Sunday, November 22, 2020

ప్లేస్టోర్ నుంచి నాలుగు యాప్స్ డిలీట్ చేసిన గూగుల్ నాలుగు రుణాలిచ్చే యాప్స్‌ను తొలగించింది. అధిక వడ్డీలను వసూలు చేస్తున్నందున ఈ నిర్ణయం

 

1. ఓకే క్యాష్
ఈ యాప్ రూ.3,000 నుంచి రూ.లక్ష వరకు రుణాన్ని ఆఫర్ చేస్తుంది. 91 రోజుల నుంచి 365 రోజుల కాలవ్యవధిలో ఈ రుణాలను తీర్చవచ్చు. వినియోగదారుల క్రెడిట్ ప్రొఫైల్, తీసుకునే నగదును బట్టి వడ్డీ రేటు మారుతూ ఉంటుంది.

2. గో క్యాష్
ఈ యాప్ కూడా ఓకే క్యాష్ తరహాలోనే రూ.3,000 నుంచి రూ.లక్ష వరకు రుణాన్ని ఆఫర్ చేస్తుంది. తిరిగి చెల్లించే వ్యవధి కూడా అదే రేంజ్‌లో ఉండనుంది. అంటే 91 రోజుల నుంచి 365 రోజుల వరకు అన్న మాట.

3. ఫ్లిప్ క్యాష్
ఈ యాప్ డిస్క్రిప్షన్ ప్రకారం భారతదేశ వినియోగదారులకు వారి అవసరాలకు తగ్గట్లుగా వ్యక్తిగత రుణాలను అందిస్తుంది. వినియోగదారులకు వారి అన్ని ఆర్థిక అవసరాలకు తగ్గట్లుగా లోన్స్ ఇస్తామని వీరు అంటున్నారు.

4. స్నాప్ ఇట్ లోన్
ఇది కూడా వ్యక్తిగత రుణాలను అందించే యాపే. వ్యక్తిగత రుణాలను తీసుకోవడానికి కొత్త దారిని వినియోగదారులకు చూపిస్తామని ఈ యాప్ డిస్క్రిప్షన్‌లో పేర్కొన్నారు.

 

వినియోగదారుల అవసరాలను ఆసరాగా చేసుకుని అత్యధిక వడ్డీ రేట్లను వసూలు చేసే యాప్స్ ఎన్నో ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు ఆన్ లైన్ యాప్స్‌లో రుణాలను తీసుకోకుండా ఉండటమే బెస్ట్. ఒకవేళ తీసుకోవడం తప్పకపోతే తక్కువ వడ్డీ రేట్లను అందించే యాప్స్‌ను ఎంచుకోవడం మంచిది.