కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ‘వన్ నేషన్.. వన్ రేషన్ కార్డు’ పథకాన్ని అమలు..
కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ‘వన్ నేషన్.. వన్ రేషన్ కార్డు’ (One Nation-One Ration Card) పథకాన్ని అమలు చేసేందుకు కొత్తయాప్‌ను విడుదల చేసింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ సరకులు పొందుతున్న లబ్ధిదారుల కోసం కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ‘మేరా రేషన్’ మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ యాప్ ఇంగ్లీష్, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. జీవనోపాధి కోసం దేశంలోని పలు ప్రాంతాలకు వెళ్లే రేషన్ కార్డుదారులకు మేరా రేషన్ మొబైల్ యాప్ ప్రయోజనం చేకూరుస్తుందని ఆహార, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే వెల్లడించారు. చాలా మంది సొంత ప్రాంతం నుంచి మరొక ప్రదేశానికి జీవనోపాధి కోసం వెళతారని.. అలాంటి వారికి ఈ యాప్ ఎంతగానో ఉపయోపడుతుందని తెలిపారు.
Mera Ration app Download
ప్రస్తుతం 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ పథకంలో భాగస్వామ్యం అయ్యాయని.. త్వరలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన వెల్లడించారు. వన్ రేషన్ కార్డులో భాగస్వామ్యం కాని మిగిలిన నాలుగు రాష్ట్రాలైన అస్సాం, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ అనుసంధానం రాబోయే కొద్ది నెలల్లోనే పూర్తవుతుందని సుధాన్షు పాండే తెలిపారు. దేశవ్యాప్తంగా గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య మొత్తం 15.4 కోట్ల పోర్టబిలిటీ లావాదేవీలు పూర్తయ్యాయని వివరించారు. 2019 ఆగస్టులో 4 రాష్ట్రాల్లో ప్రారంభమైన ఈ వ్యవస్థను 2020 డిసెంబర్ నాటికి వేగంగా విస్తరించినట్లు ఆయన పేర్కొన్నారు.
Mera Ration app Download