Sunday, April 17, 2022

మీ స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సాప్‌ యాప్‌కు లాక్‌-అన్‌లాక్‌ చేయడం ఎలా..?

 


 

Whatsapp: ప్రస్తుతం వాట్సాప్‌ వినియోగం పెరిగిపోయింది. అలాగే ఫోన్‌లో ఏది చేసినా బయటకు పొక్కకుండా ఉండేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాము. స్మార్ట్‌ఫోన్‌ (Smartphone Lock)కు లాక్‌ వేసుకుంటాము. అలాగే స్మార్ట్‌ఫోన్‌ (Smartphones)లలో ఎక్కువగా వినియోగించేది వాట్సాప్‌ . ప్రతి రోజు ఉదయం నుంచి రాత్రి పడుకోబోయే వరకు చాలా మంది వాట్సాప్‌లో మునిగి తేలుతుంటారు. వాట్సాప్‌ (Whatsapp)లో కూడా కొన్ని సిక్రెట్స్‌ ఉంటాయి. అలాంటి సమయంలో వాట్సాప్‌ యాప్‌కు కూడా లాక్‌ వేసుకోవడం ఎంతో ముఖ్యం. స్మార్ట్‌ఫోన్‌లలో వ్యక్తిగతంలో ఎన్నో సిక్రెట్స్‌ ఉంటాయి. ఇతరులు వారి వాట్సాప్‌ చాట్‌ను చూపేందుకు ఆసక్తి చూపరు. ఎవరికైనా ఫోన్‌ ఇచ్చినా వాట్సాప్‌ ఎక్కడ ఓపెన్‌ చేస్తారేమోనని టెన్షన్‌ ఉంటుంది. అందుకే కొందరు వాట్సాప్‌కు సిస్టమ్‌ యాప్‌, ఇతర లాక్‌ యాప్‌లను వినియోగిస్తుంటారు. ఆ యాప్స్‌ వాట్సాప్ రక్షణగా ఉంటుంది. అయితే ఎలాంటి యాప్స్‌ లేకుండా కూడా లాక్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. స్వయంగా వాట్సాప్‌లోనే ఈ లాక్‌ ఫీచర్‌ ఉంటుంది. దీనిని ఫింగర్‌ప్రింట్‌ (Fingerprint) సెన్సార్‌ లేదా ఫేస్‌ రికగ్నైజేషన్ అథంటికేషన్ ద్వారా మీరు మాత్రమే ఓపెన్ చేయవచ్చు.

ఆండ్రాయిడ్‌, ఓఐఎస్ యాప్స్‌లో ఈ వాట్సాప్‌ లాక్ ఫీచర్ అందుబాటులో ఉంది. దీన్ని ఒక్కసారి ఆన్ చేసుకుంటే మీరు ఫింగర్‌ప్రింట్ యాక్సెస్ ఇస్తేనే వాట్సాప్‌ ఓపెన్ అవుతుంది. ఫేస్ అన్‌లాక్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు. వాట్సాప్‌ లాక్‌లో ఉన్నా వాట్సాప్‌ కాల్స్‌కు ఆన్సర్ చేసే సదుపాయం కూడా ఉంటుంది. అయితే మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ వాట్సాప్‌ లాక్‌ను ఎలా ఆన్ చేసుకోవాలో చూడండి.

ఆండ్రాయిడ్‌ మొబైల్‌ యూజర్లు వాట్సాప్‌ లాక్ ఆన్ చేసుకోండిలా..

☛ మీ ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్‌ ఓపెన్‌ చేయండి.

☛ యాప్‌పై కుడి భాగంలో ఉన్న మూడు చుక్కలపై క్లిక్‌ చేయాలి.

☛ తర్వాత సెట్టింగ్‌ (Settings)లోకి వెళ్లి అకౌంట్‌ (Account) ఆప్షన్‌పై ట్యాప్‌ చేయాల్సి ఉంటుంది.

☛ ఆ తర్వాత ప్రైవసీ (Privacy)ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి

☛ అనంతరం కిందికి స్క్రోల్‌ చేస్తే ఫింగర్‌ప్రింట్ లాక్ (Fingerprint Lock) అని ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేసి అన్‌లాక్‌ విత్‌ ఫింగ్‌ప్రింట్‌ అనే ఆప్షన్‌ను టాగుల్‌ చేసి ఎనేబుల్‌ చేసుకోండి. ఇక తర్వాత నుంచి వాట్సాప్‌ ఓపెన్‌ చేయాలంటే ఫింగర్‌ప్రింట్‌ అథంటికేషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది