Sunday, July 24, 2022

వాట్సప్ ద్వారా బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు. SBI వాట్సప్ బ్యాంకింగ్ సర్వీస్‌కు ఎలా రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకోండి

 


 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు గుడ్ న్యూస్. ఎస్‌బీఐ వాట్సప్ బ్యాంకింగ్ (WhatsApp Banking) సేవల్ని ప్రారంభించింది. వాట్సప్ ద్వారా బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు. ఎస్‌బీఐ వాట్సప్ బ్యాంకింగ్ సర్వీస్‌కు ఎలా రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకోండి.

SBI WHATSAPP BANKING KNOW HOW TO REGISTER FOR STATE BANK OF INDIA WHATSAPP BANKING SERVICE

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మరో సర్వీస్ ప్రారంభించింది. తొలిసారి వాట్సప్ బ్యాంకింగ్ (WhatsApp Banking) సేవల్ని ప్రారంభించింది. ఎస్‌బీఐ ఖాతాదారులు చాలాకాలంగా ఈ సర్వీస్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఎస్‌బీఐ వాట్సప్ బ్యాంకింగ్ (SBI WhatsApp Banking) సేవల్ని త్వరలో ప్రారంభిస్తామని ఇటీవల ఎస్‌బీఐ ఛైర్మెన్ దినేష్ ఖారా తెలిపారు.

ఎస్‌బీఐ ఛైర్మెన్ దినేష్ ఖారా ప్రకటించిన మూడువారాల్లో ఎస్‌బీ వాట్సప్ బ్యాంకింగ్ సేవలు ప్రారంభమయ్యాయి. ఎస్‌బీఐ ఖాతాదారులు వాట్సప్ ద్వారా బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు. ఎస్‌బీఐ అందించే సర్వీసుల కోసం బ్రాంచ్‌కు లేదా ఏటీఎంకు వెళ్లాల్సిన అవసరం లేదు. చాలావరకు సేవలు వాట్సప్ ద్వారా లభిస్తాయి.

ఇందుకోసం SMS WAREG అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి అకౌంట్ నెంబర్ టైప్ చేసి 917208933148 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. కస్టమర్లు తమ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచే ఎస్ఎంఎస్ పంపాల్సి ఉంటుంది. ఎస్‌బీఐ వాట్సప్ బ్యాంకింగ్ సేవల కోసం రిజిస్టర్ చేసిన కస్టమర్లు +919022690226 నెంబర్‌కు Hi అని టైప్ చేస్తే ఈ కింది మెసేజ్ వస్తుంది.

 

ఎస్‌బీఐ కస్టమర్లు వాట్సప్ బ్యాంకింగ్ సేవల్ని పొందాలనుకుంటే ముందుగా +919022690226 నెంబర్‌ను తమ స్మార్ట్‌ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ నెంబర్‌కు Hi అని టైప్ చేసి మెసేజ్ చేయాలి. ఆ తర్వాత వచ్చే ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు. అయితే అంతకన్నా ముందు కస్టమర్లు వాట్సప్ బ్యాంకింగ్ సేవల కోసం రిజిస్టర్ చేసుకోవాల్సి వస్తుంది.  

+919022690226 నెంబర్‌కు Hi అని టైప్ చేస్తే ఈ కింది మెసేజ్ వస్తుంది.

Dear Customer, Welcome to SBI Whatsapp Banking Services! Please choose from any of the options below.
1. Account Balance
2. Mini Statement
3. De-register from WhatsApp Banking
You may also type your query to get started

వీటిలో మీకు కావాల్సిన సర్వీస్‌కు సూచించిన ఆప్షన్ ఎంచుకోవాలి. మొదటి ఆప్షన్ ఎంచుకుంటే అకౌంట్ బ్యాలెన్స్ తెలుస్తుంది. రెండో ఆప్షన్ ఎంచుకుంటే ఐదు ట్రాన్సాక్షన్స్‌తో మినీ స్టేట్‌మెంట్ వస్తుంది. మూడో ఆప్షన్ ఎంచుకుంటే ఎస్‌బీఐ వాట్సప్ బ్యాంకింగ్ సేవల నుంచి డీ-రిజిస్టర్ చేయొచ్చు.

వాట్సప్ ఉపయోగిస్తున్న ఎస్‌బీఐ కస్టమర్లందరూ ఈ సేవలు ఉపయోగించుకోవచ్చు. అయితే ఎస్‌బీఐ అకౌంట్‌తో రిజిస్టర్ అయి ఉన్న మొబైల్ నెంబర్‌తో మాత్రమే వాట్సప్ బ్యాంకింగ్ సేవలు లభిస్తాయి. ఇప్పటికే ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు వాట్సప్ ద్వారా సేవలు లభిస్తున్నాయి. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ అకౌంట్ వివరాలు, రివార్డ్ పాయింట్స్, ఔట్‌స్టాండింగ్ బ్యాలెన్స్, కార్డ్ పేమెంట్స్ లాంటి సేవల్ని వాట్సప్ ద్వారా పొందుతున్నారు.