ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ఆండ్రాయిడ్ యాప్ ‘గో ఎస్ఎంఎస్ ప్రో’ యాప్‌ను గూగుల్ తన ప్లే స్టోర్ నుండి తీసివేసింది. ప్లే స్టోర్‌లో ఉన్న హానికరమైన యాప్‌లను గూగుల్ ఎప్పటికప్పుడు తొలగిస్తూ వస్తుంది. తాజగా ఇలాంటి హానికరమైన యాప్ లలో ఒకటైన ‘గో ఎస్ఎంఎస్ ప్రో’ చైనా యాప్ ని తొలగించింది. ఈ యాప్ ఇప్పటివరకు 100 మిలియన్లకు పైగా డౌన్ లోడ్ లను పూర్తీ చేసుకుంది. ‘గో ఎస్ఎంఎస్ ప్రో’ యాప్ వినియోగదారుల యొక్క వ్యక్తిగత డేటా, ఫొటోలు, వీడియోలు, ఇతర ఫైల్‌లతో సహా బహిర్గతమవుతున్నాయి. ఈ యాప్‌ను ఉపయోగిస్తున్న యూజర్ల డేటాకు ప్రమాదం పొంచి ఉందని సింగపూర్‌కు చెందిన ట్రస్ట్‌వేవ్‌లోని భద్రతా పరిశోధకులు ఇటీవల వెల్లడించారు.
"ట్రస్ట్‌వేవ్‌లోని భద్రతా పరిశోధకులు ఆగస్టులో ఈ లోపాన్ని కనుగొన్నారు. ఈ
సమస్యను పరిష్కరించడానికి 90 రోజుల గడువును కూడా ఇచ్చినట్లు తెలిపారు.
అయినప్పటికీ, గో ఎస్ఎంఎస్ ప్రో ఎటువంటి భద్రతా చర్యలను తీసుకోలేదు.
అందువల్లనే యూజర్లకు ఇప్పుడు ఈ సమాచారాన్ని చెప్పక తప్పడం లేదని సైబర్
సెక్యూరిటీ సంస్థ ట్రస్ట్ వేవ్ వెల్లడించింది" అని టెక్ క్రంచ్ నివేదిక
తెలిపింది. గో ఎస్ఎంఎస్ ప్రో యాప్ ద్వారా యూజర్లు ఇప్పటివరకు పంపిన సమస్త
సమాచారం పబ్లిక్‌గా లభిస్తుందని, ఈ సమాచారాన్ని ఒక ఎస్‌ఎమ్ఎస్ ద్వారా
పంపిన యూఆర్ఎల్ లింక్‌తో సులభంగా యాక్సెస్ చేయవచ్చని నిపుణులు
పేర్కొంటున్నారు. ఒక డీకోడ్ లింక్ ద్వారా వినియోగదారులు ఇప్పటివరకు
పంపుకున్న ఫోన్ నంబర్స్, బ్యాంక్ లావాదేవీ స్క్రీన్ షాట్స్, అరెస్ట్
రికార్డ్, ఇతర సమాచారాన్ని సులభంగా యాక్సెస్ చేయవచ్చని వారు పేర్కొన్నారు.
దింతో మీ యొక్క ఫోన్, బ్యాంకు అకౌంట్ హ్యాకింగ్ గురి అయ్యే అవకాశం ఎక్కువ
అని ఆందుకోసమే వెంటనే మీ ఫోన్ నుండి ఈ యాప్ ని డిలీట్ చేయాలనీ నిపుణులు
తెలుపుతున్నారు.