Monday, January 25, 2021

ఫేస్‌బుక్‌కు పోటీగా దూసుకెళ్తున్న 'మీవే' యాప్ MEWE APK

 తాజా వాట్సాప్-ఫేస్‌బుక్ డేటా షేరింగ్ వివాదం నేపథ్యంలో చాలా మంది ప్రజలు కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల కోసం ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియా దిగ్గజాలైన ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటివి ప్రైవసీ ఉల్లంఘనకు పాల్పడటంతో పాటు యూజర్ల యాక్టీవీటి మీద నిఘా పెంచడంతో చాలా మంది యూజర్లు ఇతర యాప్ ల వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో యుఎస్ ఆధారిత సోషల్ నెట్‌వర్క్ "మీవే" గూగుల్ ప్లే స్టోర్‌లో అత్యధికంగా డౌన్‌లోడ్ చేయబడిన సోషల్ యాప్‌గా నిలిచింది. కేవలం ఒక్క వారంలోనే 2.5 మిలియన్లకు పైగా యూజర్లు దీనిని డౌన్‌లోడ్ చేసుకున్నారు.

2016లో ప్రారంభించినప్పటి నుంచి 2020 అక్టోబర్ వరకు ఈ సోషల్ నెట్‌వర్క్ ‌యాప్ ను తొమ్మిది మిలియన్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ ప్లాట్‌ఫామ్‌లో ప్రస్తుతం 15.5 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు. "మీవే" ఇప్పుడు 20 భాషలకు సపోర్ట్ చేయనుంది. ప్రస్తుతం హాంకాంగ్‌లో నెం.1సోషల్ యాప్ గా "మీవే" కొనసాగుతుంది. కంపెనీ తెలిపిన వివరాలు ప్రకారం యూజర్ల డేటాను గౌరవించే సోషల్ నెట్‌వర్క్‌ను నిలిచినందున దీనిని చాలా మంది వినియోగదారులు డౌన్‌లోడ్ చేసుకున్నట్లు పేర్కొంది. ఇది సోషల్ నెట్‌వర్క్ యాడ్ ఫ్రీగా కొనసాగనుంది. 2021 జనవరి 15నాటికి ప్రపంచంలోనే గూగుల్ ప్లే స్టోర్ లో డౌన్‌లోడ్ పరంగా నెం.3గా.. సోషల్ మీడియా డౌన్‌లోడ్ పరంగా నెం.1గానూ కొనసాగుతుంది. ఇప్పటివరకు వాట్సాప్ కు పోటీగా సిగ్నల్, టెలిగ్రామ్ యాప్ లు ఉన్నాయి. ఇప్పుడు ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి వాటికీ ప్రత్యామ్నాయంగా "మీవే" యాప్ నిలిచింది. యాడ్ ఫ్రీగా కొనసాగుతుండటంతో ఎక్కువ మంది యూజర్లు డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. ఎక్స్ ట్రా ఫీచర్లతో ప్రీమియం మోడల్స్ ను మించిపోయేలా ఉంది.

DOWNLOAD