Thursday, March 11, 2021

TS: ఇంటర్ మోడల్‌ పేపర్స్ విడుదల..

 


 

కోవిడ్‌ కారణంగా విద్యాసంస్థలు మూతబడిన నేప‌థ్యంలో ఇంట‌ర్మీడియ‌ట్ సిల‌బ‌స్‌ను 70 శాతానికే ప‌రిమితం చేసిన విష‌యం తెలిసిందే. దీంతో ఇంట‌ర్ ప‌రీక్షల ప్ర‌శ్నాప‌త్రాల్లో స్వ‌ల్ప మార్పులు చేశారు. ఈ మేర‌కు ఇంట‌ర్ మోడ‌ల్ పేప‌ర్స్‌ను ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు విడుద‌ల చేసింది. అన్ని స‌బ్జెక్టుల ప్ర‌శ్నాప‌త్రాల్లో మార్పులు చేసిన‌ట్లు ఇంటర్‌ బోర్డు తెలిపింది.

రెండు మార్కుల ప్ర‌శ్న‌లు ప‌దింటికి ప‌ది రాయాల్సి ఉంటుంది. 4 మార్కులు, 8 మార్కుల ప్ర‌శ్న‌ల్లో మార్పులు చేశారు. మోడ‌ల్ పేప‌ర్స్ కోసం https://tsbie.cgg.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

 

 

Tags: Ts Inter Model Papers, Inter Model Paper,  Telugu Tech News Papers, Ts Model Papers