ఇండియాలోని టెలికాం రంగంలో 5G సర్వీసులు 2021 ద్వితీయార్ధంలో విడుదల కానున్నట్లు రిలయన్స్ జియో ఇండస్ట్రీస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2020 సమావేశంలో వెల్లడించారు. జియో అందించే 5G సర్వీస్ ప్రభుత్వ ఆత్మనిర్భర్ భారత్ విధానానికి "సాక్ష్యం" అని ఈ బిలియనీర్ గుర్తించారు. ఇండియాలో 5G ని విడుదల చేయడమే కాకుండా గూగుల్ సహకారంతో సరసమైన ఆండ్రాయిడ్ ఫోన్‌ను జియో అభివృద్ధి చేస్తోంది అని కూడా తెలిపారు. దీనిని రాబోయే నెలల్లో ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంది అని తెలిపారు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.
జియో 5G నెట్‌వర్క్ సర్వీస్ ప్రారంభ రోల్ అవుట్
ఇండియాలో 5G ప్రారంభ రోల్ అవుట్ ను వేగవంతం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు
తీసుకుంటామని అంబానీ తెలిపారు. 2021 రెండవ భాగంలో జియో 5G విప్లవానికి
మార్గదర్శకత్వం వహిస్తుందని కూడా తెలిపారు. ఇండియా అభివృద్ధి చెందడానికి
నెట్‌వర్క్, హార్డ్‌వేర్ టెక్నాలజీ విభాగాలు అధికంగా దోహదం చేస్తాయి అని
ఆయన చెప్పారు. జియో కొంతకాలంగా 5G ని ఇండియాకు తీసుకురావడానికి విశేషంగా
పనిచేస్తోంది. దేశవ్యాప్తంగా ఎల్‌టిఇ-ఎక్స్‌క్లూజివ్ నెట్‌వర్క్ కవరేజ్
చెందిన టెల్కోలలో ఎయిర్‌టెల్ మరియు Vi తో పోల్చినప్పుడు తక్కువ సమయంలో
తదుపరి తరం సెల్యులార్ సర్వీసుకు మారడానికి సహాయం చేస్తుంది.
5G నెట్‌వర్క్ రేడియో యాక్సెస్
భారతదేశంలో 5G రియాలిటీకి తీసుకురావడానికి రిలయన్స్ జియో సంస్థ శామ్‌సంగ్,
క్వాల్‌కామ్ వంటి సంస్థలతో కలిసి పనిచేస్తోంది. జూలైలో జరిగిన రిలయన్స్
ఇండస్ట్రీస్ 43వ వార్షిక సర్వసభ్య సమావేశంలో 5G స్పెక్ట్రం అందుబాటులోకి
వచ్చిన వెంటనే జియో దేశంలో 5G నెట్‌వర్క్‌ను పరీక్షించడం
ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. స్వదేశీ 5G నెట్‌వర్క్ ని అభివృద్ధి
చేయడానికి టెల్కోలు అన్ని కూడా కృషి చేస్తున్నాయి. అక్టోబర్లో జరిగిన
క్వాల్కమ్ 5G సమ్మిట్ లో జియో తన 5G ప్లాన్ లను మరింత వివరించింది మరియు
దాని 5G రేడియో యాక్సెస్ నెట్‌వర్క్ అభివృద్ధిని కూడా ప్రకటించింది.
ఇండియాలో జియో నెట్‌వర్క్ మార్కెట్ వాటా శాతం
జియో నెట్‌వర్క్‌ను కలిగి ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ జియో
ప్లాట్‌ఫాంలు గత కొన్ని నెలలుగా వివిధ ప్రపంచ సంస్థల నుండి పెట్టుబడులను
ఆకర్షించాయి. ఈ పెట్టుబడిదారుల జాబితాలో గూగుల్, ఫేస్‌బుక్, ఇంటెల్
క్యాపిటల్, క్వాల్కమ్ వెంచర్స్ మరియు సిల్వర్ లేక్ వంటి పార్ట్‌నర్స్
ఉన్నారు. జియో సంస్థ తన యొక్క ప్లాట్‌ఫాంలో సుమారు 32.97 శాతం వాటాను ఇతర
సంస్థలకు అమ్మడం ద్వారా సుమారు 152,056 కోట్లను ఆర్జించింది. ఆ పెట్టుబడులు
దేశంలో డిజిటల్ ఉనికిని విస్తరించడానికి సంస్థను ఎనేబుల్ చేస్తున్నాయి.
ఇండియాలో జియో టెలికాం సంస్థ 5G సేవలను తీసుకురావడంతో జియో ప్లాట్‌ఫారమ్‌ల
యొక్క ప్రస్తుత మరియు కొత్త పరిణామాలను మరింత పెంచడానికి సహాయపడుతుంది.
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అందించిన గణాంకాల ప్రకారం 35 శాతం
పైగా మార్కెట్ వాటాతో ఇప్పటికే భారత టెలికాం రంగంలో అతిపెద్ద టెల్కోగా
ఉంది.