జాతీయ మానవ హక్కుల కమీషన్ చట్టబద్దమైన, స్వయం ప్రతిపత్తి సంస్థ, కాని రాజ్యాంగబధ్ధమైన సంస్థ కాదు. "మానవ హక్కుల పరిరక్షణ చట్టం-1993" ప్రకారం జాతీయ మానవ హక్కుల కమీషన్ అక్టోబర్ 12 , 1993 న ఏర్పడింది. కాంగ్రేస్ పార్టీ అధికారంలో పి.వి నరసింహరావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ కమీషన్ ను ఏర్పాటు చేశారు. 1993 మానవ హక్కుల చట్టాన్ని 2006 సంవత్సరంలో సవరించి ఈ కమీషన్ లో కోన్ని మార్పులు చేశారు.
- దీన్ని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
- జాతీయ మానవ హక్కుల కమీషన్ లో ఒక చైర్మన్, నలుగురు ఇతర సభ్యులు ఉంటారు.
- చైర్మన్ గా నియమించబడే వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన వారై ఉండాలి.
- ఒక సభ్యుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి గా పనిచేస్తున్న లేదా పదవి విరమణ చేసిన వారై ఉండాలి.
- మరోక సభ్యుడు ఏదైన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న లేదా పదవి విరమణ చేసిన వారై ఉండాలి.
- మిగిలిన ఇద్దరు సభ్యులు మానవ హక్కుల రంగంలో పరిజ్ఞానం ఉన్న వారై ఉండాలి
UPLOAD అవుతుంది.......