మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఇప్పుడు తన వినియోగదారులకు డెస్క్ టాప్, వెబ్ యాప్స్
లో టీమ్స్ నుంచి స్నేహితులు, కుటుంబ సభ్యులకు వీడియో కాల్ చేసుకునే
సౌలభ్యాన్ని కల్పించింది. ఈ ఏడాది ప్రారంభంలోనే మైక్రోసాఫ్ట్.. ఆండ్రాయిడ్,
ఐఓఎస్ యూజర్స్ కి ఈ ఫీచర్ ని తీసుకొచ్చింది. "మైక్రోసాఫ్ట్ టీమ్స్ యూజర్స్
తమ వ్యక్తి గత ఖాతాల ద్వారా టీమ్స్ డెస్క్ టాప్ లేదా వెబ్ యాప్ లో మీ
స్నేహితులు, కుటుంబ సభ్యులతో వీడియో కాలింగ్ లేదా చాటింగ్ చేసుకోవడానికి" ఈ
ఫీచర్ ని తీసుకొచ్చినట్లు మైక్రోసాఫ్ట్ 365 ప్రొడక్ట్ మార్కెటింగ్ మేనేజర్
అర్జున్ తోమర్ తెలిపారు. గ్రూప్ చాట్, వీడియో కాలింగ్.. ఇప్పుడు డెస్క్
టాప్, మొబైల్ రెండింటిలోనూ అందుబాటులో ఉన్నందున మీకిష్టమైనవారితో కనెక్ట్
అవ్వడం, నిర్వహించడం గతంలో కంటే సులభతరమవుతుందని, ముఖ్యంగా సెలవులప్పుడు
ఉపయోగించుకోవచ్చని ఆయన ఒక బ్లాగ్ లో పోస్ట్ చేశారు.