Sunday, July 10, 2022

Ration Card మీరు కొత్త రేషన్‌కార్డు కోసం అప్లై చేసుకున్నారా.. అయితే లిస్టులో మీ పేరు ఉందో చెక్‌ చేసుకోండి

 


మీరు కొత్త రేషన్‌కార్డు కోసం అప్లై చేసుకున్నారా.. అయితే లిస్టులో మీ పేరు ఉందో చెక్‌ చేసుకోండి. ఇందుకోసం ఆహార శాఖ అధికారిక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంట్లో కూర్చున్న ప్రతి వ్యక్తి తన మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా కొత్త రేషన్ కార్డు గురించి తెలుసుకోవచ్చు. కానీ ఆన్‌లైన్ జాబితాలో పేరును తనిఖీ చేసే విధానం చాలా మందికి తెలియదు. ఇది ఏ విధంగా తనిఖీ చేయాలో తెలుసుకుందాం.

కొత్త రేషన్ కార్డు ఎవరికి వచ్చిందో ఎలా చెక్ చేసుకోవాలి?

1. ముందుగా రేషన్ కార్డ్ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేయండి. దీని కోసం గూగుల్ సెర్చ్ బాక్స్‌లో nfsa.gov.in అని టైప్ చేయడం ద్వారా సెర్చ్‌ చేయండి.

2. తర్వాత మీరు స్క్రీన్‌పై విభిన్న సేవల ఎంపికను చూస్తారు. ఇక్కడ మెనులో రేషన్ కార్డ్స్ ఆప్షన్‌ని ఎంచుకోండి. తర్వాత రేషన్ కార్డు వివరాలు ఆన్ స్టేట్ పోర్టల్స్ ఎంపికను ఎంచుకోండి.

3. తర్వాత అన్ని రాష్ట్రాల జాబితా స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఇక్కడ మీరు మీ రాష్ట్రం పేరు కోసం వెతకాల్సి ఉంటుంది.

4. తర్వాత రాష్ట్రంలోని అన్ని జిల్లాల పేర్లు కనిపిస్తాయి. ఇందులో మీ జిల్లా పేరుని ఎంచుకోవాలి.

5. తర్వాత ఆ జిల్లాలోని అన్ని బ్లాక్‌ల జాబితా కనిపిస్తుంది. ఇక్కడ మీరు మీ బ్లాక్ పేరును కనుగొని దానిని ఎంచుకోవాలి.

6. తర్వాత ఆ బ్లాక్‌లో అన్ని గ్రామ పంచాయతీల జాబితా ఓపెన్‌ అవుతుంది. ఇక్కడ మీరు మీ పంచాయతీ పేరును ఎంచుకోవాలి.

7. తర్వాత, మీరు ఎంచుకున్న పంచాయతీలో నిర్వహిస్తున్న రేషన్ దుకాణం పేరు, రేషన్ కార్డు రకం స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఇక్కడ రేషన్ కార్డు రకాన్ని ఎంచుకోండి.

8. మీరు రేషన్ కార్డు రకాన్ని ఎంచుకున్న వెంటనే రేషన్ కార్డు లబ్ధిదారులందరి జాబితా తెరపై కనిపిస్తుంది. ఇక్కడ రేషన్ కార్డ్ నంబర్, హోల్డర్ పేరు, తండ్రి/భర్త పేరు, యూనిట్ నంబర్ మొదలైన వివరాలు కనిపిస్తాయి. కొత్త రేషన్ కార్డు ఎవరికి వచ్చిందో ఇక్కడ తెలుసుకోవచ్చు.