Showing posts with label Xiaomi. Show all posts
Showing posts with label Xiaomi. Show all posts

Saturday, December 3, 2022

షావోమి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. షియోమి 12కి కొన‌సాగింపుగా షియోమి 13 సిరీస్‌

 





 

Xiaomi 13 to launch on December 1 : చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. షియోమి 12కి కొన‌సాగింపుగా షియోమి 13 సిరీస్‌ (Xiaomi 13 Pro)ను డిసెంబ‌ర్ 1వ తేదీన లాంఛ్ చేయ‌నున్న‌ట్టు కంపెనీ త‌న అధికారిక వీబో పేజ్‌లో వెల్ల‌డించింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగ‌న్ 8 జెన్ 2 చిప్‌సెట్‌తో లీకా ట్యూన్డ్ కెమెరాల‌తో షియోమి లేటెస్ట్ సిరీస్ క‌స్ట‌మ‌ర్ల ముందుకు రానుంద‌ని టెక్ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

ఈ సిరీస్‌లో Xiaomi 13 Pro పేరుతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ రానుంద‌ని అఫిషియ‌ల్ పోస్టర్ వెల్ల‌డించింది. ఇక Xiaomi 13 Pro క‌ర్వ్డ్ డిస్‌ప్లేతో రెగ్యుల‌ర్ మోడ‌ల్ ఫ్లాట్ డిస్‌ప్లేతో ఉంటుంద‌ని చెబుతున్నారు. లాంఛ్ ఈవెంట్ డిసెంబ‌ర్ 1 రాత్రి ఏడుగంట‌ల‌కు ఉంటుంద‌ని కంపెనీ తెలిపింది. షియోమి లేటెస్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14 అవుటాఫ్ ది బాక్స్ ఓఎస్‌పై ర‌న్ అవుతుంది.

ఇక షియోమి 12 ప్రొను భార‌త్‌లో ఈ ఏడాది ఏప్రిల్‌లో లాంఛ్ చేయ‌గా ధ‌ర రూ.62,999 కాగా.. భార‌త్‌లో షియోమి 13 ప్రో ధ‌ర కొంచెం అధికంగా ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇక షియోమి 13 సిరీస్ ఫీచ‌ర్ల విష‌యానికి వ‌స్తే.. లీకుల ఆధారంగా లేటెస్ట్ షియోమి సిరీస్ స్నాప్‌డ్ర‌గ‌న్ 8 జెన్ 2 ఎస్ఓసీ చిప్‌సెట్‌తో, ప్రొ మోడ‌ల్ 6.65 ఇంచ్ 2కే రిజ‌ల్యూష‌న్ క‌ర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేతో క‌స్ట‌మ‌ర్ల ముందుకు రానుంది. డిసెంబర్ 1వ తేదీన రాత్రి 7 గంటలకు షావోమి 13 సిరీస్‌ను విడుదల చేయనున్నారు.

Moto X40 : Motorola నుంచి మరో కొత్త ఫోన్ రానుంది.. Moto X40 వివరాలు ఇవే..!
ఇటీవల కాలంటో మోటరోలా కొత్త ఫోన్ల లాంచింగ్‌లతో దూసుకుపోతోంది. గత కొన్ని నెలల క్రితం Moto X30 Proని లాంచ్ చేసింది.. 200MP కెమెరాతో ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌గా ఇది అవతరించింది. ఇప్పుడు.. Moto X40 త్వరలో Snapdragon 8 Gen 2 చిప్‌సెట్‌తో త్వరలో లాంచ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ కొత్త Motorola స్మార్ట్‌ఫోన్ అదే చిప్‌సెట్‌తో రాబోయే ఫోన్‌లతో ఎంతవరకు పోటీపడుతుంది? అనే విషయాలు తెలుసుకుందాం..

మోటో ఎక్స్‌40 టీజ‌ర్ల‌తో అంచ‌నాలు పెంచుతున్న మొటొరోలా ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ లాంఛ్ డేట్‌ను మాత్రం ఇంకా వెల్ల‌డించ‌లేదు. డిసెంబ‌ర్‌లో రానున్న మోటో ఎక్స్‌40 స్పెసిఫికేష‌న్స్‌పై లెనోవా ఎగ్జిక్యూటివ్ చెన్ జిన్ కీల‌క స‌మాచారం వెల్ల‌డించారు. నెక్ట్స్ మొటొరోలా ఫోన్ స్పెసిఫికేష‌న్స్‌పై వీబోలో స‌మాచారం అందించారు.


మోటో ఎక్స్‌40 లేటెస్ట్ స్నాప్‌డ్రాగ‌న్ 8 జెన్ 2 చిప్‌సెట్‌తో క‌స్ట‌మ‌ర్ల ముందుకు రానుంది. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ వాట‌ర్, డస్ట్ రెసిస్టెన్స్‌తో కూడిన ఐపీ68 రేటింగ్‌ను క‌లిగిఉంది. మోటో ఎక్స్40 6.67 ఇంచ్ ఓఎల్ఈడీ ప్యానెల్‌తో, 4x ఆప్టిక‌ల్ జూమ్ స‌పోర్ట్‌తో కూడిన‌ ట్రిపుల్ రియ‌ర్ కెమెరా సెట‌ప్‌తో క‌స్ట‌మ‌ర్ల‌ను ఆకట్టుకోనుంది.

ఇక మోటో ఎక్స్‌40 4950ఎంఏహెచ్ బ్యాట‌రీ సామ‌ర్ధ్యం క‌లిగి ఉంటుంద‌ని టెక్ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ 128జీబీ, 256జీబీ, లేదా 512జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌తో 8జీబీ, 12జీబీ, 18జీవీ ర్యాంతో మార్కెట్‌లోకి రానున్నాయ‌ని చెబుతున్నారు.

Moto X40 లాంచ్ ద్వారా ఏమి ఆశించాలి..?
తాజా పుకార్లు నిజమైతే.. రాబోయే Moto X40 స్మార్ట్ ఫోన్ Xiaomi మరియు Samsungని ఓడించి సరికొత్త Qualcomm మొబైల్ చిప్‌తో వచ్చే మొదటి ఫోన్‌గా మార్కెట్లో ప్రవేశించవచ్చు. Samsung Galaxy S23 గీక్‌బెంచ్‌లో ఒకే చిప్‌సెట్‌తో గుర్తించబడింది. ఇది రెండు ఫోన్‌లను ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంచుతుంది.

OnePlus, Xiaomi, OPPO మరియు Vivo వంటి ఇతర బ్రాండ్లు కూడా అదే చిప్‌సెట్‌తో ఫ్లాగ్‌షిప్‌లపై పని చేస్తున్నాయని తెలుస్తోంది. Qualcomm Snapdragon 8 Gen 2 ఆకట్టుకునే CPU పనితీరును నమోదు చేస్తుందని కూడా నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ ఫోన్‌లు లాంచ్ అయిన తర్వాత మాత్రమే వాస్తవ విషయాలు తెలియనున్నాయి.