Wednesday, August 12, 2026

తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తు PDF Download



తెలంగాణలోని పలు బలహీన వర్గాలకు సామాజిక భద్రతను అందించే దిశగా CM రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. చేయూత సామాజిక భద్రత పథకం కింద కొత్త పింఛన్లకు దరఖాస్తులు ఆహ్వానించింది. కొత్త పెన్షన్ల మంజూరుకు సంబంధించిన మార్గదర్శకాలను సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పోవర్టీ (SERP) గ్రామీణాభివృద్ధి శాఖ సర్క్యులర్ జారీ చేసింది. ఈ మేరకు CM రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా మొదటి విడతలో ప్రాధాన్య క్రమంలో లబ్ధిదారులకు కొత్త పింఛన్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.



తొలి విడత పింఛన్లలో వీరికే ప్రాధాన్యం


తొలి విడత ప్రాధాన్యత జాబితాలో ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులు, రక్త సంబంధ వైకల్య సమస్యలైన థలసేమియా, సికిల్ సెల్ డిసీజ్, హీమోఫీలియాతో బాధపడుతున్న వ్యక్తులను లబ్దిదారులుగా చేర్చారు. ఇప్పటికే దరఖాస్తు చేసినవారు మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. కొత్తగా దరఖాస్తు చేసేవారికి ఆగస్టు 31 వరకు అవకాశం కల్పించారు.

-  వితంతువులు
-  ఒంటరి మహిళలు 
-  దివ్యాంగులు
-  కల్లుగీత కార్మికులు
-  చేనేత కార్మికులు
-  ఫైలేరియా
-  తలసేమియా
-  సికిల్ సెల్
-  హీమోఫీలియా బాధితులు


Application Form Telugu PDF Download

Application Form English PDF Download