Showing posts with label News. Show all posts
Showing posts with label News. Show all posts

Saturday, March 12, 2022

Aadhaar-PAN Details: పాన్, ఆధార్ నెంబర్‌ వివరాలను షేర్ చేస్తున్నారా.. అయితే జాగ్రత్త..!

 

 


ఆధార్ కార్డు, పాన్ కార్డు వివరాలను ఎవరితోను పంచుకోరాదని పరోక్ష పన్నులు, కస్టమ్స్ కేంద్ర బోర్డు (CBIC) ప్రజలను ఉద్దేశించి గురువారం ట్వీట్ చేసింది. ఈ వివరాలతో మోసగాళ్లు జీఎస్టీ ఎగవేతలకు పాల్పడుతున్నారని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఆధార్, పాన్ వివరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, గోప్యతను పాటించాలని కోరింది. అకారణంగా లేదా నగదు ప్రయోజనాల కోసం ఈ వివరాలను ఇతరుల చేతికి అందిస్తే దుర్వినియోగం చేస్తున్నారని, నకిలీ సంస్థలను సృష్టించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నట్లు తెలిపింది.

బోగస్ కంపెనీల పేరుతో నకిలీ ఇన్వాయిస్‌లను సృష్టించి ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC)ని మోసపూరితంగా క్లెయిమ్ చేస్తున్నారని CBIC తెలిపింది. 'పన్నుల ఎగవేత కోసం జీఎస్టీలో నకిలీ ఎంటిటీలను సృష్టించేందుకు ఉపయోగపడే మీ వ్యక్తిగత డేటాను రక్షించుకోండి' అని ట్వీట్ చేసింది. గతంలో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (GST) అధికారులు అనేక బోగస్ సంస్థలను చేధించారు. అసలు వస్తువుల సరఫరా లేకుండా నకిలీ ఇన్వాయిస్‌ను పెంచేందుకు ఉపయోగించారు. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ని మోసపూరితంగా క్లెయిమ్ చేయడమే వీరి ఉద్దేశ్యం.

 

 

 

Tuesday, September 14, 2021

NEET: నీట్‌ పరీక్షకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం.. అన్నాడీఎంకే పూర్తి మద్దతు

 


NEET – Tamil Nadu – Assembly: తమిళనాడు అసెంబ్లీ నీట్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేసింది. తమిళనాడు విద్యార్ధులకు నీట్‌ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని తమిళనాడు అసెంబ్లీ ముక్తకంఠంతో కేంద్రానికి చాటింది. తమ రాష్ట్రంలో నీట్‌ పరీక్షను రద్దు చేస్తామని ప్రకటించారు తమిళనాడు సీఎం స్టాలిన్‌. అన్నాడీఎంకే కూడా నీట్‌ పరీక్షకు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతు తెలిపింది. తీర్మానంపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి స్టాలిన్‌. బీజేపీకి అన్నాడీఎంకే మిత్రపక్షమని, నీట్‌ను రద్దు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఆ పార్టీ నేతలకు సూచించారు. అదే సమయంలో నీట్ లేకుండా మెడికల్ అడ్మిషన్ల కోసం తెచ్చిన బిల్లును తమిళనాడు అసెంబ్లీ ఆమోదించింది.

సీఏఏ, సాగుచట్టాలపై ఓటింగ్‌ జరిగినప్పుడు నీట్‌ను రద్దు చేయాలన్న షరతును పెట్టి ఉంటే కేంద్రం ఆనాడే నిర్ణయం మార్చుకునేదని అన్నాడీఎంకే నేతలకు స్టాలిన్‌ చురకలంటించారు. నీట్‌ పరీక్ష ఒత్తిడిని తట్టుకోలేక తమిళనాడు విద్యార్ధులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే అన్నాడీఎంకే నేతలు ఇన్నాళ్లు ప్రేక్షకపాత్ర పోషించారని మండిపడ్డారు. బీజేపీని ఎదిరించే ధైర్యం బీజేపీ నేతలకు లేదన్నారు. తాము అధికారం లోకి వచ్చాక నీట్‌ పరీక్షను రద్దు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటునట్టు సీఎం సభకు తెలిపారు.

 

 12వ తరగతి మార్కుల ఆధారంగానే మెడిసిన్‌లో విద్యార్ధులకు ప్రవేశం ఇచ్చేందుకు తమిళనాడు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు ముఖ్యమంత్రి స్టాలిన్‌. నీట్‌కు తమ ప్రభుత్వం పూర్తి వ్యతిరేకమని స్పష్టం చేశారు. తమిళనాడు విద్యార్ధులకు నీట్‌ పరీక్ష అవసరం లేదన్నారు. సామాజిక న్యాయాన్ని తుంగలో తొక్కే విధంగా నీట్‌ పరీక్ష విధానాన్ని తీసుకొచ్చారని విమర్శించారు. పేద, దళిత విద్యార్ధులకు దీంతో తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు స్టాలిన్‌. అసెంబ్లీలో నీట్‌కు వ్యతిరేకంగా సీఎం స్టాలిన్‌ ప్రవేశపెట్టిన తీర్మానానికి అన్నాడీఎంకేతో సహా అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. దీంతో ఏకగ్రీవంగా ఈ తీర్మానాన్ని తమిళనాడు అసెంబ్లీ ఆమోదించింది.

 

 

Electric Bus: ఈ బస్సు ఒక్కసారి ఛార్జ్ చేస్తే హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్లి వచ్చేస్తుంది..అందుకే గిన్నిస్ బుక్ లోకి..

 


Electric Bus: మెర్సిడెస్ బెంజ్.. వోల్వో వంటి ఆటోమేకర్లు కూడా ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహన రేసులో పాల్గొంటున్నారు. ఎలక్ట్రిక్ ట్రక్కుల తయారీలో నిమగ్నమై ఉన్నారు. ఎలక్ట్రిక్ ట్రక్కులను అభివృద్ధి చేయడానికి తయారు చేయడానికి DPD స్విట్జర్లాండ్, కాంటినెంటల్ టైర్‌లతో భాగస్వామ్యమైన వాణిజ్య వాహన బ్రాండ్ అయిన యూరోప్ ఫ్యూచారికా కూడా ఈ పోటీలో ఉంది. 

ఈ బృందం రీఛార్జ్ చేయకుండానే  అత్యధిక దూరం ప్రయాణించే ఎలక్ట్రిక్ ట్రక్కును సిద్ధం చేసింది. దీంతో ఈ బస్సు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది. రికార్డు కోసం, వీరు  గత 6 నెలలుగా వస్తువులను తీసుకెళ్తున్న ఇ-ట్రక్కును ఉపయోగించారు.

 

ఈ ఇ-ట్రక్కును మొదట ఎలక్ట్రిక్ ట్రక్కుగా మార్చడానికి వోల్వో ద్వారా సరి చేయించారు. ఇది ఒక్కసారి ఛార్జ్ స్తే.. ఆగకుండా 1,099 కి.మీ. ప్రయాణిస్తుంది. అంటే హైదరాబాద్ లో బయలుదేరితే రాజమండ్రి వెళ్లి వచ్చేస్తుంది. 

23 గంటల్లో 392 ల్యాప్‌లను తీసుకున్న పూర్తి

ఎలక్ట్రిక్ వాహనాన్ని కాంటినెంటల్  అంతర్గత పరీక్ష కేంద్రం కాంటిండ్రోమ్‌లో 2.8 కిమీ పొడవు, ఓవల్ టెస్ట్ ట్రాక్‌పై నడిపారు. ఇద్దరు డ్రైవర్లు ఇ-ట్రక్కును నడిపారు. 23 గంటల్లో 392 ల్యాప్‌లను పూర్తి చేశారు. ట్రక్ సగటు వేగం గంటకు 50 కిమీ (31 mph). ఈ ఇ-ట్రక్ ప్రతిరోజూ దాదాపు 300 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోగలదు.

ఎలక్ట్రిక్ ట్రక్కు 680 kWh/h బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉందని DPD స్విట్జర్లాండ్‌లోని స్ట్రాటజీ అండ్ ఇన్నోవేషన్ డైరెక్టర్ మార్క్ ఫ్రాంక్ చెప్పారు. ఫ్యూచర్  బ్రాండ్‌లో పనిచేసే డిజైన్ వర్క్ ప్రొడక్ట్స్ AG  CEO అడ్రియన్ మెలిగర్ మాట్లాడుతూ, ఈ ఎలక్ట్రిక్ ట్రక్కు 680 kWh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది యూరోప్‌లో అతిపెద్ద ట్రక్ బ్యాటరీ. 19 టన్నుల బరువున్న ట్రక్కు 680 hp కంటే ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అని తెలిపారు.

 


Sunday, August 29, 2021

సొంత సూర్యుడ్ని సెట్‌ చేసేసుకున్నారు..... !

 అదో చిన్న ఊరు.. చుట్టూ పెద్ద పెద్ద కొండల మధ్య అందంగా ఉంటుంది.. కానీ ఆ ఊరిలో ఏడాదికి మూడు నెలలు అసలు ఎండ అనేదే పడదు. మధ్యాహ్నం రెండు, మూడు గంటల పాటు తప్పిస్తే.. మిగతా సమయంలో పగలూ, రాత్రీ తేడా తెలియదు. వందల ఏళ్లుగా ఇలాగే వెళ్లదీసిన స్థానికులు.. కొన్నేళ్ల కింద చిన్న ఆలోచనతో తమ ఊరికి మరో సూర్యుడ్ని తెచ్చేసుకున్నారు. ఇన్నిరోజులు పెద్దగా ఎవరికీ తెలియని ఈ విషయం.. ఓ టిక్‌టాకర్‌ చేసిన వీడియోతో వైరల్‌గా మారింది. మరి ఈ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా?
  

అద్దాల నుంచి ప్రతిఫలిస్తున్న వెలుగులో విగనెల్లా గ్రామం. (ఇన్‌సెట్‌లో) కొండపై ఏర్పాటు చేసిన అద్దాలు

 

 


ఏడాదికి మూడు నెలలు.. 
ఇటలీ ఉత్తర ప్రాంతంలోని అంట్రోనా లోయలో ఉన్న చిన్న ఊరే విగనెల్లా. రెండు, మూడు వందల మంది మాత్రమే ఉండే ఈ ఊరికి మూడు వైపులా పెద్ద కొండలు ఉంటాయి. అవి సూర్యరశ్మిని అడ్డుకోవడంతో.. ఏటా నవంబర్‌ 11వ తేదీ నుంచి ఫిబ్రవరి రెండో తేదీదాకా ఊరిలో ఎండ మొత్తానికే పడదు. కొండలపై పడ్డ ఎండ ప్రతిఫలించి (రిఫ్లెక్షన్‌) వచ్చే వెలుతురే వారికి దిక్కు. అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం.. 13వ శతాబ్దం నుంచీ అంటే ఎనిమిది వందల ఏళ్లుగా ఆ ఊరివాళ్లు ఇలాగే గడుపుతున్నారు. హా మూడు నెలల చీకటి తర్వాత ఎండపడటం మొదలయ్యే రోజున పండుగ చేసుకుంటారు.

చిన్న ఆలోచనే.. 
వరుసగా మూడు నెలల పాటు ఎండ పడకపోవడం, అదీ చలికాలం కావడంతో.. ఊరివాళ్లు శారీరకంగా, మానసికంగా ఇబ్బందిపడుతూనే వచ్చారు. ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి కొండలపై పడే ఎండను ఊరిపైకి రిఫ్లెక్ట్‌ చేయాలని 1999లో ఊరి మేయర్‌ మిడాలి ప్రతిపాదన చేశాడు. ఆర్కిటెక్ట్‌ బొంజాని, ఇంజనీర్‌ గియానీ ఫెరారీ కలిసి ఓ పెద్ద అద్దాన్ని కొండపై అమర్చి.. వెలుతురును ఊరిపై పడేలా ఓ డిజైన్‌ను సిద్ధం చేశారు. అయితే.. సూర్యోదయం నుంచి అస్తమయం దాకా సూర్యుడు కదులుతూనే ఉంటాడు. మరి అద్దం నుంచి వచ్చే వెలుగు ఊరిలో ఒకేచోట పడేదెలా అన్న సమస్య వచ్చింది. 

 


స్టీలు అద్దం.. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో.. 
మామూలు అద్దం అయితే పగిలిపోయే అవకాశం ఉంటుందని.. అత్యంత నున్నటి స్టీల్‌ అద్దాలను తెప్పించారు. ఎనిమిది మీటర్ల వెడల్పు, ఐదు మీటర్ల ఎత్తుతో వాటిని ఏర్పాటు చేసి.. ప్రత్యేకమైన కంప్యూటరైజ్డ్‌ మోటార్‌ వ్యవస్థకు అనుసంధానించారు. సూర్యుడి కదలికలకు అనుగుణంగా.. అద్దాల కోణాన్ని మార్చేలా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను వినియోగించారు. దీనితో స్టీలు అద్దాల నుంచి ప్రతిఫలించే ఎండ.. ఎప్పుడూ ఊరి మధ్యలో పడుతూ ఉంటుంది. 2006 డిసెంబర్‌ 17న ప్రారంభించిన ఈ వ్యవస్థకోసం.. అప్పుడే రూ.90 లక్షలు (లక్ష యూరోలు) ఖర్చయింది. నేరుగా ఎండ పడినట్టుగా కాకపోయినా.. తమ ‘కొత్త సూర్యుడి’తో చాలా ఇబ్బందులు తప్పాయని ఊరివాళ్లు చెప్తుంటారు. నాలుగు రోజుల కింద మనదేశానికి చెందిన కరన్‌ రాజన్‌ అనే వ్యక్తి ఈ ఊరి గురించి చేసిన టిక్‌టాక్‌ వీడియో వైరల్‌గా మారింది.

 

 మరో దేశానికీ స్ఫూర్తినిచ్చి.. 
భూమి ఉత్తర ధృవానికి దగ్గరగా ఉండే చాలా దేశాల్లో కూడా.. కొండలు, గుట్టల మధ్య ఉన్న గ్రామాల్లో ‘విగనెల్లా’ వంటి పరిస్థితే ఉంటుంది. నెలలకు నెలలు ఎండ పడదు. నార్వేలో అలా ఇబ్బందిపడుతున్న జుకాన్‌ అనే ఊరివాళ్లు.. విగనెల్లాను స్ఫూర్తిగా తీసుకుని 2013లో అద్దాల వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు.

 


Sunday, August 15, 2021

Independence Day 2021 | Sing the National ANTHE | జాతీయ గీతం పాడండి.. పార్టీసిపేషన్ సర్టిఫికెట్ పొందండి..


ముందుగా అందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

యువతా.. దేశభక్తి చాటండి...

ఈరోజే జెండా పండుగ (ఆగస్టు 15). స్కూల్ పిల్లలు అందరికీ ఇష్టమైన రోజు. భారతీయ యువత తమ దేశ భక్తిని చాటుకునేలా, దేశ ప్రజలందరూ ఒక్క తాటి పైకి వచ్చేలా.. కేంద్ర ప్రభుత్వం, rashtragaan.in వెబ్ సైట్ ఒక ప్రయత్నం చేస్తుంది. ఈ వెబ్ సైట్ ను సందర్శించి ఎవరైనా వీడియోలు రూపొందించి, జాతీయ గీతాన్ని అప్లోడ్ చేయవచ్చు. ఇప్పటివరకు అప్లోడ్ చేసిన వీడియోలన్నింటిని క్రోడీకరించి ఒకే వీడియో గా మలిచి ఈ రోజు(ఆగస్టు 15, 2021)న అందుబాటులోకి ఉంచుతారు. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలు, కాలేజీ లోని విద్యార్థులను ఇందులో భాగస్వాములను చేయాలని ప్రభుత్వం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ని కోరింది.

               కరోనా కారణంగా వేడుకలని ఎక్కువగా ఆన్లైన్ కె పరిమితం చేయడంతో, ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో పాల్గొన్న వారందరికీ ప్రభుత్వం ధ్రువీకరణ పత్రం అందజేస్తుంది. ఇక్కడ 12 భారతీయ భాషల్లో వీడియోలు రికార్డ్ చేసి, అప్లోడ్ చేయడానికి అవకాశం ఇచ్చారు.

               నేను, నా వంతు దేశ భక్తిని చాటుకోవడానికి, మా పాఠశాల విద్యార్థులతో, మరియు కుటుంబ సభ్యులతో, జాతీయ గీతం పాడించి, వీడియో అప్లోడ్ చేసి సర్టిఫికెట్ను పొందేలా చేశాను.

నేను కూడా సర్టిఫికెట్ను పొందాను. దానిని మీరు ఇక్కడ చూడవచ్చు.

మీరు కూడా జాతీయ గీతం వీడియోను రూపొందించి, అప్లోడ్ చేసి సర్టిఫికెట్ ను పొందండి.


మీరు కూడా ఈ మహోత్సవం లో భాగస్వాములు అయి, మినిస్టర్ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ను పొందండి.


సులభంగా సర్టిఫికెట్ పొందడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.

1. అధికారిక వెబ్ సైట్: https://rashtragaan.in/ ను సందర్శించండి.

2. మీ వివరాలు నమోదు చేయండి.

3. చక్కగా నిలబడి జాతీయగీతం పాడుతూ వీడియో రికార్డ్ చేయండి.

4. అప్లోడ్ చేయండి.

5. సర్టిఫికెట్ పొందండి.



 

 

 

శవాన్ని బ్రతికిస్తానంటూ మంత్రాలు, పూజలు.. పోలీసుల ఎంట్రీతో మారిన సీన్..వైరల్ వీడియో

 

ఓ వైపు ప్రపంచం టెక్నాలజీలో పరగులు తీస్తోంది. మానవుడు అంతరిక్షంపై కూడా అడుగు పెట్టాడు. కానీ కొందరు ప్రజలు మాత్రం ఇంకా మంత్రలు చింతకాయలు అంటూ.. మూఢనమ్మకాల ముసుగులోనే మగ్గిపోతున్నారు. చనిపోయిన మనిషిని బతికిస్తానంటూ ఓ వ్యక్తి అతని మృతదేహం వద్ద పూజలు

 


 

Wednesday, June 30, 2021

అంబేడ్క‌ర్ ఓపెన్ వ‌ర్సిటీ ప‌రీక్ష తేదీలు ఖ‌రారు.. పూర్తి వివరాలివే ..!

 

 


డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్క‌ర్ ఓపెన్ యూనివ‌ర్సిటీ (BRAOU) ప‌రీక్ష‌ల తేదీల‌ను ఖ‌రారు చేసింది. యూనివ‌ర్సిటీ ప‌రిధిలో జ‌రిగే ప‌రీక్ష‌ల‌కుగాను అధికారులు తేదీల‌ను అధికారికంగా ప్ర‌క‌టించారు. వాస్తవానికి ఈ ప‌రీక్ష‌ల‌ను మార్చి 21న మొద‌లు పెట్టి ఏప్రిల్‌లో ముగించాల‌నుకున్నారు. కానీ క‌రోనా కార‌ణంగా వాయిదా వేస్తూ అధికారులు నిర్ణ‌యం తీసుకున్న విషయం తెలిసిందే.

దీంతో తాజాగా కొత్త తేదీల‌ను ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలోనే డిగ్రీ (సీబీసీఎస్) 4వ సెమిస్ట‌ర్ ఎగ్జామ్స్ జులై 6 నుంచి 8వ తేదీ వ‌ర‌కు, డిగ్రీ 2వ సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌ల‌ను జులై 9 నుంచి 15వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప్ర‌క‌ట‌న చేశారు. మూడేళ్ల డిగ్రీ కోర్సు పాత బ్యాచ్‌ల ప‌రీక్ష‌ల‌ను జులై 16 నుంచి ఆగ‌స్టు 1 వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు

  ఇత‌ర వివ‌రాల కోసం https://www.braouonline.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

Thursday, May 6, 2021

క్రెడిట్ కార్డు రూపం లో ఉండే పీవీసీ ఆధార్ కార్డు పొందే విధానం

 

డిజిటల్‌ ఆధార్‌ డౌన్‌లోడ్‌ చేసే విధానం క్రెడిట్ కార్డు రూపం లో ఉండే పీవీసీ ఆధార్ కార్డు పొందే విధానం
 

 

డిజిటల్‌ ఆధార్‌ డౌన్‌లోడ్‌ చేసే విధానం

1. మీరు ఇ-ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేయాలంటే ముందుగా AADHAR WEBSITE వెబ్‌సైట్‌ ఓపెన్ చేయండి.

2. అక్కడ మీ ఆధార్‌ నంబర్‌ గానీ, వర్చువల్‌ ఐడీ నంబర్‌ గానీ, ఎన్‌రోల్‌మెంట్‌ ఐడీ నంబర్‌ గానీ ఎంటర్‌చేయాలి.

3. 12 అంకెల ఆధార్‌ నంబర్‌ ఎంటర్ చేసిన తరువాత క్యాప్చా కోడ్‌ను కూడా ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.

4. ఆ తర్వాత ‘send OTP’ ని క్లిక్ చెయ్యాలి.

5. మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. అప్పుడు OTP ని ఎంటర్ చెయ్యాలి.

6. ఈ ప్రక్రియ పూర్తి కాగానే మీ మొబైల్‌/డెస్క్‌టాప్‌లోకి డిజిటల్‌ ఆధార్‌ కాపీ పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్‌ అవుతుంది.

7. అయితే, డౌన్‌లోడ్ అయిన ఇ-ఆధార్‌కు పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ ఉంటుంది. మీ పేరులోని మొదటి 4 అక్షరాలు, మీరు పుట్టిన సంవత్సరం కలిపి 8 డిజిట్స్ పాస్‌వర్డ్ ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డు ఓపెన్ అవుతుంది.

DIGITAL AADHAAR WEBSITE LINK


క్రెడిట్ కార్డు రూపం లో ఉండే పీవీసీ ఆధార్ కార్డు పొందే విధానం

1. మీరు పీవీసీ ఆధార్ కార్డు ఆర్డర్ చేయాలంటే ముందుగా AADHAR WEBSITE వెబ్‌సైట్‌ ఓపెన్ చేయండి.

2. అక్కడ మీ ఆధార్‌ నంబర్‌ గానీ, వర్చువల్‌ ఐడీ నంబర్‌ గానీ, ఎన్‌రోల్‌మెంట్‌ ఐడీ నంబర్‌ గానీ ఎంటర్‌చేయాలి.

3. 12 అంకెల ఆధార్‌ నంబర్‌ ఎంటర్ చేసిన తరువాత క్యాప్చా కోడ్‌ను కూడా ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.

4. ఆ తర్వాత ‘send OTP’ ని క్లిక్ చెయ్యాలి.

5. మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. అప్పుడు OTP ని ఎంటర్ చెయ్యాలి.

6. ఈ ప్రక్రియ పూర్తి కాగానే మనకి ‘Preview’ స్క్రీన్ కనపడి, క్రింద పేమెంట్ ఆప్షన్ ని క్లిక్ చెయ్యాలి. ఈ పి‌వి‌సి కార్డు కోసం మనం రూ. 50 చెల్లించాలి.

7. పేమెంట్ అవ్వగానే మీ పి‌వి‌సి ఆర్డర్ ప్రక్రియ పూర్తి అవుతుంది.

8. మీరు ఆర్డర్ చేసిన కార్డు స్టేటస్ ని ఈ క్రింది లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

AADHAAR PVC CARD ORDER LINK

కల్యాణానికి కొవిడ్​ నియమం.. ప్రత్యామ్నాయంతో సిద్ధం

 

గత నాలుగు నెలల పాటు సుముహూర్తాలు లేనందున శుభకార్యాలు జరగలేదు. మే నెలలో మంచి రోజులు రావడంతో వివాహాలు, ఇతర శుభాకార్యాలు చేసుకునేందుకు అనేక కుటుంబాలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. రోజు రోజుకు కరోనా వైరస్‌ విజృంభిస్తుండడంతో ముహూర్తాలు పెట్టుకున్న కుటుంబ సభ్యుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. నేటి నుంచి జూన్‌ 26 తేదీ వరకు ముహూర్తాలు ఉన్నాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లాతో పాటు వికారాబాద్‌ జిల్లాలో 5 వేలకు పైగా వివాహాలు జరగవచ్చని అంచనా. కొవిడ్‌-19 ఉద్ధృతితో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొందరు వివాహాలు వాయిదా వేసుకోగా.. మరి కొందరు సాదాసీదాగా వివాహాలు చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. సీజన్‌పై ఆధారపడిన వారు మాత్రం నిరాశగా ఉన్నారు. ఈసారి తమ వ్యాపారాలు దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఫంక్షన్‌ హాళ్లు కాకుండా ఇళ్లతోనే అతి తక్కువ మంది కుటుంబ సభ్యులు అతిథుల మధ్యనే కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ వివాహాలు చేసుకోవాలని పలువురు సూచనలు చేస్తున్నారు.

జూన్‌ 26 వరకు..
ఈ నెల 6 నుంచి జూన్‌ 26 వరకు సుముహూర్తాలు ఉన్నాయి. మే 6, 13, 14, 16, 19, 21, 23, 26, 28, 29, 30, జూన్‌ 3, 4, 5, 20, 21. 24, 26 వరకు కల్యాణ ఘడియలున్నాయి.
మూణ్నెల్ల ముందే..
ఉమ్మడి మెదక్‌ జిల్లాతో పాటు వికారాబాద్‌ జిల్లాలో 5 వేలకు పైగా వరకు వివాహాలు మే, జూన్‌ నెలల్లో జరగనున్నాయని అర్చక, పురోహిత సంఘాల ప్రతినిధులు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో వివాహాలు చేసుకునే వారు ఇప్పటికే ఫంక్షన్‌ హాళ్లు బుక్‌ మూణ్నెల్ల ముందే బుక్‌ చేసుకున్నారు. వీటితో పాటు బాజాభజంత్రీలు, అలంకరణ, టెంట్లు, పురోహితులను అడ్వాన్సులు ఇచ్చి మాట్లాడుకున్నారు. ప్రస్తుతం చాలామంది ఆలోచనలో పడ్డారు.
50 మందికి మించొద్దు..
వివాహాలు, ఇతర వేడుకలు కుటుంబ సభ్యులు, ముఖ్యమైన అతిథులు 50 మందికి మించి పిలవవద్దని అధికారులు పేర్కొంటున్నారు. పెళ్లి కొడుకు, కుతురు ఇద్దరి తరఫున 25 మంది చొప్పున పిలుచుకోవాలి. వివాహ వేడుకలకు సంబంధించి ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు రానప్పటికీ నాలుగైదు రోజుల్లో వచ్చే అవకాశం ఉందని ఓ తహసీల్దార్‌ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. వివాహం చేసుకునే వారు వధువు, వరుడు, తల్లిదండ్రుల ఆధార్‌ కార్డు, లగ్నపత్రిక, అఫిడవిట్‌తో తహసీల్దార్‌కు సమర్పించాల్సి ఉంటుంది. కల్యాణ మండపాల్లో కరోనా కేసులు నమోదు అయ్యే అవకాశం ఉండటంతో ఇళ్ల వద్దనే అతి కొద్ది మంది కుటుంబ సభ్యుల మధ్యనే వివాహాలు చేసుకోవాలని సూచనలు చేస్తున్నారు.
మాస్కులు, శానిటైజర్లు తప్పనిసరి
వివాహాల్లో మాస్కులు, శానిటైజర్లు తప్పని సరిగా ఉంచాలి. పెళ్లికి వచ్చే వారికి మాస్కులు అందించడంతో పాటు శానిటైజర్లు అందించాలి. వివాహాం చేసుకునే ముందు రోజు రాత్రి పెళ్లి వేదికను పూర్తిగా శానిటరైజ్‌ చేయించాలి. పెళ్లి వచ్చే వారికి శరీర ఉష్ణాగ్రతలను కూడా పరిశీలించాలి. కొంచెం అనుమానం వచ్చిన వారికి వివాహా మండపాలకు రానివ్వవద్దని అధికారులు సూచనలు చేస్తున్నారు.

 

 

రిజిస్ట్రేషన్‌ చట్టబద్ధం
న్యూస్‌టుడే, కంది: ఇంట్లో కొద్ది మంది అతిథుల సమక్షంలో చేసుకున్న తరువాత చట్టబద్ధం చేసుకునేందుకు రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో నమోదు చేసుకోవచ్చు. వివాహం రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు వివాహ శుభలేఖ, పదో తరగతి మెమో, జనన ధ్రువీకరణ పత్రాలు, వధువు, వరుడు ఆధార్‌ కార్డులు, నివాస ధ్రువీకరణ పత్రం, ముగ్గురు సాక్షులు, సంయుక్త అఫిడవిట్‌ సమర్పిస్తే వివాహాన్ని చట్టబద్ధంగా రిజిస్టర్‌ చేస్తామని అధికారులు వివరించారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాతో పాటు వికారాబాద్‌ జిల్లాలో దీనికి సంబంధించి 16 రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు ఉన్నాయి.

గిరాకీలకు దెబ్బ
వివాహాలు నియంత్రణగా జరిగితే వివిధ వర్గాల వారికి ఆర్థికంగా దెబ్బపడే అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో శుభాకార్యం ఏదైన అలంకరణకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. రూ.20 వేల నుంచి రూ.లక్ష వరకు అలంకరణకు ఖర్చు చేస్తున్నారు. వీరిపై కరోనా ప్రభావం పడనుంది. తక్కువ మంది అతిథులతో వివాహాలు చేసుకునేందుకు ఆసక్తి చూపడంతో ప్రైవేట్‌ వాహనాలు బుక్‌ చేయడం లేదు. ఒక్కో రోజుకు పెద్ద వాహనాలకు రూ.2 వేలు, చిన్న వాహనాలకు రూ.వెయ్యి, బత్తా రూ.500 వసూలు చేస్తున్నారు. దూరం, ఉపయోగించుకునే సమయాన్ని బట్టి రుసుము పెరుగుతుంది. ఇలాంటి రంగాల వారు తీవ్రంగా నష్టపోనున్నారు. పూల దుకాణ దారులు కూడా వివాహ సీజన్‌లో రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు గిరాకీ కోల్పోతారు.


G
M
T
Text-to-speech function is limited to 200 characters

Wednesday, May 5, 2021

ఒక్క టీకానూ వృథా కానివ్వని కేరళ - మోదీ ఫిదా


 

 


 

కేరళ ఆరోగ్య కార్యకర్తలు, నర్సులపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. టీకాలు వృథా కాకుండా వారు వ్యవహరించిన తీరు దేశానికి ఆదర్శమన్నారు. తమ రాష్ట్రంలో ఆరోగ్య సిబ్బంది పనితీరు అద్భుతమని సీఎం పినరయి విజయన్ చేసిన ట్వీట్​కు మోదీ ఈ విధంగా బదులిచ్చారు.

 

 కేంద్రం నుంచి కేరళకు 73,38,806 టీకా డోసులు రాగా.. తమ ఆరోగ్య సిబ్బంది 74,26,164 డోసులను పంపిణీ చేశారని విజయన్​ మంగళవారం ట్వీట్ చేశారు. వృథాను దృష్టిలో ఉంచుకుని ఒక్కో వయల్​లో​ ఇచ్చే అదనపు డోసులను కూడా చక్కగా వినియోగించుకున్నట్లు తెలిపారు. తమ ఆరోగ్య కార్యకర్తలు, ప్రత్యేకించి నర్సులు అద్భుతంగా పని చేశారని కితాబిచ్చారు.

 


 

దీనిపై మోదీ బుధవారం స్పందించారు. కేరళ ఆరోగ్య సిబ్బంది దేశానికి ఉదాహరణగా నిలిచారని, కరోనాపై చేస్తున్న పోరాటాన్ని బలోపేతం చేసేందుకు టీకాలను వృథా చేయకుండా వినియోగించడం అత్యంత కీలకమని ట్వీట్ చేశారు.

కరోనాపై సీఎంలతో సమీక్ష నిర్వహించిన ప్రతిసారీ మోదీ ఈ విషయాన్ని నొక్కి చెబుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో టీకాల వృథా శాతం ఎక్కువగా ఉందనే విషయాన్ని ప్రస్తావించారు.

 

Tuesday, May 4, 2021

ఇంట్లో ఉండవలసిన కోవిడ్ మెడికల్ కిట్.

 ఇంట్లో ఉండవలసిన కోవిడ్ మెడికల్ కిట్..💼



   1. డోలో  650 mg
   2. అజిత్రో మైసిన్  500mg
   3. _Montek LC
   4. మౌత్ వాష్ మరియు గార్గ్ల్
       కోసం బీటాడిన్
   5. విటమిన్ సి మరియు డి3
   6. బి కాంప్లెక్స్ Beplex forte
   7. Zincovit tablets
   8. ఆవిరి కోసం ఆవిరి యంత్రం +    Karvol plus గుళికలు
   9. పల్స్ ఆక్సిమీటర్
   10. థర్మ మీటర్


   -ఆక్సిజన్ సిలిండర్ (అత్యవసర
        పరిస్థితికి మాత్రమే)
  - * ఆరోగ సేతు అనువర్తనం*
  - * శ్వాస వ్యాయామ పరికరాలు *


 ☘️ కవిడ్ మూడు దశలు :

   1. ముక్కులో మాత్రమే కోవిడ్ -
        రికవరీ సమయం సగం రోజు.
        (ఆవిరి పీల్చడం), విటమిన్ సి
        సాధారణంగా జ్వరం ఉండదు.
        కన్పించడం.

   2. గొంతులో కోవిడ్ - గొంతు నొప్పి,
        కోలుకునే సమయం 1 రోజు
        (వేడి నీటి గార్గ్లే, త్రాగడానికి
        వెచ్చని నీరు, టెంప్ ఉంటే
        పారాసెటమాల్. విటమిన్ సి,
        బికాంప్లెక్స్. యాంటీబయాటిక్
        కన్నా తీవ్రంగా ఉంటే.

   3. ఊపిరితిత్తులలో కోవిడ్-
        దగ్గు మరియు ఊపిరి 4 నుండి
        5 రోజులు.  (విటమిన్ సి,
        బి కాంప్లెక్స్, వేడి నీటి గార్గ్లే,
        ఆక్సిమీటర్, పారాసెటమాల్,
        తీవ్రంగా ఉంటే సిలిండర్,
        ద్రవం చాలా అవసరం, లోతైన
        శ్వాస వ్యాయామం.

🌸 ఆసుపత్రికి చేరుకోవలసిన దశ :

       ఆక్సిజన్ స్థాయిని పర్యవేక్షించండి. ఇది 94 (సాధారణ 98-100) దగ్గరకు వెళితే మీకు ఆక్సిజన్ సిలిండర్ అవసరం. ఇంట్లో అందుబాటులో ఉంటే, ఆసుపత్రిలో చేరవలసిన అవసరం ఉండకపోవచ్చు .

ఆరోగ్యంగా ఉండండి, సురక్షితంగా ఉండండి!

       దయచేసి భారతదేశంలోని మీ పరిచయాలకు ఫార్వార్డ్ చేయండి...  ఇది ఎవరికి సహాయపడుతుందో మీకు తెలియదు.

       టాటా గ్రూప్ మంచి చొరవను ప్రారంభించింది, వారు చాటింగ్, టెలి మెడిసిన్ ద్వారా ఆన్‌లైన్‌లో ఉచిత వైద్యుల సంప్రదింపులను అందిస్తున్నారు.  ఈ సదుపాయం మీ కోసం ప్రారంభించబడింది, తద్వారా మీరు వైద్యుల కోసం బయటకు వెళ్లవలసిన అవసరం లేదు మరియు మీరు ఇంట్లో సురక్షితంగా ఉంటారు.

       క్రింద ఉన్న లింక్, ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను.
 https://www.tatahealth.com/online-doctor-consultation/general-physician.

       ఐసోలేషన్ ఆసుపత్రుల నుండి సలహా, మేము ఇంట్లో చేయవచ్చు.

       ఐసోలేషన్ ఆసుపత్రులలో తీసుకునే మందులు..

   1. విటమిన్ సి -1000
   2. విటమిన్ ఇ (ఇ)
   3. (10 నుండి 11) గంటల వరకు,
       సూర్యరశ్మిలో 15-20 నిమిషాలు
       కూర్చుని.
   4. గుడ్డు భోజనం ఒకసారి ..
   5. మేము కనీసం 7-8 గంటలు
       విశ్రాంతి తీసుకుంటాము /
       నిద్రపోతాము
   6. మేము రోజూ 1.5 లీటర్ల
       నీరు తాగుతాము
   7. అన్ని భోజనాలు వెచ్చగా
       ఉండాలి (చల్లగా కాదు).

       రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి మేము ఆసుపత్రిలో చేస్తున్నది అంతే..!

       కరోనావైరస్ యొక్క pH 5.5 నుండి 8.5 వరకు మారుతుందని గమనించండి.

       అందువల్ల, వైరస్ను తొలగించడానికి మనం చేయాల్సిందల్లా వైరస్ యొక్క ఆమ్లత స్థాయి కంటే ఎక్కువ ఆల్కలీన్ ఆహారాలను తీసుకోవడం.
 
  ● ఆకుపచ్చ నిమ్మకాయ - 9.9 పిహెచ్
  ● పసుపు నిమ్మకాయ - 8.2 పిహెచ్
  ● అవోకాడో - 15.6 పిహెచ్
  ● వెల్లుల్లి - 13.2 పిహెచ్
  ● మామిడి - 8.7 పిహెచ్
  ● టాన్జేరిన్ - 8.5 పిహెచ్
  ● పైనాపిల్ - 12.7 పిహెచ్
  ● వాటర్‌క్రెస్ - 22.7 పిహెచ్
  ● నారింజ - 9.2 పిహెచ్


       మీరు కరోనా వైరస్ బారిన పడ్డారని ఎలా తెలుసుకోవాలి?

   1. గొంతు దురద
   2. పొడి గొంతు
   3. పొడి దగ్గు
   4. అధిక ఉష్ణోగ్రత
   5. శ్వాస ఆడకపోవడం
   6. వాసన కోల్పోవడం ....

       మరియు వెచ్చని నీటితో నిమ్మకాయ ఊపిరితిత్తులకు చేరే ముందు ప్రారంభంలో వైరస్ను తొలగిస్తుంది ...


       👆ఈ సమాచారాన్ని మీ వద్ద ఉంచుకోవద్దు.  మీ కుటుంబం మరియు స్నేహితులందరికీ అందించండి..🙏
*Gurunath Reddy*
*RR color lab mlg*

Tatahealth (https://www.tatahealth.com/online-doctor-consultation/general-physician)
Ask a General Doctor Online for Free

Etela Rajender Very Emotional Song || Telangana Ex. Minister Huzurabad MLA | Telangana Songs

 


 Download

 

 Etela rajender,minister etela rajender,etela rajender land scam,etela rajender live,etela rajender press meet,etela rajender press meet live,etela rajender latest news,etela rajender songs,minister etela rajender land scam,etela rajender land,health minister etela rajender,etela rajender land scam in medak,minister etela rajender land scam news,etela rajender assigned land scam,etela rajender emotional speech,etela rajender emotional words,etela rajender song

 

 

 

Saturday, April 24, 2021

TS Private Teachers 25 KG Rice Scheme list

 TS Private School or Institute teachers who want to get benefits from this scheme can apply the (Rs. 2000 & 25Kg Rice) Telangana State Private

 

 

Rice Scheme List 

 

TS Private School or Institute teachers who want to get benefits from this scheme can apply the (Rs. 2000 & 25Kg Rice) Telangana State Private

Tuesday, April 20, 2021

భయపడొద్దు.. వ్యాక్సిన్‌లో కరోనా వైరస్‌ ఉండదు.

 

 


 

వ్యాక్సిన్‌ వేయించుకున్నాక జ్వరం, ఒళ్లు నొప్పులు, కొద్దిగా దగ్గు వస్తాయి. జలుబు చేసినట్లు కూడా ఉంటుంది. ఇవన్నీ అందరికీ కచ్చితంగా వస్తాయి. వారు ఆస్పత్రులకు వెళ్లి  కరోనా టెస్టులు చేయించుకుంటున్నారు. వ్యాక్సిన్‌ వేయించుకున్నాక 15 రోజుల వరకు ఎప్పుడు టెస్టు చేయించుకున్నా పాజిటివ్‌ అనే వస్తుంది. అలాంటి వారిని భయపడొద్దని చెప్పండి. టెస్టులు చేయించుకోవద్దని చెప్పండి. అనవసరంగా పాజిటివ్‌ అని భయపడొద్దు..’అంటూ వైద్య సిబ్బంది చెప్తున్నట్టుగా ఓ ఆడియో క్లిప్పింగ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

అయితే ఇది ఎంతమాత్రం నిజం కాదని, దాన్ని నమ్మవద్దని వైద్య నిపుణులు చెప్తున్నారు. వ్యాక్సిన్లలో కరోనా వైరస్‌ ఉండదని, వ్యాక్సిన్‌ వల్ల పాజిటివ్‌ రాదని స్పష్టం చేస్తున్నారు. అమెరికాకు చెందిన ‘వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం (సీడీసీ)’కూడా ఇప్పటికే దీనిపై తగిన వివ రణ ఇచ్చింది. ఏ వ్యాక్సిన్‌ వేయించుకున్నా టెస్టుల్లో పాజిటివ్‌ రాదని.. ఒకవేళ వస్తే సదరు వ్యక్తికి నిజంగా కరోనా ఇన్ఫెక్షన్‌ సోకి నట్టేనని తెలిపింది. అంతకుముందే వైరస్‌ సోకి తగ్గిపోతే.. యాంటీబాడీస్‌ టెస్టుల్లో నిర్ధారణ చేసుకోవచ్చని పేర్కొంది. ఇం దులో ఐజీఎం టెస్టులో పాజిటివ్‌ వస్తే అంతకుముందు వారంలో ఇన్ఫెక్షన్‌ వచ్చినట్టు అని.. ఐజీజీలో పాజిటివ్‌ వస్తే అం తకు 14 రోజులకు ముందు ఎప్పుడైనా కరోనా వచ్చినట్టు వెల్లడి అవుతుందని వివరించింది. వ్యాక్సిన్‌ వేసుకున్నాక పాజిటివ్‌ వస్తే.. కరోనా అప్పటికే సోకి ఉండటంగానీ, వ్యాక్సిన్‌ వేసుకున్నాక సోకడంగానీ జరిగి ఉంటుందన్న నిర్ధారణకు రావాలని తెలిపింది

 

1) ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్లు:
మోడెర్నా, ఫైజర్‌ టీకాలు ఈ కోవలోకి వస్తాయి. ఈ వ్యాక్సిన్లలో కరోనా వైరస్‌లోని జన్యు పదార్థాన్ని ఎంఆర్‌ఎన్‌ఏగా మార్చి వినియోగిస్తారు. నిజానికి ఒరిజినల్‌ కరోనా వైరస్‌లో ఆర్‌ఎన్‌ఏ మాత్రమే ఉంటుంది. దీన్ని జెనెటిక్‌ పద్ధతిలో ఎంఆర్‌ఎన్‌ఏగా మారుస్తారు. ఈ ఎంఆర్‌ఎన్‌ఏలో స్పైక్‌ ప్రొటీన్‌ డేటా ఉంటుంది. వ్యాక్సిన్‌ వేసినప్పుడు అందులోని ఎంఆర్‌ఎన్‌ఏ శరీర కణాల్లోకి వెళ్లి స్పైక్‌ ప్రొటీన్‌గా మారుతుంది. అది కణాల నుంచి బయటికి రాగానే శరీరం గుర్తించి యాంటీ బాడీస్‌ను ఉత్పత్తి చేస్తుంది.

2) ఎడినో వైరస్‌ వెక్టార్‌ వ్యాక్సిన్లు:
స్పుత్నిక్, జాన్సన్, ఆక్స్‌ఫర్డ్‌ టీకాలు ఈ తరహాలో అభివృద్ధి చేశారు. ఇందులో.. మనుషులు, ఇతర జంతువుల్లో జలుబును కలిగించే ఎడినో వైరస్‌లను తీసుకుని, బలహీన పరుస్తారు. వాటికి కరోనా వైరస్‌ జన్యుపదార్థాన్ని జోడించి వ్యాక్సిన్‌ రూపొందిస్తారు. అందుకే వీటిని ఎడినో వైరస్‌ వెక్టార్‌ వ్యాక్సిన్లు అంటారు. ఈ వ్యాక్సిన్‌ ఇచ్చినప్పుడు మన శరీరం.. టీకాలోని అడినోవైరస్‌ను, దానికి జోడించిన కరోనా స్పైక్‌ ప్రొటీన్స్‌ను గుర్తించి యాంటీ బాడీస్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌లో చింపాంజీలో జలుబును కలిగించే ఎడినో వైరస్‌ను వెక్టార్‌గా వాడారు. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకాలో మనుషుల్లో జలుబుకు కారణమయ్యే ఎడినో వైరస్‌ 26 రకాన్ని వినియోగించారు. స్పుత్నిక్‌లో అయితే తొలిడోసులో ఎడినో వైరస్‌ 26, రెండో డోస్‌లో ఎడినో వైరస్‌ 25 రకాలను వెక్టార్లుగా వాడారు.

3) ఒరిజినల్‌ వైరస్‌ను నిర్వీర్యం చేసి..:
ఒరిజినల్‌ కరోనా వైరస్‌ను నిర్వీర్యం చేసి ఇంజెక్షన్‌ రూపంలో ఇచ్చే తరహా టీకా కోవాగ్జిన్‌. ఈ తరహా వ్యాక్సిన్‌ రక్తంలోకి ప్రవేశించగానే.. శరీరంలోని టీసెల్స్‌ అది అసలైన వైరస్‌గా భావించి అంటుకుంటాయి. దీనితో డి సెల్స్‌ ప్రభావితమై.. శరీరంలో రోగ నిరోధక శక్తిని ప్రేరేపిస్తాయి. దీనితో యాంటీ బాడీలు ఉత్పత్తి అవుతాయి. 

ఏ మాత్రం వైరస్‌ ఉన్నా ‘ఆర్టీపీసీఆర్‌’ గుర్తిస్తుంది 
ఆర్టీపీసీఆర్‌ పరీక్ష కోసం గొంతు లేదా ముక్కు నుంచి శాంపిళ్లు తీసుకుంటారు. సజీవంగా ఉన్న వైరస్‌లో ఆర్‌ఎన్‌ఏ జన్యు పదార్థం ఉంటుంది. ఆ శాంపిల్స్‌కు ఎంజైమ్‌ను కలిపి డీఎన్‌ఏగా మారుస్తారు. దీనిని 36 రెట్లు వృద్ధి చేసి.. ఆర్టీపీసీఆర్‌లోని యాంటిలిఫికేషన్‌ టెక్నాలజీ ద్వారా పరీక్షిస్తారు. వైరస్‌ ఉంటే కచ్చితంగా గుర్తించేలా టెస్టు ఉంటుంది. చాలా వరకు 20 సార్లు వృద్ధి చేసే సరికే కరోనా వైరస్‌ ఉందా లేదా అన్నది తేలిపోతుంది. 
 
వ్యాక్సిన్లన్లీ యాంటీ బాడీస్‌ను ప్రేరేపించేవే..
కరోనా వ్యాక్సిన్లన్నీ కూడా మన శరీరంలో యాంటీ బాడీస్‌ను లేదా టీ సెల్స్‌ను ప్రేరేపించేవి మాత్రమే. ఒకవేళ వైరస్‌ సోకినా తక్కువ లోడ్‌తో ఇన్ఫెక్షన్‌ వస్తుంది. రోగ తీవ్రత తగ్గుతుంది. వ్యాక్సిన్‌ వేసుకోని వాళ్లకంటే వ్యాక్సిన్లు వేసుకున్న వారిలో నమోదయ్యే కేసులు 80-94 శాతం తక్కువగా ఉన్నాయని గమనించాలి. 
- డాక్టర్‌ కిరణ్‌ మాదల, క్రిటికల్‌ కేర్‌ విభాగాధిపతి, నిజామాబాద్‌ ప్రభుత్వ వైద్య కళాశాల

వ్యాక్సిన్‌ తీసుకున్నాక ఆర్టీపీసీఆర్‌లో ఏమీ కనిపించదు.. 
కరోనా వ్యాక్సిన్లు వేటిలోనైనా వాహకాలుగా వాడే వైరస్‌లు పూర్తిగా నిర్వీర్యం చేసినవే. వాటికి సంతతిని పెంచుకునే సామర్థ్యం ఉం డదు. మన శరీరంలో జన్యు పదార్థాన్ని టీ, బీ సెల్స్‌ను ప్రభావితం చేయడానికి మాత్రమే ఉద్దేశించినవి. దీనివల్ల శరీరంలో యాంటీ బాడీస్‌ తయారై.. అసలు  వైరస్‌ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటాయి. వ్యాక్సిన్లలో వాడే జన్యు పదార్థాలు ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లో దొరకవు. అందువల్ల వ్యాక్సిన్‌ తీసుకున్నాక టెస్టుల్లో పాజి టివ్‌ వచ్చే సమస్యే తలెత్తదని సీడీసీ స్పష్టం చేసింది. 3 రకాలుగా వ్యాక్సిన్లు ఎలా అభివృద్ధి చేస్తారన్న వివరాలు వెల్లడించింది.

 

 

 

 

Wednesday, March 24, 2021

నాకు రిటైర్మెంట్‌ వయసు పెంపు వద్దు ..రెండురోజులుగా నమిలికొండ హెచ్‌ఎం నల్లబ్యాడ్జీతో నిరసన

 


కొడిమ్యాల: ఉద్యోగ విరమణ వయోపరిమితి పెంపుపై ఉద్యోగులంతా సంబరాలు చేసుకుంటుండగా.. ఓ ప్రధానోపాధ్యాయుడు మాత్రం తనకు పెంపు వద్దంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజులుగా నల్లబ్యాడ్జీ ధరించి విధులకు హాజరవుతున్నారు.జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నమిలికొండ ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం ఏనుగు మల్లారెడ్డి తనకు రిటైర్మెంట్‌ వయస్సు పెంపు వద్దని మంగళవారం ప్రకటించారు.

ఉద్యోగ విరమణ వయస్సును 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచడం వల్ల నిరుద్యోగ యువతకు అవకాశాలు దక్కకుండా పోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థులు చేసిన త్యాగాలను గుర్తు తెచ్చుకుని సీఎం కేసీఆర్‌ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.   

 

 

Sunday, March 14, 2021

జాబిలిపై జీన్‌ బ్యాంక్‌ .. వీర్యం, అండాలు ఆ లూనార్‌ బ్యాంక్‌లో భద్రపరచాలని... !


 

 భూమిపై పెరిగిపోతున్న కాలుష్యం, పర్యావరణ అసమతుల్యత శాస్త్రవేత్తలను ఎప్పుడూ భయపెడుతూనే ఉంటాయి. ప్రమాదకరమైన పరిస్థితుల వల్ల భూమిపై జీవావరణం దెబ్బతింటుందని, జీవులు అంతరించిపోతాయని వారు ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే వేలాది జీవులు పలు కారణాల వల్ల అంతరించిపోయాయి. భూమిపై జీవుల మనుగడ ప్రశ్నార్థకమవుతున్న నేపథ్యంలో ఇతర గ్రహాల్లో మనుగడ సాగించేందుకు ఉన్న అవకాశాలపై చాలా కాలం నుంచి పరిశోధనలు చేస్తూనే ఉన్నారు.

 

అలాగే సౌర కుటుంబంలో భూమికి సహజ ఉపగ్రహమైన జాబిలిపై ఇప్పటికే కాలు మోపి.. చాలా ఏళ్ల నుంచి అక్కడి పరిస్థితులను అంచనా వేస్తున్నారు. అయితే ఇతర గ్రహాల వలే చంద్రుడు కూడా ప్రాణుల మనుగడకు అనుకూలం కాదని ఇప్పటి వరకూ నమ్ముతున్నారు. కానీ, మన విలువైన వనరులను భద్రపరచడానికి స్టోరేజీలా మూన్‌ ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. న్యూయార్క్‌ పోస్ట్‌ కథనం ప్రకారం.. చంద్రుడిపై జీన్‌ బ్యాంక్‌ను ఏర్పాటు చేయాలని సైంటిస్టులు ప్రతిపాదన చేశారు.

మనుషులతో సహా సుమారు 67 లక్షల జీవులకు సంబంధించిన పునరుత్పత్తి కణాలు, వీర్యం, అండాలు ఆ లూనార్‌ బ్యాంక్‌లో భద్రపరచాలని సూచిస్తున్నారు. పాశ్చాత్య మతగ్రంథాలలో జీవుల రక్షణకు ఉపయోగించిన ‘ఆర్క్‌’లాంటి ఈ బ్యాంకును మోడరన్‌ గ్లోబల్‌ ఇన్సూ్యరెన్స్‌ పాలసీగా చూడాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆరిజోనా యూనివర్సిటీకి చెందిన మెకానికల్, ఏరోస్పేస్‌ ఇంజనీర్‌ జెకన్‌ తంగ, అతని బృందం తయారు చేసిన ఓ రిపోర్టును ఇటీవల జరిగిన ఏరోస్పేస్‌ సదస్సులో సమర్పించారు. రక్షణ చర్యల్లో భాగంగా లక్షలాది జీవుల వీర్యం, అండాల శాంపిల్స్‌ను లూనార్‌ బ్యాంకుకు తరలించాలని ఆ రిపోర్టులో ప్రతిపాదించారు.

 

చంద్రుడి ఉపరితలం సేఫ్‌
ఇటీవల జరిగిన ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీర్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐఈఈఈ) వార్షిక ఏరోస్పేస్‌ సదస్సులో తంగ ప్రసంగిస్తూ.. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని జీవుల నమూనాలను భద్రపరచడానికి భూమిపై భాండాగారం నిర్మాణం సరైంది కాదన్నారు. మరో గ్రహాన్ని లేదా చందమామపైనైనా జీవుల జన్యువులను భద్రపరిచే భాండాగారాన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నెలకొల్పాలని సూచించారు. ఒకవేళ భూగోళంపై ఎంతటి విధ్వంసం జరిగినా.. జీన్‌ బ్యాంక్‌లో భద్రపరిచిన జీవులను ఇప్పుడున్న శాస్త్రసాంకేతికత పురోగతితో పునరుత్పత్తి చేయవచ్చు అని ఆయన తన ప్రసంగంలో సూచించారు.

ఇటీవల చంద్రుడి ఉపరితలంపై కనుగొన్న లావా గోతుల్లో ఆ బ్యాంకును భద్రపరచవచ్చని తంగా అభిప్రాయపడ్డారు. ఆ గోతులు రెడీమేడ్‌ స్టోరేజీగా ఉపయోగించుకోవచ్చన్నారు. 80 నుంచి 100 మీటర్ల లోతుతో ఉండే ఈ గోతులు జీన్‌ బ్యాంక్‌ రక్షణకు సరిగ్గా సరిపోతాయని, ఈ గోతుల్లో భద్రపరిస్తే ఉల్కాపాతాలు, స్పేస్‌ రేడియేషన్‌ నుంచి రక్షణ పొందవచ్చన్నారు. అయితే తంగ జీన్‌ బ్యాంక్‌ ప్రతిపాదన కొత్త కాదు. ఆర్కిటిక్‌ సముద్రంలోని స్పిట్స్‌ బర్గెన్‌ ఐల్యాండ్‌పై స్వాల్‌బార్డ్‌ గ్లోబల్‌ సీడ్‌ వాల్ట్‌ని భూమిపై ఇప్పటికే నెలకొల్పారు. దీనిలో మొక్కల విత్తనాలు, ఇతర సీడ్స్‌లకు చెందిన 9,92,000 శాంపిల్స్‌ భద్రపరిచారు.

 

 Tags: Tech News, Telugu News,

సన్యాసి అవతారంలో ధోని.. షాక్‌లో అభిమానులు

 

 ఐపీఎల్ 2021 ప్రారంభానికి ముందు ఎంఎస్‌ ధోని కొత్త లుక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సన్యాసి అవతారంలో నైరాశ్యంలో మునిగి ఉన్న ధోనిని చూసి అభిమానులు షాక్‌ తిన్నారు. కాగా ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్‌లు జరగనుండగా.. ఇప్పటికే చెన్నైకి చేరుకున్న ధోనీ.. అక్కడ సీఎస్‌కే క్యాంప్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం నెట్స్‌లో బౌలర్లని ఉతికారేస్తూ సిక్సర్ల వర్షం కురిపించిన ధోని అకస్మాత్తుగా ఇలా సన్యాసిగా మారిపోవడం ఏంటని నెటిజన్ల నోరెళ్లబెడుతున్నారు. సన్యాసిలా మారి నైరాశ్యంలో ఉన్న ధోని ఫోటోను స్టార్ స్పోర్ట్స్ తన ట్విటర్‌లో  షేర్ చేసింది.

 

 


 

వాస్తవానికి ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు అతని ఆట కంటే హెయిర్ స్టయిల్ గురించే ఎక్కువగా చర్చ నడిచింది. అప్పట్లో పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ సైతం ధోనీ జులపాల జుట్టుకి ముచ్చటపడ్డాడు. ఆ తర్వాత 2011లో భారత్ జట్టు వన్డే ప్రపంచకప్ గెలిచాక గుండు చేయించుకున్న ధోనీ.. మొహక్ స్టయిల్‌ని కూడా ట్రై చేసేశాడు. గత ఏడాది ఐపీఎల్‌కి ముందు గుబురు గడ్డం, లేయర్డ్ హెయిర్‌తో కనిపించాడు. ధోనీ సన్యాసి అవతారంపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. యాడ్ షూటింగ్ కోసం ధోనీ ఆ వేషం వేసినట్లు కొందరు అంచనా వేస్తున్నారు. సన్యాసి అవతారంలో లేకపోయినా.. ధోనీ ఎప్పుడూ సౌమ్యంగానే ఉంటాడని మరికొందరు చెప్పుకొస్తున్నారు. 

కాగా గతేడాది ఐపీఎల్‌ 13వ సీజన్‌ యూఏఈ వేదికగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ సీజన్‌లో ధోని కెప్టెన్సీలోని సీఎస్‌కే ఆరంభంలో వరుస పరాజయాలు చవిచూసి ఆఖరిదశలో వరుస విజయాలు నమోదు చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరగపోయింది. మొత్తం 14 మ్యాచ్‌ల్లో 6 విజయాలు.. 8 ఓటములతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది.

Friday, March 12, 2021

ఆంధ్రా బ్యాంక్‌ కస్టమర్లకు కొత్త పాస్‌బుక్స్‌ అందిస్తారు


 


యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఆంధ్రా బ్యాంక్‌ విలీనం పూర్తయిపోయింది. ఈ విషయాన్ని ఇటీవల యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అధికారికంగా ప్రకటించింది. దీనిపై ఇకపై..

యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఆంధ్రా బ్యాంక్‌ విలీనం పూర్తయిపోయింది. ఈ విషయాన్ని ఇటీవల యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అధికారికంగా ప్రకటించింది. దీనిపై ఇకపై ఆంధ్రాబ్యాంక్‌ కస్టమర్లందరూ యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కస్టమర్లుగా సేవలు అందుకోనున్నారు. అయితే యూనియన్‌ బ్యాంకు మారినా పాత అకౌంట్‌ నెంబర్లు అలాగే ఉంటాయి. అకౌంట్‌ నెంబర్‌లో ఎలాంటి మార్పు ఉండదు. అంతేకాదు కస్టమర్‌ ఐడీ కూడా పాతదే ఉంటుంది.

ఆంధ్రా బ్యాంక్‌ కస్టమర్లకు కొత్త పాస్‌బుక్స్‌ అందిస్తారు. ఆ పాత బుక్స్‌ అన్నీ యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పేరుతో వస్తాయి. కాబట్టి పాత ఆంధ్రాబ్యాంక్‌ కస్టమర్లు తమ పాస్‌ బుక్స్‌ బ్యాంకులో మార్చుకోవచ్చు. ఇక ఆంధ్రా బ్యాంక్‌ యాప్‌ పని చేయదు. కస్టమర్లు U-Mobile యాప్‌ ఉపయోగించాలి.

U-Mobile Download



ఇక మీ దగ్గర ఆంధ్రా బ్యాంక్‌ చెక్స్‌ ఉంటే అవి 2021 మార్చి 31 వరకే పని చేస్తాయి. ఆ తర్వాత పని చేయవు. అంటే మీరు ఏప్రిల్‌ 1 నుంచి యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (UBI) చెక్స్‌ మాత్రమే ఉపయోగించాలి. కస్టమర్లు బ్యాంక్‌కు వెళ్లి కొత్త చెక్‌ బుక్స్‌ తీసుకోవాలి.


ఆంధ్రా బ్యాంక్‌ ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ కూడా మారుతుంది. ప్రస్తుతం ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ 2021 మార్చి 31 వరకే పని చేస్తుంది. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. కొత్త ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ మీ బ్రాంచ్‌లో లేదా యూనియన్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా వెబ్‌సైట్‌లో తెలుసుకోవాలి. కస్టమర్లకు ఏవైనా సందేహాలుంటే యూనియన్ బ్యాంక్ టోల్‌ ఫ్రీ నెంబర్లు 1800 208 2244, 1800 22 22 44 కాగా కస్టమర్ కేర్ నెంబర్ +91-80-61817110. సంప్రదించాలి.


ఇటీవల ఆంధ్రా బ్యాంక్‌ అన్ని బ్రాంచుల ఐటీ ఇంటిగ్రేషన్‌ పూర్తయిందని యూనియన్‌ బ్యాంక్‌ ప్రకటించింది. గతంలో ఆంధ్రా బ్యాంకులుగా సేవలు అందించిన అన్ని సర్వీసులు బ్రాంచ్‌లు, స్పెషలైజ్ఢ్‌ బ్రాంచులు ఇప్పుడు యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో అనుసంధానమయ్యాయి.


ప్రస్తుతం ఇండియాలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో యూనియన్‌ బ్యాంక్‌ ఐదో స్థానంలో ఉంది. నెట్‌వర్క్‌ విషయంలో నాలుగో స్థానంలో ఉంది. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు 9590పైగా బ్రాంచ్‌లు, 13,287 ఏటీఎంలు ఉన్నాయి.

 

Wednesday, December 9, 2020

Jio సంచలన నిర్ణయం!! 5G నెట్‌వర్క్ సేవలు త్వరలోనే ప్రారంభం...

 ఇండియాలోని టెలికాం రంగంలో 5G సర్వీసులు 2021 ద్వితీయార్ధంలో విడుదల కానున్నట్లు రిలయన్స్ జియో ఇండస్ట్రీస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2020 సమావేశంలో వెల్లడించారు. జియో అందించే 5G సర్వీస్ ప్రభుత్వ ఆత్మనిర్భర్ భారత్ విధానానికి "సాక్ష్యం" అని ఈ బిలియనీర్ గుర్తించారు. ఇండియాలో 5G ని విడుదల చేయడమే కాకుండా గూగుల్ సహకారంతో సరసమైన ఆండ్రాయిడ్ ఫోన్‌ను జియో అభివృద్ధి చేస్తోంది అని కూడా తెలిపారు. దీనిని రాబోయే నెలల్లో ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంది అని తెలిపారు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.


 

జియో 5G నెట్‌వర్క్ సర్వీస్ ప్రారంభ రోల్ అవుట్ ఇండియాలో 5G ప్రారంభ రోల్ అవుట్ ను వేగవంతం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని అంబానీ తెలిపారు. 2021 రెండవ భాగంలో జియో 5G విప్లవానికి మార్గదర్శకత్వం వహిస్తుందని కూడా తెలిపారు. ఇండియా అభివృద్ధి చెందడానికి నెట్‌వర్క్, హార్డ్‌వేర్ టెక్నాలజీ విభాగాలు అధికంగా దోహదం చేస్తాయి అని ఆయన చెప్పారు. జియో కొంతకాలంగా 5G ని ఇండియాకు తీసుకురావడానికి విశేషంగా పనిచేస్తోంది. దేశవ్యాప్తంగా ఎల్‌టిఇ-ఎక్స్‌క్లూజివ్ నెట్‌వర్క్ కవరేజ్ చెందిన టెల్కోలలో ఎయిర్‌టెల్ మరియు Vi తో పోల్చినప్పుడు తక్కువ సమయంలో తదుపరి తరం సెల్యులార్ సర్వీసుకు మారడానికి సహాయం చేస్తుంది.

5G నెట్‌వర్క్ రేడియో యాక్సెస్ భారతదేశంలో 5G రియాలిటీకి తీసుకురావడానికి రిలయన్స్ జియో సంస్థ శామ్‌సంగ్, క్వాల్‌కామ్‌ వంటి సంస్థలతో కలిసి పనిచేస్తోంది. జూలైలో జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 43వ వార్షిక సర్వసభ్య సమావేశంలో 5G స్పెక్ట్రం అందుబాటులోకి వచ్చిన వెంటనే జియో దేశంలో 5G నెట్‌వర్క్‌ను పరీక్షించడం ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. స్వదేశీ 5G నెట్‌వర్క్ ని అభివృద్ధి చేయడానికి టెల్కోలు అన్ని కూడా కృషి చేస్తున్నాయి. అక్టోబర్లో జరిగిన క్వాల్కమ్ 5G సమ్మిట్ లో జియో తన 5G ప్లాన్ లను మరింత వివరించింది మరియు దాని 5G రేడియో యాక్సెస్ నెట్‌వర్క్ అభివృద్ధిని కూడా ప్రకటించింది.

 
ఇండియాలో జియో నెట్‌వర్క్‌ మార్కెట్ వాటా శాతం జియో నెట్‌వర్క్‌ను కలిగి ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ జియో ప్లాట్‌ఫాంలు గత కొన్ని నెలలుగా వివిధ ప్రపంచ సంస్థల నుండి పెట్టుబడులను ఆకర్షించాయి. ఈ పెట్టుబడిదారుల జాబితాలో గూగుల్, ఫేస్‌బుక్, ఇంటెల్ క్యాపిటల్, క్వాల్కమ్ వెంచర్స్ మరియు సిల్వర్ లేక్ వంటి పార్ట్‌నర్స్ ఉన్నారు. జియో సంస్థ తన యొక్క ప్లాట్‌ఫాంలో సుమారు 32.97 శాతం వాటాను ఇతర సంస్థలకు అమ్మడం ద్వారా సుమారు 152,056 కోట్లను ఆర్జించింది. ఆ పెట్టుబడులు దేశంలో డిజిటల్ ఉనికిని విస్తరించడానికి సంస్థను ఎనేబుల్ చేస్తున్నాయి. ఇండియాలో జియో టెలికాం సంస్థ 5G సేవలను తీసుకురావడంతో జియో ప్లాట్‌ఫారమ్‌ల యొక్క ప్రస్తుత మరియు కొత్త పరిణామాలను మరింత పెంచడానికి సహాయపడుతుంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అందించిన గణాంకాల ప్రకారం 35 శాతం పైగా మార్కెట్ వాటాతో ఇప్పటికే భారత టెలికాం రంగంలో అతిపెద్ద టెల్కోగా ఉంది.

 

 

ఏపీ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. పరీక్షలు ముగిసేవరకు జియో టీవీ ద్వారా ఆన్‌లైన్ క్లాసులు..

 

AP Inter Students: ఏపీ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్. ఈ ఏడాది విద్యా సంవత్సరాన్ని(2020-21) పూర్తి చేసేందుకు ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా విద్యకు దూరమైన ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జియో టీవీ ద్వారా వీడియో పాఠాలను ప్రసారం చేస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి రామకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు.

డిసెంబర్ 8వ తేదీ నుంచి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు పరీక్షలు ముగిసేవరకు వీడియో పాఠాలను ప్రసారం చేస్తామన్నారు. అలాగే బోర్డుకు చెందిన Bieap Virtual Class యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా పాఠ్యాంశాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

కాగా, ప్రస్తుతం ఇంటర్మీడియేట్ రెండో సంవత్సరం క్లాసెస్ ప్రసారం అవుతుండగా.. త్వరలోనే ఇంటర్ ఫస్టియర్, జేఈఈ, ఎంసెట్, నీట్ పాఠాలను సైతం అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అటు ఇంటర్మీడియట్‌ ఆన్‌లైన్‌ క్లాసులకు సంబంధించిన టైమ్‌టేబుల్ కోసం విద్యార్థులు https://bie.ap.gov.in/ వెబ్‌సైట్‌లో సందర్శించాలని సూచించారు.