Thursday, May 6, 2021

క్రెడిట్ కార్డు రూపం లో ఉండే పీవీసీ ఆధార్ కార్డు పొందే విధానం

డిజిటల్‌ ఆధార్‌ డౌన్‌లోడ్‌ చేసే విధానం క్రెడిట్ కార్డు రూపం లో ఉండే పీవీసీ ఆధార్ కార్డు పొందే విధానం
 
డిజిటల్‌ ఆధార్‌ డౌన్‌లోడ్‌ చేసే విధానం

1. మీరు ఇ-ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేయాలంటే ముందుగా AADHAR WEBSITE వెబ్‌సైట్‌ ఓపెన్ చేయండి.

2. అక్కడ మీ ఆధార్‌ నంబర్‌ గానీ, వర్చువల్‌ ఐడీ నంబర్‌ గానీ, ఎన్‌రోల్‌మెంట్‌ ఐడీ నంబర్‌ గానీ ఎంటర్‌చేయాలి.

3. 12 అంకెల ఆధార్‌ నంబర్‌ ఎంటర్ చేసిన తరువాత క్యాప్చా కోడ్‌ను కూడా ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.

4. ఆ తర్వాత ‘send OTP’ ని క్లిక్ చెయ్యాలి.

5. మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. అప్పుడు OTP ని ఎంటర్ చెయ్యాలి.

6. ఈ ప్రక్రియ పూర్తి కాగానే మీ మొబైల్‌/డెస్క్‌టాప్‌లోకి డిజిటల్‌ ఆధార్‌ కాపీ పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్‌ అవుతుంది.

7. అయితే, డౌన్‌లోడ్ అయిన ఇ-ఆధార్‌కు పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ ఉంటుంది. మీ పేరులోని మొదటి 4 అక్షరాలు, మీరు పుట్టిన సంవత్సరం కలిపి 8 డిజిట్స్ పాస్‌వర్డ్ ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డు ఓపెన్ అవుతుంది.

DIGITAL AADHAAR WEBSITE LINK

క్రెడిట్ కార్డు రూపం లో ఉండే పీవీసీ ఆధార్ కార్డు పొందే విధానం

1. మీరు పీవీసీ ఆధార్ కార్డు ఆర్డర్ చేయాలంటే ముందుగా AADHAR WEBSITE వెబ్‌సైట్‌ ఓపెన్ చేయండి.

2. అక్కడ మీ ఆధార్‌ నంబర్‌ గానీ, వర్చువల్‌ ఐడీ నంబర్‌ గానీ, ఎన్‌రోల్‌మెంట్‌ ఐడీ నంబర్‌ గానీ ఎంటర్‌చేయాలి.

3. 12 అంకెల ఆధార్‌ నంబర్‌ ఎంటర్ చేసిన తరువాత క్యాప్చా కోడ్‌ను కూడా ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.

4. ఆ తర్వాత ‘send OTP’ ని క్లిక్ చెయ్యాలి.

5. మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. అప్పుడు OTP ని ఎంటర్ చెయ్యాలి.

6. ఈ ప్రక్రియ పూర్తి కాగానే మనకి ‘Preview’ స్క్రీన్ కనపడి, క్రింద పేమెంట్ ఆప్షన్ ని క్లిక్ చెయ్యాలి. ఈ పి‌వి‌సి కార్డు కోసం మనం రూ. 50 చెల్లించాలి.

7. పేమెంట్ అవ్వగానే మీ పి‌వి‌సి ఆర్డర్ ప్రక్రియ పూర్తి అవుతుంది.

8. మీరు ఆర్డర్ చేసిన కార్డు స్టేటస్ ని ఈ క్రింది లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

AADHAAR PVC CARD ORDER LINK