ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ సర్వీస్ యాప్ లలో ఒకటైన టెలిగ్రామ్ సంస్థ తన
యొక్క యూజర్ల కోసం కొత్త ఫీచర్‌లను అభివృద్ధి చేసింది. ఈ కొత్త అభివృద్ధి
బ్లాక్‌చెయిన్ లో మెసేజింగ్ యాప్‌కి కొత్తగా క్రిప్టో పేమెంట్ల ఫీచర్‌ను
ప్రారంభించింది. ఈ ఫీచర్ అందుబాటులోకి రావడంతో వినియోగదారులు ఎటువంటి అదనపు
రుసుము చెల్లించకుండానే ఇతర టెలిగ్రామ్ వినియోగదారులకు క్రిప్టోకరెన్సీ
యొక్క Toncoinని పంపడానికి అనుమతిస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు
తెలుసుకోవడానికి ముందుకు చదవండి.
సుమారు 550 మిలియన్ల మంది వినియోగదారులను కలిగి ఉన్న టెలిగ్రామ్ AUS సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్ (SEC) నుండి చట్టపరమైన సవాలును ఎదురుకున్న తర్వాత దాని స్వంత టోకెన్ కోసం దాని ప్లాన్‌ను గతంలో విరమించుకుంది. 2019లో టెలిగ్రామ్ తన టోకెన్‌ను అభివృద్ధి చేయడానికి $1.7 బిలియన్ల సేకరణ తరువాత దానిని చట్టవిరుద్ధమైన టోకెన్ సమర్పణగా పేర్కొంటూ SEC దావా వేసింది. టెలిగ్రామ్ తరువాత SECకి జరిమానా చెల్లించడమే కాకుండా పెట్టుబడిదారులకు మూలధనాన్ని తిరిగి ఇవ్వడానికి అంగీకరించింది. అప్పటి నుండి టెలిగ్రామ్ యొక్క CEO పావెల్ దురోవ్ టెలిగ్రామ్ నుండి స్పష్టమైన మరియు స్వతంత్రంగా ఉన్న ప్రత్యేక స్పిన్-ఆఫ్ టోకెన్ టోన్‌కాయిన్‌ను ఆమోదించడానికి కృష్టి చేస్తున్నారు. దాని యొక్క ఫలితంగానే ఇప్పుడు టెలిగ్రామ్‌లో పేమెంట్స్ కోసం ఇప్పుడు క్రిప్టోకరెన్సీలను ప్రారంభించింది అని నివేదిక పేర్కొంది.