Thursday, March 17, 2022

Aadhaar Card : ఆధార్ నంబర్‌ మరిచిపోయారా ? కార్డు లేకున్నా మీ ఫోన్‌కు ఆధార్ నంబర్‌....

 

Aadhaar Card : ఆధార్ నంబర్‌ మరిచిపోయారా ? కార్డు లేకున్నా మీ ఫోన్‌కు ఆధార్ నంబర్‌ను ఎస్ఎంఎస్ ద్వారా పొందేందుకు ఇలా చేయండి

 


ఆన్‌లైన్‌ ద్వారా ఆధార్ కార్డు నంబర్‌ను ఎలా పొందాలో చూడండి. ఈ స్టెప్స్ ఫాలో అయితే మీ మొబైల్‌కు ఆధార్ నంబర్‌ మెసేజ్ రూపంలో వస్తుంది.

 భారత దేశంలో ఆధార్ (Aadhaar) అత్యంత ముఖ్యమైన కార్డు. ప్రభుత్వ పథకాలు పొందాలన్నా.. కొన్ని ఇతర సేవలను పొందాలన్న ఆధార్ కార్డు (Aadhaar Card) తప్పనిసరిగా మారింది. అయితే ఒక్కోసారి ఆధార్ కార్డును వెంట తీసుకెళ్లం. అకస్మత్తుగా అవసరం వస్తుంది. అయితే చాలాచోట్ల ఫిజికల్‌గా కార్డు లేకున్నా.. Aadhaar Number ఉన్నా పని జరుగుతుంది. నంబర్‌ నమోదు చేస్తే వివరాలు వస్తాయి. అయితే చాలా మందికి ఆధార్ నంబర్‌ సరిగా గుర్తుండదు. అలాంటి సమయాల్లో చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే Aadhaar Card దగ్గర లేని సమయాల్లో.. మీ స్మార్ట్‌ఫోన్ నుంచే ఆధార్ నంబర్‌ను పొందవచ్చు. అందుకు ఓ మార్గం ఉంది. చాలా సందర్భాల్లో ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అదెలానో చూడండి

ఆన్‌లైన్‌ ద్వారా ఆధార్ నంబర్‌ పొందాలంటే..

  • ముందుగా ఆధార్ అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ లోకి వెళ్లాలి.
  • అనంతరం మొదట ఉన్న మై ఆధార్ (My Aadhaar) ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత గెట్ ఆధార్ (Get Aadhaar) అనే సెక్షన్‌లో రిట్రైవ్ లాస్ట్ ఆర్ ఫర్గాటెన్ ఈఐడీ / యూఐడీ (Retrieve Lost or Forgotten EID / UID) అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
  • అనంతరం ఓపెన్ అయ్యే వెబ్‌పేజీలో పేరు, మొబైల్‌ నంబర్‌‌తో పాటు అక్కడే కనిపించే క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.
  • వివరాలు నమోదు చేశాక.. సెండ్ ఓటీపీ బటన్‌పై క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత మీ ఆధార్‌కు రిజిస్టర్ అయిన మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.
  • ఆ ఓటీపీ సబ్మిట్ చేస్తే.. మొబైల్‌కు ఆధార్ నంబర్‌ మెసేజ్ రూపంలో వస్తుంది.
Aadhaar Card పోగొట్టుకున్న సమయంలోనూ ఈ సదుపాయం ఎంతో ఉపయోగపడుతుంది. నంబర్‌ కూడా గుర్తులేక.. కార్డు కోల్పోయిన సమయంలో నంబర్‌ను ఈ ప్రక్రియతో పొందవచ్చు. రూ.50 ఫీజు చెల్లించి మళ్లీ ఆధార్ కార్డు కోసం అధికారిక వెబ్‌సైట్‌లోనే ఆర్డర్ చేయవచ్చు. 15 రోజుల్లోనే ఇంటికే ఆధార్ కార్డు వస్తుంది