Showing posts with label Tech News. Show all posts
Showing posts with label Tech News. Show all posts

Tuesday, August 8, 2023

ఎయిర్‌టెల్‌ 5జీ వైర్‌లెస్ వైఫై ప్రారంభం..

 

 


దేశంలో ప్రముఖ టెలికాం సంస్థ భారతి ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్‌ ఎయిర్‌ఫైబర్‌ (Xstream AirFiber) పేరిట ఫిక్స్‌డ్‌ వైర్‌లెస్‌ 5జీ సర్వీస్‌లను ప్రకటించింది. ఢిల్లీ,  ముంబై నగరాల్లో తొలి 5జీ టెక్నాలజీ ఆధారిత ఫిక్స్‌డ్‌ వైర్‌లెస్ యాక్సెస్ (FWA) సేవలను ప్రారంభించింది.

నెట్‌వర్క్‌ అందుబాటులోని మారుమూల గ్రామాలకు సైతం ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించే ఉద్దేశంతో ఈ టెక్నాలజీ 5జీ వైర్‌లెస్‌ సేవలు అందుబాటులోకి తీసువచ్చినట్లు ఎయిర్‌టెల్‌ తెలిపింది. ఈ ఎక్స్‌ట్రీమ్‌ ఎయిర్‌ ఫైబర్‌ వైర్‌లెస్‌గా 100 Mbps వేగంతో ఇంటర్నెట్‌ అందిస్తుంది.

ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ఎయిర్‌ఫైబర్‌ అనేది స్వతంత్రంగా పనిచేసే ఓ ప్లగ్ అండ్ ప్లే పరికరం. వైఫై 6 ప్రమాణాలతో అంతరాయం లేకుండా విస్తృత నెట్‌వర్క్ కవరేజీని అందిస్తుంది. దీని ద్వారా ఏకకాలంలో  64 ఫోన్లు లేదా ల్యాప్‌టాప్‌లకు హై స్పీడ్ ఇంటర్నెట్‌ను పొందవచ్చు. ఈ పరికరానికి సంబంధించిన హార్డ్‌వేర్ పరికరాలన్నీ భారత్‌లోనే తయారైనట్లు కంపెనీ పేర్కొంది.  గత మూడు నాలుగేళ్లుగా ఇళ్లలో ఉపయోగించే వైఫై సేవలకు డిమాండ్ విపరీతంగా పెరిగిందని,  ఎక్స్‌ట్రీమ్‌ ఎయిర్‌ఫైబర్‌తో ఫిజికల్ ఫైబర్ నెట్‌వర్క్ సదుపాయం లేని ప్రాంతాలకు కూడా వేగవంతమైన వైఫై ఇంటర్నెట్‌ సేవలు అందిస్తామని కంపెనీ పేర్కొంది. 

ప్రస్తుతం డిల్లీ, ముంబై నగరాల్లోనే ఈ సేవలు ప్రారంభించినప్పటికీ రాబోయే రోజుల్లో దేశమంతటా విస్తరించాలని యోచిస్తోంది. 5జీ ఆధారిత ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ సర్వీస్‌ను అధికారికంగా ప్రారంభించిన మొదటి కంపెనీ ఎయిర్‌టెల్. అయితే కొన్ని నెలల క్రితం జియో కూడా జియో ఎయిర్‌ఫైబర్ పేరుతో ఇటాంటి సర్వీసునే తీసుకురాన్నుట్లు ప్రకటించింది.  ప్రస్తుతానికి జియో ఎయిర్‌ఫైబర్‌ ధరలు ఎంత ఉంటాయి.. అధికారికంగా ఎప్పుడు ప్రారంభిస్తారు? అన్న వివరాలపై సమాచారం లేదు.

ఎయిర్‌టెల్‌ ఎయిర్‌ఫైబర్‌ ప్లాన్‌ వివరాలు
ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఎయిర్‌ఫైబర్ నెలకు రూ. 799. హార్డ్‌వేర్ కాంపోనెంట్ కోసం సెక్యూరిటీ డిపాజిట్‌గా అదనంగా రూ. 2,500 చెల్లించాలి. మొత్తం ఆరు నెలల ప్యాకేజ్‌ 7.5 శాతం తగ్గింపుతో రూ. 4,435లకే అందిస్తోంది. అయితే ఎయిర్‌టెల్ అపరిమిత డేటాను ఆఫర్ చేస్తుందా లేదా మిగిలిన  బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల మాదిరిగానే పరిమితి ఉంటుందా అనేది స్పష్టత లేదు.

 

 

Thursday, August 3, 2023

ఆధార్‌ అప్‌డేట్‌పై బిగ్‌ న్యూస్‌.. అప్పటి వరకూ సమయాన్ని పెంచుతూ కీలక ప్రకటన

 


 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ నిర్వహించే సుమారు 1,200 ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు సేవా బట్వాడా కోసం ఆధార్ ఆధారిత గుర్తింపు ఉపయోగిస్తారు. అదనంగా బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు వంటి ఆర్థిక సంస్థల వంటి సేవా ప్రదాతలు అందించే అనేక ఇతర సేవలు కూడా వినియోగదారులను సులభంగా ప్రామాణీకరించడానికి, ఆన్‌బోర్డ్ చేయడానికి ఆధార్‌ను ఉపయోగిస్తున్నాయి.

భారతదేశంలో ‍ప్రతి చిన్న అవసరానికి ఆధార్‌ నెంబర్‌ తప్పనిసరిగా మారింది. ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందడానికి ఆధార్‌ తప్పనిసరి చేయడంతో ఆధార్‌ కార్డును లైవ్‌లో ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే పుట్టిన దగ్గరి నుంచి చనిపోయే వరకూ ఆధార్‌ ఏదో రూపంలో అవసరం అవుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ నిర్వహించే సుమారు 1,200 ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు సేవా బట్వాడా కోసం ఆధార్ ఆధారిత గుర్తింపు ఉపయోగిస్తారు. అదనంగా బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు వంటి ఆర్థిక సంస్థల వంటి సేవా ప్రదాతలు అందించే అనేక ఇతర సేవలు కూడా వినియోగదారులను సులభంగా ప్రామాణీకరించడానికి, ఆన్‌బోర్డ్ చేయడానికి ఆధార్‌ను ఉపయోగిస్తున్నాయి. అయితే ఆధార్ ఎన్‌రోల్‌మెంట్, అప్‌డేటింగ్ రూల్స్ 2016 ప్రకారం ఆధార్ నంబర్ హోల్డర్‌లు తమ డేటా కచ్చితత్వాన్ని కాపాడుకోవడం కోసం ఎన్‌రోల్‌మెంట్ తేదీ నుంచి కనీసం పది సంవత్సరాలకు ఒకసారి ఆధార్‌లో తమ సపోర్టింగ్ పేపర్‌లను అప్‌డేట్ చేయాల్సి ఉంది. అందువల్ల ఈ ఏడాది జూన్‌ 14 వరకూ ఈ సేవను ఫ్రీగా అందించిన ప్రభుత్వం తాజాగా గడువును పెంచింది. కాబట్టి ఆధార్‌ అప్‌డేట్‌ గురించి కీలక విషయాలను తెలుసుకుందాం. 

ఆధార్ నంబర్ హోల్డర్లందరూ తమ డేటా కచ్చితత్వాన్ని నిర్ధారించుకోవడానికి ఎన్‌రోల్‌మెంట్ తేదీ నుంచి కనీసం పదేళ్లకు ఒకసారి ఆధార్‌లో తమ సపోర్టింగ్ డాక్యుమెంట్లను అప్‌డేట్ చేయాలని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడీఎఐ) సూచించింది. యూఐడీఏఐ నెటిజన్ల కోసం ఆధార్ కార్డ్ పత్రాల నవీకరణ కోసం ఉచిత సర్వీస్‌ను ప్రారంభించింది.  గతంలో ఈ గడువు జూన్‌ 14 వరకూ ఉండగా ప్రస్తుతం సెప్టెంబర్‌ 30 వరకూ ఉంచింది. ఈఉచిత సేవ ప్రత్యేకంగా మైఆధార్‌ పోర్టల్‌లో అందుబాటులో ఉండాలి. అయితే మీరు భౌతిక ఆధార్ కేంద్రాలను ఉపయోగించాలనుకుంటే రూ. 50 ఛార్జీ ఇప్పటికీ వర్తిస్తుంది. మీరు మీ జనాభా సమాచారాన్ని (పేరు, పుట్టిన తేదీ, చిరునామా మొదలైనవి) అప్‌డేట్ చేయాలనుకుంటే మీకు రెండు ఎంపికలు ఉన్నాయి. మీరు ప్రామాణిక ఆన్‌లైన్ అప్‌డేట్ సేవను ఉపయోగించవచ్చు లేదా మీ స్థానిక ఆధార్ కేంద్రాన్ని సందర్శించవచ్చు. కాబట్టి ఆన్‌లైన్‌లో ఈ సేవను ఎలా ఉపయోగించుకోవాలో? ఓసారి చూద్దాం.

యూఐడీఏఐలో అప్‌డేట్‌ ప్రాసెస్‌ ఇదే..

https://myaadhaar.uidai.gov.in/ 

  • స్టెప్‌-1: మై ఆధార్‌ వెబ్‌సైట్‌లో ఆధార్‌ నెంబర్‌ ద్వారా లాగిన్‌ అవ్వాలి.
  • స్టెప్‌-2: ‘డాక్యుమెంట్ అప్‌డేట్’ ఎంచుకుంటే మీ ప్రస్తుత వివరాలు ప్రదర్శితమవుతాయి.
  • స్టెప్‌-3: వివరాలను ధ్రువీకరించి, తదుపరి హైపర్‌లింక్‌పై క్లిక్ చేయాలి.
  • స్టెప్‌-4: డ్రాప్‌డౌన్ జాబితా నుంచి గుర్తింపు రుజువు, చిరునామా పత్రాలను ఎంచుకోవాలి.
  • స్టెప్‌-5: స్కాన్ చేసిన కాపీలను అప్‌లోడ్ చేసి చెల్లింపు చేయడానికి కొనసాగండి.
  • స్టెప్‌-6: చెల్లింపు ప్రాసెస్‌ అయ్యాక వ్యాలిడేషన్‌ అనంతరం మీ ఆధార్‌ కార్డు అప్‌డేట్‌ అవుతుంది. 

 

 Tags: aadhar update, aadhar update check, uidai aadhar update, mobile number aadhar update mobile number aadhar update documents aadhaar update online aadhar update online aadhaar update status aadhar update address aadhar update application aadhar update app aadhar update address proof aadhaar update appointment aadhar update age aadhar update age limit aadhar update agents near me airtel aadhar update aadhaar address update

Keywords  : #aadharupdate ,#Aadharaddresschange 

66 లక్షల వాట్సాప్‌ అకౌంట్లు బ్యాన్‌.. కారణం ఇదే...

 


మెటా (Meta) యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్‌(WhatsApp) భారత్‌లో 2023 జూన్ నెలలో 66 లక్షలకు పైగా అకౌంట్లను బ్యాన్‌ చేసింది. ఐటీ రూల్స్ 2021కి అనుగుణంగా మెటా ఈ చర్యలు తీసుకుంది.

2023 జూన్ 1 నుంచి 30వ తేదీ మధ్య మొత్తం 6,611,700 వాట్సాప్ అకౌంట్లను బ్యాన్‌ చేసింది. ఇందులో 2,434,200 అకౌంట్లను ఫిర్యాదులతో సంబంధం లేకుండా ముందస్తుగా నిషేధించినట్లు వాట్సాప్‌ తాజా నివేదికలో వెల్లడించింది. మరోవైపు జూన్‌ నెలలో 7,893 ఫిర్యాదులు అందగా వీటిలో 337 అకౌంట్లపై చర్యలు తీసుకున్నట్లు ప్రకటించింది.

 వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా 500 మిలియన్‌లకు పైగా యూజర్లు ఉన్నారు. యూజర్‌ సేఫ్టీ రిపోర్ట్‌లో నమోదైన ఫిర్యాదులకు అనుగుణంగా కొన్ని అకౌంట్లపై చర్యలు తీసుకోగా నిబంధనలు అతిక్రమించిన మరికొన్ని అకౌంట్లపై ముందస్తు చర్యలు చేపట్టినట్లు వాట్సాప్‌ పేర్కొంది. చర్యల నిమిత్తం గ్రీవెన్స్‌ అప్పిలేట్‌ కమిటీ నుంచి ఆదేశాలు అందినట్లు తెలిపింది.

 

Saturday, June 17, 2023

యూట్యూబ్ నిబంధనల సడలింపు.. యూట్యూబ్ నుండి డబ్బు ఇప్పుడు ఈజీగా సంపాదించండి

 


ఆన్ లైన్ వీడియో షేరింగ్ ఫ్లాట్ ఫార్మ్  యూట్యూబ్ నుండి డబ్బు ఎలా సంపాదించాలా అని ఆలోచించేవారు మన చుట్టూ చాల మంది ఉండే ఉంటారు. అలాంటి వారి కోసం యూట్యూబ్ ఒక కొత్త నోటిఫికేషన్ ద్వారా  గుడ్ న్యూస్ అందించింది. యూట్యూబ్ అకౌంట్  క్రియేట్ చేసి వీడియోలను అప్‌లోడ్ చేసిన తర్వాత దాని ద్వారా ఆదాయాన్ని సంపాదించడానికి కొన్ని షరతులు ఉన్నాయి. అయితే యూట్యూబ్ ఈ నిబంధనలను సడలించింది.

ప్రస్తుతం, YouTube కంటెంట్ క్రియేటర్ పేమెంట్ పొందడానికి 1000 మంది సబ్‌స్క్రైబర్‌లు, సంవత్సరంలో 4000 గంటల వ్యూస్  లేదా 90 రోజుల్లో 1 కోటి యూట్యూబ్  షార్ట్స్ వ్యూస్  అవసరం. కానీ యూట్యూబ్ ఉత్తర అమెరికాలో ఈ నిబంధనలను కొద్దిగా మార్చింది. దీని ప్రకారం, పేమెంట్  పొందడానికి ఛానెల్‌లో కనీసం మూడు వీడియోలు తప్పనిసరిగా ఒక సంవత్సరంలో 3000 గంటల వ్యూస్ లేదా 90 రోజుల్లో 30 లక్షల షార్ట్స్ వ్యూలను లేదా 1000 మంది సబ్‌స్క్రైబర్‌లకు బదులు 500 సబ్‌స్క్రైబర్‌లను పొందాలి.

 యుఎస్ అండ్ కెనడాలో ఉన్న ఈ షరతులు భారతదేశం వంటి మార్కెట్లకు దగ్గరగా రావచ్చని నివేదించబడింది. అయితే యూట్యూబ్ వీడియోలు అండ్ క్రియేటర్లు భారీగా పెరిగిన భారతీయ మార్కెట్లో యూట్యూబ్ త్వరిత రాయితీని ఇస్తుందనే సందేహాలు ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో Tik Tok లేదా InstaReels వంటి చిన్న వీడియో ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి ఇంకా బెస్ట్  కంటెంట్ క్రియేటర్స్ ని ఆకర్షించడానికి YouTube  ఈ మార్పు ప్రధానంగా ఉందని నివేదించబడింది.

అంటే ఛానెల్‌లో కనీసం మూడు  వీడియోలు సంవత్సరంలో 3000 గంటల వ్యూస్ క్కి సరిపోతాయి. గొప్ప కంటెంట్‌ను కనుగొనడానికి క్రియేటర్లకు సమయం ఇవ్వాలని YouTube భావిస్తోంది. దీని వల్ల కంటెంట్ నాణ్యత పెరుగుతుందని యూట్యూబ్ కూడా విశ్వసిస్తోంది.

అదే సమయంలో, చిన్న వీడియో ప్లాట్‌ఫారమ్‌ల ఛాలెంజ్‌కి పోటీగా 90 రోజుల్లో 30 లక్షల తీర వీక్షణలు సెట్ చేయబడ్డాయి. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ కింద పనిచేసే యూట్యూబ్ ఇలాంటి  వీడియోల సంఖ్యను పెంచుతుందని అభిప్రాయపడింది. 

 Tags : Youtube

Sunday, December 4, 2022

USB Type C Connector : భారత్ కూడా కామన్ ఛార్జింగ్ పోర్ట్‌పై ఒక నిర్ణయానికి వచ్చింది. స్టాండర్డ్‌ ఛార్జర్‌లు వచ్చిన తర్వాత..

 USB Type C Connector : భారత్ కూడా కామన్ ఛార్జింగ్ పోర్ట్‌పై ఒక నిర్ణయానికి వచ్చింది. స్టాండర్డ్‌ ఛార్జర్‌లు వచ్చిన తర్వాత.. ఫోన్‌ తయారీదారులు యూజర్లకు బాక్స్‌లో ఛార్జర్‌లను రవాణా చేయనవసరం లేదు.

USB Type C Port for All Devices : ప్రస్తుతం వివిధ కంపెనీల స్మార్ట్‌ఫోన్‌ (Smartphones)లకు ప్రత్యేక ఛార్జర్‌ను వినియోగించాల్సి ఉంటుంది. సాధారణంగా మొబైల్స్‌ పోర్ట్‌లు అన్నింటికీ ఒకేలా ఉండవు. దీంతో ఒక ఛార్జర్‌ను మరో ఫోన్‌కు వినియోగించలేని పరిస్థితి. ఫలితంగా ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పెరగడానికి కూడా ఇది కారణమవుతోంది. ఈ సమస్యలను దూరం చేసేందుకు వివిధ దేశాలు కామన్‌ పోర్ట్‌ తీసుకురావాలని చెబుతున్నాయి.

తాజాగా భారత్ కూడా కామన్ ఛార్జింగ్ పోర్ట్‌పై ఒక నిర్ణయానికి వచ్చింది. స్టాండర్డ్‌ ఛార్జర్‌లు వచ్చిన తర్వాత.. ఫోన్‌ తయారీదారులు యూజర్లకు బాక్స్‌లో ఛార్జర్‌లను రవాణా చేయనవసరం లేదు. వినియోగదారుల వద్ద అప్పటికే అవసరమైన ఛార్జర్‌లు ఉంటాయి అవి అన్నింటికీ సరిపోతాయి. ఇలా ఇరు వర్గాల ఖర్చులు ఆదా అవుతాయి. యూరోపియన్ యూనియన్ ఇటీవల ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. 2024 నాటికి అన్ని మొబైల్ డివైజ్‌లు, టాబ్లెట్‌లకు USB-C పోర్ట్‌లు ఉండటాన్ని తప్పనిసరి చేసింది. ఈ దిశగా ప్రముఖ కంపెనీలు ఇప్పటికే చర్యలు ప్రారంభించాయి. తాజాగా ఇండియాలో కూడా ఈ దిశగా అడుగులు పడుతున్నాయి.

ఇండియా ప్రస్తుతం దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇంటర్‌ మినిస్ట్రియల్‌ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఈ టాస్క్‌ఫోర్స్‌ సమావేశంలో వాటాదారులు ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత భారతదేశం అన్ని స్మార్ట్ డివైజ్‌లకు USB టైప్ C ఛార్జింగ్ పోర్ట్‌ ఉండాలనే నిబంధనలు తీసుకొస్తుంది.



USB-C Port అంటే ఏంటి..? ఉపయోగాలు ఏంటి..?
ఈ మధ్య రిలీజ్ అవుతోన్న స్మార్ట్‌ఫోన్‌లలో USB Type- C port అనే స్పెసిఫికేషన్‌ను మనం వింటున్నాం. వాస్తవానికి.. యూఎస్బీ టైప్ - సీ పోర్ట్ అనేది ఓ కొత్త యూఎస్బీ స్టాండర్డ్. దీన్నే యూఎస్బీ 3.1 అని కూడా పిలుస్తారు. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న అన్ని యూఎస్బీ వర్షన్‌లకు ఇది అప్‌డేటెడ్ వర్షన్. ప్రస్తుతానికి మనం వాడుతున్న యూఎస్బీ టైప్ - A, టైప్ - B పోర్ట్స్ కేవలం ఒక సైడ్ మాత్రమే కనెక్ట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తాయి.

 
కొత్తగా అందుబాటులోకి వచ్చిన USB Type- C port రెండు వైపులా కనెక్ట్ చేసుకునే వెసలుబాటును కల్పిస్తుంది. USB Type-C port అన్ని రకాల అవసరాలను తీరుస్తుంది. డేటాను హై స్పీడ్ వేగంతో ట్రాన్స్ ఫర్ చేస్తుంది. అలానే ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ టైప్ - సీ పోర్ట్ బై డైరక్షనల్ పద్ధతిలో పవర్.. అలానే డేటాను సెండ్ చేయటంతో పాటు రీసీవ్ కూడా చేసుకుంటుంది. ఈ సదుపాయంతో రెండు డివైస్‌ల మధ్య డేటా అలానే పవర్‌ను అటు ఇటు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.



Type-C port కోసం అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రత్యేకమైన అడాప్టర్‌కు HDMI, VGA, Display తదితర కనెక్షన్‌లను అనుసంధానించుకుని హైక్వాలిటీ అవుట్‌పుట్‌ను పొందవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే Type-C port అందుబాటులోకి రావటం వల్ల ఇక పై ఎక్కువ కేబుల్స్ ను ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. అన్ని రకాల కనెక్టువిటీ పనులను యూఎస్బీ టైప్ - సీ పోర్ట్ పోర్ట్ సింపుల్ గా చక్కబెట్టేస్తుంది. రెండు డివైస్ లను USB Type-C port ఆధారంగా కనెక్ట్ చేయాలంటే కచ్చితంగా ఆ రెండు డివైస్‌లు టైప్ - సీ పోర్ట్‌ లను కలిగి ఉండాలి.

 

Saturday, December 3, 2022

షావోమి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. షియోమి 12కి కొన‌సాగింపుగా షియోమి 13 సిరీస్‌

 





 

Xiaomi 13 to launch on December 1 : చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. షియోమి 12కి కొన‌సాగింపుగా షియోమి 13 సిరీస్‌ (Xiaomi 13 Pro)ను డిసెంబ‌ర్ 1వ తేదీన లాంఛ్ చేయ‌నున్న‌ట్టు కంపెనీ త‌న అధికారిక వీబో పేజ్‌లో వెల్ల‌డించింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగ‌న్ 8 జెన్ 2 చిప్‌సెట్‌తో లీకా ట్యూన్డ్ కెమెరాల‌తో షియోమి లేటెస్ట్ సిరీస్ క‌స్ట‌మ‌ర్ల ముందుకు రానుంద‌ని టెక్ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

ఈ సిరీస్‌లో Xiaomi 13 Pro పేరుతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ రానుంద‌ని అఫిషియ‌ల్ పోస్టర్ వెల్ల‌డించింది. ఇక Xiaomi 13 Pro క‌ర్వ్డ్ డిస్‌ప్లేతో రెగ్యుల‌ర్ మోడ‌ల్ ఫ్లాట్ డిస్‌ప్లేతో ఉంటుంద‌ని చెబుతున్నారు. లాంఛ్ ఈవెంట్ డిసెంబ‌ర్ 1 రాత్రి ఏడుగంట‌ల‌కు ఉంటుంద‌ని కంపెనీ తెలిపింది. షియోమి లేటెస్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14 అవుటాఫ్ ది బాక్స్ ఓఎస్‌పై ర‌న్ అవుతుంది.

ఇక షియోమి 12 ప్రొను భార‌త్‌లో ఈ ఏడాది ఏప్రిల్‌లో లాంఛ్ చేయ‌గా ధ‌ర రూ.62,999 కాగా.. భార‌త్‌లో షియోమి 13 ప్రో ధ‌ర కొంచెం అధికంగా ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇక షియోమి 13 సిరీస్ ఫీచ‌ర్ల విష‌యానికి వ‌స్తే.. లీకుల ఆధారంగా లేటెస్ట్ షియోమి సిరీస్ స్నాప్‌డ్ర‌గ‌న్ 8 జెన్ 2 ఎస్ఓసీ చిప్‌సెట్‌తో, ప్రొ మోడ‌ల్ 6.65 ఇంచ్ 2కే రిజ‌ల్యూష‌న్ క‌ర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేతో క‌స్ట‌మ‌ర్ల ముందుకు రానుంది. డిసెంబర్ 1వ తేదీన రాత్రి 7 గంటలకు షావోమి 13 సిరీస్‌ను విడుదల చేయనున్నారు.

Moto X40 : Motorola నుంచి మరో కొత్త ఫోన్ రానుంది.. Moto X40 వివరాలు ఇవే..!
ఇటీవల కాలంటో మోటరోలా కొత్త ఫోన్ల లాంచింగ్‌లతో దూసుకుపోతోంది. గత కొన్ని నెలల క్రితం Moto X30 Proని లాంచ్ చేసింది.. 200MP కెమెరాతో ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌గా ఇది అవతరించింది. ఇప్పుడు.. Moto X40 త్వరలో Snapdragon 8 Gen 2 చిప్‌సెట్‌తో త్వరలో లాంచ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ కొత్త Motorola స్మార్ట్‌ఫోన్ అదే చిప్‌సెట్‌తో రాబోయే ఫోన్‌లతో ఎంతవరకు పోటీపడుతుంది? అనే విషయాలు తెలుసుకుందాం..

మోటో ఎక్స్‌40 టీజ‌ర్ల‌తో అంచ‌నాలు పెంచుతున్న మొటొరోలా ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ లాంఛ్ డేట్‌ను మాత్రం ఇంకా వెల్ల‌డించ‌లేదు. డిసెంబ‌ర్‌లో రానున్న మోటో ఎక్స్‌40 స్పెసిఫికేష‌న్స్‌పై లెనోవా ఎగ్జిక్యూటివ్ చెన్ జిన్ కీల‌క స‌మాచారం వెల్ల‌డించారు. నెక్ట్స్ మొటొరోలా ఫోన్ స్పెసిఫికేష‌న్స్‌పై వీబోలో స‌మాచారం అందించారు.


మోటో ఎక్స్‌40 లేటెస్ట్ స్నాప్‌డ్రాగ‌న్ 8 జెన్ 2 చిప్‌సెట్‌తో క‌స్ట‌మ‌ర్ల ముందుకు రానుంది. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ వాట‌ర్, డస్ట్ రెసిస్టెన్స్‌తో కూడిన ఐపీ68 రేటింగ్‌ను క‌లిగిఉంది. మోటో ఎక్స్40 6.67 ఇంచ్ ఓఎల్ఈడీ ప్యానెల్‌తో, 4x ఆప్టిక‌ల్ జూమ్ స‌పోర్ట్‌తో కూడిన‌ ట్రిపుల్ రియ‌ర్ కెమెరా సెట‌ప్‌తో క‌స్ట‌మ‌ర్ల‌ను ఆకట్టుకోనుంది.

ఇక మోటో ఎక్స్‌40 4950ఎంఏహెచ్ బ్యాట‌రీ సామ‌ర్ధ్యం క‌లిగి ఉంటుంద‌ని టెక్ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ 128జీబీ, 256జీబీ, లేదా 512జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌తో 8జీబీ, 12జీబీ, 18జీవీ ర్యాంతో మార్కెట్‌లోకి రానున్నాయ‌ని చెబుతున్నారు.

Moto X40 లాంచ్ ద్వారా ఏమి ఆశించాలి..?
తాజా పుకార్లు నిజమైతే.. రాబోయే Moto X40 స్మార్ట్ ఫోన్ Xiaomi మరియు Samsungని ఓడించి సరికొత్త Qualcomm మొబైల్ చిప్‌తో వచ్చే మొదటి ఫోన్‌గా మార్కెట్లో ప్రవేశించవచ్చు. Samsung Galaxy S23 గీక్‌బెంచ్‌లో ఒకే చిప్‌సెట్‌తో గుర్తించబడింది. ఇది రెండు ఫోన్‌లను ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంచుతుంది.

OnePlus, Xiaomi, OPPO మరియు Vivo వంటి ఇతర బ్రాండ్లు కూడా అదే చిప్‌సెట్‌తో ఫ్లాగ్‌షిప్‌లపై పని చేస్తున్నాయని తెలుస్తోంది. Qualcomm Snapdragon 8 Gen 2 ఆకట్టుకునే CPU పనితీరును నమోదు చేస్తుందని కూడా నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ ఫోన్‌లు లాంచ్ అయిన తర్వాత మాత్రమే వాస్తవ విషయాలు తెలియనున్నాయి.

Thursday, September 15, 2022

మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న సాంకేతికత

 


అతి వినియోగంతో తగ్గుతున్న జ్ఞాపకశక్తి

పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు

పెను ప్రమాదంలో 15–32 ఏళ్ల యువత

అభివృద్ధితో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవడమూ ముఖ్యమంటున్న నిపుణులు 

‘‘కర్నూలు సిటీలోని గణేశ్‌నగర్‌ వాసి మహ్మద్‌ రిజ్వాన్‌ వెన్నునొప్పితో గాయత్రి ఎస్టేట్‌లోని ఓ న్యూరోఫిజిషియన్‌ వద్దకు వెళ్లారు. డాక్టర్‌ ఆరాతీస్తే రోజూ అర్ధరాత్రి ఒంటిగంట వరకూ మేల్కొని సెల్‌ఫోన్‌ చూస్తుంటారని తేలింది. ఇతనికి ఇదొక్కటే సమస్య కాదు కంటిచూపు తగ్గడం, విపరీతమైన తలనొప్పి కూడా ఉన్నాయి.’’ 

‘‘మనస్విని అనే ఐదోతరగతి చదువుతోన్న చిన్నారి ఏక్యాంపులో నివాసం ఉంటోంది. ఈ వయస్సుకే దృష్టిలోపం వచ్చింది. ఆస్పత్రికి వెళితే కంటిచూపు ‘మైనస్‌ వన్‌’ ఉందని అద్దాలు ఇచ్చారు. స్కూలు నుంచి రాగానే సెల్‌ఫోన్, టీవీకి అతుక్కుపోతుందని, గట్టిగా మందలిస్తే భోజనం చేయకుండా మారం చేస్తుందని, తాము ఏం చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నామని తల్లిదండ్రులు చెబుతున్నారు’’ 


సాక్షిప్రతినిధి, కర్నూలు: ప్రపంచీకరణ నేపథ్యంలో టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతోంది. 30 ఏళ్ల కిందటతో పోలిస్తే టెక్నాలజీ అభివృద్ధి, తద్వారా జనజీవనానికి జరిగిన మేలు ఊహలకందనిది. చావు కబురు పంపాలంటే గతంలో టెలిగ్రాం చేయాల్సి వచ్చేది. బంధువులను పండుగల్లోనే, వేసవి కాలం సెలవుల్లోనూ చూడాల్సి వచ్చేది. మధ్యలో మంచిచెడులు తెలుసుకోవాలంటే ఉత్తరాలు దిక్కయ్యేవి. ఈ దశ నుంచి కంప్యూటర్, ఇంటర్నెట్‌ యుగంలోకి వచ్చాం. ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో ఆండ్రాయిడ్‌ ఫోన్‌ ఉంటోంది! ఇంటింటా స్మార్ట్‌ టీవీలు ఉన్నాయి. ఇంటర్నెట్‌తో ఇంటి నుంచే ప్రపంచంలో ఏం జరుగుతోందో తెలుసుకుంటున్నాం. ఏ సమాచారం కావాలన్నా గూగుల్‌లో దొరుకుతోంది. కావాల్సిన బ్రాండ్‌ దుస్తులు, వస్తువులు ఏది కావాలన్నా ఆన్‌లైన్‌లో షాపింప్‌ చేస్తున్నాం. వ్యాపార రంగంలో ఆన్‌లైన్‌ బిజినెస్‌ వాటా ఏకంగా 37 శాతం ఉందంటే టెక్నాలజీ ప్రభావం ఏవిధంగా ఉందో స్పష్టమవుతోంది. 

ఇదే రకంగా పిల్లల వీడియో గేమ్స్‌ యాప్స్‌ రూపంలో మొబైల్స్, టీవీల్లో వస్తున్నాయి. టెక్నాలజీ లేకుంటే రోజువారీ జీవితం నడవని పరిస్థితి నెలకొంది. మనకు తెలియని ప్రాంతానికి వెళ్లాలంటే అడ్రస్‌ కోసం ‘గూగుల్‌’ మ్యాప్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తోంది. ఇదంతా నాణేనికి ఓవైపు మాత్రమే. మరోవైపు నిశితంగా పరిశీలిస్తే టెక్నాలజీని అతిగా వినియోగిస్తూ ఆరోగ్య సమస్యలతో అల్లాడిపోతున్నవారు లక్షల సంఖ్యలో ఉన్నారు. వీరిలో 15–32 ఏళ్ల వయస్సున్న యువతీ, యువకులు ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగించే విషయం.  

పెరుగుతున్న ఒత్తిడి 
టెక్నాలజీలో ఎక్కువ సమస్యలు వస్తోంది స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్‌తోనే అని ‘యూరోపియన్‌ స్పైన్‌ జర్నల్‌’ ప్రచురించింది. చిన్న పిల్లలు, టీనేజర్ల మానసిక వికాసంపై టెక్నాలజీ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ వయస్సు వారిలోనే మానసిక, శారీరక సమస్యలు వస్తున్నాయి. సోషల్‌ మీడియాకు ఎక్కువగా అలవాటైనవారిలో సాధారణ కంటే ఐదు రెట్లు ఒత్తిడి ఉంటోంది. మొబైల్‌ఫోన్లను తక్కువగా వాడేవారు సానుకూల ఆలోచనా ధోరణితో ఒత్తిడికి దూరంగా ఉంటే, ఎక్కువగా ఆధారపడే వారు నెగిటివ్‌ ఆలోచనలతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.

ట్యాబ్‌లు, స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లపై ఎక్కువ సమయం గడిపేవారు కంటి సమస్యలతో బాధపడుతున్నారు. చాలా మందికి తలనొప్పి, మెడ, భుజాల నొప్పి వస్తున్నాయి. ఈ సమస్యలతో ఆస్పత్రికి వెళ్లేవారు గత నాలుగేళ్లలో ఏకంగా ఐదురెట్లు పెరిగారు. దీంతో ‘అమెరికా ఆప్తాల్మజీ అసోసియేషన్‌’ ఓ రూల్‌ ప్రవేశపెట్టింది. కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు వాడేవారు ప్రతీ 20 నిమిషాలకొకసారి కనీసం 20 సెకండ్లు దృష్టి మరల్చాలి. 20 అడుగుల దూరం నడక సాగించాలి. 

డేంజర్‌ జోన్‌లో చిన్నపిల్లలు  
అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ పీడియాట్రిక్‌ చేసిన ఓ సర్వేలో చిన్నపిల్లలపై టెక్నాలజీ ప్రభావం ఎక్కువగా ఉంటోందని తేలింది. స్కూలు నుంచి ఇంటికి రాగానే ఫోన్, టీవీకి అతుక్కుపోతున్నారు. దీంతో చదువులో వెనుకబడటం, క్రమశిక్షణ లేకపోవడం, దేనిపైనా సరైన ఫోకస్‌ లేకపోవడం, వ్యక్తులతో మాట్లాడటం తగ్గిపోవడం, శారీరక శ్రమ తగ్గిపోయి ఊబకాయం పెరగడం, నిద్రలేమి సమస్య, అగ్రెసివ్‌ బిహేవియర్‌కు గురవుతున్నారు. ఇవి చిన్న సమస్యలు కాదని, అత్యంత ప్రమాదకరమైనవని ఆ అకాడమీ తల్లిదండ్రులను హెచ్చరించింది. అందుకే 18 నెలల వయస్సు పిల్లలకు టీవీ, ఫోన్‌ చూపించకూడదు. 2–5 ఏళ్ల పిల్లలు గంటకు మించి టీవీ చూడకూడదు. 

మరిన్ని అనారోగ్య సమస్యలు.. పరిష్కారాలు  
► ఒకే ప్రదేశంలో కూర్చుని కంప్యూటర్‌ చూస్తూ గడిపేవారికి వెన్ను సమస్యలు అధికమవుతున్నాయి.ఈ నొప్పితో మనిషి ఇతర విషయాలపై దృష్టి సారించలేకపోతున్నారు. చురుకుదనం తగ్గిపోయి పురోగతి సాధించలేకపోతున్నారు. వీరు కనీసం గంటకోసారి లేచి నడవాలి. 

► ఫోన్‌లతో జ్ఞాపకశక్తి క్లీణించింది. గతంలో పదుల సంఖ్యలో ఫోన్‌ నంబర్లు గుర్తుండేవి. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్ల నంబర్లు కూడా గుర్తులేని పరిస్థితి. లావాదేవీల్లో గతంలో ‘నోటిలెక్కల’తో తేల్చేసేవారు. ఇప్పుడు ఫోన్‌లో ‘కాలిక్యులేటర్‌’పై ఆధారపడాల్సిందే! 

► మొబైల్‌ఫోన్‌ ఎక్కువగా వాడటం, సరిగా కూర్చోకుండా టీవీలు చూడటంతో మెడ వెనుక అప్పర్‌ బ్యాక్‌పెయిన్‌ వస్తోంది.

► 2019 నుంచి నిద్రలేమి సమస్యలు ఎక్కువగా పెరిగాయి. రోజూ అర్ధరాత్రి 12 గంటలు, ఒంటిగంట వరకూ నిద్ర మేల్కొని ఉంటున్నారు. జనాభాలో 32 శాతం మంది అర్ధరాత్రి వరకూ ఫోన్లలో గడుపుతున్నారు.

► అనవసర సోషల్‌ మీడియా యాప్స్‌ మొబైల్స్‌లో పెట్టుకోకూడదు.

► సెల్‌ఫోన్, టీవీలు ఎక్కువ సమయం, ఎక్కువ లైటింగ్‌లో చూడటం, అతిదగ్గరగా, అతి దూరంగా చూడటం, సరిగా కూర్చోకుండా చూడటం చాలా ప్రమాదకరం.

► నిద్రకు కనీసం గంట ముందు టీవీ, ఫోన్‌ చూడటం ఆపేయాలి.

► పుస్తకాలు, న్యూస్‌పేపర్‌ చదవడం తగ్గింది. దీన్ని అలవాటు చేయాలి. బంధువులు, స్నేహితులతో ఎక్కువగా గడపాలి, మాట్లాడాలి. శారీరక దృఢత్వాన్ని కలిగి ఉండేలా ఆటలు ఆడాలి. వ్యాయామాలు చేయాలి. 


సోమరితనం పెరుగుతోంది 
‘టెక్నాలజీ’ అవసరం కోసమే. కానీ బానిసలవుతున్నాం. దీంతో వెన్ను, మెడ నొప్పితో పాటు ‘నిద్ర’ టైంటేబుల్‌ మారిపోయింది. గతంలో 9 నుంచి 10 గంటల వరకు నిద్రపోయేవాళ్లు. ఇప్పుడు ఫోన్, ఓటీటీల్లో సినిమాలు చూస్తూ అర్ధరాత్రి వరకూ మేల్కొని ఉదయం ఆలస్యంగా నిద్ర లేస్తున్నారు. దీంతో శరీరంలో హార్మోనల్‌ ఇన్‌బ్యాలెన్స్‌ అవుతోంది. సోమరితనం ఎక్కువగా వస్తోంది. జ్ఞాపకశక్తిని కోల్పోయి మొద డు మొద్దుబారుతోంది. ఫోన్‌ నంబర్లతో పాటు కొత్తగా పరిచయమయ్యేవారి పేర్లను కూడా గుర్తుపెట్టుకోలేకపోతున్నారు. పిల్లలు ఆహారం తినాలన్నా ఫోన్లు, టీవీలు చూపించే పరిస్థితి. ప్రస్తుతం ‘డిప్రెషన్‌ ట్రెండ్‌’ నడుస్తోంది. చాలామందికి వారు డిప్రెషన్‌లో ఉన్న సంగతే తెలీడం లేదు. 
– డాక్టర్‌ కె. హేమంత్‌కుమార్‌రెడ్డి, న్యూరోఫిజీషియన్‌


జాగ్రత్త లేకపోతే భవిష్యత్తు ఛిన్నాభిన్నమే  
టెక్నాలజీ అతి వినియోగంతో ఎక్కువ మానసిక సమస్యలు వస్తున్నాయి. 15–25 ఏళ్ల వయస్సున్న వారికి లెర్నింగ్‌ ఎబిలిటీ ఎక్కువగా ఉంటుంది. దీనికి ప్రాధాన్యత ఇవ్వాలి. చదవడం, నేర్చుకోవడంతో నాలెడ్ట్‌ వస్తుంది. ఇప్పటి పిల్లలు వినోదానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో చదువులో క్వాలిటీ ఉండటం లేదు. సొసైటీపై కూడా బాధ్యత ఉండటం లేదు. ఉద్యోగాలు సాధించలేని పరిస్థితుల్లో డిప్రెషన్‌లోకి వెళ్లి ఆల్కాహాల్, సిగరెట్లు, డ్రగ్స్‌కు బానిసయ్యే ప్రమాదం ఉంది. చెడు, మంచి రెండూ నేర్చుకునే అవకాశాలు ప్రస్తుత సొసైటీలో ఉన్నాయి. పిల్లల పెంపకంపై తల్లిదండ్రులు మరింత జాగ్రత్తతో ఉండాలి. గారాబాలతో ఏమాత్రం అలసత్వం చేసినా భవిష్యత్‌ను ఛిన్నాభిన్నం చేసినట్లే.         
 డాక్టర్‌ ఇక్రముల్లా, సైక్రియాట్రిస్ట్, కర్నూలు. 

 

 

 

Sunday, July 31, 2022

భూమిపై చివరి సెల్ఫీ ఎలా ఉంటుందో తెలుసా? AI అందించిన ఫొటోలు చూస్తే.. Last Selfie..


 


 DALL-E ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ చివరి సెల్ఫీని రూపొందించమని కోరింది. ఆ తర్వాత అది కొన్ని ఫొటోలను నెటిజన్ల ముందు ఉంచింది. ఇవి చూసిన జనాలు షాకవుతున్నారు.
సెల్‌ఫోన్స్‌లో ఫ్రంట్ కెమెరా వచ్చినప్పటి నుంచి సెల్ఫీల పిచ్చి జనాలకు అంటుకుంది. ప్రస్తుతం ఈ ట్రెండ్ విపరీతంగా పెరిగిపోయింది. జనాలు ఎక్కడ ఉన్నా సరే.. సెల్ఫీలు తీసుకోవడం మాత్రం మానడం లేదు. ఇదంతా పక్కన పెడితే.. ప్రపంచంలోని చివరి సెల్ఫీ ఎలా ఉంటుందో చూడాలని ఉందా? అయితే, ఇప్పుడే చూసేద్దాం. కానీ, ఈ ఫొటోలు చూస్తే మాత్రం మీరు చాలా భయపడిపోతారనడంలో ఎలాంటి సందేహం లేదు. AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భూమిపై చివరి సెల‌్ఫీ ఎలా ఉంటుందో చూపించింది. ప్రస్తుతం ఏఐ అన్నింటిలోనూ దూసుకపోతోంది. ప్రపంచం అంతా ఏఐతోనే నడుస్తుందంటే పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఇమేజ్ జనరేటర్ కోసం AI DALL-E 2 ఉపయోగించారు. భూమి చివరి సెల్ఫీ ఎలా ఉంటుందని ఏఐని అడిగితే, దాని ఫలితాలు అంత బాగా రాలేదంట. కాగా ప్రశ్నపై, AI అనేక చిత్రాలను రూపొందించింది.

రోబో ఓవర్‌లార్డ్స్ అనే టిక్‌టాక్ ఖాతా ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ ఫొటోలను రూపొందించారు. అయితే, ఈ ఫొటోలలో భూమిపై జరుగుతోన్న విధ్వంసం కూడా చూపించారు. ఇదే సమయంలో ప్రజలు చేతిలో మొబైల్ పట్టుకుని సెల్ఫీలను తీస్తున్నట్లు చూడొచ్చు.


DALL-E అంటే ఏమిటి? చివరి సెల్ఫీ ఎలా అంచనా వేశారు?

కృత్రిమ మేధస్సు(ఏఐ) వ్యవస్థను చివరిగా తీసుకోవాల్సిన సెల్ఫీని రూపొందించమని DALL-E కోరింది. దీనికి భూమిపై చివరిసారిగా తీసుకునే సెల్ఫీని సిద్ధం చేసి, ఆశ్చర్యపరించింది. Google సర్వర్‌ల నుంచి అందిన సమాచారం ఆధారంగా, ఈ ఫోటోలను సిద్ధం చేసింది.

భూమిపై మనుషులు నిల్చున్న చుట్టుపక్కల వినాశనం జరుగుతున్న ఫొటోలను ఇదిచూపించింది. అయితే, ఇదే సమయంలో ప్రజలు ఫోన్‌లతో జరుగుతున్న వినాశకరమైన దృశ్యాలను చూపిస్తూ సెల్ఫీలను తీసుకుంటున్నట్లు చూడొచ్చు.
ఈ AI సిస్టమ్ 12-బిలియన్ పారామీటర్ వెర్షన్ GPT-3ని ఉపయోగించింది. ఇంజనీర్లు OpenAI GPT-3 మోడల్‌ని ఉపయోగించి DALL-Eని నిర్మించారు. దీనితో, ఇది టెక్స్ట్ ఇన్‌పుట్ ఆధారంగా ఫొటోలను రూపొందిస్తుంది.
 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఊహించిన సెల్ఫీలను‌ ఈ ట్వీట్‌ నుంచి చూడొచ్చు.

 

 


 

Sunday, July 24, 2022

వాట్సప్ ద్వారా బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు. SBI వాట్సప్ బ్యాంకింగ్ సర్వీస్‌కు ఎలా రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకోండి

 


 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు గుడ్ న్యూస్. ఎస్‌బీఐ వాట్సప్ బ్యాంకింగ్ (WhatsApp Banking) సేవల్ని ప్రారంభించింది. వాట్సప్ ద్వారా బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు. ఎస్‌బీఐ వాట్సప్ బ్యాంకింగ్ సర్వీస్‌కు ఎలా రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకోండి.

SBI WHATSAPP BANKING KNOW HOW TO REGISTER FOR STATE BANK OF INDIA WHATSAPP BANKING SERVICE

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మరో సర్వీస్ ప్రారంభించింది. తొలిసారి వాట్సప్ బ్యాంకింగ్ (WhatsApp Banking) సేవల్ని ప్రారంభించింది. ఎస్‌బీఐ ఖాతాదారులు చాలాకాలంగా ఈ సర్వీస్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఎస్‌బీఐ వాట్సప్ బ్యాంకింగ్ (SBI WhatsApp Banking) సేవల్ని త్వరలో ప్రారంభిస్తామని ఇటీవల ఎస్‌బీఐ ఛైర్మెన్ దినేష్ ఖారా తెలిపారు.

ఎస్‌బీఐ ఛైర్మెన్ దినేష్ ఖారా ప్రకటించిన మూడువారాల్లో ఎస్‌బీ వాట్సప్ బ్యాంకింగ్ సేవలు ప్రారంభమయ్యాయి. ఎస్‌బీఐ ఖాతాదారులు వాట్సప్ ద్వారా బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు. ఎస్‌బీఐ అందించే సర్వీసుల కోసం బ్రాంచ్‌కు లేదా ఏటీఎంకు వెళ్లాల్సిన అవసరం లేదు. చాలావరకు సేవలు వాట్సప్ ద్వారా లభిస్తాయి.

ఇందుకోసం SMS WAREG అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి అకౌంట్ నెంబర్ టైప్ చేసి 917208933148 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. కస్టమర్లు తమ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచే ఎస్ఎంఎస్ పంపాల్సి ఉంటుంది. ఎస్‌బీఐ వాట్సప్ బ్యాంకింగ్ సేవల కోసం రిజిస్టర్ చేసిన కస్టమర్లు +919022690226 నెంబర్‌కు Hi అని టైప్ చేస్తే ఈ కింది మెసేజ్ వస్తుంది.

 

ఎస్‌బీఐ కస్టమర్లు వాట్సప్ బ్యాంకింగ్ సేవల్ని పొందాలనుకుంటే ముందుగా +919022690226 నెంబర్‌ను తమ స్మార్ట్‌ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ నెంబర్‌కు Hi అని టైప్ చేసి మెసేజ్ చేయాలి. ఆ తర్వాత వచ్చే ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు. అయితే అంతకన్నా ముందు కస్టమర్లు వాట్సప్ బ్యాంకింగ్ సేవల కోసం రిజిస్టర్ చేసుకోవాల్సి వస్తుంది.  

+919022690226 నెంబర్‌కు Hi అని టైప్ చేస్తే ఈ కింది మెసేజ్ వస్తుంది.

Dear Customer, Welcome to SBI Whatsapp Banking Services! Please choose from any of the options below.
1. Account Balance
2. Mini Statement
3. De-register from WhatsApp Banking
You may also type your query to get started

వీటిలో మీకు కావాల్సిన సర్వీస్‌కు సూచించిన ఆప్షన్ ఎంచుకోవాలి. మొదటి ఆప్షన్ ఎంచుకుంటే అకౌంట్ బ్యాలెన్స్ తెలుస్తుంది. రెండో ఆప్షన్ ఎంచుకుంటే ఐదు ట్రాన్సాక్షన్స్‌తో మినీ స్టేట్‌మెంట్ వస్తుంది. మూడో ఆప్షన్ ఎంచుకుంటే ఎస్‌బీఐ వాట్సప్ బ్యాంకింగ్ సేవల నుంచి డీ-రిజిస్టర్ చేయొచ్చు.

వాట్సప్ ఉపయోగిస్తున్న ఎస్‌బీఐ కస్టమర్లందరూ ఈ సేవలు ఉపయోగించుకోవచ్చు. అయితే ఎస్‌బీఐ అకౌంట్‌తో రిజిస్టర్ అయి ఉన్న మొబైల్ నెంబర్‌తో మాత్రమే వాట్సప్ బ్యాంకింగ్ సేవలు లభిస్తాయి. ఇప్పటికే ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు వాట్సప్ ద్వారా సేవలు లభిస్తున్నాయి. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ అకౌంట్ వివరాలు, రివార్డ్ పాయింట్స్, ఔట్‌స్టాండింగ్ బ్యాలెన్స్, కార్డ్ పేమెంట్స్ లాంటి సేవల్ని వాట్సప్ ద్వారా పొందుతున్నారు.

Sunday, July 10, 2022

Ration Card మీరు కొత్త రేషన్‌కార్డు కోసం అప్లై చేసుకున్నారా.. అయితే లిస్టులో మీ పేరు ఉందో చెక్‌ చేసుకోండి

 


మీరు కొత్త రేషన్‌కార్డు కోసం అప్లై చేసుకున్నారా.. అయితే లిస్టులో మీ పేరు ఉందో చెక్‌ చేసుకోండి. ఇందుకోసం ఆహార శాఖ అధికారిక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంట్లో కూర్చున్న ప్రతి వ్యక్తి తన మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా కొత్త రేషన్ కార్డు గురించి తెలుసుకోవచ్చు. కానీ ఆన్‌లైన్ జాబితాలో పేరును తనిఖీ చేసే విధానం చాలా మందికి తెలియదు. ఇది ఏ విధంగా తనిఖీ చేయాలో తెలుసుకుందాం.

కొత్త రేషన్ కార్డు ఎవరికి వచ్చిందో ఎలా చెక్ చేసుకోవాలి?

1. ముందుగా రేషన్ కార్డ్ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేయండి. దీని కోసం గూగుల్ సెర్చ్ బాక్స్‌లో nfsa.gov.in అని టైప్ చేయడం ద్వారా సెర్చ్‌ చేయండి.

2. తర్వాత మీరు స్క్రీన్‌పై విభిన్న సేవల ఎంపికను చూస్తారు. ఇక్కడ మెనులో రేషన్ కార్డ్స్ ఆప్షన్‌ని ఎంచుకోండి. తర్వాత రేషన్ కార్డు వివరాలు ఆన్ స్టేట్ పోర్టల్స్ ఎంపికను ఎంచుకోండి.

3. తర్వాత అన్ని రాష్ట్రాల జాబితా స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఇక్కడ మీరు మీ రాష్ట్రం పేరు కోసం వెతకాల్సి ఉంటుంది.

4. తర్వాత రాష్ట్రంలోని అన్ని జిల్లాల పేర్లు కనిపిస్తాయి. ఇందులో మీ జిల్లా పేరుని ఎంచుకోవాలి.

5. తర్వాత ఆ జిల్లాలోని అన్ని బ్లాక్‌ల జాబితా కనిపిస్తుంది. ఇక్కడ మీరు మీ బ్లాక్ పేరును కనుగొని దానిని ఎంచుకోవాలి.

6. తర్వాత ఆ బ్లాక్‌లో అన్ని గ్రామ పంచాయతీల జాబితా ఓపెన్‌ అవుతుంది. ఇక్కడ మీరు మీ పంచాయతీ పేరును ఎంచుకోవాలి.

7. తర్వాత, మీరు ఎంచుకున్న పంచాయతీలో నిర్వహిస్తున్న రేషన్ దుకాణం పేరు, రేషన్ కార్డు రకం స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఇక్కడ రేషన్ కార్డు రకాన్ని ఎంచుకోండి.

8. మీరు రేషన్ కార్డు రకాన్ని ఎంచుకున్న వెంటనే రేషన్ కార్డు లబ్ధిదారులందరి జాబితా తెరపై కనిపిస్తుంది. ఇక్కడ రేషన్ కార్డ్ నంబర్, హోల్డర్ పేరు, తండ్రి/భర్త పేరు, యూనిట్ నంబర్ మొదలైన వివరాలు కనిపిస్తాయి. కొత్త రేషన్ కార్డు ఎవరికి వచ్చిందో ఇక్కడ తెలుసుకోవచ్చు.

 

 

Thursday, May 12, 2022

గూగుల్‌లో ఈ 3 విషయాలు వెతకొద్దు.. సెర్చ్‌ చేశారంటే జైలుకెళ్లడం ఖాయం

 


 ప్రపంచం డిజిటల్‌ మయమైంది. అదీ ఇదీ అని కాకుండా ఏ చిన్న సందేహం వచ్చినా ఇంటర్నెట్‌ను ఆశ్రయిస్తాం. గూగుల్‌, యూట్యూబ్‌, అమెజాన్‌, ఫేస్‌బుక్‌, మైక్రోసాఫ్ట్‌ బింగ్‌, బైడూ, యాండెక్స్‌ వంటి సెర్చ్‌ ఇంజిన్లు చాలా ఉన్నప్పటికీ.. ఎక్కువమంది గూగుల్‌ తల్లివైపే మొగ్గు చూపుతారు. అయితే, అక్కడేది వెతికినా పర్లేదు అనుకుంటే పొరపాటే! కాలం మారింది.. క్రైంను అరికట్టేందుకు కఠినమైన చట్టాలు అమల్లోకి వచ్చాయి. గూగుల్‌లో కొన్ని విషయాల గురించి సెర్చ్‌ చేస్తే జైలు ఊచలు లెక్కించాల్సిందే. అవేంటో చూద్దాం!

1. చైల్డ్‌ పోర్నోగ్రఫీ
చిన్నారులకు సంబంధించి పోర్నోగ్రఫీ కంటెంట్‌ను గూగుల్‌లో వెతికితే శిక్షార్హులవుతారు. పొరపాటున సెర్చ్‌ చేసినా పోక్సో చట్టం కింద జైలు ఖాయం అవ్వొచ్చు. ఈ నేరం కింద 5 నుంచి ఏడేళ్లవరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. తస్మాత్‌ జాగ్రత్త!

2. బాంబుల తయారీ
బాంబులను ఎలా తయారు చేయాలని గూగుల్‌లో సెర్చ్‌ చేస్తే చిక్కులు తప్పవు. ఇటువంటి కంటెంట్‌ను వెతికినవారిని సెక్యురిటీ సంస్థలు గుర్తిస్తాయి. చట్టపరమైన చర్యలు తీసుకుంటే జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.

3. అబార్షన్‌
అబార్షన్‌ చేయడమెలా? అని గనుగ గూగుల్‌లో వెతికితే కటకటాలు తప్పవు. గర్భస్రావాలను నిరోధించేందుకు భారత్‌ గట్టి చట్టాలను రూపొందించింది. అబార్షన్‌కు సంబంధించిన కంటెంట్‌ను సెర్చ్‌ చేస్తే భారతీయ చట్టాల ప్రకారం శిక్షార్హులు. డాక్టర్‌ అనుమతితోనే గర్భస్రావానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి.

 

WhatsApp స్టేటస్‌లను ఎటువంటి థర్డ్-పార్టీ అప్లికేషన్ లేకుండా డౌన్‌లోడ్ చేయడం ఎలా?

 


వాట్సాప్ అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రపంచం మొత్తం మీద ఉన్న తమ ప్రియమైన వారిని సులభంగా పలకరించగలుగుతున్నారు. వాట్సాప్ కొత్త ఫీచర్లను అందిస్తూ 2017లో స్టేటస్ ఫీచర్‌ని అధికారికంగా ప్రకటించింది. వాట్సాప్ అప్లికేషన్‌లో ఈ ఫీచర్ అధిక ప్రాముఖ్యతను సంతరించుకుంది. వాట్సాప్ స్టేటస్ ఫీచర్ ద్వారా వినియోగదారులు ఫోటోలు మరియు వీడియోలను వాట్సాప్‌లో వారి స్నేహితులతో పంచుకోవడానికి అనుమతిస్తుంది.

 వాట్సాప్ యాప్‌ యొక్క స్టేటస్ లో పంచుకున్న ఫోటోలు మరియు వీడియోలు మీ పరికరంలో తాత్కాలికంగా స్టోర్ చేయబడతాయి. తరువాత 24 గంటల వ్యవధి తర్వాత స్వయంచాలకంగా తొలగించబడతాయి. అయితే ఏ థర్డ్-పార్టీ అప్లికేషన్ లేకుండానే మీ ఫోన్‌లో ఈ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఒక మార్గం ఉంది.

వాట్సాప్ స్టేటస్‌లను మీ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకునే విధానం

 ** వాట్సాప్ స్టేటస్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడం కోసం ముందుగా మీ ఫోన్‌లో ఫైల్స్ మేనేజర్ యాప్ ఉందని నిర్ధారించుకోండి. అది అందుబాటులో లేకుంటే కనుక మీరు 'ప్లే స్టోర్' నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
** ఫైల్స్ (ఫైల్ మేనేజర్) అప్లికేషన్‌ను ఓపెన్ చేయండి.
** ఎగువ కుడివైపు హాంబర్గర్ మెనుకి వెళ్లి సెట్టింగ్‌ల ఎంపికపై క్లిక్ చేయండి.
** సెట్టింగ్స్ ఎంపికలో "షో హిడెన్ ఫైల్స్" ఎంపికను కనుగొనడానికి క్రిందికి స్క్రోల్ చేసి దాన్ని టోగుల్ చేయండి.

** తర్వాత ఫైల్స్ యాప్ యొక్క మెయిన్ పేజీకి తిరిగి వెళ్లి 'ఇంటర్నల్ స్టోరేజ్' ఎంపిక కోసం చూడండి.
** క్రింది ఎంపికల జాబితాలో "Android" ఎంపిక కోసం చూడండి.
** తరువాత "మీడియా" ఎంపికపై క్లిక్ చేయండి.
** దానిని అనుసరించి మీరు వాటిలో వివిధ యాప్‌ల డేటా యొక్క పేర్ల జాబితాను చూస్తారు.
** వాట్సాప్ పేరుతో ఉన్నదానిపై క్లిక్ చేసి కింది ఫోల్డర్‌ను ఓపెన్ చేయండి.
** తరువాత అందులో కనిపించే "మీడియా" ఎంపికను ఎంచుకోండి.
** తరువాత జాబితాలో కనిపించే "స్టేటస్" ఎంపిక మీద క్లిక్ చేయండి.
** క్రింది పేజీలో మీరు ఇటీవల చూసిన అన్ని స్టేటస్‌లను చూడవచ్చు.
** తరువాత మీకు నచ్చిన మరియు డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్న దానిపై క్లిక్ చేయండి.
** కుడివైపు ఎగువన ఉన్న మూడు-చుక్కల మెనుపై క్లిక్ చేసి 'మూవ్ టు' ఎంపికను ఎంచుకొని ఇంటర్నల్ స్టోరేజ్ ను ఎంచుకోండి.
** మీరు దాన్ని గూగుల్ క్లౌడ్ లేదా ఏదైనా ఇతర యాప్ ద్వారా కూడా షేర్ చేయవచ్చు మరియు స్టోర్ చేయవచ్చు.

 

Tuesday, May 10, 2022

కొన్ని సులభమైన మార్గాల ద్వారా ఆధార్‌ నంబర్‌ను తెలుసుకోవచ్చు.

 


Aadhaar Number: ప్రస్తుతం ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్‌ ఒకటి. ఇది లేనిది ఏ పనులు జరగవు. ప్రభుత్వ, ప్రైవేటు పథకాల నుంచి చిన్న పాటి పనులకు ఆధార్‌ కార్డు తప్పనిసరి కావాల్సిందే. అయితే ఆధార్‌ కార్డును ఎప్పుడు వెంట ఉంచుకోము. కొన్ని సందర్భాలలో ఆధార్‌ నంబర్‌ మర్చిపోతుంటాము. అయితే కొన్ని సులభమైన మార్గాల ద్వారా ఆధార్‌ నంబర్‌ను తెలుసుకోవచ్చు. ఒక విషయం ఏంటంటే ఆధార్ కార్డుకు మీ ఫోన్ నెంబ‌ర్ లింక్ (Mobile Number Link) అయ్యి ఉండాలి. అప్పుడు ఆధార్‌ నంబర్‌ను తెలుసుకునేందుకు సాధ్యమవుతుంది.

☛ ముందుగా స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూట‌ర్‌లో బ్రౌజ‌ర్ ఓపెన్ చేసి యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

☛ అనంత‌రం వెబ్‌సైట్‌లోని ‘మై ఆధార్’ సెక్షన్‌లోని ‘ఆధార్ స‌ర్వీసెస్’పై క్లిక్ చేసి.. అందులో ఉన్న ‘రిట్రైవ్ లాస్ట్ ఆర్ ఫర్గాటెన్ ఈఐడీ/యూఐడీ’ అనేదానిపై క్లిక్ చేయాలి.

☛ త‌ర్వాత ఓపెన్ అయిన కొత్త పేజీలో ఆధార్ నంబ‌ర్ (యూఐడీ)ని సెల‌క్ట్ చేసుకోవాలి.

☛ అనంత‌రం మీ రిజిస్టర్ మొబైల్ నెంబ‌ర్ లేదా ఈమెయిల్ ఐడీని నమోదు చేయాలి.

☛ ఇక అక్కడే ఉన్న క్యాప్చా కోడ్‌ను ఎంట‌ర్ చేసి.. సెండ్ ఓటీపీపై క్లిక్ చేయాలి.

☛ మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌కు వ‌చ్చిన ఓటీపీని ఎంట‌ర్ చేసి ఎంట‌ర్ నొక్కాలి. దీంతో మొబైల్ నెంబ‌ర్‌కు ఆధార్ నెంబ‌ర్ మెసేజ్ రూపంలో వ‌స్తుంది. ఇలా సింపుల్‌గా మర్చిపోయిన ఆధార్‌ నంబర్‌ను తెలుసుకోవచ్చు.

 

 

 

Wednesday, May 4, 2022

టెలిగ్రామ్‌లో క్రిప్టోకరెన్సీ పేమెంట్లను చేయడానికి వీలుగా కొత్త ఫీచర్!!

 

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ సర్వీస్ యాప్ లలో ఒకటైన టెలిగ్రామ్ సంస్థ తన యొక్క యూజర్ల కోసం కొత్త ఫీచర్‌లను అభివృద్ధి చేసింది. ఈ కొత్త అభివృద్ధి బ్లాక్‌చెయిన్ లో మెసేజింగ్ యాప్‌కి కొత్తగా క్రిప్టో పేమెంట్ల ఫీచర్‌ను ప్రారంభించింది. ఈ ఫీచర్ అందుబాటులోకి రావడంతో వినియోగదారులు ఎటువంటి అదనపు రుసుము చెల్లించకుండానే ఇతర టెలిగ్రామ్ వినియోగదారులకు క్రిప్టోకరెన్సీ యొక్క Toncoinని పంపడానికి అనుమతిస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

సుమారు 550 మిలియన్ల మంది వినియోగదారులను కలిగి ఉన్న టెలిగ్రామ్ AUS సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్ (SEC) నుండి చట్టపరమైన సవాలును ఎదురుకున్న తర్వాత దాని స్వంత టోకెన్ కోసం దాని ప్లాన్‌ను గతంలో విరమించుకుంది. 2019లో టెలిగ్రామ్ తన టోకెన్‌ను అభివృద్ధి చేయడానికి $1.7 బిలియన్ల సేకరణ తరువాత దానిని చట్టవిరుద్ధమైన టోకెన్ సమర్పణగా పేర్కొంటూ SEC దావా వేసింది. టెలిగ్రామ్ తరువాత SECకి జరిమానా చెల్లించడమే కాకుండా పెట్టుబడిదారులకు మూలధనాన్ని తిరిగి ఇవ్వడానికి అంగీకరించింది. అప్పటి నుండి టెలిగ్రామ్ యొక్క CEO పావెల్ దురోవ్ టెలిగ్రామ్ నుండి స్పష్టమైన మరియు స్వతంత్రంగా ఉన్న ప్రత్యేక స్పిన్-ఆఫ్ టోకెన్ టోన్‌కాయిన్‌ను ఆమోదించడానికి కృష్టి చేస్తున్నారు. దాని యొక్క ఫలితంగానే ఇప్పుడు టెలిగ్రామ్‌లో పేమెంట్స్ కోసం ఇప్పుడు క్రిప్టోకరెన్సీలను ప్రారంభించింది అని నివేదిక పేర్కొంది.

 
"టెలిగ్రామ్‌లోని ఈ ఫంక్షనాలిటీ వినియోగదారుని యొక్క బిజినెస్ పేమెంట్ల వరకు విస్తరిస్తుందని మేము అంచనా వేస్తున్నాము. తద్వారా ప్రజలు టెలిగ్రామ్ యాప్‌లోని బాట్‌ల ద్వారా టన్‌కాయిన్‌ను పంపడం ద్వారా అన్ని రకాల సేవలను సులభంగా పొందవచ్చు" అని TON ఫౌండేషన్ తెలిపింది. "టెలిగ్రామ్ లో కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ కొత్త సర్వీసుతో మీరు ఇకపై అతిపెద్ద లేదా పొడవైన వాలెట్ అడ్రసులను నమోదు చేయాల్సిన అవసరం లేదు మరియు నిర్ధారణల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు" అని ఫౌండేషన్ ఫీచర్‌ను ప్రకటిస్తూ ట్వీట్‌లో పేర్కొంది.
టెలిగ్రామ్ ఇటీవలి కొత్త అప్‌డేట్‌లు టెలిగ్రామ్ సంస్థ ఇటీవల కొత్తగా మరొక అప్ డేట్ ను కూడా ప్రకటించింది. వీటిలో మ్యూట్ డ్యూరేషన్, యానిమేటెడ్ ఎమోజీలు మరియు మెరుగైన మెసేజ్ ట్రాన్సలేషన్లతో సహా అనేక కొత్త ఫీచర్‌లను అందిస్తుంది. అలాగే కస్టమ్ నోటిఫికేషన్ సౌండ్స్ ఫీచర్ తో వినియోగదారులు ఏదైనా సౌండ్‌ని నోటిఫికేషన్ టోన్‌గా మార్చడానికి అనుమతిస్తుంది. ఇది యాప్‌లో కస్టమ్ అలర్ట్‌లను రూపొందించడానికి ఉపయోగించవచ్చు.

 
** కస్టమ్ మ్యూట్ డ్యూరేషన్ సాయంతో టెలిగ్రామ్ లో నిర్దిష్ట వ్యవధికి నోటిఫికేషన్‌లను పాజ్ చేసే సామర్థ్యాన్ని కూడా జోడించింది. వినియోగదారులు ఒక గంట, 2 గంటలు, ఒక వారం, రెండు వారాలు, మూడు నెలలు మొదలైన అనేక రకాల ఎంపికల నుండి ఎంచుకోవచ్చు. ప్రతి చాట్‌లో అలర్ట్‌లను సవరించడానికి స్ట్రీమ్‌లైన్డ్ మెనూ ఉంటుందని టెలిగ్రామ్ చెబుతోంది. ** ప్రొఫైల్‌లలో కొత్త ఫీచర్లలో ఆటో- డెలిట్ మెను అనేది టెలిగ్రామ్ వ్యక్తిగత ప్రొఫైల్‌లలో ఆటో- డెలిట్ మెసేజ్ ఎంపికను ప్రారంభించడానికి ప్రయాణాన్ని కూడా సులభతరం చేసింది. ** ఫార్వార్డ్ చేసిన మెసేజ్లకు ప్రత్యుత్తరం యొక్క తాజా అప్‌డేట్‌తో వినియోగదారులు ఇతర చాట్‌లకు మెసేజ్ ని ఫార్వార్డ్ చేసినప్పుడు టెలిగ్రామ్ రిప్లై ప్రివ్యూలతో సహా ఉంటుంది. ఇది ఇతర వినియోగదారులు చేసే సంభాషణలో ఇతర వినియోగదారులకు మరింత సందర్భాన్ని ఇస్తుంది.

 


మగవారి ముఖంలో మొటిమలను వెంటనే మాయమయ్యేలా చేసే తులసి మహిమలు..

 


నేడు చాలా మంది ముఖ సౌందర్యాన్ని పాడు చేయడంలో ఈ మొటిమలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. ముఖం మీద మొటిమలు ఎక్కువగా ఉంటే మనం ఏ పనీ జాగ్రత్తగా చేయలేము. ముఖం గురించి చాలా ఆత్రుతగా ఆలోచిస్తాం. ఈ విధంగా ఆయన కార్యాలయంలోని కొందరు అనేక రకాల బలహీనతలను ఎదుర్కొన్నారు. మీ ముఖంపై ఉన్న మొటిమలు వెంటనే పోవాలంటే ఏదైనా చేసి విసిగిపోయారా..?ఐతే ఈ పోస్ట్ మీకోసమే. నేడు చాలా మంది ముఖ సౌందర్యాన్ని పాడు చేయడంలో ఈ మొటిమలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. ముఖం మీద మొటిమలు ఎక్కువగా ఉంటే మనం ఏ పనీ జాగ్రత్తగా చేయలేము. ముఖం గురించి చాలా ఆత్రుతగా ఆలోచిస్తాం.

 

Tuesday, May 3, 2022

గూగుల్ క్రోమ్ యూజర్లకు ప్రభుత్వం హెచ్చరిక జారీ.. వెంటనే అప్‌డేట్ చేయండి లేదంటే..?

 

 


ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) గూగుల్ క్రోమ్‌కు సంబంధించి హెచ్చరిక జారీ చేసింది అలాగే యూజర్లు క్రోమ్ బ్రౌజర్‌ను వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని కోరింది.

మీరు గూగుల్ క్రోమ్  (Google Chrome) బ్రౌజర్‌ని ఉపయోగిస్తున్నట్లయితే, మీ కోసం ఒక పెద్ద వార్త. ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) గూగుల్ క్రోమ్‌కు సంబంధించి ఒక హెచ్చరిక జారీ చేసింది, గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌  వినియోగదారులు  బ్రౌజర్‌ను వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని కోరింది.

  Google Chromeలో ఒక బగ్ ఉంది, దాని ఉపయోగించుకొని హ్యాకర్లు ప్రజలను మోసం చేయవచ్చు. ఈ బగ్ కారణంగా హ్యాకర్లు యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉందని హెచ్చరికలో పేర్కొంది. CERT-In ప్రకారం, Google Chrome వెర్షన్ 100 చాలా ప్రమాదకరమైన భద్రతా బగ్‌ ఉంది. దీంతో గూగుల్ వెర్షన్ 101ని కూడా విడుదల చేసింది.

హెచ్చరిక ప్రకారం, Windows కాకుండా, Linux, MacOS వినియోగదారులు Google Chrome ఈ బగ్ ద్వారా ఎక్కువగా ప్రభావితమయ్యారు. ఈ బగ్ కారణంగా, హ్యాకర్లు మీ సిస్టమ్  భద్రతను సెకన్లలో నాశనం చేయవచ్చు.

Google Chrome బ్రౌజర్‌ని ఎలా అప్‌డేట్ చేయాలి
*ముందుగా, మీ కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌లో Google Chromeని తెరవండి.
*ఇప్పుడు పైన కుడి వైపున కనిపించే మూడు చుక్కలపై క్లిక్ చేయండి.
*ఇప్పుడు క్రిందికి స్క్రోల్ చేసి, హెల్ప్ బటన్‌పై క్లిక్ చేయండి.
*తరువాత Google Chrome గురించి క్లిక్ చేయండి.
*దీని తర్వాత మీరు మీ Chrome వెర్షన్ చూస్తారు ఇంకా మీరు అప్ డేట్ ఆప్షన్ కూడా చూస్తారు.
అప్‌డేట్ చేసిన తర్వాత, మీ Chromeని రీస్టార్ట్ చేయండి.

 

ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులకు బిగ్‌ షాక్‌.. గూగుల్‌ కీలక నిర్ణయం

 


 ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులకు బిగ్‌ షాక్‌ తగలనుంది. యాప్స్‌ విషయంలో గూగుల్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆండ్రాయిడ్ ఫోన్స్​లో కాల్​ రికార్డింగ్ యాప్స్‌ను తొలగించనున్నట్టు పేర్కొంది. యాజర్ల ప్రైవసీని దెబ్బతీస్తున్నాయన్న కారణంతో థర్డ్ పార్టీ కాల్ రికార్డింగ్ యాప్స్​ అన్నింటినీ నిలిపేయాలని గూగుల్‌ నిర్ణయించింది. మే 11 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

అయితే, మీ ఫోన్‌లో వాయిస్ కాల్​ మాట్లాడుతున్నప్పుడు, ఆన్​లైన్​ కాన్ఫరెన్స్​లో పాల్గొంటున్నప్పుడు ఆ కాల్స్‌ను రికార్డ్ చేయడం ఇక కుదరకపోవచ్చు. గూగుల్ డయలర్ లేదా స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ డిఫాల్ట్‌గా ఇచ్చే డయలర్ ద్వారా మాత్రమే ఇకపై కాల్ రికార్డింగ్ ఫీచర్ అందుబాటులో ఉండనుంది. కాగా, గూగుల్ డయలర్​ ద్వారా ఎవరైనా ఈ ఫీచర్ ఉపయోగిస్తుంటే అవతలి వ్యక్తికి కూడా ఈ కాల్‌ రికార్డు చేస్తున్నారనే అలర్ట్‌ వస్తుంది. 

ఇదిలా ఉండగా.. కాల్ రికార్డింగ్​కు గగుల్‌ ఎప్పుడూ వ్యతిరేక స్వరాన్నే వినిపించింది. అవతలి వ్యక్తికి తెలియకుండా ఫోన్‌లో వారి వాయిస్‌ను రికార్డ్ చేయడం ద్వారా యూజర్ల ప్రైవసీకి భంగం కలుగుతుందన్నది గూగుల్ ఇప్పటికే చాలా సందర్బాల్లో పేర్కొంది. అందులో భాగంగానే కాల్ రికార్డింగ్ యాప్స్​ను తొలగించేందుకు సిద్ధమైంది.

 

Truecaller: గూగుల్‌ షాకింగ్‌ నిర్ణయం..ఇకపై ట్రూకాలర్‌లో ఈ ఫీచర్‌ పనిచేయదు..!

 

 


 

ఆండ్రాయిడ్‌ యూజర్లకు ప్రైవసీను దెబ్బతీస్తున్నాయనే కారణంతో థర్డ్‌ పార్టీ కాల్‌ రికార్డింగ్స్‌ యాప్స్‌ను నిషేధిస్తున్నట్లు గూగుల్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కొత్త రూల్‌ను తెరపైకి రావడంతో కాలర్‌ వేరిఫికేషన్‌ ప్లాట్‌ఫాం ట్రూకాలర్‌ కీలక నిర్ణయం తీసుకుంది. తమ యాప్‌లో కాల్‌ రికార్డింగ్‌ ఫీచర్‌ను అందించబోమని ట్రూకాలర్‌ ప్రకటించింది. 

ఈ ఫీచర్‌ను మే 11 నుంచి నిలిపివేస్తామని ట్రూకాలర్‌ పేర్కొంది.  మే 11 నుంచి యాక్సెసిబిలిటీ ఏపీఐకి థర్డ్-పార్టీ అప్లికేషన్‌ల యాక్సెస్‌ని నియంత్రిస్తూ గూగుల్‌ ప్లే స్టోర్‌ పాలసీని అప్‌డేట్ చేసినట్లు గూగుల్‌ ప్రకటించిన వెంటనే ట్రూకాలర్‌ ఈ నిర్ణయం తీసుకుంది.  దీంతో థర్డ్‌ పార్టీ యాప్స్‌నుపయోగించి కాల్స్‌ను రికార్డింగ్‌ చేయలేరు.  ట్రూకాలర్‌ యాప్‌ యూజర్లకు కాల్ రికార్డింగ్ ఫీచర్‌ను అందరికీ ఉచితంగా అందిస్తోంది, గూగుల్‌ యాక్సెసిబిలిటీ ఏపీఐని ఉపయోగించి కాల్‌ రికార్డింగ్‌ ఫీచర్‌ను ఎనేబుల్ చేసింది. అయితే, గూగుల్‌ అప్‌డేట్‌ చేసిన డెవలపర్ ప్రోగ్రామ్ విధానాల ప్రకారం...ఇకపై కాల్ రికార్డింగ్‌ను అందించలేమని ట్రూకాలర్‌ పేర్కొంది


ఇదిలా ఉండగా స్మార్ట్‌ఫోన్స్‌లో ముందుగా ఇన్‌స్టాల్‌ చేసిన యాప్స్‌తో, గూగుల్‌ డయలర్‌తో ఫోన్‌ కాల్స్‌ను రికార్డ్‌ చేయవచ్చునని గూగుల్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆండ్రాయిడ్ వినియోగదారులకు మరింత గోప్యతను అందించడానికి, కాల్ రికార్డింగ్ చట్టాలకు అనుగుణంగా గూగుల్‌ ఈ మార్పును తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

 

Sunday, April 17, 2022

మళ్లీ తెరపైకి ఏలియన్ల ఊసు.. అది గ్రహాంతరవాసుల ముద్రేనా?

 


గ్రహాంతరవాసుల ఉనికిపై మరోసారి అమెరికా వరుస ప్రకటనలకు దిగుతోంది. అమెరికా జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా(National Aeronautics and Space Administration).. గ్రహాంతరవాసుల జాడకు సంబంధించిందిగా చెప్తూ ఓ ఫొటోను రిలీజ్‌ చేసింది. తాజాగా యూఎస్‌ స్పేస్‌ కమాండ్.. 2014లో భూమిని ఢీ కొట్టిన ఓ ఉల్కను.. ఇంటర్ స్టెల్లర్‌గా ధృవీకరించింది. ఈ మేరకు పెంటగాన్‌ సైతం ప్రకటన చేయడం విశేషం. ఈ నేపథ్యంలో ఇప్పుడు నాసా సైతం ఓ మిస్టరీ ఫొటోను విడుదల చేసి.. ఏలియన్ల ఉనికిపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

అంగారక గ్రహాంపై గుర్తు తెలియని ముద్రలకు సంబంధించిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ రిలీజ్‌ చేయగా.. అది ముమ్మాటికీ ఏలియన్లకు సంబంధించిందేనన్న చర్చ ఊపందుకుంది. మార్టిన్ క్రేటర్‌లోని ఆ గుర్తుల్ని హైరెజల్యూషన్‌ ఇమేజింగ్‌ ద్వారా క్యాప‍్చర్‌ చేసింది నాసా. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇందుకు సంబంధించిన ఫొటోను షేర్‌ చేయగా.. ఫాలోవర్ల మధ్య జోరుగా చర్చ నడుస్తోంది.

ఏలియన్ల ఉనికి తెలుస్తుందా?
2017లో భూమిని తాకిన ఓ శకలాన్ని.. ‘ఒయూమువామువా’గా నామకరణం చేశారు. సాంకేతిక పరిశోధనలతో.. అది ఇంటర్‌ స్టెల్లర్‌(నక్షత్రాల మధ్య) ఆబ్జెక్ట్‌గా తేలింది. అయితే.. అంతకంటే ముందే 2014 జనవరిలో ఓ ఉల్క భూమిని తాకింది. తాజాగా దీనిని కూడా ఇంటర్‌ స్టెల్లర్‌ ప్రాజెక్టుగానే ధృవీకరించింది అమెరికా స్పేస్‌ కమాండ్‌. మరో సౌర వ్యవస్థ నుంచి దూసుకొచ్చిన ఈ స్పేస్‌ రాక్‌ను హార్వార్డ్‌ ఖగోళ పరిశోధకులు అమీర్‌ సిరాజ్‌, అబ్రహం లియోబ్‌లు పరిశోధనలు జరిపి.. ఇంటర్‌ స్టెల్లర్‌ ఆబ్జెక్ట్‌గా నిర్ధారించారు. దీంతో 2017లో భూమిని తాకిన ‘ఒయూమువామువా’ను రెండో ఇంటర్‌ స్టెల్లర్‌ ఆబ్జెక్ట్‌గా తేల్చినట్లు అయ్యింది.

 

    
  
అటువంటి ఇంటర్‌ స్టెల్లర్(నక్షత్రాల మధ్య) శకలాలు.. గ్రహాంతర జీవుల ఉనికిని ఇతర ప్రాంతాలకు మోసుకెళ్తాయని పరిశోధకులు నమ్ముతారు. ఇంటర్‌ స్టెల్లర్‌ మెటోర్స్‌ అనేవి ఇతర గ్రహాల వ్యవస్థ, అక్కడి ప్రాణుల ఉనికిని తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాదు విశ్వంలో జీవరాశి(పాన్‌స్పెర్మియా) గురించి తెలియజేసేందుకు మధ్యవర్తిత్వం లాగా అవి పని చేస్తాయని అబ్రహం లోయిబ్‌ అంటున్నారు. అయితే.. 2014 ఉల్క సంగతి ఏమోగానీ.. ఒయూమువామువా మాత్రం ఆస్టరాయిడ్‌ అనడం కంటే.. ఏలియన్‌ టెక్నాలజీకి సంబంధించిన వస్తువుగా దాదాపు నిర్ధారణ అయినట్లు చెప్తున్నారు. హాలీవుడ్‌లో ఇంటర్ స్టెల్లర్ మూవీ.. అదే ఏడాది నవంబర్‌లో రిలీజ్‌ కావడం కొసమెరుపు.

 

 

మీ స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సాప్‌ యాప్‌కు లాక్‌-అన్‌లాక్‌ చేయడం ఎలా..?

 


 

Whatsapp: ప్రస్తుతం వాట్సాప్‌ వినియోగం పెరిగిపోయింది. అలాగే ఫోన్‌లో ఏది చేసినా బయటకు పొక్కకుండా ఉండేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాము. స్మార్ట్‌ఫోన్‌ (Smartphone Lock)కు లాక్‌ వేసుకుంటాము. అలాగే స్మార్ట్‌ఫోన్‌ (Smartphones)లలో ఎక్కువగా వినియోగించేది వాట్సాప్‌ . ప్రతి రోజు ఉదయం నుంచి రాత్రి పడుకోబోయే వరకు చాలా మంది వాట్సాప్‌లో మునిగి తేలుతుంటారు. వాట్సాప్‌ (Whatsapp)లో కూడా కొన్ని సిక్రెట్స్‌ ఉంటాయి. అలాంటి సమయంలో వాట్సాప్‌ యాప్‌కు కూడా లాక్‌ వేసుకోవడం ఎంతో ముఖ్యం. స్మార్ట్‌ఫోన్‌లలో వ్యక్తిగతంలో ఎన్నో సిక్రెట్స్‌ ఉంటాయి. ఇతరులు వారి వాట్సాప్‌ చాట్‌ను చూపేందుకు ఆసక్తి చూపరు. ఎవరికైనా ఫోన్‌ ఇచ్చినా వాట్సాప్‌ ఎక్కడ ఓపెన్‌ చేస్తారేమోనని టెన్షన్‌ ఉంటుంది. అందుకే కొందరు వాట్సాప్‌కు సిస్టమ్‌ యాప్‌, ఇతర లాక్‌ యాప్‌లను వినియోగిస్తుంటారు. ఆ యాప్స్‌ వాట్సాప్ రక్షణగా ఉంటుంది. అయితే ఎలాంటి యాప్స్‌ లేకుండా కూడా లాక్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. స్వయంగా వాట్సాప్‌లోనే ఈ లాక్‌ ఫీచర్‌ ఉంటుంది. దీనిని ఫింగర్‌ప్రింట్‌ (Fingerprint) సెన్సార్‌ లేదా ఫేస్‌ రికగ్నైజేషన్ అథంటికేషన్ ద్వారా మీరు మాత్రమే ఓపెన్ చేయవచ్చు.

ఆండ్రాయిడ్‌, ఓఐఎస్ యాప్స్‌లో ఈ వాట్సాప్‌ లాక్ ఫీచర్ అందుబాటులో ఉంది. దీన్ని ఒక్కసారి ఆన్ చేసుకుంటే మీరు ఫింగర్‌ప్రింట్ యాక్సెస్ ఇస్తేనే వాట్సాప్‌ ఓపెన్ అవుతుంది. ఫేస్ అన్‌లాక్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు. వాట్సాప్‌ లాక్‌లో ఉన్నా వాట్సాప్‌ కాల్స్‌కు ఆన్సర్ చేసే సదుపాయం కూడా ఉంటుంది. అయితే మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ వాట్సాప్‌ లాక్‌ను ఎలా ఆన్ చేసుకోవాలో చూడండి.

ఆండ్రాయిడ్‌ మొబైల్‌ యూజర్లు వాట్సాప్‌ లాక్ ఆన్ చేసుకోండిలా..

☛ మీ ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్‌ ఓపెన్‌ చేయండి.

☛ యాప్‌పై కుడి భాగంలో ఉన్న మూడు చుక్కలపై క్లిక్‌ చేయాలి.

☛ తర్వాత సెట్టింగ్‌ (Settings)లోకి వెళ్లి అకౌంట్‌ (Account) ఆప్షన్‌పై ట్యాప్‌ చేయాల్సి ఉంటుంది.

☛ ఆ తర్వాత ప్రైవసీ (Privacy)ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి

☛ అనంతరం కిందికి స్క్రోల్‌ చేస్తే ఫింగర్‌ప్రింట్ లాక్ (Fingerprint Lock) అని ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేసి అన్‌లాక్‌ విత్‌ ఫింగ్‌ప్రింట్‌ అనే ఆప్షన్‌ను టాగుల్‌ చేసి ఎనేబుల్‌ చేసుకోండి. ఇక తర్వాత నుంచి వాట్సాప్‌ ఓపెన్‌ చేయాలంటే ఫింగర్‌ప్రింట్‌ అథంటికేషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది