మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్‌ను భౌతికంగా ప్రతిచోటా తీసుకెళ్లకుండా దాని
సాఫ్ట్ కాపీని మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉంచాలనుకుంటున్నారా లేదా డౌన్‌లోడ్
చేయాలనుకుంటున్నారా? ఇందుకోసం భారత ప్రభుత్వం మీ డ్రైవింగ్ లైసెన్స్‌ను మీ
ఫోన్‌లో సేవ్ చేయడానికి లేదా దాని సాఫ్ట్ కాపీని డిజిలాకర్ లేదా ఎమ్
పరివాహన్ యాప్ ద్వారా పొందడానికి సహాయపడే ఒక ఆప్షన్‌ను అందించింది. మీ
డ్రైవింగ్ లైసెన్స్ యొక్క హార్డ్ కాపీని తీసుకెళ్లడం మర్చిపోతే ట్రాఫిక్
పోలీసుల తనిఖీ వద్ద ఇది ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. అలాగే మీ డ్రైవింగ్
లైసెన్స్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌లో భద్రపరచడం వలన హార్డ్ కాపీ దొంగతనం
చేయబడినప్పటికీ తిరిగి పొందే అవకాశం ఉంటుంది.
Download App
2018 లో డిజిలాకర్ మరియు ఎమ్ పరివాహన్ యాప్‌లో స్టోర్ చేసిన డ్రైవింగ్
లైసెన్స్ మరియు వాహన రిజిస్ట్రేషన్‌ను ఆమోదించాలని ప్రభుత్వం ఒక
ఆర్డినెన్సును జారీ చేసింది. డ్రైవింగ్ చేసేటప్పుడు డాక్యుమెంట్‌ల భౌతిక
వెర్షన్‌లను తీసుకెళ్లాల్సిన అవసరాన్ని తొలగించడమే ఆ ఎత్తుగడ లక్ష్యం. మీరు
మీ స్మార్ట్‌ఫోన్‌లో డ్రైవింగ్ లైసెన్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి కింద
ఉన్న మార్గాలను అనుసరించండి.
మీ స్మార్ట్‌ఫోన్‌లో మీ డ్రైవింగ్ లైసెన్స్‌ను డౌన్‌లోడ్ చేసుకునే
విధానం
ప్రారంభించడానికి ముందు మీరు DigiLocker లో అకౌంట్ కలిగి ఉండాలని మాత్రం
మర్చిపోకండి. మీరు మీ ఫోన్ నంబర్ మరియు ఆధార్ కార్డు ఉపయోగించి
డిజిలాకర్‌లో సైన్ అప్ చేయవచ్చు.
స్టెప్@ 1
డిజిలాకర్ సైట్‌ను ఓపెన్ చేయండి. తరువాత మీ యూజర్ నేమ్ మరియు ఆరు అంకెల
పిన్‌తో సైన్ ఇన్ చేయండి. అప్పుడు మీరు మీ రిజిస్టర్డ్ ఫోన్‌లో ఒక సారి
పాస్‌వర్డ్ (OTP) అందుకుంటారు.
స్టెప్@ 2
సైన్ ఇన్ చేసిన తర్వాత 'గెట్ ఇష్యూడ్ డాక్యుమెంట్స్' బటన్ పై క్లిక్ చేయండి.
స్టెప్@ 3
ఇప్పుడు సెర్చ్ బార్‌లో "డ్రైవింగ్ లైసెన్స్" అనే పదాన్ని టైప్ చేయండి.
స్టెప్@ 4
తరువాత మీరు డ్రైవింగ్ లైసెన్స్ పొందిన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంచుకోండి.
ఒకవేళ మీకు గుర్తులేకపోతే కనుక ప్రత్యామ్నాయంగా మీరు అన్ని రాష్ట్రాల
ఎంపికను కూడా ఎంచుకోవచ్చు.
స్టెప్@ 5
మీ డ్రైవింగ్ లైసెన్స్ నంబర్‌ను నమోదు చేయండి. తరువాత గెట్ డాక్యుమెంట్
బటన్‌ని నొక్కండి. మరింత ముందుకు వెళ్లే ముందు మీ డేటాను ఇష్యూయర్‌తో
పంచుకోవడానికి డిగ్‌లాకర్‌కు మీ సమ్మతిని అందించడానికి చెక్‌బాక్స్‌పై
క్లిక్ చేయండి.
స్టెప్@ 6
డిజిలాకర్ ఇప్పుడు మీ డ్రైవింగ్ లైసెన్స్‌ను రవాణా శాఖ నుండి అందిస్తుంది.
స్టెప్@ 7
ఇష్యూడ్ డాక్యుమెంట్‌ల లిస్ట్‌కు వెళ్లడం ద్వారా మీరు ఇప్పుడు మీ డ్రైవింగ్ లైసెన్స్ యొక్క సాఫ్ట్ కాపీని చూడవచ్చు.
స్టెప్@ 8
డ్రైవింగ్ లైసెన్స్ PDF బటన్ పై క్లిక్ చేయడం ద్వారా సాఫ్ట్ కాపీలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
స్టెప్@ 9
డిజిలాకర్ యాప్‌ను మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేయడం ద్వారా కూడా డ్రైవింగ్ లైసెన్స్ ను మరింత సులభంగా పొందవచ్చు.
డిజి లాకర్‌లో చూపించే పత్రాలు
కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలు మరియు ఆయా
రాష్ట్రాల పోలీసు శాఖలకు డిజి లాకర్‌లో చూపించే పత్రాలు చెల్లుతాయని
సూచించింది. ల్యామినేటెడ్ రూపంలో ఉన్న పత్రాలను స్కాన్ చేసి, సాఫ్ట్ కాపీల
రూపంలో డిజి లాకర్‌లో భద్రత పరుచుకున్న అన్ని ప్రభుత్వం కార్యాలయాల్లో
చెల్లుబాటు అవుతాయని కేంద్రం సూచించింది. భారత సమాచార సాంకేతిక చట్టం 2000
ప్రకారం డిజి లాకర్‌లో ఉన్న పత్రాలు చెల్లుబాటు అవుతాయి. కేంద్ర రోడ్డు
రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా మాట్లాడుతూ, "రాష్ట్ర
ప్రభుత్వాలు మోటార్ వాహనాల చట్టం 1988 ప్రకారం జారీ చేసిన డ్రైవింగ్
లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మరియు ఇతర పత్రాలు డిజి లాకర్ లేదా
ఎమ్‌పరివాహన్ మొబైల్ యాప్ ద్వారా ఎలక్ట్రానిక్ రూపంలో చెల్లుబాటు అవుతాయని
పేర్కొంది."