తెలంగాణ ఉద్యోగులు, విధ్యార్థులు, ఒక మహా సమ్మె తల పెట్టారు. 13 సెప్టెంబర్ నుంచి 24 అక్టోబర్ 2011 వరకు నలభై రోజులు తెలంగాణలో సాధారణ జన జీవితం స్తంభించింది. అన్ని వృత్తులవారు ఈ సమ్మెలో పాల్గొన్నారు. రోడ్లపైనే వంటా-వార్పులు, రైల్ రోకో, రోడ్డు దిగ్బంధాలు ఈ సమ్మెకాలంలో నిత్యకృత్యమైనాయి.
తెలంగాణా పోరాటం ప్రధానంగా శాంతియుత పద్ధతులలో సాగింది. "జై తెలంగాణ" నినాదాలు మారుమూల పల్లెల్లో గుడారాల్లోకూడా మారుమోంది. హుస్సేన్ సాగర్ చుట్టూ జనం చేరి నిరసన తెలిపారు. దీన్నే "సాగరహారం" అంటారు. తెలంగాణ వ్యాప్తంగా అనేకమంది యువకులు ఆత్మహుతులు చెసుకున్నారు. దాదాపు వెయ్యిమంది విద్యార్థులు తెలంగాణ కోసం బలిదానాలు చేసినట్టు వార్తా పత్రికల కథనాలు తెలుపుతున్నాయి. కేంద్రం తెలంగాణఇవ్వడంలో విపరీతమైన జాప్యచేస్తూ ఉండటంవల్ల, ఆందోళన వల్లనే ఈ బలిదానాలు జరిగాయి. వ్యవస్థ మీద నమ్మకం నశించడం పర్యవసానంగా ఈ పరిణామం సంభవించిందని రాజకీయ వ్యాఖ్యతలు తెలిపారు
ఆగకుండా సాగుత్తున్న తెలంగాణా ఉధ్యమం కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించింది U.P.A ప్రభుత్వం తెలంగాణ గురించిన నిర్ణయాన్ని వేగవంతం చేయదలచింది.
Tags:సకల జనుల సమ్మె ,తెలంగాణా ఉధ్యమం,sakala janula samme,
సకల జనుల సమ్మె ,తెలంగాణా ఉధ్యమం,sakala janula samme,