Showing posts with label Android. Show all posts
Showing posts with label Android. Show all posts

Monday, May 23, 2022

పోస్ట్‌ ఇన్ఫో యాప్‌.. క్షణాల్లో డిజిటల్‌ సేవలు

 

 


  DOWNLOAD

తపాల శాఖ పూర్వకాలం నాటి పద్ధతులకు స్వస్తి పలుకుతూ.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త టెక్నాలజీతో వినియోగదారులకు సేవలు అందించడానికి ప్రయత్నం చేస్తోంది. కేవలం ఉత్తరాల బట్వాడా లాంటి సేవలకే పరిమితమైతే మనుగడ కష్టమని గ్రహించిన తపాలా శాఖ.. మార్కెట్లోకి వచ్చిన ప్రతి సేవనూ తామూ అందిస్తామని సగర్వంగా ప్రచారం చేస్తోంది. 

ఆధార్‌ కార్డు నమోదు, సవరణలు, పాస్‌పోర్టు దరఖాస్తు తదితర ఎన్నో సేవలు అందిస్తూ వినియోగదారులకు చేరువ అవుతోంది. సుకన్య సమృద్ధి యోజన, రికరింగ్, సేవింగ్స్‌ డిపాజిట్ల సేకరణలో కూడా వినూత్న పంథా అనుసరిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే అన్నింటా తానూ ఉన్నానని చాటిచెబుతోంది. త్వరితగతిన సమాచారం నిమిత్తం ఇప్పుడు ప్రజలంతా మొబైల్‌ ఫోన్ల మీదనే ఆధార పడుతున్నారు. అన్ని రకాల సేవలు ఫోన్ల ద్వారా సులభంగా పొందుతున్నారు. 

ఈ నేపథ్యంలో తపాలా శాఖ కూడా మొబైల్‌ యాప్‌ ‘పోస్ట్‌ ఇన్ఫో’ తీసుకొచ్చింది. పోటీ ప్రపంచంలో బ్యాంకులు, ఇతర సేవలందించే వివిధ సంస్థలకు దీటుగా ఈ యాప్‌ చక్కగా ఉపయోగపడుతుంది. ఆండ్రాయిడ్‌ మొబైల్‌లో ప్లేస్టోర్‌ నుంచి యాప్‌ను డౌన్‌లోడు చేసుకోవచ్చు. యాప్‌ ద్వారా తొమ్మిది రకాల సేవలు పొందే సౌకర్యం ఉంది. ప్రీమియం, వివిధ రకాల డిపాజిట్లపై వడ్డీ లెక్కలు సైతం వెంటనే తెలుసుకోవచ్చు. ఇప్పటికే పోస్ట్‌ బ్యాంక్‌ యాప్‌ వినియోగంలో ఉంది. పలు రకాల సేవలు అందించే తపాలా శాఖ ఏటీఎం సౌకర్యం కూడా ఏర్పాటు చేసింది.  

యాప్‌లో ఫీచర్స్‌ ఇవే.. 
సుకన్య సమృద్ధి యోజన పథకం 
రికరింగ్‌ డిపాజిట్‌ పథకం. టైం డిపాజిట్‌లో ఏడాది నుంచి ఐదేళ్ల వరకు చేసే డిపాజిట్లపై ఆదాయాన్ని తెలుసుకోవచ్చు. 

ఇంట్రస్ట్‌ కాలిక్యులేటర్‌  
ఏ డిపాజిట్‌ పథకంలో ఎంత సొమ్ము కడితే ఎంత మొత్తం తిరిగి పొందవచ్చు. దానికి సంబంధించిన వివిధ పథకాల సమాచారం తెలుసుకోవచ్చు. 

ఆర్టికల్‌ ట్రాకింగ్‌ 
వినియోగదారులు పంపిన స్పీడ్‌ పోస్టు, రిజిస్టర్‌ పోస్టు, పార్శిల్, ఈఎంవో ఎక్కడ ఉన్నాయి. అవతలి వ్యక్తులకు ఎప్పుడు చేరుతుందో తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. 

సర్వీస్‌ రిక్వెస్ట్‌ 
ఇంటి వద్ద సేవలు పొందేందుకు, డోర్‌ డెలివరీ వంటి సదుపాయాలకు సంబంధించిన సమాచారం కూడా తెలుసుకోవచ్చు. 

కంప్లైంట్స్‌ ట్రాకింగ్‌ 
వినియోగదారులు ఇచ్చిన ఫిర్యాదులు ఏ దశలో ఉన్నాయి. దానికి సంబంధించిన సమాచారం ఇంకా ఏమైనా కావాలా అనే అంశాలు తెలుస్తాయి.  

ఇన్సూరెన్స్‌ పోర్టల్‌ 
తపాలా శాఖ ద్వారా అందిస్తున్న వివిధ రకాల బీమా పథకాల సమాచారం తెలుసుకోవచ్చు. 

ఫీడ్‌ బ్యాక్‌ 
పోస్టల్‌ సేవలకు సంబంధించిన సందేహాలు ఏమైనా ఉంటే వివరంగా తెలుసుకోవచ్చు. సలహాలు, సూచనలు ఇవ్వవచ్చు. 

పోస్టేజ్‌ కాలిక్యులేటర్‌ 
వినియోగదారులు పంపించే పార్సిళ్లు, పోస్టల్‌ కవర్లు, ధరలు, ఎంత బరువుకు ఎంత చెల్లించాలి. సాధారణ, స్పీడ్‌ పోస్టులో పంపితే ఎంత ఖర్చు అవుతుంది. అన్న విషయాన్ని చాలా సులభంగా, స్పష్టంగా తెలుసు కోవచ్చు.  

పోస్టల్‌ ఆఫీస్‌ సెర్చ్‌ 
దేశంలో ఏ పిన్‌ కోడ్‌ అయినా తెలుసుకోవచ్చు. ఊరి పేరు నమోదు చేయగానే సంబంధిత పిన్‌కోడ్‌ వస్తుంది. పిన్‌కోడ్‌ నంబర్‌ తెలిస్తే డెలివరీ కావాల్సిన పోస్ట్‌ ఆఫీసు ఎక్కడ ఉంది. ఏ తపాలా ప్రధాన కార్యాలయం పరిధిలో ఉందో కూడా ఇట్టే తెలుసుకోవచ్చు.  

యాప్‌తో ఉపయోగాలు 
పోస్ట్‌ ఇన్ఫో యాప్‌తో వినియోగదారులకు మరిన్ని సేవలు అందుబాటులోకి అందుతాయి. మొబైల్‌ ఫోన్ల ద్వారా పలు రకాల సేవలు అందిస్తున్నాం. తపాలా వినియోగదారులంతా ఈ యాప్‌ను డౌన్‌లోడు చేసుకోవడం ద్వారా కొత్త సేవలు పొందవచ్చు.

 DOWNLOAD

 

Thursday, May 12, 2022

WhatsApp స్టేటస్‌లను ఎటువంటి థర్డ్-పార్టీ అప్లికేషన్ లేకుండా డౌన్‌లోడ్ చేయడం ఎలా?

 


వాట్సాప్ అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రపంచం మొత్తం మీద ఉన్న తమ ప్రియమైన వారిని సులభంగా పలకరించగలుగుతున్నారు. వాట్సాప్ కొత్త ఫీచర్లను అందిస్తూ 2017లో స్టేటస్ ఫీచర్‌ని అధికారికంగా ప్రకటించింది. వాట్సాప్ అప్లికేషన్‌లో ఈ ఫీచర్ అధిక ప్రాముఖ్యతను సంతరించుకుంది. వాట్సాప్ స్టేటస్ ఫీచర్ ద్వారా వినియోగదారులు ఫోటోలు మరియు వీడియోలను వాట్సాప్‌లో వారి స్నేహితులతో పంచుకోవడానికి అనుమతిస్తుంది.

 వాట్సాప్ యాప్‌ యొక్క స్టేటస్ లో పంచుకున్న ఫోటోలు మరియు వీడియోలు మీ పరికరంలో తాత్కాలికంగా స్టోర్ చేయబడతాయి. తరువాత 24 గంటల వ్యవధి తర్వాత స్వయంచాలకంగా తొలగించబడతాయి. అయితే ఏ థర్డ్-పార్టీ అప్లికేషన్ లేకుండానే మీ ఫోన్‌లో ఈ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఒక మార్గం ఉంది.

వాట్సాప్ స్టేటస్‌లను మీ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకునే విధానం

 ** వాట్సాప్ స్టేటస్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడం కోసం ముందుగా మీ ఫోన్‌లో ఫైల్స్ మేనేజర్ యాప్ ఉందని నిర్ధారించుకోండి. అది అందుబాటులో లేకుంటే కనుక మీరు 'ప్లే స్టోర్' నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
** ఫైల్స్ (ఫైల్ మేనేజర్) అప్లికేషన్‌ను ఓపెన్ చేయండి.
** ఎగువ కుడివైపు హాంబర్గర్ మెనుకి వెళ్లి సెట్టింగ్‌ల ఎంపికపై క్లిక్ చేయండి.
** సెట్టింగ్స్ ఎంపికలో "షో హిడెన్ ఫైల్స్" ఎంపికను కనుగొనడానికి క్రిందికి స్క్రోల్ చేసి దాన్ని టోగుల్ చేయండి.

** తర్వాత ఫైల్స్ యాప్ యొక్క మెయిన్ పేజీకి తిరిగి వెళ్లి 'ఇంటర్నల్ స్టోరేజ్' ఎంపిక కోసం చూడండి.
** క్రింది ఎంపికల జాబితాలో "Android" ఎంపిక కోసం చూడండి.
** తరువాత "మీడియా" ఎంపికపై క్లిక్ చేయండి.
** దానిని అనుసరించి మీరు వాటిలో వివిధ యాప్‌ల డేటా యొక్క పేర్ల జాబితాను చూస్తారు.
** వాట్సాప్ పేరుతో ఉన్నదానిపై క్లిక్ చేసి కింది ఫోల్డర్‌ను ఓపెన్ చేయండి.
** తరువాత అందులో కనిపించే "మీడియా" ఎంపికను ఎంచుకోండి.
** తరువాత జాబితాలో కనిపించే "స్టేటస్" ఎంపిక మీద క్లిక్ చేయండి.
** క్రింది పేజీలో మీరు ఇటీవల చూసిన అన్ని స్టేటస్‌లను చూడవచ్చు.
** తరువాత మీకు నచ్చిన మరియు డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్న దానిపై క్లిక్ చేయండి.
** కుడివైపు ఎగువన ఉన్న మూడు-చుక్కల మెనుపై క్లిక్ చేసి 'మూవ్ టు' ఎంపికను ఎంచుకొని ఇంటర్నల్ స్టోరేజ్ ను ఎంచుకోండి.
** మీరు దాన్ని గూగుల్ క్లౌడ్ లేదా ఏదైనా ఇతర యాప్ ద్వారా కూడా షేర్ చేయవచ్చు మరియు స్టోర్ చేయవచ్చు.

 

Wednesday, May 4, 2022

టెలిగ్రామ్‌లో క్రిప్టోకరెన్సీ పేమెంట్లను చేయడానికి వీలుగా కొత్త ఫీచర్!!

 

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ సర్వీస్ యాప్ లలో ఒకటైన టెలిగ్రామ్ సంస్థ తన యొక్క యూజర్ల కోసం కొత్త ఫీచర్‌లను అభివృద్ధి చేసింది. ఈ కొత్త అభివృద్ధి బ్లాక్‌చెయిన్ లో మెసేజింగ్ యాప్‌కి కొత్తగా క్రిప్టో పేమెంట్ల ఫీచర్‌ను ప్రారంభించింది. ఈ ఫీచర్ అందుబాటులోకి రావడంతో వినియోగదారులు ఎటువంటి అదనపు రుసుము చెల్లించకుండానే ఇతర టెలిగ్రామ్ వినియోగదారులకు క్రిప్టోకరెన్సీ యొక్క Toncoinని పంపడానికి అనుమతిస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

సుమారు 550 మిలియన్ల మంది వినియోగదారులను కలిగి ఉన్న టెలిగ్రామ్ AUS సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్ (SEC) నుండి చట్టపరమైన సవాలును ఎదురుకున్న తర్వాత దాని స్వంత టోకెన్ కోసం దాని ప్లాన్‌ను గతంలో విరమించుకుంది. 2019లో టెలిగ్రామ్ తన టోకెన్‌ను అభివృద్ధి చేయడానికి $1.7 బిలియన్ల సేకరణ తరువాత దానిని చట్టవిరుద్ధమైన టోకెన్ సమర్పణగా పేర్కొంటూ SEC దావా వేసింది. టెలిగ్రామ్ తరువాత SECకి జరిమానా చెల్లించడమే కాకుండా పెట్టుబడిదారులకు మూలధనాన్ని తిరిగి ఇవ్వడానికి అంగీకరించింది. అప్పటి నుండి టెలిగ్రామ్ యొక్క CEO పావెల్ దురోవ్ టెలిగ్రామ్ నుండి స్పష్టమైన మరియు స్వతంత్రంగా ఉన్న ప్రత్యేక స్పిన్-ఆఫ్ టోకెన్ టోన్‌కాయిన్‌ను ఆమోదించడానికి కృష్టి చేస్తున్నారు. దాని యొక్క ఫలితంగానే ఇప్పుడు టెలిగ్రామ్‌లో పేమెంట్స్ కోసం ఇప్పుడు క్రిప్టోకరెన్సీలను ప్రారంభించింది అని నివేదిక పేర్కొంది.

 
"టెలిగ్రామ్‌లోని ఈ ఫంక్షనాలిటీ వినియోగదారుని యొక్క బిజినెస్ పేమెంట్ల వరకు విస్తరిస్తుందని మేము అంచనా వేస్తున్నాము. తద్వారా ప్రజలు టెలిగ్రామ్ యాప్‌లోని బాట్‌ల ద్వారా టన్‌కాయిన్‌ను పంపడం ద్వారా అన్ని రకాల సేవలను సులభంగా పొందవచ్చు" అని TON ఫౌండేషన్ తెలిపింది. "టెలిగ్రామ్ లో కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ కొత్త సర్వీసుతో మీరు ఇకపై అతిపెద్ద లేదా పొడవైన వాలెట్ అడ్రసులను నమోదు చేయాల్సిన అవసరం లేదు మరియు నిర్ధారణల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు" అని ఫౌండేషన్ ఫీచర్‌ను ప్రకటిస్తూ ట్వీట్‌లో పేర్కొంది.
టెలిగ్రామ్ ఇటీవలి కొత్త అప్‌డేట్‌లు టెలిగ్రామ్ సంస్థ ఇటీవల కొత్తగా మరొక అప్ డేట్ ను కూడా ప్రకటించింది. వీటిలో మ్యూట్ డ్యూరేషన్, యానిమేటెడ్ ఎమోజీలు మరియు మెరుగైన మెసేజ్ ట్రాన్సలేషన్లతో సహా అనేక కొత్త ఫీచర్‌లను అందిస్తుంది. అలాగే కస్టమ్ నోటిఫికేషన్ సౌండ్స్ ఫీచర్ తో వినియోగదారులు ఏదైనా సౌండ్‌ని నోటిఫికేషన్ టోన్‌గా మార్చడానికి అనుమతిస్తుంది. ఇది యాప్‌లో కస్టమ్ అలర్ట్‌లను రూపొందించడానికి ఉపయోగించవచ్చు.

 
** కస్టమ్ మ్యూట్ డ్యూరేషన్ సాయంతో టెలిగ్రామ్ లో నిర్దిష్ట వ్యవధికి నోటిఫికేషన్‌లను పాజ్ చేసే సామర్థ్యాన్ని కూడా జోడించింది. వినియోగదారులు ఒక గంట, 2 గంటలు, ఒక వారం, రెండు వారాలు, మూడు నెలలు మొదలైన అనేక రకాల ఎంపికల నుండి ఎంచుకోవచ్చు. ప్రతి చాట్‌లో అలర్ట్‌లను సవరించడానికి స్ట్రీమ్‌లైన్డ్ మెనూ ఉంటుందని టెలిగ్రామ్ చెబుతోంది. ** ప్రొఫైల్‌లలో కొత్త ఫీచర్లలో ఆటో- డెలిట్ మెను అనేది టెలిగ్రామ్ వ్యక్తిగత ప్రొఫైల్‌లలో ఆటో- డెలిట్ మెసేజ్ ఎంపికను ప్రారంభించడానికి ప్రయాణాన్ని కూడా సులభతరం చేసింది. ** ఫార్వార్డ్ చేసిన మెసేజ్లకు ప్రత్యుత్తరం యొక్క తాజా అప్‌డేట్‌తో వినియోగదారులు ఇతర చాట్‌లకు మెసేజ్ ని ఫార్వార్డ్ చేసినప్పుడు టెలిగ్రామ్ రిప్లై ప్రివ్యూలతో సహా ఉంటుంది. ఇది ఇతర వినియోగదారులు చేసే సంభాషణలో ఇతర వినియోగదారులకు మరింత సందర్భాన్ని ఇస్తుంది.

 


Tuesday, May 3, 2022

ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులకు బిగ్‌ షాక్‌.. గూగుల్‌ కీలక నిర్ణయం

 


 ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులకు బిగ్‌ షాక్‌ తగలనుంది. యాప్స్‌ విషయంలో గూగుల్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆండ్రాయిడ్ ఫోన్స్​లో కాల్​ రికార్డింగ్ యాప్స్‌ను తొలగించనున్నట్టు పేర్కొంది. యాజర్ల ప్రైవసీని దెబ్బతీస్తున్నాయన్న కారణంతో థర్డ్ పార్టీ కాల్ రికార్డింగ్ యాప్స్​ అన్నింటినీ నిలిపేయాలని గూగుల్‌ నిర్ణయించింది. మే 11 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

అయితే, మీ ఫోన్‌లో వాయిస్ కాల్​ మాట్లాడుతున్నప్పుడు, ఆన్​లైన్​ కాన్ఫరెన్స్​లో పాల్గొంటున్నప్పుడు ఆ కాల్స్‌ను రికార్డ్ చేయడం ఇక కుదరకపోవచ్చు. గూగుల్ డయలర్ లేదా స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ డిఫాల్ట్‌గా ఇచ్చే డయలర్ ద్వారా మాత్రమే ఇకపై కాల్ రికార్డింగ్ ఫీచర్ అందుబాటులో ఉండనుంది. కాగా, గూగుల్ డయలర్​ ద్వారా ఎవరైనా ఈ ఫీచర్ ఉపయోగిస్తుంటే అవతలి వ్యక్తికి కూడా ఈ కాల్‌ రికార్డు చేస్తున్నారనే అలర్ట్‌ వస్తుంది. 

ఇదిలా ఉండగా.. కాల్ రికార్డింగ్​కు గగుల్‌ ఎప్పుడూ వ్యతిరేక స్వరాన్నే వినిపించింది. అవతలి వ్యక్తికి తెలియకుండా ఫోన్‌లో వారి వాయిస్‌ను రికార్డ్ చేయడం ద్వారా యూజర్ల ప్రైవసీకి భంగం కలుగుతుందన్నది గూగుల్ ఇప్పటికే చాలా సందర్బాల్లో పేర్కొంది. అందులో భాగంగానే కాల్ రికార్డింగ్ యాప్స్​ను తొలగించేందుకు సిద్ధమైంది.

 

Truecaller: గూగుల్‌ షాకింగ్‌ నిర్ణయం..ఇకపై ట్రూకాలర్‌లో ఈ ఫీచర్‌ పనిచేయదు..!

 

 


 

ఆండ్రాయిడ్‌ యూజర్లకు ప్రైవసీను దెబ్బతీస్తున్నాయనే కారణంతో థర్డ్‌ పార్టీ కాల్‌ రికార్డింగ్స్‌ యాప్స్‌ను నిషేధిస్తున్నట్లు గూగుల్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కొత్త రూల్‌ను తెరపైకి రావడంతో కాలర్‌ వేరిఫికేషన్‌ ప్లాట్‌ఫాం ట్రూకాలర్‌ కీలక నిర్ణయం తీసుకుంది. తమ యాప్‌లో కాల్‌ రికార్డింగ్‌ ఫీచర్‌ను అందించబోమని ట్రూకాలర్‌ ప్రకటించింది. 

ఈ ఫీచర్‌ను మే 11 నుంచి నిలిపివేస్తామని ట్రూకాలర్‌ పేర్కొంది.  మే 11 నుంచి యాక్సెసిబిలిటీ ఏపీఐకి థర్డ్-పార్టీ అప్లికేషన్‌ల యాక్సెస్‌ని నియంత్రిస్తూ గూగుల్‌ ప్లే స్టోర్‌ పాలసీని అప్‌డేట్ చేసినట్లు గూగుల్‌ ప్రకటించిన వెంటనే ట్రూకాలర్‌ ఈ నిర్ణయం తీసుకుంది.  దీంతో థర్డ్‌ పార్టీ యాప్స్‌నుపయోగించి కాల్స్‌ను రికార్డింగ్‌ చేయలేరు.  ట్రూకాలర్‌ యాప్‌ యూజర్లకు కాల్ రికార్డింగ్ ఫీచర్‌ను అందరికీ ఉచితంగా అందిస్తోంది, గూగుల్‌ యాక్సెసిబిలిటీ ఏపీఐని ఉపయోగించి కాల్‌ రికార్డింగ్‌ ఫీచర్‌ను ఎనేబుల్ చేసింది. అయితే, గూగుల్‌ అప్‌డేట్‌ చేసిన డెవలపర్ ప్రోగ్రామ్ విధానాల ప్రకారం...ఇకపై కాల్ రికార్డింగ్‌ను అందించలేమని ట్రూకాలర్‌ పేర్కొంది


ఇదిలా ఉండగా స్మార్ట్‌ఫోన్స్‌లో ముందుగా ఇన్‌స్టాల్‌ చేసిన యాప్స్‌తో, గూగుల్‌ డయలర్‌తో ఫోన్‌ కాల్స్‌ను రికార్డ్‌ చేయవచ్చునని గూగుల్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆండ్రాయిడ్ వినియోగదారులకు మరింత గోప్యతను అందించడానికి, కాల్ రికార్డింగ్ చట్టాలకు అనుగుణంగా గూగుల్‌ ఈ మార్పును తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

 

Sunday, April 17, 2022

మీ స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సాప్‌ యాప్‌కు లాక్‌-అన్‌లాక్‌ చేయడం ఎలా..?

 


 

Whatsapp: ప్రస్తుతం వాట్సాప్‌ వినియోగం పెరిగిపోయింది. అలాగే ఫోన్‌లో ఏది చేసినా బయటకు పొక్కకుండా ఉండేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాము. స్మార్ట్‌ఫోన్‌ (Smartphone Lock)కు లాక్‌ వేసుకుంటాము. అలాగే స్మార్ట్‌ఫోన్‌ (Smartphones)లలో ఎక్కువగా వినియోగించేది వాట్సాప్‌ . ప్రతి రోజు ఉదయం నుంచి రాత్రి పడుకోబోయే వరకు చాలా మంది వాట్సాప్‌లో మునిగి తేలుతుంటారు. వాట్సాప్‌ (Whatsapp)లో కూడా కొన్ని సిక్రెట్స్‌ ఉంటాయి. అలాంటి సమయంలో వాట్సాప్‌ యాప్‌కు కూడా లాక్‌ వేసుకోవడం ఎంతో ముఖ్యం. స్మార్ట్‌ఫోన్‌లలో వ్యక్తిగతంలో ఎన్నో సిక్రెట్స్‌ ఉంటాయి. ఇతరులు వారి వాట్సాప్‌ చాట్‌ను చూపేందుకు ఆసక్తి చూపరు. ఎవరికైనా ఫోన్‌ ఇచ్చినా వాట్సాప్‌ ఎక్కడ ఓపెన్‌ చేస్తారేమోనని టెన్షన్‌ ఉంటుంది. అందుకే కొందరు వాట్సాప్‌కు సిస్టమ్‌ యాప్‌, ఇతర లాక్‌ యాప్‌లను వినియోగిస్తుంటారు. ఆ యాప్స్‌ వాట్సాప్ రక్షణగా ఉంటుంది. అయితే ఎలాంటి యాప్స్‌ లేకుండా కూడా లాక్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. స్వయంగా వాట్సాప్‌లోనే ఈ లాక్‌ ఫీచర్‌ ఉంటుంది. దీనిని ఫింగర్‌ప్రింట్‌ (Fingerprint) సెన్సార్‌ లేదా ఫేస్‌ రికగ్నైజేషన్ అథంటికేషన్ ద్వారా మీరు మాత్రమే ఓపెన్ చేయవచ్చు.

ఆండ్రాయిడ్‌, ఓఐఎస్ యాప్స్‌లో ఈ వాట్సాప్‌ లాక్ ఫీచర్ అందుబాటులో ఉంది. దీన్ని ఒక్కసారి ఆన్ చేసుకుంటే మీరు ఫింగర్‌ప్రింట్ యాక్సెస్ ఇస్తేనే వాట్సాప్‌ ఓపెన్ అవుతుంది. ఫేస్ అన్‌లాక్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు. వాట్సాప్‌ లాక్‌లో ఉన్నా వాట్సాప్‌ కాల్స్‌కు ఆన్సర్ చేసే సదుపాయం కూడా ఉంటుంది. అయితే మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ వాట్సాప్‌ లాక్‌ను ఎలా ఆన్ చేసుకోవాలో చూడండి.

ఆండ్రాయిడ్‌ మొబైల్‌ యూజర్లు వాట్సాప్‌ లాక్ ఆన్ చేసుకోండిలా..

☛ మీ ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్‌ ఓపెన్‌ చేయండి.

☛ యాప్‌పై కుడి భాగంలో ఉన్న మూడు చుక్కలపై క్లిక్‌ చేయాలి.

☛ తర్వాత సెట్టింగ్‌ (Settings)లోకి వెళ్లి అకౌంట్‌ (Account) ఆప్షన్‌పై ట్యాప్‌ చేయాల్సి ఉంటుంది.

☛ ఆ తర్వాత ప్రైవసీ (Privacy)ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి

☛ అనంతరం కిందికి స్క్రోల్‌ చేస్తే ఫింగర్‌ప్రింట్ లాక్ (Fingerprint Lock) అని ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేసి అన్‌లాక్‌ విత్‌ ఫింగ్‌ప్రింట్‌ అనే ఆప్షన్‌ను టాగుల్‌ చేసి ఎనేబుల్‌ చేసుకోండి. ఇక తర్వాత నుంచి వాట్సాప్‌ ఓపెన్‌ చేయాలంటే ఫింగర్‌ప్రింట్‌ అథంటికేషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది

 

 

Friday, October 8, 2021

సిగ్నల్స్ లేకున్నా కూడా కాల్స్ మాట్లాడవచ్చు.. ఎలా అంటే ? ఈ సెట్టింగ్‌ని మార్చిన తర్వాత

 

 


 ఈ రోజుల్లో కాల్స్ చేయడానికి నెట్‌వర్క్‌కు సంబంధించి సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. సాధారణంగా ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు ఒకోసారి ఫోన్ మధ్యలో డిస్‌కనెక్ట్ అవుతుంటుంది లేదంటే మాట్లాడుతున్నపుడు సరిగ్గా వినపడకపోవడం జరుగుతుంది.

దేశవ్యాప్తంగా చాలా మంది ఈ సమస్యను ఎదురుకునే ఉంటారు. మీరు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటుంటే మీరు వై-ఫై కాలింగ్ వైపు మారితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఫీచర్ సహాయంతో మీరు నెట్‌వర్క్ సరిగ్గా లేకున్నా లేదా వీక్ గా ఉన్న   కూడా మాట్లాడవచ్చు. వై-ఫై కాలింగ్ సమయంలో మీ కాల్ డ్రాప్స్ సమస్య బాగా తగ్గుతుంది. ఇంకా ఫోన్‌లో మాట్లాడేటప్పుడు వాయిస్ కూడా స్పష్టంగా వినిపిస్తుంది. ఈ ఫీచర్ కోసం టెలికాం కంపెనీలు  కస్టమర్ల నుండి ఎలాంటి రుసుమును చార్జ్ చేయవు. కాబట్టి మీరు దీని గురించి తప్పక తెలుసుకోవాలి. మీరు మీ ఫోన్‌లో వై-ఫై కాలింగ్‌ను ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే..?

 

 మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో వైఫై కాలింగ్ ఫీచర్‌ 
దీన్ని ఆక్టివేట్ చేయడానికి మీరు మొదట మీ స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్‌ ఓపెన్ చేయాలి. సెట్టింగ్‌ని ఓపెన్ చేసిన తర్వాత, పైన ఉన్న నెట్‌వర్క్ కనెక్షన్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
ఆ తర్వాత మీరు వై-ఫై ఆప్షన్ లోకి వెళ్లి  అడ్వాన్స్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

 వై-ఫై కాలింగ్ ఆప్షన్ 
తరువాత వై-ఫై కాలింగ్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఆక్టివేట్ చేసుకోవచ్చు. మీ ఫోన్‌లోరెండు  సిమ్ కార్డులు ఉంటే అందులోంచి  దేనినైనా ఉపయోగించవచ్చు. 


మీరు ఐఫోన్ ఉపయోగిస్తే
 మీరు ఐఫోన్ వాడితే మొదట సెట్టింగులను ఓపెన్ చేయాలి. ఆ తర్వాత ఫోన్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
ఇప్పుడు మీరు డేటా ఆప్షన్ ఎంచుకోవాలి. దానిని ఎంచుకున్న తర్వాత మీరు వై-ఫై కాలింగ్ ఆప్షన్ చూస్తారు, దానిపై క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన తర్వాత   వైఫై కాలింగ్ పక్కన ఉన్న టోగుల్‌ని ఆన్ చేయండి ఆక్టివేట్ అవుతుంది.

Friday, October 1, 2021

IQoo Z5: అదిరిపోయే ఫీచర్లుతో iQoo Z5 స్మార్ట్‌ఫోన్‌..


ప్రముఖ వివో స్మార్ట్‌ఫోన్‌కు సబ్‌ బ్రాండ్‌గా ఐక్యూ Z5 స్మార్ట్‌ఫోన్‌ను చైనా తాజాగా భారత మార్కెట్లో లాంచ్‌ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్‌కమ్ స్నాప్​డ్రాగన్​ 778జీ ప్రాసెసర్ అందించింది.

 

ప్రముఖ వివో స్మార్ట్‌ఫోన్‌కు సబ్‌ బ్రాండ్‌గా ఐక్యూ Z5 స్మార్ట్‌ఫోన్‌ను చైనా తాజాగా భారత మార్కెట్లో లాంచ్‌ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్‌కమ్ స్నాప్​డ్రాగన్​ 778జీ ప్రాసెసర్ అందించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 120 hertz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల ఫుల్-హెచ్ డీ+ LCD పంచ్ హోల్ డిస్ ప్లేను కలిగి ఉంది. ఇందులో 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు ట్రిపుల్ రేర్‌ కెమెరా సెటప్ ఉంది. ట్రిపుల్‌ రేర్‌ కెమెరాల్లో 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ మాక్రో కెమెరా 16 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాలొచ్చాయి. ఐక్యూ Z5 ఫోన్‌ 5,000 MAH బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. హై-రెస్ ఆడియో, హై-రెస్ ఆడియో వైర్‌లెస్ ను సపోర్ట్‌ చేస్తుంది.

 VIDEO LINK     https://youtu.be/arQqCwkwLzY

 


 

 

iQOO Z5 Summary

iQOO Z5 mobile was launched on 23rd September 2021. The phone comes with a 6.67-inch touchscreen display with a resolution of 1,080x2,400 pixels and an aspect ratio of 20:9. iQOO Z5 is powered by an octa-core Qualcomm Snapdragon 778G processor that features 4 cores clocked at 2.4 MHz and 4 cores clocked at 1.8 MHz. It comes with 8GB of RAM. The iQOO Z5 runs Android 11 and is powered by a 5000mAh non-removable battery. The iQOO Z5 supports proprietary fast charging.

As far as the cameras are concerned, the iQOO Z5 on the rear packs a triple camera setup featuring a 64-megapixel primary camera with an f/1.79 aperture; an 8-megapixel camera with an f/2.2 aperture, and a 2-megapixel camera with an f/2.4 aperture. The rear camera setup has autofocus. It has a single front camera setup for selfies, featuring a 16-megapixel sensor with an f/2.45 aperture. The front camera also features autofocus.

The iQOO Z5 runs Origin OS 1.0 is based on Android 11 and packs 128GB of inbuilt storage. The iQOO Z5 measures 164.70 x 76.68 x 8.49mm (height x width x thickness) and weighs 193.00 grams. It was launched in Blue Origin, Dreamspace, and and Twilight Morning colours.

Connectivity options on the iQOO Z5 include Wi-Fi, GPS, Bluetooth v5.20, USB OTG, and USB Type-C. Sensors on the phone include ambient light sensor, compass/ magnetometer, gyroscope, proximity sensor, and fingerprint sensor. The iQOO Z5 supports face unlock.

As of 1st October 2021, iQOO Z5 price in India starts at Rs. 23,990.

 

TAGS:-  IQoo Z5, IQoo Z5 Mobile , iQoo Z5 launched with Snapdragon 778, 120Hz screen. See price, specifications  -

 

Saturday, September 18, 2021

ఫోన్‌ స్టోరేజ్‌ నిండిందా? డోంట్‌ వర్రీ.. వీటిలో ట్రై చేయండి

 జియోక్లౌడ్‌ (ఫ్రీ క్లౌడ్‌ స్టోరేజ్‌).. గూగుల్‌ ఫొటోస్‌కు ఇంకో ఉచిత ప్రత్యామ్నాయం ఇది. జియో ద్వారా క్లౌడ్‌ స్టోరేజ్‌ 50జీబీ ఉచిత స్టోరేజ్‌ ఇస్తుంది. రిఫరెన్స్‌, ప్రమోషన్స్ ద్వారా మరికొంత ఫ్రీ స్టోరేజ్‌ను పొందవచ్చు.

 

 


Hey, JioCloud offers *LIFE-TIME FREE* cloud storage. 

Try it now, use code *YGFC3H* to help me earn 10GB. 

 

https://www.jiocloud.com/referral

 Download

 

JioCloud is a cloud storage app for all your PHOTOS, VIDEOS, DOCUMENTS, AUDIO, CONTACTS and MESSAGES. JioCloud lets you AUTO BACKUP your content on cloud and INSTANTLY SYNCS your content across all your devices. You can ACCESS your files from any smartphone, computer or even your TV using JioCloud app.

Salient features of JioCloud are-

FREE STORAGE SPACE:-
JioCloud provides you more than 50 GB of FREE ONLINE STORAGE through 'Refer & Earn' program and promotions run time-to-time. To use Refer & Earn feature, go to the app. To avail promotional offers, keep using JioCloud app. :)
Read about past promotions at https://static.jiocloud.com/promotions.html

AUTO BACKUP:- Simply enable auto-backup to keep your phone data safe on JioCloud. All your existing and new files will be backed up automatically to JioCloud as per your backup settings. We provide tension-free auto-backup.

CONTACTS BACKUP:- JioCloud will create one contact address book for all your smartphones contacts. Enable contacts backup from settings and secure your contacts forever. JioCloud also lets you RESTORE your contacts on your smartphone. App can also FIND DUPLICATE contacts in your contacts list and help you merge them.

BACKUP SETTINGS:- Flexibility to switch backup network (mobile/Wi-Fi) setting and choose which file type to backup. You can decide what you want to backup to your cloud storage.

EASY SHARING
:- Quickly share any content from JioCloud with your friends. You can share as many files as you want of any size, type using share link. Receiver need not to have JioCloud account to view those files.

SHARED ALBUMS:- JioCloud lets you create 'Boards' which are your shared albums. Create boards for all your holiday trips, birthday parties, wedding events or group projects. Upload photos, videos, music or docs to your boards and INVITE FRIENDS to view those files. Your friends can also add files to your boards.

SIMPLE FILE ORGANISATION:- You can CREATE FOLDERS as per your requirement to arrange your files and upload files in any folder. JioCloud arranges your files in TIMELINE VIEW so that you can easily navigate down the memory lane. You can also change SORT order to re-arrange your files.

ACCESS FROM ANYWHERE:- Access your backed up files from anywhere, anytime using JioCloud app or website (www.jiocloud.com) on any smartphone, computer or TV. Once uploaded to JioCloud, your files are instantly synced across all your devices.

STREAM MUSIC & VIDEOS:
- Real time streaming support to watch videos and listen to your favorite music without any delay and without downloading them to your device.

RELIABLE FREE CLOUD:- We securely store multiple copies of your data with us so you never lose any file and can access them whenever you need them.

We are listening to your feedback and constantly working on it. Please reach out to us at care.jiocloud@jio.com for any queries or feedback.

 

 టెరాబాక్స్‌(డ్యూబాక్స్‌).. గూగుల్‌​ ఫొటోస్‌కు బెస్ట్‌ ప్రత్యామ్నాయం ఇది. ఈ యాప్‌లో 1టీబీ(వెయ్యి జీబీ) ఉచిత స్టోరేజ్‌ ఇస్తుంది. ఫైల్స్‌, ఫొటోస్‌, వీడియోలు, ఫోల్డర్‌లు ఏవైనా దాచుకోవచ్చు. అయితే వీడియోలు ఆటోమేటిక్‌గా బ్యాక్‌ప్‌లోకి వెళ్లాలంటే మాత్రం.. ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉండాల్సిందే. ఇక ఫొటోలను మాత్రం ఉచితంగా బ్యాకప్‌ చేసుకునేందుకు ఎనేబుల్‌ బటన్‌ను క్లిక్‌ చేయాల్సి ఉంటుంది.


 

 Download

 

 Register for 1024GB permanent free cloud storage! Automatically back up your photos and videos. Supports online photo preview and video playing.

With TeraBox, you can store approximately: 3,000,000+ photos, 2500+ video files or 6.5 million document pages. We provide a safe place for all your files and storage and prevent your data from being stolen. You can safely back up, sync, access and share your important content.

Get secure cloud storage for free and make secure backups to avoid losing them! 📥Anyone can upload and transfer files to TeraBox and share them with friends and family. Back up photos, videos, documents and other files to cloud storage, and access files synchronized with any computer or mobile device ——from anywhere! 📤

TeraBox Cloud Storage Highlights :
– 1024GB permanent free cloud storage;
– Upload photos, videos, documents and other files from your Android device;
– Access all the content you have stored in cloud storage, no matter what device it came from;
– Preview photos & Online video playback;
– Create folders and move files between them;
– Transfer files to different file storage;

Sign up now for your free TeraBox Cloud Storage. You’ll get enough space to save files from all your linked devices. Also, you can easily sign in with your Facebook, Google, or Apple Id account. We provides you a safe space to upload files from multiple devices like smartphone, tablet, or computer. The backup function can safely back up your files, such as videos, photos and documents, without worrying about losing files. Moreover, you can easily create folders to manage your files and documents.

Function features:
🎥Back up photos & videos
• Automatic photo backup from your phone
• Online photo preview & video playback

🗄File Accessing
• Safely access any type of your files on the app
• Easily archive your files
• Download multiple files at the same time in your transfer list

🔎Search
• Search docs by name and keyword

TeraBox is an innovative cloud storage app that protects all the files on your device, organizes them for you, and helps you quickly back up and search through your photos by using powerful AI technology. With TeraBox, we bring the future of data backup and cloud storage to you.

Any questions for TeraBox? Please do not hesitate to contact us at helpdesk@terabox.com
If you would like to know what people are saying about TeraBox app:
Follow us on Instagram: https://www.instagram.com/clouddubox/

 

Thursday, September 2, 2021

JioPhone Next లాంచ్ డేట్ ...? ప్రీ -బుకింగ్,ధర మరియు ఇతర వివరాలు


 

 రిలయన్స్ జియో కంపెనీ రాబోయే బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ జియోఫోన్ నెక్స్ట్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. జూన్ 24 న కంపెనీ 44 వ వార్షిక సర్వసభ్య సమావేశంలో చేసిన ప్రకటన ప్రకారం ఈ పరికరం సెప్టెంబర్ 10 న వస్తుందని భావిస్తున్నారు. రాబోయే స్మార్ట్‌ఫోన్ ప్రారంభానికి రెండు వారాల కన్నా తక్కువ సమయం ఉన్నందున, ఈ వారం ప్రీ-ఆర్డర్లు ప్రారంభమవుతాయని నివేదికలు సూచిస్తున్నాయి.

 


 JioPhone పోటీ ధరలతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కి అంతరాయం కలిగించే టెలికాం ఆపరేటర్, ఈ పరికరం కోసం ప్రీ-ఆర్డర్‌లను ప్రారంభించడానికి రిటైల్ భాగస్వాములతో చర్చలు జరుపుతున్నట్లు తాజా నివేదిక సూచిస్తుంది. గణేష్ చతుర్థి సందర్భంగా ఈ స్మార్ట్‌ఫోన్ వస్తుందని కంపెనీ తెలిపింది.

 రాబోయే జియోఫోన్ నెక్స్ట్, ఆప్టిమైజ్ చేసిన గూగుల్ యొక్క ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క అనుకూలీకరించిన వెర్షన్‌తో పాటుగా రూపొందించిన గూగుల్ అసిస్టెంట్ మరియు మెరుగైన కెమెరా యాప్ వంటి ప్రత్యేక ఫీచర్లతో వస్తుంది. ఇది క్రోమ్ గో, కెమెరా గో మరియు డుయో గో వంటి గూగుల్ యాప్స్ యొక్క చిన్న వెర్షన్‌లతో విడుదల చేయబడుతుందని భావిస్తున్నారు. రిలయన్స్ జియో తన రాబోయే జియోఫోన్ నెక్స్ట్ స్మార్ట్‌ఫోన్ యొక్క హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్‌లను అధికారికంగా ప్రకటించాల్సి ఉండగా, వివిధ లీకులు మరియు నివేదికల ప్రకారం  64-బిట్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 215 చిప్‌సెట్‌ని కలిగి ఉన్నట్లు సూచించాయి.అంతేకాక ఈ స్మార్ట్ ఫోన్  2,500 ఎంఏహెచ్ బ్యాటరీతో శక్తినిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5.5 అంగుళాల డిస్‌ప్లేతో పాటు 13MP వెనుక కెమెరా మరియు 2MP సెల్ఫీ షూటర్‌తో కూడా రావచ్చు.

 జియోఫోన్ నెక్స్ట్ దేశంలో ఎప్పుడు ప్రారంభించబడుతుందో మాకు తెలుసు, ఎందుకంటే కంపెనీ 44 వ ఎజిఎం ఈవెంట్‌లో ఇది వెల్లడైంది. అయితే, ధర విషయానికి వస్తే, ధరపై అధికారిక సమాచారం లేదు - కానీ మార్కెట్లో ఉన్న పోటీ స్మార్ట్ఫోన్ల ధరలను పరిశీలిస్తే ,ఈ ఫోన్ ధర ₹ 5,000 కంటే తక్కువగా ఉండవచ్చని నివేదికలు సూచించాయి. ఇది Xiaomi, Realme మరియు Samsung వంటి పోటీదారులు గట్టి పోటీని ఇవ్వగలదు. ఎందుకంటే ఈ ఊహించిన స్పెసిఫికేషన్‌లతో పోల్చదగిన స్మార్ట్‌ఫోన్ ధర సుమారు ,రూ. 6,000 మార్క్. ఏదేమైనా, ఈ వివరాలను అంచనాలుగా మాత్రమే తీసుకోవడం మంచిది. పరికరాన్ని అధికారికంగా ప్రారంభించినప్పుడు మాత్రమే జియోఫోన్ యొక్క అధికారిక ధర ప్రకటించబడుతుంది.

 రిలయన్స్ జియో 'జియో ఎక్స్‌క్లూజివ్' బండిల్డ్ స్మార్ట్‌ఫోన్‌లతో మిడ్-సెగ్మెంట్ వినియోగదారులపై తన పట్టును కఠినతరం చేయాలని చూస్తోంది, అయితే Jio POS ని ఇన్‌స్టాల్ చేయడం కొత్త వాణిజ్య పరిధిని విస్తరిస్తుంది, లాక్-ఇన్ హ్యాండ్‌సెట్‌ల కోసం కంపెనీ హ్యాండ్‌సెట్ భాగస్వామ్యాల గురించి ఇటీవలి నివేదికలు వెలువడ్డాయి.జియోఫోన్ నెక్స్ట్ లాంచ్ కోసం సిద్ధమవుతున్నందున, జియో సిమ్ లాక్ చేయబడిన పరికరాలను అందించడానికి ఆఫ్‌లైన్ స్టోర్‌లతో జతకట్టడం ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ తన హ్యాండ్‌సెట్ రిటైల్ వ్యూహాన్ని ప్రకటించింది.జియో సిమ్ లాక్ చేయబడిన ఫోన్‌ల కోసం వివో, షియోమి, శామ్‌సంగ్, ఒప్పో, హెచ్‌ఎండి గ్లోబల్ మరియు ఐటెల్ వంటి కంపెనీలతో రిలయన్స్ రివర్స్ హ్యాండ్‌సెట్ బండ్లింగ్ భాగస్వామ్యాలను కుదుర్చుకోనున్నట్లు సమాచారం.

 

 'జియో ఎక్స్‌క్లూజివ్' స్మార్ట్‌ఫోన్‌లు పరికర తయారీదారుల భాగస్వామ్యంతో జియో సిమ్ మరియు జియో బండిల్డ్ యాప్‌లతో లాక్ చేయబడ్డాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లు జియో నుండి ధర మద్దతుతో పాటు, ఎటువంటి ధర EMI (6 నెలల వరకు) మరియు రూ .7000-10000 విలువైన అదనపు ప్రయోజనాలతో పాటు వస్తాయి.జియోఫోన్ నెక్స్ట్ మరియు జియో ఎక్స్‌క్లూజివ్ స్మార్ట్‌ఫోన్‌లు రెండూ మార్కెట్ పరిధిని పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి, ఎందుకంటే జియో ఇతర టెల్కోల 300 మిలియన్ 2 జి సబ్‌స్క్రైబర్‌లను మరియు ప్రస్తుత జియోఫోన్ వినియోగదారులను 'జియోఫోన్ నెక్స్ట్' కి అప్‌గ్రేడ్ చేయడానికి ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తుంది. ఇంకా, POS పరికరాలు టెలికాం రిటైలర్లకు కూడా కొత్త వాణిజ్య పరిధిని విస్తరిస్తాయి.

 

 ఇప్పుడు, ఒక ప్రత్యేక నివేదిక ప్రకారం, రిలయన్స్ జియో ప్రారంభానికి ముందే జియోఫోన్ నెక్స్ట్ అమ్మకాలకు ఆర్థికంగా ఐదు బ్యాంకులతో జతకట్టింది. వచ్చే ఆరు నెలల్లో 5 కోట్ల వరకు జియోఫోన్ నెక్స్ట్ యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. జియోఫోన్ నెక్స్ట్ కొనుగోలుదారులు మిగిలిన మొత్తానికి రుణదాతలతో 10 శాతం ఖర్చును ముందుగానే చెల్లించాల్సి ఉంటుందని నివేదిక పేర్కొంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పిరమాల్ క్యాపిటల్, IDFC ఫస్ట్ అస్యూర్ మరియు DMI ఫైనాన్స్‌తో సహా ఐదు బ్యాంకులు ఒక్కొక్కటి రూ .10,000 కోట్ల వ్యాపారానికి హామీ ఇచ్చాయి. ఇంకా నాలుగు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు రూ. 2,500 కోట్ల విలువైన క్రెడిట్ సపోర్ట్ ఇస్తాయని నివేదికలు విడుదలయ్యాయి.రిలయన్స్ పరిశ్రమలు జియోఫోన్ నెక్స్ట్ 4 జి స్మార్ట్‌ఫోన్ కోసం ప్రారంభ ఉత్పత్తి ఆర్డర్‌ను యుటిఎల్ నియోలంక్‌ సంస్థకు అందించాయి, ఇది బెంగుళూరుకు చెందిన యుటిఎల్ గ్రూప్ మరియు నియోలింక్ సొల్యూషన్స్ యొక్క జాయింట్ వెంచర్.

Sunday, August 15, 2021

టెలిగ్రామ్ మరో సూపర్ అప్ డేట్.. ఇప్పుడు ఒకేసారి.. ఎంతమంది వీడియో కాల్స్ మాట్లాడొచ్చంటే,,

 దేశీయ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ సరికొత్త అప్ డేట్ తీసుకొచ్చింది. ఇప్పుడు టెలిగ్రామ్ యూజర్లు  ఒకేసారి 1000 మంది వరకు గ్రూప్ వీడియో కాల్‌ మాట్లాడుకునే అవకాశాన్ని కల్పించింది. అంతేకాదు వీడియో షేరింగ్‌ ఫీచర్‌ని కూడా అప్‌డేట్ చేసింది. దీని ద్వారా మీరు మీ చాట్ బాక్స్‌లోని రికార్డింగ్ బటన్‌ని క్లిక్ చేస్తే వీడియో రికార్డ్‌ అవుతుంది. ఆ రికార‍్డైన వీడియోలను మీ స‍్నేహితులకు కూడా షేర్‌ చేసుకోవచ్చు.  ఇంకా వీడియోలను 0.5 లేదా 2x వేగంతో చూడవచ్చు.

 


 గ్రూప్ వీడియో కాల్స్ 30 మంది యూజర్ల కెమెరా అండ్ స్క్రీన్ రెండింటి నుండి వీడియోలను ప్రసారం చేయడానికి అనుమతిస్తాయి. ఇప్పుడు 1000 మంది ఒకేసారి ఆన్‌లైన్ క్లాసెస్ నుండి లైవ్ ర్యాప్ వరకు ఏదైనా చూడవచ్చు. టెలిగ్రామ్ ఈ పరిమితిని "భూమిపై ఉన్న అందరికీ ఒకే గ్రూప్ కాల్‌ ద్వారా చేరడానికి త్వరలో మరింత అప్ డేట్ చేస్తామని తెలిపింది.

 గ్రూప్ వీడియో కాల్‌ను ప్రారంభించడానికి ముందు మీరు అడ్మిన్‌గా ఉన్న ఏదైనా గ్రూప్  పేజీ (Android లో ⋮ మెనూలో) నుండి వాయిస్ చాట్‌ను క్రియేట్ చేయండి తర్వాత మీ వీడియోని ఆన్ చేయండి.

 



మీ గ్యాలరీలోకి ఒక వీడియోని యాడ్ చేయకుండా మీ డివైజెస్ నుండి షేర్ చేయడానికి వీడియో మెసేజెస్ బెస్ట్ మార్గం. బ్లాగ్‌పోస్ట్ ప్రకారం వీడియో మెసేజ్‌ని ట్యాప్ ద్వారా పాజ్ చేయవచ్చు,  ఒకవేళ మీరు మెసేజ్‌ని వేగంగా ఫార్వర్డ్ చేయడానికి లేదా రివైండ్ చేయడానికి అనుమతిస్తుంది.

 వీడియో మెసేజ్ రికార్డ్ చేయడానికి, 1-ఆన్ -1 కాల్‌లకు జోడించిన స్క్రీన్ షేరింగ్‌ పై నొక్కండి. ఇప్పుడు ఏదైనా వీడియో కాల్‌లో ప్రసారం చేసేటప్పుడు మీ డివైజ్  వచ్చే సౌండ్ కూడా చేర్చుతుంది.

 

 

 

Tuesday, April 20, 2021

రియల్‌మీ బడ్జెట్‌ ఫోన్లు

 

మొబైల్‌ ఫోన్స్‌ బ్రాండ్‌ రియల్‌మీ తాజాగా సి–సిరీస్‌లో మూడు కొత్త మోడళ్లను రూపొందించింది. వీటి ధరలు రూ.6,799 నుంచి రూ.10,999 వరకు ఉన్నాయి. వేరియంట్‌నుబట్టి ర్యామ్‌ 2–4 జీబీ, ఇంటర్నల్‌ మెమరీ 32–128 జీబీ, బ్యాటరీ 5000–6000 ఎంఏహెచ్‌ ఉంది. ఇప్పటి వరకు అంతర్జాతీయంగా సి–సిరీస్‌లో 3.2 కోట్ల ఫోన్లు అమ్ముడయ్యాయని రియల్‌మీ వైస్‌ ప్రెసిడెంట్‌ మాధవ్‌ సేథ్‌ తెలిపారు.  

 


 

 

 

 


Wednesday, March 24, 2021

అదిరిపోయే ఫీచర్లతో విడుదలైన పోకో ఎక్స్3 ప్రో, పోకో ఎఫ్3

 

పోకో ఎక్స్3 ప్రో, పోకో ఎఫ్3 ఫోన్లు గ్లోబల్ లాంచ్ అయ్యాయి. వీటిలో పోకో ఎక్స్3 ప్రోలో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 860 ప్రాసెసర్‌ను అందించారు. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. గత నెలలో చైనాలో లాంచ్ అయిన రెడ్ మీ కే40కి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఇందులో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్‌ను అందించారు. 5జీ సపోర్ట్ కూడా ఉంది. వీటిలో పోకో ఎక్స్3 ప్రో మన దేశంలో మార్చి 30వ తేదీన లాంచ్ కానుంది.

 


 

పోకో ఎక్స్3 ప్రో ఫీచర్లు:

  • 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డాట్ డిస్ ప్లే 
  • స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌  
  • టచ్ శాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్‌ 
  • గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్ 
  • ఆక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 860 ప్రాసెసర్‌
  • 6 జీబీ, 8 జీబీ ర్యామ్
  • 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్
  • 48 ఎంపీ + 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ +  2 ఎంపీ మాక్రో + 2 ఎంపీ డెప్త్ కెమెరా
  • 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
  • ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12 
  • బ్యాటరీ సామర్థ్యం 5160 ఎంఏహెచ్  
  • 33వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ 
  • 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: 249 యూరోలు(సుమారు రూ.21,400) 
  • 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: 299 యూరోలు(సుమారు రూ.25,700) 

పోకో ఎఫ్3 ఫీచర్లు:

  • 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఈ4 అమోఎల్ఈడీ డిస్ ప్లే
  • రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్  
  • టచ్ శాంప్లింగ్ రేట్ 360 హెర్ట్జ్ 
  • కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్ 
  • ఆక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్ 
  • 6 జీబీ, 8 జీబీ ర్యామ్
  • 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్
  • 48 ఎంపీ + 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ + 5 ఎంపీ టెలిమాక్రో కెమెరా 
  • 20 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12 
  • బ్యాటరీ సామర్థ్యం 4520 ఎంఏహెచ్ 
  • 33వాట్ ఫాస్ట్ చార్జింగ్ 
  • 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: 349 యూరోలు(సుమారు రూ.30,100) 
  • 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: 399 యూరోలు(సుమారు రూ.34,400) 

 

 

 

 Tags: Telugu Tech, New Mobile Lunch, Telugu Android News

 

 

Monday, March 15, 2021

స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌లో యూట్యూబ్ వీడియోలను డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్నారా...

 

 ఈ రోజుల్లో సోషల్ మీడియాలో వీడియోలు చాలా వైరల్ అవుతున్నాయి. నిజంగా చెప్పాలంటే సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో క్రీయేటివిటీ వీడియోలు చాలా పాపులర్ అవుతుంటాయి. ఇక యూట్యూబ్‌లో కూడా ఇదే పరిస్థితి.    
 
మీరు యూట్యూబ్‌లో ఎక్కువగా వీడియోలను చూస్తుంటారు. మనం యూట్యూబ్ లో ఉండే వీడియోలను   ఒకోసారి షేర్ చేయాలనుకుంటున్నాం లేదా ఫోన్‌లో డౌన్ లోడ్ చేసుకోవాలనుకుంటుంటాం కానీ కొందరికి ఎలా డౌన్ లోడ్ చేయాలో తెలిదు. ఈ రోజు యూట్యూబ్ నుండి వీడియోలను ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలుసుకోండి..    యూట్యూబ్‌ యాప్ లో  వీడియోలను ఎలా సేవ్ చేయాలి  యూట్యూబ్‌ యాప్ లో వీడియోలను ఆఫ్‌లైన్ చూడటానికి యూట్యూబ్ లో సేవ్ చేయడం ద్వారా  డౌన్ లోడ్ చేసుకోవచ్చు, కానీ ఈ ఫీచర్ చాలా వీడియోలకు అందుబాటులో లేదు. 
 
 
మీరు ఈ విధంగా వీడియోలను డౌన్‌లోడ్ చేయాలనుకుంటే, మొదట యూట్యూబ్‌ యాప్ ఓపెన్ చేసి మీరు డౌన్‌లోడ్ చేయదలిచిన వీడియో  సెర్చ్ చేయండి.    తరువాత వీడియొ కింద లైక్ అండ్ షేర్ బటన్లతో పాటు డౌన్‌లోడ్ బటన్ కూడా కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయడం ద్వారా మీరు వీడియోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా డౌన్‌లోడ్ చేసిన వీడియోలను లైబ్రరీలో చూడవచ్చు.      స్మార్ట్‌ఫోన్‌లో యూట్యూబ్ వీడియోను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి  మీరు ఫోన్‌లో ఎప్పటికీ వీడియోను డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే దీని కోసం మీరు థర్డ్ పార్టీ యాప్స్ అయిన స్నాప్‌ట్యూబ్ సహాయం తీసుకోవాలి. కాబట్టి మొదట ఈ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేయాలి. అప్పుడు మీరు డౌన్‌లోడ్ చేయదలిచిన యూట్యూబ్ వీడియో లింక్‌ను కాపీ చేయండి. ఇప్పుడు ఈ యాప్ లో లింక్‌ను పేస్ట్ చేసి ఆపై డౌన్‌లోడ్ చేయండి 
 
  ల్యాప్‌టాప్‌లో యూట్యూబ్ వీడియోలను డౌన్‌లోడ్ చేయడం ఎలా  మీరు మీ ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌లో యూట్యూబ్ వీడియోను డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కూడా మీరు థర్డ్ పార్టీ వెబ్‌సైట్ సహాయం తీసుకోవాలి.  వంటి  థర్డ్ పార్టీ వెబ్‌సైట్ల నుండి మీరు ల్యాప్‌టాప్‌లో యూట్యూబ్ వీడియోలను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.   మొదట మీరు వీడియో లింక్‌ను కాపీ చేసి, ఆపై ఈ వెబ్‌సైట్ సెర్చ్ బార్‌కు వెళ్లి పేస్ట్ చేయండి. ఈ వెబ్‌సైట్లలో మీరు వీడియో క్వాలిటీ కోసం అనేక ఆప్షన్స్ కూడా ఉంటాయి.

 


Saturday, March 13, 2021

మీ ఫోన్‌లో ఈ యాప్స్ ఉన్నాయా.? తస్మాత్ జాగ్రత్త.. వెంటనే డిలీట్ చేయండి.!

 

 

 


Uninstall Apps From Phone: మీరు సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్‌గా ఉంటున్నారా.? నగదు లావాదేవీలు యాప్స్ ద్వారా చేస్తున్నారా.! అలాగే ప్లేస్టోర్ నుంచి వివిధ రకాల యాప్స్ డౌన్‌లోడ్ చేసుకుంటూ ఉంటారా.. అయితే తస్మాత్ జాగ్రత్త కొన్ని యాప్స్ మీ ఫోన్ ద్వారా బ్యాంక్ ఖాతా వివరాలు, పాస్‌వర్డ్స్, ఆధార్, పాన్ నెంబర్స్ వంటివి తెలుసుకుని నగదును లూటీ చేసే అవకాశం ఉంది. ఈ అంశాన్ని బీజీఆర్ తాజా రిపోర్ట్‌లో వెల్లడించింది. ఇందులో కొన్ని యాప్స్‌కు సంబంధించిన వివరాలను తెలియజేసింది. ఆ అప్లికేషన్స్ మీ ఫోన్‌లో ఉంటే వెంటనే డిలీట్ చేయాలని సైబర్ నిపుణులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

  • బీట్‌ప్లేయర్ (BeatPlayer)
  • క్యూర్/బార్‌కోడ్ స్కానర్ మ్యాక్స్ (QR/Barcode Scanner MAX)
  • కేక్ వీపీఎన్ (Cake VPN)
  • పసిఫిక్ వీపీఎన్ (Pacific VPN)
  • ఈవీపీఎన్ (eVPN)
  • టూల్‌‌టిప్‌నేటర్‌లైబ్రరీ (tooltipnatorlibrary)
  • క్యూరికార్డర్ (QRecorder)

ఈ యాప్స్ మీ ఫోన్‌లో ఉంటే వెంటనే అన్‌- ఇన్‌స్టాల్ చేయండి లేదంటే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అయినట్లే.!

 Tags: Uninstall Apps, Telugu Tech News, Android Use apps

G
M
T
Text-to-speech function is limited to 200 characters

Tuesday, March 9, 2021

Smartphone కొనబోతున్నారు.. ... ఇకపై ఈ ఫీచర్స్ ఉంటేనే ... లేటెస్ట్ ట్రెండ్స్ ఇవి!

 

 


కొత్తగా smartphone కొనాలంటే అనేక అంశాలు పరిగణనలోకి తీసుకుంటారు. అయితే ఇవి ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఈ సంవత్సరం నుండి రాబోయే కొన్నేళ్లలో ఏయే అంశాల ఆధారంగా వినియోగదారులు smartphone కొనుగోలు చేయబోతున్నారు అనే అంశం మీద ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ Flipkart కొన్ని వివరాలు వెల్లడించింది.

5G phoneలకు ఇటీవల విపరీతంగా ఆదరణ పెరిగినట్లు ఆ సంస్థ వెల్లడించింది. రాబోయే కొన్నేళ్లపాటు 5G smartphone లకు ఎక్కువ గిరాకీ ఉంటుందని ఆ సంస్థ అంచనా వేస్తోంది. మరోవైపు ఇప్పటివరకు 64 మెగాపిక్సెల్ కెమెరా కలిగిన ఫోన్లతో సరిపెట్టుకున్న వినియోగదారులు.. ఇప్పుడిప్పుడే 108 మెగాపిక్సెల్ రిసల్యూషన్ ఉన్న ఫోన్ల వైపు దృష్టి సారిస్తున్నారు. మున్ముందు ఇప్పటికన్నా మరింత ఎక్కువగా కెమెరా క్వాలిటీ గురించి వినియోగదారులు ఆలోచించే అవకాశం ఉంది.

 

ఇదిలా ఉంటే మరోవైపు బ్యాటరీల పరంగా కూడా నిన్న మొన్నటి వరకు 5000 mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీలు ప్రామాణికంగా ఉంటే ఇప్పుడు ఏకంగా 6000 mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీలు ప్రామాణికంగా మారుతున్నాయి. మరోవైపు ఇప్పుడు వాడకంలో ఉన్న ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీల కంటే మరింత శక్తివంతమైన 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన ఫోన్లకి విపరీతంగా ఆదరణ పెరగబోతున్నట్లు తెలుస్తోంది.

 Under display selfie camera కలిగిన మొట్టమొదటి ఫోన్ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో, ఇకమీదట ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే ఇలాంటి ఫీచర్లని దృష్టిలో పెట్టుకొని వినియోగదారులు ఫోన్లను కొనే అవకాశం ఉందని Flipkart చెబుతోంది. దీంతోపాటు వినియోగదారుల ఎప్పటికప్పుడు ఫోన్ పనితీరు పట్ల కూడా ప్రత్యేకంగా దృష్టి నిలుపుతున్న ట్లు ఫ్లిప్కార్ట్ సంస్థ గమనించింది. 5nm ప్రాసెసర్లు అందుబాటులోకి రావడం, ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ఆధారంగా పనిచేసే ఇతర ఫీచర్లు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుండడంతో కంప్యుటేషనల్ ఫోటోగ్రఫీ ప్రాధాన్యత సంతరించుకుంటోందని, ముందు ముందు ఫోన్ లలో ఇది కీలకంగా మారబోతోందని Flipkart భావిస్తోంది.

 


ఏదేమైనప్పటికీ ప్రస్తుతం మనం phoneలను వాడుతున్న తీరుకి భిన్నమైన, మరింత శక్తివంతమైన phoneలను రాబోయే రెండు మూడేళ్లలో ఉపయోగించబోతున్నాం.

 

Friday, March 5, 2021

ట్రూకాలర్ అద్భుతమైన కొత్త యాప్.. ఎలా ఉప్యోగపడుతుందంటే ?.. పిల్లలు, అమ్మాయిల కోసం

కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్ గార్డియన్ అనే కొత్త యాప్ లాంచ్ చేసింది. ఇది ట్రూకాలర్ నుండి వస్తున్న రెండవ యాప్. గార్డియన్ యాప్ అనేది వ్యక్తిగత భద్రతా యాప్, ఈ యాప్ లో వినియోగదారులు వారి కుటుంబం, స్నేహితులు, అధికారులను యాడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా మీరు మీ కుటుంబం, స్నేహితులు, అధికారులను సంప్రదించడానికి మీకు సహాయపడే వివిధ ఫీచర్స్ వస్తుంది. ఈ యాప్ లోని “ఎమర్జెన్సీ” బటన్‌ను నొక్కడం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో మీరు మీ లొకేషన్ ఎంచుకున్న వారితో షేర్ చేసుకోవచ్చు. మీరు “ఎమర్జెన్సీ” బటన్‌ను నొక్కిన తర్వాత మీ లొకేషన్ పొందే “కమ్యూనిటీ గార్డియన్స్” నుండి సహాయాన్ని పొందవచ్చు. ఒకే ట్యాప్‌తో ట్రూకాలర్ వినియోగదారులకు సైన్-ఇన్ ప్రాసెస్ సులభం చేసింది. ఈ గార్డియన్ యాప్ గురించి పూర్తిగా తెలుసుకోండి.. 

 


 

 అండ్రాయిడ్, ఐ‌ఓ‌ఎస్ వినియోగదారుల కోసం ;
ట్రూకాలర్ భారతదేశంతో పాటు ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో గార్డియన్ అనే కొత్త యాప్ విడుదల చేసింది. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ నుండి ఉచితంగా డౌన్‌లోడ్ చూసుకోవచ్చు. ట్రూకాలర్ గార్డియన్ ఫీచర్స్ ఉపయోగించడానికి ఎలాంటి చార్జెస్ లేవు ఇంకా పూర్తిగా ఉచితం. ఇందులో ;యాప్స్ లేదా ప్రీమియం అక్కౌంట్ అలాంటి లేవు.

 


Download

 గార్డియన్ యాప్ ఎలా పని చేస్తుంది?
గార్డియన్ యాప్ ట్రూకాలర్నుండి వస్తున్న కొత్త భద్రతా యాప్. ఇది అత్యవసర సమయంలో మీ ఎంపిక చేసుకున్నా మీ సంరక్షకులకు సమాచారాన్ని తెలియజేయడానికి ఎమర్జెన్సీ బటన్‌ ఇందులో ఉంటుంది. మీరు మీ కుటుంబం, స్నేహితులు, అధికారులను మీ సంరక్షకులుగా ఇందులో చేర్చవచ్చు. మీరు ఎమర్జెన్సీ బటన్‌ను నొక్కిన తర్వాత మీ లొకేషన్ ఎవరికైతే షేర్ చేయాలనుకుంటున్నారో కూడా సెలెక్ట్ చేసువచ్చు. అలాగే మీరు ఈ యాప్ ద్వారా స్థానిక స్థానిక పోలీసుల నుండి కూడా సహాయం పొందవచ్చు.

Wednesday, March 3, 2021

ఇన్‌స్టాగ్రామ్‌లో అద్భుతమైన కొత్త ఫీచర్... ఫోటో షేరింగ్

 సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ యాజమాన్యంలోని ఫోటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారుల కోసం ఒక కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది.


 

 

ఇన్‌స్టాగ్రామ్ లైవ్ రూమ్స్ అనే పేరుతో ఈ ఫీచర్‌ను ప్రారంభించింది, దీని సహాయంతో నలుగురు వ్యక్తులను ఒకేసారి లైవ్ ప్రసారంలో చేర్చవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ లోన  ఈ కొత్త ఫీచర్ క్లబ్‌హౌస్‌తో సమానంగా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ఒక యూజర్ ని మాత్రమే  చేర్చే ఫీచర్ ఇంతకు ముందు ఉండేది.


 ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్  సహాయంతో వినియోగదారులు ఒకరికొకరు మాట్లాడుకోవచ్చు. అంతే కాకుండా మీరు ఏదైనా ట్యుటోరియల్ కూడా నిర్వహించవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ లైవ్ రూమ్స్ చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ కి ఎంతో ఉపయోగపడతాయి.

 ఇన్‌స్టాగ్రామ్  క్రొత్త ఫీచర్ ఎలా పని చేస్తుంది    ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ రూమ్‌ను ఉపయోగించడానికి మీరు ఎడమవైపు స్వైప్ చేసి తరువాత లైవ్ కెమెరా ఆప్షన్ పై క్లిక్ చేయండి. దీని తరువాత టైటిల్ ఎంటర్ చేసి మీరు చాట్ రూమ్స్ సింబల్ పై క్లిక్ చేయాలి.

 ఆ తరువాత మీతో లైవ్ లోకి రావటానికి  రిక్వెస్ట్ చేసిన వ్యక్తులను మీరు చూస్తారు. ఇది కాకుండా మీరు సెర్చ్ ద్వారా ఎవరినైనా లైవ్ ప్రసారం చేయవచ్చు. మీరు బ్రాడ్‌కాస్టర్ అయితే ముగ్గురు వ్యక్తులతో కలిసి లైవ్ ప్రసారం చేయవచ్చు. 

 


 

ఈ కొత్త ఫీచర్ క్లబ్‌హౌస్‌తో సమానంగా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ఒక యూజర్ ని మాత్రమే చేర్చే ఫీచర...

Monday, January 25, 2021

ఫేస్‌బుక్‌కు పోటీగా దూసుకెళ్తున్న 'మీవే' యాప్ MEWE APK

 తాజా వాట్సాప్-ఫేస్‌బుక్ డేటా షేరింగ్ వివాదం నేపథ్యంలో చాలా మంది ప్రజలు కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల కోసం ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియా దిగ్గజాలైన ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటివి ప్రైవసీ ఉల్లంఘనకు పాల్పడటంతో పాటు యూజర్ల యాక్టీవీటి మీద నిఘా పెంచడంతో చాలా మంది యూజర్లు ఇతర యాప్ ల వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో యుఎస్ ఆధారిత సోషల్ నెట్‌వర్క్ "మీవే" గూగుల్ ప్లే స్టోర్‌లో అత్యధికంగా డౌన్‌లోడ్ చేయబడిన సోషల్ యాప్‌గా నిలిచింది. కేవలం ఒక్క వారంలోనే 2.5 మిలియన్లకు పైగా యూజర్లు దీనిని డౌన్‌లోడ్ చేసుకున్నారు.

2016లో ప్రారంభించినప్పటి నుంచి 2020 అక్టోబర్ వరకు ఈ సోషల్ నెట్‌వర్క్ ‌యాప్ ను తొమ్మిది మిలియన్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ ప్లాట్‌ఫామ్‌లో ప్రస్తుతం 15.5 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు. "మీవే" ఇప్పుడు 20 భాషలకు సపోర్ట్ చేయనుంది. ప్రస్తుతం హాంకాంగ్‌లో నెం.1సోషల్ యాప్ గా "మీవే" కొనసాగుతుంది. కంపెనీ తెలిపిన వివరాలు ప్రకారం యూజర్ల డేటాను గౌరవించే సోషల్ నెట్‌వర్క్‌ను నిలిచినందున దీనిని చాలా మంది వినియోగదారులు డౌన్‌లోడ్ చేసుకున్నట్లు పేర్కొంది. ఇది సోషల్ నెట్‌వర్క్ యాడ్ ఫ్రీగా కొనసాగనుంది. 2021 జనవరి 15నాటికి ప్రపంచంలోనే గూగుల్ ప్లే స్టోర్ లో డౌన్‌లోడ్ పరంగా నెం.3గా.. సోషల్ మీడియా డౌన్‌లోడ్ పరంగా నెం.1గానూ కొనసాగుతుంది. ఇప్పటివరకు వాట్సాప్ కు పోటీగా సిగ్నల్, టెలిగ్రామ్ యాప్ లు ఉన్నాయి. ఇప్పుడు ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి వాటికీ ప్రత్యామ్నాయంగా "మీవే" యాప్ నిలిచింది. యాడ్ ఫ్రీగా కొనసాగుతుండటంతో ఎక్కువ మంది యూజర్లు డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. ఎక్స్ ట్రా ఫీచర్లతో ప్రీమియం మోడల్స్ ను మించిపోయేలా ఉంది.

DOWNLOAD

Monday, January 11, 2021

Whatsapp vs Signal App: భారత్‌లో వాట్సాప్‌కి షాక్.. సిగ్నల్‌ యాప్‌కి మారిపోతున్న కస్టమర్లు..!

 

Whatsapp vs Signal App: ఇన్నాళ్లూ వాట్సాప్ వాడిన మనకు... దాన్ని మానేసి... సిగ్నల్ యాప్ వాడాలంటే అదేంటో, ఎలా ఉంటుందో, వాడొచ్చో లేదో ఇలా చాలా డౌట్లు ఉంటాయి. కానీ... గూగుల్ ప్లే స్టోర్‌లో ఇప్పటికే కోటి మందికి పైగా పైగా ఈ యాప్ వాడుతున్నారు. రేటింగ్ కూడా 4.5 ఇచ్చారు. ఇండియాలో సిగ్నల్ యాప్‌కు క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎవరి నోట చూసినా ఇదే మాట.  


Download app

 

వాట్సాప్ కొత్త సర్వీస్ రూల్స్‌ యూజర్లకు నచ్చట్లేదు. తమ ప్రైవసీకి దెబ్బ పడుతుందని ఆలోచిస్తూ... వాట్సాప్‌ని వదిలేసి... సిగ్నల్ యాప్‌కి జంప్ అవుతున్నారు. యాపిల్ ఇండియా యాప్‌ స్టోర్‌లో ఇది నంబర్ వన్ యాప్‌గా మారింది.

 ఈ మధ్య వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ నోటిఫికేషన్లను కస్టమర్లకు పంపించింది. వాటిని ఒప్పుకుంటేనే వాట్సాప్‌ వాడాలని మెలిక పెట్టింది. వాటిపై చాలామంది కస్టమర్లు అసంతృప్తిగా ఉన్నారు. టెస్లా కంపెనీ సీఈఓ ఎలన్ మస్క్, అమెరికన్ విజిల్‌బ్లోయర్ ఎడ్వర్డ్ స్నోడెన్, ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సే వంటి ప్రముఖులు... సిగ్నల్‌ యాప్‌ను వాడమని చెప్పేశారు. దాంతో అంతా సిగ్నల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు.