Showing posts with label Study Material. Show all posts
Showing posts with label Study Material. Show all posts

Thursday, June 22, 2023

తెలంగాణ రాష్ట్రము లో ముఖ్యమైన జాతరలు

    తెలంగాణ రాష్ట్రము లో ముఖ్యమైన జాతరలు
➖➖➖➖➖➖➖➖➖➖
1 , సమ్మక్క -సారక్క       --  వరంగల్

2 . ఏడుపాయల జాతర  -- మెదక్

3 . కొండగట్టు జాతర       - కరీనగర్

4 . నాగోబా జాతర           --  ఆదిలాబాద్

5 . ఉర్సు                        --  నల్గొండ

6. పెద్దగట్టు జాతర          - నల్గొండ

7 .కొండగట్టు అంజన్న జాతర     - కరీంనగర్

8 .గొల్లగట్టు జాతర                -- నల్గొండ

9 .కొమురెల్లి జాతర            --  వరంగల్

10 .రామప్ప జాతర           -   -- వరంగల్

11.వేళల జాతర                 -- ఆదిలాబాద్

12.బెజ్జంకి జాతర               - కరీంనగర్

13.మన్నెంకొండ జాతర  -- మహబూబ్ నగర్.
 

 

Sunday, July 24, 2022

తెలంగాణ చరిత్ర- ఇక్ష్వాకులు

 


తెలంగాణ చరిత్ర- ఇక్ష్వాకులు

స్థాపకుడు  వాసిష్టీపుత్ర శ్రీశాంతమూలుడు
చిహ్నం  సింహం
రాజలాంఛనం  హారతీ పుత్రులు / శ్రీ పర్వతీయులుగా ప్రసిద్ధి
రాజధాని  విజయపురి
 రాజభాష  ప్రాకృతం
మతం  వైష్ణవం, బౌద్ధమతం
 శాసనాలు  నా గార్జున కొండ ,అమరావతి
శిల్పకళ  ఆకుపచ్చని రాతిపై శిల్పాలు, మందాత శిల్పం  (జగ్గయ్యపేట)

 

గొప్పవాడు వీరపురుష దత్తుడు
చివరివాడు   రుద్రపురుష దత్తుడు

 

 ఇక్ష్వాకుల చరిత్రకు ఆధారాలు

1.శాసనాధారాలు : 

  • మత్స్యపురాణం ప్రకారం ఏడుగురు ఇక్ష్వాకు రాజులు వంద సంవత్సరాలు పరిపాలించారు 
  • జగ్గయ్యపేట, నాగార్జునకొండ శాసనాల ప్రకారం నలుగురు ఇక్ష్వాకు రాజులు మాత్రమే పాలించారు.
  • నాగార్జునకొండ శాసనం ప్రకారం వాశిష్టపుత్ర శాంతమూలుడు ఇక్ష్వాకు రాజ్యాన్ని స్థాపించాడు. 
  • శాతవాహనులకు సామంతులుగా ఇక్ష్వాకులు ఉన్నారని వీరపురుషదత్తుని యొక్క అల్లూరి శాసనం పేర్కొంటుంది.
  •  ఇక్ష్వాకు వంశ చివరి రాజు రుద్రపురుషదత్తున్ని పల్లవ వంశస్థాపకుడు సింహవర్మ ఓడించాడు అని మంచికల్లు శాసనం పేర్కొంటుంది. 
  • ఇక్ష్వాకుల అంతం గురించి పేర్కొంటున్న శాసనాలు 
  1. మైదవోలు శాసనం
  2. మంచికల్లు శాసనం

2. పురాణాలు :

  •  మత్స్యపురాణం ఏడుగురు ఇక్ష్వాకు రాజులు వంద సంవత్సరాలు పాలించారని పేర్కొంటుంది. 
  • ఇక్ష్వాకులను శ్రీపర్వతీయులు అని, ఆంధ్రభృత్యులు అని మత్స్యపురాణం పేర్కొంది.
  • ఇక్ష్వాకు రాకుమారులు దక్షిణ ప్రాంతానికి వచ్చి రాజ్యాలు స్థాపించారని విష్ణుపురాణం పేర్కొంటుంది.

3.సాహిత్య ఆధారాలు:

  • ధర్మామృతం (జైనకావ్యం, కన్నడ గ్రంథం) .
  • దీనిని న్యాయసేనుడు 11వ శతాబ్దంలో రచించాడు.

 

4. వంశం: 

  • ఇక్ష్వాకులు తాము బుద్దుని (శాక్యముని) వంశానికి చెందిన వారమని నాగార్జునకొండ శాసనంలో ప్రకటించుకున్నారు.
  • విష్ణుపురాణం, జైనధర్మామృతం ప్రకారం ఇక్ష్వాకు రాకుమారులు దక్షిణ ప్రాంతానికి వచ్చి రాజ్యాలు స్థాపించారు.

ఇక్ష్వాకు పాలకులు, వారి రాజకీయ చరిత్ర

1) వాశిష్టపుత్ర శ్రీశాంతమూలుడు: 

  • శాతవాహన చివరి పాలకుడైన 3వ పులోమావిని పారద్రోలి ఇక్ష్వాక రాజ్యాన్ని స్థాపించాడు.
  • ఇతను వ్యవసాయాభివృద్ధికి గోవులను, నాగళ్ళను, భూమిని దానం చేశాడు.
  • ఇతను వైదిక మతం, పౌరాణిక మతాలను ఆదరించాడు.
  • ఇతను కార్తికేయుని (మహాసేన విరుపాక్షకుని) భక్తుడు.
  • ఈయన అశ్వమేథ, వాజపేయ యాగాలు నిర్వహించాడని ఇతని కుమారుడు వీరపురుషదత్తుని శాసనాల వలన తెలుస్తుంది.
  • నాగార్జున కొండ వద్ద ‘అశ్వమేధ యాగ’ వేదిక బయటపడింది.

 

 2) వీరపురుషదత్తుడు: 

  • ఇతను శైవమతంను ద్వేషించినట్లు, శివలింగాన్ని కాళ్ళతో తొక్కుతున్నట్లు ఉన్న శిల్పాలు నాగార్జున కొండలో బయటపడ్డాయి.
  •  ఇతను బౌద్ధమును ఆదరించాడు. ఇతని కాలంను ఆంధ్రలో ”  బౌద్ధ మత స్వర్ణయుగంగా ” పేర్కొంటారు.
  • ఇతన్ని దక్షిణాది అశోకుడు అంటారు.
  • ఇతని కాలంలో శ్రీపర్వతం (నాగార్జున కొండ) మహాయానంకు గొప్ప పుణ్య క్షేత్రమైంది.
  • ఇతని కాలంలోనే శ్రీపర్వత విశ్వవిద్యాలయం స్థాపించబడింది.

  నోట్ :   1.  భారతదేశంలో మొట్టమొదటి బౌద్ధ విశ్వవిద్యాలయం – శ్రీపర్వత విశ్వవిద్యాలయం.

              2. భారత్ లో అత్యంత ప్రాచీన విశ్వవిద్యాలయం – తక్షశిల.

మేనత్త  కుమార్తెలను వివాహమాడే సాంప్రదాయం వీరి కాలంలోనే ప్రారంభమైంది.

 

3) శ్రీ ఎహుబల శాంతమూలుడు : 

  •  శాంతమూలుడి సోదరి కొండ, నాగార్జున కొండపై బౌద్ధవిహారాన్ని నిర్మించింది.
  • ఇతని  కాలం నుండే సంస్కృతంలో శాసనాలు రాసే సంప్రదాయం ప్రారంభమైంది.
  • నాగార్జునకొండ వద్ద సంస్కృత శాసనం వేయించాడు. (దక్షిణ భారత్ లో తొలి సంస్కృత శాసనం )
  • ఇతని కాలం నాటి ప్రాకృత శాసనం – గుమ్మడి గుర్రు శాసనం.
  • దక్షిణ భారత్ లో హిందూ దేవాలయాలు నిర్మించిన మొట్టమొదటి రాజు.
  • నాగార్జున కొండలో ఇతని కాలంలో నిర్మించిన దేవాలయాలు:

                1.  కార్తికేయుని ఆలయం.

                 2. నందికేశ్వర ఆలయం.

                 3. నవగ్రహ ఆలయం.

                4.  హరీతి దేవాలయం : హరీతి దేవాలయంలోని సప్తమాత్రుకల వద్ద ఆ కాలం నాటి 

స్త్రీలు సంతానం  కోసం గాజులను సమర్పించేవారు.

  • ఇతని సేనాపతి ఎలిసిరి నాగార్జున కొండ వద్ద కుమారస్వామి దేవాలయం నిర్మించాడు. *
  • అభిరరాజు శక సేనుని సేనాని శివసేనుడు నాగార్జున కొండ వద్ద అష్టభుజ నారాయణస్వామి దేవాలయం నిర్మించాడు. ఇది ఆంధ్రదేశంలో నిర్మించిన తొలి వైష్ణవాలయం.

4) రుద్ర పురుషదత్తుడు:

  • ఇక్ష్వాకుల వంశంలో చివరివాడు.
  • ఇతను పుష్పభద్ర స్వామి ఆలయంను నిర్మించాడు.
  • మంచికల్లు శాసనం ప్రకారం పల్లవ వంశస్థాపకుడైన సింహవర్మచే ఇతను ఓడించబడ్డాడు.
  • ఇక్ష్వాకుల అంతం గురించి పేర్కొన్న శాసనాలు- మైదవోలు శాసనం (శివస్కంధవర్మ), మంచుకల్లు శాసనం (సింహవర్మ)

 

 

 

Monday, November 30, 2015

విద్యను హక్కు చట్టం




విద్యను హక్కుగా పొందే చట్టం అనగా నేమి?
  • ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల మధ్య వయస్సు గల ప్రతి బాలబాలికలకు ఉచిత విద్య మరియు నిర్భంధిత విద్యను హక్కుగా కల్పించబడింది. ఇది 86 వ రాజ్యాంగ సవరణ చట్టం ఆర్టికల్ 21 ఎ కి అనుబంధంగా కల్పించబడింది. ఉచితంగా విద్యను హక్కుగా పొందే ఈ సవరణ వలన మంచి పరిణామము ఇవ్వాలని కోరుతుంది.
  • పాఠశాల నిర్వహణాసంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు పిల్లలందరికీ ఉచిత విద్యను కల్పించాలి. ప్రైవేటు పాఠశాలలు తమ పాఠశాలలలో 25 శాతం పిల్లలకు ఎటువంటి రుసుము లేకుండా ప్రవేశము కల్పించాలి.
  • నాణ్యతతో పాటు అన్ని రకాల ప్రాథమిక విద్యా విషయాలను పర్యవేక్షించుటకు గాను జాతీయ సంఘం ఏర్పాటు చేయాలి.

చట్టం పరిణామ క్రమము

డిశెంబరు 2002
86 వ రాజ్యాంగ సవరణ చట్టం (2002) ఆర్టికల్ 21 ఎ మూడవ భాగం ద్వారా ఆరు నుండి పద్నాలుగు సంవత్సరముల లోపు వయస్సు గల పిల్లలకు నిర్భంద ఉచిత విద్య, ప్రాథమిక హక్కుగా చేసేందుకు ఉద్దేశింప బడింది.
అక్టోబరు 2003
పిల్లలకు ఉచిత నిర్భంధ విద్యా బిల్లు 2003 పై ఆర్టికల్లో అనుకున్న విధంగా మొదటి ముసాయిదా చట్టాన్ని అక్టోబరు 2003లో తయారు చేసి పెద్ద మొత్తంలో ప్రజా స్పందనకు మరియు సూచనలను పొందుటకుగాను ఈ క్రింది వెబ్ సైట్ లో ఉంచబడింది.
2004 ఆ తర్వాత ఈ బిల్లు ముసాయిదా పై వచ్చిన సూచనలననుసరించి ఉచిత నిర్భంధ విద్యాబిల్లు 2004 కి సంబంధించిన మార్పుచేసిన బిల్లు ముసాయిదా తయారు చేసి ఈ క్రింది వెబ్ సైట్ లో పెట్టబడింది.


జూన్ 2005
కేంద్రీయ విద్యాసలహా సంఘము (సి ఎ బి ఇ) కమిటీ తయారు చేసిన ఉచిత నిర్భంద విద్య బిల్లు ముసాయిదా ను మానవ వనరుల మంత్రిత్వ శాఖకు సమర్పించారు. మానవ వనరుల మంత్రిత్వశాఖ జాతీయ సలహా మండలి (ఎన్ ఎ సి) చైర్మన్ అయిన శ్రీమతి సోనియా గాంధీకి పంపించారు. జాతీయ సలహామండలి బిల్లుని ప్రధాన మంత్రికి పరిశీలన కొరకై పంపించింది .
పద్నాల్గవ (14) తేదీ జులై 2006
ఆర్థిక శాఖ, ప్లానింగ్ కమీషన్ లు నిధుల లేవని చెప్పి ఈ బిల్లును ఆమోదించలేదు. ఈ బిల్లు ముసాయిదాను అవసరమైన ఏర్పాట్లు కొరకు రాష్ట్రాలకు పంపబడినది. (86 వ రాజ్యాంగ సవరణ తరువాత రాష్ట్ర ప్రభుత్వాలు నిధుల లేమిని ఎప్పుడో ప్రకటించాయి).
పంతొమ్మిదవ (19) తేదీ జులై 2006
బాలకార్మిక నిర్మూలన ప్రచారము (సి ఎ సి ఎల్), విద్యను ప్రాథమిక హక్కు గా రావడానికి కృషిచేసే జాతీయ కూటమి (ఎస్ ఎ ఎఫ్ ఇ), జాతీయ విద్యా విధాన సలహా మండలి (ఎన్ ఎ ఎఫ్ ఆర్ ఇ), కేంద్రీయ విద్యాసలహా సంఘము (సి ఎ బి ఇ) మొదలగునవి భారత అక్షరాస్యతా పథకము (ఐ ఎల్ పి) మరియు ఇతర సంస్థలను ఆహ్వానించి ప్రణాళికా సమావేశము ఏర్పాటుచేసి, ఆ సమావేశములో పార్లమెంటులో ఈ చర్య ప్రభావము మరియు సమర్ధన చర్యలు ఎలా మొదలుపెట్టాలి మరియు జిల్లా, పల్లెల స్థాయిలో ఏ విధంగా అమలు పరచ వలెనో దిశానిర్ధేశకం చేయడంపై చర్చించాయి.

ఈ చట్టం పై తరచుగా అడగబడు ప్రశ్నలు

  1. ఈచట్టం ఎందుచేత అత్యంత ఆవశ్యకము?
రాజ్యాంగ సవరణను అమలు పరచుటలో ప్రభుత్వం యొక్క చురుకైన పాత్రకు ఇది మొదటి మెట్టు కాబట్టి ఈ బిల్లు ముఖ్యమైనది. మరియు చట్టం ఎందువలన ముఖ్యమైనదంటే:
  • ఉచిత నిర్భంద ప్రాథమిక విద్య మరియు తరువాత స్థాయి విద్య ఏర్పాటుని శాసననిర్మాణం చేస్తుంది.
  • ప్రతి ఆవాసానికి ఒక పాఠశాలని ఏర్పాటు చేస్తుంది.
  • పాఠశాల పర్యవేక్షక కమిటీ (పాఠశాల నిర్వహణను పర్యవేక్షించే ఆ ఆవాసంలో గల ఎన్నికైన సభ్యులు) ఏర్పాటు చేస్తుంది
  • ఆరు నుండి పద్నాలుగు (6-14) సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలెవరూ పనిలోకి వెళ్ళకుండా శాసనం చేస్తుంది.
ఇటువంటి మంచి చర్యలు ప్రజల విద్యా విధానము అభివృద్ధికై పునాదిగా ఉపయోగబడి, నాణ్యమైన విద్య అందరి పిల్లలకి కల్పించబడేటట్లు చేస్తాయి. తద్వారా సాంఘికంగా మరియు ఆర్థికంగా బహిష్కరణకు ప్రజలు గురికావడం నివారింపబడుతుంది.
ఎందువలన 6-14సంవత్సరముల వయస్సుగల పిల్లల గ్రూపునే ఎంచుకోవాలి?
ఈ చట్టం ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య, నిర్భంధంగా పిల్లలందరికీ కల్పించబడేటట్లు కేంద్రీకరిస్తుంది. ఈ వయస్సుగల పిల్లల గ్రూపుకి, ఈ నిర్భంధవిద్యను కల్పించబడడం ద్వారా వారి భవితకు పునాది ఏర్పాడుతుంది.
చట్టం ఎందుకు ప్రాముఖ్యం మరియు భారతదేశానికి ఎటువంటి మేలు చేస్తుంది?
పిల్లల హక్కైన ఉచిత మరియు తప్పనిసరి విద్యా చట్టం 2009 (ఆర్ టి ఇ) జారీచేయుట భారతదేశ విద్యార్ధుల చరిత్రలోనే ఒక మైలు రాయిగా నిలుస్తుంది
నాణ్యమైన ప్రాధమిక విద్యను ఆర్జించడానికి ప్రతి బాలుడు/ బాలికకు తమ హక్కుగా ఈ చట్టం ఒక స్థాపనా అమరికలా పనిచేస్తుంది మరియు కుటుంబాలు మరియు కమ్యూనిటీల సహాయంతో రాష్ట్రం ఈ బాధ్యతని నిర్వర్తిస్తుంది.
ప్రపంచంలో కొన్ని దేశాలకు పిల్లలకు ఉచిత మరియు పిల్లల కేంద్రితమైన, పిల్లలకి స్నేహ పూర్వకంగా ఉండే విద్యను అందించడానికి అటువంటి జాతీయ సదుపాయం కలదు.
‘ఉచిత మరియు తప్పనిసరి ప్రాధమిక విద్య’ అంటే ఏమిటి?
6 నుండి 14 వయస్సులోపు అందరి పిల్లలకు దగ్గరున్న పాఠశాలలో ఉచిత మరియు తప్పనిసరి విద్య అర్జించే హక్కుకలదు.
పిల్లలు కాని తల్లిదండ్రులు కాని ప్రాధమిక విద్యని అభ్యసించడానికి, ప్రత్యక్షమైన (స్కూల్ ఫీజు) లేదా పరోక్షమైన (యూనిఫార్మ్ లు, టెక్ట్స్ బుక్ లు, మధ్యాహ్న భోజనం, రవాణా) ఖర్చులు భరించనవసరం లేదు. ఒక పిల్లవాడు ప్రాధమిక విద్యను పూర్తి చేసే వరకు ప్రభుత్వం ఉచితంగా చదువుని అందిస్తుంది.
ఆర్ టి ఇ ని సాధించడానికి కమ్యూనిటీకి మరియు తల్లిదండ్రులకి పోషించే పాత్ర ఏమిటి?
పిల్లల హక్కైన ఉచిత మరియు తప్పనిసరి విద్యా చట్టం 2009 (ఆర్ టి ఇ) జారిచేయుట భారతదేశ విద్యార్ధుల చరిత్రలోఒక మైలురాయిగా నిలుస్తుంది. భారతదేశపు చరిత్రలో మొట్ట మొదటి సారిగా, కుటుంబాలు మరియు కమ్యూనిటీల సహాయంతో రాష్ట్రం ద్వారా నాణ్యమైన ప్రాధమిక విద్యను పొందే హక్కును అందించే హామీ ఇస్తుంది.
విద్యార్ధులకు వారి పూర్తి సామర్ధ్యాన్ని అభివృద్ధి పరుచుకోవడంలో దోహదపడేలా చూడడానికి, ప్రపంచంలోని కొన్ని దేశాలు పిల్లల కేంద్రితమైన, పిల్లలకి స్నేహపూర్వకంగా ఉండే విద్యను అందించే జాతీయ సదుపాయం కలదు. 2009 లో, 6 నుంచి 14 వయస్సు లోపు పాఠశాలకు వెళ్ళని పిల్లలు 8 మిలియన్లు ఉన్నారని అంచనా. భారతదేశము లేకుండా 2015 నాటికి ప్రతి పిల్లవానికి పూర్తి ప్రాధమిక విద్య అనే లక్ష్యాన్ని ప్రపంచం చేరుకొలేదు.
స్థానిక అధికార ఉద్యోగులు, తల్లిదండ్రులు, గార్డియన్లు మరియు టీచర్లతో పాఠశాలలు, పాఠశాలల నిర్వహణ సంఘాన్ని (ఎస్ ఎమ్ సి లని) నియమించాలి. ఎస్ ఎమ్ సి లు, పాఠశాల అభివృద్ధి పథకాలని తయారు చేయడం మరియు ప్రభుత్వపు ధనాన్ని వినియోగాన్ని మరియు మొత్తం పాఠశాల వాతావరణాన్ని ఎస్ ఎమ్ సి ఎస్ లు పర్యవేక్షించాలి.
ఎస్ ఎమ్ సి లలో లాభం పొందని గ్రూపుల నుండి 50 శాతం ఆడవాళ్ళని మరియు తల్లిదండ్రులని చేర్చుకోవాలని కూడా ఆర్ టి ఇ తీర్మానిస్తుంది. బాలురకి మరియు బాలికలకి వేరు వేరు మరుగుదొడ్ల సదుపాయాలు మరియు ఆరోగ్యం, నీరు, పారిశుధ్యం మరియు ఆరోగ్య సమస్యలకి తగినంత శ్రద్ధ అందించడం ద్వారా స్నేహపూర్వకమైన “పూర్తి పాఠశాల” వాతావరణాన్ని కల్పించడంలో ఇటువంటి సంఘం కీలక పాత్ర వహిస్తుంది.
ఆర్ టి ఇ బాల్య స్నేహపూర్వక పాఠశాలలను ఎలా ప్రోత్సాహిస్తుంది?
ప్రభావితంగా అభ్యాసించే వాతావరణం కోసం, అన్ని పాఠశాలలు అవస్థాపన వసతులు మరియు ఉపాధ్యాయ ప్రమాణాలని పాటించాలి. ప్రాధమిక స్థాయిలో, ప్రతీ 60 మంది విద్యార్థులకు ఇద్దరు శిక్షణ పొందిన ఉపాధ్యాయులను నియమిస్తారు.
ఉపాధ్యాయులు పాఠశాలకు క్రమం తప్పకుండా మరియు సమయానికి పాఠశాలకు హాజరుకావాలి పూర్తి పాఠ్యప్రణాళికలని పూర్తి చేయాలి, అభ్యాస సామర్ధ్యాలను అంచనా వేయాలి, ఉపాధ్యాయ తల్లిదండ్రుల సమావేశాలను క్రమంగా నిర్వహించాలి. గ్రేడు ఆధారంగా కన్నా విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయుల సంఖ్య ఆధారపడి ఉంటుంది.
విద్యార్థుల మెరుగైన అభ్యాస ఫలితాలను అందించే ఉపాధ్యాయులకు ప్రభ్యుత్వం సంతృప్తికరమైన సహాయం అందించాలి. సమానత్వంతో కూడిన పాఠశాల నాణ్యతను అందించడానికి, ఎస్ ఎమ్ సి ల సహాయ సహాకారంతో కమ్యూనిటీలు మరియు పౌరసంఘాలు ప్రముఖపాత్ర పోషించాలి. ప్రతి పిల్లవానికి ఆర్. టి. ఇ ను నిజమయ్యేలా చేయడానికి, రాష్ట్రం పోలసీ విధానాలని ఇస్తుంది మరియు సమర్ధవంతమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.
భారతదేశంలో ఆర్ టి ఇ కి ఏ విధంగా ఆర్ధికసహాయం ఇవ్వబడుతుంది మరియు అమలు పరుస్తారు?
నాణ్యమైన ప్రాధమిక విద్యను ఆర్జించడానికి ప్రతి బాలుడు/ బాలికకు తమ హక్కుగా ఈ చట్టం ఒక స్థాపనా అమరికలా పనిచేస్తుంది మరియు కుటుంబాలు మరియు కమ్యూనిటీల సహాయంతో రాష్ట్రం ఈ బాధ్యతని నిర్వర్తిస్తుంది.
ప్రపంచంలో కొన్ని దేశాలకు పిల్లలకు ఉచిత మరియు పిల్లల కేంద్రితమైన, పిల్లలకి స్నేహ పూర్వకంగా ఉండే విద్యను అందించడానికి అటువంటి జాతీయ సదుపాయం కలదు.
ఆర్ టి ఇ కొరకు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్ధిక భాధ్యతలను పంచుకుంటాయి. కేంద్ర ప్రభుత్వం ఖర్చుల అంచనాలను తయారుచేస్తుంది. ఈ ఖర్చులలో కొంత శాతం రాష్ట్ర ప్రభుత్వాలకి ఇవ్వబడును.
ఆర్. టి. ఇ యొక్క సదుపాయాలను నిర్వహించడానికి రాష్ట్రానికి అదనపు వనరులను అందించ డానికి, కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక సంఘాన్ని అభ్యర్ధించవచ్చు.
ఆచరణకు అవసరమైన మూలధనమును అందించుటలో రాష్ట్ర ప్రభుత్వం భాద్యత వహిస్తుంది. నిధుల కొరత ఉంటుంది. దీనిని పౌర సంఘం, అభివృద్ధి సంస్థలు, కోర్పరేట్ సంస్థల నుండి భాగస్వాముల దగ్గర నుండి మరియు దేశ పౌరులు నుండి మద్దతు తీసుకోవలసి ఉంటుంది.
ఆర్ టి ఇ ని సాధించడానికి ముఖ్యమైల సమస్యలు ఏమిటి?
ఏప్రిల్ నెల ఒకటవ తేదీ నుండి ఆర్ టి ఇ చట్టం ఆచరణలోకి వస్తుంది. వీలైనంత త్వరగా ప్రకటించడానికి మరియు రాష్ట్రాలు తమ నియమాలను రూపొందించడానికి అవసరమయ్యే డ్రాఫ్ట్ నమూన నియమాలు ప్రభుత్వాలతో పంచుకోబడతాయి.
బాల కార్మికులు, వలస వచ్చిన పిల్లలు, ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు లేదా “సాంఘిక, ఆర్ధిక, భౌగోళిక, భాష, లింగపరంగా లేదా అటువంటి కారణం వలన” నష్టపడిన పిల్లలు వంటి ప్రయోజనము చేకూరని గ్రూపులకి ప్రత్యేకమైన ఏర్పాట్లతో, ఆర్ టి ఇ అందనివారికి ఒక మంచి ప్లాట్ ఫార్మ్ ని అందిస్తుంది. విధంగా ప్రత్యేక సదుపాయాలతో లాభపడని తెగలకు గట్టి ఆధారం అందిస్తుంది. వేగవంతమైన ప్రయత్నాలు మరియు పెద్ద మొత్తంలో సంస్కరణలు అవసరమయ్యే శిక్షణ మరియు అభ్యాసం యొక్క నాణ్యత మీద అర్ టి ఇ దృష్టి కేంద్రీకరిస్తుంది :

  • రానున్న 5 సంవత్సరాలలో, 1 మిలియన్ కన్నా ఎక్కువ క్రొత్త మరియు శిక్షణ ఇవ్వని ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి మరియు సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు నైపుణ్యాలని పటిష్ట పరచి, స్నేహసంబంధ బాల్య విద్యని అందించడానికి సృజనాజత్మకమైన మరియు నిలకడ అయిన చొరవలు కీలకమైనవి.
  • భారతదేశంలో నేటికి ప్రాధమిక విద్య అభ్యసించవలసిన 190 మిలియన్ల బాలురు బాలికలు ప్రతి ఒక్కరకి స్నేహసంబంధ బాల్య విద్యని సమకూర్చడానికి, కుటుంబములు మరియు కమ్యూనిటీలు కూడా చాలా పెద్ద పాత్రని పోషించాలి.
  • సమానత్వంతో కూడిన నాణ్యతను ఇవ్వడానికి తారతమ్యములను నిర్మూలించవలెను. ఫ్రీ స్కూల్ లో పెట్టుబడి పెట్టుటయే గమ్యములను చేరుకొనుటకు ముఖ్య వ్యూహరచన.
  • పాఠశాలలో చేరని 8 మిలియన్ల పిల్లల్ని తరగతుల లోకి సరైన వయస్సులో పాఠశాలలో తీసుకువచ్చి సహకారంతో ఉండడానికి సహకరించి, విజయవంతం కావడానికి అనుకూల మైన, సృజనాత్మక దృక్పధములు ఎంతో అవసరం.
ఆర్ టి ఇ ని ఉల్లంఘించినట్లయితే ఏ చర్య అందుబాటులో ఉంది?
ఈ చట్టం క్రింద ఇచ్చిన హక్కుల రక్షకాలను, పిల్లల హక్కుల రక్షణ జాతీయ సమితి సమీక్షించి, ఫిర్యాదులను పరిశోధించి మరియు విచారణ చేస్తున్న కేసులలో, సివిల్ కోర్టు పవర్లను కలిగి ఉంటుంది.
ఏప్రిల్ 1 నుండి ఆరు నెలలు లోపు, పిల్లల హక్కుల రక్షణ కొరకు ఒక రాష్ట్ర సమితిని (ఎస్ సి పి సి ఆర్) లేదా విద్యా హక్కు రక్షణ అధారిటీ (ఆర్ ఇ పి ఎ) ని రాష్ట్రాలు నియమించాలి. స్థానిక అధికారు లకి, ఏ వ్వక్తి అయినా ఒక సమస్యని ఫైల్ చేయాలనుకుంటే, వ్రాత పూర్వకంగా ఫిర్యాదును అందించాలి.ఎస్ సి పి సి ఆర్/ఆర్ ఇ పి ఎ చే విన్నపములు నిర్ణయించబడతాయి. సముచితమైన ప్రభుత్వముచే అధికారం ఇవ్వబడిన ఆఫీసర్ యొక్క ఆమోదం ఫిర్యాదుల పరిశీలనకు అవసరం.
ఆర్ టి ఇ యదార్ధంగా ఏవిధంగా కార్య రూపం దాల్చుతుంది?
సమానత్త్వంతో నాణ్యతను అందించడంలో మరియు తారతమ్యములను నిర్మూనించుటకు గట్టి ప్రయత్నాలు అవసరం. సెలబ్రిటి ప్రపంచం, సమాచార సాధనం, ఉపాధ్యాయ సంస్థలు, పౌర సంఘం, ప్రభుత్వం నుండి సంబధిత స్టేక్ హోల్డర్స్ ఒక చోటికి చేర్చడంలో యూనిసెఫ్ ముఖ్య పాత్రను నిర్వహిస్తుంది.
కార్యరూపం దాల్చడానికి పిలుపునివ్వడానికి మరియు ప్రజలలో అవగాహన పెంచడానికి యూనిసెఫ్ భాగస్వాములను పంపిస్తుంది. పిల్లలకు మెరుగైన ఫలితాలు ఇవ్వడంలో, ప్రాప్యత మరియు నాణ్యమైన విద్యని మెరుగుపరచడం మీద పోలసీ మరియు పధకము రూపకల్పన/అమలు దృష్టిని కేంద్రీకరిస్తాయి. ఆర్ టి ఇ పై, జాతీయ మరియు రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ సంఘాలను పటిష్టం చేయడానికి, యూనిసెఫ్ భాగస్వాములతోకూడా కలిసి పనిచేస్తుంది.
ఆధారము: యూనిసెఫ్

విద్యను హక్కుగా పొందే బిల్లుని ఆమోదించిన భారతదేశం

భారతరాజ్యాంగంలో సవరణ చేసిన ఆరు సంవత్సరాల తరువాత, యూనియన్ క్యాబినెట్ విద్యను హక్కుగా పొందే బిల్లుని ఆమోదించింది. ప్రతి బాలబాలికలకు ఉచిత విద్య మరియు నిర్భంధిత విద్య పొందే ప్రాథమిక హక్కుని ఆమోదించడానికి ఇప్పుడు తొందరలో పార్లమెంటులో ప్రవేశపెడుతున్నారు.
ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల మధ్య వయస్సు గల ప్రతి బాలబాలికలకు ఉచిత మరియు నిర్భంధిత విద్యను కల్పించే ప్రాథమిక హక్కు బిల్లుని భారత ప్రభుత్వం స్వాతంత్ర్యం వచ్చిన ఆరు కన్నా ఎక్కువ దశాబ్దాల
తరువాత ఆమోదించింది.
ప్రతి బాలబాలికలకు ఉచిత మరియు నిర్భంధిత విద్యను కల్పించే విద్యాహక్కు బిల్లుని యూనియన్ క్యాబినెట్ ఎంతోకాలం తరువాత ఆమోదించింది. విద్యారంగ అభివృద్ధికి ఇది ఎంతగానో శక్తిని ఇస్తుంది.
ఇరుగు పొరుగునున్న సౌలభ్యంలేని పిల్లలకి ప్రైవేటు పాఠశాలలలో 25 శాతం రిజర్వేషన్లు ప్రారంభదశలో కల్పించే ముఖ్యమైన నిభంధనలు ఈ బిల్లులో ఉన్నాయి. పిల్లలకి అయ్యే ఖర్చు ప్రభుత్వం పాఠశాలలకు ఇస్తుంది. ప్రవేశ రుసుము తీసుకోకూడదని, ప్రవేశానికి పిల్లలని లేదా తల్లిదండ్రుల్ని ఇంటర్వ్యూ చేయకూడ దన్న నిభంధనలు కూడా ఈ బిల్లులో ఉన్నాయి.
పిల్లలని భౌతికంగా దండించడం, బహిష్కరించడం లేదా నిర్భంధించడం మరియు ఉపాధ్యాయుల్ని జనాభా లెక్కలు లేదా ఎన్నికల మరియు ఆపద్కాల ఉపశమన బాధ్యతలు తప్ప ఇతర బాధ్యతల్లో నియుక్తించడాన్ని ఈ బిల్లులో నిషేధించారు. గుర్తింపు లేకుండా పాఠశాల నడిపితే చట్టబద్దంగా చర్య తీసుకుంటారు.
పిల్లలకిచ్చిన ముఖ్యమైన మాటగా, విద్య ఒక ప్రాథమికహక్కు అవుతుండడంతో కేంద్ర మరియు రాష్ట్రాలకు ఉచిత మరియు నిర్భంధిత విద్యను కల్పించడం చట్టపరంగా తీసుకోవలసిన బాధ్యత అని పి. చిదంబరం చెప్పారు.
కొన్ని రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని, ఎన్నికల కమిషన్ తో సంప్రదించిన తరువాత మానవ వనరుల మంత్రిత్వ శాఖ బిల్లుని విడుదల చేస్తుందని ఆయన చెప్పారు.
ఈ బిల్లుని పరిశీలించే పనిని మంత్రుల సముదాయాని (జి ఒ ఎమ్)కి ఇచ్చారు. ఈ బిల్లులోని అంశాల్ని ఏమాత్రం మార్చకుండా ఈనెల మొదట్లో ముసాయిదా చట్టాన్ని మంత్రుల సముదాయం ఆమోదించారు. ఇరుగు పొరుగునున్న సౌలభ్యంలేని పిల్లలకి ప్రైవేటు పాఠశాలలలో 25 శాతం రిజర్వేషన్లు ప్రారంభదశలో కల్పించే నిభంధన కూడా ఉంచారు. ప్రైవేటురంగం ద్వారా రాష్ట్రంయొక్క చట్ట బాధ్యతల్ని నెరవేర్చడానికి ఇది ఒక మార్గంగా కొంత మంది భావిస్తున్నారు.
86 వ రాజ్యాంగ సవరణ ప్రకటించడానికి విద్యా హక్కు బిల్లు చట్టానికి తోడ్పడింది. ఇది ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల మధ్య వయస్సు గల ప్రతి బాల బాలికలకు ఉచిత మరియు నిర్భంధిత విద్యను కల్పిస్తుంది. ఇది చేయడానికి 61 సంవత్సరాలు పట్టింది.
1937 సంవత్సరములో మహాత్మాగాంధి అందరికి విద్య అవసరమని చెప్పినప్పుడు, ఇప్పటి సమస్య లాగానే ఖర్చు ఒక అడ్డు గోడలా ఎదురయింది. పద్నాలుగు సంవత్సరాలు వయస్సు గల అందరి పిల్లలకి ఉచిత మరియు నిర్భంధిత విద్య కల్పించడం అనిర్దుష్టమయిన మనవి అని రాజ్యాంగం విడిచి పెట్టింది. కాని ప్రాథమిక పాఠశాల ప్రవేశము ఈ రోజులలో కూడా సందేహాస్పదమే.
2002 సంవత్సరములోనే, విద్యని ప్రాథమిక హక్కుగా 86 రాజ్యాంగ సవరణలో చేయ బడింది.
2004 సంవత్సరములో ప్రభుత్వాధికారంలోనున్న జాతీయ ప్రజాస్వామిక కూటమి (ఎన్ డి ఎ) ముసాయిదా పత్రాన్ని తయారుచేసింది. కానీ అది ప్రవేశపెట్టేలోపలే ఎన్నికలలో ఓటమిని చవి చూసింది. ప్రస్తుతం అధికారం లోనున్న సంకీర్ణ ప్రగతి శీల కూటమి (యు పి ఎ) యొక్క నమూనా బిల్లు, కేంద్ర రాష్ట్రాల మధ్యలో నిధులు మరియు బాధ్యతల విషయంల్లో అల్లాడి పోతుంది.
బిల్లులో ఉన్న వయోనిభంధనలపై విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. ఆరు సంవత్సరముల క్రింద మరియు పద్నా లుగు సంవత్సరాల పైన ఉన్న పిల్లలని కూడా కలపాలని చెపుతున్నారు. ఉపాధ్యాయుల కొరత, తక్కువ నైపుణ్యంగల ఎంతోమంది ఉపాధ్యాయులు మరియు విద్యా అవస్థాపక సౌకర్యాల కొరతలు ఉన్న ప్రస్తుత పాఠశాలల్ని పట్టించుకోకుండా ప్రభుత్వం క్రొత్త పాఠశాలల్ని మాత్రమే నిర్మించి అభివృద్ది చేస్తున్నారని విమర్శిస్తున్నారు.
ఈ బిల్లు న్యాయ మరియు ఆర్ధిక మంత్రిత్వశాఖల నుండి రాష్ట్ర ప్రభుత్వాల ఆర్ధిక సహకారము విషయంలో వ్యతిరేకత ఎదురైంది. కేంద్ర మంత్రిత్వశాఖ రిజర్వేషన్లలో 25 శాతము పెంపు విషయంలో ఆటంకములు ఎదురౌతాయని భావించింది. అదే సమయంలో మానవ వనరులశాఖ 55,000 కోట్ల రుపాయలు ప్రతి సంవత్సరము అవసరమౌతాయని అంచనావేసింది.
జాతీయ ప్రణాళికా సంఘం మూల ధనాన్ని భరించుటకు వ్యతిరేకతను వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు మూలధనంలో కొంత భాగం కూడా భరించడానికి సిద్ధంగా లేమని చెప్పాయి. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం. ఇక తప్పని సరై ఈ బిల్లుని మొత్తం తొక్కపెట్టడానికి సిద్ధపడింది.
“పాఠశాల” అనే పదం మౌలిక భవన సదుపాయములతో కూడిన దైనప్పటికీ, ఈ బిల్లు ముసాయిదా ప్రతి ఆవాస ప్రాంతంలో మూడు సంవత్సరములలో ప్రాథమిక పాఠశాలల ఏర్పాటుకు లక్ష్యంగా పెట్టుకుంది.
దూరప్రాంతాలైన పల్లెలు మరియు నగర పేదవాడలలో పాఠశాల స్థాపనకు మామూలుగా అవసరమైన పరిపాలనా విధాన మంజూరు వంటి అవరోధములు లేకుండా కొన్ని కనీస ప్రమాణములు తయారు చేయబడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్థిక అంశాలతో ముడిపడిన కారణాలతో పిల్లలు స్కూలుకు పోకుండా చేసే విషయాలను పరిష్కరించడానికి సహాయ సహకారాలను అందిస్తానని అంగీకరించాయి.
చట్టాలు, బిల్లులు పిల్లలను స్కూలుకు వెళ్ళేటట్లు చేయలేవు. ప్రారంభంలో కొన్ని అవరోధములున్నప్పటికి, ఈ పథకము ప్రయోజనం సరైన పిల్లలకి చేరాలా ప్రతివాళ్ళు సాంఘిక బాధ్యతను తీసుకోవల్సిఉంటుంది. ఫీజును ప్రభుత్వమే భరిస్తుందని వాళ్ళు చెపుతున్నారు, కానీ ఇతరుల మీద ఆ ఫీజు భారం వేయుట భావ్యం కాదని క్రొత్త ఢిల్లీ, బరఖాంబ రోడ్ లో ఉన్న మోడర్న్ స్కూలు ప్రధానోపాధ్యాయులు, లతా వైద్యనాధన్ అన్నారు.
సామాజిక బాధ్యత పంచుకోవడాన్ని ఒక ప్రత్యేక అధికారముతో కూడిన గౌరవంగా భావించాలి తప్ప భారంగా భావించరాదని, ఈ బిల్లు రావడానికి మూలకారకులైన విద్యావేత్తలు అటున్నారు.

విద్యా హక్కు పరిరక్షణకై దిశా నిర్దేశన

ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టంలోని అంశాలను పర్యవేక్షించడం జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ – ఎన్ . సి. పీ. సీ. ఆర్.) యొక్క బాధ్యతగా పేర్కొన బడింది . ఈ చట్టం మాటల్లోనూ, చేతల్లోనూ సమర్ధవంతంగా అమలు జరిగేటట్లు ఎన్ . సి. పీ. సీ. ఆర్. కమిషన్ వివిధ సంస్థలకు, ప్రభుత్వ శాఖలకు, పౌర సంఘాలకూ, మరియు ఇతర సంబంధిత సంస్థలకూ ఏకాభిప్రాయం కుదర్చడం లో చొరవ చూపించింది. విద్యా హక్కును సక్రమంగా అమలు చేయడానికి తగిన దిశా నిర్దేశన కొరకు వివిధ ప్రభుత్వ అధికారులతోనూ, విద్యా రంగంలో మిక్కిలి ప్రతిభ మరియు అనుభవం కలిగిన వ్యక్తులతోనూ కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ కమిటీ ఇప్పటి వరకూ జరిగిన నాలుగు సమావేశాలలో ఆర్. టి. ఇ. యాక్ట్ ను సక్రమంగా అమలు జరిపించేందుకు ఒక ప్రణాళికను రూపొందించింది. ఆర్. టి. ఇ. పై దృష్టి కేంద్రీకరించడానికి ఎన్ . సి. పీ. సీ. ఆర్. లోనే ప్రత్యేకించి ఒక విభాగాన్ని నెలకొల్పడం దీనిలోని భాగము. ఈ విభాగాన్ని ఇద్దరు కమిషనర్లు, ఇతర సిబ్బంది సహాయంతో నిర్వహిస్తారు. ఈ విభాగం మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ (మినిస్ట్రీ ఆఫ్ హ్యుమన్ రిసోర్స్ డెవలప్ మెంట్ – ఎమ్. హెచ్. ఆర్. డి.) తో సంబంధం ఏర్పరచుకుని సహాయం పొందుతుంది.
ఆర్. టి. ఇ. యాక్ట్ ను జయప్రదంగా అమలు జరప డానికి ఈ విభాగం ఎమ్ . హెచ్. ఆర్. డి. తో కలిసి పనిచేసే వెసులుబాటు కల్పించవలసిన అవసరం ఉంది.
ఎన్ . సి. పీ. సీ. ఆర్ . తరఫున పని చేయడానికి వివిధ రాష్ట్రాలలో ప్రతినిధులను నియమించడం మూడో విధానం గా సూచించబడింది. విద్యా రంగం లో నిష్ణాతులైన ఈ ప్రతినిధులు వారి వారి రాష్ట్రాలలో ఈ హక్కు అమలౌతున్న పరిస్థితిపై ఎన్ . సి. పీ. సీ. ఆర్. కు సమచారాన్ని తెలియచేస్తారు. పలు రాష్ట్రాల నుండి వచ్చిన ఫిర్యాదులను కూడా పరిశీలిస్తారు.
మరింత సమన్వయం సాధించడం కొరకు ఆర్. టి. ఇ. యాక్ట్ కు సంబంధించిన ఇతర మంత్రిత్వ శాఖల (సామాజిక న్యాయం మరియు సాధికారత, శ్రామిక, గిరిజన వ్యవహారాలు, పంచాయతి రాజ్ లోని అధికారులతో సమావేశాలు ఏర్పరచడమైనది. ఉదాహరణకి, ఆర్. టి. ఇ. యాక్ట్ బాల కార్మిక చట్టం తో ముడిపడి ఉండడం వలన కార్మిక మంత్రిత్వశాఖ యొక్క జోక్యం అవసరం. అలాగే గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించే పాఠశాలలు కూడా ఆర్. టి. ఇ. యాక్ట్ పరిధిలోనికే వస్తాయి. అందువలన ఎన్. సి. పీ. సీ. ఆర్. మరియు ఈ మంత్రిత్వ శాఖల మధ్య మంచి సమన్వయం, అవగాహన ఉంటే పిల్లలు ఆర. టి. ఇ. యాక్ట్ వలన లాభం పొందగలరు.
ఆర. టి. ఇ. యాక్ట్ ను సమర్ధవంతంగా పర్యవేక్షించడానికి, పరస్పర సంబంధాలను చర్చించేందుకు ఎన్. సి. పీ. సీ. ఆర్. ఇతర జాతీయ కమిషన్ల (జాతీయ మహిళా కమిషన్, షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్ ) ప్రతినిధులతో సమావేశమైంది. ఉదాహరణకి, బాలికలు, వెనుకబడిన తరగతులకు చెందిన పిల్లలు విద్యా హక్కు ను కోల్పోకుండా ఉండేందుకు ఈ కమిషన్లు కలిసి కృషి చేయ వచ్చు. అంతే కాక ఎన్ . సి. పీ. సీ. ఆర్. బహిరంగ విచారణ నిర్వహించినప్పుడు తత్సంబంధిత కమిషన్ నుండి ఒక ప్రతినిధి జూరీలో ఉంటే మరింత బలం చేకూరుతుందని కూడా సూచించబడింది.
ఈ యాక్ట్ లోని వివిధ అంశాలను మరియు దాని పర్యవేక్షణ గురించి చర్చించడానికి దేశంలోని వివిధ ప్రాంతాలలోని విద్యావేత్తలతో సంప్రదింపులు జరిపింది. ఇరవై రాష్ట్రాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రతినిధులను నియమించడానికి పౌర సంఘాలతో ఎన్. సి. పీ. సీ. ఆర్. జరిపిన సమావేశాల పరంపరలో ఇది మొదటిది.
అయినప్పటికీ ఈ యాక్ట్ ను మరింత మెరుగ్గా అమలు పరచి, పరిరక్షించేందుకు, దానిలోని అంశాలను దేశంలోని అన్ని సంస్థలూ అర్ధం చేసుకొని అనుసరించే విధంగా మరింత అవగాహనను పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు గాను ఒక విస్తృతమైన ప్రచార కార్య క్రమాన్ని చేపట్టవలసి ఉంది. ఇందులో భాగంగా ఈ యాక్ట్ ను ఎమ్. హెచ్. ఆర్. డి. మరియు ఇతర సంస్థలు కలిసి వివిధ భాషలలోనికి అనువదించాలి. ఈ ప్రచారానికి పనికి వచ్చే విధంగా ఈ యాక్ట్ లోని మౌలికమైన అంశాలను మరియు హక్కులను వివరిస్తూ సులభ శైలిలో రాసిన చట్టాన్ని, పోస్టర్లను, ప్రాధమిక వాచకాలను, కర పత్రాలను రూపొందించి ఈ ప్రక్రియకు ఎన్. సి. పీ. సీ. ఆర్. నాంది పలికింది. పిల్లలు కూడా ఈ యాక్ట్ ను అర్ధం చేసుకునేలా వారి కొరకు ప్రత్యేక బోధనా సామగ్రిని కూడా సంస్థ రూపొందిస్తుంది.

తాజా వార్తలు

'చిన్నారులకు ప్రవేశ పరీక్షలొద్దు'

న్యూఢిల్లీ: నిర్బంధ విద్యాహక్కు చట్టం కింద ఒకటో తరగతి, అంతకన్నా ముందు (ప్రీప్రైమరీ) తరగతుల్లో జరిపే ప్రవేశాలకు సంబంధించి కేంద్ర మానవవనరులశాఖ కొత్త మార్గదర్శకాలను గురువారం విడుదల చేసింది. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఎటువంటి పరీక్షలు జరపకుండానే ప్రవేశం కల్పించాలని స్పష్టం చేసింది. విద్యాహక్కుచట్టం ప్రకారం అన్ని అన్‌ఎయిడెడ్‌, ప్రత్యేక విభాగపు పాఠశాలల్లో కనీసం 25 శాతం సీట్లను సమీప ప్రాంతాల్లోని నిరుపేద, బలహీనవర్గాల పిల్లలకు ఉచితంగా కేటాయించాలి. ప్రాథమికవిద్య పూర్తయ్యేంతవరకూ చదువు చెప్పాలి. దీనికి సంబంధించి అస్పష్టత నెలకొన్న నేపథ్యంలో కేంద్రం తాజా మార్గదర్శకాలను వెలువరించింది. మిగిలిన 75% సీట్లకు సంబంధించి సహేతుకమైన విధానాన్ని అనుసరించాలని, తల్లిదండ్రుల విద్యార్హతల ఆధారంగా విద్యార్థుల సామర్థ్యాన్ని లెక్కించే పద్ధతి మానుకోవాలని, ప్రవేశ ప్రక్రియ వివరాలను బహిరంగంగా అందరికీ వెల్లడించాలని కేంద్రం తెలిపింది.

విద్యా హక్కు చట్టం అమలుపై కార్యాచరణ ప్రణాళిక

ఉచితంగా పుస్తకాలు, యూనిఫాం
ఒకటి నుంచి 8వ తరగతి దాకా పంపిణీ
విద్యా హక్కు చట్టం అమలుపై కార్యాచరణ ప్రణాళిక
రాష్ట్రాల విద్యా కార్యదర్శుల భేటీలో చర్చ
న్యూఢిల్లీ: విద్యా హక్కు చట్టాన్ని అమలుచేయడానికి కేంద్రం తయారుచేసిన కార్యాచరణ ప్రణాళిక(రోడ్‌మ్యాప్‌)ను రాష్ట్రాలు ఆమోదించినట్లయితే.. దేశంలో ఒకటి నుంచి 8వ తరగతి వరకు చదివే ప్రతి విద్యార్థికీ ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అందజేస్తారు. ఇటీవల జరిగిన రాష్ట్రాల విద్యా కార్యదర్శుల సమావేశంలో ఈ రోడ్‌మ్యాప్‌పై చర్చించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం దాని స్వరూపం స్థూలంగా ఇదీ...
  • దేశంలో అదనపు తరగతి గదుల నిర్మాణం-7.8 లక్షలు
  • బాలికల మరుగుదొడ్ల నిర్మాణం-7 లక్షలు
  • వచ్చే ఐదేళ్లలో కేంద్రం చేసే ఖర్చు-రూ.1.71 లక్షల కోట్లు
  • ప్రతి విద్యార్థికీ ఏటా యూనిఫాంపై చేసే ఖర్చు - రూ.400 (యూనిఫాంలను రాష్ట్రాలే అందజేయాలి)
  • పాఠ్యపుస్తకాల పంపిణీ- ఉచితంగానే
  • ప్రత్యేక శ్రద్ధ అవసరమైన విద్యార్థిపై ఏటా చేసే ఖర్చు-రూ.3వేలు
  • తీవ్ర అంగవైక్యలం ఉన్న విద్యార్థులకు ఇంట్లోనే చదువు నేర్పించడానికి చేసే ఖర్చు - రూ.10వేలు
  • ప్రతి 30 మంది విద్యార్థులకు ఓ ఉపాధ్యాయుడు ఉండాలంటే అదనంగా అవసరమైన టీచర్లు - 5.1 లక్షలు
  • మొత్తం కేటాయింపుల్లో ఉపాధ్యాయుల వేతనాలపై చేసే ఖర్చు-28 శాతం
  • పౌర సంబంధ పనులపై చేసే ఖర్చు- 24 శాతం
  • బడిలో చేరిన విద్యార్థులపై చేసే వ్యయం- 17 శాతం
  • పాఠశాల వెలుపల ఉండే విద్యార్థులకు శిక్షణపై వ్యయం - 9 శాతం
  • పాఠశాల సౌకర్యాలపై చేసే ఖర్చు- 8 శాతం
  • అందరికీ సమానంగా విద్యావకాశాలు కల్పించడానికి ఖర్చు - 6 శాతం
  • వచ్చే ఐదేళ్లలో శిక్షణ పొందే ఉపాధ్యాయులు - 7.6 లక్షలు
  • ఒక్కో తరగతి గదికి ఒక్కో టీచరుండాలి
  • నీటిసౌకర్యం కల్పించాల్సిన పాఠశాలలు-3.4 లక్షలు
ఆధారము: ఈనాడు.

విద్యాహక్కు నియమావళి

సర్కారీ సీట్లు లేకుంటేనే ప్రైవేటు విద్య
నేరుగా చేరితే విద్యాహక్కు వర్తించదు
చట్టం అమల్లో రాష్ట్రం మెలిక
నియమావళిని విడుదల చేసిన విద్యాశాఖ
28లోగా అభిప్రాయాలు తెలపాలని ప్రజలకు సూచన
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లన్నీ భర్తీ అయిన తర్వాత వచ్చే విద్యార్థులకుమాత్రమే ప్రైవేటు పాఠశాలల్లో 25% రిజర్వేషన్లను అమలుజేస్తామని రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. తల్లిదండ్రులు తమ పిల్లలను నేరుగా ప్రైవేటు పాఠశాలల్లో చేరిస్తే వారికి విద్యాహక్కు చట్టం వర్తించదని స్పష్టం చేసింది. అలా చేరిన వారికి ప్రభుత్వం బోధనా ఫీజును చెల్లించదని పేర్కొంది. చట్టాన్ని అనుసరించి ప్రైవేటు పాఠశాలల్లో చేరిన ఒక్కో విద్యార్థికి రూ.550 ఖర్చవుతుందని అధికారులు అంచనా వేసిన సంగతి తెలిసిందే. చట్టం అమలుకు ప్రత్యేక కమిటీ రూపొందించిననియమాలను ప్రాథమిక, మాధ్యమిక విద్యాశాఖ మంత్రులు అహ్మదుల్లా, మాణిక్యవరప్రసాదరావు సోమవారం ఇక్కడ వెల్లడించారు. ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశాలు ముగిసి, తరగతులు ప్రారంభమైన ప్రస్తుతపరిస్థితుల్లో నియమావళిని విడుదల చేయడంపై విలేకర్లు మంత్రులను ప్రశ్నించారు. తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామని వారు బదులిచ్చారు. ప్రైవేటు పాఠశాలల్లో 25% రిజర్వేషన్‌ విధానాన్ని అమలుచేస్తే ప్రభుత్వ పాఠశాలల మనుగడ ప్రశ్నార్థకమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నట్లు రాజీవ్‌ విద్యా మిషన్‌ ప్రాజెక్టు సంచాలకులు మహమ్మద్‌ అలీ రఫత్‌ చెప్పారు.
ఇవీ నియమాలు
  • ఎయిడెడ్‌, అన్‌ఎయిడెడ్‌, ప్రత్యేక కేటగిరీ పాఠశాలలు ఒకటో తరగతిలో 25% సీట్లను పేద, వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలతో భర్తీ చేయాలి. అందుకయ్యే ఖర్చును నిబంధనలకు లోబడి ప్రభుత్వమే చెల్లిస్తుంది
  • అనాధలు, హెచ్‌ఐవీ బాధితులు, వికలాంగులకు ఐదు శాతం; ఎస్సీలకు 10, ఎస్‌టీలకు 4, వార్షికాదాయం రూ.60 వేలు లోపున్న బీసీ, మైనార్టీ, ఓసీ విద్యార్థులకు ఆరు శాతం సీట్లను కేటాయించారు
  • ప్రభుత్వం గుర్తింపు లేకుండా ఎవరూ పాఠశాలను ఏర్పాటు చేయకూడదు
  • ఇప్పటికే నడుస్తున్న పాఠశాలల్లో నిర్దేశించిన సౌకర్యాలు లేకుంటే చట్టం అమల్లోకి వచ్చిన మూడేళ్ల లోపు వాటిని సొంత ఖర్చులతో ఏర్పాటు చేయాలి. లేకుంటే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తారు
  • ప్రైవేటు అన్‌ఎయిడెడ్‌ పాఠశాలలు తప్పించి మిగిలిన అన్ని పాఠశాలలుస్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో యాజమాన్య సంఘాన్ని ఏర్పాటు చేయాలి. దీనికి గ్రామ సర్పంచి ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు
  • యాజమాన్య సంఘం సంబంధిత పాఠశాల పనితీరును సమీక్షించడం, అభివృద్ధి ప్రణాళిక రూపకల్పన తదితర విధులు నిర్వర్తిస్తుంది
  • ఉపాధ్యాయుల ఫిర్యాదుల పరిష్కారానికి మండల, జిల్లా స్థాయిలోనూ కమిటీలను ఏర్పాటు చేస్తారు
  • సెప్టెంబరు చివరినాటికి అన్ని పాఠశాలలు ప్రాథమిక స్థాయిలో 1:30, ప్రాథమికోన్నతస్థాయిలో 1:35 వంతున ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తిని అమలుచేయాలి
  • ఉపాధ్యాయుల ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీచేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి
  • ఎనిమిదో తరగతి పూర్తిచేసిన విద్యార్థులకు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రాథమిక విద్య పూర్తయినట్లు ధ్రువీకరణపత్రం ఇవ్వాలి
  • బాలల విద్యా హక్కుల పరిరక్షణకుగాను విద్యాహక్కు సంరక్షణ సంస్థను సెప్టెంబరులో ఏర్పాటుచేయాలి
  • చట్టం అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి తగిన సలహాలు ఇచ్చేందుకు ఓ సలహా సంఘాన్ని ఏర్పాటు చేయాలి
పై నిబంధనలపై ప్రజలు తమ అభిప్రాయాలను, సూచనలను ఈనెల 28 లోగా apssahyd@yahoo.co.in వెబ్‌సైట్‌ లేదా Fax :04023299089ద్వారా తెలియజేయవచ్చు. అధికారి, రాజీవ్‌ విద్యామిషన్‌ రాష్ట్ర ప్రాజెక్ట్‌ కార్యాలయం, ఎస్‌ఐఎంఏటీ బిల్డింగ్‌, ఎస్‌సీఈఆర్‌టీ క్యాంపస్‌, ఎల్బీ స్టేడియం ఎదురుగా, హైదరాబాద్‌-500 001 చిరునామాకు రాతపూర్వకంగా కూడా పంపొచ్చు.

విద్యా హక్కు చట్టం నిబంధనలకు అనుగుణంగా పాఠశాలలలో ప్రవేశాలు (అడ్మిషన్లు)

దేశమంతటా, పాఠశాలలలో ప్రవేశాలకు (అడ్మిషన్లకు) సంబంధించిన విధానాలు, బాలల నిర్బంధ ఉచిత విద్యా హక్కు చట్టం -2009 ( ఆర్ టి ఇ ) నిబంధనలకు అనుగుణంగా వుండేలా చూడడానికి బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ ( ఎన్ సి పి సి ఆర్ ) అనేక రకాల చర్యలను తీసుకుంటున్నది. మాధ్యమిక స్ధాయి విద్యలో ప్రవేశాల విషయంలో ఎలాంటి వడబోత ( స్క్రీనింగ్ ) వుండకూడదని విద్యాహక్కు చట్టం నిర్దేశిస్తున్నప్పటికి, కొన్ని రాష్ట్రాలలో పాఠశాలలు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తుండడంతో, ఎన్ సి పి సి ఆర్ ఇలాంటి చర్యలు చేపట్టవలసిన అవసరం ఏర్పడింది.
పాఠశాలలలో సంబంధించిన విధానాలు, విద్యా హక్కు చట్టానికి లోబడి వుండేవిధంగా చూడడంకోసం ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయాలంటూ ఎన్‌ సి పి సి ఆర్ ఏప్రిల్ లో అన్ని రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు (ఛీఫ్ సెక్రటరీలకు) లేఖలు వ్రాసింది. దేశ రాజధాని ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వ(గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీ---జి ఎన్ సి టి డి) విద్యాశాఖ సంచాలకుల కార్యాలయం (డైరెక్టరేట్) నిర్వహణలోని రాజకీయ ప్రతిభా వికాస్ విద్యాలయాలలో ఆరవ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ, ఆ సంచాలకుల కార్యాలయం మార్చిలో జారీ చేసిన ఒక ప్రకటన ఎన్‌ సి పి సి ఆర్ ఇలా లేఖలు వ్రాయడానికి కారణమైంది.
జి ఎన్ సి టి డి విద్యా శాఖ సంచాలకుల కార్యాలయం, అన్ని ప్రముఖ వార్తా పత్రికలలోను, సంచాలకుల కార్యాలయ వెబ్ సైట్ లోను జారీచేసిన ఆ ప్రకటన, తమ పాఠశాలలలో ఆరవ తరగతిలో చేరాలనుకునే విద్యార్థులు ఒక్కొక్క దరఖాస్తు ఫారాన్ని ` 25 వంతున కొని, దరఖాస్తు చేసుకోవాలని; ఆ తరువాత ప్రవేశ పరీక్ష వ్రాయాలని నిర్దేశిస్తున్నది. అయితే, ఏ రకమైన ఎంపిక పరీక్ష పద్ధతి ( స్క్రీనింగ్ ) వుండకూడదని , కేవలం అప్పటి పరిస్థితికి అనువైన రీతిలో యాదృచ్ఛికంగా( రాండమ్) మాత్రమే విద్యార్థుల ఎంపిక జరపాలని ఆర్ టి ఇ చట్టం నిర్దేశిస్తుండడంతో, సంచాలకుల కార్యాలయం జారీచేసిన ప్రకటన, ఆర్ టి ఇ చట్టాన్ని కచ్చితంగా ఉల్లంఘించడమే అవుతుంది.
ఆర్ టి ఇ చట్టం అమలును పర్యవేక్షించే కేంద్రీయ సంస్థ అయిన ఎన్ సి పి సి ఆర్, ఆ ప్రకటనను వెనుకకు తీసుకోవలసిందిగా, దానికి బదులుగా, విద్యా హక్కు చట్టం నిబంధనలకు అనుగుణమైన రీతిలో ప్రకటనను జారీచేయవలసిందిగా కోరుతూ, జి ఎన్ సి టి డి , విద్యా విభాగం ముఖ్య కార్యదర్శికి లేఖ వ్రాసింది. జి ఎన్ సి టి డి నిర్వహణలోని మిగతా అన్ని పాఠశాలలుకూడా, ఆర్ టి ఇ చట్టం అమలులో తాము అనుసరిస్తున్న పద్ధతులను తగినరీతిలో సవరించుకోవడానికి వీలుగా, ఆ చట్టం నిబంధనలను వివరిస్తూ వారంలోగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయాలని కూడా ఆ లేఖలో కోరడం జరిగింది.
అయితే, ఎన్ సి పి సి ఆర్ సూచనను పాటించడానికి జి ఎన్ సి టి డి సంచాలకుల కార్యాలయం నిరాకరించడంతో, కమిషన్ తాఖీదు పంపి సంచాలకుల కార్యాలయం అధికారులను పిలిపించుకుని, పాఠశాలలలో ప్రవేశాలను ఆర్ టి ఇ చట్టం నిబంధనలకు అనుగుణంగా తిరిగి జరపవలసిందేనని నిర్దేశించి, జులై వరకు గడువు ఇచ్చింది. ఇతర రాష్ట్రాలలో కూడా ఆర్ టి ఇ చట్టం ఈ రకమైన ఉల్లంఘనలకు గురికాకుండా చూడడంకోసం, చట్ట నిబంధనలను వివరిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయవలసిందిగా అన్ని రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు కమిషన్ లేఖలు వ్రాసింది. పాఠశాలలకు జారీచేసే ప్రభుత్వ ఉత్తర్వులలో ఈ క్రింది అంశాలను స్పష్టంగా పేర్కొనాలని కమిషన్ నిర్దేశించింది:
  1. ఆర్ టి ఇ చట్ట నిబంధనలకు అనుగుణంగా ప్రవేశాల పద్ధతులను రూపొందించుకోవాలి
  2. నిర్దిష్ట వర్గీకరణ " ( స్పెసిఫైడ్ క్యాటగిరి ) కి సంబంధించిన అన్ని పాఠశాలలలోను, ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలలలోను బలహీన వర్గాల విద్యార్థులకు 25 % సీట్లు తప్పనిసరిగా కేటాయించాలి ; ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు అవి అనుసరించవలసిన ప్రత్యేకింపు (రిజర్వేషన్) నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి.
ఇంతేకాకుండా, ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలలను కూడా కనిపెట్టి, విద్యా హక్కు చట్టం నిబంధనలను గురించి, వాటి పరిసరాలలోని విద్యార్థులను పాఠశాలలో చేర్చుకునే విషయంలో అనుసరించవలసిన విధానాలను గురించి వాటికి నోటీసులు జారీ చేయాలనికూడా కమిషన్ నిర్దేశించింది. విద్యా హక్కు చట్టం పై రాష్ట్రాల నిబంధనల ఖరారు త్వరలో పూర్తికావాలని కూడా కమిషన్ పేర్కొన్నది.
ఆర్ టి ఇ చట్టంలో, " నిర్దిష్ట వర్గీకరణ " ( స్పెసిఫైడ్ క్యాటగిరి ) కి సంబంధించిన పాఠశాలలుగా పేర్కొన్న నవోదయ పాఠశాలల విషయంలో ఏ విధానాన్ని అనుసరించాలన్న ప్రశ్నకు సమాధానంగా, ఆర్ టి ఇ చట్టంలోని 13 వ విభాగం (సెక్షన్‌) లో పొందుపరచిన నిబంధనలు ఎలాంటి మినహాయింపులేకుండా అన్ని పాఠశాలలకు వర్తిస్తాయని కమిషన్ స్పష్టీకరించింది.
విద్యా హక్కు చట్టం 13వ విభాగం (సెక్షన్‌) లోని సంబంధిత అంశాలు :
" పిల్లలను పాఠశాలలో చేర్చుకునే సమయంలో ఏ పాఠశాల అయినా లేదా ఏ వ్యక్తి అయినా ఏ రకమైన తలసరి రుసుం (క్యాపిటేషన్ ఫీజు) వసూలుచేయకూడదు. ఆ పిల్లలకు లేదా వారి తలిదండ్రులకు లేదా సంరక్షకులకు ఎలాంటి ఎంపిక పరీక్ష ( స్క్రీనింగ్ ) పెట్టకూడదు "
  • సబ్ సెక్షన్-1 లోని ఈ నిబంధనను ఉల్లంఘించి ఏదైనా పాఠశాల లేదా వ్యక్తి తలసరి రుసుం వసూలుచేస్తే,
ఎ ) వారికి ఆ తలసరి రుసుం కు పదిరెట్లు జరిమానా శిక్షగా విధించబడుతుంది.
బి ) పాఠశాలలో చేరగోరె పిల్లలను ఏదైనా ఎంపిక పరీక్షకు గురిచేస్తే, ఆ విధంగా మొదటిసారి నిబంధన ఉల్లంఘించినందుకు ` 25, 000, ఆ తర్వాత ప్రతి ఉల్లంఘనకు ` 50, 000 వంతున జరిమానా శిక్షగా విధించబడుతుంది.
ఆధారము: NCPCR

నవోదయ పాఠశాలలలో ప్రవేశానికి ఎలాంటి ఎంపిక పరీక్ష వుండకూడదు

ప్రాథమిక విద్యా తరగతులలో ( 1 వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ) చేరగోరె బాలలకు ఎలాంటి ఎంపిక పరీక్ష నిర్వహించకూడదని బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ ( ఎన్ సి పి సి ఆర్ ) నవోదయ పాఠశాలల కమిషనర్‌కు, రాష్ట్రాల విద్యా శాఖ కార్యదర్శులకు లేఖలు వ్రాసింది. ఢిల్లీలోను, కొన్ని ఇతర రాష్ట్రాలలోను నవోదయ పాఠశాలలు విద్యార్థులకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నాయంటూ ఫిర్యాదులు అందడంతో, ఆర్ టి ఇ నిబంధనల ఉల్లంఘన జరిగిందేమో నిర్ధారించుకోవడానికి ఎన్ సి పి సి ఆర్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నది.
ఆర్ టి ఇ చట్టం 13 వ విభాగంలోని నిబంధనలను పేర్కొంటూ, పిల్లలను పాఠశాలలో చేర్చుకునే సమయంలో ఏ పాఠశాల అయినా లేదా ఏ వ్యక్తి అయినా ఏ రకమైన తలసరి రుసుంను వసూలుచేయడాన్ని, ఆ పిల్లలకు లేదా వారి తలిదండ్రులకు లేదా సంరక్షకులకు ఎలాంటి ఎంపిక పరీక్ష ( స్క్రీనింగ్ ) పెట్టడాన్ని చట్టం నిషేధించిన విషయాన్ని ఎన్ సి పి సి ఆర్ ఎత్తిచూపింది. ఏదైనా పాఠశాల లేదా వ్యక్తి తలసరి రుసుం వసూలుచేస్తే, వారు ఆ తలసరి రుసుం కు పదిరెట్లు జరిమానాతో శిక్షించబడతారని కూడా ఎన్ సి పి సి ఆర్ స్పష్టంచేసింది.
పాఠశాలలో చేరగోరె పిల్లలను ఏదైనా ఎంపిక పరీక్షకు గురిచేస్తే, ఆ విధంగా మొదటిసారి నిబంధన ఉల్లంఘించినందుకు ` 25, 000, ఆ తర్వాత ప్రతి ఉల్లంఘనకు ` 50, 000 వంతున జరిమానా విధింపబడుతుంది.
ఆర్ టి ఇ చట్టంలో ప్రత్యేక వర్గీకరణ పాఠశాలలుగా పేర్కొనబడిన నవోదయ పాఠశాలలతో సహా, అన్ని పాఠశాలలకు 13 వ విభాగం వర్తిస్తుందని, నవోదయ పాఠశాలలు నిర్వహించే ఎంపిక పరీక్షలు ఆర్ టి ఇ చట్టాన్ని ఉల్లంఘించడమేనని కూడ ఎన్ సి పి సి ఆర్ స్పష్టంచేసింది. పాఠశాలలు తాము అనుసరిస్తున్న పద్ధతులను, నిబంధనలను వారంలోగా తగిన విధంగా మార్చుకునేలా, చట్టంలోని నిబంధనలను వివరిస్తూ అన్ని పాఠశాలలకు ఉత్తర్వులు జారీచేయాలని ఎన్ సి పి సి ఆర్ రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.
ఆధారము: NCPCR

విద్యా హక్కు బాధ్యత రాజీవ్‌ విద్యా మిషన్‌కు అదనంగా రూ.665 కోట్ల నిధులు 20వేల మంది టీచర్ల సర్దుబాటు? 70 లక్షల మంది విద్యార్థులకు దుస్తులు

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: విద్యా హక్కు చట్టం పర్యవేక్షణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం రాజీవ్‌ విద్యా మిషన్‌కు అప్పగించింది. ఇందుకోసం దాని కార్యకలాపాల గడువును మరో రెండేళ్లు పొడిగించింది. వాస్తవానికి ప్రాథమిక విద్య బలోపేతానికి 2001-02లో ప్రారంభమైన రాజీవ్‌ విద్యా మిషన్‌ గడువు 2010తో ముగియాల్సి ఉంది. విద్యా హక్కు చట్టం అమలు కోసం ఇప్పుడు రెండేళ్ల పొడిగింపు లభించింది. ఆ తర్వాతా పొడిగింపు లభించే అవకాశముంది. ఎందుకంటే 2015 వరకూ విద్యా హక్కు చట్ట పర్యవేక్షణ బాధ్యతను రాజీవ్‌ విద్యా మిషన్‌ చూడాల్సి ఉంది. ఈ విషయాన్ని ప్రాథమిక విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి చందనాఖన్‌ తెలిపారు.
రాజీవ్‌ విద్యా మిషన్‌కు 2010-11 ఆర్థిక సంవత్సరానికి రూ.1100 కోట్లను కేటాయించారు. తాజాగా విద్యా హక్కు చట్టం అమలుకు సంబంధించి మరో రూ.660 కోట్లు కేంద్రం నుంచి పొందాలని ప్రాథమిక విద్యాశాఖ ప్రతిపాదనలను రూపొందించింది.
విద్యా హక్కు చట్టం అమలులో భాగంగా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల సర్దుబాటు, ఉచితంగా రెండు జతలదుస్తుల పంపిణీ వంటి చర్యలకు సంబంధించిన దస్త్రాల పరిశీలనలో ప్రభుత్వం నిమగ్నమైంది. ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి 30మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 35 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు వంతున సర్దుబాటు చేయాలి. దీని ప్రకారం సుమారు 20వేల మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాల్సి ఉంటుందని అధికారులు అంచనాలు సిద్ధం చేశారు. ఇవి ప్రాథమిక విద్యాశాఖ నుంచి మాథ్యమిక విద్యాశాఖ అధికారులకు అందాయి. ఈ చర్యలకు ఉపక్రమించే ముందు న్యాయపరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనిపై త్వరలో మంత్రి సమీక్షించనున్నారు.
జనవరిలో ఉచిత దుస్తులు: మరోవైపు ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదివే విద్యార్థులకు (సుమారు 70లక్షల మంది) రెండు జతల యూనిఫాం ఇవ్వనున్నారు. జతకు రూ.200 వంతున వ్యయం చేయనున్నారు. ప్రభుత్వ సంస్థల ద్వారా వీటిని కొనుగోలు చేయాలని అధికార వర్గాలు భావిస్తున్నాయి. పరిస్థితులు అనుకూలిస్తే వచ్చే ఏడాది జనవరి నుంచి విద్యార్థులకు రెండు జతల దుస్తులను అందజేస్తామని చందనాఖన్‌ 'న్యూస్‌టుడే'కు చెప్పారు.
ముఖ్యమంత్రి కార్యాలయానికి కీలక దస్త్రాలు: బాలల హక్కులను పర్యవేక్షించేందుకు 'రైట్‌ టూ ఎడ్యుకేషన్‌ ప్రొటెక్షన్‌ అథారిటీ'ని ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన దస్త్రాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి అధికారులు పంపారు. అథారిటీ బాధ్యతలను హైకోర్టు న్యాయమూర్తితో సమానమైన విద్యావేత్తకు అప్పగించాలని నిబంధనలు చెబుతున్నాయి. ప్రభుత్వపరంగా ఇందుకు సంబంధించిన నియామకం జరగనుంది. మరోవైపు ఈ చట్టం అమలుకు సంబంధించి కేంద్రం ప్రకటించిన ముసాయిదాను అనుసరించి అధికారులు తయారుచేసిన నిబంధనల దస్త్రం ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లింది.
ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు








జాతీయ మానవ హక్కుల కమీషన్



  


జాతీయ మానవ హక్కుల కమీషన్ చట్టబద్దమైన, స్వయం ప్రతిపత్తి సంస్థ, కాని రాజ్యాంగబధ్ధమైన సంస్థ కాదు. "మానవ హక్కుల పరిరక్షణ చట్టం-1993" ప్రకారం జాతీయ మానవ హక్కుల కమీషన్ అక్టోబర్ 12 , 1993 న ఏర్పడింది. కాంగ్రేస్ పార్టీ అధికారంలో పి.వి నరసింహరావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ కమీషన్ ను ఏర్పాటు చేశారు. 1993  మానవ హక్కుల చట్టాన్ని 2006 సంవత్సరంలో సవరించి ఈ  కమీషన్ లో కోన్ని మార్పులు చేశారు.
  • దీన్ని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
  • జాతీయ మానవ హక్కుల కమీషన్ లో ఒక చైర్మన్, నలుగురు ఇతర సభ్యులు ఉంటారు.
సభ్యులకు ఉండవలసిన అర్హతలు: 
  • చైర్మన్ గా నియమించబడే వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన వారై ఉండాలి.
  • ఒక సభ్యుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి గా పనిచేస్తున్న లేదా పదవి విరమణ చేసిన వారై ఉండాలి.
  • మరోక సభ్యుడు ఏదైన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న లేదా పదవి విరమణ చేసిన వారై ఉండాలి.
  • మిగిలిన ఇద్దరు సభ్యులు మానవ హక్కుల రంగంలో పరిజ్ఞానం ఉన్న వారై ఉండాలి











 UPLOAD అవుతుంది.......

Sunday, November 29, 2015

TET Material free download in Telugu

TET -STUDY-MATERIAL-ENGLISH-TELUGU-MEDIUM

  Here we provice DSC 2014-15 (TET cum TRT) SGT (Seconday Grade Teacher)
Study material both Telugu Medium & English Medium from
Sakshi Education to prepare well without referring many books.

General Knowledge
Current Affairs
SGT  Telugu Content
SGT  Telugu Methodology
SGT Biology Content
SGT Biology Methodology
SGT Maths Content
SGT Maths Methodology
Child Development & Pedagogy
English Grammar
English Cont & Methodology
SGT Physical Science Content
SGT Physical Science Methodology
SGT Social content – Geography
SGT Social content – History
SGT Social content – Economics
SGT Social content – Civics
SGT Social Studies Methodology

Tuesday, October 20, 2015

telangana study material pdf

Telangana Geography Study Material for TSPSC Group 1/2/3/4. geography of Telangana state study material books pdf download in telugu




Monday, August 10, 2015

Open School inter text books



Telugu Download

Political sciences Download

Biology Download

  Economics Download

  Physics Vol II Download

Physics Vol III Download


Commerce Download


Mathematics Vol II Download


Mathematics Vol III Download





 Open School inter text books  open inter telangana  open inter results 2015  open inter hall tickets 2014  open inter admissions  ts open inter  open inter hall ticket download 2015  open inter time table 2015  open inter exam date 2015 Inter Text Books - Welcome to ANDHRA PRADESH OPEN Open School tenth and inter text books - Tteachers

Tuesday, July 21, 2015

Telangana 10th Class Telugu Medium Text Books



10th Class Telugu Medium
Telugu Download
Hindi Download
English Download
Maths Download
Phy.Science Download
Bio.Science Download
 Social Download



10th Class English Medium

Tags: Telangana 10th Class Telugu Medium Text Books Telangana SSC Class Telugu Medium Text Books Telangana School Text Books  school textbooks cheap  school text books are only available on cd and dvd  school textbooks for sale  school textbooks online  school Telangana School Text Books  text books for sale  collecting vintage school text books readers  school text books Telangana School Text Books Telangana School Text Books Xth Class Books Download  9Th Class Books Download 8Th Class Books Download 7Th Class Books Download  6Th Class Books Download 5Th Class Books Download 4Th Class Books Download Telugu Medium. 1 to 10 Classes. Telugu · Maths. 8th to 10th Classes. Biology · Physics. 6th & 7th Classes. General Science. 6th to 10th 6th Class Social AP State Board Syllabus Telugu Medium Telugu Online Full HD ... National Crime Records Bureau report – Telangana 2nd top state in farmers

Telangana 9th Class Telugu Medium Text Books


9th Class Telugu Medium
Telugu Download
Hindi Download
English Download
Maths Download
Phy.Science Download
Bio.Science Download
 Social Download


9th Class English Medium
 Tags: Telangana 6th Class Telugu Medium Text Books Telangana School Text Books  school textbooks cheap  school text books are only available on cd and dvd  school textbooks for sale  school textbooks online  school Telangana School Text Books  text books for sale  collecting vintage school text books readers  school text books Telangana School Text Books Telangana School Text Books 10Th Class Books Download  9Th Class Books Download 8Th Class Books Download 7Th Class Books Download  6Th Class Books Download 5Th Class Books Download 4Th Class Books Download Telugu Medium. 1 to 10 Classes. Telugu · Maths. 8th to 10th Classes. Biology · Physics. 6th & 7th Classes. General Science. 6th to 10th 6th Class Social AP State Board Syllabus Telugu Medium Telugu Online Full HD ... National Crime Records Bureau report – Telangana 2nd top state in farmers

Telangana 8th Class Telugu Medium Text Books


8th Class Telugu Medium
Telugu Download
Hindi Download
English Download
Maths Download
Phy.Science Download
Bio.Science Download
 Social Download
 

Tags: Telangana School Text Books  school textbooks cheap  school text books are only available on cd and dvd  school textbooks for sale  school textbooks online  school Telangana School Text Books  text books for sale  collecting vintage school text books readers  school text books Telangana School Text Books Telangana School Text Books 10Th Class Books Download  9Th Class Books Download 8Th Class Books Download 7Th Class Books Download  6Th Class Books Download 5Th Class Books Download 4Th Class Books DownloadTags: Telangana 6th Class Telugu Medium Text Books Telangana School Text Books  school textbooks cheap  school text books are only available on cd and dvd  school textbooks for sale  school textbooks online  school Telangana School Text Books  text books for sale  collecting vintage school text books readers  school text books Telangana School Text Books Telangana School Text Books 10Th Class Books Download  9Th Class Books Download 8Th Class Books Download 7Th Class Books Download  6Th Class Books Download 5Th Class Books Download 4Th Class Books Download Telugu Medium. 1 to 10 Classes. Telugu · Maths. 8th to 10th Classes. Biology · Physics. 6th & 7th Classes. General Science. 6th to 10th 6th Class Social AP State Board Syllabus Telugu Medium Telugu Online Full HD ... National Crime Records Bureau report – Telangana 2nd top state in farmers


Telangana 7th Class Telugu Medium Text Books

7Th Class Telugu Medium
Telugu Download
Hindi Download
English Download
Maths Download
 Science Download
 Social Download


7Th Class English Medium

Tags: Telangana 7th Class Telugu Medium Text Books Telangana School Text Books  school textbooks cheap  school text books are only available on cd and dvd  school textbooks for sale  school textbooks online  school Telangana School Text Books  text books for sale  collecting vintage school text books readers  school text books Telangana School Text Books Telangana School Text Books 10Th Class Books Download  9Th Class Books Download 8Th Class Books Download 7Th Class Books Download  7Th Class Books Download 5Th Class Books Download 7Th Class Books Download Telugu Medium. 1 to 10 Classes. Telugu · Maths. 7th to 10th Classes. Biology · Physics. 6th & 7th Classes. General Science. 6th to 10th 6th Class Social AP State Board Syllabus Telugu Medium Telugu Online Full HD ... National Crime Records Bureau report – Telangana 2nd top state in farmers

Telangana 6th Class Telugu Medium Text Books


6Th Class Telugu Medium
Telugu Download
Hindi Download
English Download
Maths Download
 Science Download
 Social Download



6th Class English Medium


Tags: Telangana 6th Class Telugu Medium Text Books Telangana School Text Books  school textbooks cheap  school text books are only available on cd and dvd  school textbooks for sale  school textbooks online  school Telangana School Text Books  text books for sale  collecting vintage school text books readers  school text books Telangana School Text Books Telangana School Text Books 10Th Class Books Download  9Th Class Books Download 8Th Class Books Download 7Th Class Books Download  6Th Class Books Download 5Th Class Books Download 4Th Class Books Download Telugu Medium. 1 to 10 Classes. Telugu · Maths. 8th to 10th Classes. Biology · Physics. 6th & 7th Classes. General Science. 6th to 10th 6th Class Social AP State Board Syllabus Telugu Medium Telugu Online Full HD ... National Crime Records Bureau report – Telangana 2nd top state in farmers




Monday, July 20, 2015

Telangana 6th Class English Medium Text Books



6Th Class English Medium
Telugu Download
Hindi Download
English Download
Maths Download
 Science Download
 Social Download


6Th Class Telugu Medium



Tags: Telangana School Text Books  school textbooks cheap  school text books are only available on cd and dvd  school textbooks for sale  school textbooks online  school Telangana School Text Books  text books for sale  collecting vintage school text books readers  school text books Telangana School Text Books Telangana School Text Books 10Th Class Books Download  9Th Class Books Download 8Th Class Books Download 7Th Class Books Download  6Th Class Books Download 5Th Class Books Download 4Th Class Books DownloadTelangana 6th Class Telugu Medium Text Books Telangana School Text Books  school textbooks cheap  school text books are only available on cd and dvd  school textbooks for sale  school textbooks online  school Telangana School Text Books  text books for sale  collecting vintage school text books readers  school text books Telangana School Text Books Telangana School Text Books 10Th Class Books Download  9Th Class Books Download 8Th Class Books Download 7Th Class Books Download  6Th Class Books Download 5Th Class Books Download 4Th Class Books Download Telugu Medium. 1 to 10 Classes. Telugu · Maths. 8th to 10th Classes. Biology · Physics. 6th & 7th Classes. General Science. 6th to 10th 6th Class Social AP State Board Syllabus Telugu Medium Telugu Online Full HD ... National Crime Records Bureau report – Telangana 2nd top state in farmers