Showing posts with label India Geography. Show all posts
Showing posts with label India Geography. Show all posts

Tuesday, March 27, 2018

ఇండియన్ జాగ్రపీ బిట్స్

*🔥ఇండియన్ జాగ్రపీ బిట్స్🔥*

●1. ప్రపంచ జనపనార రాజధానిగా ఏ నగరాన్ని పేర్కొంటారు ?

*జ: కలకత్తా*

●2. భారతదేశంలో పొగాకు పంటను ప్రవేశపెట్టిన వారు ఎవరు

*జ: పోర్చుగీసువారు*

●3. దేశంలో అత్యధికంగా సాగుచేసిన తేయాకు  రకం ఏది?

*జ: బ్లాక్ టీ*

●4. కర్నాటకలో బాబు బుడాన్ కొండల ప్రాంతం దేనికి ప్రసిద్ధి ?

*జ: కాఫీ*

●5. రబ్బరు ఉత్పత్తి లో ప్రధమ స్థానంలో ఉన్న రాష్ట్రం ?

*జ: కేరళ*

●6. కుంకుమపువ్వు  ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం

*జ: జమ్ము కాశ్మీర్*

●7. ఉల్లిపాయల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ?

*జ: మహారాష్ట్ర*

●8. నారింజ పండ్ల ఉత్పత్తిలో ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ?

*జ: మహారాష్ట్ర*

●9. దేశంలో అత్యధికంగా ఖనిజాలు లభించే ప్రాంతం ?

*జ: చోట నాగపూర్ ప్రాంతం*

●10. దేశంలో అతిపెద్ద మెకనైజ్డ్ ఇనుప ధాతువు గని ఏది?

*జ: బైలదిల్లా*

●11. మాంగనీస్ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం

*జ: మధ్యప్రదేశ్*

●12. మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ పీఠభూమి ఏ  ఖనిజానికి ప్రసిద్ధి చెందినది ?

*జ: బాక్సైట్*

●13. రాజస్థాన్లోని ఖేత్రీ గని దేనికి ప్రసిద్ధి చెందింది ?

*జ: రాగి*

Saturday, November 22, 2014

సింధునది


సింధునది : ఇది టిబెట్‌లోని మానస సరోవర్ అనే సరస్సు దగ్గర పుట్టి జమ్ముకశ్మీర్ గుండా ప్రవహించి తరువాత పాకిస్థాన్ గుండా కరాచీ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. దీని మొత్తం పొడవు 2880 కి.మీ. సింధునదికి ఆపేరు పెట్టింది ఆర్యులు. ఈ సింధు నుంచి ఇండియా(ఇండస్) అను పేరు మనదేశానికి వచ్చింది. సింధునది మనదేశంలో 709 కి.మీ.లు ప్రవహిస్తుంది. ఈ నదీ జలాల్లో ఇండియా 20 శాతం మాత్రమే ఉపయోగించుకుంటోంది. సింధు 5,180 మీటర్ల ఎత్తున ఇండియాలో జమ్ముకశ్మీర్‌లో ధీమ్‌చోక్ వద్ద ప్రవేశిస్తుంది. చిలాస్ వద్ద పాకిస్థాన్‌లో ప్రవహిస్తుంది. జీలం : ఉలార్ సరస్సులోకి ప్రవహిస్తుంది. ఇది ఇండియా, పాకిస్థాన్ సరిహద్దు గుండా ప్రవహించి(ముజఫర్‌బాద్, మంగళ) పాకిస్థాన్‌లోని జాంగ్‌వద్ద చీనాబ్ నదిలో కలుస్తుంది. రావి : చంబాలోయ గుండా ప్రవహిస్తుంది. పిర్ పంజాల్ దైల్‌దార్ శ్రేణుల దక్షిణ, తూర్పు ప్రాంతాలను తడుపుతుంది. బియాస్ : కులలోయ, దౌల్‌దార్ శ్రేణుల గుండా ప్రవహించి పంజాబ్ మైదానంలోకి ప్రయాణిస్తుంది. ఇది భాక్రానంగల్, హరికే, సరిహింద్ ప్రాజెక్టుల కాలువల వ్యవస్థకి నీటిని అందిస్తుంది. ఉపనదులు : ష్యాక్, షిగార్, గిర్‌గిడ్‌డ్య్రాస్, ఔస్కర్, నుబ్రా అనునది జమ్ముకశ్మీర్‌లో ముఖ్య ఉపనదులు. నాగరికతలు : హరప్పా, మెహంజోదారో నాగరికతలు వెల్లివిరిసినది ఈ నదీ పరివాహక ప్రాంతంలోనే పంజాబ్ : పంజాబ్ అనగా ఐదు నదులు ప్రవహించే ప్రదేశం. సింధునది ఉపనదులు పంజాబ్‌లో ప్రవహిస్తున్నాయి. కావున దీనికి పంజాబ్ అని పేరు వచ్చింది. ఈ ఐదు ఉప నదులు జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లేజ్‌లు. సింధు నది ముఖ్య ఉనదులైన రావి, సట్లేజ్, చీనాబ్‌లు పాకిస్థాన్‌లో సింధు నదిలో కలుస్తాయి. గంగానది వ్యవస్థ : ఇండియాలో అతిపెద్ద నదీవ్యవస్థ. గంగానది రెండు ప్రధాన సెలయేరులైన అలక్‌నంద, భగీరిథిలు దేవప్రయోగ వద్ద కలిసి గంగా నది ఏర్పడింది. గంగానది-గంగోత్రి, హిమనీనదము(గోయుఖ్-3900మీ.)ఉత్తరాంచల్‌లో ఉత్తర ఖోకా జిల్లాలో పుడుతుంది. దీన్ని భగీరథి అంటారు. అలక్‌నంద శటోపనాథ హిమనీనదం వద్ద పుడుతుంది. దేవప్రయగాగ వద్ద భగీరథి కలక్‌నందను కలిసి గంగానదిగా ఏర్పడుతుంది. -గంగానది పరీవాహక ప్రాంతం ఆర్య నాగరికతకు కేంద్రంగా ఉన్నది. -గంగానది మొత్తం పొడవు 2525 కి.మీ. దీనిలో ఎక్కువ భాగం ఉత్తర ప్రదేశ్‌లో 1450 కి.మీ. బీహార్‌లో 445 కి.మీ. పశ్చిమబెంగాల్‌లో 520 కి.మీ ప్రవహిస్తుంది. -పశ్చిమ బెంగాల్‌లోని పరక్కా తర్వాత ఆగ్నేయ దిశగా ప్రవహించి బంగ్లాదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. -గంగానది రెండు పాయలుగా చీలుతుంది. ఒకదాన్ని భగీరథి హూగ్లీ, రెండోదాన్ని పద్మ అని పిలుస్తారు. ఉపనదులు. గంగ ముఖ్య ఉపనది యమున -గంగానదికి ఎడమవైపున కలిసే ఉపనదులు యమున, చంబల్, బెట్వా, సన్, పున్‌పున్. -కుడివైపున కలిసే ఉపనదులు రామగంగా, గోమతి, ఘాగ్రా, గండక్, కోసి, మహనంద్, రప్తీలు హిమాలయాల్లో పుడతాయి. -ఈ నది హరద్వార్ వద్ద మైదానంలోకి ప్రవేశిస్తుంది. 
Tags:dsc study material in telugu,dsc study material in telugu pdf,dsc study material in telugu free download,dsc sgt study material in telugu,dsc perspectives in education study material in telugu,dsc social studies syllabus in Telugu,dsc material in telugu medium ,geography of india pdf ebook  geography of india in hindi  download geography of india by khullar  climate of india  geography of india for kids  history of india  geography of india quiz  geography of india ppt