Friday, March 5, 2021

ట్రూకాలర్ అద్భుతమైన కొత్త యాప్.. ఎలా ఉప్యోగపడుతుందంటే ?.. పిల్లలు, అమ్మాయిల కోసం

కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్ గార్డియన్ అనే కొత్త యాప్ లాంచ్ చేసింది. ఇది ట్రూకాలర్ నుండి వస్తున్న రెండవ యాప్. గార్డియన్ యాప్ అనేది వ్యక్తిగత భద్రతా యాప్, ఈ యాప్ లో వినియోగదారులు వారి కుటుంబం, స్నేహితులు, అధికారులను యాడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా మీరు మీ కుటుంబం, స్నేహితులు, అధికారులను సంప్రదించడానికి మీకు సహాయపడే వివిధ ఫీచర్స్ వస్తుంది. ఈ యాప్ లోని “ఎమర్జెన్సీ” బటన్‌ను నొక్కడం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో మీరు మీ లొకేషన్ ఎంచుకున్న వారితో షేర్ చేసుకోవచ్చు. మీరు “ఎమర్జెన్సీ” బటన్‌ను నొక్కిన తర్వాత మీ లొకేషన్ పొందే “కమ్యూనిటీ గార్డియన్స్” నుండి సహాయాన్ని పొందవచ్చు. ఒకే ట్యాప్‌తో ట్రూకాలర్ వినియోగదారులకు సైన్-ఇన్ ప్రాసెస్ సులభం చేసింది. ఈ గార్డియన్ యాప్ గురించి పూర్తిగా తెలుసుకోండి.. 

 


 

 అండ్రాయిడ్, ఐ‌ఓ‌ఎస్ వినియోగదారుల కోసం ;
ట్రూకాలర్ భారతదేశంతో పాటు ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో గార్డియన్ అనే కొత్త యాప్ విడుదల చేసింది. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ నుండి ఉచితంగా డౌన్‌లోడ్ చూసుకోవచ్చు. ట్రూకాలర్ గార్డియన్ ఫీచర్స్ ఉపయోగించడానికి ఎలాంటి చార్జెస్ లేవు ఇంకా పూర్తిగా ఉచితం. ఇందులో ;యాప్స్ లేదా ప్రీమియం అక్కౌంట్ అలాంటి లేవు.

 


Download

 గార్డియన్ యాప్ ఎలా పని చేస్తుంది?
గార్డియన్ యాప్ ట్రూకాలర్నుండి వస్తున్న కొత్త భద్రతా యాప్. ఇది అత్యవసర సమయంలో మీ ఎంపిక చేసుకున్నా మీ సంరక్షకులకు సమాచారాన్ని తెలియజేయడానికి ఎమర్జెన్సీ బటన్‌ ఇందులో ఉంటుంది. మీరు మీ కుటుంబం, స్నేహితులు, అధికారులను మీ సంరక్షకులుగా ఇందులో చేర్చవచ్చు. మీరు ఎమర్జెన్సీ బటన్‌ను నొక్కిన తర్వాత మీ లొకేషన్ ఎవరికైతే షేర్ చేయాలనుకుంటున్నారో కూడా సెలెక్ట్ చేసువచ్చు. అలాగే మీరు ఈ యాప్ ద్వారా స్థానిక స్థానిక పోలీసుల నుండి కూడా సహాయం పొందవచ్చు.