సోషల్ సైన్సెస్
1. భారతదేశంలో దీర్ఘకాలంగా ఇంచు మించు శూన్యంగా వున్న ప్రాంతం ఏది? - లడక్
2. శీతాకాలపు అత్యల్ప పగటి ఉష్ణోగ్రత ఎక్కడ నమోదు అయింది?
- శ్రీనగర్
3. పర్వత ప్రాంత శీతోష్ణస్థితి ప్రాంతం ఎచ్చట వున్నది? - ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్‌లోని రాష్ట్ర
ఉత్తర భాగాలు.
4.
స్టెప్పీ రకపు శీతోష్ణస్థితి ప్రాంతం ఎచ్చట వున్నది? - రాజస్థాన్ తూర్పు
తీర ప్రాంతం, దక్షిణ పంజాబ్, గుజరాత్‌లోని ఉత్తర చివరభాగం.
5. ఆర్ధ్ర ఉష్ణమండల శీతోష్ణస్థితి ఎచ్చట వున్నది?
- కలకత్తా, పాట్నా. లక్నో ప్రాంతాలు.
6. ఆయనరేఖ ప్రాంత అడవుల శీతోష్ణస్థితి ఎచ్చట వుంది? - అస్సాం, అరుణాచ ల్‌ప్రదేశ్, మేఘాలయ, మహారాష్ట్రలోని పశ్చిమప్రాంతం
7. వాతావరణ స్థితి అంటే ...
- రోజుకిగాని, కొన్ని దినాలకుగాని సంబంధించిన శీతోష్ణస్థితి అంశాలను సూచిస్తే దానిని వాతావరణ స్థితి అంటారు.
8. సముద్రమట్టం నుండి ఎత్తుకు వెళ్ళే కొలది ఏ మేరకు ఉష్ణోగ్రత తగ్గుతూ వుంటుంది?
- సముద్ర మట్టం నుండి ప్రతి వెయ్యి అడుగులకు 3.3. చొప్పున ఉష్ణోగ్రత తగ్గుతుంది.
9. ఉష్ణోగ్రత విలోమత అంటే ఏమిటి?
-
ఒక్కొక్కప్పుడు భూమికి సమీపంలో వున్న గాలి చల్లగా వుండి, ఎత్తుగా వున్న
ప్రదేశాల్లో గాలివేడిగా వుండటాన్ని ఉష్ణోగ్రత విలోమత అంటారు.
10. సమభారరేఖలు అని వేనిని అంటారు?
- సమాన వాతావరణ పీడనం వున్న ప్రదేశాలన్నింటిని కలుపుతూ గీసిన రేఖలను సమభారరేఖలు అంటారు.
11. సమవర్షపాత రేఖలని వేటిని అంటారు?
- సమ వర్షపాతర వున్న వివిధ ప్రాంతాలను కలిపే ఊహారేఖలను సమవర్షపాత రేఖలంటారు.
12. నేల అని దేనిని పరిగణించవచ్చు?
- భూమి ఉపరితలంమీద ఉన్న పలు చని పొరను (ముఖ్యంగా 25 సెం.మీ. నుండి 35 సెం.మీ. నేలగా పరిగణించ వచ్చు)
13. భారతదేశంలో వున్న నేలలను ఎన్ని వర్గాలుగా విభజించారు?
-
ఎనిమిది. (1- ఒండ్రుమట్టినేలలు, 2-ఎడారినేలలు, 3-క్షార సంబంధ మైన (చవిటి)
నేలలు, 4-ఇసుక నేలలు, 5-నల్లరేగడినేలలు,6.ఎర్ర నేలలు, 7. రాతి నేలలు, 8.
కొండ నేలలు.
14. నేలలు అధ్యయనశాస్త్రాన్ని ఏమంటారు?
- ఐడాలజి
15. గంగా, సింధూనది మైదానాలలోని నేలలను ఎన్ని రకాలుగా విభజించారు?
- నాలుగు (1- ఒండ్రుమట్టినేలలు, 2- క్షార సంబంధమైన (చవిటి)నేలలు, 3- ఎడారినేలలు, 4-ఇసుకనేలలు)
16. ఎర్రనేలలు ఎక్కడ ఎక్కువగా వున్నాయి?
- తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలోని ఆగేయ ప్రాంతం, ఆంధ్రప్రదేశ్‌లోని ఈశాన్య ప్రాంతం
17. ఎర్రనేలలు ఏ శిలలు శిథిలం అవటం వల్ల ఏర్పడినాయి? - ఇన్-సిటా
18. నల్లరేగడి నేలలు ఎచ్చట వున్నాయి?
- మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, మధ్య ప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, తమిళ నాడు, ఉత్తరప్రదేశ్
19. ఏ శిలలు శిథిలం కావటం వల్ల నల్ల రేగడి నేలలు ఏర్పడతాయి? - బెసాల్ట్
20. నల్లరేగడి నేలలు ఏ పంటకు శ్రేష్టమై నవి? - ప్రత్తి, గోధుమ