైడ్రేట్లు, కేలరీలు మరియు కొవ్వు తక్కువ ఉన్న ఆహారాలు తినడం మంచిది. కానీ మీరు రాత్రిపూట ఆరోగ్యకరమైన ఆహారాన్ని కొద్ది మొత్తంలో తినాలని నిర్ధారించుకోండి. బరువు తగ్గాలనుకునే వారు రాత్రిపూట దూరంగా ఉండాల్సిన కొన్ని ఆహార పదార్థాల గురించి ఈ కథనంలో చదవవచ్చు
సోడా సోడా వంటి చక్కెర పానీయాలు మీ శరీరానికి చెత్త శత్రువు కావచ్చు. ముఖ్యంగా మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నట్లయితే. సోడాలు ఎటువంటి పోషకాలను అందించవు మరియు చాలా ఖాళీ కేలరీలను కలిగి ఉంటాయి, ఇవి మీ శరీర బరువును పెంచగలవు. ఇది మధుమేహం, గుండె జబ్బులు మరియు ఊబకాయం ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
 
ఫాస్ట్ ఫుడ్స్
 
 నేటి బిజీ కాలంలో ఫాస్ట్ ఫుడ్ బాగా పాపులర్ అయింది. అయితే ఇవి చాలా రకాలుగా శరీరానికి హానికరం. రాత్రిపూట అలాంటి ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది. రాత్రిపూట ప్రాసెస్ చేసిన మాంసాహారం తినడం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు మరియు ఊబకాయం వంటి ఆరోగ్య పరిస్థితులు ఏర్పడతాయి. ప్రాసెస్ చేసిన మాంసాలలో ట్రాన్స్ ఫ్యాట్, ఉప్పు మరియు చక్కెర అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో ఉండే అదనపు క్యాలరీలు బరువు పెరగడానికి కారణమవుతాయి

 గింజలు

బాదం, వాల్‌నట్, జీడిపప్పు, పిస్తా వంటి నట్స్‌లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే. అయితే, ఆరోగ్య ప్రయోజనాలతో పాటు, వీటిలో కేలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి రాత్రిపూట దీన్ని తినడం హానికరం. నిద్రపోయే ముందు శారీరక శ్రమ లేనందున, శరీరం శక్తి కోసం అధిక కేలరీలను ఉపయోగించాల్సిన అవసరం లేదు. మరియు అది లావుగా ఉంచుతుంది. కాబట్టి బరువు తగ్గడానికి పడుకునే ముందు నట్స్ తినడం మంచిది కాదు. బదులుగా, ఉదయం లేదా వ్యాయామానికి ముందు వాటిని తినండి.


 ఐస్ క్రీం


 ఐస్ క్రీం డిన్నర్ తర్వాత డెజర్ట్ తీసుకుంటే బాగుంటుందని అనిపించవచ్చు. అది జరిగినప్పుడు, మీ ఆలోచన ఐస్ క్రీం అవుతుంది. కానీ ఈ స్వీట్లు మీ బరువు తగ్గే ప్రయాణానికి ఆటంకం కలిగిస్తాయి. ఐస్‌క్రీమ్‌లలో కొవ్వు మరియు కృత్రిమ చక్కెరలు ఉంటాయి, ఇవి శరీరానికి అనవసరమైన కేలరీలను అందిస్తాయి. కాబట్టి రాత్రిపూట ఐస్‌క్రీమ్‌ తినడం మానుకోండి.


 

 

Thursday, March 17, 2022

Aadhaar Card : ఆధార్ నంబర్‌ మరిచిపోయారా ? కార్డు లేకున్నా మీ ఫోన్‌కు ఆధార్ నంబర్‌....

 

Aadhaar Card : ఆధార్ నంబర్‌ మరిచిపోయారా ? కార్డు లేకున్నా మీ ఫోన్‌కు ఆధార్ నంబర్‌ను ఎస్ఎంఎస్ ద్వారా పొందేందుకు ఇలా చేయండి

 


ఆన్‌లైన్‌ ద్వారా ఆధార్ కార్డు నంబర్‌ను ఎలా పొందాలో చూడండి. ఈ స్టెప్స్ ఫాలో అయితే మీ మొబైల్‌కు ఆధార్ నంబర్‌ మెసేజ్ రూపంలో వస్తుంది.

 భారత దేశంలో ఆధార్ (Aadhaar) అత్యంత ముఖ్యమైన కార్డు. ప్రభుత్వ పథకాలు పొందాలన్నా.. కొన్ని ఇతర సేవలను పొందాలన్న ఆధార్ కార్డు (Aadhaar Card) తప్పనిసరిగా మారింది. అయితే ఒక్కోసారి ఆధార్ కార్డును వెంట తీసుకెళ్లం. అకస్మత్తుగా అవసరం వస్తుంది. అయితే చాలాచోట్ల ఫిజికల్‌గా కార్డు లేకున్నా.. Aadhaar Number ఉన్నా పని జరుగుతుంది. నంబర్‌ నమోదు చేస్తే వివరాలు వస్తాయి. అయితే చాలా మందికి ఆధార్ నంబర్‌ సరిగా గుర్తుండదు. అలాంటి సమయాల్లో చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే Aadhaar Card దగ్గర లేని సమయాల్లో.. మీ స్మార్ట్‌ఫోన్ నుంచే ఆధార్ నంబర్‌ను పొందవచ్చు. అందుకు ఓ మార్గం ఉంది. చాలా సందర్భాల్లో ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అదెలానో చూడండి

ఆన్‌లైన్‌ ద్వారా ఆధార్ నంబర్‌ పొందాలంటే..

  • ముందుగా ఆధార్ అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ లోకి వెళ్లాలి.
  • అనంతరం మొదట ఉన్న మై ఆధార్ (My Aadhaar) ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత గెట్ ఆధార్ (Get Aadhaar) అనే సెక్షన్‌లో రిట్రైవ్ లాస్ట్ ఆర్ ఫర్గాటెన్ ఈఐడీ / యూఐడీ (Retrieve Lost or Forgotten EID / UID) అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
  • అనంతరం ఓపెన్ అయ్యే వెబ్‌పేజీలో పేరు, మొబైల్‌ నంబర్‌‌తో పాటు అక్కడే కనిపించే క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.
  • వివరాలు నమోదు చేశాక.. సెండ్ ఓటీపీ బటన్‌పై క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత మీ ఆధార్‌కు రిజిస్టర్ అయిన మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.
  • ఆ ఓటీపీ సబ్మిట్ చేస్తే.. మొబైల్‌కు ఆధార్ నంబర్‌ మెసేజ్ రూపంలో వస్తుంది.
Aadhaar Card పోగొట్టుకున్న సమయంలోనూ ఈ సదుపాయం ఎంతో ఉపయోగపడుతుంది. నంబర్‌ కూడా గుర్తులేక.. కార్డు కోల్పోయిన సమయంలో నంబర్‌ను ఈ ప్రక్రియతో పొందవచ్చు. రూ.50 ఫీజు చెల్లించి మళ్లీ ఆధార్ కార్డు కోసం అధికారిక వెబ్‌సైట్‌లోనే ఆర్డర్ చేయవచ్చు. 15 రోజుల్లోనే ఇంటికే ఆధార్ కార్డు వస్తుంది

 

Wednesday, August 25, 2021

స్మార్ట్‌ఫోన్‌లో మీ డ్రైవింగ్ లైసెన్స్‌ను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా??

 

మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్‌ను భౌతికంగా ప్రతిచోటా తీసుకెళ్లకుండా దాని సాఫ్ట్ కాపీని మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉంచాలనుకుంటున్నారా లేదా డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్నారా? ఇందుకోసం భారత ప్రభుత్వం మీ డ్రైవింగ్ లైసెన్స్‌ను మీ ఫోన్‌లో సేవ్ చేయడానికి లేదా దాని సాఫ్ట్ కాపీని డిజిలాకర్ లేదా ఎమ్ పరివాహన్ యాప్ ద్వారా పొందడానికి సహాయపడే ఒక ఆప్షన్‌ను అందించింది. మీ డ్రైవింగ్ లైసెన్స్ యొక్క హార్డ్ కాపీని తీసుకెళ్లడం మర్చిపోతే ట్రాఫిక్ పోలీసుల తనిఖీ వద్ద ఇది ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. అలాగే మీ డ్రైవింగ్ లైసెన్స్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌లో భద్రపరచడం వలన హార్డ్ కాపీ దొంగతనం చేయబడినప్పటికీ తిరిగి పొందే అవకాశం ఉంటుంది.


 

Download App

2018 లో డిజిలాకర్ మరియు ఎమ్ పరివాహన్ యాప్‌లో స్టోర్ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ మరియు వాహన రిజిస్ట్రేషన్‌ను ఆమోదించాలని ప్రభుత్వం ఒక ఆర్డినెన్సును జారీ చేసింది. డ్రైవింగ్ చేసేటప్పుడు డాక్యుమెంట్‌ల భౌతిక వెర్షన్‌లను తీసుకెళ్లాల్సిన అవసరాన్ని తొలగించడమే ఆ ఎత్తుగడ లక్ష్యం. మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో డ్రైవింగ్ లైసెన్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి కింద ఉన్న మార్గాలను అనుసరించండి.



మీ స్మార్ట్‌ఫోన్‌లో మీ డ్రైవింగ్ లైసెన్స్‌ను డౌన్‌లోడ్ చేసుకునే విధానం ప్రారంభించడానికి ముందు మీరు DigiLocker లో అకౌంట్ కలిగి ఉండాలని మాత్రం మర్చిపోకండి. మీరు మీ ఫోన్ నంబర్ మరియు ఆధార్ కార్డు ఉపయోగించి డిజిలాకర్‌లో సైన్ అప్ చేయవచ్చు. 
 

 
 
స్టెప్@ 1 
 డిజిలాకర్ సైట్‌ను ఓపెన్ చేయండి. తరువాత మీ యూజర్ నేమ్ మరియు ఆరు అంకెల పిన్‌తో సైన్ ఇన్ చేయండి. అప్పుడు మీరు మీ రిజిస్టర్డ్ ఫోన్‌లో ఒక సారి పాస్‌వర్డ్ (OTP) అందుకుంటారు.

స్టెప్@ 2 
 సైన్ ఇన్ చేసిన తర్వాత 'గెట్ ఇష్యూడ్ డాక్యుమెంట్స్' బటన్ పై క్లిక్ చేయండి.


స్టెప్@ 3
ఇప్పుడు సెర్చ్ బార్‌లో "డ్రైవింగ్ లైసెన్స్" అనే పదాన్ని టైప్ చేయండి.




స్టెప్@ 4
 తరువాత మీరు డ్రైవింగ్ లైసెన్స్ పొందిన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంచుకోండి. ఒకవేళ మీకు గుర్తులేకపోతే కనుక ప్రత్యామ్నాయంగా మీరు అన్ని రాష్ట్రాల ఎంపికను కూడా ఎంచుకోవచ్చు.


స్టెప్@ 5
 మీ డ్రైవింగ్ లైసెన్స్ నంబర్‌ను నమోదు చేయండి. తరువాత గెట్ డాక్యుమెంట్ బటన్‌ని నొక్కండి. మరింత ముందుకు వెళ్లే ముందు మీ డేటాను ఇష్యూయర్‌తో పంచుకోవడానికి డిగ్‌లాకర్‌కు మీ సమ్మతిని అందించడానికి చెక్‌బాక్స్‌పై క్లిక్ చేయండి.


స్టెప్@ 6
 డిజిలాకర్ ఇప్పుడు మీ డ్రైవింగ్ లైసెన్స్‌ను రవాణా శాఖ నుండి అందిస్తుంది.


స్టెప్@ 7 
 ఇష్యూడ్ డాక్యుమెంట్‌ల లిస్ట్‌కు వెళ్లడం ద్వారా మీరు ఇప్పుడు మీ డ్రైవింగ్ లైసెన్స్‌ యొక్క సాఫ్ట్ కాపీని చూడవచ్చు. 
 
 స్టెప్@ 8 
 డ్రైవింగ్ లైసెన్స్ PDF బటన్ పై క్లిక్ చేయడం ద్వారా సాఫ్ట్ కాపీలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

స్టెప్@ 9 
 
 డిజిలాకర్ యాప్‌ను మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేయడం ద్వారా కూడా డ్రైవింగ్ లైసెన్స్ ను మరింత సులభంగా పొందవచ్చు.

డిజి లాకర్‌లో చూపించే పత్రాలు
 
 కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలు మరియు ఆయా రాష్ట్రాల పోలీసు శాఖలకు డిజి లాకర్‌లో చూపించే పత్రాలు చెల్లుతాయని సూచించింది. ల్యామినేటెడ్ రూపంలో ఉన్న పత్రాలను స్కాన్ చేసి, సాఫ్ట్ కాపీల రూపంలో డిజి లాకర్‌లో భద్రత పరుచుకున్న అన్ని ప్రభుత్వం కార్యాలయాల్లో చెల్లుబాటు అవుతాయని కేంద్రం సూచించింది. భారత సమాచార సాంకేతిక చట్టం 2000 ప్రకారం డిజి లాకర్‌లో ఉన్న పత్రాలు చెల్లుబాటు అవుతాయి. కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా మాట్లాడుతూ, "రాష్ట్ర ప్రభుత్వాలు మోటార్ వాహనాల చట్టం 1988 ప్రకారం జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మరియు ఇతర పత్రాలు డిజి లాకర్ లేదా ఎమ్‌పరివాహన్ మొబైల్ యాప్ ద్వారా ఎలక్ట్రానిక్ రూపంలో చెల్లుబాటు అవుతాయని పేర్కొంది."





Sunday, November 22, 2020

2020లో ఎక్కువగా ఉపయోగించిన మొదటి ఇరవై పాస్‌వర్డ్‌లు

 2020లో ఎక్కువగా ఉపయోగించిన మొదటి ఇరవై పాస్‌వర్డ్‌లు: '123456', '123456789', 'పిక్చర్ 1', 'పాస్‌వర్డ్... '12345678', '111111', '123123', '12345', '1234567890 ',' సెన్హా ',' 1234567 ',' qwerty ',' abc123 ' Million2 ',' 000000 ',' 1234 ',' iloveyou ',' aaron431 ',' password1', qqww1122 '...

  సాధారణంగా చాలామందికి పాస్‌వార్డులు గుర్తుపెట్టుకోవడం మర్చిపోతుంటారు, మరికొందరైతే జి‌-మెయిల్, ఫేస్ బుక్ ఇలా వివిధ సోషల్ నెట్వర్క్ పాస్‌వార్డులు వై-ఫై  పాస్‌వార్డులు గుర్తుపెట్టుకోవడం ఒకోసారి కష్టంగ ఉంటుంది.

బ్యాంకు ఖాతాలు, పేమెంట్‌ బ్యాంకులు,  స్మార్ట్‌ఫోన్‌ పాస్‌వర్డ్‌, యాప్ లాక్ వీటితో  పాటు సోషల్‌ మీడియా అకౌంట్లు వీటన్నింటికి సంబంధించిన యూజర్‌నేమ్స్‌, పాస్‌వర్డ్‌లను గుర్తుపెట్టుకోవడమంటే ఒకోసారి కష్టంగ మారుతుంది.

 అందుకే సులభంగా గుర్తుండేల నంబర్లు లాంటివి లేదంటే పుట్టిన రోజు తేదీలను  పాస్‌వర్డ్‌లుగా పెట్టుకుంటుంటాము. అయితే ఇక్కడే హ్యాకర్లకు దొరికిపోతామని  టెక్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 ‘123456' అనే పాస్‌వార్డు 2020లో ఎక్కువగా ఉపయోగించిన పాస్‌వర్డ్, దీనిని 23 మిలియన్లకు పైగా బ్రేక్ చేసినట్లు పాస్‌వర్డ్ మేనేజర్ నార్డ్‌పాస్ వార్షిక నివేదిక వెల్లడించింది. ఈ పాస్‌వార్డుని మిలియన్ల మంది ప్రజలు ఉపయోగించినట్లు నివేదించింది. అంతేకాదు ఈ పాస్‌వార్డు బ్రేక్ చేయడానికి సెకను కన్నా తక్కువ సమయం పడుతుంది.

 ఈ సంవత్సరంలో 200 చెత్త పాస్‌వర్డ్‌లు, అవి ఎన్నిసార్లు బహిర్గతమయ్యాయో, ఉపయోగించబడ్డాయో, వాటిని బ్రేక్ చేయడానికి ఎంత సమయం పడుతుందో వివరించింది. ‘123456789 'రెండవ స్థానంలో ఉండగా,‘ పిక్చర్ 1 ’మూడవ స్థానంలో నిలిచింది



2015లో ఒక సాఫ్ట్‌వేర్ సంస్థ ఇచ్చిన నివేదికలో చెత్త పాస్‌వర్డ్‌ల జాబితాలో ‘123456’ అగ్రస్థానంలో ఉందని, ఆ తర్వాత ‘password ’ అనేది ఉందని వెల్లడించింది. ఐదు సంవత్సరాల తరువాత కూడా పెద్దగా మారలేదు.

ఇప్పటికీ ‘123456 'సాధారణంగా ఉపయోగించే పాస్‌వర్డ్‌గా ఉందని నార్డ్‌పాస్ నివేదిక వెల్లడించింది. ‘password ’ అనేది నాల్గవ స్థానంలో ఉందని తెలిపింది.

నార్డ్‌పాస్ పరిశోధన మనకు తెలిసిన వాటిని ధృవీకరిస్తుంది: ప్రజలు సింపుల్ గా, సులభంగా గుర్తుంచుకోగల పాస్‌వర్డ్‌లను ఉపయోగిస్తారు ఎందుకంటే ఇది అవి గుర్తుపెట్టుకోవడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. మర్చిపోలేని పాస్‌వర్డ్‌లు కూడా ఎక్కువగా క్రాక్ గురవుతాయి అని పరిశోధనలో చూపిస్తుంది.


అయితే నివేదిక ప్రకారం వీటిని క్రాక్ చేయడానికి సెకను కన్నా తక్కువ సమయం పడుతుంది అని తెలిపింది

క్యాటగిరిల ప్రకారం సాధారణంగా ఉపయోగించే పాస్‌వర్డ్‌లు కూడా బయటపడ్డాయి. 90,000 మంది వినియోగదారులతో ఈ సంవత్సరం పాస్‌వర్డ్‌లలో ఎక్కువగా ఉపయోగించే పేరు ‘ఆరోన్ 431’, అలాగే 21,409 మంది వినియోగదారులతో 'చాక్లెట్' ఎక్కువగా ఉపయోగించే ఆహార పేరు.

37,000 మందికి పైగా వినియోగదారులు వారి పాస్‌వర్డ్‌లలో ‘పోకీమాన్’ ఉపయోగిస్తున్నారు, ఇది సాధారణంగా ఉపయోగించే ఎంటర్టైన్మెంట్ పదంగా మారింది. మరో సాధారణంగా ఉపయోగించే పాస్‌వర్డ్‌ల జాబితాలో ‘ఐ లవ్ యు’ 17 వ స్థానంలో, పాజిటివ్ పదాల విభాగంలో మొదటి స్థానంలో ఉంది, సుమారు ఒక మిలియన్‌ మందికి పైగా వినియోగదారులు ఈ పదాన్ని పాస్‌వర్డ్‌గా వాడుతున్నారు.








Thursday, September 10, 2020

Airtel Xstream Fiber Vs JioFiber : తక్కువ ధర బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో బెస్ట్ ఇదే!!!

 


 

ఇండియాలో బ్రాడ్‌బ్యాండ్ రంగంలో రోజు రోజుకి పోటీ ఎక్కువ అవుతున్నది. ఎంతలా అంటే ఎక్కువ మంది వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఒకరిని మించి మరొకరు తక్కువ ధరల వద్ద బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ లను అందిస్తున్నాయి. మరి ముఖ్యంగా జియోఫైబర్ మరియు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్లు రెండు కూడా తమ యూజర్లకు కొత్త ప్లాన్‌లను అందిస్తున్నాయి.

జియోఫైబర్ Vs ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ కొత్త అప్‌డేట్ ప్లాన్‌లు 
 
జియోఫైబర్ కొద్ది రోజుల క్రితం తన బ్రాడ్‌బ్యాండ్ సమర్పణలను అప్‌డేట్ చేసింది. ఇది తన వినియోగదారులకు కొత్త ప్లాన్‌లను అందించడంతో పాటు వినియోగదారుల కోసం ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ డెమో ఆఫర్‌ను కూడా అందిస్తున్నది. అంతకుముందు జియోఫైబర్ అందిస్తున్న అతి తక్కువ మరియు చౌకైన ఆఫర్ నెలకు రూ.699 ధర వద్ద 100 Mbps వేగంతో అందిస్తోంది. అయితే ఇప్పుడు జియోఫైబర్ 30 Mbps వేగంతో నెలకు రూ.399 ధర వద్ద అందిస్తున్నది. అదే విధంగా టెలికాం ఆపరేటర్ ఎయిర్టెల్ కూడా తన బ్రాడ్‌బ్యాండ్ సమర్పణలను అప్‌డేట్ చేసింది. ఇది కూడా రూ.499ల తక్కువ ధర వద్ద కొత్త ప్లాన్ ను ప్రవేశపెట్టింది. దీనితో పాటు ఇప్పుడు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ మొత్తంగా ఐదు ప్లాన్‌లను అందిస్తున్నాయి. ఈ రెండు బ్రాడ్‌బ్యాండ్ సర్వీసు ప్రొవైడర్లు అందిస్తున్న చౌకైన ఆఫర్‌ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

జియోఫైబర్‌ రూ.399 చౌకైన ప్లాన్ పూర్తి వివరాలు
 
 జియోఫైబర్‌ తన వినియోగదారులకు రూ.399 అతి తక్కువ ధర వద్ద అందిస్తున్న ప్లాన్ అపరిమిత డేటాను అందిస్తుంది. ఈ కొత్త ప్లాన్ ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ కంటే 100 రూపాయలు చౌకైనది. కానీ ఇది ఎయిర్‌టెల్ కంటే 10 Mbps తక్కువ ఇంటర్నెట్ డౌన్‌లోడ్ మరియు అప్‌లోడ్ వేగంతో లభిస్తుంది. జియోఫైబర్‌ యొక్క రూ.399 ప్లాన్ యొక్క అపరిమిత డేటా నెలలో 3.3TB FUP పరిమితిని కలిగి ఉంటుంది.


 

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ రూ.499 ప్లాన్ వివరాలు 
 
ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ ఇప్పుడు కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను రూ.499 ధర వద్ద అందిస్తోంది. టెల్కో దీనిని తన వినియోగదారులకు 2020 సెప్టెంబర్ 7 నుండి అందిస్తోంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులకు అపరిమిత ఇంటర్నెట్ డేటా లభిస్తుంది. ఇంతకు ముందు సంస్థ రూ.799 ధర వద్ద చౌకైన ప్లాన్‌ను అందించేది. అయినప్పటికీ ఇది అపరిమిత డేటాను అందించదు. అపరిమిత డేటా కావలసిన వినియోగదారులు నెలవారీ ప్రాతిపదికన రూ.299 అదనంగా చెల్లించాల్సి ఉండేది.


 

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ రూ.499 ప్లాన్ అదనపు ప్రయోజనాలు
 
 ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ ఇప్పుడు తన వినియోగదారులకు అందిస్తున్న ప్రతి ప్లాన్ ను కూడా అపరిమిత డేటాతో అందిస్తున్నది. దానితో పాటు కస్టమర్ కు అపరిమిత వాయిస్ కాలింగ్ కూడా అదనంగా లభిస్తుంది. రూ.499 ధర వద్ద లభించే ఈ చౌకైన ప్లాన్ 40 Mbps వేగంతో దాని ధరను సమర్థిస్తు వస్తుంది. ఇవే కాకుండా ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ బండిల్‌లో మీకు లభించే ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ 4K టివి బాక్స్ కూడా అదనంగా లభిస్తుంది. దాని కోసం కస్టమర్ కేవలం రూ.1,499 (సెక్యూరిటీ డిపాజిట్) చెల్లించాల్సి ఉంటుంది. అది సంస్థ తిరిగి చెల్లిస్తుంది కూడా. ఇవే కాకుండా 7 OTT యాప్ లు మరియు 5 స్టూడియోల యొక్క షోలతో పాటు 10,000+ సినిమాలకు ఉచిత యాక్సిస్ ను పొందుతారు.


 

జియోఫైబర్‌ రూ.399 ప్లాన్ Vs ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ రూ.499 ప్లాన్
 
 జియో ఫైబర్ అందిస్తున్న రూ.399 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో ఎటువంటి OTT ప్రయోజనాలు అందుబాటులో లేవు. కాకపోతే వినియోగదారులకు అపరిమిత కాలింగ్ ప్రయోజనం మాత్రం అందుబాటులో ఉంది. రెండు ప్లాన్‌లను పోల్చి చూస్తే కనుక ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ యొక్క రూ.499 ప్లాన్ జియోఫైబర్ యొక్క రూ.399 ప్లాన్ కంటే రూ.100 ఖరీదైనది అయినప్పటికీ జియోఫైబర్ ప్లాన్‌తో పోలిస్తే అద్భుతమైన డేటా వేగంతో మరియు OTT ప్రయోజనాలను అందిస్తుంది.


 

 

 

 

Wednesday, May 27, 2020

స్టేట్ బ్యాంక్ రివార్డ్జ్ పాయింట్లను సంపాదించడానికి అర్హులు.

స్టేట్ బ్యాంక్ రివార్డ్జ్: స్టేట్ బ్యాంక్ డెబిట్ కార్డ్ హోల్డర్ల కోసం స్టేట్ బ్యాంక్ గ్రూప్ యొక్క లాయల్టీ ప్రోగ్రామ్. ఈ కస్టమర్లకు వారి డెబిట్ కార్డులతో చెల్లింపులు చేసినందుకు ప్రోగ్రామ్ రివార్డ్ చేస్తుంది.
ప్రతి స్టేట్ బ్యాంక్ డెబిట్ కార్డ్ హోల్డర్ స్టేట్ బ్యాంక్ రివార్డ్జ్ సభ్యునిగా ముందే నమోదు చేయబడ్డాడు మరియు అతను / ఆమె ఏదైనా చెల్లింపు కోసం డెబిట్ కార్డును ఉపయోగించిన ప్రతిసారీ విమోచన స్టేట్ బ్యాంక్ రివార్డ్జ్ పాయింట్లను సంపాదించడానికి అర్హులు.
ఈ స్టేట్ బ్యాంక్ రివార్డ్జ్ పాయింట్లు డెబిట్ కార్డులో పేరుకుపోతాయి మరియు ఆన్‌లైన్ & స్టోర్ షాపింగ్ కోసం రీడీమ్ చేయవచ్చు. ఎయిర్ / బస్ / మూవీ టికెట్ బుకింగ్, మొబైల్ / డిటిహెచ్ రీఛార్జ్ మరియు మరెన్నో... 
ఎస్బిఐ డెబిట్ కార్డ్ రివార్డ్ పాయింట్లు ఏమిటి? మరియు వాటిని ఎలా ఉపయోగించాలి?
                              మీరు 200 లేదా అంతకంటే ఎక్కువ ఆన్‌లైన్ లావాదేవీల కోసం ఎస్‌బి‌ఐ డెబిట్ కార్డును ఉపయోగిస్తుంటే లేదా కొంత వాలెట్‌లో డబ్బును జోడించడం లేదా స్వైప్ మెషీన్‌ల వద్ద స్వైప్ చేయడం వంటివి చేస్తే మీరు ఒక పాయింట్ సంపాదిస్తున్నారు.
మీరు రెండు మోడ్‌లపైనా 12000+ ఖర్చు చేశారు అనుకోండి  (స్వైప్ మరియు ఆన్‌లైన్ కనీసం లావాదేవీలతో 200)
అప్పుడు మీరు 60 రివార్డ్ పాయింట్లను సంపాదిస్తారు. (తరచుగా ఉపయోగించే కార్డుల కోసం త్రైమాసికంలో 300+ పాయింట్లను ఎస్బిఐ ఇచ్చే అవకాశం ఉంది)
కాబట్టి మీకు ఎస్బిఐ నుండి 360 త్రైమాసిక రివార్డ్ పాయింట్లు వచ్చాయని హిస్తే.
360 కి మొత్తం 360/4 = 90రూ. కు సమానం
మీరు  ఎయిర్ / బస్ / మూవీ టికెట్ బుకింగ్మొబైల్ / డిటిహెచ్ రీఛార్జ్ అమెజాన్‌ను స్పష్టంగా ఉపయోగిస్తుంటే, మీరు దీన్ని 90రూ. ఎయిర్ / బస్ / మూవీ టికెట్ బుకింగ్మొబైల్ / డిటిహెచ్ రీఛార్జ్  అమెజాన్‌ను ఇమెయిల్ గిఫ్ట్ కార్డ్ యొక్క వోచర్‌గా మార్చవచ్చు మరియు అమెజాన్ చెల్లింపుకు క్రెడిట్ తక్షణమే చెల్లించవచ్చు.
అమెజాన్ విముక్తి 10రూ. నుండి మొదలవుతుంది కాబట్టి ఇతరులతో పోలిస్తే మంచి ఎంపిక.
ఫ్లిప్‌కార్ట్ కనిష్ట 50రూ.
బుక్‌మిషో కనిష్టంగా 100రూ.
మీ మాక్స్ రిడీమ్ కింద మొబిక్విక్‌లో కూడా మీరు ఈ పాయింట్లను రీడీమ్ చేయవచ్చు ఎక్కువ పాయింట్లను పొందండి మరియు వాటిని బ్యాలెన్స్‌గా మార్చవచ్చు.
మీరు ఎస్బిఐ రివార్డ్జ్ సైట్లో ప్రీపెయిడ్ రీఛార్జ్ చేయవచ్చు.
చివరగా మీరు చాలా వస్తువులు ఉన్న ఎస్బిఐ రివార్డ్జ్ సైట్లో రీడీమ్ చేసుకోవచ్చు...

స్టేట్ బ్యాంక్ రివార్డ్జ్ పాయింట్లను రీడీమ్ చేసుకునే విదానమును ఇక్కడ స్క్రీన్ షాట్ ఆదారంగా... 

సూచన: స్టేట్ బ్యాంక్ కస్టమర్లు ఇంటర్నెట్ బ్యాంకింగ్ / యోనో ఎస్‌బి‌ఐ ను రిజిస్టర్ చేసుకొని ఉపయోగిస్తున్నవారకి మాత్రమే కనిపిస్తాయి. 


యోనో ఎస్‌బి‌ఐ వినియోగిస్తున్నా వారికోసం
1. స్టేట్ బ్యాంక్ డెబిట్ కార్డ్ హోల్డర్లు రివార్డ్జ్ పాయింట్లను రీడిమ్ చేసుకోవడానికి యోనో ఎస్‌బి‌ఐ లో పైన చూపించిన విధాముగా Login కావాలి.
2. లోన్స్ ను ఎంపిక చేసుకొని స్క్రోల్ చేయడం ద్వారా క్రింద కనిపిస్తున్న రివార్డ్ పాయింట్స్ కనిపిస్తాయి.
3. మనకున్న రివార్డ్ పాయింట్స్ కనిపిస్తాయి. పైన చూడండి...
ఈ పాయింట్స ను ఎయిర్ / బస్ / మూవీ టికెట్ బుకింగ్మొబైల్ / డిటిహెచ్ రీఛార్జ్ ల వినియోగానికి వాడుకోవచ్చు..
4. పైన కనిపిస్తున్న వాటిలో ఏదో ఒకటి ఎంపిక చేసుకొ గానే కింద కనిపిస్తున్న డిస్క్లైమర్ కనిపిస్తుంది I Agree పై క్లిక్ చేయడం ద్వారా రివార్డ్ పాయింట్స్ ను  రీడిమ్ చేసుకోవచ్చు..
5. సెండ్ OTP మీద క్లిక్ చేసి రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు వచ్చిన OTP ను ఎంటర్ చేయడం ద్వారా రివార్డ్ పాయింట్స్ ను  రీడిమ్ చేసుకోవచ్చు...
                                        ఆన్లైన్ లావాదేవీలు ఎక్కువగా చేసేవారికి ఎక్కువగా రివార్డ్ పాయింట్స్ వస్తు ఉంటాయి ... రివార్డ్ పాయింట్స్ ను  రీడిమ్ చేసుకొండి...
మరియు మీ మీ మిత్రులకు తెలియపరచండి... 
..ఈ పోస్టర్ ను షేర్ చేయండి..

🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻

ఆన్లైన్ ఎస్‌బి‌ఐ వినియోగిస్తున్నా వారికోసం
1. స్టేట్ బ్యాంక్బ్యాంక్ డెబిట్ కార్డ్ హోల్డర్లు రివార్డ్జ్ పాయింట్లను రీడిమ్ చేసుకోవడానికి ఆన్లైన్ ఎస్‌బి‌ఐ లో Login కావాలి.
2. Login అయిన తరువాత పక్కన కనిపిస్తున Quick Links లో SBI Rewardz ను ఎంచుకోవడం ద్వారా రివార్డ్ పాయింట్స్ ను చూడవచ్చు...
Last 10 Transctions ను క్లిక్ చేసి ఏ విధముగా రివార్డ్ పాయింట్స్ వాస్తు న్నవో చూడవచ్చును... (పైన ఉన్నవి చూడండి)
3. పై విదముగా ఎంపిక చేసుకోవచ్చును ... 
4. Proceed  పై క్లిక్ చేయడం ద్వారా కింద కనిపిస్తున్న డిస్క్లైమర్ కనిపిస్తుంది I Agree పై క్లిక్ చేయడం ద్వారా రివార్డ్ పాయింట్స్ ను  రీడిమ్ చేసుకోవచ్చు..
5. సెండ్ OTP మీద క్లిక్ చేసి రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు వచ్చిన OTP ను ఎంటర్ చేయడం ద్వారా రివార్డ్ పాయింట్స్ ను  రీడిమ్ చేసుకోవచ్చు...
                                        ఆన్లైన్ లావాదేవీలు ఎక్కువగా చేసేవారికి ఎక్కువగా రివార్డ్ పాయింట్స్ వస్తు ఉంటాయి ... రివార్డ్ పాయింట్స్ ను  రీడిమ్ చేసుకొండి...