Telangana State Public Service Commission GROUP-IV SERVICES (GENERAL RECRUITMENT)NOTIFICATION No. 19/2022
Notification,Syllabus,Model Papers, SBI Jobs, Material, SI, E Books Download, Online Results, Mobile Useful , Android, New Apps,Tech News,apk file,
Sunday, June 25, 2023
Thursday, June 8, 2023
TSPSC Group 1 Hall Ticket 2023 , Prelims Admit Card Link - Telangana State Public Service Commission. GROUP-I SERVICES
Tags: Telangana State Public Service Commission. GROUP-I SERVICES TSPSC Group 1 Hall Ticket 2023 Out, Prelims Admit Card Link tspsc group 1 hall ticket 2023 www.tspsc.gov.in results TSPSC Login ID and password TSPSC Hall Ticket Tspsc id Group 1 tspsc hall ticket 2023 TSPSC Group 1 results TSPSC. RegistrationTSPSC Login ID and password
tspsc group 1 hall ticket 2023
TSPSC. Registration
Tspsc id
TSPSC login
www.tspsc.gov.in results
TSPSC Group 1 results
TSPSC Hall Ticket
Wednesday, June 7, 2023
Arithmetic Reasoning in Telugu
Reasoning Right Choice Academy PDF
RS-Agarwal-Verbal-Nonverbal pdf download
RRB-arithmetic TM PDF DOWNLOAD
ARITHMETIC-TM-NEW PDF DOWNLOAD
Tags: Arithmetic Reasoning in Telugu,Arithmetic bits in telugu pdf Arithmetic reasoning in Telugu pdf Arithmetic and reasoning topics in telugu Arithmetic syllabus in telugu Shyam institute arithmetic Material pdf free download Arithmetic and reasoning questions and answers in Telugu pdf Numerical and arithmetical abilities topics in telugu Arithmetic Reasoning in English
Keyword : Arithmetic bits in telugu pdf Arithmetic reasoning in Telugu pdf Arithmetic and reasoning topics in telugu Arithmetic syllabus in telugu Shyam institute arithmetic Material pdf free download Arithmetic and reasoning questions and answers in Telugu pdf Numerical and arithmetical abilities topics in telugu Arithmetic Reasoning in English
Tuesday, June 6, 2023
Monday, October 17, 2022
TSPSC Group-1: ప్రశాంతంగా గ్రూప్-1 ప్రిలిమ్స్... సివిల్స్ స్థాయిలో ప్రశ్నలు..!
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం జరిగిన ఈ ఎగ్జామ్ కు 75 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. 503 గ్రూప్-1 పోస్టుల కోసం 3.80 లక్షల మంది అప్లై చేసుకున్నారు. అయితే 2.86 లక్షల మంది మాత్రమే పరీక్ష రాశారు. ఈ ఎగ్జామ్ నిర్వహణకు తెలంగాణ వ్యాప్తంగా 1,019 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 10: 30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష (Group-1 Prelims) జరిగింది. అభ్యర్థులను ఉదయం 8: 30 గంటల నుంచే సెంటర్స్ లోకి అనుమతించారు. ఎగ్జామ్ నిర్వహణను టీఎస్పీఎస్సీ కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి కమిషన్ ఛైర్మన్, సభ్యులు పర్యవేక్షించారు.
ఈ పరీక్షకు సంబంధించి ప్రాథమిక కీ ను
ఎనిమిది రోజుల్లో విడుదల చేస్తామని కమిషన్ తెలిపింది. గ్రూప్-1 ప్రిలిమ్స్
పరీక్ష ప్రశాంతంగా ముగియడంలో సహకరించిన సిబ్బందికి టీఎస్పీఎస్సీ ఛైర్మన్
జనార్దన్ రెడ్డి కృతక్షతలు తెలిపారు. అయితే పరీక్షలో ప్రశ్నల సరళి సివిల్స్
స్థాయిలో ఉన్నాయని అభ్యర్థులు తెలిపారు. విశ్లేషణాత్మక, స్టేట్‌మెంట్
ఆధారిత ప్రశ్నలే ఎక్కువగా వచ్చినట్లు వారు తెలిపారు. రీజనింగ్, కరెంట్
ఆఫైర్స్, సైన్ అండ్ టెక్నాలజీ, జాగ్రఫీ, తెలంగాణ హిస్టరీ విభాగాల నుంచి
ఎక్కువగా ప్రశ్నలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రిలిమ్స్ పేపర్ కఠినంగా
ఉండటంతో కటాఫ్ మార్కులు తగ్గే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. గ్రూప్-1
మెయిన్స్ పరీక్ష డిసెంబరులో జరిగే అవకాశం ఉంది.
Sunday, October 9, 2022
తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు విడుదల TSPSC Group 1 Hall Ticket 2022
తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు విడుదల TSPSC Group 1 Hall Ticket 2022
Download Hall-Ticket
tspsc group 1 hall ticket,
tspsc group 1 hall ticket download 2022,
tspsc group 1 hall ticket 2022,
tspsc group 1 hall ticket 2022 release date,
tnpsc group 1 hall ticket download 2022,
how to download tspsc group 1 hall ticket,
tspsc group 1 hall ticket download,
group 1 tnpsc hall ticket,
tspsc group 1 exam hall ticket download,
tspsc group 1 hall ticket alp,
tspsc group 1 hall ticket agent,
tspsc group 1 hall ticket box office,
tspsc group 1 hall ticket builder
Saturday, May 14, 2022
TSPSC Group 1 Study Books 2022 pdf download
TSPSC GROUP 1 TELUGU BOOKS DOWNLOAD
Tags: TSPSC GROUP 1 TELUGU BOOKS DOWNLOAD,TSPSC BOOKS, GROUP 1 BOOKS.
Monday, October 3, 2016
మిషన్ కాకతీయ, తెలంగాణ హరితహారం
కాకతీయులు రామప్ప చెరువు, పాకాల, లక్నవరం చెరువులు వంటి పెద్ద చెరువులనే కాకుండా చిన్న చెరువులను కూడా తవ్వించారు. కాకతీయుల అనంతరం నిజాం పరిపాలన కాలంలో నిర్మించిన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్, నిజాంసాగర్ వంటి నీటిపారుదల ప్రాజెక్టులు ప్రజల తాగు, సాగునీటి అవసరాలను తీరుస్తున్నాయి.
చెరువుల పుట్టిల్లు తెలంగాణ
- దక్కన్ పీఠభూమిలో ఉన్న తెలంగాణ రాష్ర్టం చెరువుల నిర్మాణానికి అనువైన ప్రాంతం.
- శాతవాహనుల కంటే ముందే తెలంగాణలో చెరువుల నిర్మాణం ఉందనడానికి చారిత్రక ఆధారాలున్నాయి.
- కాకతీయుల కాలంలో మాత్రం చెరువుల నిర్మాణం అత్యున్నత ప్రమాణాలతో సాగినట్లు తెలుస్తోంది.
- కాకతీయులు నిర్మించిన రామప్ప, పాకాల, లక్నవరం, ఘనవరం, బయ్యారం వంటి అనేక పెద్ద చెరువులు నేటికీ సేవలు అందిస్తున్నాయి.
- కాకతీయుల తర్వాత తెలంగాణను పాలించిన కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీలు, వివిధ సంస్థానాధీశులు చెరువుల నిర్మాణాన్ని కొనసాగించి, వ్యవసాయ విస్తరణకు తోడ్పడ్డారు.
- తెలంగాణలో ప్రతీ ఊరికి ఒక చెరువు తప్పనిసరిగా ఉండేది. ఒకటి కంటే ఎక్కువ చెరువులు ఉన్న గ్రామాలు తెలంగాణలో చాలా ఉన్నాయి.
- ప్రత్యేక తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ర్ట ప్రభుత్వం పునర్నిర్మాణంపై దృష్టి సారించింది.
- పునర్నిర్మాణం ప్రధానంగా సాగునీటి రంగంపై ఆధారపడి ఉందని భావించిన ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణకు ప్రత్యేక కార్యచరణ ప్రకటించింది.
- చెరువుల పునరుద్ధరణ జరిగితే తెలంగాణలో వలసలు తగ్గుతాయి. గ్రామాల్లో అనేక కులవృత్తుల ప్రజలకు జీవనోపాధి లభిస్తుంది.
- చెరువులను పునరుద్ధరించి వాటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా వ్యవసాయాభివృద్ధి సాధించాలని ప్రభుత్వం భావిస్తోంది.
- తెలంగాణలో వేల సంఖ్యలో చెరువులను తవ్వించిన కాకతీయుల స్ఫూర్తిగా రాష్ర్ట ప్రభుత్వం మిషన్ కాకతీయను ప్రారంభించింది.
- తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు 2015, మార్చి 12న నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలం పాత చెరువులో ‘మిషన్ కాకతీయ’ పైలాన్‌ను ప్రారంభించారు.
- ఈ కార్యక్రమం ద్వారా చెరువులను పునరుద్ధరించి కాకతీయుల కాలం నాటి శోభను తిరిగితెచ్చేందుకు ప్రభుత్వం దృఢసంకల్పంతో ముందుకు సాగుతోంది. మిషన్ కాకతీయ కార్యక్రమం ద్వారా 46 వేలకు పైగా చెరువులను పునరుద్ధరించనున్నారు. దీని కోసం ప్రభుత్వం భారీ మొత్తంలో వ్యయం చేయనుంది.
- 2014-15 నుంచి దశల వారీగా చెరువుల పనరుద్ధరణ జరగనుంది. ఏడాదికి ఐదో వంతు చొప్పున మొత్తం 46,531 చెరువులను పునరుద్ధరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది. ఇందులో భాగంగా ‘మిషన్ కాకతీయ’ కోసం 20 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. అన్ని చెరువులను 5 ఏళ్లలో అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
1) మెదక్ | 7,941 |
2) మహబూబ్‌నగర్ | 7,480 |
3) కరీంనగర్ | 5,939 |
4) వరంగల్ | 5,839 |
5) నల్గొండ | 4,762 |
6) ఖమ్మం | 4,517 |
7) ఆదిలాబాద్ | 3,951 |
8) నిజామాబాద్ | 3,251 |
9) రంగారెడ్డి | 2,851 |
మొత్తం | 46,531 |
సంవత్సరం-ప్రతిపాదించిన చెరువులు (2014-19)
1) 2014 - 15 | 9,305 |
2) 2015 - 16 | 9,308 |
3) 2016 - 17 | 9,430 |
4) 2017 - 18 | 9,480 |
5) 2018 - 19 | 9,008 |
మొత్తం | 46,531 |
చేపట్టనున్న కార్యక్రమాలు
- చెరువులు, కుంటల్లోని పూడికను తొలగించి వాటి నీటి నిల్వ సామర్థ్యం పెంచడం.
- చెరువు కట్టలను బలోపేతం చేయడం, చెరువు అలుగు, తూములకు మరమ్మత్తులు చేయడం.
- చెరువుల్లో పెరిగిన తుమ్మచెట్లను నరికివేయడం, గుర్రపు డెక్క లొట్టపీసు మొక్కల తొలగింపు.
- గొలుసు కట్టు చెరువులను పునరుద్ధరిస్తారు.
- తొలగించిన పూడికను రైతుల పంట భూముల్లో చల్లుతారు.
- చెరువు కట్ట బలోపేతానికి సరిపడా పూడికమట్టిని వాడుకోవడం.
- అవసరమైన చోట్ల ఫీడర్ చానళ్లను రీసెక్షన్ చేయడంతో పాటు పూడిక ను తొలగిస్తారు.
- చెరువుల శిఖం భూములను కబ్జాల నుంచి కాపాడటం.
- మిషన్ కాకతీయ మొదటి దశలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఒక పట్టణ చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేస్తారు.
చెరువుల పునరుద్ధరణ వల్ల రైతులు, వ్యవసాయ కూలీలు ప్రత్యక్షంగా ప్రయోజనం పొందనున్నారు. దీంతో పాటు గ్రామాల్లోని అన్ని వర్గాల ప్రజలకు పరోక్షంగా ప్రయోజనం కలగనుంది. చెరువుల మీద ఆధారపడి జీవించే అనేక కులవృత్తులు... రజకులు, కుమ్మరులు, బేస్తవారు, కల్లు గీత కార్మికులు తదితరులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.
చెరువులు - సాంస్కృతిక కేంద్రాలు
తెలంగాణ రాష్ర్టంలో చెరువులు సాంస్కృతిక కేంద్రాలుగా కూడా విలసిల్లుతున్నాయి. తెలంగాణలో వైభవంగా జరుపుకునే బతుకమ్మ పండగను చెరువు కట్టలపైనే జరుపుకుంటారు.
జిల్లా | ఏడాదికి ప్రతిపాదించిన చెరువులు | మొత్తం చెరువులు | ||||
2014-15 | 2015-16 | 2016-17 | 2017-18 | 2018-19 | ||
కరీంనగర్ | 1188 | 1210 | 1220 | 1200 | 1121 | 5939 |
ఆదిలాబాద్ | 790 | 800 | 800 | 800 | 761 | 3951 |
వరంగల్ | 1168 | 1170 | 1180 | 1200 | 1121 | 5839 |
ఖమ్మం | 903 | 910 | 920 | 930 | 854 | 4517 |
నిజామాబాద్ | 650 | 650 | 650 | 650 | 651 | 3251 |
మెదక్ | 1588 | 1590 | 1600 | 1610 | 1553 | 7941 |
రంగారెడ్డి | 570 | 500 | 570 | 600 | 611 | 2851 |
మహబూబ్‌నగర్ | 1496 | 1500 | 1510 | 1510 | 1464 | 7480 |
నల్గొండ | 952 | 978 | 980 | 980 | 872 | 4762 |
మొత్తం | 9305 | 9308 | 9430 | 9480 | 9008 | 46531 |
- తెలంగాణలో అడవుల విస్తీర్ణం 24 శాతంగా ఉంది. రాష్ర్ట భౌగోళిక విస్తర్ణీంలో వృక్షాల విస్తీర్ణ శాతాన్ని 33 శాతానికి పెంచటం లక్ష్యంగా ప్రభుత్వం ‘తెలంగాణకు హరితహారం’ పథకాన్ని ప్రారంభించింది.
- ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు 2015, జూలై 3న రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని ‘చిలుకూరు బాలాజీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ‘సంపంగి’ మొక్కను నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
- కార్యక్రమంలో భాగంగా బహుళ రహదారుల పక్కన, నదులు, కాలువలు, చెరువుల గట్టుల మీద, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ప్రాంగణాల్లో, ఆధ్యాత్మిక ప్రదేశాల్లో, హౌసింగ్ కాలనీల్లో, కమ్యూనిటీ భూముల్లో పెద్ద ఎత్తున మొక్కలు పెంచనున్నారు.
- హరిత హారం కార్యక్రమంలో అందరినీ భాగస్వాములను చేయనున్నారు.ఇందులో భాగంగా సంబంధిత విధానాలు, చట్టాలు, పాలనాపరమైన అంశాల్లో అవసరమైన మార్పులు చేస్తారు.
- రానున్న మూడేళ్లలో రాష్ర్ట వ్యాప్తంగా 230 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. వీటిలో 130 కోట్ల మొక్కలను నోటిఫైడ్ అటవీ ప్రాంతాలకు వెలుపల నాటాలని ప్రతిపాదించారు. ఇందులో భాగంగా 10 కోట్ల మొక్కలను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) పరిధిలో, మిగిలిన 120 కోట్ల మొక్కలను రాష్ర్టంలోని మిగిలిన ప్రాంతాల్లో నాటనున్నారు.
- అడవులను సంరక్షించటం, లైవ్ రూట్ స్టాక్‌ను ప్రోత్సహించడం ద్వారా నోటిఫైడ్ అడవుల లోపల వంద కోట్ల మొక్కలను పునరుజ్జీవింప చేయాలని నిర్ణయించారు.
- ‘మన ఊరు - మన ప్రణాళిక (ఏంవీఎంపీ)’ కార్యక్రమం ద్వారా వచ్చే సూచనల ఆధారంగా హరితహారం కార్యక్రమంలో నర్సరీలు, మొక్కలను నాటే ప్రదేశాలను గుర్తిస్తారు.
- ఇలా గుర్తించిన 3,888 నర్సరీల్లో 2015లో 40 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి అటవీశాఖ, వ్యవసాయ, ఉద్యానవన, గిరిజన సంక్షేమం తదితర శాఖలను కూడా కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తున్నారు.
- 2016లో మరో 40 కోట్ల మొక్కలను నాటేందుకు భవిష్యత్ ప్రణాళికను రూపొందించారు.
- చైనా, బ్రెజిల్ తర్వాత తెలంగాణలోనే భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి - మదింపు ప్రక్రియలు
1. ప్రాథమిక రంగం (Primary Sector)
2. ద్వితీయ రంగం (Secondary Sector)
3. తృతీయ రంగం (Tertiary Sector)
వీటిని వివిధ ప్రధాన వృత్తుల ఆధారంగా విభజించారు. ఒక దేశంలోని జనాభా వివిధ వృత్తుల్లో పనిచేసే తీరును ఈ వృత్తుల వారీ విభజన తెలుపుతుంది. జాతీయ/ రాష్ట్ర ఆదాయానికి ఏయే రంగాల ద్వారా ఎంత ఆదాయం సమకూరుతుందో తెలుసుకోవడానికి, వాటి అభివృద్ధి, పెరుగుదల శాతాల్లో ఏ విధమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయో అర్థం చేసుకొని తగిన సంస్కరణలు ప్రవేశపెట్టడానికి ఈ విభజన తోడ్పడుతుంది. వివిధ ఆర్థిక రంగ అభివృద్ధి ప్రక్రియలు దేశ పురోభివృద్ధి గమనాన్ని, సామాజిక, ఆర్థిక వ్యవస్థలను అధికంగా ప్రభావితం చేస్తాయి.
ప్రాథమిక రంగంలోని ఉప రంగాలు: వ్యవసాయం, పశుసంపద - పాడి పరిశ్రమ, అడవులు - అటవీ ఉత్పత్తులు, మత్స్య పరిశ్రమ, గనులు, తవ్వకాలు.
ద్వితీయ రంగంలోని ఉప రంగాలు: వస్తూత్పత్తి తయారీ పరిశ్రమలు, నిర్మాణ రంగం, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా.
తృతీయ రంగంలోని ఉప రంగాలు: వ్యాపారం, హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా, నిల్వలు, సమాచార వ్యవస్థ, రైల్వేలు, రక్షణ, తపాలా సేవలు, ఫైనాన్సింగ్, బీమా, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్, సామాజిక వ్యక్తిగత సేవలు, ప్రజాపరిపాలన, ఇతర సేవలు.
సాధారణంగా వ్యవసాయ రంగాన్ని ప్రాథమిక రంగంగా, పారిశ్రామిక రంగాన్ని ద్వితీయ రంగంగా, సేవా రంగాన్ని తృతీయ రంగంగా పేర్కొంటారు. అయితే ‘గనులు, తవ్వకాలు’ అనే ఉప రంగం లేని ప్రాథమిక రంగంలోని అంశాలను వ్యవసాయ రంగంగా భావిస్తారు. ‘గనులు, తవ్వకాలు’ ఉప రంగంతో కూడిన ద్వితీయ రంగంలోని అంశాలను పారిశ్రామిక రంగంగా గుర్తిస్తారు. తృతీయ రంగంలోని అంశాలన్నీ సేవల రంగం కిందకి వస్తాయి. ఈ ముఖ్య ఆర్థిక రంగాల్లో వివిధ ఉప రంగాల వారీగా ఆదాయం, వృద్ధి, మొత్తం ఆదాయంలో వాటి వాటాను మదింపు చేసి జాతీయాదాయం లేదా రాష్ట్ర ప్రాంతీయాదాయాన్ని తెలుసుకుంటారు. ‘కేంద్ర గణాంక సంస్థ’ (Central Statistical Organisation - CSO) జాతీయాదాయాన్ని అంచనా వేస్తుంది. రాష్ట్ర ఆర్థిక గణాంక సంచాలకులు రాష్ట్ర ఆదాయాన్ని అంచనా వేస్తారు. ఇందులో భాగంగా వీరు వివిధ లెక్కింపు పద్ధతుల ద్వారా గణాంకాలను రూపొందిస్తారు.
ఆదాయ మదింపు పద్ధతులు
సాధారణంగా జాతీయ లేదా రాష్ట్ర ఆదాయాన్ని 3 రకాల పద్ధతుల్లో లెక్కిస్తారు. అవి:
1. ఉత్పత్తి లేదా నికర ఉత్పత్తి పద్ధతి
2. ఆదాయ పద్ధతి (నికర ఆదాయ పద్ధతి)
3. వ్యయ పద్ధతి
ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ మూడు పద్ధతులనే అనుసరిస్తున్నారు. మన దేశంలో (అన్ని రాష్ట్రాల్లోనూ) ఉత్పత్తి, ఆదాయ మదింపు పద్ధతుల ఆధారంగా జాతీయదాయాన్ని గణిస్తున్నారు.
ఉత్పత్తి మదింపు పద్ధతి
దీన్ని విలువ జోడించిన పద్ధతి (Value Added Method), Industrial Origin Method, Inventory Method అని కూడా అంటారు. ప్రముఖ ఆర్థికవేత్త సైమన్ కుజినెట్స్ ఈ పద్ధతిని ‘ఉత్పత్తి సేవా పద్ధతి’గా పేర్కొన్నాడు. ఆర్థిక వ్యవస్థలో ఏడాది కాలంలో జరిగే అంతిమ వస్తు సేవల ఉత్పత్తిని కలిపితే ‘నికర ఉత్పత్తి’ వస్తుంది. ఈ విలువను జాతీయాదాయం లేదా రాష్ట్ర ప్రాంతీయాదాయంగా భావిస్తారు. ఆర్థిక వ్యవస్థలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాల్లో జరిగిన ఉత్పత్తిని కలిపితే మొత్తం ఉత్పత్తి వస్తుంది. అయితే ఒక రంగంలో జరిగిన ఉత్పత్తిని మరో రంగంలో ఉత్పత్తి కారకాలు (మాధ్యమిక వస్తువులు)గా ఉపయోగించవచ్చు. కాబట్టి వాటి విలువను లెక్కలోకి తీసుకోకూడదు. అంటే ఒకే వస్తువును రెండుసార్లు లెక్కించకూడదు. ఈ పద్ధతిలో.. జాతీయాదాయం = కారకాల దృష్ట్యా నికర దేశీయోత్పత్తి + నికర విదేశీ కారకాల ఆదాయాలు.
ఆదాయ మదింపు పద్ధతి
దీన్ని కారక చెల్లింపు పద్ధతి (Factor Payment Method), వాటాల పంపిణీ పద్ధతి (Distributed Share Method), ఆదాయ చెల్లింపు పద్ధతి (Income Paid Method), ఆదాయ గ్రాహక పద్ధతి (Income Received Method) అని పిలుస్తారు. ఈ పద్ధతిలో జాతీయ/ రాష్ట్ర ఆదాయాన్ని పంపిణీ కోణం నుంచి లెక్కిస్తారు. వివిధ ఉత్పత్తి కారకాలు.. అంటే శ్రమపై వచ్చే వేతనాలు, భూమిపై వచ్చే అద్దె, మూలధనంపై వచ్చే వడ్డీ, పరిశ్రమ వ్యవస్థాపకుడికి వచ్చే లాభాలు, వీటన్నింటి ప్రతిఫలాల మొత్తం విలువతో పాటు నికర విదేశీ ఆదాయాలను కలిపితే వచ్చేదే జాతీయాదాయం. ఈ పద్ధతిలో వివిధ ఉత్పత్తి కారకాల మధ్య జాతీయాదాయం ఏ విధంగా పంపిణీ అయిందో తెలుసుకోవచ్చు. దీంతో పాటు వివిధ వర్గాల ప్రజలకు ఎంతెంత ఆదాయం వస్తుందో అంచనా వేయవచ్చు. ఆదాయ మదింపు పద్ధతిలో.. జాతీయాదాయం = వేతనం + భాటకం + వడ్డీ + లాభాలు + నికర విదేశీ ఆదాయాలు.
వ్యయాల మదింపు పద్ధతి
ఇది ఆధునిక పద్ధతి. దీన్ని ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశాల్లో అనుసరిస్తున్నారు. భారతదేశంలో ఇది అంతగా వినియోగంలో లేదు. ఈ పద్ధతిలో వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వం ఒక ఏడాది కాలంలో అంతిమ వస్తు సేవలపై చేసే మొత్తం వ్యయాన్ని లెక్కించడం ద్వారా జాతీయాదాయాన్ని గణిస్తారు. జాతీయాదాయ లెక్కింపు పద్ధతులన్నింటిలో ఇది చాలా కచ్చితమైంది. దీన్ని వినియోగ - పెట్టుబడి పద్ధతి అని కూడా అంటారు. ఈ వ్యయ మదింపు పద్ధతిని ప్రఖ్యాత ఆర్థికవేత్త జే.ఎం. కీన్‌స రూపొందించారు. ఈ పద్ధతిలో జాతీయాదాయం = గృహ సంబంధ వ్యయాలు + సంస్థల వ్యయాలు + ప్రభుత్వ వ్యయాలు.
జాతీయ, రాష్ట్ర ప్రాంతీయ ఆదాయాన్ని గణించేటప్పుడు సాధారణంగా రెండు రకాల ధరలను ప్రామాణికంగా తీసుకుంటారు.
ప్రస్తుత ధరల్లో జాతీయాదాయం
ప్రస్తుత సంవత్సరం ఆచరణలో ఉన్న వస్తు సేవల ధరల్లో ఆదాయాన్ని లెక్కిస్తే దాన్ని ‘ప్రస్తుత ధరల్లో ఆదాయం’ లేదా ‘నామమాత్రపు ఆదాయం’ అంటారు.
ఉదా: 2014-15 జాతీయాదాయన్ని లెక్కించేటప్పుడు 2014-15లోని ధరలనే ప్రామాణికంగా తీసుకోవడం.
ప్రస్తుత ధరల్లో ఆదాయాన్ని లెక్కించినప్పుడు.. గతేడాది, ప్రస్తుత సంవత్సరం జాతీయాదాయాలను సరిపోలిస్తే ఉత్పత్తి పెరగనప్పటికీ ధరలు అధికమవడం వల్ల జాతీయదాయం పెరిగినట్లు ఫలితాలు రావచ్చు. ఎందుకంటే వస్తు సేవల ధరలు అనేక కారణాల వల్ల రోజురోజుకూ పెరుగుతుంటాయి. ధరలు పెరగడం వల్ల ఆదాయం అధికమైనట్లు గోచరిస్తుంది. ఈ కారణంగా వాస్తవ వస్తు సేవల ఉత్పత్తులను అంచనా వేయలేం. అందువల్ల ఈ పద్ధతిలో వాస్తవ జాతీయాదాయాన్ని లెక్కించడం వీలు కాదు.
స్థిర (ప్రామాణిక) ధరల్లో జాతీయాదాయం
ఏ విధమైన సామాజిక, రాజకీయ, ఆర్థిక, ప్రకృతి పరమైన ఒడుదొడుకులు లేకుండా ఉత్పత్తి మంచిగా జరిగిన ఒకానొక సంవత్సరాన్ని ఆధార సంవత్సరం (బేస్ ఇయర్)గా తీసుకొని ఆ ధరల ఆధారంగా జాతీయాదాయాన్ని లెక్కిస్తే దాన్ని ‘స్థిర ధరల్లో ఆదాయం’ లేదా ‘వాస్తవ ఆదాయం’ అంటారు.
ఉదా: 2014-15 జాతీయాదాయాన్ని లెక్కించేటప్పుడు 2004-05 ధరలను ప్రామాణికంగా తీసుకోవడం.
స్థిర ధరల్లో జాతీయాదాయాన్ని లెక్కించడానికి కేంద్ర గణాంక సంస్థ (సీఎస్‌వో) ఎప్పటికప్పుడూ ఆధార సంవత్సరాన్ని నిర్ధారిస్తుంది. మన దేశంలో ఇప్పటివరకూ 1948-49, 1960-61, 1970-71, 1980-81, 1993-94, 1999-2000, 2004-05లను ఆధార సంవత్సరాలుగా తీసుకున్నారు.
ప్రస్తుత ధరల్లో ఆదాయాన్ని గణించినప్పటికీ దాన్ని ‘ధరల సూచీ’ (Price Deflator) ఆధారంగా స్థిర ధరల్లోకి మార్చవచ్చు.
స్థిర ధరల్లో ఆదాయం = (ప్రస్తుత ధరల్లో ఆదాయం / ధరల సూచీ) × 100
ఒక రాష్ట్ర భౌగోళిక హద్దుల మధ్య, నిర్ణీత కాల వ్యవధిలో (సాధారణంగా ఒక సంవత్సరం) ఉత్పత్తి చేసిన వస్తువుల, సేవల మొత్తం విలువను స్థూల రాష్ట్రోత్పత్తి (Gross State Domestic Product - GSDP) అంటారు. జీఎస్‌డీపీ నుంచి ‘తరుగుదల’ను తీసేస్తే ‘నికర రాష్ట్రోత్పత్తి (Net State Domestic Product - NSDP) వస్తుంది. సాధారణంగా జీఎస్‌డీపీనే రాష్ట్ర ఆదాయంగా పరిగణిస్తారు. కానీ, ఆర్థిక పరిభాషలో రాష్ట్ర ఆదాయం అంటే ఎన్‌ఎస్‌డీపీ. వీటిని గణించేటప్పుడు ఒక రాష్ట్రంలోని వారు ఇతర రాష్ట్రాల్లో సంపాదించిన ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకోరు.
రాష్ట్ర తలసరి ఆదాయం = ఎన్‌ఎస్‌డీపీ ÷ రాష్ట్ర జనాభా
స్థూల జిల్లా ఉత్పత్తి (జీడీడీపీ)
ఒక జిల్లాలో ఏడాది కాలంలో ఉత్పత్తి చేసిన అంతిమ వస్తు సేవల మొత్తం విలువను ‘స్థూల జిల్లా ఉత్పత్తి’ (Gross District Domestic Product - GDDP) అంటారు.
రాష్ట్ర స్థూల ఉత్పత్తి - దృగ్విషయాలు
జీఎస్‌డీపీ లెక్కింపునకు అనువుగా ఉండటానికి రాష్ట్రంలో మూడు రంగాలను తొమ్మిది విభాగాలుగా విభజించారు. ఈ పద్దులను కింది విధంగా వర్గీకరించారు.
- వ్యవసాయ రంగం
1.1 (ఎ) వ్యవసాయం
1.1 (బి) జీవోత్పత్తులు (పశు సంపద - పాడి పరిశ్రమ)
1.2 అటవీ ఉత్పత్తులు, కలప
1.3 మత్స్య సేకరణ - పారిశ్రామిక రంగం
2. గనులు, తవ్వకాలు
3. వస్తూత్పత్తి
4. విద్యుచ్ఛక్తి, గ్యాస్, నీటి సరఫరా
5. నిర్మాణాలు - సేవల రంగం
6. వాణిజ్యం, హోటళ్లు, రెస్టారెంట్లు
7.1 రైల్వేలు
7.2 రవాణా, నిల్వ చేయడం
7.3 సమాచార సంబంధాలు
8. రుణ సహాయం (ఫైనాన్సింగ్), బీమా, స్థిరాస్తులు, వ్యాపార సేవలు
9. సామూహిక, సామాజిక, వ్యక్తి స్థాయి సేవలు, ఇతర సేవలు
Tags: Telangana Gross Production Telangana Economic System Telangana Economy Study Material TSPSC Groups Study Material
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం
- హైదరాబాద్ రాష్ట్ర శాసనసభకు మొదటి సారిగా 1952లో ఎన్నికలు జరిగాయి. ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు ఎన్నికయ్యారు..
- మద్రాస్ రాష్ట్రం నుంచి 1953లో విడిపోయిన ఆంధ్రరాష్ట్రం మొదటి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం ఎన్నికయ్యారు.
- తెలుగు మాట్లాడే ప్రాంతాలు ఒకే రాష్ట్రంగా ఏర్పడాలనే కోరికతో ఆంధ్రరాష్ట్రం నుంచి ‘‘విశాలాంధ్ర’’ ఉద్యమం మొదలైంది.
- రెండు రాష్ట్రాల నాయకుల మధ్య 1956 ఫిబ్రవరి 20న ‘‘పెద్దమనుషుల ఒప్పందం’’ జరిగి నవంబర్ 1, 1956న ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.
- ఈ ఒప్పందంపై ఆంధ్రాప్రాంతం నుంచి బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, గౌతులచ్చన్న, అల్లూరి సత్యనారాయణ రాజులు,తెలంగాణ నుంచి బూర్గుల రామకృష్ణారావు, మర్రిచెన్నారెడ్డి, జె.వి. నర్సింగరావు, కె.వి రంగారెడ్డి లు సంతకాలు చేసి 14 అంశాలపైన అంగీకారానికి వచ్చారు.
- పై ఒప్పందంలోని పలు అంశాలను విస్మరించడం వల్ల 1969లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ప్రారంభమైంది. తెలంగాణ వారిని సంతృప్తిపరచడం కోసం అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ 8 సూత్రాల పథకాన్ని సూచించారు.
- తెలంగాణ ఉద్యమానికి ప్రతిస్పందనగా సీమాంధ్ర ప్రాంతంలో 1972లో ‘‘జై ఆంధ్ర ఉద్యమం’’ మొదలైంది. అందుకు ప్రతిగా కేంద్ర ప్రభుత్వం 1973లో 6 సూత్రాల పథకం రూపొందించింది. వాటిలోని అంశాలు పెద్ద మనుషుల ఒప్పందానికి వ్యతిరేకంగా ఉండడం వల్ల తెలంగాణ తన ప్రత్యేక అస్తిత్వాన్ని కోల్పోయింది.
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు అన్యాయానికి గురైయ్యారు. అన్ని వనరులు సీమాంధ్ర ప్రాంతం వారే అనుభవించడం వల్ల తెలంగాణ ప్రజలు అసంతృప్తికిలోనయ్యారు. 1990లో జరిగిన వరంగల్ రైతు కూలీ సంఘం బహిరంగ సభతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తిరిగి ప్రారంభమైంది.
- 2001 ఏప్రిల్ 27న కె.చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో ‘‘తెలంగాణ రాష్ట్ర సమితి’’ (టీఆర్‌ఎస్) రాజకీయ పార్టీ ఏర్పడింది. ఈ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ప్రధాన ఎజెండాగా ప్రజలను ముందుకు నడిపింది.
- 2009 నవంబరు 29న కె.చంద్రశేఖర్‌రావు ఆమరణ నిరాహార దీక్ష చేయడంతో ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి 2009 డిసెంబరు 9న ‘‘ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర’’ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.
- ఆంధ్ర నాయకుల ఒత్తిడితో 2009 డిసెంబరు 23న కేంద్రం తన డిసెంబరు 9న చేసిన ప్రకటనను ఉపసంహరించుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని పరిణామాలపై అధ్యయనం చేయడానికి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేశారు.
- ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పక్షాలు, సంస్థలు ఏకమై ‘‘తెలంగాణ ఐక్యకార్యాచరణ కమిటి’’ గా ఏర్పడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని తీవ్ర తరం చేశాయి. దాని ఫలితమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ ప్రాంతం విడిపోయి 2014 జూన్ 2న కొత్త రాష్ర్టంగా రూపుదిద్దుకుంది.
- భాష ప్రాయుక్త రాష్ట్రాలు: ఒకే భాషను మాట్లాడే ప్రాంతాలన్ని ఒకే రాష్ట్రంగా ఏర్పాటు చేయడం. ఈ ప్రాతిపదికపై ఏర్పడిన తొలి రాష్ట్రం ‘ఆంధ్రరాష్ట్రం’ (1953).
- పెద్దమనుషుల ఒప్పందం: ఆంధ్ర రాష్ట్రానికి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన 8 మంది పెద్దమనుషులు (నాయకులు) ఢిల్లీలోని ‘హైదరాబాద్ అతిథి గృహంలో సుధీర్ఘంగా చర్చించి రెండు ప్రాంతాల విలీనానికి 1956 ఫిబ్రవరి 20న ఒప్పందం కుదుర్చుకున్నారు. తెలంగాణ ప్రజల భ్రమలను పోగొట్టడానికి వీరు 14 అంశాలపైన అంగీకారానికి వచ్చారు.
- ముల్కీ నిబంధనలు: ముల్కీ అనే ఉర్దూ పదానికి అర్థం ‘స్థానిక’. స్థానికంగా ఉన్న ఉద్యోగాలలో స్థానికులనే నియమించాలని ముల్కీ నిబంధనాన్ని హైదరాబాద్ నిజాం ప్రవేశపెట్టారు. పెద్ద మనుషుల ఒప్పందం కూడా వీటిని ఆమోదించింది. కాని ఆచరణలో ఈ నియమాలను పట్టించుకోకపోవడం వల్ల తెలంగాణ ప్రజలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్యాయం జరిగి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం చెలరేగింది.
- జై ఆంధ్ర ఉద్యమం: 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ప్రతిగా సీమాంధ్ర ప్రాంతంలో 1972లో ‘‘జై ఆంధ్ర’’ ఉద్యమం మొదలైంది. తెలంగాణ లోని ముల్కీ నిబంధనల వల్ల తమ అవకాశాలు సన్నగిల్లుతాయని భావించిన సీమాంధ్ర విద్యార్థులు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమాన్ని కొనసాగించారు. వీరి కోరికలను సంతృప్తి పరుస్తూ 1973లో కేంద్ర ప్రభుత్వం ఆరు సూత్రాల విధానాన్ని ప్రకటించడంతో ఈ ఉద్యమం చల్లారింది.
- శ్రీకృష్ణ కమిటి: ఆంధ్రప్రదేశ్‌లోని పరిణామాలను అధ్యయనం చేసి పరిష్కారాలను సూచించడానికి కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు న్యాయమూర్తి బి.ఎన్.కృష్ణ ఆధ్వర్యంలో 2010లో ఫిబ్రవరి 3న ఒక కమిటిని నియమించింది. శ్రీకృష్ణ కమిటి తన 505 పేజీల నివేదికను 2011 జనవరి 6న కేంద్రానికి అందించింది.
- సకల జనుల సమ్మె: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు తెలంగాణ లోని అన్ని వర్గాల ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు, రైతులు అనేక రకాలుగా నిరసనలు తెలిపి సమ్మె చేశారు. ఇది సకల జనుల సమ్మెగా ప్రసిద్ధి చెందింది. సెప్టెంబరు 13, 2011 నుంచి 42 రోజుల పాటు శాంతియుతంగా జరిగిన ఈ సకల జనుల సమ్మె ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగు వేయడానికి దోహదపడింది.
1. పెద్ద మనుషుల ఒప్పందంలోని ప్రధానాంశాలను పేర్కొనండి.
జ: పెద్దమనుషుల ఒప్పందం:-తెలుగు మాట్లాడే రెండు ప్రాంతాలను విలీనం చేసి ఒకే రాష్ట్రంగా మార్చాలని అటు ఆంధ్రరాష్ట్రంలోని నాయకులు ఇటు హైదరాబాద్ రాష్ట్రంలోని కొందరు తెలంగాణ నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం ఆరంభించారు. కేంద్రం అందుకు ఒప్పుకుని రెండు ప్రాంతాలకు చెందిన ముఖ్యమైన నాయకులైన బి.గోపాల్‌రెడ్డి, ఎన్.సంజీవరెడ్డి, జి.లచ్చన్న, ఎ.సత్యనారాయణరాజు (ఆంధ్ర ప్రాంతం), బి.రామకృష్ణారావు, ఎం.చెన్నారెడ్డి, జి.వి.నర్సింగరావు, కె.వి.రంగారెడ్డి (తెలంగాణ )లను ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో సమావేశపర్చి ఒక అంగీకారానికి రావాలని సూచించింది. 1956 ఫిబ్రవరి 20న వీరు సమావేశమై 14 అంశాలపైన ఒప్పందానికి వచ్చి ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమం చేశారు. ఆ ఒప్పందం ప్రకారమే నవంబరు 1, 1956న ‘ఆంధ్రప్రదేశ్’ అవతరించింది.
ఈ ఒప్పందంలోని ముఖ్యాంశాలు:
- తెలంగాణ లోని రెవెన్యూ మిగులుని తెలంగాణ అభివృద్ధికి మాత్రమే ఉపయోగించాలి.
- తెలంగాణ లో 12 సంవత్సరాలు నివసిస్తే ముల్కీ నిబంధనలకువారు అర్హులు అవుతారు.
- తెలంగాణ అభివృద్ధికి 20 మందితో చట్టబద్ధమైన తెలంగాణ ప్రాంతీయ సంఘాన్ని ఏర్పాటు చేయాలి.
- ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందంలో 40 శాతం తెలంగాణ నుంచి, 60 శాతం ఆంధ్ర ప్రాంతం నుంచి సభ్యులు ఉండాలి.
- ముఖ్యమంత్రి ఆంధ్ర నుంచి ఉంటే ఉపముఖ్యమంత్రి తెలంగాణ నుంచి ఉండాలి.
- తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల్లో తెలంగాణ వారికే ప్రవేశాలివ్వాలి.
2. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రజల్లో అసంతృప్తి పెరగడానికి దోహదపడిన అంశాలను తెలపండి? (విషయావగాహన)
జ: తెలంగాణ ప్రజల్లో అసంతృప్తికి కారణాలు:-
- రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దమనుషుల ఒప్పందంలోని కీలక అంశాలను విస్మరించాయి.
- జై ఆంధ్ర ఉద్యమాన్ని చల్లార్చాడానికి కేంద్ర ప్రభుత్వం 1973లో రూపొందించిన ‘6 సూత్రాల విధానం’ తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి కమిటిల ఏర్పాటును, ముల్కీ నిబంధనలకు నిలిపివేసింది.
- ప్రణాళికబద్ధ అభివృద్ధి ఫలాలు తెలంగాణ కంటే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు చేజిక్కించుకున్నాయి.
- తెలంగాణ లోని వనరులను, ఉపాధి అవకాశాలను సీమాంధ్ర ప్రాంతీయులు సొంతం చేసుకుంటున్నారని తెలంగాణ యువత భావించారు.
- స్థూల సాగు విస్తీర్ణం 1955-56లో ఆంధ్ర ప్రాంతంలో 4.2 మిలియన్ హెక్టార్లు ఉండగా 2006-07లో 5.3 మి.హె.కు (వృద్ధి 20 శాతం) పెరిగింది. అదే కాలంలో తెలంగాణ లో 4.8 మి.హె. నుంచి 5 మి.హె.కు (వృద్ధి శాతం 5) మాత్రమే పెరిగింది.
- 1993-94లో రెండు ప్రాంతాల్లోను గ్రామీణ రైతుకు లభించే ఆదాయం 7800 రూపాయలు ఉండాగా 2007-08లో ఆంధ్ర రైతుకు రూ.11,800 ఆదాయం ఉంటే తెలంగాణ రైతు పదివేల రూపాయల ఆదాయం మాత్రమే పొందాడు.
- అదే కాలంలో తెలంగాణ లో వ్యవపాయ కూలీల సంఖ్య 38 శాతం నుంచి 47 శాతానికి పెరిగితే ఆంధ్రలో 1 శాతం మాత్రమే పెరిగింది.
- వ్యవసాయంలో సంక్షోభం వల్ల 2004-05లో ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 1068 రైతుల ఆత్మాహత్యలు జరిగితే అందులో 663 మంది తెలంగాణ వారే ఉన్నారు.
- 2001 లెక్కల ప్రకారం ఆంధ్రలో అక్షరాస్యత 63 శాతం ఉంటే తెలంగాణ లో 53 శాతం మాత్రమే ఉంది.
- కళాశాల విద్యకు గ్రాంటు తెలంగాణాకు 93 కోట్ల రూపాయలు కేటాయించగా ఆంధ్రకి 224 కోట్ల రూపాయలు ఉంది.
- వివక్షతతో కూడిన ఈ ముఖ్యమైన కారాణాలతో పాటు అసమాన అభివృద్ధి కూడా తెలంగాణ ప్రజలను కృంగదీసింది. సామాజికంగా, సాంస్కృతికంగా ద్వితియ శ్రేణి పౌరులుగా మారుతున్నామన్న ఆలోచన తెలంగాణ విద్యావంతుల్లో పెరిగిపోయింది. వివక్షతలు లేని తెలంగాణ రూపకల్పనకు ప్రత్యేక రాష్ట్ర సాధన అంతిమ పరిష్కారమని తెలంగాణ ప్రజలు భావించారు.
1. నూతనంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నీ ఇచ్చే సూచనలేంటి? (సమకాలీన అంశాలపై స్పందన)
జ: తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుండడానికి నేనిచ్చే సూచనలు:-
- తెలంగాణలోని అపార వనరులను ఉపయోగించి అన్ని ప్రాంతాలను, వర్గాలను సమానంగా అభివృద్ధి చేయాలి.
- ఉపాధి అవకాశాలను పెంచి నిరుద్యోగ యువతను సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలి.
- నీటి పారుదల వసతులను, విద్యుచ్ఛక్తి సరిపడ అందించి వ్యవసాయ సాగుభూమి విస్తీర్ణాన్ని, ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంచాలి.
- పభుత్వం గామీణ రైతులకు సంఘటితరంగ వ్యవసాయ రుణాలను కాలానుగుణంగా అందించి వారికి ఆర్థిక పరిపుష్టి కలిగించాలి.
- విద్యా, ఆరోగ్య మౌలిక వసతులను ప్రతి మారుమూల ప్రాంతానికి కల్పించి తెలంగాణ ను ‘విజ్ఞాన తెలంగాణ’ , ‘ఆరోగ్య తెలంగాణ’గా మార్చాలి.
- ప్రభుత్వ పాలనలో పారదర్శకత పెంచి అశ్రీతపక్షపాతాన్ని, అలసత్వాన్ని, అవినీతిని రూపుమాపాలి.
జ:అన్ని రాజకీయ పక్షాలను, సంస్థలను ఏకం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ‘తెలంగాణ ఐక్యకార్యాచరణ సంస్థ’ వివిధ రూపాలలో ఆందోళనలు నడిపింది. అవి:-
1. | సహాయ నిరాకరణోద్యమం | 2011, ఫిబ్రవరి 17 నుంచి | సుమారు 3 లక్షల మంది తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు 16 రోజుల పాటు తమ నిరసనలతో ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేశారు. |
2. | మిలియన్ మార్చ్ | 2011, మార్చి 10న | 50 వేల మంది ఉద్యమకారులు టాంక్ బండ్ (హైదరాబాద్) పై మిలియన్ మార్చ్‌ను నిర్వహించారు. |
3. | సకల జనుల సమ్మె | సెప్టెంబరు 13, 2011 నుంచి | అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు, కార్మికులు, వృత్తి నిపుణులు 42 రోజుల పాటు సమ్మె చేశారు. |
4. | సాగర హారం | సెప్టెంబరు 30, 2012న | సుమారు 2 లక్షల మందితో హుస్సేన్ సాగర్ చుట్టూ మానవహారం నిర్వహించారు. |
1 మార్కు ప్రశ్నలు
1. కోస్తా ఆంధ్ర ప్రాంతం అభివృద్ధి చెంది ఉండడానికి ప్రధాన కారణం ఏమిటి? (విషయావగాహన)
జ: కోస్తా ఆంధ్ర ప్రాంతం తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన ప్రాంతంగా గుర్తింపు పొందింది. అందుకు ప్రధాన కారణాలు:-
- కోస్తా ప్రాంతం బ్రిటిష్ ప్రత్యక్ష పాలన కింద ఉండడం వల్ల అక్కడ ఆంగ్ల విద్య అందుబాటులోకి వచ్చింది. తద్వారా విద్యావంతులు పెరిగి ఆధునీకీకరణ చెందింది.
- నదులు ఏర్పరిచిన డెల్టా ప్రాంతం, కాలువల ద్వారా సాగునీటి సదుపాయం ఉండడం వల్ల వ్యవసాయం అభివృద్ధి చెందింది.
- రైలు రవాణా, ఓడరేవుల సదుపాయాలు, రహదారి వ్యవస్థ విస్తరించి ఉండడం వల్ల కూడా కోస్తా ఆంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందిందిగా గుర్తిస్తున్నారు.
జ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన రాజకీయేతర సంస్థలు:-
- తెలంగాణ జనపరిషత్, తెలంగాణ మహాసభ, తెలంగాణ జనసభ, తెలంగాణ ఐక్యవేదిక.
3. తెలంగాణ ఉద్యమంలోని వివిధ నిరసన రూపాలను తెలపండి? (విషయావగాహన)
జ: ప్రజలను సమీకరించడానికి ప్రత్యక్ష తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సంస్థలు వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తికరించాయి. అవి:
- తెలంగాణ ధూంధాం, తెలంగాణ గర్జన, పాదయాత్రలు, బోనాలు, రహదారులపై వంట వార్పు, మానవహారాలు, సడక్‌బంద్‌లు, రైల్‌రోకోలు, సహపంక్తి భోజనాలు, మిలియన్ మార్చ్, సాగరహారం, చలో అసెంబ్లీ, సకల జనుల సమ్మె మొ॥
అబ్జెక్టివ్
1. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ఏ రోజున ఆవిర్భవించింది... ( a )
a) 2001 ఏప్రిల్ 27
b) 2001 మార్చి 9
c) 2001 మార్చి 30
d) 2002 ఏప్రిల్ 1న
2. హైదరాబాద్ సంస్థానాన్ని స్వతంత్ర భారతదేశంలో విలీనం చేసిన సంఘటనను ఏమని పిలుస్తారు.... ( c )
a) ఆపరేషన్ సక్సెస్
c) ఆపరేషన్ పోలో
d) ఆపరేషన్ సైనిక్
3. ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి ...... ( b)
a) నీలం సంజీవరెడ్డి
b) టంగుటూరి ప్రకాశం పంతులు
c)బెజవాడ గోపాల్‌రెడ్డి
d) బూర్గుల రామకృష్ణారావు
4. హైదరాబాద్ రాష్ట్ర మొదటి, చివరి ముఖ్యమంత్రి..... ( c )
a) జి.ఎన్.చౌదరి
b) ఎం.కె.వెల్లోడి
c) బూర్గుల రామకృష్ణారావు
d) నీలం సంజీవరెడ్డి
5. పెద్దమనుషుల ఒప్పందం ఎవరెవరి మధ్య జరిగింది..... ( a )
a) ఆంధ్ర, తెలంగాణ నాయకుల మధ్య
b) ఆంధ్ర, తెలంగాణ, ఢిల్లీ నాయకుల మధ్య
c) ఆంధ్ర, తెలంగాణ ముఖ్యమంత్రుల మధ్య
d) ఆంధ్ర, తెలంగాణలకు చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకుల మధ్య
6. పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గంలో తెలంగాణ వారు ఎంత శాతం మంది ఉండాలి....... ( c )
a) 50
b) 60
c) 40
d) 30
7. ముల్కీ నిబంధనలు దేనికి సంబంధించినవి...... ( a )
a) ఉద్యోగాలకు
b) నివాసానికీ
c) రాజకీయపదవులకు
d) స్థానికతకు
8. ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ఎవరు.......... ( b )
a) బూర్గుల రామకృష్ణారావు, నీలం సంజీవరెడ్డి
b) నీలం సంజీవరెడ్డి, కె.వి.రంగారెడ్డి
c) మర్రి చెన్నారెడ్డి, దామోదరం సంజీవయ్య
d) బి.గోపాల్‌రెడ్డి, మర్రి చెన్నారెడ్డి
9. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదట ఏ సం॥మొదలైంది.......... ( a )
a) 1969
b) 1971
c) 1973
d) 1974
10. కింది వారిలో తెలంగాణ ప్రజా సమితి నాయకుడు ఏవరు? ...... ( c )
a) ఆలే నరేంద్ర
b) కె.చంద్రశేఖర్‌రావు
c) మర్రి చెన్నారెడ్డి
d) విజయశాంతి
11. ఆంధ్రప్రదేశ్‌లోని పరిణామాలను అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటి.......... ( c )
a) ఫజల్‌ఆలీ కమిటి
b) వాంభూ కమిటి
c) కృష్ణ కమిటి
d) కమలనాథన్ కమిటి
12. వరంగల్‌లోని మేధావులు ‘తెలంగాణ విద్రోహదినాన్ని’ ఏ రోజున పాటించారు.....( a )
a) నవంబరు 1, 1996
b) నవంబరు 1, 2000
c) నవంబరు, 2001
d) నవంబరు, 2009
13. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ప్రకటనను ఏ రోజున చేసింది...... ( b )
a) డిసెంబర్ 7
b) డిసెంబర్ 9
c) డిసెంబర్16
d) డిసెంబర్23
14. 2009 నవంబర్ 29న కె.చంద్రశేఖర్‌రావు తన ఆమరణ నిరాహార దీక్షను ఎక్కడ నిర్వహించారు .....( d )
a) సిద్దిపేట
b) హైదరాబాద్
c) వరంగల్
d) ఖమ్మం
15. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటున్నాము...... ( b )
a) జనవరి 4
b) జూన్ 2
c) జూన్ 14
d) డిసెంబరు 9
Tags: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం తెలంగాణ ఉద్యమం చరిత్ర తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలంగాణ చరిత్ర pdf తెలంగాణ కవులు తెలంగాణ ఉద్యమ పాటలు తెలంగాణ ఉద్యమం పాటలు తెలంగాణ సంస్కృతి తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం
Tuesday, September 20, 2016
తెలంగాణ చరిత్ర, భౌగోళిక స్వరూపం
తెలంగాణా నదులు
నదులు: గోదావరి, కృష్ణా నదులతో సహా పలు నదులు తెలంగాణ రాష్ట్రంలో ప్రవహిస్తున్నాయి. గోదావరి నది ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దుల గుండా ప్రవహిస్తుంది. కృష్ణా నది మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల దక్షిణ భాగం నుంచి ప్రవహిస్తుంది. తుంగభద్రనది మహబూబ్‌నగర్ జిల్లా దక్షిణ సరిహద్దు గుండా ప్రవహిస్తూ కృష్ణానదిలో సంగమిస్తుంది. భీమానది మహబూబ్‌నగర్ జిల్లాలో కొంత దూరం ప్రవహించి కృష్ణాలో సంగమిస్తుంది. దుందుభి నది మహబూబ్‌నగర్ మరియు నల్గొండ జిల్లాలలో ప్రవహించి కృష్ణానదిలో కలుస్తుంది. ప్రాణహిత నది ఆదిలాబాదు జిల్లా సరిహద్దు గుండా ప్రవహించి గోదావరిలో సంగమిస్తుంది. మూసీనది రంగారెడ్డి, హైదరాబాదు మరియు నల్గొండ జిల్లాలలో ప్రవహించి కృష్ణానదిలో కలుస్తుంది. పాలేరు నది నల్గొండ, ఖమ్మం జిల్లాల సరిహద్దు గుండా ప్రవహించి కృష్ణాలో విలీనమౌతుంది. కాగ్నా నది రంగారెడ్డి జిల్లాలో పశ్చిమ దిశగా ప్రవహించి కర్ణాటకలో కృష్ణాలో సంగమిస్తుంది. మంజీరా నది మెదక్, నిజామాబాదు జిల్లాలలో ప్రవహించి గోదావరిలో కలుస్తుంది.
అడవులు:ఆదిలాబాదు, ఖమ్మం, వరంగల్ జిల్లాలలోఅడవులు అధికంగా ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా అగ్నేయప్రాంతం మరియు నల్గొండ జిల్లా నైరుతి ప్రాంతంలో విస్తరించియున్న అమ్రాబాదు పులుల అభయారణ్యం దేశంలోనే పెద్దది. మెదక్, నిజామాబాదు జిల్లాలలో, నల్గొండ ఆగ్నేయ భాగంలోని దేవరకొండ డివిజన్‌లో కూడా అడవులు ఉన్నాయి. నల్లమల అటవీ రక్షిత ప్రాంతం, మంజీరా అభయారణ్యం, కిన్నెరసాని అభయారణ్యం, కవ్వాల్ అభయారణ్యం ఈ ప్రాంతంలోని ప్రముఖ రక్షిత అరణ్యాలు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 10 జిల్లాలు ఉన్నాయి. 1948లో హైదరాబాదు రాష్ట్రం ఏర్పడే నాటికి 8 జిల్లాలు ఉండగా, 1956లో ఖమ్మం జిల్లా, ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ఉన్నప్పుడు 1978లో రంగారెడ్డి జిల్లా నూతనంగా ఏర్పాటు చేశారు.
ఈ రాష్ట్రంలో ఆదిలాబాదు జిల్లా ఉత్తరాన ఉండగా పశ్చిమ సరిహద్దులో ఆదిలాబాదుతో పాటు నిజామాబాదు, మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలు ఉన్నాయి. ఈశాన్య సరిహద్దులో కరీంనగర్, వరంగల్ మరియు ఖమ్మం జిల్లాలు ఉన్నాయి. దక్షిణమున మహబూబ్ నగర్ జిల్లా, ఆగ్నేయమున నల్గొండ జిల్లా సరిహద్దుగా ఉంది. ఖమ్మం జిల్లా తెలంగాణకు అతి తూర్పున ఉన్న జిల్లాగా పేరుగాంచింది. తెలంగాణ రాష్ట్రపు భౌగోళిక సరిహద్దు లేని ఏకైక జిల్లా హైదరాబాదు.
కర్ణాటక సరిహద్దుగా 3 జిల్లాలు, మహారాష్ట్ర సరిహద్దుగా 3 జిల్లాలు, ఛత్తీస్‌ఘఢ్ సరిహద్దుగా 2 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుగా 3 జిల్లాలు ఉన్నాయి
మౌర్యుల కాలం:మౌర్యుల కాలంలో ఈ ప్రాంతం భాగంగా ఉండేదనడానికి అశోకుని 13వ శిలాశాసనం ఆధారంగా చరిత్రకారులు నిర్ణయించారు. మౌర్యుల కాలంలో పర్యటించిన విదేశీ యాత్రికుడు మెగస్తనీసు ఆంధ్రులకు 30 దుర్గాలున్నాయని పేర్కొనగా అందులో కదంబపూర్ (కరీంనగర్), పౌదన్యపురం (బోధన్), పిధుండ, ముషిక, ధూళికట్ట, పెద్దబొంకూర్, ఫణిగిరి, కొండాపురం, కోటిలింగాల, గాజులబండ ముఖ్యమైనది. ఇవన్నీ నేటి తెలంగాణ రాష్ట్రంలోనివే. ఇంకనూ బయటపడాల్సిన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. మెగస్తనీసు ఎంతో బలవంతమైనదిగా వర్ణించిన ఆంధ్రరాజ్యం బహుశా ములక అస్సక లేదా ప్రతిష్టాన రాజ్యమే అయి ఉంటుందని ప్రముఖ చరిత్రకారుడు బి.ఎస్.ఎల్.హనుమంతరావు పేర్కొన్నారు.
శాతవాహనుల కాలం: శాతవాహనుల కాలంలో కోటిలింగాల ఒక వెలుగు వెలిగిన ప్రాంతం. శాతవాహనుల తొలి రాజధాని కూడా ఇదే. అయితే కొన్ని దశాబ్దాల వరకు కూడా ప్రతిష్టానపురం మరియు ధరణికోటనే తొలి రాజధానిగా పరిగణించారు. శాతవాహనులకు సంబంధించిన పలు నాణేలు కోటిలింగాల మరియు దాని పరిసరాలలో లభ్యమయ్యాయి. కాబట్టి శాతవాహనుల తొలి కేంద్రస్థానం గోదావరి తీరంలోని తెలంగాణ ప్రాంతమేనని పరిశోధకులు నిర్ణయించారు. శాతవాహనుల అనంతరం తెలంగాణ ప్రాంతం మొత్తం కలిపి పాలించిన రాజ్యాలులేవు. విజయపురి కేంద్రంగా పాలించిన ఇక్ష్వాకుల రాజ్యంలో తెలంగాణ తూర్పు ప్రాంతాలు భాగంగా ఉండేవి. ఇదే కాలంలో ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని వాకాటకులు పాలించారు. వాకాటక రాజు ప్రవరసేనుడి కాలంలో మొత్తం తెలంగాణ ప్రాంతం వాకాటక రాజ్యంలో కలిసిపోయింది. ఇక్ష్వాకులకు సామంతులుగా ఉన్న విష్ణుకుండినులు కూడా ఇక్ష్వాకుల తర్వాత స్వతంత్రంగా ఏర్పడి రాజ్యపాలన చేశారు. ఈ విష్ణుకుండినుల జన్మభూమి తెలంగాణయేనని ప్రసిద్ధ చరిత్రకారుడు బి.ఎన్.శాస్త్రి పరిశోధనల ద్వారా నిరూపించాడు. ఇంద్రపాలనగరంలోని అమరేశ్వర, రామేశ్వర, మల్లికార్జున ఆలయాలు, కీసరలోని రామలింగేశ్వర, షాద్‌నగర్ సమీపంలోని రామలింగేశ్వర ఆలయాలు విష్ణుకుండినుల కాలం నాటివి.
మౌర్యుల కాలం:మౌర్యుల కాలంలో ఈ ప్రాంతం భాగంగా ఉండేదనడానికి అశోకుని 13వ శిలాశాసనం ఆధారంగా చరిత్రకారులు నిర్ణయించారు. మౌర్యుల కాలంలో పర్యటించిన విదేశీ యాత్రికుడు మెగస్తనీసు ఆంధ్రులకు 30 దుర్గాలున్నాయని పేర్కొనగా అందులో కదంబపూర్ (కరీంనగర్), పౌదన్యపురం (బోధన్), పిధుండ, ముషిక, ధూళికట్ట, పెద్దబొంకూర్, ఫణిగిరి, కొండాపురం, కోటిలింగాల, గాజులబండ ముఖ్యమైనది. ఇవన్నీ నేటి తెలంగాణ రాష్ట్రంలోనివే. ఇంకనూ బయటపడాల్సిన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. మెగస్తనీసు ఎంతో బలవంతమైనదిగా వర్ణించిన ఆంధ్రరాజ్యం బహుశా ములక అస్సక లేదా ప్రతిష్టాన రాజ్యమే అయి ఉంటుందని ప్రముఖ చరిత్రకారుడు బి.ఎస్.ఎల్.హనుమంతరావు పేర్కొన్నారు.
శాతవాహనుల కాలం: శాతవాహనుల కాలంలో కోటిలింగాల ఒక వెలుగు వెలిగిన ప్రాంతం. శాతవాహనుల తొలి రాజధాని కూడా ఇదే. అయితే కొన్ని దశాబ్దాల వరకు కూడా ప్రతిష్టానపురం మరియు ధరణికోటనే తొలి రాజధానిగా పరిగణించారు. శాతవాహనులకు సంబంధించిన పలు నాణేలు కోటిలింగాల మరియు దాని పరిసరాలలో లభ్యమయ్యాయి. కాబట్టి శాతవాహనుల తొలి కేంద్రస్థానం గోదావరి తీరంలోని తెలంగాణ ప్రాంతమేనని పరిశోధకులు నిర్ణయించారు. శాతవాహనుల అనంతరం తెలంగాణ ప్రాంతం మొత్తం కలిపి పాలించిన రాజ్యాలులేవు. విజయపురి కేంద్రంగా పాలించిన ఇక్ష్వాకుల రాజ్యంలో తెలంగాణ తూర్పు ప్రాంతాలు భాగంగా ఉండేవి. ఇదే కాలంలో ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని వాకాటకులు పాలించారు. వాకాటక రాజు ప్రవరసేనుడి కాలంలో మొత్తం తెలంగాణ ప్రాంతం వాకాటక రాజ్యంలో కలిసిపోయింది. ఇక్ష్వాకులకు సామంతులుగా ఉన్న విష్ణుకుండినులు కూడా ఇక్ష్వాకుల తర్వాత స్వతంత్రంగా ఏర్పడి రాజ్యపాలన చేశారు. ఈ విష్ణుకుండినుల జన్మభూమి తెలంగాణయేనని ప్రసిద్ధ చరిత్రకారుడు బి.ఎన్.శాస్త్రి పరిశోధనల ద్వారా నిరూపించాడు. ఇంద్రపాలనగరంలోని అమరేశ్వర, రామేశ్వర, మల్లికార్జున ఆలయాలు, కీసరలోని రామలింగేశ్వర, షాద్‌నగర్ సమీపంలోని రామలింగేశ్వర ఆలయాలు విష్ణుకుండినుల కాలం నాటివి.
రాష్ట్రకూటుల కాలం: రెండో కీర్తివర్మతో చాళుక్యవంశం అంతంకాగా మాన్యఖేతం రాజధానిగా రాష్ట్రకూటులు పాలన సాగించారు. దంతిదుర్గుని కాలంలో తెలంగాణ మొత్తం రాష్ట్రకూటుల పాలనలో ఉండేది. తెలంగాణలో తొలి గద్యశాసనం "కొరివి శాసనం" ఈ కాలం నాటిదే. రాష్ట్రకూటుల సామంతులుగా ఉన్న వేములవాడ చాళుక్యులు బోధన్, వేములవాడలలో స్వతంత్ర పాలన చేశారు.
కళ్యాణి చాళుక్యకాలం: రాష్ట్రకూట రాజు రెండోకర్కరాజును ఓడించి రెండో తైలపుడు కళ్యాణి చాళుక్యరాజ్యం స్థాపించాడు. ప్రముఖ కవి రన్నడు ఇతని ఆస్థాన కవి. మహబూబ్‌నగర్ జిల్లా గంగాపురంలోని చెన్నకేశ్వస్వామి ఆలయాన్ని ఈ కాలంలోనే నిర్మించబడింది. ఈ ప్రాంతంలోవీరి పలు శాసనాలున్నాయి. ఇదే కాలంలో ఖమ్మం ప్రాంతంలో ముదిగొండ చాళుక్యులు పాలించారు. పాలమూరు జిల్లా మద్యభాగంలో కందూరి చోడుల పాలన కిందకు ఉండేది.
కందూరి చోడులు: క్రమక్రమంగా కందూరు చోళరాజ్యం విస్తరించింది. తొలి కాకతీయుల కాలం నాటికి ఇది కాకతీయ రాజ్యం కంటే పెద్ద రాజ్యంగా విలసిల్లింది. కందూరు, మగతల (నేటి మక్తల్), వర్థమానపురం (నేటి నంది వడ్డెమాన్), గంగాపురం, అమరాబాద్, భువనగిరి, వాడపల్లి, కొలనుపాక ఈ కాలంలో పెద్ద పట్టణాలుగా విలసిల్లాయి. విక్రమాదియుని కుమారుడు తైలపుని కాలంలో రాజ్యాన్ని రెండుగా చేసి ఇద్దరు కుమారులను రాజులుగా చేశాడు. దానితో ఇప్పటి నల్గొండ, పాలమూరు జిల్లా ప్రాంతాలలోవేర్వేరు పాలన సాగింది. గోకర్ణుడు తన రాజధానిని పానగల్లు నుంచి వర్థమాన పురానికి తరలించాడు. కందూరు చోడుల శాసనం ఒకటి మామిళ్ళపల్లిలో కూడా లభ్యమైంది. ఇదే కాలంలో వరంగల్ ప్రాంతంలో పొలవాస పాలకులు రాజ్యం చేశారు. అనుమకొండ (నేటి హన్మకొండ ప్రాంతం) మాత్రం కొలనుపాక రాజధానిగా కళ్యాణి చాళుక్యులే పాలించారు.
కుతుబ్‌షాహీల కాలం: క్రీ.శ.1565లో విజయనగర సామ్రాజ్యం అంతం కాగా, దక్షిణ తెలంగాణ ప్రాంతం కుతుబ్‌షాహీల పాలనలోకి వచ్చింది. ఉత్తర ప్రాంతంలో అంతకు క్రితమే బహమనీలు పాలించారు. బహమనీ సామ్రాజ్యం ఐదు ముక్కలు అయిన పిదప గోల్కొండ ప్రాంతాన్ని కుతుబ్‌షాహీలు రాజ్యమేలారు. కుతుబ్‌షాహీల ఉచ్ఛదశలో కూడా కృష్ణానదికి దక్షిణాన ఉన్న తెలంగాణ ప్రాంతం (రాయచూర్ డోబ్‌లోని నడిగడ్డ ప్రాంతం) ఆదిల్‌షాహీల పాలన కిందకు ఉండేది. అయితే ఇది తరచుగా చేతులు మారింది. 1687లో ఈ ప్రాంతం మొఘలుల వశమైంది.
ఆసఫ్‌జాహీల కాలం: క్రీ.శ.1724 నుంచి తెలంగాణ ప్రాంతాన్ని ఆసఫ్‌జాహీలు పాలించారు. రాజభాషగా పర్షియన్ స్థానంలో ఉర్దూ ప్రవేశపెట్టారు. స్థానిక ప్రజలను అణకద్రొక్కి ఢిల్లీనుంచి ఉద్యోగస్తులను రప్పించడంతో ముల్కీ ఉద్యమం తలెత్తింది. క్రమక్రమంగా ప్రజలలో తలెత్తిన స్వేచ్ఛా భావనలతో 20వ శతాబ్ది ప్రారంభం నుంచి పలు రచయితల మూలంగా ప్రజలలో చైతన్యం వచ్చింది. సురవరం ప్రతాపరెడ్డి 1925లో గోల్కొండ పత్రికను స్థాపించడం, 1930 నుంచి నిజాం రాష్ట్ర ఆంధ్రమహాసభలు జరగడంతో ప్రజలలో చైతన్యం అధికమైంది. సురవరంతో పాటు బూర్గుల రామకృష్ణారావు, పులిజాల వెంకటరావు, కొండా వెంకట రంగారెడ్డి, మాడపాటి హన్మంతరావు, మందుముల నరసింగరావు, రావి నారాయణరెడ్డి, జమలాపురం కేశవరావు తదితరులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు
1956 తర్వాత: 1956లో భాషా ప్రాతిపదికపై రాష్ట్రాల పునర్విభజన జరుగగా హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలు మరియు ఆంధ్రరాష్ట్రం కలిసి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడింది. వరంగల్లు నుండి కొంత ప్రాంతాన్నీ, గోదావరి జిల్లాలనుండి భద్రాచలం, దండకారణ్యం ప్రాంతాలకు వేరు చేసి ఖమ్మం రాజధానిగా ఖమ్మం జిల్లాను ఏర్పరచారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన కొన్నాళ్ళకే మళ్ళీ వేర్పాటు ఉద్యమాలు తలెత్తాయి. 1969లో మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉధృతరూపం దాల్చింది. అప్పుడు ప్రత్యేక తెలంగాణ నేపథ్యంలో ఏర్పడిన తెలంగాణ ప్రజా సమితి పార్టీ 1971లో 11 లోకసభ స్థానలలో విజయం సాధించింది. 1979లో హైదరాబాదు జిల్లా గ్రామీణ ప్రాంతాన్ని వేరుచేసి రంగారెడ్డి జిల్లా ఏర్పాటుచేశారు. 2001, ఏప్రిల్ 27న కె.చంద్రశేఖర్ రావు ప్రత్యేక తెలంగాణ లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేశారు. 2011 నుంచి తెలంగాణ ఉద్యమ నాయకత్వం "ఐక్య కార్యాచరణ సమితి" చేతుల్లోకి వెళ్ళడంతో విద్యార్థులు, ఉద్యోగసంఘాలు చురుకుగా పాల్గొన్నారు. 2010లో తెలంగాణ అంశంపై శ్రీకృష్ణ కమిటిని నియమించగా ఆ కమిటి 6 ప్రతిపాదనలు చేసింది. తెలంగాణ అంతటా ఉద్యోగులు, కార్మికులు 2011లో 42 రోజుల సమ్మె చేశారు. 2013, జూలై 30న ప్రత్యేక తెలంగాణకై కాంగ్రెస్ వర్కింగ్ కమిటి తీర్మానం చేయగా, 2013 అక్టోబరు 3న కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. జూన్ 2, 2014నాడు దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించింది.
Tuesday, September 22, 2015
BC Study Circles for free coaching in Telangana State Public Service Commission Group – I to Group – IV Services
1. For further details and Registration Guidelines, the Candidates is advised to visit the Website: tsbcstudycircles.cgg.gov.in. The Candidate may contact to their Respective District Study Circles:
- 1. Hyderabad & RR Dist: Director, T.S. Study Circle for BCs, H.No.4-1-825/E, 5th floor, Laxmi Estate. Jawaharlal Nehuru Road, 500 001, Ph.040–24611408, 24651178.
- 2. Mahabubnagar: T.S. Study Circle for BCs, Govt. B.Ed. College Compound, Pillalamarri Road, Mettuguda, Mahabubnagar-1 Ph. 08542 – 245790
- 3. Warangal: Director, T.S. Study Circle for BCs, 6-1-46/5,Lashkar Bazar, Kancharla Kunta, Hanmakonda – 1, Ph: 0870 – 2571192.
- 4. Adilabad: Director, T.S. Study Circle for BCs,Imam All Building, above, Teachers Colony S.B.I Branch, Near RIMS Medical College, Adilabad, Ph: 0873 – 2221280.
- 5. Karimnagar: Director, T.S. Study Circle for BCs, B2, OPP S.R.R. College, Near Employment Office, Jagityal Road, Karimnagar, Ph: 0878 – 2228686
- 6. Khammam: Director, T.S. Study Circle for BCs,N.T.R. Circle, Opp; P.G. Center, Khammam, Cell 9393254433,Ph. 08742 – 227427.
- 7. Nizamabad: Director, T.S. Study Circle for BCs, Rajaram Stadium Building, Nagaram, Nizamabad, Ph; 08462 – 245055.
- 8. Nalgonda: Director, T.S. Study Circle for BCs, Back Side NG College, Sri Nagar Colony, Integrated Hostel-2 Back Side, Nalgonda Ph. 08682 – 220007
- 9. Medak & Siddipet: Director, T.S. Study Circle for BCs, Near Ambedkar Stadium Ground, Sanga Reddy at Medak Ph. 08455 – 277015