Thursday, March 11, 2021

Freeగా లభిస్తున్న కొన్ని Paid Android Apps

 

Google Play Storeలో లభించే కొన్ని ఆండ్రాయిడ్ అప్లికేషన్లు కొంత సమయం పాటు ఉచితంగా లభిస్తాయి. అందులో భాగంగా ప్రస్తుతం Freeగా లభిస్తున్న కొన్ని Paid Android Apps వివరాలు ఇక్కడ చూద్దాం.

 

Hairy Letters

280 రూపాయల విలువ కలిగిన ఈ అప్లికేషన్ ఇప్పుడు ఫ్రీగా లభిస్తోంది. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నట్లయితే ఇది బాగా ఉపయోగపడుతుంది. అక్షరాలు శబ్దాలను గుర్తించే విధంగా ఇది మంచి లెర్నింగ్ అప్లికేషన్ గా పనికొస్తుంది. వేళ్ళతో లెటర్ షేపులను ట్రాక్ చేయడం, అక్షరాలను చిన్న చిన్న పదాలలోకి అమర్చడం, చిన్న పిల్లలు సులభంగా వాడే ఆకర్షణీయమైన ఇంటర్ఫేస్ కలిగి ఉండటం దీని ప్రత్యేకతలు. 

Google Play Storeలో ఈ లింక్ నుండి ఈ అప్లికేషన్ 

ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

 

FX Camera Pro 4K HD DSLR Camera Ultra Blur Effect

380 రూపాయలు విలువ కలిగిన ఈ అప్లికేషన్ కొంత సమయం పాటు ఫ్రీగా లభిస్తుంది. మీ మొబైల్ ఫోన్ కెమెరా ద్వారా తీయ బడే ఫోటోలను DSLR క్వాలిటీ కలిగి ఉండే విధంగా ఇది ఉపకరిస్తుంది. దీంట్లో అనేక రకాల షూటింగ్ మోడ్స్ లభిస్తుంటాయి. మనకు నచ్చినట్లు మాన్యువల్ కెమెరా కంట్రోల్స్ ఉపయోగించుకోవచ్చు.

 Google Play Storeలో ఈ లింక్ నుండి 

దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

 

Simpan – Note various Needs

రూ. 200 విలువ కలిగిన ఈ యాప్ ఇప్పుడు ఫ్రీగా లభిస్తోంది. అన్ని రకాల ముఖ్యమైన నోట్స్ మీ ఫోన్లో జాగ్రత్తగా సేవ్ చేసుకోవడం కోసం దీనిని ఉపయోగించవచ్చు. ముఖ్యమైన మెమరీ లు, షాపింగ్ లిస్టులు, వంటలకు సంబంధించిన సమాచారం, పిల్లలు స్కూల్ అసైన్మెంట్లు, ఈవెంట్ అపాయింట్మెంట్లు వంటి ఈ వివరాలను దీనిలో నమోదు చేసుకోవచ్చు.  

Google Play Storeలో ఈ లింకు నుండి దీన్ని 

కొంత సమయం పాటు ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.