Sunday, August 15, 2021

Independence Day 2021 | Sing the National ANTHE | జాతీయ గీతం పాడండి.. పార్టీసిపేషన్ సర్టిఫికెట్ పొందండి..


ముందుగా అందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

యువతా.. దేశభక్తి చాటండి...

ఈరోజే జెండా పండుగ (ఆగస్టు 15). స్కూల్ పిల్లలు అందరికీ ఇష్టమైన రోజు. భారతీయ యువత తమ దేశ భక్తిని చాటుకునేలా, దేశ ప్రజలందరూ ఒక్క తాటి పైకి వచ్చేలా.. కేంద్ర ప్రభుత్వం, rashtragaan.in వెబ్ సైట్ ఒక ప్రయత్నం చేస్తుంది. ఈ వెబ్ సైట్ ను సందర్శించి ఎవరైనా వీడియోలు రూపొందించి, జాతీయ గీతాన్ని అప్లోడ్ చేయవచ్చు. ఇప్పటివరకు అప్లోడ్ చేసిన వీడియోలన్నింటిని క్రోడీకరించి ఒకే వీడియో గా మలిచి ఈ రోజు(ఆగస్టు 15, 2021)న అందుబాటులోకి ఉంచుతారు. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలు, కాలేజీ లోని విద్యార్థులను ఇందులో భాగస్వాములను చేయాలని ప్రభుత్వం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ని కోరింది.

               కరోనా కారణంగా వేడుకలని ఎక్కువగా ఆన్లైన్ కె పరిమితం చేయడంతో, ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో పాల్గొన్న వారందరికీ ప్రభుత్వం ధ్రువీకరణ పత్రం అందజేస్తుంది. ఇక్కడ 12 భారతీయ భాషల్లో వీడియోలు రికార్డ్ చేసి, అప్లోడ్ చేయడానికి అవకాశం ఇచ్చారు.

               నేను, నా వంతు దేశ భక్తిని చాటుకోవడానికి, మా పాఠశాల విద్యార్థులతో, మరియు కుటుంబ సభ్యులతో, జాతీయ గీతం పాడించి, వీడియో అప్లోడ్ చేసి సర్టిఫికెట్ను పొందేలా చేశాను.

నేను కూడా సర్టిఫికెట్ను పొందాను. దానిని మీరు ఇక్కడ చూడవచ్చు.

మీరు కూడా జాతీయ గీతం వీడియోను రూపొందించి, అప్లోడ్ చేసి సర్టిఫికెట్ ను పొందండి.


మీరు కూడా ఈ మహోత్సవం లో భాగస్వాములు అయి, మినిస్టర్ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ను పొందండి.


సులభంగా సర్టిఫికెట్ పొందడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.

1. అధికారిక వెబ్ సైట్: https://rashtragaan.in/ ను సందర్శించండి.

2. మీ వివరాలు నమోదు చేయండి.

3. చక్కగా నిలబడి జాతీయగీతం పాడుతూ వీడియో రికార్డ్ చేయండి.

4. అప్లోడ్ చేయండి.

5. సర్టిఫికెట్ పొందండి.