Showing posts with label News. Show all posts
Showing posts with label News. Show all posts

Wednesday, December 9, 2020

డిసెంబర్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు..

 

మీరు బ్యాంకు లావాదేవీల‌ను నిత్యం చేస్తూ ఉంటారా..? అయితే డిసెంబ‌ర్ నెల‌లో బ్యాంకులకు ఏఏ రోజు సెలువులొస్తున్నాయో తెలుసా… సాధార‌ణ సెల‌వు రోజుల కంటే డిసెంబ‌ర్ నెల‌లో ఆరు రోజుల‌తో పాటు మ‌రో రోజు హాలిడే వ‌చ్చింది. అయితే తెలంగాణ‌లోని హైద‌రాబాద్ ప‌రిధిలోని బ్యాంకుల‌కు మాత్రం మ‌రో రోజు అధికంగా హాలిడే వ‌చ్చింది. అది ఎందుకంటే… జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్ర‌భుత్వం డిసెంబ‌ర్ 1న సెల‌వు దినంగా ప్ర‌క‌టించింది.


 

మొత్తంగా తెలంగాణ‌లో బ్యాంకుల సేవ‌లు డిసెంబ‌ర్ నెల‌లో 8 రోజుల పాటు దూర‌మ‌వ‌నున్నాయి. మ‌రో విష‌యం ఎంటంటే… డిసెంబర్ 25న క్రిస్మస్ కావడంతో ఆరోజు బ్యాంకులకు సెలవే. డిసెంబర్ 26 నాలుగో శనివారం, 27 ఆదివారం ఉంది కాబట్టి…. డిసెంబర్ 25 నుంచి 27 వరకు బ్యాంకులు తెరుచుకోవు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే సెలవులు ప్రభుత్వ బ్యాంకులతో ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులకు వర్తిస్తాయన్న సంగతి కస్టమర్లు గుర్తుంచుకోవాలి.

ఏఏ రోజులు సెల‌వంటే..


డిసెంబర్ 1న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నిక‌లు
డిసెంబర్ 6న ఆదివారం
డిసెంబర్ 12న‌ రెండో శనివారం
డిసెంబర్ 13న ‌ఆదివారం
డిసెంబర్ 20న ఆదివారం
డిసెంబర్ 25న క్రిస్మస్
డిసెంబర్ 26 నాలుగో శనివారం
డిసెంబర్ 27న ఆదివారం

ICICI MOBILE యాప్‏లో కీలక మార్పు.. ఇతర బ్యాంకుల కస్టమర్లకు ఇకపై అందుబాటులోకి..

 

ఐసీఐసీఐ బ్యాంకు తమ మొబైల్ పే యాప్‏‏లో కీలక మార్పు చేసింది. ఇతర బ్యాంకుల కస్టమర్లకు కూడా తమ ఐమొబైల్ పే ద్వారా సేవలు అందిస్తామని తెలిపింది. ఇప్పటివరకు ఈ యాప్ ‘Imobile’ పేరుతో అందుబాటులో ఉంది. కొత్తగా తీసుకువచ్చిన మార్పులకు అనుగుణంగా దీనిని I mobile Payగా మార్చారు. ఈ యాప్ ద్వారా ఇతర బ్యాంకుల వినియోగదారులు తమ సొంత UPI  IDని నమోదు చేసుకొని, దాంతో అనుసంధానించిన బ్యాంక్ అకౌంట్‏తో లావాదేవీలు చేసుకోవచ్చు.

ఇలాంటి యాప్ రావడం ఇదే మొదటిసారని ఐసీఐసీఐ తెలిపింది. కస్టమర్లు తమ కాంటాక్టులకు సంబంధించిన యూపీఐ ఐడీలను ఎక్కువకాలం గుర్తుంచుకోనవసరం లేకుండా ఇంటర్ఆపరబిలిటీని అందిస్తున్నామని తెలిపింది. దీంతో సులభంగా పేమెంట్ యాప్స్, వాలెట్లకు మనీ ట్రాన్స్‏ఫర్ చేసుకోవచ్చని పేర్కోంది.

 

“సరికొత్త ఆవిష్కరణలు చేయడం, వాటిని అమలుపరచడంలో మేమెప్పుడూ ముందుంటాం. 2008లో దేశంలోనే మొదటిసారిగా బ్యాంకింగ్ యాప్‏ను పరిచయం చేశాం. ఇప్పుడు విడుదల చేసిన కొత్త వెర్షన్‏తో ఇతర బ్యాంకులకు చెందిన కస్టమర్లు కూడా వారు బ్యాంకు అకౌంట్లను ఇందులో లింక్ చేసుకోవచ్చు” అని ఐసీఐసీఐ బ్యాంక్ ఓ ప్రకటనలో తెలిపింది.

 


DOWNLOAD

అమెజాన్ మరియు ఆపిల్ యొక్క కస్టమర్ కేర్ విభాగం నుండి కాల్ చేస్తున్నామని.. జర జాగ్రత్త!

 

ప్రముఖ టెక్, ఈ కామర్స్ కంపెనీలైనా ఆపిల్ మరియు అమెజాన్ సంస్థలు ఇటీవల వారి వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేసాయి. ఇటీవల అమెజాన్ మరియు ఆపిల్ యొక్క కస్టమర్ కేర్ విభాగం నుండి కాల్ చేస్తున్నామని.. ఆర్డర్ లేదా అకౌంట్‏లో అనుమానిత కార్యాకలపాలు జరుగుతున్నాయంటూ ఎటువంటి అనుమానాస్పద కాల్స్ వచ్చిన వాటి నుండి జాగ్రత్తగా ఉండమని హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. అందుకే ప్రతి వినియోగదారుడు తమ లాగిన్ అకౌంట్ వివరాలను బహిర్గతం చేయకూడదని ఫెడరల్ ట్రేడ్ కమిషన్ తన బ్లాగ్‏లో పోస్ట్ చేసింది

 

 ఆపిల్ వినియోగదారుడికి ఒక తెలియని వ్యక్తి నుంచి కాల్ వస్తుంది.. మీ ఐక్లౌడ్ అకౌంట్‏లో అనుమానిత కార్యాకలపాలు జరుగుతున్నాయంటూ స్కామర్లు కాల్ చేస్తారు. తర్వాత మీ అకౌంట్ లో జరిగిన తప్పును సరిచేయడానికి ప్రతిస్పందనగా '1' డయల్ చేయండి లేదా మేము తెలిపిన నంబర్‌కు తిరిగి కాల్ చేయండి అని స్కామర్లు పేర్కొంటారు. అలాగే  అమెజాన్ తరపున వచ్చిన నకిలీ కాల్స్ అయితే, గతంలో మీరు చేసిన క్యాన్సల్ అయిన ఆర్డర్ లేదా మీరు చివరగా చేసిన డెలివరీకి సంబంధించి కాల్ చేస్తున్నామని స్కామర్లు పేర్కొంటారు. అమెజాన్ డెలివరీలు రోజు చాలా మొత్తంలో జరుగుతుండటంతో ఇటువంటి వంటి వాటికీ ఎక్కువ ఆస్కారం ఉందని నిపుణులు తెలుపుతున్నారు. 


మీరు ఒకవేళ వీటిని నమ్మి నిజంగా కాల్ చేస్తే వారు మీ యొక్క క్రెడిట్, డెబిట్ కార్డ్స్ వివరాలు అడుగుతారు దీని ద్వారా మీ అకౌంట్స్ హ్యాక్ చేసే అవకాశం ఎక్కువ. అందుకే ప్రతి వినియోగదారుడు తమ లాగిన్ అకౌంట్ వివరాలను బహిర్గతం చేయకూడదని ఫెడరల్ ట్రేడ్ కమిషన్ తన బ్లాగ్‏లో పోస్ట్ చేసింది. ఇలాంటి కాల్స్ వస్తే యూజర్లు ఎలాంటి నంబర్లు క్లిక్ చేయకూడదని హెచ్చరించింది. ఇటువంటి స్కాం కాల్స్ చాలా వస్తాయని వాటికీ వినియోగదారులు భయపడాల్సిన అవసరం లేదు అని తెలిపింది. అమెజాన్ మరియు ఆపిల్ కు చెందిన సంస్థల నుండి కాల్స్ వస్తే ఒకసారి వారి పోర్టల్ లో రిజిస్టర్ చేయబడిన కస్టమర్ కేర్ నెంబర్ కాదా అనే తెలుసుకోవాలని ఫెడరల్ ట్రేడ్ కమిషన్ తెలిపింది. ప్రస్తుతం ఇటువంటి మోసాలు ఎక్కువగా అమెరికాలో జరుగుతున్నాయని భారత్ లో కాదని తెలిపింది. కానీ భవిష్యత్ లో ఇలాంటి స్పామ్ కాల్స్ భారత యూజర్లు కూడా వస్తాయని తెలిపారు. అందుకోసమే వినియోగదారులు ఇంకా జాగ్రత్త వహించాలని కోరారు.

Tuesday, December 8, 2020

ప్రమాదంలో 2కోట్ల చైనా మొబైల్స్

 

చైనాలో దిగ్గజ కంపెనీ జియోనీ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. చైనాలోని ఒక న్యాయస్థానం జియోనీ ఫోన్‌లతో సంబంధం ఉన్న ఒక వివాదాస్పద అంశంపై తీర్పు ఇచ్చింది. చైనా జడ్జిమెంట్ డాక్యుమెంట్ నెట్‌వర్క్ ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, జియోనీ ఫోన్‌లలో ఉద్దేశపూర్వకంగానే 2 కోట్లకుపైగా ఫోన్లలో ట్రోజన్ హార్స్ అనే వైరస్ ను సంస్థ ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది. డిసెంబర్ 2018 మరియు అక్టోబర్ 2019 మధ్య ఒక యాప్ ద్వారా 20 మిలియన్లకు పైగా జియోనీ ఫోన్లలలో ఉద్దేశపూర్వకంగా ప్రవేశ పెట్టిన ట్రోజన్ హార్స్‌ వైరస్ తో దెబ్బతిన్నాయని కోర్టు కనుగొంది. “స్టోరీ లాక్ స్క్రీన్” ప్రత్యేక యాప్ వినియోగదారుల నుండి అయాచిత ప్రకటనలు మరియు ఇతర చట్టవిరుద్ధ మార్గాల ద్వారా లాభాల సాధనంగా ఉపయోగబడిందని నివేదిక పేర్కొంది.

 

 “స్టోరీ లాక్ స్క్రీన్” యాప్ యొక్క అప్డేట్ ద్వారా వినియోగదారుల ఫోన్‌లలో ట్రోజన్ హార్స్ ప్రోగ్రామ్‌ను అమర్చడానికి షెన్‌జెన్ జిపు టెక్నాలజీ(జియోనీ యొక్క అనుబంధ సంస్థ)తో ఒప్పందం కుదర్చుకున్నట్లు కోర్టు తెలిపింది. నివేదిక తెలిపినట్లుగా, "పుల్ పద్ధతి"ని ఉపయోగించి వినియోగదారుకు తెలియకుండా సాఫ్ట్‌వేర్ ఆటోమేటిక్ గా జియోనీ మొబైల్ ఫోన్‌లలో అప్డేట్ చేసారని కోర్టు పేర్కొంది. దీని కోసం జియోనీ 40 లక్షల డాలర్లు ముడుపులు ఇచ్చుకుంది. 2018లో మొదటిసారిగా వారు ఈ వైరస్‌ను ఫోన్లలో ఇన్‌స్టాల్ చేయడం ప్రారంభించారు. 2019 అక్టోబర్ వరకు ఇలాగే కొనసాగించారు. ఈ పద్దతిలో 21.75 మిలియన్ స్మార్ట్‌ఫోన్‌లను ప్రభావితం చేయడంతో ద్వారా.. కంపెనీ సుమారు 4.2 మిలియన్లు అర్జించినట్లు తేలింది. మొబైల్ పరికరాలను చట్టవిరుద్ధంగా నియంత్రించినందుకు న్యాయస్థానం.. గ్జూ లి, జో యింగ్, జియా జెంగ్కియాంగ్, పాన్ క్వి లను దోషులుగా తేల్చింది. వారికి 3 నుంచి 3.5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి 22,59,738 రూపాయల జరిమానా విధించింది.

 

PNR Status in Whatsapp : వాట్సాప్‌లో పీఎన్ఆర్ స్టేటస్

 కరోనా మహమ్మారి కారణంగా రైల్వే ప్రయాణికులు సౌలభ్యం కోసం ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని తీసుకొస్తున్న ఐఆర్‌సీటీసీ. తాజాగా మరో కొత్త సదుపాయాన్ని ప్రయాణికులకు కల్పిస్తున్నట్లు పేర్కొంది. రైలు ప్రయాణం కోసం ఆన్లైన్ సేవలు వినియోగించుకునే వారి సంఖ్య ఎక్కువ కావడంతో.. మరిన్ని సేవలను ఆన్ లైన్ లో తీసుకొచ్చింది. తాజాగా వాట్సాప్ ద్వారా రియల్ టైమ్ పిఎన్‌ఆర్ స్టేటస్ మరియు ట్రైన్ జర్నీ సమాచారాన్ని పొందటానికి వినియోగదారులు పొందే అవకాశాన్ని కల్పిస్తుంది. “రైలు యొక్క పీఎన్‌ఆర్ స్టేటస్, రైలు లైవ్ స్టేటస్, ఆలస్యానికి సంబంధించిన వివరాలు, రాబోయే స్టాప్‌లకు సంబంధించిన వంటి సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇతర వెబ్‌సైట్లలో వెతకడం ద్వారా మీ సమయాన్ని వృదా చేసుకోకుండా ఉండటానికి రైలోఫీ అనే కొత్త సౌకర్యాన్ని కల్పించనట్లు” సంస్థ తెలిపింది.

 

దీనికోసం మన వాట్సాప్ లో రైలోఫీకి చెందిన మొబైల్ నెంబర్ ని +91 9881193322 సేవ్ చేసుకోవాలి. దీని తర్వాత మీరు బుక్ చేసుకున్న రైలు యొక్క 10 అంకెల పీఎన్ఆర్ నంబర్‌ను రైలోఫీకి వాట్సాప్ లో మెసేజ్ ద్వారా పంపించాలి. అప్పుడు మీరు ఎక్కబోయే ట్రైన్ లేట్‌గా నడుస్తుందా? టైమ్‌కే వస్తుందా? అనే సమాచారాన్ని కూడా మీరు వాట్సాప్‌లోనే పొందవచ్చు. దీంతోపాటు ట్రైన్‌లో తర్వాత రాబోయే స్టేషన్ సమాచారం కూడా పొందవచ్చు. కంపెనీ తెలుపుతున్న వివరాల ప్రకారం, రోజుకి కోటి మంది పీఎన్ఆర్ స్టేటస్ గురుంచి గూగుల్ సెర్చ్ చేస్తునట్టు తెలిపింది. ఈ కొత్త సర్వీస్ ద్వారా వినియోగదారులకు వాట్సాప్‌లోనే దీనికి సంబంధించిన స్టేటస్‌ను చూసుకునే అవకాశం ఉంది.  

Thursday, December 3, 2020

ఆండ్రాయిడ్ 11తో రానున్న గెలాక్సీ ఎ32 5జీ

 


శామ్సంగ్ గెలాక్సీ ఎ32 5జీ మొబైల్ అవుట్ అఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 11తో రానున్నట్లు సమాచారం. దీనికి సంబందించిన కొన్ని లీక్స్ బయటకి వచ్చాయి. ఈ ఫొటోలో నాచ్ డిస్ప్లే, చిన్న కెమెరా బంప్ తో రానున్నట్లు కనిపిస్తుంది. మోడల్ నంబర్ ఎస్‌ఎమ్-ఎ326బితో వస్తున్న ఫోన్ గెలాక్సీ A32 5జీ అని సమాచారం. దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శామ్సంగ్ దీని గురుంచి ఎటువంటి సమాచారం తెలపలేదు. ఇది ఆండ్రాయిడ్ 11 సపోర్ట్ తో వన్ UI 3.0పై పని చేయనుంది. ఇటీవల గెలాక్సీ ఎ32 5జీ యొక్క ఫీచర్స్ గురుంచి కొన్ని రూమర్లు బయటికి వస్తున్నాయి. ఇందులో 6.5-అంగుళాల డిస్ప్లే మరియు క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను చూపిస్తుంది. ఫోన్ ఫ్లాట్ అయిన ప్లాస్టిక్ బ్యాక్ ప్యానల్‌తో పాటు ముందు భాగంలో సెల్ఫీ కెమెరా కోసం నాచ్ తో వస్తుంది అని నివేదిక పేర్కొంది. ప్రధాన కెమెరా వచ్చేసి 48 మెగాపిక్సెల్ తో రానున్నట్లు సమాచారం. ఫోన్ వెనుక భాగంలో కెమెరా మాడ్యూల్ లేని బ్యాక్ ప్యానెల్ తో ఫ్లష్ గా ఉంటుంది. గెలాక్సీ ఎ 32 5జీ మొబైల్ యుఎస్‌బి టైప్-సి పోర్ట్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్‌తో రావచ్చు.

My WhatsApp group: https://chat.whatsapp.com/HYRUxIhnwNAEa6J2DfDj6Q

 

Wednesday, December 2, 2020

Tata Sky Binge+ ఉచిత OTT యాక్సిస్ లో అందరి కంటే మెరుగ్గా ఉంది!!

 

ఇండియాలోని డిటిహెచ్ ఆపరేటర్ ఎక్కువ మంది యూసర్ బేస్ లను కలిగిన టాటా స్కై కొద్దీ నెలల క్రితం తన వినియోగదారుల కోసం బింగే + ఆండ్రాయిడ్ టివి సెట్-టాప్ బాక్స్‌ను పరిచయం చేసింది. అయితే ఈ బింగే + హైబ్రిడ్ సెట్-టాప్ బాక్స్‌ యొక్క ధరను మూడు నెలల క్రితం రూ.2,999 కు తగ్గించిన తరువాత దీని యొక్క వినియోగం ఎక్కువ అయింది అని కంపెనీ తెలిపింది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ మరియు DishSMRT Hub బాక్స్‌ కూడా వినియోగదారులకు ఇప్పుడు కేవలం రూ.2,499 ధర వద్ద లభిస్తున్న కారణంగా వీటి మధ్య పోటీ మరింత తీవ్రం అయింది. ప్రస్తుతం రూ.2,999 ధర వద్ద టాటా స్కై బింగే + బాక్స్ కొనుగోలు చేయడంతో టాటా స్కై బింగే యొక్క ఆరు నెలల బండిల్ ఆఫర్‌ను కూడా ఉచితంగా అందిస్తున్నది. టాటా స్కై బింగే ZEE5, SonyLIV వంటి మరిన్ని OTT సబ్స్క్రిప్షన్ లకు ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది. దీని గురించి మరింత తెలుసుకోవడానికి ముందుకు చదవండి.


 
టాటా స్కై బింగే +ను ఎందుకు ఎంచుకోవాలి?
 
 టాటా స్కై యొక్క బింగే + సెట్-టాప్ బాక్స్‌తో పోటీ పడటానికి ఎయిర్‌టెల్ ఇటీవల OTT బండిల్డ్ ఆఫర్‌లతో ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌ను పరిచయం చేసింది. టాటా స్కై బింగే +ను కొత్త వినియోగదారులు రూ.2,999 ధర వద్ద పొందవచ్చు. అయితే దీనితో పాటుగా వినియోగదారులు ఆరు నెలల టాటా స్కై బింగే చందాలను కూడా ఉచితంగా పొందవచ్చు. ఈ డిటిహెచ్ ఆపరేటర్ అందిస్తున్న టాటా స్కై బింగే అనేది ఒక ప్రసిద్ధ సర్వీస్ మరియు ఇది చాలా ప్రత్యేకమైనది కూడా. ఇది నెలకు రూ.299 ధర వద్ద అనేక OTT సబ్స్క్రిప్షన్ లకు ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది
 

టాటా స్కై బింగే + ఉచిత OTT సబ్స్క్రిప్షన్స్ 
 
టాటా స్కై డిటిహెచ్ ఆపరేటర్ తన బింగే సర్వీస్ మీద అందించే ఉచిత OTT చందాలలో డిస్నీ + హాట్‌స్టార్, సోనీలైవ్, ZEE5, వూట్ సెలెక్ట్, క్యూరియాసిటీ స్ట్రీమ్, వూట్ కిడ్స్, ఈరోస్ నౌ, SunNXT, హంగామా ప్లే మరియు షెమరూమీ వంటివి ఉన్నాయి. అలాగే వీటితో పాటుగా మొదటి మూడు నెలలు టాటా స్కై బింగే + వినియోగదారులు అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ను కూడా ఉచితంగా పొందవచ్చు. అలాగే మొదటి మూడు నెలల తరువాత అమెజాన్ ప్రైమ్ యొక్క
చందాను నెలకు రూ.129 ధర వద్ద పొందవచ్చు.


 
టాటా స్కై బింగే +తో అదనంగా రూ.1,800 విలువైన ప్రయోజనాలు
 
 టాటా స్కై బింగే అందించే అన్ని OTT చందాల మొత్తం నెలవారీ ధర 800 రూపాయలకు పైగా ఉంటుంది. టాటా స్కై బింగే సాధారణంగా అమెజాన్ ఫైర్ స్టిక్-టాటా స్కై ఎడిషన్‌తో వస్తుంది. బింగే+ అనేది ఆండ్రాయిడ్ టీవీ- ఆధారిత STB కాబట్టి ఇందులో పైన పేర్కొన్న అన్ని యాప్ లు అన్ని ముందే ప్రీలోడ్ చేయబడి ఉంటాయి. బింగే + కొత్త ఎస్‌టిబి బాక్స్ రూ.2,999 ధర వద్ద లభించినప్పటికి టాటా స్కై బింగే రూపంలో అదనంగా రూ.1,800 విలువైన ప్రయోజనాలను అందిస్తోంది.

Vodafone Idea(Vi) రూ.1,348 కొత్త ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్!! OTT ఉచిత యాక్సిస్ లో ముందంజ...

 

ఇండియాలోని టెలికాం సంస్థలలో ఒకటైన వోడాఫోన్ ఐడియా తన వినియోగదారులకు అధిక ప్రయోజనాలతో ప్రీపెయిడ్ ప్లాన్‌లతో పాటుగా పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను కూడా అందిస్తున్నది. ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లలో వక్తిగత వినియోగదారుల కోసం ఉన్న REDX ప్లాన్ మాదిరిగానే REDX ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను కూడా అందిస్తున్నది. Vi REDX యొక్క రూ. 598, రూ .749 ఫ్యామిలీ ప్లాన్‌ల ధరలను ఇటీవల రూ.649 మరియు రూ.799లకు పెంచింది. ఇప్పుడు కొత్తగా రూ.1348 ధరల వద్ద Vi REDX ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ను విడుదల చేసింది. ఒరిజినల్ REDX ప్లాన్ రూ.1,099 ధర వద్ద లభిస్తుంది. Vi REDX వ్యక్తిగత పోస్ట్‌పెయిడ్ ప్లాన్ మాదిరిగానే Vi REDX ఫ్యామిలీ ప్లాన్ ఒక సంవత్సరం పాటు నెట్‌ఫ్లిక్స్‌కు ఉచిత యాక్సిస్ ను మరియు అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ & ZEE5 ప్రీమియం వంటి ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.
 
Vi REDX రూ.1,348 ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు
 Vi టెలికాం సంస్థ రూ.1,348 ధర వద్ద అందించే REDX కొత్త ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే స్టార్టర్స్ కోసం Vi REDX ఫ్యామిలీ ప్లాన్ నెలకు 150GB క్యాప్ వద్ద అపరిమిత డేటా బెనిఫిట్, అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు 100 SMS ల ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్రయోజనాలు మొదటి కనెక్షన్ కోసం అందుబాటులో ఉన్నాయి. అలాగే రెండవ కనెక్షన్ల కోసం Vi RED ఫ్యామిలీ ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్, 50GB వరకు రోల్‌ఓవర్‌తో 30GB డేటా మరియు 100 SMS ల ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

 
Vi REDX రూ.1,348 ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ యాడ్-ఆన్ కనెక్షన్‌ ప్రయోజనాలు 
 
Vi REDX రూ.1,348 ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ కొత్త ప్లాన్ ఎటువంటి యాడ్-ఆన్ కనెక్షన్‌లను ఉచితంగా అందించడం లేదు. కాబట్టి కస్టమర్ ప్రతి కనెక్షన్‌కు నెలకు రూ.249 చెల్లించి సెకండరీ కనెక్షన్‌లను ఎన్నుకోవలసి ఉంటుంది. Vi REDX ఫ్యామిలీ ప్లాన్ తో ఒక కస్టమర్ అదనంగా నలుగురు ఫ్యామిలీ మెంబెర్స్ ను జోడించడానికి అనుమతిని ఇస్తుంది. జోడించిన తర్వాత ద్వితీయ కనెక్షన్లకు పైన తెలిపిన ప్రయోజనాలు లభిస్తాయి. ఇవి అన్ని కనెక్షన్లలో స్టాండర్డ్ గా ఉంటాయి. వోడాఫోన్ ఐడియా ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌తో అదనపు ఖర్చు లేకుండా కనీసం ఒక సెకండరీ యాడ్-ఆన్ కనెక్షన్‌ను అందించాలి.

 
Vi REDX ఉచిత OTT యాప్ యాక్సిస్ ప్రయోజనాలు
 
 Vi సంస్థ తన కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్ తో 5,988 రూపాయల విలువైన నెట్‌ఫ్లిక్స్ చందాను , ఒక సంవత్సరం అమెజాన్ ప్రైమ్‌ సబ్స్క్రిప్షన్, రూ.999 విలువైన ZEE5 ప్రీమియం సబ్స్క్రిప్షన్ మరియు Vi మూవీస్ & టీవీ యాప్ లకు ఉచిత యాక్సిస్ ఇస్తుంది. అలాగే వినియోగదారులకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా అంతర్జాతీయ మరియు దేశీయ విమానాశ్రయ లాంజ్లకు సంవత్సరానికి నాలుగు సార్లు ఉచిత ప్రవేశం కూడా లభిస్తుంది. ఈ OTT మరియు విమానాశ్రయ లాంజ్ యాక్సెస్‌ను ప్రాధమిక కనెక్షన్ ద్వారా రీడీమ్ చేయవచ్చు.

 



Monday, November 30, 2020

షావోమీ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్..

 

 షావోమీ ఫ్యాన్స్‌కు శుభవార్త. భారీ డిస్కౌంట్స్‌తో బ్లాక్ ఫ్రైడే సేల్ ప్రకటించింది షావోమీ. ఈ సేల్ నవంబర్ 26 నుండి 29 వరకు బ్లాక్ ఫ్రైడే సేల్ కొనసాగుతుంది. ఈ సమయంలో మీరు మీ.కామ్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఆఫ్‌లైన్ స్టోర్ లలో కొనుగోలు చేసే షియోమి ఉత్పత్తుల మీద భారీ డిస్కౌంట్ పొందగలుగుతారు. ఈ సేల్‌లో రూ.699 ధరకే 10,000ఎంఏహెచ్ రెడ్‌మీ పవర్ బ్యాంక్ కొనొచ్చు. ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 4 ధర రూ.1,999 మాత్రమే. ఇలా అనేక ప్రొడక్ట్స్‌పై డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. మరి ఏ ప్రొడక్ట్‌పై ఎంత డిస్కౌంట్ లభిస్తుందో తెలుసుకోండి.

 

 

రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్‌లు

  • రెడ్‌మి 8ఎ డ్యూయల్ స్మార్ట్‌ఫోన్‌ను బేస్ మోడల్‌కు రూ .6,999 వద్ద అందుబాటులో ఉంది. 
  • రెడ్‌మీ 9ఐ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ.9,999 కాగా ఆఫర్ ధర రూ.ఆఫర్ ధర రూ.8,299.
  • రెడ్‌మీ 9 ప్రైమ్ అసలు ధర రూ.11,999 కాగా ఆఫర్ ధర రూ.ఆఫర్ ధర రూ.9,999.
  • రెడ్‌మీ నోట్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ.16,999 కాగా ఆఫర్ ధర రూ.13,999.
  • రెడ్‌మి నోట్ 8‌ అసలు ధర రూ.12,999కాగా, ఆఫర్ ధర రూ.12,999.

రెడ్‌మీ ఇయర్‌బడ్స్

  • ఎంఐ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ 2సీ అసలు ధర రూ.3,499 కాగా ఆఫర్ ధర రూ.2,299.
  • ఎంఐ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ 2 అసలు ధర రూ.5499 కాగా ఆఫర్ ధర రూ.2,999.
  • రెడ్‌మీ ఇయర్‌బడ్స్ ఎస్ బ్లాక్ అసలు ధర రూ.2,399 కాగా ఆఫర్ ధర రూ.1,699.
  • రెడ్‌మీ ఇయర్ బడ్స్ 2సీ అసలు ధర రూ.1,999 కాగా ఆఫర్ ధర రూ.1,299.

రెడ్‌మీ ఇతర ఉత్పత్తులు

  • రెడ్‌మీ 20,000ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ అసలు ధర రూ.1,999 కాగా ఆఫర్ ధర రూ.1,299.
  • రెడ్‌మీ 10,000ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ అసలు ధర రూ.999 కాగా ఆఫర్ ధర రూ.699.
  • ఎంఐ బియర్డ్ ట్రిమ్మర్ 1సీ అసలు ధర రూ.1,199 కాగా ఆఫర్ ధర రూ.899.
  • ఎంఐ బియర్డ్ ట్రిమ్మర్ అసలు ధర రూ.1,499 కాగా, ఆఫర్ ధర రూ.1,299.
  • ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 4 అసలు ధర రూ.2,499 కాగా ఆఫర్ ధర రూ. 1,999.
  • ఎంఐ వాచ్ రివాల్వ్ అసలు ధర రూ.15,999 కాగా ఆఫర్ ధర రూ. 9,999.
  • మెన్స్ స్పోర్ట్స్ షూస్ 2 అసలు ధర రూ.3,999 కాగా ఆఫర్ ధర రూ.2,499.
  • ఎంఐ ఫ్లెక్స్ ఫోన్ గ్రిప్ స్టాండ్ అసలు ధర రూ.199 కాగా ఆఫర్ ధర రూ.99.
  • ఎంఐ టీవీ స్టిక్ అసలు ధర రూ.3,499 కాగా ఆఫర్ ధర రూ.2,499.

 

 

 

 

Saturday, November 28, 2020

GHMC Election ఓటరు కార్డు లేదా.. అయితే ఇవి తెచ్చుకోండి

 గ్రేటర్ హైదరాబాద్ లో డిసెంబర్ 1న జరిగే పోలింగ్‌కు ఓట‌రు గుర్తింపుకార్డు లేకున్నా ప్రత్యామ్నాయ గుర్తింపు డాక్యుమెంట్ల‌ను చూపించి ఓటు వేసే అవ‌కాశం క‌ల్పిస్తున్న‌ట్టు జిల్లా ఎన్నిక‌ల అధికారి డి.ఎస్.లోకేష్ కుమార్ శనివారం తెలిపారు. ఓటు వేయ‌డానికి ముందు పోలింగ్ కేంద్రంలో ప్రతీ ఒక్క ఓటరు గుర్తింపు నిర్థార‌ణ‌కు గాను ఓట‌రు గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ అది లేకపోతే నిర్థార‌ణ‌కు కింద తెలిపిన ప్ర‌త్యామ్నాయ ఫోటో గుర్తింపు కార్డుల‌లో ఏద‌యినా ఒక‌దానిని చూపాలని జిల్లా ఎన్నిక‌ల అధికారి స్ప‌ష్టం చేశారు. కాగా ఓటర్‌ గుర్తింపు కార్డుకు ప్రత్యామ్నాయంగా కింద పేర్కొన్న 18 గుర్తింపు కార్డులు ఓటర్లు తమ వెంట తీసుకురావచ్చు. అవి ఏంటంటే  

1. ఆధార్ కార్డు 2.  పాస్‌పోర్ట్ ‌3. డ్రైవింగ్ లైసెన్స్‌ 4. ఫోటోతో కూడిన‌ స‌ర్వీస్ ఐడెంటిఫైకార్డ్‌ 5. ఫోటోతో కూడిన‌ బ్యాంకు పాస్‌బుక్‌ 6. పాన్ కార్డు7.  ఆర్‌.జి.ఐ, ఎన్‌.పి.ఆర్ స్మార్ట్ కార్డు 8. జాబ్ కార్డు 9. హెల్త్ కార్డు 10. ఫోటోతో కూడిన పింఛ‌న్‌ డాక్యుమెంట్ 11.  ఎం.ఎల్‌.ఏ, ఎం.పి, ఎమ్మెల్సీల‌కు జారీచేసిన అధికారగుర్తింపు ప‌త్రం 12. రేషన్ కార్డు 13. కుల ధృవీక‌ర‌ణ ప‌త్రం 14. ఫ్రీడమ్ ఫైటర్ ఐడెంటిఫై కార్డు 15. ఆర్మ్స్ లైసెన్స్ కార్డు 16. అంగవైకల్యం సర్టిఫికేట్ 17. లోక్ సభ, రాజ్యసభ మెంబర్ ఐడెంటిఫై కార్డు 18. పట్టదారు పాస్ బుక్

Social Media లో ఇలాంటివి పోస్ట్ చేయకండి



 ప్రస్తుతం ప్రపంచ జనాభాలో సగానికి పైగా ఫేస్‌బుక్, ట్విటర్, వాట్సప్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగిస్తున్నారు. అందుకే ఈ సోషల్ మీడియా యుగంలో.. సంతోషమైనా.. విచారమైనా.. విడాకులైనా.. పుట్టుకైనా.. చావైనా.. ఇట్టే ప్రపంచానికి తెలిసిపోవాల్సిందే. చాలా మంది సోషల్ మీడియాలో వారు పెట్టిన పోస్టులకు ఎన్ని లైకులు, కామెంట్లు వచ్చాయి అనే దానిపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. సోషల్ మీడియా ద్వారా మనకు ఎంత మంచి జరుగుతుందో.. అంత కన్నా ఎక్కువే చెడు జరుగుతుంది. సోషల్ మీడియాలో మంచి వార్తల కన్నా నకిలీ వార్తలు ఎక్కువగా ప్రభావం చూపుతున్నాయి. ఇలువంటి పోస్టుల ద్వారా మనకు తెలియకుండానే మనం పెద్ద ప్రమాదంలో పడే అవకాశం ఎక్కువ. ఏదైనా మితంగా వాడితే మంచిది.. లేకపోతె అనేక అనర్దాలకు దారి తీస్తుంది. అందుకే మీరు సోషల్ మీడియా ద్వారా ప్రమాదంలో పడకుండా ఉండటానికి కొన్ని విషయాల గురించి మీకు తెలియజేస్తాము. 

ఇంతకుముందు సోషల్ మీడియాలో వచ్చే పోస్టుల గురించి పెద్దగా పట్టించుకోని ఆయా సంస్థలు.. తాజాగా ఇలా చేసేవారిమీద ఓ కన్నేసి ఉంచుతున్నాయి. అందుకు తగ్గట్టుగా వారి పాలసీలను మార్చుకుంటున్నాయి. ఫేక్ న్యూస్‌ను అరికట్టేందుకు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్, ట్విటర్, వాట్సప్ వంటివి ప్రత్యేక నిఘా టీంలను ఏర్పాటు చేసుకున్నాయి. ఎవరెవరు ఏం పోస్టులు చేస్తున్నారు..? అందులో నిజమెంత..? వంటివన్నీ ఈ బృందాలు పరిశీలిస్తాయి. తరుచూ ఫేక్ న్యూస్ పోస్ట్ చేసేవారి ఖాతాలను బ్లాక్ చేయడం.. వారు ఇంకా అలాగే చేస్తుంటే పోలీసులకు ఫిర్యాదు చేయడం కూడా చేస్తున్నాయి.

మీరు ఎప్పటికి కరోనా వైరస్‌కు సంబంధించిన నకిలీ వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్ చేయవద్దు. ఇవి ఆయా సామాజిక మాధ్యమ సంస్థల విధానాలకు వ్యతిరేకంగా ఉంటే అవి మీ పై కేసు పెట్టవచ్చు. అలాగే ఇతరులు ఫార్వార్డ్ చేసిన నకిలీ సందేశాలను ఫేస్‌బుక్, ట్విటర్, వాట్సప్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేయవద్దు. ఇవి కూడా మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేయొచ్చు. దీని ద్వారా పోలీసులు అదుపులోకి తీసుకోవచ్చు. మీరు పని చేసే సంస్థ యొక్క ఫోటోలను కూడా పోస్ట్ చేయవద్దు. ఇలా చేసిన వారికి నోటీసులు జారీ చేస్తున్నాయి. సంస్థకు సంబంధించిన విషయాలు గానీ.. ఫోటోలు గానీ పోస్టు చేయడాన్ని ఆ సంస్థలు సీరియస్‌గా తీసుకుంటున్నాయి. ఎన్నికలప్పుడు గాని, ఇతర సమావేశాలు నిర్వహించేటప్పుడు రెచ్చగొట్టే పోస్టులు, హింసాత్మక పోస్టులను సోషల్ మీడియాలో పోస్టు చేస్తే అంతే. అలాంటి పోస్టులకు భారీ మూల్యం చెల్లించాల్సిందే. సోషల్ మీడియా సంస్థలే గాక.. పోలీసులు, నిఘా విభాగం, సైబర్ పోలీసులు వీటి మీద నిఘా వేసి ఉంచుతారు.

 

Friday, November 27, 2020

ఈ యాప్‌ను వెంటనే డిలీట్ చేయండి.. Go SMS Pro

 ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ఆండ్రాయిడ్ యాప్ ‘గో ఎస్ఎంఎస్ ప్రో’ యాప్‌ను గూగుల్ తన ప్లే స్టోర్ నుండి తీసివేసింది. ప్లే స్టోర్‌లో ఉన్న హానికరమైన యాప్‌లను గూగుల్ ఎప్పటికప్పుడు తొలగిస్తూ వస్తుంది. తాజగా ఇలాంటి హానికరమైన యాప్ లలో ఒకటైన ‘గో ఎస్ఎంఎస్ ప్రో’ చైనా యాప్ ని తొలగించింది. ఈ యాప్ ఇప్పటివరకు 100 మిలియన్లకు పైగా డౌన్ లోడ్ లను పూర్తీ చేసుకుంది. ‘గో ఎస్ఎంఎస్ ప్రో’ యాప్ వినియోగదారుల యొక్క వ్యక్తిగత డేటా, ఫొటోలు, వీడియోలు, ఇతర ఫైల్‌లతో సహా బహిర్గతమవుతున్నాయి. ఈ యాప్‌ను ఉపయోగిస్తున్న యూజర్ల డేటాకు ప్రమాదం పొంచి ఉందని సింగపూర్‌కు చెందిన ట్రస్ట్‌వేవ్‌లోని భద్రతా పరిశోధకులు ఇటీవల వెల్లడించారు.




"ట్రస్ట్‌వేవ్‌లోని భద్రతా పరిశోధకులు ఆగస్టులో ఈ లోపాన్ని కనుగొన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి 90 రోజుల గడువును కూడా ఇచ్చినట్లు తెలిపారు. అయినప్పటికీ, గో ఎస్ఎంఎస్ ప్రో ఎటువంటి భద్రతా చర్యలను తీసుకోలేదు. అందువల్లనే యూజర్లకు ఇప్పుడు ఈ సమాచారాన్ని చెప్పక తప్పడం లేదని సైబర్ సెక్యూరిటీ సంస్థ ట్రస్ట్ వేవ్ వెల్లడించింది" అని టెక్ క్రంచ్ నివేదిక తెలిపింది. గో ఎస్ఎంఎస్ ప్రో యాప్ ద్వారా యూజర్లు ఇప్పటివరకు పంపిన సమస్త సమాచారం పబ్లిక్‌గా లభిస్తుందని, ఈ సమాచారాన్ని ఒక ఎస్‌ఎమ్ఎస్ ద్వారా పంపిన యూఆర్ఎల్ లింక్‌తో సులభంగా యాక్సెస్ చేయవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఒక డీకోడ్ లింక్ ద్వారా వినియోగదారులు ఇప్పటివరకు పంపుకున్న ఫోన్ నంబర్స్, బ్యాంక్ లావాదేవీ స్క్రీన్ షాట్స్, అరెస్ట్ రికార్డ్, ఇతర సమాచారాన్ని సులభంగా యాక్సెస్ చేయవచ్చని వారు పేర్కొన్నారు. దింతో మీ యొక్క ఫోన్, బ్యాంకు అకౌంట్ హ్యాకింగ్ గురి అయ్యే అవకాశం ఎక్కువ అని ఆందుకోసమే వెంటనే మీ ఫోన్ నుండి ఈ యాప్ ని డిలీట్ చేయాలనీ నిపుణులు తెలుపుతున్నారు. 

Wednesday, November 25, 2020

తాజాగా మరో 43 మొబైల్ యాప్‌లను బ్యాన్ చేసిన భారత ప్రభుత్వం...

 

 

ఇండియా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమాచారం 
 
 ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి అందిన సమగ్ర నివేదికల ఆధారంగా భారతదేశంలోని వినియోగదారులు ఈ యాప్‌లను వాడుతుంటే కనుక వాటి యొక్క యాక్సెస్‌ను వెంటనే నిలిపివేయాలని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.


భారతప్రభుత్వం ప్రజల యొక్క భద్రత దృష్ట్యా గతంలో 59 మొబైల్ యాప్‌లను బ్యాన్ చేసింది. ఇప్పుడు కూడా భారత మొబైల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మరొక 43 మొబైల్ యాప్‌లకు యాక్సెస్‌ను నిరోధించింది. భారతదేశం యొక్క సార్వభౌమాధికారం మరియు సమగ్రత, రక్షణ, రాష్ట్ర భద్రత మరియు పక్షపాత కార్యకలాపాలను కాపాడడానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 69A కింద ఈ యాప్‌లను నిషేదించింది.
 


ఇండియాలో ముందు బ్యాన్ చేసిన యాప్‌ల వివరాలు
 
 ఇండియాలో ఈ సంవత్సరం జూన్ 29 న భారత ప్రభుత్వం 59 చైనా మొబైల్ యాప్‌లకు యాక్సెస్‌ను నిరోధించింది. అలాగే 2020 సెప్టెంబర్ 2 న సమాచార సాంకేతిక చట్టంలోని సెక్షన్ 69A కింద 118 యాప్‌లను పూర్తిగా నిషేధించారు. పౌరుల ప్రయోజనాలు మరియు సార్వభౌమత్వాన్ని మరియు భారతదేశం యొక్క సమగ్రతను రక్షించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది అని నిర్ధారించడానికి ఈ చర్యలను తీసుకున్నట్లు భారత ప్రభుత్వం గతంలో కూడా తెలిపింది.
 
 
భారతదేశంలో కొత్తగా బ్లాక్ చేయబడిన 43 యాప్‌ల జాబితా 
 
 AliSuppliers Mobile App 
 
Alibaba Workbench
 
AliExpress - Smarter Shopping, 
 
Better Living 
 
 Alipay Cashier 
 
 Lalamove India - Delivery App
 
 Drive with Lalamove India 
 
Snack Video 
 
CamCard - Business Card Reader 
 
CamCard - BCR (Western) 
 
Soul- Follow the soul to find you 
 
Chinese Social - Free Online Dating Video App & Chat 
 
 
 Date in Asia - Dating & Chat For Asian Singles
 
 
 WeDate-Dating App
 
 Free dating app-Singol, start your date! 
 
 
Adore App
 
 TrulyChinese - Chinese Dating App 
 
 
TrulyAsian - Asian Dating App 
 
 ChinaLove: dating app for Chinese singles 
 
 
Heroes Evolved
 
 
 Happy Fish
 
 
 
DateMyAge: Chat, Meet,
 
 
 Date Mature Singles Online
 
 AsianDate: find Asian singles 
 
 
 FlirtWish: chat with singles 
 
Guys Only Dating: Gay Chat 
 
 
Tubit: Live Streams 
 
WeWorkChina
 
 First Love Live- super hot live beauties live online 
 
 Rela - Lesbian Social Network 
 
 Cashier Wallet 
 
 MangoTV 
 
MGTV-HunanTV official TV APP
 

 Lucky Live-Live Video Streaming App 
 
 Taobao Live 
 
DingTalk
 
 
 Identity V
 
 Isoland 2: Ashes of Time 
 
BoxStar (Early Access) 
 
 
 Jellipop Match-Decorate your dream island! 
 
Munchkin Match: magic home building
 
 Conquista Online II

 WeTV - TV version
 
 WeTV - Cdrama, Kdrama&More 
 
WeTV Lite
 

 

 

Tuesday, November 24, 2020

Xiaomi నకిలీ ఉత్పత్తులు పట్టివేత!.. రూ.34 లక్షల వరకు విలువ ఉండే అవకాశం

    

 

   ఇండియా యొక్క మార్కెట్లో షియోమి సంస్థకు చెందిన అన్ని రకాల ఉత్పత్తులకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం Mi పేరుతో కొన్ని నకిలీ ఉత్పత్తులు మార్కెట్లో హల్ చల్ చేస్తున్నాయి. వీటి గురించి వినియోగదారులు తెలుసుకోవాలని ఇప్పటికే షియోమి సంస్థ హెచ్చరించింది. స్థానిక పోలీసు స్టేషన్లలో కంపెనీ ఫిర్యాదులు చేసిన తరువాత అక్టోబర్ మరియు నవంబర్ నెలల్లో మార్కెట్లో దాడులు జరిగాయి. ఇప్పుడు కొత్తగా చెన్నైలో మరియు బెంగళూరులో కొంత మంది సరఫరాదారుల నుండి రూ.34 లక్షల విలువైన Mi నకిలీ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు సంస్థ వెల్లడించింది.   


 


 షియోమి నకిలీ ఉత్పత్తులు  

పోలీసుల విచారణలో రెండు నగరాలలో ఈ సరఫరాదారులు ఈ వ్యాపారాన్ని చాలా కాలంగా నిర్వహిస్తున్నారని మరియు మార్కెట్లో ఇప్పటికే చాలా రకాల నకిలీ ఉత్పత్తులను విక్రయించినట్లు కనుగొనబడింది. నకిలీ ఉత్పత్తుల కొనుగోలుతో కస్టమర్ అనుభవాన్ని దిగజార్చడమే కాకుండా వినియోగదారుల ఆరోగ్యానికి మరియు భద్రతకు పెద్ద ముప్పు ఉండే అవకాశం కూడా ఉంది. అలాగే వినియోగదారుల యొక్క గోప్యత మరియు డేటా భద్రతకు కూడా హాని కలిగించే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో ఇవి మరింత ప్రమాదకరంగా కూడా ఉండే అవకాశం ఉంది

 

 షియోమి నకిలీ ఉత్పత్తుల మొత్తం విలువ 

 

ఇటీవల చెన్నై మరియు బెంగళూరులో జరిగిన పోలీసుల దాడులలో మొబైల్ బ్యాక్ కేసులు, హెడ్‌ఫోన్లు, పవర్ బ్యాంకులు, ఛార్జర్లు మరియు ఇయర్‌ఫోన్‌లతో కూడిన 3 వేలకు పైగా నకిలీ ఉత్పత్తులు దొరికాయని షియోమి ఇండియా పత్రిక సమావేశంలో తెలిపింది. వీటి యొక్క విలువలు వరుసగా 24.9 లక్షల రూపాయలు, రూ .8.4 లక్షల విలువ కలిగి ఉన్నట్లు Mi ఇండియా తెలిపింది. Mi యొక్క ఈ నకిలీ ఉత్పత్తులను విక్రయించినందుకు రెండు నగరాలలోని దుకాణ యజమానులను అరెస్టు చేసినట్లు కంపెనీ తెలిపింది.



 షియోమి ఇండియా టాస్క్‌ఫోర్స్‌ 

షియోమి ఇండియా నకిలీ ఉత్పత్తులను కనుగొనడానికి ఇండియాలో ఒక ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను కూడా కొత్తగా సృష్టించింది. ఇది ఇండియా యొక్క మార్కెట్‌ను నిరంతరం పర్యవేక్షించడానికి మరియు నకిలీ ఉత్పత్తుల తయారీ సంస్థలకు వ్యతిరేకంగా పనిచేయడానికి బాధ్యత వహిస్తుంది. బ్రాండ్ మరియు భాగస్వామి అవుట్లెట్ల యొక్క అధీకృత దుకాణాల నుండి మాత్రమే "నిజమైన" ఉత్పత్తులను కొనుగోలు చేయాలని కంపెనీ వినియోగదారులకు సూచించింది.


 షియోమి నకిలీ ఉత్పత్తులు

 

పోలీసుల విచారణలో రెండు నగరాలలో ఈ సరఫరాదారులు ఈ వ్యాపారాన్ని చాలా కాలంగా నిర్వహిస్తున్నారని మరియు మార్కెట్లో ఇప్పటికే చాలా రకాల నకిలీ ఉత్పత్తులను విక్రయించినట్లు కనుగొనబడింది. నకిలీ ఉత్పత్తుల కొనుగోలుతో కస్టమర్ అనుభవాన్ని దిగజార్చడమే కాకుండా వినియోగదారుల ఆరోగ్యానికి మరియు భద్రతకు పెద్ద ముప్పు ఉండే అవకాశం కూడా ఉంది. అలాగే వినియోగదారుల యొక్క గోప్యత మరియు డేటా భద్రతకు కూడా హాని కలిగించే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో ఇవి మరింత ప్రమాదకరంగా కూడా ఉండే అవకాశం ఉంది.

Monday, November 23, 2020

మైక్రోసాఫ్ట్ టీమ్స్ కుటుంబ సభ్యులకు వీడియో కాల్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించింది.

 

మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఇప్పుడు తన వినియోగదారులకు డెస్క్ టాప్, వెబ్ యాప్స్ లో టీమ్స్ నుంచి స్నేహితులు, కుటుంబ సభ్యులకు వీడియో కాల్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించింది. ఈ ఏడాది ప్రారంభంలోనే మైక్రోసాఫ్ట్.. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్స్ కి ఈ ఫీచర్ ని తీసుకొచ్చింది. "మైక్రోసాఫ్ట్ టీమ్స్ యూజర్స్ తమ వ్యక్తి గత ఖాతాల ద్వారా టీమ్స్ డెస్క్ టాప్ లేదా వెబ్ యాప్ లో మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో వీడియో కాలింగ్ లేదా చాటింగ్ చేసుకోవడానికి" ఈ ఫీచర్ ని తీసుకొచ్చినట్లు మైక్రోసాఫ్ట్ 365 ప్రొడక్ట్ మార్కెటింగ్ మేనేజర్ అర్జున్ తోమర్ తెలిపారు. గ్రూప్ చాట్, వీడియో కాలింగ్.. ఇప్పుడు డెస్క్ టాప్, మొబైల్ రెండింటిలోనూ అందుబాటులో ఉన్నందున మీకిష్టమైనవారితో కనెక్ట్ అవ్వడం, నిర్వహించడం గతంలో కంటే సులభతరమవుతుందని, ముఖ్యంగా సెలవులప్పుడు ఉపయోగించుకోవచ్చని ఆయన  ఒక బ్లాగ్ లో పోస్ట్ చేశారు.

Sunday, November 22, 2020

రూ.19కే అన్‌లిమిటెడ్ కాల్స్ : ఎయిర్‌టెల్ AirTel

 

తక్కువ ధరకే ఎక్కువ ప్రయోజనాలు ఉండేలా ప్లాన్‌ను ఎంచుకుంటాం. జియో వచ్చినప్పటి నుండి మార్కెట్లో తీవ్ర పోటీ ఉన్న కారణంగా అన్నీ కంపెనీలు తక్కువ ధరకే ప్లాన్లను తీసుకొస్తున్నాయి. తాజాగా ఎయిర్టెల్ కూడా తమ కస్టమర్లకు మరింత దగ్గరయ్యేందుకు అత్యంత చౌకైన రూ. 19 ప్లాన్ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్లో కాలింగ్‌తో పాటు డేటా సదుపాయాన్ని కల్పిస్తుంది.

 

ట్రూలీ అన్‌లిమిటెడ్ క్యాటరిగీ కింద ఈ 19 రూపాయల ప్లాన్‌ను తీసుకొచ్చింది ఎయిర్‌టెల్. ఈ ప్లాన్లో మీకు అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయం లభిస్తుంది. ఎవరైతే ఎక్కువగా ఫోన్లో మాట్లాడుతారో వారికీ ఎక్కువగా ఇది ఉపయోగ పడుతుంది. దీనిలో ఉచిత కాలింగ్ తో పాటు మీకు డేటా కూడా లభిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా మీకు 200 ఎంబి డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ లో మీకు ఎటువంటి ఉచిత ఎస్‌ఎంఎస్‌లు లభించవు. దీని యొక్క కాలపరిమితి 2 రోజులు మాత్రమే.

 

ప్లేస్టోర్ నుంచి నాలుగు యాప్స్ డిలీట్ చేసిన గూగుల్ నాలుగు రుణాలిచ్చే యాప్స్‌ను తొలగించింది. అధిక వడ్డీలను వసూలు చేస్తున్నందున ఈ నిర్ణయం

 

1. ఓకే క్యాష్
ఈ యాప్ రూ.3,000 నుంచి రూ.లక్ష వరకు రుణాన్ని ఆఫర్ చేస్తుంది. 91 రోజుల నుంచి 365 రోజుల కాలవ్యవధిలో ఈ రుణాలను తీర్చవచ్చు. వినియోగదారుల క్రెడిట్ ప్రొఫైల్, తీసుకునే నగదును బట్టి వడ్డీ రేటు మారుతూ ఉంటుంది.

2. గో క్యాష్
ఈ యాప్ కూడా ఓకే క్యాష్ తరహాలోనే రూ.3,000 నుంచి రూ.లక్ష వరకు రుణాన్ని ఆఫర్ చేస్తుంది. తిరిగి చెల్లించే వ్యవధి కూడా అదే రేంజ్‌లో ఉండనుంది. అంటే 91 రోజుల నుంచి 365 రోజుల వరకు అన్న మాట.

3. ఫ్లిప్ క్యాష్
ఈ యాప్ డిస్క్రిప్షన్ ప్రకారం భారతదేశ వినియోగదారులకు వారి అవసరాలకు తగ్గట్లుగా వ్యక్తిగత రుణాలను అందిస్తుంది. వినియోగదారులకు వారి అన్ని ఆర్థిక అవసరాలకు తగ్గట్లుగా లోన్స్ ఇస్తామని వీరు అంటున్నారు.

4. స్నాప్ ఇట్ లోన్
ఇది కూడా వ్యక్తిగత రుణాలను అందించే యాపే. వ్యక్తిగత రుణాలను తీసుకోవడానికి కొత్త దారిని వినియోగదారులకు చూపిస్తామని ఈ యాప్ డిస్క్రిప్షన్‌లో పేర్కొన్నారు.

 

వినియోగదారుల అవసరాలను ఆసరాగా చేసుకుని అత్యధిక వడ్డీ రేట్లను వసూలు చేసే యాప్స్ ఎన్నో ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు ఆన్ లైన్ యాప్స్‌లో రుణాలను తీసుకోకుండా ఉండటమే బెస్ట్. ఒకవేళ తీసుకోవడం తప్పకపోతే తక్కువ వడ్డీ రేట్లను అందించే యాప్స్‌ను ఎంచుకోవడం మంచిది.

 

2020లో ఎక్కువగా ఉపయోగించిన మొదటి ఇరవై పాస్‌వర్డ్‌లు

 2020లో ఎక్కువగా ఉపయోగించిన మొదటి ఇరవై పాస్‌వర్డ్‌లు: '123456', '123456789', 'పిక్చర్ 1', 'పాస్‌వర్డ్... '12345678', '111111', '123123', '12345', '1234567890 ',' సెన్హా ',' 1234567 ',' qwerty ',' abc123 ' Million2 ',' 000000 ',' 1234 ',' iloveyou ',' aaron431 ',' password1', qqww1122 '...

  సాధారణంగా చాలామందికి పాస్‌వార్డులు గుర్తుపెట్టుకోవడం మర్చిపోతుంటారు, మరికొందరైతే జి‌-మెయిల్, ఫేస్ బుక్ ఇలా వివిధ సోషల్ నెట్వర్క్ పాస్‌వార్డులు వై-ఫై  పాస్‌వార్డులు గుర్తుపెట్టుకోవడం ఒకోసారి కష్టంగ ఉంటుంది.

బ్యాంకు ఖాతాలు, పేమెంట్‌ బ్యాంకులు,  స్మార్ట్‌ఫోన్‌ పాస్‌వర్డ్‌, యాప్ లాక్ వీటితో  పాటు సోషల్‌ మీడియా అకౌంట్లు వీటన్నింటికి సంబంధించిన యూజర్‌నేమ్స్‌, పాస్‌వర్డ్‌లను గుర్తుపెట్టుకోవడమంటే ఒకోసారి కష్టంగ మారుతుంది.

 అందుకే సులభంగా గుర్తుండేల నంబర్లు లాంటివి లేదంటే పుట్టిన రోజు తేదీలను  పాస్‌వర్డ్‌లుగా పెట్టుకుంటుంటాము. అయితే ఇక్కడే హ్యాకర్లకు దొరికిపోతామని  టెక్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 ‘123456' అనే పాస్‌వార్డు 2020లో ఎక్కువగా ఉపయోగించిన పాస్‌వర్డ్, దీనిని 23 మిలియన్లకు పైగా బ్రేక్ చేసినట్లు పాస్‌వర్డ్ మేనేజర్ నార్డ్‌పాస్ వార్షిక నివేదిక వెల్లడించింది. ఈ పాస్‌వార్డుని మిలియన్ల మంది ప్రజలు ఉపయోగించినట్లు నివేదించింది. అంతేకాదు ఈ పాస్‌వార్డు బ్రేక్ చేయడానికి సెకను కన్నా తక్కువ సమయం పడుతుంది.

 ఈ సంవత్సరంలో 200 చెత్త పాస్‌వర్డ్‌లు, అవి ఎన్నిసార్లు బహిర్గతమయ్యాయో, ఉపయోగించబడ్డాయో, వాటిని బ్రేక్ చేయడానికి ఎంత సమయం పడుతుందో వివరించింది. ‘123456789 'రెండవ స్థానంలో ఉండగా,‘ పిక్చర్ 1 ’మూడవ స్థానంలో నిలిచింది



2015లో ఒక సాఫ్ట్‌వేర్ సంస్థ ఇచ్చిన నివేదికలో చెత్త పాస్‌వర్డ్‌ల జాబితాలో ‘123456’ అగ్రస్థానంలో ఉందని, ఆ తర్వాత ‘password ’ అనేది ఉందని వెల్లడించింది. ఐదు సంవత్సరాల తరువాత కూడా పెద్దగా మారలేదు.

ఇప్పటికీ ‘123456 'సాధారణంగా ఉపయోగించే పాస్‌వర్డ్‌గా ఉందని నార్డ్‌పాస్ నివేదిక వెల్లడించింది. ‘password ’ అనేది నాల్గవ స్థానంలో ఉందని తెలిపింది.

నార్డ్‌పాస్ పరిశోధన మనకు తెలిసిన వాటిని ధృవీకరిస్తుంది: ప్రజలు సింపుల్ గా, సులభంగా గుర్తుంచుకోగల పాస్‌వర్డ్‌లను ఉపయోగిస్తారు ఎందుకంటే ఇది అవి గుర్తుపెట్టుకోవడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. మర్చిపోలేని పాస్‌వర్డ్‌లు కూడా ఎక్కువగా క్రాక్ గురవుతాయి అని పరిశోధనలో చూపిస్తుంది.


అయితే నివేదిక ప్రకారం వీటిని క్రాక్ చేయడానికి సెకను కన్నా తక్కువ సమయం పడుతుంది అని తెలిపింది

క్యాటగిరిల ప్రకారం సాధారణంగా ఉపయోగించే పాస్‌వర్డ్‌లు కూడా బయటపడ్డాయి. 90,000 మంది వినియోగదారులతో ఈ సంవత్సరం పాస్‌వర్డ్‌లలో ఎక్కువగా ఉపయోగించే పేరు ‘ఆరోన్ 431’, అలాగే 21,409 మంది వినియోగదారులతో 'చాక్లెట్' ఎక్కువగా ఉపయోగించే ఆహార పేరు.

37,000 మందికి పైగా వినియోగదారులు వారి పాస్‌వర్డ్‌లలో ‘పోకీమాన్’ ఉపయోగిస్తున్నారు, ఇది సాధారణంగా ఉపయోగించే ఎంటర్టైన్మెంట్ పదంగా మారింది. మరో సాధారణంగా ఉపయోగించే పాస్‌వర్డ్‌ల జాబితాలో ‘ఐ లవ్ యు’ 17 వ స్థానంలో, పాజిటివ్ పదాల విభాగంలో మొదటి స్థానంలో ఉంది, సుమారు ఒక మిలియన్‌ మందికి పైగా వినియోగదారులు ఈ పదాన్ని పాస్‌వర్డ్‌గా వాడుతున్నారు.








Bigg Boss 11th week :మోనాల్ సేఫ్.. ఈ వారం ఎగ్జిట్ అయ్యేది ఎవరు..?

  బిగ్‌బాస్ తెలుగు -4 సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. హౌజ్‌లో ఈ వారంలో కంటెస్టెంట్ల సొంతవారు ఎంటర్ అవడంతో కాస్త భావోద్వేగ సన్నివేశాలు కనిపించాయి. ఇక 76 ఎపిసోడ్‌లు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ రియాలిటీ షో... గ్రాండ్ ఫినాలే వైపు దూసుకెళుతోంది. డిసెంబర్ 20వ తేదీన గ్రాండ్ ఫినాలే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక 8 మంది మాత్రమే ఇప్పుడు మిగిలి ఉన్నారు. అయితే హౌజ్‌లో కంటెస్టెంట్లు కూడా చాలా స్ట్రాంగ్‌గా తయారవుతున్నారు.

చివరి మూడు స్థానాల్లో ఉన్నది వీరే...

బిగ్‌బాస్ తెలుగు రియాల్టీ షోలో ఎలిమినేషన్ వీక్ వచ్చేసింది. 11వ వారంలో ఈ సారి ఎవరు ఎలిమినేట్ అవుతారా అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. ఇక ఈ సారి ఎలిమినేషన్‌కు నామినేట్ అయిన వారిలో అభిజీత్, అరియానా, మోనాల్, హారిక, సోహెయిల్, లాస్యలు ఉన్నారు. వీరిలో ఓటింగ్ పరంగా చూస్తూ చివరి మూడు స్థానాల్లో మోనాల్, లాస్య, అరియానాలు ఉన్నారు. ఇక మోనాల్ ఎలిమినేట్ అవుతుందా అంటే... అంత ఛాన్స్ లేదని నెటిజెన్లు చెబుతున్నారు. మోనాల్‌ను ఎలిమినేట్ చేసే ధైర్యం బిగ్‌బాస్ నిర్వాహకులు చేయరని సమాచారం.

అరియానా ఓవరాక్షన్.. లాస్య సేఫ్ గేమ్

ఇక హారికా కెప్టెన్సీ రేసుకు మోనాల్ మద్దతుగా నిలవడంతో చాలామంది ప్రేక్షకులు ఈ ఉత్తరాది భామను అభినందించారు. అంతేకాదు మోనాల్ ఆటను మరింత బలంగా ఆడాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలోనే ప్రేక్షకులు కూడా మోనాల్‌కు బాగానే ఓట్లు వేసినట్లు సమాచారం. లాస్య అరియానాలు.. ఓటింగ్‌లో మోనాల్ తర్వాతే ఉన్నట్లు సమాచారం. ఇక బిగ్‌బాస్ హౌజ్‌లో అరియానా చేస్తున్న రచ్చతో ప్రేక్షకులు ఒక్కింత విసుగెత్తి పోయినట్లు తెలుస్తోంది. అరియానా ఇంట్లో గట్టిగా కేకలు పెట్టడం, ఓవరాక్షన్ చేయడం వంటివి చూసి ఇదేం తలనొప్పిరా నాయనా అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్లు పోస్టింగులు పెడుతున్నారు. ఇక లాస్య విషయానికొస్తే... ఈ రెడ్డి వారి అమ్మాయి తనకు ఇచ్చిన టాస్కును పూర్తిచేయలేక చేతులెత్తేస్తోందన్న అభిప్రాయం నెలకొంది. అంతేకాదు యాక్టివ్‌గా కూడా కనిపించడం లేదని అదే సమయంలో బిగ్‌బాస్ హౌజ్‌లో ఒక్క వంటగదికి మాత్రమే పరిమితమై సేఫ్ గేమ్ ఆడుతోందన్న అభిప్రాయం ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు.

 

 

Thursday, November 19, 2020

టాప్ 4 పవర్ బ్యాంక్‌లపై డిస్కౌంట్స్

 

 

ఫీచర్స్, బ్యాకప్ పరంగా బెటర్‌గా ఉంటూ ఇండియాలో లభిస్తున్న టాప్ 4 పవర్ బ్యాంక్‌లపై డిస్కౌంట్స్

టాప్ 1: Mi Power Bank 3i 20000mAh (Sandstone Black) Triple Output and Dual Input Port | 18W Fast Charging | Power Delivery అసలు ధర, 2,199, డిస్కౌంట్‌తో కేవలం 1,399 మాత్రమే.. https://amzn.to/2UhiG0W

టాప్ 2: Realme 10000 mAh Power Bank (Quick Charge 2.0, Quick Charge 3.0) (Black, Lithium Polymer) @ Rs. 1,299 https://amzn.to/3ko1GjT

టాప్ 3: Redmi 20000mAh Li-Polymer Power Bank (Black), USB Type C and Micro USB Ports | 18W Fast Charging అసలు ధర 1,999 కాగా ప్రస్తుతం కేవలం 1,299కే.. https://amzn.to/2Ue4cPp

టాప్ 4: Ambrane 27000mAh Li-Polymer Powerbank with Type C and USB Ports | Fast Charging for Smartphones, Smart Watches, Neckbands & Other Devices (PP-30 Pro, Black) అసలు ధర 3,499 కాగా ప్రస్తుతం కేవలం 1,499 మాత్రమే.. https://amzn.to/2IgC23X

 

 

 

 https://t.me/allinone_dvr/34