Thursday, September 10, 2020

Airtel Xstream Fiber Vs JioFiber : తక్కువ ధర బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో బెస్ట్ ఇదే!!!

 


 

ఇండియాలో బ్రాడ్‌బ్యాండ్ రంగంలో రోజు రోజుకి పోటీ ఎక్కువ అవుతున్నది. ఎంతలా అంటే ఎక్కువ మంది వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఒకరిని మించి మరొకరు తక్కువ ధరల వద్ద బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ లను అందిస్తున్నాయి. మరి ముఖ్యంగా జియోఫైబర్ మరియు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్లు రెండు కూడా తమ యూజర్లకు కొత్త ప్లాన్‌లను అందిస్తున్నాయి.

జియోఫైబర్ Vs ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ కొత్త అప్‌డేట్ ప్లాన్‌లు 
 
జియోఫైబర్ కొద్ది రోజుల క్రితం తన బ్రాడ్‌బ్యాండ్ సమర్పణలను అప్‌డేట్ చేసింది. ఇది తన వినియోగదారులకు కొత్త ప్లాన్‌లను అందించడంతో పాటు వినియోగదారుల కోసం ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ డెమో ఆఫర్‌ను కూడా అందిస్తున్నది. అంతకుముందు జియోఫైబర్ అందిస్తున్న అతి తక్కువ మరియు చౌకైన ఆఫర్ నెలకు రూ.699 ధర వద్ద 100 Mbps వేగంతో అందిస్తోంది. అయితే ఇప్పుడు జియోఫైబర్ 30 Mbps వేగంతో నెలకు రూ.399 ధర వద్ద అందిస్తున్నది. అదే విధంగా టెలికాం ఆపరేటర్ ఎయిర్టెల్ కూడా తన బ్రాడ్‌బ్యాండ్ సమర్పణలను అప్‌డేట్ చేసింది. ఇది కూడా రూ.499ల తక్కువ ధర వద్ద కొత్త ప్లాన్ ను ప్రవేశపెట్టింది. దీనితో పాటు ఇప్పుడు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ మొత్తంగా ఐదు ప్లాన్‌లను అందిస్తున్నాయి. ఈ రెండు బ్రాడ్‌బ్యాండ్ సర్వీసు ప్రొవైడర్లు అందిస్తున్న చౌకైన ఆఫర్‌ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

జియోఫైబర్‌ రూ.399 చౌకైన ప్లాన్ పూర్తి వివరాలు
 
 జియోఫైబర్‌ తన వినియోగదారులకు రూ.399 అతి తక్కువ ధర వద్ద అందిస్తున్న ప్లాన్ అపరిమిత డేటాను అందిస్తుంది. ఈ కొత్త ప్లాన్ ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ కంటే 100 రూపాయలు చౌకైనది. కానీ ఇది ఎయిర్‌టెల్ కంటే 10 Mbps తక్కువ ఇంటర్నెట్ డౌన్‌లోడ్ మరియు అప్‌లోడ్ వేగంతో లభిస్తుంది. జియోఫైబర్‌ యొక్క రూ.399 ప్లాన్ యొక్క అపరిమిత డేటా నెలలో 3.3TB FUP పరిమితిని కలిగి ఉంటుంది.


 

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ రూ.499 ప్లాన్ వివరాలు 
 
ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ ఇప్పుడు కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను రూ.499 ధర వద్ద అందిస్తోంది. టెల్కో దీనిని తన వినియోగదారులకు 2020 సెప్టెంబర్ 7 నుండి అందిస్తోంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులకు అపరిమిత ఇంటర్నెట్ డేటా లభిస్తుంది. ఇంతకు ముందు సంస్థ రూ.799 ధర వద్ద చౌకైన ప్లాన్‌ను అందించేది. అయినప్పటికీ ఇది అపరిమిత డేటాను అందించదు. అపరిమిత డేటా కావలసిన వినియోగదారులు నెలవారీ ప్రాతిపదికన రూ.299 అదనంగా చెల్లించాల్సి ఉండేది.


 

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ రూ.499 ప్లాన్ అదనపు ప్రయోజనాలు
 
 ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ ఇప్పుడు తన వినియోగదారులకు అందిస్తున్న ప్రతి ప్లాన్ ను కూడా అపరిమిత డేటాతో అందిస్తున్నది. దానితో పాటు కస్టమర్ కు అపరిమిత వాయిస్ కాలింగ్ కూడా అదనంగా లభిస్తుంది. రూ.499 ధర వద్ద లభించే ఈ చౌకైన ప్లాన్ 40 Mbps వేగంతో దాని ధరను సమర్థిస్తు వస్తుంది. ఇవే కాకుండా ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ బండిల్‌లో మీకు లభించే ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ 4K టివి బాక్స్ కూడా అదనంగా లభిస్తుంది. దాని కోసం కస్టమర్ కేవలం రూ.1,499 (సెక్యూరిటీ డిపాజిట్) చెల్లించాల్సి ఉంటుంది. అది సంస్థ తిరిగి చెల్లిస్తుంది కూడా. ఇవే కాకుండా 7 OTT యాప్ లు మరియు 5 స్టూడియోల యొక్క షోలతో పాటు 10,000+ సినిమాలకు ఉచిత యాక్సిస్ ను పొందుతారు.


 

జియోఫైబర్‌ రూ.399 ప్లాన్ Vs ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ రూ.499 ప్లాన్
 
 జియో ఫైబర్ అందిస్తున్న రూ.399 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో ఎటువంటి OTT ప్రయోజనాలు అందుబాటులో లేవు. కాకపోతే వినియోగదారులకు అపరిమిత కాలింగ్ ప్రయోజనం మాత్రం అందుబాటులో ఉంది. రెండు ప్లాన్‌లను పోల్చి చూస్తే కనుక ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ యొక్క రూ.499 ప్లాన్ జియోఫైబర్ యొక్క రూ.399 ప్లాన్ కంటే రూ.100 ఖరీదైనది అయినప్పటికీ జియోఫైబర్ ప్లాన్‌తో పోలిస్తే అద్భుతమైన డేటా వేగంతో మరియు OTT ప్రయోజనాలను అందిస్తుంది.