ఐసీఐసీఐ బ్యాంకు తమ మొబైల్ పే యాప్‌లో కీలక మార్పు చేసింది. ఇతర బ్యాంకుల కస్టమర్లకు కూడా తమ ఐమొబైల్ పే ద్వారా సేవలు అందిస్తామని తెలిపింది. ఇప్పటివరకు ఈ యాప్ ‘Imobile’ పేరుతో అందుబాటులో ఉంది. కొత్తగా తీసుకువచ్చిన మార్పులకు అనుగుణంగా దీనిని I mobile Payగా మార్చారు. ఈ యాప్ ద్వారా ఇతర బ్యాంకుల వినియోగదారులు తమ సొంత UPI IDని నమోదు చేసుకొని, దాంతో అనుసంధానించిన బ్యాంక్ అకౌంట్‌తో లావాదేవీలు చేసుకోవచ్చు.
ఇలాంటి యాప్ రావడం ఇదే మొదటిసారని ఐసీఐసీఐ తెలిపింది. కస్టమర్లు తమ కాంటాక్టులకు సంబంధించిన యూపీఐ ఐడీలను ఎక్కువకాలం గుర్తుంచుకోనవసరం లేకుండా ఇంటర్ఆపరబిలిటీని అందిస్తున్నామని తెలిపింది. దీంతో సులభంగా పేమెంట్ యాప్స్, వాలెట్లకు మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చని పేర్కోంది.
“సరికొత్త ఆవిష్కరణలు చేయడం, వాటిని అమలుపరచడంలో మేమెప్పుడూ ముందుంటాం. 2008లో దేశంలోనే మొదటిసారిగా బ్యాంకింగ్ యాప్‌ను పరిచయం చేశాం. ఇప్పుడు విడుదల చేసిన కొత్త వెర్షన్‌తో ఇతర బ్యాంకులకు చెందిన కస్టమర్లు కూడా వారు బ్యాంకు అకౌంట్లను ఇందులో లింక్ చేసుకోవచ్చు” అని ఐసీఐసీఐ బ్యాంక్ ఓ ప్రకటనలో తెలిపింది.