సోషల్ సైన్సెస్
1. భారతదేశంలో దీర్ఘకాలంగా ఇంచు మించు శూన్యంగా వున్న ప్రాంతం ఏది? - లడక్
2. శీతాకాలపు అత్యల్ప పగటి ఉష్ణోగ్రత ఎక్కడ నమోదు అయింది?
- శ్రీనగర్
3. పర్వత ప్రాంత శీతోష్ణస్థితి ప్రాంతం ఎచ్చట వున్నది? - ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్‌లోని రాష్ట్ర
ఉత్తర భాగాలు.
4. స్టెప్పీ రకపు శీతోష్ణస్థితి ప్రాంతం ఎచ్చట వున్నది? - రాజస్థాన్ తూర్పు తీర ప్రాంతం, దక్షిణ పంజాబ్, గుజరాత్‌లోని ఉత్తర చివరభాగం.
5. ఆర్ధ్ర ఉష్ణమండల శీతోష్ణస్థితి ఎచ్చట వున్నది?
- కలకత్తా, పాట్నా. లక్నో ప్రాంతాలు.
6. ఆయనరేఖ ప్రాంత అడవుల శీతోష్ణస్థితి ఎచ్చట వుంది? - అస్సాం, అరుణాచ ల్‌ప్రదేశ్, మేఘాలయ, మహారాష్ట్రలోని పశ్చిమప్రాంతం
7. వాతావరణ స్థితి అంటే ...
- రోజుకిగాని, కొన్ని దినాలకుగాని సంబంధించిన శీతోష్ణస్థితి అంశాలను సూచిస్తే దానిని వాతావరణ స్థితి అంటారు.
8. సముద్రమట్టం నుండి ఎత్తుకు వెళ్ళే కొలది ఏ మేరకు ఉష్ణోగ్రత తగ్గుతూ వుంటుంది?
- సముద్ర మట్టం నుండి ప్రతి వెయ్యి అడుగులకు 3.3. చొప్పున ఉష్ణోగ్రత తగ్గుతుంది.
9. ఉష్ణోగ్రత విలోమత అంటే ఏమిటి?
- ఒక్కొక్కప్పుడు భూమికి సమీపంలో వున్న గాలి చల్లగా వుండి, ఎత్తుగా వున్న ప్రదేశాల్లో గాలివేడిగా వుండటాన్ని ఉష్ణోగ్రత విలోమత అంటారు.
10. సమభారరేఖలు అని వేనిని అంటారు?
- సమాన వాతావరణ పీడనం వున్న ప్రదేశాలన్నింటిని కలుపుతూ గీసిన రేఖలను సమభారరేఖలు అంటారు.
11. సమవర్షపాత రేఖలని వేటిని అంటారు?
- సమ వర్షపాతర వున్న వివిధ ప్రాంతాలను కలిపే ఊహారేఖలను సమవర్షపాత రేఖలంటారు.
12. నేల అని దేనిని పరిగణించవచ్చు?
- భూమి ఉపరితలంమీద ఉన్న పలు చని పొరను (ముఖ్యంగా 25 సెం.మీ. నుండి 35 సెం.మీ. నేలగా పరిగణించ వచ్చు)
13. భారతదేశంలో వున్న నేలలను ఎన్ని వర్గాలుగా విభజించారు?
- ఎనిమిది. (1- ఒండ్రుమట్టినేలలు, 2-ఎడారినేలలు, 3-క్షార సంబంధ మైన (చవిటి) నేలలు, 4-ఇసుక నేలలు, 5-నల్లరేగడినేలలు,6.ఎర్ర నేలలు, 7. రాతి నేలలు, 8. కొండ నేలలు.
14. నేలలు అధ్యయనశాస్త్రాన్ని ఏమంటారు?
- ఐడాలజి
15. గంగా, సింధూనది మైదానాలలోని నేలలను ఎన్ని రకాలుగా విభజించారు?
- నాలుగు (1- ఒండ్రుమట్టినేలలు, 2- క్షార సంబంధమైన (చవిటి)నేలలు, 3- ఎడారినేలలు, 4-ఇసుకనేలలు)
16. ఎర్రనేలలు ఎక్కడ ఎక్కువగా వున్నాయి?
- తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలోని ఆగేయ ప్రాంతం, ఆంధ్రప్రదేశ్‌లోని ఈశాన్య ప్రాంతం
17. ఎర్రనేలలు ఏ శిలలు శిథిలం అవటం వల్ల ఏర్పడినాయి? - ఇన్-సిటా
18. నల్లరేగడి నేలలు ఎచ్చట వున్నాయి?
- మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, మధ్య ప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, తమిళ నాడు, ఉత్తరప్రదేశ్
19. ఏ శిలలు శిథిలం కావటం వల్ల నల్ల రేగడి నేలలు ఏర్పడతాయి? - బెసాల్ట్
20. నల్లరేగడి నేలలు ఏ పంటకు శ్రేష్టమై నవి? - ప్రత్తి, గోధుమ
21. నల్లరేగడి నేలలు దేశం మొత్తంమీద ఎంతమేరకు వ్యాపించి వున్నవి?
- 4,46,000 చ.కి.మీ.
22. భారతదేశంలో నల్లరేగడి నేల ఏ దేశపు నల్లరేగడి నేలతో సరితూగుతుంది?
- అమెరికా సంయుక్త రాష్ట్రాలు- అరిజోనా)
23. ఒండ్రునేలలు ఎచ్చట వున్నాయి?
- అస్సాం నుండి పంజాబ్ వరకు గంగా, సింధుమైదాన ప్రాంతంలో, తూర్పుతీర ప్రాంతంలో ఎక్కువగా వున్నాయి.
24. ఎర్ర రాతి నేలలు ఎక్కడ వున్నాయి?
- మహారాష్ట్ర, కర్ణాటక, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో
25. అధిక స్థాయి ఎర్రరాతినేలలు ఎక్కడ వుంటాయి?
- భూగర్భంలో బాక్సైట్ నిల్వ వున్న ప్రదేశాలలో
26. అధిక స్థాయి ఎర్రరాతినేలలు ఏ పంటకు అనువైనవి? - చిరుధాన్యాలు
27. ఎడారి నేలలు ఎచ్చట వున్నాయి?
- ఆరావళి పర్వతాలకు సింధునది లోయకు మధ్యవున్న ప్రాంతం
28. ఏ నేలలో క్షారగుణాలు అధికంగా వుంటాయి? - చవిటినేలల్లో
29. హిమాలయ పర్వత ప్రాంతపు నేలలు ఎన్ని రకాలుగా విభజించవచ్చు?
మూడు (1-పర్వతాలకు దిగువనున్న నేల (లేదా) టెరైనేల, 2-పర్వతాల మీద నున్న నేలలు, 3-సున్నపురాయి డోలమైట్ నేలలు)
30. ముస్సోరి నైనిటాల్ పర్వత ప్రాంతాల్లో ఏ రకపు నేలలు వున్నాయి?
- సున్నపురాయి డోలమైట్ నేలలు.
31. నేలలో భూసారం ఎంత లోతు వరకు వుంటుంది?- 15 సెం.మీ. నుండి 30 సెం.మీ. లోతు వరకు
32. ఒండ్రునేలలు అతి తక్కువ వున్న రాష్ట్రం ఏది? - మధ్యప్రదేశ్
33. చిత్తడి నేలలు ఎచ్చట గలవు?
- ఒరిస్సా తీరప్రాంతం, పశ్చిమబెంగాల్ లోని సుందరవన ప్రాంతం, ఉత్తర బీహార్, తమిళనాడు తీరపు ఆగేయ ప్రాంతం
34. మనదేశంలో మృత్తిక క్షయానికి ప్రధాన కారణం ఏమిటి?
- అధిక వర్షపాతం ఫలితంగా వచ్చే వరదలు.
35. మృత్తిక క్షయం ఏ రాష్ట్రంలో ఎక్కువగా వున్నది? - మధ్యప్రదేశ్, బీహార్, తమిళనాడు, పంజాబ్, మహారాష్ట్రల లోని కొన్ని ప్రాంతాలు.
36. మృత్తికక్షయం ఎన్ని రకాలుగా జరుగు తుంది? - రెండు. 1.పొర క్రమక్షయం, 2.గంట్ల క్రమక్షయం
37. పొర క్రమక్షయం ఏఏ రాష్ట్రాలలో వున్నది? -అస్సాం, ఉత్తరప్రదేశ్, బీహార్
38. గంట్ల క్రమక్షయం ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా వున్నది?
- బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్
39. లేట్రైట్ నేలలు ఎట్లు ఏర్పడతాయి?
- ఎక్కువ వర్షపాతం కలిగిన ప్రాంతాల్లో, శిలలు శైధిల్యం చెంది ఇనుము, అల్యూమినియం హైడ్రేట్ శేష పదార్ధంగా లేట్రైట్ నేలలు ఏర్పడతాయి.
40.లేట్రైట్ నేలలు ఏ పంటలకు అను కూలం? - తేయాకు, జీడిమామిడి
DSC Social Content Bits, DSC Telugu Social Content Bits, Telugu DSC Social Content Bits, Gk DSC Social Content Bits, Gk Telugu Bits DSC Social Content Bits, DSC Telugu Social Content Bits, Telugu DSC Social Content Bits, Gk DSC Social Content Bits, Gk Telugu Bits, DSC Social Content Bits, DSC Telugu Social Content Bits, Telugu DSC Social Content Bits, Gk DSC Social Content Bits, Gk Telugu Bits, DSC Social Content Bits, DSC Telugu Social Content Bits, Telugu DSC Social Content Bits, Gk DSC Social Content Bits, Gk Telugu Bits, DSC Social Content Bits, DSC Telugu Social Content Bits, Telugu DSC Social Content Bits, Gk DSC Social Content Bits, Gk Telugu Bits