Showing posts with label Telugu. Show all posts
Showing posts with label Telugu. Show all posts

Friday, September 13, 2024

బారిష్టర్ పార్వతీశం - Full Story 😄😄👌👌👌

 

 బారిష్టర్ పార్వతీశం - Full Story


ఈ బారిష్టర్ పార్వతీశం అనే నవల మా 10 వ తరగతి లో ఉపవాచకం గా ఉండేది, 2002 లో కీ.శే శ్రీ వాడిబోయిన వెంకటరమణ గారు చదివి వాయిస్ రికార్డ్ చేసారు.

G
M
T
Y
Text-to-speech function is limited to 200 characters

Sunday, August 29, 2021

మీరు దేశీయ యాప్ కూలో ఎల్లో టిక్‌ కోసం చూస్తున్నారా.. అయితే ఈ విధంగా చేయండి..!

 

Download 

 

దేశీయ మైక్రో ప్లాట్‌ఫాం "కూ" యాప్ పబ్లిక్ డొమైన్‌లో "ఎల్లో టిక్" ప్రక్రియను ప్రారంభించింది. ఇందుకు ఎమినెన్స్ ప్రమాణాలు కూడా షేర్ చేసింది. కూ యాప్ లో  ఎల్లో టిక్ వెరిఫికేషన్‌కి  ఎమినెన్స్ అని పేరు కూడా పెట్టారు. సాధారణంగా ట్విట్టర్ లో బ్లూ టిక్, కూ యాప్ ఎల్లో టిక్ యూజర్  ప్రొఫైల్ సోషల్ మీడియాలో అధికారికంగా ఉందా లేదా అనే దాని కోసం ఉపయోగిస్తారు. 

 


 కూ యాప్ ప్రత్యర్థి ట్విట్టర్‌లో ఇప్పటికే బ్లూ టిక్ వినియోగంలో ఉంది. దేశంలోని చాలా మంది సామాన్య ప్రజలు కూ యాప్ ను ఉపయోగిస్తున్నారు, వీరిలో ఎక్కువ మంది ఎల్లో టిక్‌ వెరిఫికేషన్ కోసం కోరుకుంటున్నారు. ఇప్పుడు కూ యాప్‌లో ఎల్లో టిక్‌ వేరిఫై కోసం విధానం, షరతుల గురించి తెలుసుకోండి. అలాగే కూ యాప్ లో ఎల్లో టిక్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో కూడా తెలుసుకోండి..

 


 కూ యాప్ యూజర్లను ఎల్లో టిక్‌ కోసం స్వాగతిస్తున్నట్లు కూ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతి సంవత్సరం మార్చి, జూన్, సెప్టెంబర్, డిసెంబర్‌లలో వెరిఫికేషన్ ప్రమాణాలను తనిఖీ చేస్తామని కంపెనీ తెలిపింది. ఇప్పటివరకు ఎల్లో టిక్ కోసం దరఖాస్తు చేసుకున్న యూజర్లలో ఒక శాతం మందికి వేరిఫై జరిగినట్లు కంపెనీ పేర్కొంది.

 

 కూ యాప్ ఎల్లో టిక్ వేరిఫై కోసం రెండు ఆప్షన్స్ ఉన్నాయి. మొదటిది మీరు యాప్ ద్వారానే దరఖాస్తు చేసుకోవచ్చు. రెండవది మీరు [email protected] ఈ-మెయిల్ ద్వారా వేరిఫై పొందవచ్చు. కొన్ని సందర్భాల్లో ఆలస్యం ఉన్నప్పటికీ, దరఖాస్తు చేసిన 10 రోజుల్లో మీకు సమాధానం లభిస్తుంది. మీరు https://www.kooapp.com/eminence  ని సందర్శించడం ద్వారా పూర్తి నిబంధనలను చదవవచ్చు.

 

 ఎమినెన్స్ ప్రారంభోత్సవం గురించి కూ సహ వ్యవస్థాపకుడు, సిఇఒ అప్రమేయ రాధాకృష్ణ మాట్లాడుతూ, “ మేము భారతదేశ స్థానిక వాస్తవాలను దృష్టిలో ఉంచుకుని ఈ విధానాన్ని రూపొందించాము. వేరిఫై కోసం పారదర్శకతను నిర్ధారించడానికి కట్టుబడి ఉన్నాము" . ఆన్‌లైన్‌లో ఇంటరాక్ట్ చేసేటప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని అన్నారు.

Download

 

Tuesday, October 17, 2017

తెలుగు చంధస్సు

 తెలుగు చంధస్సు


*గణములు రెండు రకములు*

1.విసర్గ గణములు
2.ఉప గణములు

*1.విసర్గ గణుములు :*


లల II ఉదా: రమ, క్రమ, సమ, ధన, అన్నీ కూడా లల గణములు
లగ IU ఉదా: రమా
గల UI ఉదా: అన్న, అమ్మ, కృష్ణ
గగ UU ఉదా: రంరం, సంతాన్
ఇవి రెండక్షరములతో కూడినవి

*మూడక్షరాల గణాలు*


ఆది గురువు భ గణము UII
మధ్య గురువు జ గణము IUI
అంత్య గురువు స గణము IIU
సర్వ లఘువులు న గణము III
ఆది లఘువు య గణము IUU
మధ్య లఘువు ర గణము UIU
అంత్య లఘువు త గణము UUI
సర్వ గురువులు మ గణము UUU
గురు లఘువులులను తేలికగా గుర్తించుటకు ఒక పద్దతి

య. మా. తా. రా. జ. భా న. స. ల. గం

I. U. U U. I. U. I I I. U

*2. ఉప గణములు:*

*సూర్య గణములు*

న = న = III
హ = గల = UI

*ఇంద్ర గణములు*


నగ = IIIU
సల = IIUI
నల = IIII
భ = UII
ర = UIU
త = UUI


Tuesday, October 20, 2015

TELANGANA KAVULU తెలుగు కవులు







Tags:Searches related to TELANGANA KAVULU  telangana kavulu list  telangana kavulu in telugu  telangana poets TELUGU KAVULU తెలుగు కవులు

Monday, June 8, 2015

ప్రముఖ రచయిత దాశరథి రంగాచార్య కన్నుమూత


ప్రముఖ రచయిత దాశరథి రంగాచార్య ఈరోజు (08/06/2015) ఉదయం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమాజీగూడలోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. ఆయనకు ముగ్గురు సంతానం. చిల్లర దేవుళ్లు, మోదుగుపూలు, జానపదం నవలలు రచించి సాహితీ రంగంలో విశేష ప్రశంసలు అందుకున్నారు. తెలంగాణ సాయుధ పోరాటం నాటి స్థితిగతులు, ఆ కాలంలోని దారుణమైన బానిస పద్దతులను ఆయన తన నవలల్లో చిత్రీకరించారు.రంగాచార్య జీవిత విశేషాలు...* 1928లో వరంగల్‌ జిల్లా చినగూడూరులో జన్మించారు.* నిజాంకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు.* 1951-57 మధ్య ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేశారు.* 1957-88 మధ్య సికింద్రాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌లో ఉద్యోగం చేశారు.* 'చిల్లర దేవుళ్లు' నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు.* తెలుగు సాహిత్య చరిత్రలోనే తొలిసారిగా నాలుగు వేదాలను తెలుగులోకి అనువదించారు.* శ్రీమద్రామాయణం, శ్రీమహాభారతాలను సరళంగా తెలుగులో రచించారు.* 'జీవనయానం' పేరుతో ఆత్మకథను
రచించారు.* అభినవ వ్యాసుడిగా బిరుదు పొందారు.* దేహదాసు ఉత్తరాలు, శ్రీ మహాభారతము, జీవనయానం, చతుర్వేద సంహిత, అమృత ఉపనిషత్తు, అమృతంగమయ తదితర రచనలు చేశారు.కేసీఆర్‌ సంతాపందాశరథి రంగాచార్య మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగాఢ సంతాపం తెలిపారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన గొప్ప వ్యక్తి రంగాచార్య అని ఆయన కొనియాడారు. తన రచనల ద్వారా సామాజిక స్ఫూర్తిని ప్రదర్శించారన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన దాశరథి:
చంద్రబాబుప్రముఖ సాహితీవేత్త దాశరథి రంగాచార్య మృతిపట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర సంతాపం ప్రకటించారు. సాహితీ ప్రక్రియల్లో దాశరథి చేసిన కృషి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిందని కొనియాడారు.


Wednesday, March 18, 2015

తెలుగులో వ్రాయాలనుకుంటున్నారా?


తెలుగులో వ్రాయాలనుకుంటున్నారా? లేఖిని చూడండి.తెలుగులో టైపు చెయ్యడం ఎలా?

ఈ రోజుల్లో తెలుగుని చాలా సులువుగా టైపు చెయ్యవచ్చు. అందుకు చాలా పరికరాలు, పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. వాటన్నింటి సమాహారమే ఈ టపా.


కంప్యూటర్లో ఎక్కడైనా తెలుగు టైపు చెయ్యడానికి (నేరుగా టైపు చేసుకోవచ్చు. కాపీ-పేస్టు అవసరం లేదు. అంతర్జాల సంధానం అవసరం లేదు.):

Net సాధనాలు (మీ కంప్యూటర్లో స్థాపించుకోనవసరం లేదు, అంతర్జాల సంధానం ఉండాలి, టైపు చేసిన దాన్ని కాపీ-పేస్టు చేసుకోవాలి):

Monday, February 9, 2015

ఇలాచదవాలి.. అలా సాధించాలి





పిల్లల భవిష్యత్ కోసం పరితపిస్తూ ,పరిశ్రమించే ప్రతి తల్లిదండ్రులూ తప్పక

చదవాల్సిన,చదివించాల్సిన పుస్తకం. ”ఇలాచదవాలి.. అలా సాధించాలి .. ”

ఉదయకుమార్ అలజంగి రచించిన ఇలాచదవాలి.. అలా సాధించాలి ..

 

 

Download 

అనే 100 రూ// విలువగల పుస్తకాన్ని ‘విహంగ పాఠకుల కోసం పూర్తి ఉచితంగా

అందిస్తున్నారు. చదివి మీఅభిప్రాయాలను తెలియజేయండి. మీ స్నేహితులకు

పంపండి.

- ‘విహంగ మహిళా సాహిత్య పత్రిక ‘


‘విహంగ’ పాఠకులకు ప్రత్యేక కానుక -”ఇలాచదవాలి.. అలా సాధించాలి ..”

undefined

పిల్లల భవిష్యత్ కోసం పరితపిస్తూ ,పరిశ్రమించే ప్రతి తల్లిదండ్రులూ తప్పక

చదవాల్సిన,చదివించాల్సిన పుస్తకం. ”ఇలాచదవాలి.. అలా సాధించాలి .. ”

ఉదయకుమార్ అలజంగి రచించిన ఇలాచదవాలి.. అలా సాధించాలి ..

అనే 100 రూ// విలువగల పుస్తకాన్ని ‘విహంగ పాఠకుల కోసం పూర్తి ఉచితంగా

అందిస్తున్నారు. చదివి మీఅభిప్రాయాలను తెలియజేయండి. మీ స్నేహితులకు

పంపండి.

- ‘విహంగ మహిళా సాహిత్య పత్రిక ‘

- See more at: http://vihanga.com/?page_id=6070#sthash.YoPRYN5G.dpuf




Tuesday, February 3, 2015

Telugu DSC Bits


తెలుగు సాహిత్యం

1. వ్యాస ప్రక్రియపై మంచి పరిశోధన గ్రంథం ప్రకటించిన వారు?
1. ఎస్వీ రామారావు
2. బూదరాజు రాధాకృష్ణ
3. కొలకలూరి ఇనాక్‌
4. బేతవోలు రామబ్రహ్మం
2. స్వాతంత్య్రోద్యమ కాలంలో ప్రసిద్ధి పొందిన పత్రిక
1. వివేకవర్ధని
2. ఈనాడు
3. హితసంజీవని
4. కృష్ణాపత్రిక
3. వేమన పద్యాలలో ఎక్కువగా కనిపించే ఛందోరీతి
1. తేటగీతి 2. కందము 3. ఆటవెలది 4. సీసము
4. మధ్యాక్కరలకు మరల మహర్దశ పట్టించిన మహాకవి
1. మల్లాది 2. విశ్వనాథ
3. సి.నా.రె. 4. జంధ్యాల
5. 'మా తెలుగు తల్లికి మల్లెపూదండ' పాడిన కవి
1. గరిమళ్ళ 2. శంకరంబాడి
3. చిలకమర్తి 4. త్రిపురనేని
6. 'వాక్యం రసాత్మకం కావ్యమ్‌' అన్న అలంకారికుడు
1. జగన్నాథుడు 2. భామహుడు
3. విశ్వనాథుడు 4. మమ్మటుడు

7. లలితకళలలో ఉత్తమోత్తమంగా భావింపబడే కళ
1. సంగీతం 2. శిల్పం
3. చిత్రలేఖనం 4. కవిత్వం
8. సోక్రటీసు శిష్యుడు
1. అరిస్టాటిల్‌ 2. షేక్స్పియర్‌
3. మిల్టన్‌ 4. ప్లేటో
9. క్షేమేంద్రుడు
1. రసవాది
2. ఔచిత్యవాది
3. రీతివాది
4. గుణవాది
10. సాహిత్య శిల్ప సమీక్ష రచయిత
1. దివాకర్ల
2. పింగళి లక్ష్మీకాంతం
3. పల్లా దుర్గయ్య
4. రాళ్ళపల్లి
11. 'ఏకో రసః కరుణ ఏవ' అన్నవాడు
1. కాళిదాసు
2. భాసుడు
3. భవభూతి
4. మాఘుడు
12. ధ్వని సిద్ధాంత ప్రవర్తకుడు
1. భోజుడు
2. జగన్నాథరాయలు
3. విశ్వేశ్వరుడు
4. ఆనందవర్థనుడు
13. సాహిత్య విమర్శ అంటే
1. పొగడడం
2. తిట్టడం
3. గుణదోషాలను తర్కించడం
4. మౌనంగా వుండటం
14. కవిత్వ తత్త్వవిచారం
1. అలంకారిక గ్రంథం
2. విమర్శ గ్రంథం
3. శాస్త్ర గ్రంథం
4. కవితల సంపుటి
15. చారిత్రక విమర్శకు ప్రాధాన్య మిచ్చినవారిలో ప్రసిద్ధులు
1. వేటూరి ప్రభాకరశాస్త్రి
2. పురిపండా అప్పలస్వామి
3. రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ
4. నడకుదుటి వీరరాజు
సమాధానాలు
1. 3, 2. 4, 3. 3, 4. 2, 5. 2, 6. 3, 7. 4, 8. 1, 9. 2, 10. 2, 11. 3, 12. 4, 13. 3, 14. 2, 15. 4
 
Tags:telugu literature pictures  telugu literature poem  telugu hot stories blogs  telugu literature websites  telugu literature boothu  kamasastry telugu literature  telugu literature pdf  telugu literature for civil services  telugu literature boothu  kamasastry telugu literature  telugu literature pdf  telugu literature for civil services  telugu literature books  masterpiece in telugu literature  telugu literature books free download  nagaraju telugu literature,

Friday, December 5, 2014

మార్బుల్ జలపాతం ఏ నదిపై ఉంది?

ద్వీపకల్ప నదులు హిమాలయ నదీ వ్యవస్థకన్నా పురాతనమైనవి. చాలా వరకు పశ్చిమకనుమల్లో జన్మిస్తాయి. ఇవి తూర్పుగా ప్రయాణించి బంగాళాఖాతంలో కలుస్తాయి. ఇవి చాల పెద్ద నదులు. ఇవి పంక ఆకారంలో ఉండే డెల్టాలను ఏర్పరుస్తాయి. ఈ నదులు పగులు లోయగుండా ప్రవహిస్తాయి. ద్వీపకల్ప నదులో దేశం మొత్తం మీద తీసుకుపోయే నీటిలో 30 శాతాన్ని తీసుకుపోతాయి. పశ్చిమ దిశగా ప్రవహించే నదులు నర్మదా నర్మదా పరివాహక ప్రాంతం మధ్యప్రదేశ్‌లో 87 శాతాన్ని కలిగి ఉంటుంది. మిగతాది గుజరాత్‌లో ఉంది. అమర్‌కంఠక్ పీఠభూమిలోని మైకాల్ రేంజ్‌లో 1060 మీ. ఎత్తు కలిగిన బుగ్గ నుంచి ఏర్పడుతుంది. భేరా వద్ద 15 అడుగులు కిందకు దూకడం వల్ల మార్బుల్ జలపాతం ఏర్పడింది. -మధ్యప్రదేశ్‌లోని అమర్‌కంఠక్ వద్ద జన్మించి గుజరాత్‌లోని భరూచ్ వద్ద(కాంబే సింధూశాఖ) అరేబియా సముద్రంలో కలుస్తుంది. -దీని పరివాహక ప్రాంతం ఎక్కువగా మధ్యప్రదేశ్‌లో ఉంది. గుజరాత్‌లో కేవలం 1/10 వంతు మాత్రమే ఉంది. -పరివాహక ప్రాంతం మధ్యప్రదేశ్, గుజరాత్ మహారాష్ట్రలకు సంబంధించింది. ఉపనదులు -దుధి, తావా, హిరన్, షేర్ మొదలైనవి. -నర్మదా, వింధ్యా,సాత్పురా పర్వతాల మధ్య అగాధదరి(పగులు లోయ) గుండా రవహిస్తుంది. ఈ నదిపై కమల్‌దవర్(23 మీ.), దనుదర్(15 మీ) అనే జలపాతాలు ఉన్నాయి. -ప్రసిద్ధిగాంచిన మార్బుల్ జలపాతం నర్మదాపై ఉంది. -నర్మదానది ఒడ్డున ఉన్న ముఖ్యపట్టణం జబల్‌పూర్(మధ్యప్రదేశ్). తపతి ఇది మధ్యప్రదేశ్‌లోని బెతుల్ జిల్లాలోని సాత్పురా పర్వతాల్లో ముల్తాని వద్ద జన్మించి నర్మదానదికి సమాంతరంగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. దీని పొడవు 724 కి.మీ. పరివాహక ప్రాంతం మధ్యప్రదేశ్ గుజరాత్, మహారాష్ట్రలో ఉంది. ఈ నది ఒడ్డున ఉన్న ముఖ్య పట్టణం సూరత్(గుజరాత్) ఉపనదులు పూర్ణ, బెతుల్, అరుణావతి, వేగ్‌హార్, గిర్‌నార్, బోరి, పన్‌జహార్ మొదలైనవి. -ఇవి అజంతా, సాత్పుర కొండల మధ్య ప్రవహిస్తాయి. -పరివాహక ప్రాంతం మహారాష్ట్ర, గుజరాత్‌లలో ఉంది. -దీని పరివాహక ప్రాంతం గుజరాత్‌లో 79 శాతం ఉంది. సబర్మతి ఈ నది రాజాస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్ జిల్లాలోని ఆరావళి పర్వతాల్లోని జయ సముద్రం సరస్సులో పుడుతుంది. దక్షిణదిశగా ప్రవహించి కాంబే అఖాతం వద్ద(గుజరాత్) అరేబియా సముద్రంలో కలుస్తుంది. దీని పొడవు 416 కి.మీ. ఉపనదులు -వాకాల్, నేష్వా, హారా మొదలైనవి. -దీని పరివాహక ప్రాంతం రాజస్థాన్, గుజరాత్‌లలో కలదు. పట్టణం : ఈ నది ఒడ్డున ఉన్న ముఖ్య పట్టణం అహ్మదాబాద్. ఈ నదికి గిరికర్ణిక అనే పురాతన పేరు ఉంది. ఈ నది గురించి పద్మ, గరుడ పురాణాల్లో పేర్కొన్నారు. మహి గ్వాలియర్‌లో పుట్టి గుజరాత్‌లోని కాంబే అఖాతం దగ్గర అరేబియా సముద్రంలో కలుస్తుంది. దీని పరివాహక ప్రాంతం మధ్యప్రదేశ్, గుజరాత్‌ల్లో ఉంది. పశ్చిమ కనుమల్లో పుట్టి పడమరకు ప్రవహించే నదులు గోవా : మాన్‌డవి, రాజోల్ జోరి నదులు కేరళ : పోనార్, పెరియార్, పంబ, బయపొర నదులు కర్ణాటక : కలినాడి, శరావతి, నేత్రావతి, టాద్రి నదులు కలవు. తూర్పు దిశగా ప్రవహించే నదులు









ఏపీపీఎస్సీ నిర్వహించే గ్రూప్ - IV పరీక్ష మొదటి పేపర్ లో జనరల్ స్టడీస్ కి సంబంధించిన పలు విభాగాల నుంచి ప్రశ్నలు .,telugu study material,d to telugu study material  vro study material in telugu free download  vro study material in telugu pdf free download,APPSC GROUP 2 MATERIAL IN TELUGU ... Please upload if you have updated Materials.. Reply .... this study material is very useful,Appsc material in Telugu Medium, free download, group 2 material in Telugu free download, group 4 study material in Telugu free download  appsc study material in telugu free download  dsc study material in telugu pdf  group 2 study material in telugu  group 2 study material in telugu medium  group 2 study material in telugu in sakshi education  telugu study AP Geography (Telugu) Download Geography Material Download Indian Geography (Telugu) Download Tags: DIET CET Study Material, DIET CET Study Material telugu boothukathalu  telugu books online free download  telugu books online library  telugu books free download  telugu books online shopping  telugu books online buy  telugu books online purchase  buy telugu books online india,telugu study bible  telugu study material  study telugu brown  study telugu language  telugu websites  learn telugu  telugu associations  telugu calendar,study material in telugu pdf free download,APPSC GROUP 2 MATERIAL IN TELUGU ... Please upload if you have updated Materials.. Reply .... this study material is very useful,Appsc material in Telugu Medium, free download, group 2 material in Telugu free download, group 4 study material in Telugu free download  appsc study material in telugu free download  dsc study material in telugu pdf  group 2 study material in telugu  group 2 study material in telugu medium  group 2 study material in telugu in sakshi education  telugu study AP Geography (Telugu) Download Geography Material Download Indian Geography (Telugu) Download Tags: DIET CET Study Material, DIET CET Study Material telugu boothukathalu  telugu books online free download  telugu books online library  telugu books free download  telugu books online shopping  telugu books online buy  telugu books online purchase  buy telugu books online india,telugu study bible  telugu study material  study telugu brown  study telugu language  telugu websites  learn telugu  telugu associations  telugu calendar,study material in telugu pdf free download,APPSC GROUP 2 MATERIAL IN TELUGU ... Please upload if you have updated Materials.. Reply .... this study material is very useful,Appsc material in Telugu Medium, free download, group 2 material in Telugu free download, group 4 study material in Telugu free download  appsc study material in telugu free download  dsc study material in telugu pdf  group 2 study material in telugu  group 2 study material in telugu medium  group 2 study material in telugu in sakshi education  telugu study AP Geography (Telugu) Download Geography Material Download Indian Geography (Telugu) Download Tags: DIET CET Study Material, DIET CET Study Material telugu boothukathalu  telugu books online free download  telugu books online library  telugu books free download  telugu books online shopping  telugu books online buy  telugu books online purchase  buy telugu books online india,telugu study bible  telugu study material  study telugu brown  study telugu language  telugu websites  learn telugu  telugu associations  telugu calendar,

Sunday, November 30, 2014

గురజాడ వేంకట అప్పారావు - Gurazada Apparao


గురజాడ వేంకట అప్పారావు -  Gurazada Apparao



అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని సామాజిక రుగ్మతల మీద దాడిచేసిన మహాకవి, రచయిత, నాటకకర్త గురజాడ వేంకట అప్పారావు. ఆయన రచనలు ఆదర్శం. ఆయన జీవితం ఆదర్శం. ఆయన చేతిలో అక్షరం వ్యంగ్య బాణమైతే, మరెవరూ అందుకు సాటి కాలేకపోయారు. అందుకే ఆయన అసంపూర్ణంగా వదిలి వెళ్ళిపోయిన కొండు భట్టీయము, బిల్హణీయం నాటకాల్ని ఎందరో పూర్తి చేయాలని ప్రయత్నించారు. కానీ సఫలులు కాలేకపోయారు. 'కన్యాశుల్కం' నాటకం నాటి తీవ్ర సమస్యలకి అద్దం పట్టింది. నాటి పాత్రల్ని సజీవంగా మనముందుంచింది. 'నేనూ వాళ్ళలో ఉన్నానా?' అని ఎవరికి వారు భుజాలు తడుముకునేట్టు చేసింది. ఆషాఢ భూతులన్ని చోట్లా ఉంటారు జాగ్రత్తని హెచ్చరించింది. వేశ్యలు ఆ కాలంలో ఎక్కువగా ఉండేవారు కాబట్టి వాళ్ళకి సరైన దారి చూపించింది. నాటకంలో ఒక నాయకుని, వితంతువైన ఒక నాయికనీ, ప్రవేశపెట్టి వాళ్ళిద్దరికీ పెళ్ళి చేయలేదు. గురజాడకి అరకొర పరిష్కారాన్ని చూపించడం ఇష్టం ఉండదు. సంస్కరణ జరిగితే అది పరిపూర్ణంగా ఉండాలని విశ్వసిస్తారు, అందుకే బుచ్చమ్మకి పునర్వివాహం చేసి సంస్కరించాలనుకున్నా నీతిలేని గిరీశం లాంటి వాళ్ళకిచ్చి చేయడం సంస్కారం కాదు, గొంతుకోయడమవుతుందన్నది ఆయన అభిప్రాయం. అందుకే నాటకంలో ఆయన ఇద్దరికీ పెళ్ళిచేయలేదు. పైగా కుసంస్కారిని నాటకం చివరలో బయటకు నెట్టేసాడు. కన్యాశుల్కం అసంపూర్ణమని చాలామంది అభిప్రాయం కానేకాదు? ఆ ప్రాంతం నుంచి తెలివిగా అతడిని బయటకు నెట్టేసారు. డామిట్‌ కథ అడ్డం తిరిగిందని బాధపడ్డాడు. కుక్క దాని గుంటలాగా యాంటినాచ్‌ నంటూ మరికొందరు విధవలకు వలలు వేయడానికి వేరే ప్రదేశాలకి వెళ్తాడు. తస్మాత్‌ జాగ్రత్తని, హెచ్చరిక చిన్నపిల్లల్ని కొనుక్కుని తీసుకువెళ్ళి పెళ్ళి చేసుకోవాలనుకునే ముసలివాళ్ళకు హెచ్చరిక. ఇలాంటి పెళ్ళిళ్ళవల్లనే ప్రతి ఇంట్లోనూ విధవలెక్కువై, వివాహేతర సంబంధాలూ పెచ్చుపెరుగుతాయని ఘాటుగా చెప్పారు. చిన్న పిల్లల్ని వివాహం పేరుతో ఎలా గొంతుకోస్తున్నారో కన్నీళ్ళుబుకి వచ్చేట్టు చెప్పారు. పూర్ణమ్మ కథని, యువతులపై అధికార మదంతో కొందరు ఎలా నలిపివేయాలని చూస్తారో కన్యకలో చెప్పారు. ఆయన కథానికలలో కూడా చదువుకున్న భార్య తెలివిగా వేశ్యాలోలుడైన భర్తని ఎలా మార్చుకుందో దిద్దుబాటులో చెప్పారు. ఇది మొదటి కథానికే కాదు, లక్షణాలివని చెప్పకుండానే కథానికా లక్షణాలు చెబుతుంది ఈ కథానిక. ముసలి మొగుడు పడుచుపెళ్ళాన్ని ఎలా చిత్రహింసలు పెడతాడో మెటిల్డాలో చెప్పారు. మనిషి మతాన్ని ఎలా వాడుకోగలడో మతము విప్పుతము కథానికలో చెప్పారు. ఒకే మతంలోని చీలికలతో, రకరకాల దేవుళ్ళ పేరుతో ప్రజలు కొట్టుకునే విధానానికి చాలా ఘాటుగా స్పందించారు. .. మీ పేరేమిటి? కథానికలో సంస్కర్త హృదయం కథానికలో ఒక వేశ్యని సంస్కరిస్తానని వేశ్యాలోలుడైన ఓ ప్రొఫెసర్‌ వికృత రూపాన్ని చూపిస్తారు. రాచమల్లు రామచంద్రారెడ్డి గారన్నట్లు వితంతు వివాహాలకు తాను అనుకూలుడై ఉండి కూడా ఆ సమస్యను అల్లరిపాలు చేసాడు. వేశ్యా ఉద్దరణకి అనుకూలుడై ఉండకుండా, ఆ సమస్యనీ నవ్వులపాలు ఎందుకు చేసాడు గురజాడ? అని ఆలోచిస్తే ఆయనకు సమకాలీన సమాజంలో సాగుతూ ఉండిన సంస్కరణోద్యమాల పట్ల గురజాడకు తృప్తిలేదు. సానుభూతి లేదు. ఆయన పర్‌ఫెక్షనిస్ట్‌. ఏది జరిగినా పద్ధతి ప్రకారం పరిపూర్ణంగా జరగాలనే ఆయన అభిలాష. నిజాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పగల గుండెధైర్యముంది. పీల మనిషైనా! మంచి వ్యక్తిత్వమున్న రచయిత కాబట్టే గొప్ప రచయిత కాగలిగాడు. మరణించి వందేళ్ళయినా మన మనసుల్లో పెరుగుతున్నాడే గాని, మసకబారిపోవడం లేదు. గొప్ప ప్రయోక్త, సంస్కర్త! ఆధునిక తెలుగు సాహిత్య నిర్మాతల్లో గురజాడ అప్పారావు ప్రముఖ రచయితగా నాటకకర్తగా తన రచనల్లో వ్యవహారిక భాషను ప్రవేశపెట్టిన దృష్టి. కన్యాశుల్కం నాటకంలో పాత్రోచిత భాషగా విజయనగరం భాష, యాసలను అందులోనూ కులయాసలను ప్రయోగించిన గొప్ప ప్రయోక్త.ఇకపోతే ఆయన వ్రాసిన ఐదు కథల్లో వ్యవహారిక భాషను ప్రయోగించాడు. అది 'యాస' కాక ప్రామాణికమైన వ్యవహారిక భాష. కందుకూరి వీరేశలింగం పంతులు సామాజిక పరివర్తనం కోసం సాహిత్యాన్ని పరికరంగా వాడుకున్నాడు. సాహిత్యం ప్రయోజనం సమాజాన్ని ప్రక్షాళనం చేయటం అని వీరేశలింగం గుర్తించాడు. సాహిత్యం రూపురేఖలనే ఆయన మార్చేసాడు. అదేమార్గంలో నడిచిన గురజాడ సాహిత్యం ప్రజాజీవితాన్ని మలుపు తిప్పే ఆయుధం అనే దృష్టితో రచనలుచేసాడు. అప్పటికే అచ్చుయంత్రాలు వచ్చాయి. పత్రికా ప్రచురణ పుస్తకాలు అచ్చువేయటం, మధ్య తరగతివాళ్ళు అక్షరాస్యులు వాటిని చదవటం ప్రభావితం కావటం ఆరంభమైంది. కాబట్టి గురజాడ సాహిత్యం అక్షరాస్యులకు అందింది. అతని కన్యాశుల్కం నాటకం ప్రదర్శింపబడి జనరంజకమైంది. వెంటనే గురజాడ సాహిత్యం సమాజ పరివర్తనకు మూలకారకం కాకపోయినా క్ర మంగా అతని సాహిత్యం సమాజప్రక్షాళన ప్రయోజనం బాధ్యతను నిర్వహించింది. వినూతన భావ సంచారానికి కారణమైంది. గురజాడ ఎక్కువ కథలు వ్రాయకపోయినా, వ్రాసిన ఐదు కథల్లోనూ సంఘ సంస్కరణ భావాలను చిత్రించాడు. మూఢనమ్మకాలను విమర్శించాడు. హిందూ ముస్లింల సఖ్యాన్ని ప్రబోధించాడు. అభ్యుదయ రచయితగా మన ముందుకువచ్చారు. గురజాడ తన మొదట కథ ''దిద్దుబాటు'' ను సరళ గ్రాంథికంలో రచించి తర్వాత వ్యవహారిక భాషలోకి మార్చి తిరగ రచించాడు.ఆయనవస్తువు, కథనం, భాష, పాత్రల చిత్రణ పాత్రలకు పేర్లు పెట్టటంలో, వర్ణనల్లో ఆధునికతను చూపాడు. ఒక పాత్రకు 'మెటల్డా' అని ఇంగ్లీషు పేరు పెట్టాడు. సమకాలిక సమాజ స్వభావాన్ని చక్కగా కండ్లకు కట్టేటట్లుగా వాస్తవికంగా తన కథల్లో చిత్రించాడు. అటువంటి ఆధునికమైన సమకాలిక జీవిత చిత్రణలున్న కథల్లో ఒకటి రెండు చోట్ల వర్ణనల్లో నాకు కాళిదాసుని వర్ణల్లోని భావాలు కనపడటం ఆశ్చర్యం కలిగించింది. అయితే గురజాడ సంస్కృతం చదువుకున్నాడన్నమాట అని అనుకున్నాను. ఆయన జీవిత వివరాలు సంక్షిప్తంగా పరిశీలిస్తే బిఏ లో ఆయనకు ఫిలాసఫీ అభిమాన విషయం అయినా రెండో భాషగా సంస్కృతం చదువుకున్నాడు. ఆ కాలంలో ఆ సంస్కృతం సిలబస్‌ గట్టిగానేఉండి వుంటుంది. సంస్కృతాన్ని నేర్చుకునేవాళ్ళు కాళిదాసును కాళిదాసు రఘువంశం, మేఘసందేశాలను చదువుకోవటం సంప్రదాయంగా వున్నదే. వాటిల్లో మేఘ సందేశం శ్లోకాలు వాటిల్లోని వర్ణనలు అతని హృదయానికి హత్తుకున్నాయి. అతని భావనలో మమేకమై నిలిచిపోయాయి. అందుకే ఒకటి రెండు కథల్లో వర్ణనల్లో మేఘసందేశం లోని భావాలను ఉన్నదున్నట్లుగా చెప్పేసాడు. ''మీ పేరేమిటి'' కథలో శాస్త్రులుగారు తమ శిష్యులతో రామ్మూర్తి అనే శిష్యుడు వేసిన తోటకు విహారానికి వెళ్ళారు. పూలు పండ్లతో పచ్చని తోట బ్రహ్మాండంగా ఉంది. ఆ అందమైన తోటలో విహరించటం గురువుగారికి చాలా ఇష్టం. ఆనందం. అక్కడ గురువు శాస్త్రులుగారు తమ అభిమానులైన శిష్యులతో తరచు మీటింగులు పెడ్తుంటారు. గురువుగారు శిష్యులు అట్లా కలుసుకున్నప్పుడు ''స్వర్గఖండం ఒకటి అక్కడికి దిగినట్లు వుంటుంది.'' అంటాడు కథలో కథనం చేసే కథకుడైన శిష్యుడు. ఈ భావ కల్పన మనకు కాళిదాసు మేఘ సందేశంలో ఉజ్జయిని నగరాన్ని వర్ణించిన సందర్భంలో కన్పిస్తున్నది. కాళిదాసుకు ఉజ్జయినీ నగరం అంటేచాలా అభిమానం. కాస్త వంకరతోవ అయినా సరే ఉజ్జయినీ నగరాన్ని సందర్శించమని యక్షుడు మేఘంతో అంటాడు. ఏడెనిమిది శ్లోకాల్లో ఉజ్జయినీ నగర వైభవాన్ని వర్ణించాడు కాళిదాసు. ఆ నగరాన్ని శ్రీ విశాల, అవంతి అనికూడా పిలుస్తారు. ఆ అవంతీనగరం స్వర్గవాసులైన జనులు కొంత పుణ్యాన్ని మిగుల్చుకొని భూలోకానికి వెంట తీసుకొని తెచ్చుకొన్న స్వర్గఖండమో అనే విధంగా వుంది అంటాడు కాళిదాసు. ఉజ్జయినిని స్వర్గంగా వర్ణించాడు.కాళిదాసు చెప్పిన ''స్వర్గఖండం'' దిగినట్లుగా ఉంది అన్న భావం గురజాడ హృదయంలో ఉండిపోయింది. ఆ మేఘసందేశ పఠన కాలంలో అతని హృదయంలోని హత్తుకుపోయిన కల్పన ఈ విధంగా ''మీ పేరేమిటి'' కథలో తోట ఒక భూలోకంలో దిగివచ్చిన స్వర్గభంజంగా వుందన్న భావంగా వ్యక్తమైంది. మెటల్డా కథలో మెటిల్డా తలయెత్తి యిటు అటూ చూసిన కన్నుల తళుకూ.. అన్న గురజాడ వర్ణన విద్యుద్దామ స్ఫురిత చకితైర్యత్ర.. లోచనై:...'' అన్న కాళిదాసు ఉజ్జయినీ నగర స్త్రీల కళ్ళ వర్ణనను అనుకోకుండా గుర్తుకు తెస్తుంది. ''సంస్కర్త హృదయం'' కథలో సరళ సొదశను వర్ణనలు ప్రాచీన కవుల వర్ణనల వలె రమ్యంగా వున్నాయి. ఈవర్ణనలు గురజాడ కవి హృదయాన్ని బయటపెడ్తున్నాయి. అతని సౌందర్య దృష్టిని తెలుపుతున్నాయి.

Sunday, August 3, 2014

ద్రాక్షారామంలోని భీమేశ్వరాలయాన్ని నిర్మించింది ఎవరు ?




1. ఇటీవల కరీంనగర్‌ జిల్లాలో కోటిలింగాల వద్ద దొరికిన నాణేలు ఎవరికి చెందినవి ? – శ్రీముఖుడు
2. శాతవాహనుల కాలంలో నగర పాలన ఎవరి ద్వారా జరిగేది ? - నిగమ సభ
3. ఆంధ్రులు మౌర్య సామ్రాజ్యంలో వారని అశోకుని ఎన్నో శిలాశాసనం తెలుపుతుంది ?- 13వ శిలా శాసనం
4.కవి వత్సలుడు అనే బిరుదున్న రాజు ? – హాలుడు
5. ధరణికోట శాసనం ఏ శాతవాహన రాజుకి సంబంధించింది ? - వాశిష్టిపుత్ర పులోమావి
6. శాతవాహనుల కాలంలో పల్నాడు ప్రాంతం దేనికి ప్రసిద్ధి ? – వజ్రాలు
7. శాతవాహనుల కాలం నాటి కొడాయిరాను ప్రస్తుతం ఎలా పిలుస్తున్నారు ? – ఘంటసాల
8. ఆంధ్రుల ప్రస్తావన మొట్టమొదటి సారి ఉన్న ఐతరేయ బ్రాహ్మణం ఏ వేదానికి సంబంధించింది ? – రుగ్వేదానికి
9. ఆంధ్ర మహావిష్ణువు దేవాలయం ఎక్కడ ఉంది ? - కృష్ణాజిల్లాలోని శ్రీకాకుళం
10.గుణాఢ్యుడు రచించిన బృహత్కథ ఏ భాషలో ఉంది ? – పైశాచి
11.శాతవాహనుల కాలంనాటి తొలి గుహ చైత్యాలు ఎక్కడ ఉన్నాయి ? – గుంటుపల్లి
12.విష్ణు కుండినులు పోషించిన భాష ? – సంస్కృతం
13. మంచికల్లు శాసనం ఏ వంశ రాజుల గురించి తెలుపుతుంది ? – పల్లవులు
14. 108 శివాలయాలను నిర్మించిన చాళుక్యరాజు ? – రెండో విజయాదిత్యుడు

15. ఐవోల్‌ శాసనం ఎవరి విజయాలను గురించి తెలుపుతుంది ? - రెండో పులకేశి
16. ఉండవల్లి గుహలు ప్రస్తుతం ఏ జిల్లాలో ఉన్నాయి ? - కృష్ణా
17.బైరవ కొండ గుహలు ఏ జిల్లాలో ఉన్నాయి ? - నెల్లూరు
18. విష్ణు కుండినుల రాజధాని ? - వినుకొండ
19.రేనాటి చోళుల మూల పురుషుడు ?- కరికాళ చోళుడు
20. శూన్య వాదాన్ని ప్రభోదించింది ? - ఆచార్యనాగార్జునుడు
21. ఆచార్య నాగార్జునుడు శాతవాహన రాజుల్లో ఎవరికి సమకాలికుడు ? - యజ్ఞశ్రీ పుత్ర శాతకర్ణి
22.శాతవాహనుల నాణేలను ఎలా పిలిచేవారు ? - కర్షపణలు
23. ప్రఖ్యాత శివలింగం గత చిత్తూరు జిల్లాలోని గుడిమల్లం ఏ రాజుల కాలానికి చెందింది ? - శాతవాహనులు
24. చేజర్ల శిలాశాసనం ఏ రాజు వంశీయులను గురించి తెలుపుతుంది ? - ఆనంద గోత్రులు
25. జయవర్మ కొండముది శాసనం ఏ రాజు వంశీయులను గురించి తెలుపుతుంది ? - బృహత్పలాయనులు
26.సమస్త గాంధర్వ విద్యల్లో ప్రావీణ్యులైన చెల్లవ్యను పోషించిన రాజు? - మొదటి చాళుక్య భీముడు
27. నిర్వచనోత్తర రామాయణ గ్రంథకర్త ? - తిక్కన
28.ఆంధ్రదేశంలో హిందూ గుహాలయాలను మొట్టమొదటి సారిగా నిర్మించిన వారు ? - విష్ణు కుండినులు
29. ద్రాక్షారామంలోని భీమేశ్వరాలయాన్ని నిర్మించింది ఎవరు ? - మొదటి చాళుక్య భీముడు
30. తూర్పు గోదావరి జిల్లాలోని బిక్కవోలు దేవాలయాల సముదాయాన్ని నిర్మించిన వారు ఎవరు ? - గుణగ విజయాదిత్యుడు
31. శాతవాహనుల వాణిజ్య సంబంధాలు ఏ దేశంతో అభివృద్ధి చెందాయి ? - రోమ్‌
32.శాతవాహన సామ్రాజ్యాన్ని అంతంచేసి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించిన వంశం ? - ఇక్ష్వాకులు
33.యజ్ఞశ్రీ పుత్ర వాతకర్ణి వేయించిన నాణేలపై ముద్ర ? - నౌక
34.గౌతమీ బాలశ్రీ వేయించిన నాసిక్‌, కార్లే శాసనాలు ఎవరి విజయాలను వివరంగా తెలుపుతాయి ?-గౌతమీ పుత్ర శాతకర్ణి
35. శాతవాహన రాజుల్లో ఘనుడు ? -గౌతమీ పుత్ర శాతకర్ణి
36. గాథా సప్తశతి గ్రంథ సంకలన కర్త ? - హాలుడు
37. నానాఘాట్‌ శాసనం ఎవరి విజయాలను గురించి తెలియజేస్తుంది ? - మొదటి శాతకర్ణి
38. సుహ్రృల్లేఖ అనే గ్రంథాన్ని రాసింది ఎవరు ? - ఆచార్య నాగార్జునుడు
39. గిర్నార్‌ శాసనం వేయించిన రాజు ? - రుద్రదాముడు
40. ఇటీవల తవ్వకాల్లో కాల్చిన ఇటుకలతో నిర్మితమైన అతి పెద్ద బౌద్ధస్థూపాన్ని ఎక్కడ కనుగొన్నారు ? - నేలకొండపల్లి
41. శాతవాహన కాలంలో గ్రీకు, రోమన్ల ప్రభావం దేనిపై అధికంగా ఉండేది ? - వాస్తు శిల్పం
42. కళింగ రాజైన ఖారవేలుని సమకాలికుడైన శాతవాహన రాజు ? - రెండో శాతకర్ణి
43. మహాక్షాత్ర రుద్రదామునితో పోరాడిన శాతవాహన రాజు ? - గౌతమీ పుత్ర శాతకర్ణి
44. ఇటీవల భావికొండ వద్ద (భీముని పట్నం) బయటపడిన స్థూపాలు ఎవరి కాలానికి చెందినవి ? - శాతవాహనులు
45. శాలివాహన శకం ఎప్పుడు ప్రారంబమైంది ? - క్రీ.శ78లో

46.  విదేశీ బౌద్ధమత ఆధారాలతో ఆంధ్రదేశాన్ని ఏ విధంగా పేర్కొన్నారు ? - మంజీరక దేశం
47.  అశోకుడి శాసనాలు ఆంధ్రాలో లభించిన ప్రాంతాలు? – యర్రగుడి
48. ఇటీవల ఏలూరు ప్రాంతంలోని గుంటుపల్లిలో లభించిన శాసనం ఎవరి గురించి తెలుపుతుంది ? – ఖారవేలుడు
49. శాతవాహనుల సామ్రాజ్యంలోని రాష్ట్రాలు ? – ఆహారాలు
50. శాతవాహన కాలంలో వ్యాపార అభివృద్ధికి తోడ్పడింది ? – శ్రేణులు



51. కంటక శిల దేనికి పూర్వ నామము ? –ఘంటసాల
52.అలహాబాద్‌ స్తంభ శాసనంలో పేర్కొన్న శాలంకాయన రాజు ఎవరు ? – హస్తివర్మ
53. ఉజ్జయినీ రాకుమార్తెను వివాహమాడిన ఐక్ష్వాకు రాజు ఎవరు ? - వీర పురుషదత్తుడు
54. ఈపూరు, పొలమూరు శాసనాలు ఏ రాజు వంశస్తులను గురించి తెలుపుతాయి ? - విష్ణు కుండినులు
55. త్రికూట పూర్వతాధిపతులు ? – శాలంకాయనులు
56. నవబ్రహ్మ ఆలయాలు ఎక్కడ కొలువదీరి ఉన్నాయి ? -అలంపూర్‌
57. తెలుగులో కుమార సంభవ గ్రంథకర్త ఎవరు ? – నన్నెచోదుడు
58.మహబూబ్‌నగర్‌ జిల్లా అలంపూర్‌లోని నవబ్రహ్మ ఆలయాలు ఏ రాజవశీయుల కాలానికి చెందినవి ? - పశ్చిమ (బాదామి) చాళుక్యులు
59. చోళ తూర్పు చాళుక్య రాజులను ఏకం చేసిన రాజు ? - రాజేంద్ర చోళుడు
60. ఆంధ్రాలో వీరశైవ రాజ్యాలను ఏకం చేసిన రాజు ? - రాజేంద్ర చోళుడు
61.ఆంధ్రాలో వీరశైవ మతాన్ని ప్రవేశపెట్టి ప్రచారం చేసిన వారు ? – పందితారాధ్యుడు
62. ఇక్ష్వాకుల రాజధాని ? – విజయపురి
63. ఏ రాజ వంశ కాలంలో ఆంధ్రదేశంలో బౌద్ధమతం విలసిల్లింది ? –ఇక్ష్వాకులు
64. జయవర్మ ఆంధ్ర రాజవంశాల్లో దేనికి చెందినవారు ? - బృహత్పలాయనులు65. శాలంకాయన రాజ్యస్థాపకుడు ఎవరు ? – విజయదేవవర్మ
66. శాలంకాయనుల రాజధాని ? – పెదవేగి
67. పల్లవులను ఓడించి దక్షిణాదికి తరిమివేసి కృష్ణానది దక్షిణ తీరప్రాంతాన్ని పాలించిన ఆంధ్ర దేశ రాజులు ? – ఆనందగోత్రులు
68.ఆనందగోత్రుల రాజధాని ? – కందరపురం
69. ఉండవల్లి గుహలయాలు నిర్మించిన రాజులు ? – విష్ణుకుండినులు
70. పల్లవుల రాజధాని ? – కాంచిపురం
71. పల్లవుల రాజ లాంఛనం ? – వృషభం
72. పల్వవ వంశ మూల పురుషుడు ? – వీరకూర్చవర్మ
73. మహాబలి (మామల్ల) పురం రేవు పట్టణాన్ని నిర్మించిన పల్లవరాజు ? - మొదటి నరసింహవర్మ
74. కులోత్తుంగ చోళ బిరుదాంకెతుడై గంగైకొండ చోళాపురం (చోళరాజ్యం)ను పాలించిన రాజేంద్రుడు ఎవరి కుమారుడు ? - రాజరాజ నరేంద్రుడు
75. తూర్పు చాళుక్యుల్లో సుప్రసిద్ధ రాజు ? - గుణగ విజయాధిపత్యుడు
76. తూర్పు చాళుక్య రాజ్య స్థాపకుడు ? - కుబ్జ విష్ణువర్థనుడు
77. రాజారాజ నరేంద్రుని రాజ్య పరిపాలనా కాలం ? - క్రీశ.1019-1061
78. తూర్పు చాళుక్యుల రాజధానిని వేంగి నుంచి రాజమహేంద్రవరానికి ఎవరు మార్చారు ? - మొదటి అమ్మరాజు
79.శాలంకాయనుల ఆరాధ్యదైవం ? - చిత్రరథ స్వామి
80. వేంగి (తూర్పు) చాళుక్య రాజ్యస్థాపకుడైన కుబ్జ విష్ణువర్ణనుడు ఎవరి ప్రతినిధిగా రాజ్యాన్ని పాలించాడు ? - రెండో పులకేశి
81. రెడ్డి రాజుల రాజధానిని అద్దంకి నుంచి కొండవీడుకి మార్చిన రాజు ? - పెద్దకోమటి వేమారెడ్డి
82. నేలమల రాజధాని రాచకొండ ప్రస్తుతం ఏ జిల్లాలో ఉంది ? – నల్గొండ
83. ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధ మతాభివృద్ధికి నిదర్శనం ? - ఉపాసిక బోధి శాసనం
84. ఆనంద గోత్రికులు ఎవరి సామంతులు ? – పల్లవులు
85. మొదటి హిందూ దేవాలయాన్ని కట్టించిన ఆంధ్ర వంశ రాజులు ? – ఇక్ష్వాకులు
86. బృహత్పలాయనుల గురించి తెలిపే ఒకే ఒక ఆధారం - కొండముది శాసనం
87.త్రికూట మలయాధిపతి అను బిరుదు ఎవరిది ? - రెండో మాధవ వర్మ
88.గూడూరు ఏ వంశరాజులరాజధాని ? – బృహత్పలాయనులు
89. తూర్పు చాళుక్య రాజుల్లో సుప్రసిద్ధుడు ? - గుణగ విజయాదిత్యుడు
90. తొలి చాళుక్యుల నాటి కుడ్య చిత్రాలు (పెయింటింగ్స్‌) ఎక్కడ లభ్యమయ్యాయి ? - అజంతా