ఆన్‌లైన్ బ్యాంకింగ్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు పాటించకపోతే ఖాతా ఖాళీ అవ్వడం ఖాయం!
ఇప్పుడు మనలో చాలా మంది నగదు
చెల్లింపులు ఆన్‌లైన్‌లో చేస్తున్నారు. దీనికి తగ్గట్లే బ్యాంకింగ్ ఆధారిత
నేరాలు కూడా ఎక్కువయ్యాయి. కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా
ఇప్పుడు బ్యాంకింగ్, నగదు చెల్లింపులు పూర్తిగా ఆన్‌లైన్ అయిపోయింది. చిన్న
షాపుల్లో కూడా క్యూఆర్ కోడ్ చేసి ఒక్క క్లిక్‌తో నగదు చెల్లించేయచ్చు.
అయితే ఇందులో కొన్ని రిస్కులు కూడా ఉన్నాయి. ఫిషింగ్, విషింగ్, స్కిమ్మింగ్
వంటి ఆన్‌లైన్ టూల్స్ ద్వారా మీ ఖాతాల్లోని నగదును మోసగాళ్లు
దొంగిలించేయచ్చు. అయితే కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా
ఇటువంటి మోసాలు జరగకుండా ఆపవచ్చు.
1. ఆన్‌లైన్ బ్యాంకింగ్
లావాదేవీలు చేసే సమయంలో పబ్లిక్ వైఫై ఉపయోగించకండి. ఇటువంటి కనెక్షన్లు
సాధారణంగా అంత సురక్షితంగా ఉండవు. వీటిని హ్యాక్ చేయడం కూడా చాలా సులభం.
ఇలాంటి వాటి ద్వారా మీ ఫోన్లలో సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌ఫెక్ట్ చేసి మీ
బ్యాంకింగ్ వివరాలను కాజేసే అవకాశం ఉంది.
2. బ్యాంకు కస్టమర్ కేర్ నంబర్ల కోసం గూగుల్‌లో వెతక్కండి. దీనికి
సంబంధించిన సమాచారాన్ని ఆయా బ్యాంకుల అధికారిక వెబ్ సైట్ నుంచే తీసుకోండి.
3.
గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌ల్లో దొరికేవి తప్ప వేరే యాప్స్‌ను
డౌన్‌లోడ్ చేయకండి. మీకు కావాల్సిన యాప్స్‌ను ఇలాంటి అధికారిక స్టోర్ల
నుంచే డౌన్‌లోడ్ చేసుకోవాలి. అనధికారిక స్టోర్ల నుంచి డౌన్‌లోడ్ చేసుకుంటే
మీ స్మార్ట్ ఫోన్, అందులో ఉండే డేటా రెండూ ప్రమాదంలో పడతాయి.
4. మీ స్మార్ట్ ఫోన్లకు వచ్చే ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను
ఎప్పటికప్పుడు ఇన్‌స్టాల్ చేసుకోండి. ఈ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు మీ ఫోన్‌లో
ఉండే సమస్యలను పరిష్కరిస్తాయి. అంతేకాకుండా సైబర్ నేరాల బారిన మీరు పడే
అవకాశం కూడా తగ్గుతుంది. మీ ఫోన్‌లో లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచెస్,
ఆపరేటింగ్ సిస్టం ఉంటే వాటిని ఛేదించడం హ్యాకర్లకు కష్టం అవుతుంది.
5.
మీకు ఏమైనా పేమెంట్ ఆధారిత లింకులు ఎస్ఎంఎస్, మెయిల్లో వస్తే వాటి ద్వారా
ఎటువంటి లావాదేవీలు జరపకండి. అంతేకాకుండా సైబర్ నేరగాళ్లు ఇవి బ్యాంకింగ్
ఆధారిత లావాదేవీలని, వీటిని పూర్తి చేయడం అత్యవసరం అనే రేంజ్‌లో ఇటువంటి
మెసేజ్‌లు పంపుతారు.
6. ఆన్‌లైన్ బ్యాంకింగ్‌కు సులభమైన పాస్‌వర్డ్‌లు పెట్టకండి. బలహీనమైన
పాస్‌వర్డ్‌లను క్రాక్ చేయడం చాలా సులభం. బలమైన పాస్‌వర్డ్‌లను పెట్టడం
ద్వారా సైబర్ నేరాల బారిన పడే అవకాశం తగ్గుతుంది.
7. ఇంటర్నెట్
బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌ను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండండి. ప్రతి మూడు,
నాలుగు నెలలకు ఒకసారి మార్చడం ద్వారా సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా
కాపాడుకోవచ్చు.
8. మీరు ఎక్కువగా ఉపయోగించని మొబైల్ నంబర్లు,
ఈ-మెయిల్ ఐడీలు బ్యాంక్ ఖాతాకు లింక్ చేయకండి. ఎందుకంటే ఎవరైనా మోసగాళ్లు
మీ బ్యాంకు ఖాతా నుంచి నగదు కాజేస్తే ఆ విషయం మీకు వెంటనే తెలుస్తుంది.
9.
మీ ఫోన్‌లో యాప్స్‌కు అవసరం లేని పర్మిషన్లు ఇవ్వకండి. అలాంటి పర్మిషన్లు
ఇవ్వడం ద్వారా మీ ఫోన్‌లో డేటా దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది.