Showing posts with label apk. Show all posts
Showing posts with label apk. Show all posts

Monday, May 23, 2022

పోస్ట్‌ ఇన్ఫో యాప్‌.. క్షణాల్లో డిజిటల్‌ సేవలు

 

 


  DOWNLOAD

తపాల శాఖ పూర్వకాలం నాటి పద్ధతులకు స్వస్తి పలుకుతూ.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త టెక్నాలజీతో వినియోగదారులకు సేవలు అందించడానికి ప్రయత్నం చేస్తోంది. కేవలం ఉత్తరాల బట్వాడా లాంటి సేవలకే పరిమితమైతే మనుగడ కష్టమని గ్రహించిన తపాలా శాఖ.. మార్కెట్లోకి వచ్చిన ప్రతి సేవనూ తామూ అందిస్తామని సగర్వంగా ప్రచారం చేస్తోంది. 

ఆధార్‌ కార్డు నమోదు, సవరణలు, పాస్‌పోర్టు దరఖాస్తు తదితర ఎన్నో సేవలు అందిస్తూ వినియోగదారులకు చేరువ అవుతోంది. సుకన్య సమృద్ధి యోజన, రికరింగ్, సేవింగ్స్‌ డిపాజిట్ల సేకరణలో కూడా వినూత్న పంథా అనుసరిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే అన్నింటా తానూ ఉన్నానని చాటిచెబుతోంది. త్వరితగతిన సమాచారం నిమిత్తం ఇప్పుడు ప్రజలంతా మొబైల్‌ ఫోన్ల మీదనే ఆధార పడుతున్నారు. అన్ని రకాల సేవలు ఫోన్ల ద్వారా సులభంగా పొందుతున్నారు. 

ఈ నేపథ్యంలో తపాలా శాఖ కూడా మొబైల్‌ యాప్‌ ‘పోస్ట్‌ ఇన్ఫో’ తీసుకొచ్చింది. పోటీ ప్రపంచంలో బ్యాంకులు, ఇతర సేవలందించే వివిధ సంస్థలకు దీటుగా ఈ యాప్‌ చక్కగా ఉపయోగపడుతుంది. ఆండ్రాయిడ్‌ మొబైల్‌లో ప్లేస్టోర్‌ నుంచి యాప్‌ను డౌన్‌లోడు చేసుకోవచ్చు. యాప్‌ ద్వారా తొమ్మిది రకాల సేవలు పొందే సౌకర్యం ఉంది. ప్రీమియం, వివిధ రకాల డిపాజిట్లపై వడ్డీ లెక్కలు సైతం వెంటనే తెలుసుకోవచ్చు. ఇప్పటికే పోస్ట్‌ బ్యాంక్‌ యాప్‌ వినియోగంలో ఉంది. పలు రకాల సేవలు అందించే తపాలా శాఖ ఏటీఎం సౌకర్యం కూడా ఏర్పాటు చేసింది.  

యాప్‌లో ఫీచర్స్‌ ఇవే.. 
సుకన్య సమృద్ధి యోజన పథకం 
రికరింగ్‌ డిపాజిట్‌ పథకం. టైం డిపాజిట్‌లో ఏడాది నుంచి ఐదేళ్ల వరకు చేసే డిపాజిట్లపై ఆదాయాన్ని తెలుసుకోవచ్చు. 

ఇంట్రస్ట్‌ కాలిక్యులేటర్‌  
ఏ డిపాజిట్‌ పథకంలో ఎంత సొమ్ము కడితే ఎంత మొత్తం తిరిగి పొందవచ్చు. దానికి సంబంధించిన వివిధ పథకాల సమాచారం తెలుసుకోవచ్చు. 

ఆర్టికల్‌ ట్రాకింగ్‌ 
వినియోగదారులు పంపిన స్పీడ్‌ పోస్టు, రిజిస్టర్‌ పోస్టు, పార్శిల్, ఈఎంవో ఎక్కడ ఉన్నాయి. అవతలి వ్యక్తులకు ఎప్పుడు చేరుతుందో తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. 

సర్వీస్‌ రిక్వెస్ట్‌ 
ఇంటి వద్ద సేవలు పొందేందుకు, డోర్‌ డెలివరీ వంటి సదుపాయాలకు సంబంధించిన సమాచారం కూడా తెలుసుకోవచ్చు. 

కంప్లైంట్స్‌ ట్రాకింగ్‌ 
వినియోగదారులు ఇచ్చిన ఫిర్యాదులు ఏ దశలో ఉన్నాయి. దానికి సంబంధించిన సమాచారం ఇంకా ఏమైనా కావాలా అనే అంశాలు తెలుస్తాయి.  

ఇన్సూరెన్స్‌ పోర్టల్‌ 
తపాలా శాఖ ద్వారా అందిస్తున్న వివిధ రకాల బీమా పథకాల సమాచారం తెలుసుకోవచ్చు. 

ఫీడ్‌ బ్యాక్‌ 
పోస్టల్‌ సేవలకు సంబంధించిన సందేహాలు ఏమైనా ఉంటే వివరంగా తెలుసుకోవచ్చు. సలహాలు, సూచనలు ఇవ్వవచ్చు. 

పోస్టేజ్‌ కాలిక్యులేటర్‌ 
వినియోగదారులు పంపించే పార్సిళ్లు, పోస్టల్‌ కవర్లు, ధరలు, ఎంత బరువుకు ఎంత చెల్లించాలి. సాధారణ, స్పీడ్‌ పోస్టులో పంపితే ఎంత ఖర్చు అవుతుంది. అన్న విషయాన్ని చాలా సులభంగా, స్పష్టంగా తెలుసు కోవచ్చు.  

పోస్టల్‌ ఆఫీస్‌ సెర్చ్‌ 
దేశంలో ఏ పిన్‌ కోడ్‌ అయినా తెలుసుకోవచ్చు. ఊరి పేరు నమోదు చేయగానే సంబంధిత పిన్‌కోడ్‌ వస్తుంది. పిన్‌కోడ్‌ నంబర్‌ తెలిస్తే డెలివరీ కావాల్సిన పోస్ట్‌ ఆఫీసు ఎక్కడ ఉంది. ఏ తపాలా ప్రధాన కార్యాలయం పరిధిలో ఉందో కూడా ఇట్టే తెలుసుకోవచ్చు.  

యాప్‌తో ఉపయోగాలు 
పోస్ట్‌ ఇన్ఫో యాప్‌తో వినియోగదారులకు మరిన్ని సేవలు అందుబాటులోకి అందుతాయి. మొబైల్‌ ఫోన్ల ద్వారా పలు రకాల సేవలు అందిస్తున్నాం. తపాలా వినియోగదారులంతా ఈ యాప్‌ను డౌన్‌లోడు చేసుకోవడం ద్వారా కొత్త సేవలు పొందవచ్చు.

 DOWNLOAD

 

Saturday, March 13, 2021

‘మేరా రేషన్’ యాప్ ఆవిష్కరణ.. కేంద్రం మరో ముందడుగు.. Mera Ration

 

 


 కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ‘వన్ నేషన్.. వన్ రేషన్ కార్డు’ పథకాన్ని అమలు.. 

  కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ‘వన్ నేషన్.. వన్ రేషన్ కార్డు’ (One Nation-One Ration Card) పథకాన్ని అమలు చేసేందుకు కొత్తయాప్‌ను విడుదల చేసింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్‌ సరకులు పొందుతున్న లబ్ధిదారుల కోసం కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ‘మేరా రేషన్‌’ మొబైల్‌ యాప్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ యాప్‌ ఇంగ్లీష్, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. జీవనోపాధి కోసం దేశంలోని పలు ప్రాంతాలకు వెళ్లే రేషన్‌ కార్డుదారులకు మేరా రేషన్‌ మొబైల్‌ యాప్‌ ప్రయోజనం చేకూరుస్తుందని ఆహార, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే వెల్లడించారు. చాలా మంది సొంత ప్రాంతం నుంచి మరొక ప్రదేశానికి జీవనోపాధి కోసం వెళతారని.. అలాంటి వారికి ఈ యాప్‌ ఎంతగానో ఉపయోపడుతుందని తెలిపారు.


 

Mera Ration app Download  

ప్రస్తుతం 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌ కార్డ్‌ పథకంలో భాగస్వామ్యం అయ్యాయని.. త్వరలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన వెల్లడించారు. వన్ రేషన్ కార్డులో భాగస్వామ్యం కాని మిగిలిన నాలుగు రాష్ట్రాలైన అస్సాం, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌ అనుసంధానం రాబోయే కొద్ది నెలల్లోనే పూర్తవుతుందని సుధాన్షు పాండే తెలిపారు. దేశవ్యాప్తంగా గతేడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య మొత్తం 15.4 కోట్ల పోర్టబిలిటీ లావాదేవీలు పూర్తయ్యాయని వివరించారు. 2019 ఆగస్టులో 4 రాష్ట్రాల్లో ప్రారంభమైన ఈ వ్యవస్థను 2020 డిసెంబర్‌ నాటికి వేగంగా విస్తరించినట్లు ఆయన పేర్కొన్నారు.


 

Mera Ration app Download 

 

Tags: Mera Ration App, Telugu Tech News,

మీ ఫోన్‌లో ఈ యాప్స్ ఉన్నాయా.? తస్మాత్ జాగ్రత్త.. వెంటనే డిలీట్ చేయండి.!

 

 

 


Uninstall Apps From Phone: మీరు సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్‌గా ఉంటున్నారా.? నగదు లావాదేవీలు యాప్స్ ద్వారా చేస్తున్నారా.! అలాగే ప్లేస్టోర్ నుంచి వివిధ రకాల యాప్స్ డౌన్‌లోడ్ చేసుకుంటూ ఉంటారా.. అయితే తస్మాత్ జాగ్రత్త కొన్ని యాప్స్ మీ ఫోన్ ద్వారా బ్యాంక్ ఖాతా వివరాలు, పాస్‌వర్డ్స్, ఆధార్, పాన్ నెంబర్స్ వంటివి తెలుసుకుని నగదును లూటీ చేసే అవకాశం ఉంది. ఈ అంశాన్ని బీజీఆర్ తాజా రిపోర్ట్‌లో వెల్లడించింది. ఇందులో కొన్ని యాప్స్‌కు సంబంధించిన వివరాలను తెలియజేసింది. ఆ అప్లికేషన్స్ మీ ఫోన్‌లో ఉంటే వెంటనే డిలీట్ చేయాలని సైబర్ నిపుణులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

  • బీట్‌ప్లేయర్ (BeatPlayer)
  • క్యూర్/బార్‌కోడ్ స్కానర్ మ్యాక్స్ (QR/Barcode Scanner MAX)
  • కేక్ వీపీఎన్ (Cake VPN)
  • పసిఫిక్ వీపీఎన్ (Pacific VPN)
  • ఈవీపీఎన్ (eVPN)
  • టూల్‌‌టిప్‌నేటర్‌లైబ్రరీ (tooltipnatorlibrary)
  • క్యూరికార్డర్ (QRecorder)

ఈ యాప్స్ మీ ఫోన్‌లో ఉంటే వెంటనే అన్‌- ఇన్‌స్టాల్ చేయండి లేదంటే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అయినట్లే.!

 Tags: Uninstall Apps, Telugu Tech News, Android Use apps

G
M
T
Text-to-speech function is limited to 200 characters

Thursday, March 11, 2021

Freeగా లభిస్తున్న కొన్ని Paid Android Apps

 

Google Play Storeలో లభించే కొన్ని ఆండ్రాయిడ్ అప్లికేషన్లు కొంత సమయం పాటు ఉచితంగా లభిస్తాయి. అందులో భాగంగా ప్రస్తుతం Freeగా లభిస్తున్న కొన్ని Paid Android Apps వివరాలు ఇక్కడ చూద్దాం.

 

Hairy Letters

280 రూపాయల విలువ కలిగిన ఈ అప్లికేషన్ ఇప్పుడు ఫ్రీగా లభిస్తోంది. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నట్లయితే ఇది బాగా ఉపయోగపడుతుంది. అక్షరాలు శబ్దాలను గుర్తించే విధంగా ఇది మంచి లెర్నింగ్ అప్లికేషన్ గా పనికొస్తుంది. వేళ్ళతో లెటర్ షేపులను ట్రాక్ చేయడం, అక్షరాలను చిన్న చిన్న పదాలలోకి అమర్చడం, చిన్న పిల్లలు సులభంగా వాడే ఆకర్షణీయమైన ఇంటర్ఫేస్ కలిగి ఉండటం దీని ప్రత్యేకతలు. 

Google Play Storeలో ఈ లింక్ నుండి ఈ అప్లికేషన్ 

ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

 

FX Camera Pro 4K HD DSLR Camera Ultra Blur Effect

380 రూపాయలు విలువ కలిగిన ఈ అప్లికేషన్ కొంత సమయం పాటు ఫ్రీగా లభిస్తుంది. మీ మొబైల్ ఫోన్ కెమెరా ద్వారా తీయ బడే ఫోటోలను DSLR క్వాలిటీ కలిగి ఉండే విధంగా ఇది ఉపకరిస్తుంది. దీంట్లో అనేక రకాల షూటింగ్ మోడ్స్ లభిస్తుంటాయి. మనకు నచ్చినట్లు మాన్యువల్ కెమెరా కంట్రోల్స్ ఉపయోగించుకోవచ్చు.

 Google Play Storeలో ఈ లింక్ నుండి 

దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

 

Simpan – Note various Needs

రూ. 200 విలువ కలిగిన ఈ యాప్ ఇప్పుడు ఫ్రీగా లభిస్తోంది. అన్ని రకాల ముఖ్యమైన నోట్స్ మీ ఫోన్లో జాగ్రత్తగా సేవ్ చేసుకోవడం కోసం దీనిని ఉపయోగించవచ్చు. ముఖ్యమైన మెమరీ లు, షాపింగ్ లిస్టులు, వంటలకు సంబంధించిన సమాచారం, పిల్లలు స్కూల్ అసైన్మెంట్లు, ఈవెంట్ అపాయింట్మెంట్లు వంటి ఈ వివరాలను దీనిలో నమోదు చేసుకోవచ్చు.  

Google Play Storeలో ఈ లింకు నుండి దీన్ని 

కొంత సమయం పాటు ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

 

Saturday, March 6, 2021

గూగుల్ మెసేజ్ తాజా వెర్షన్(7.4.050 )‌ లో అదిరిపోయే ఫీచర్

 మీ మిత్రుడు, బంధువులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం మర్చిపోయారా? అర్ధరాత్రి వారిని లేపకుండానే వారికీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా. అయితే, మీకు ఒక శుభవార్త. గూగుల్ తన మెసేజిస్ యాప్ లో అదిరిపోయే ఫీచర్ ను తీసుకురాబోతుంది. ఇప్పటికే వీడియో కాలింగ్, లొకేషన్ షేరింగ్ వంటి ఫీచర్స్ తీసుకొచ్చిన గూగుల్. తాజాగా, షెడ్యూల్ అనే కొత్త ఫీచర్ తీసుకొనివస్తుంది. దీని ద్వారా మీరు మీ మెసేజ్ లను షెడ్యూల్ చేయవచ్చు. మీరు మెసేజ్ ను షెడ్యూల్ చేయడానికి ముందు మీ ఫోన్‌లో గూగుల్ మెసేజ్ తాజా వెర్షన్(7.4.050 )‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఈ ఫీచర్ కేవలం గూగుల్ మెసేజ్ యాప్ లో మాత్రమే వర్తిస్తుంది. మీ ఫోన్ లో వచ్చిన మెసేజ్ యాప్ లో ఈ ఫీచర్ వర్తించదు. మీరు మెసేజ్ లను షెడ్యూల్ చేయాలంటే ఈ క్రింద స్టెప్స్ అనుసరించండి.

 

 


 

  • మెసేజ్ ను షెడ్యూల్ చేయడానికి ముందు మీ సందేశాన్ని టైప్ చేయండి 
  • తర్వాత సేండ్ బటన్‌ను లాంగ్ ప్రెస్(ఎక్కువ సేపు) చేయండి. 
  • ఇప్పుడు మీకు తేదీలు, సమయం చూపించే ఒక పాప్-అప్‌ మెసేజ్ వస్తుంది.
  • దానిలో కనిపించే తేదీ, సమయాన్ని ఎంచుకొని సేవ్ చేస్తే సరిపోతుంది.  
  • దీని ద్వారా మీ ఫొటోలు, వీడియోలు కూడా షెడ్యూల్ చేయవచ్చు.

 DOWNLOAD

Monday, January 25, 2021

ఫేస్‌బుక్‌కు పోటీగా దూసుకెళ్తున్న 'మీవే' యాప్ MEWE APK

 తాజా వాట్సాప్-ఫేస్‌బుక్ డేటా షేరింగ్ వివాదం నేపథ్యంలో చాలా మంది ప్రజలు కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల కోసం ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియా దిగ్గజాలైన ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటివి ప్రైవసీ ఉల్లంఘనకు పాల్పడటంతో పాటు యూజర్ల యాక్టీవీటి మీద నిఘా పెంచడంతో చాలా మంది యూజర్లు ఇతర యాప్ ల వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో యుఎస్ ఆధారిత సోషల్ నెట్‌వర్క్ "మీవే" గూగుల్ ప్లే స్టోర్‌లో అత్యధికంగా డౌన్‌లోడ్ చేయబడిన సోషల్ యాప్‌గా నిలిచింది. కేవలం ఒక్క వారంలోనే 2.5 మిలియన్లకు పైగా యూజర్లు దీనిని డౌన్‌లోడ్ చేసుకున్నారు.

2016లో ప్రారంభించినప్పటి నుంచి 2020 అక్టోబర్ వరకు ఈ సోషల్ నెట్‌వర్క్ ‌యాప్ ను తొమ్మిది మిలియన్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ ప్లాట్‌ఫామ్‌లో ప్రస్తుతం 15.5 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు. "మీవే" ఇప్పుడు 20 భాషలకు సపోర్ట్ చేయనుంది. ప్రస్తుతం హాంకాంగ్‌లో నెం.1సోషల్ యాప్ గా "మీవే" కొనసాగుతుంది. కంపెనీ తెలిపిన వివరాలు ప్రకారం యూజర్ల డేటాను గౌరవించే సోషల్ నెట్‌వర్క్‌ను నిలిచినందున దీనిని చాలా మంది వినియోగదారులు డౌన్‌లోడ్ చేసుకున్నట్లు పేర్కొంది. ఇది సోషల్ నెట్‌వర్క్ యాడ్ ఫ్రీగా కొనసాగనుంది. 2021 జనవరి 15నాటికి ప్రపంచంలోనే గూగుల్ ప్లే స్టోర్ లో డౌన్‌లోడ్ పరంగా నెం.3గా.. సోషల్ మీడియా డౌన్‌లోడ్ పరంగా నెం.1గానూ కొనసాగుతుంది. ఇప్పటివరకు వాట్సాప్ కు పోటీగా సిగ్నల్, టెలిగ్రామ్ యాప్ లు ఉన్నాయి. ఇప్పుడు ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి వాటికీ ప్రత్యామ్నాయంగా "మీవే" యాప్ నిలిచింది. యాడ్ ఫ్రీగా కొనసాగుతుండటంతో ఎక్కువ మంది యూజర్లు డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. ఎక్స్ ట్రా ఫీచర్లతో ప్రీమియం మోడల్స్ ను మించిపోయేలా ఉంది.

DOWNLOAD

Friday, November 27, 2020

Jio Pages షార్ట్ వీడియో ఫీచర్

 

గత నెలలో ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం రిలయన్స్ జియో సంస్థ ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం జియో పేజెస్ అనే వెబ్ బ్రౌజర్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త బ్రౌజర్ లో డేటా భద్రత, సమాచారంపై వినియోగదారులకు నియంత్రణ ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇప్పుడు, తాజాగా జియో పేజిస్ యొక్క కొత్త వెర్షన్ 2.0.1 ను విడుదల చేసింది. ఈ వెర్షన్ లో డక్‌డక్‌గోను ఇష్టపడే వారికోసం సెర్చ్ ఇంజిన్ ను ఆడ్ చేసింది. అలాగే చిన్న వీడియోల కోసం ప్రత్యేకంగా ఒక కొత్త ఫీచర్ ని తేవడంతో పాటు నావిగేషన్ మరియు ఎగ్జిట్ బటన్లను జోడించింది.


 

 

 

ఇప్పుడు జియోపేజ్ వినియోగదారులు డక్‌డక్‌గో సెర్చ్ ఇంజిన్ ను ‌ఇష్టపడే వారు కుడి వైపులో హాంబర్గర్ చిహ్నం(మెనూ)> సెట్టింగులు> క్విక్ సెట్టింగులు> సెర్చ్ ఇంజిన్‌ను క్లిక్ చేయడం ద్వారా డక్‌డక్‌గోను ఎంచుకోవచ్చు. డక్‌డక్‌గో అనేది గోప్యతాకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే సెర్చ్ ఇంజిన్. యూజర్లు బింగ్, యాహూ, గూగుల్ వంటి ఇతర సెర్చ్ ఇంజన్ ప్లాట్‌ఫారమ్‌లను కూడా జియోపేజ్  ద్వారా ఉపయోగించవచ్చు. అలాగే ఈ యాప్ లో చిన్న వీడియోల కోసం ప్రత్యేక ఫీచర్ ని తీసుకురావడం మంచి విషయం. ఈ కొత్త ఫీచర్ లో 30 సెకన్ల వరకు చిన్న వీడియోలు ప్రదర్శించబడతాయి.

చిన్న వీడియోలను చూడాలనుకునే వినియోగదారులు బాటమ్ బార్> ఎక్సప్లోర్ సెక్షన్> స్క్రోల్ టూ షార్ట్ వీడియో రీల్> వ్యూ మోర్ ను ఎంచుకుంటే సరిపోతుంది. చిన్న వీడియోలలో వినోదం, జీవనశైలి, టెక్ మొదలైన కంటెంట్ లభిస్తుంది. జియోపేజ్ లో కొత్తగా నావిగేషన్ మరియు ఎగ్జిట్ బటన్లను కూడా తీసుకొచ్చింది. జియో పేజెస్ సౌకర్యవంతమైన వీక్షణ కోసం డార్క్ మోడ్‌కు సపోర్ట్ చేస్తుంది. జియోపేజీ వెబ్ బ్రౌజర్‌ హిందీ, గుజరాతీ, మరాఠీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ మరియు బెంగాలీ వంటి ప్రాంతీయ భాషలలో బ్రౌజ్ చేయడానికి వినియోగదారులకు సపోర్ట్ చేస్తుంది.

 Download Jio Pages