ఇండియాలోని టెలికాం సంస్థలలో ఒకటైన వోడాఫోన్ ఐడియా తన వినియోగదారులకు
అధిక ప్రయోజనాలతో ప్రీపెయిడ్ ప్లాన్‌లతో పాటుగా పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను
కూడా అందిస్తున్నది. ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లలో వక్తిగత వినియోగదారుల కోసం
ఉన్న REDX ప్లాన్ మాదిరిగానే REDX ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను కూడా
అందిస్తున్నది. Vi REDX యొక్క రూ. 598, రూ .749 ఫ్యామిలీ ప్లాన్‌ల ధరలను
ఇటీవల రూ.649 మరియు రూ.799లకు పెంచింది. ఇప్పుడు కొత్తగా రూ.1348 ధరల వద్ద
Vi REDX ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ను విడుదల చేసింది. ఒరిజినల్ REDX
ప్లాన్ రూ.1,099 ధర వద్ద లభిస్తుంది. Vi REDX వ్యక్తిగత పోస్ట్‌పెయిడ్
ప్లాన్ మాదిరిగానే Vi REDX ఫ్యామిలీ ప్లాన్ ఒక సంవత్సరం పాటు
నెట్‌ఫ్లిక్స్‌కు ఉచిత యాక్సిస్ ను మరియు అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్
& ZEE5 ప్రీమియం వంటి ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది. వీటి గురించి
మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.
Vi REDX రూ.1,348 ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు
Vi టెలికాం సంస్థ రూ.1,348 ధర వద్ద అందించే REDX కొత్త ఫ్యామిలీ
పోస్ట్‌పెయిడ్ ప్లాన్ యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే స్టార్టర్స్ కోసం Vi
REDX ఫ్యామిలీ ప్లాన్ నెలకు 150GB క్యాప్ వద్ద అపరిమిత డేటా బెనిఫిట్,
అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు 100 SMS ల ప్రయోజనాలను
అందిస్తుంది. ఈ ప్రయోజనాలు మొదటి కనెక్షన్ కోసం అందుబాటులో ఉన్నాయి. అలాగే
రెండవ కనెక్షన్ల కోసం Vi RED ఫ్యామిలీ ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్, 50GB
వరకు రోల్‌ఓవర్‌తో 30GB డేటా మరియు 100 SMS ల ప్రయోజనాలను కూడా
అందిస్తుంది.
Vi REDX రూ.1,348 ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ యాడ్-ఆన్ కనెక్షన్
ప్రయోజనాలు
Vi REDX రూ.1,348 ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ కొత్త ప్లాన్ ఎటువంటి యాడ్-ఆన్
కనెక్షన్‌లను ఉచితంగా అందించడం లేదు. కాబట్టి కస్టమర్ ప్రతి కనెక్షన్‌కు
నెలకు రూ.249 చెల్లించి సెకండరీ కనెక్షన్‌లను ఎన్నుకోవలసి ఉంటుంది. Vi REDX
ఫ్యామిలీ ప్లాన్ తో ఒక కస్టమర్ అదనంగా నలుగురు ఫ్యామిలీ మెంబెర్స్ ను
జోడించడానికి అనుమతిని ఇస్తుంది. జోడించిన తర్వాత ద్వితీయ కనెక్షన్లకు పైన
తెలిపిన ప్రయోజనాలు లభిస్తాయి. ఇవి అన్ని కనెక్షన్లలో స్టాండర్డ్ గా
ఉంటాయి. వోడాఫోన్ ఐడియా ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌తో అదనపు ఖర్చు లేకుండా
కనీసం ఒక సెకండరీ యాడ్-ఆన్ కనెక్షన్‌ను అందించాలి.
Vi REDX ఉచిత OTT యాప్ యాక్సిస్ ప్రయోజనాలు
Vi సంస్థ తన కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్ తో 5,988 రూపాయల విలువైన
నెట్‌ఫ్లిక్స్ చందాను , ఒక సంవత్సరం అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్,
రూ.999 విలువైన ZEE5 ప్రీమియం సబ్స్క్రిప్షన్ మరియు Vi మూవీస్ & టీవీ
యాప్ లకు ఉచిత యాక్సిస్ ఇస్తుంది. అలాగే వినియోగదారులకు ఎటువంటి అదనపు
ఖర్చు లేకుండా అంతర్జాతీయ మరియు దేశీయ విమానాశ్రయ లాంజ్లకు సంవత్సరానికి
నాలుగు సార్లు ఉచిత ప్రవేశం కూడా లభిస్తుంది. ఈ OTT మరియు విమానాశ్రయ లాంజ్
యాక్సెస్‌ను ప్రాధమిక కనెక్షన్ ద్వారా రీడీమ్ చేయవచ్చు.