Showing posts with label New. Show all posts
Showing posts with label New. Show all posts

Sunday, December 8, 2024

Digital Ration Card: డిజిటల్ రేషన్ కార్డును ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

 

 

Mera Ration app Download

Digital Ration Card: డిజిటల్ రేషన్ కార్డును ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? Digital Ration Card: డిజిటల్ రేషన్ కార్డ్ అనేది ఎలక్ట్రానిక్ కార్డ్. ఇది రేషన్ కార్డ్ డిజిటల్ వెర్షన్. దీన్ని డౌన్‌లోడ్ చేయడం ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) కింద ఆహార ధాన్యాలు, ఇతర..  

డిజిటల్ ఇండియా కింద కేంద్రం ఎన్నో కార్యక్రమాలను చేపడుతోంది. ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో అన్ని రకాల డేటాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ విభాగంలో రేషన్ కార్డును డిజిటల్ రూపంలో అందుబాటులోకి తేవడంలో ప్రభుత్వం విజయం సాధించింది. దేశంలో “ఒకే దేశం, ఒకే రేషన్ కార్డ్” పథకాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

డిజిటల్ రేషన్ కార్డ్ అనేది ఎలక్ట్రానిక్ కార్డ్. ఇది రేషన్ కార్డ్ డిజిటల్ వెర్షన్. దీన్ని డౌన్‌లోడ్ చేయడం ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) కింద ఆహార ధాన్యాలు, ఇతర నిత్యావసర వస్తువులను పొందడం సులభం అవుతుంది. దీన్ని ఆన్‌లైన్‌లో లేదా మేరా రాషన్ 2.0 యాప్ ద్వారా సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మేరా రాషన్ 2.0 యాప్ అంటే ఏమిటి?

డిజిటల్ రేషన్ కార్డ్ అనేది ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) కింద సబ్సిడీ ఆహార ధాన్యాలను పొందేందుకు లబ్ధిదారులను సులభతరం చేసే ఎలక్ట్రానిక్ పత్రం. దీన్ని ఆన్‌లైన్‌లో లేదా మేరా రాషన్ 2.0 యాప్ ద్వారా సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది భారత ప్రభుత్వం ప్రారంభించిన మొబైల్ యాప్. ఇది రేషన్ కార్డ్ హోల్డర్‌లకు పీఈఎస్‌ సేవలను సులభంగా యాక్సెస్ చేస్తుంది. దీనిని కేంద్రం మరింత డెలవప్‌ చేస్తోంది.

  • మీరు డిజిటల్ రేషన్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
  • వ్యక్తిగత సమాచారాన్ని అప్‌డేట్ చేయవచ్చు.
  • మీరు మీ రేషన్ హక్కుల గురించి సమాచారాన్ని పొందవచ్చు.
  • మీరు కుటుంబ సభ్యులను జోడించడం లేదా తీసివేయడం వంటి సేవలను పొందవచ్చు.

అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి..

  • Android వినియోగదారులు: Google Play Store నుండి డౌన్‌లోడ్ చేసుకోండి.
  • iOS వినియోగదారులు: Apple App Store నుండి డౌన్‌లోడ్ చేసుకోండి.
  • యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి: మీ స్మార్ట్‌ఫోన్‌లో మేరా రేషన్ 2.0 యాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి.
  • అప్లికేషన్ ఓపెన్‌ చేయండి.
  • స్క్రీన్‌పై చూపిన మీ ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేయండి.
  • “ధృవీకరించు” బటన్‌ను క్లిక్ చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.
  • ఓటీపీ నమోదు చేసి, “ధృవీకరించు”పై క్లిక్ చేయండి.
  • ధృవీకరణ తర్వాత, మీ డిజిటల్ రేషన్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. డౌన్‌లోడ్ చేయండి. ప్రింట్ చేయండి లేదా సేవ్ చేయండి.

డిజిటల్ రేషన్ కార్డ్ యొక్క ప్రయోజనాలు

  • మీరు దీన్ని ఎక్కడైనా, ఎప్పుడైనా ఉపయోగించవచ్చు.
  • ఫిజికల్ కార్డ్ పోతుందనే భయం ఉండదు.
  • రికార్డులన్నీ డిజిటల్‌గా ఉండడంతో మోసం జరిగే అవకాశాలు తక్కువ.
  • మీ ఇ-రేషన్ కార్డును ఎలా ధృవీకరించాలి.
  • మీరు మీ ఇ-రేషన్ కార్డ్ సమాచారాన్ని తనిఖీ చేయాలనుకుంటే, మీ రాష్ట్ర ఆహార, ప్రజా సంక్షేమ శాఖను సందర్శించండి.

 

 Telangana Ration Card Download

 

Friday, September 20, 2024

జానీ - మైనర్ గా వున్నపుడు ప్రారంభమైన కథ మేజ‌ర్ గా మారినపుడు జానీ మాస్టర్ కు మేజ‌ర్ డామేజ్ చేసింది

 

మైనర్ గా వున్నపుడు ప్రారంభమైన కథ మేజ‌ర్ గా మారినపుడు జానీ మాస్టర్ కు మేజ‌ర్ డామేజ్ చేసింది.

 


పవన్ కళ్యాణ్ జానీ సినిమా కథ కాదు. డ్యాన్స్ మాస్టర్ జానీ ప్రేమకథ ఇది. ప్రేమల్లో రకాలు వుంటాయి. బ్రేకప్ అయితే మూవ్ అన్ అనుకునే వాళ్లు వుంటారు. పిచ్చోళ్లు అయిపోయే వాళ్లు వుంటారు. పగతీర్చుకునే వాళ్లు ప్రేయసిని చంపుకునే వాళ్లు వుంటారు. ఇదంతా ఎవరి మనసత్వం మేరకు, వారి మనసుకు తగిలిన గాయం మేరకు వుంటుంది. ఇలాంటి వ్యవహారాల్లో విపరీత సంఘటన జ‌రిగినపుడు, అ సంఘటన కనిపిస్తుంది తప్ప, తగిలిన గాయం, దాని నేపథ్యం తెలియదు. అలా తెలిసినపుడు అయ్యో అనిపిస్తుంది. మరీ పిచ్చోడా ఏమిటి? అని కూడా కామెంట్ చేయాలనిపిస్తుంది.

 

వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న డ్యాన్స్ డైరక్టర్ జానీ మాస్టర్ వెనుక కూడా ఇలాంటి భావోద్వేగ ప్రేమ కథ దాగి వుందని టాలీవుడ్ ఇన్ సైడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. కళాకారులు సాధారణంగా కాస్త భావావేశం పాలు ఎక్కువ కలిగి వుంటారు. అందుకేనేమో సినిమాల్లోనే కాదు, సినిమా రంగంలో కూడా ప్రేమ కథలే ఎక్కువ వుంటాయి.

ఓ డ్యాన్స్ షో లో చూసినపుడే జానీ మాస్టర్ ఆ అమ్మాయితో వన్ సైడ్ లవ్ లో పడిపోయినట్లు కనిపిస్తోంది. తన దగ్గర అవకాశం ఇచ్చాడు. ఇద్దరూ దగ్గరయ్యారో, జానీ మాస్టర్ బలవంతంగా దగ్గర చేసుకున్నాడో మొత్తానికి కలిసారు. చాలా మంది చాలు ‘పనైపోయింది’ ఎలాగో అలా వదిలించేసుకుంటే చాలు అనుకుంటారు. అవతలి వాళ్లు కూడా కెరీర్ కోసం కలిసాం.. పనైపోయింది అని.. బై..బై చెప్పడానికి పెద్దగా బాధపడరు.

కానీ జానీ మాస్టర్ వేరు. తమ బంధాన్ని పెళ్లిగా మార్చుకోవాలనుకున్నాడని తెలుస్తోంది. అక్కడే కథ అడ్డం తిరిగింది. ఎంతయినా తన భర్త తను వుండగా మరో పెళ్లి చేసుకుంటా అంటే ఏ మహిళా అంగీకరించదు. జానీ మాస్టర్ దగ్గరా అదే జ‌రిగినట్లుంది. కుటుంబంలో చిన్న పాటి తగాదాలు. ఇవన్నీ చూసి అ అమ్మాయి దూరం జ‌రిగింది. అక్కడితో జానీ మాస్టర్ ఆగిపోయి వుంటే కథ ఇంత దూరం వచ్చేది కాదు.

కెరీర్ పీక్ లో వుంది. కానీ జానీ మాస్టర్ కాస్త డ్రిపెషన్ లోకి వెళ్లాడు. అప్పట్లో కొరియోగ్రఫీ చేసిన సినిమాల సెట్ ల్లో జానీ మాస్టర్ డల్ మూడ్ లో కూర్చుని వుండడం చాలా మంది గమనించారు. అది ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. తను డల్ మూడ్ లోకి డిప్రెషన్ మోడ్ లోకి వెళ్తే ఓకె. అక్కడి నుంచి ఆ అమ్మాయి పని చేసే వర్క్ ప్లేస్ కు వెళ్లి, ఆమెను పిలవడం, ఇబ్బంది పెట్టడం, ఎంబ్రాసింగ్ సిట్యు వేషన్ క్రియేట్ చేయడం, ఇది చూసి అవకాశాలు వెనక్కు పోవడం ఇలా రచ్చ.. రచ్చ ప్రారంభమైంది.

దీంతో అమ్మాయి విసిగిపోయింది. ప్రేమించే వాడిని ఇష్టపడుతుంది. ఇబ్బంది పెట్టవాడిని మరింత దూరం పెట్టాలనుకుంటుంది. అదే జరిగింది. ఇలాంటి టైమ్ లో భర్త పిచ్చోడైపోవడం చూసి జానీ మాస్టర్ భార్య ఇక తప్పదని గమనించి పెళ్లికి ఓకె చెప్పినట్లు తెలుస్తోంది. కానీ అలా పెళ్లి జరగాలంటే మతాలు అడ్డు. దానికి మళ్లీ మరో మార్గం. అది కూడా పరిస్థితిని మరింత వికటించేలా చేసింది.

దాంతో కథ మొత్తం సినిమా పెద్ద‌ల దగ్గరకు అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కు చేరింది. మైనర్ గా వున్నపుడు ప్రారంభమైన కథ మేజ‌ర్ గా మారినపుడు జానీ మాస్టర్ కు మేజ‌ర్ డామేజ్ చేసింది. ప్రేమావేశాన్ని కంట్రోలు చేసుకోలేకపోవడం అసలు సిసలు తప్పిందం. డ్యాన్స్ షో టైమ్ లోనే ప్రేమావేశాన్ని కంట్రోలు చేసుకుని, జడ్జ్‌గా పెద్దరికంతో వుండిపోయి వుంటే, రేపు కోర్టులో రేప్ కేసు మీద జడ్జ్‌ ముందు నిల్చునే పరిస్థితి వుండేది కాదు.

Sunday, March 1, 2015

ఆశాజనకంగా ఆర్థిక సర్వే

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ 2014-15 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 2015-16లో వృద్ధి రేటు 8 శా తంగా ఉంటుందని ఆర్థిక సర్వేలో అంచనా వేశారు. ద్రవ్య స్థిరీకరణకు ప్రభుత్వం కటు్టబడి ఉన్నటు్ల జైట్లీ తెలియజేశారు. సబ్సిడీల హేతుబద్ధీకరణకు పిలుపు ఇస్తున్న సర్వే ప్రస్తుతం ఇస్తున్న పలు రాయితీలు, నిరుపేదల జీవన ప్రమాణాలపై పరి మాణాత్మక మార్పును చూపినట్లు లేదని వ్యాఖ్యానించింది. మరింతగా ఆర్థిక వ్యవస్థ విస్తరణకు, దుబారా వ్యయం తగ్గిం పునకు, ఉత్పాదక పెట్టుబడి ప్రోత్సాహానికి సంస్కరణల అజెం డాను నిర్దేశించడం ఆవశ్యకమని కూడాసర్వే సూచించింది. కాగా, ఈ ఆర్థిక సర్వే ప్రకారం బడ్జెట్‌లో పలు కఠిన నిర్ణ యాలు తప్పవనే సంకేతాలను ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన సంస్కరణలకు, స్కిల్‌ ఇండియా, మేక్‌ ఇన్‌ ఇండియాకు బడ్జెట్‌లో ఊతమిచ్చే అవకాశాలు ఉన్నాయి. రెండు సంవత్సరాల వ్యవధిలో ఆర్థిక వృద్ధి రేటు రెండు అంకెలకు చేరుకుంటుందని సర్వే అంచనా వేసింది. 2014-15 సంవత్సరా నికి ఆర్థిక వృద్ధి 7.4 శాతంగా ఉన్నట్లు సర్వే వెల్లడించింది. 2015-16లో 8 నుంచి 8.5 శాతం ఆర్థిక వృద్ధి రేటు సాధిస్తుందని అంచనా వేసింది. ద్రవ్య లోటును, ద్రవ్యోల్బణాన్ని కూడా గణనీయంగా నియంత్రించడం సాధ్యమే అని సర్వే ధీమా వ్యక్తం చేసింది. వ్యయాల నియంత్రణ ద్వారా ద్రవ్య లోటును తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తున్నట్లు సర్వే తెలియజేసింది. 2015-16 ఆర్థిక సంవత్సరం నాటికి ద్రవ్యోల్బణంగా గరిష్ఠం గా ఒక శాతం తగ్గి 5 నుంచి 5.5 శాతం దగ్గర నిలుస్తుందని సర్వే అంచనా వేసింది. ఇక ద్రవ్య లోటును 4.1 శాతానికి నియంత్రించడం సాధ్యమే అని సర్వే భావిస్తోంది. ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం సబ్సిడీలను తగ్గించవలసి రావచ్చని ఆర్థిక సర్వే అంచనా. అయితే దానికి రాకీయ నిర్ణయం తీసుకో వలసి ఉంటుందని సర్వే గుర్తించింది. ద్రవ్య స్థిరీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సర్వే స్పష్టం చేసింది. చమురు ధర తగ్గుదల, స్పెక్ట్రమ్‌ వేలం ద్వారా గణనీయమైన ఆదాయం సమకూరుతుందని సర్వే అంచనా వేసింది. 2014-15లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 257 మిలియన్‌ టన్నులు ఉండవచ్చని సర్వే అంచనా వేసింది. గత ఐదు సంవత్సరాల కంటే ఇది 8.5 మిలియన్‌ ట న్నులు అధికమని ఆర్థిక సర్వే పేర్కొంది. దేశ ఆర్థిక వ్యవస్థ తీరుపై ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రహ్మణ్యన్‌ నేతృత్వంలోని బృందం రూపొం దించిన ఈ వార్షిక నివేదిక ఇక వృద్ధి రేటు మరింత పెరగాలని, రెండు అంకెల వృద్ధి రేటు సాధ్యమేనని పేర్కొన్నది. ఎగుమతులు, విదేశీ నిధుల సరఫరాతో కూడుకున్న విదేశీ వాణిజ్య రంగం కూడా తిరిగి పటిష్ఠం అవుతోందని సర్వే అభిప్రాయ పడింది. పారిశ్రామిక వృద్ధి రేటు కూడా ఇప్పుడు పెరుగుతోందని సర్వే తెలిపింది. వ్యవసాయ రంగంపై కూడా సర్వే కొన్ని మంచి అభిప్రా యాలనే వ్యక్తం చేసింది. `2014-15 సంవత్సరానికి ఆహార ధాన్యల ఉత్పత్తి 257.07 మిలియన్‌ టన్నులుగా అంచనా వేయడమైంది. ఇది గత సంవ త్సరాల స్థాయి కన్నా 8.5 మిలియన్‌ టన్నుల మేర అధికంగా ఉంటుంది' అని సర్వే తెలియజేసింది.
 ఆర్థిక సర్వేలో ముఖ్యాంశాలు
 * 2014-15లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 257.07 మిలియన్‌ టన్నులు
 * రెండు అంెకల వృద్ధి రేటు సాధ్యమే
 * ఆదాయం పెంచేందుకు ప్రాధాన్యం
 * 2015-16లో కరెంట్‌ ఖాతా లోటు ఒక శాతం ఉంటుందని అంచనా
 * అర్హులకు ఫలాలు అందాలంటే జన్‌ ధన్‌, ఆధార్‌, మొబైల్‌ నంబర్‌ అవసరం
* వ్యవసాయ ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో సాధారణ మార్కెట్‌ కల్పించాలి