Monday, January 11, 2021

Whatsapp vs Signal App: భారత్‌లో వాట్సాప్‌కి షాక్.. సిగ్నల్‌ యాప్‌కి మారిపోతున్న కస్టమర్లు..!

 

Whatsapp vs Signal App: ఇన్నాళ్లూ వాట్సాప్ వాడిన మనకు... దాన్ని మానేసి... సిగ్నల్ యాప్ వాడాలంటే అదేంటో, ఎలా ఉంటుందో, వాడొచ్చో లేదో ఇలా చాలా డౌట్లు ఉంటాయి. కానీ... గూగుల్ ప్లే స్టోర్‌లో ఇప్పటికే కోటి మందికి పైగా పైగా ఈ యాప్ వాడుతున్నారు. రేటింగ్ కూడా 4.5 ఇచ్చారు. ఇండియాలో సిగ్నల్ యాప్‌కు క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎవరి నోట చూసినా ఇదే మాట.  


Download app

 

వాట్సాప్ కొత్త సర్వీస్ రూల్స్‌ యూజర్లకు నచ్చట్లేదు. తమ ప్రైవసీకి దెబ్బ పడుతుందని ఆలోచిస్తూ... వాట్సాప్‌ని వదిలేసి... సిగ్నల్ యాప్‌కి జంప్ అవుతున్నారు. యాపిల్ ఇండియా యాప్‌ స్టోర్‌లో ఇది నంబర్ వన్ యాప్‌గా మారింది.

 ఈ మధ్య వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ నోటిఫికేషన్లను కస్టమర్లకు పంపించింది. వాటిని ఒప్పుకుంటేనే వాట్సాప్‌ వాడాలని మెలిక పెట్టింది. వాటిపై చాలామంది కస్టమర్లు అసంతృప్తిగా ఉన్నారు. టెస్లా కంపెనీ సీఈఓ ఎలన్ మస్క్, అమెరికన్ విజిల్‌బ్లోయర్ ఎడ్వర్డ్ స్నోడెన్, ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సే వంటి ప్రముఖులు... సిగ్నల్‌ యాప్‌ను వాడమని చెప్పేశారు. దాంతో అంతా సిగ్నల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు.