Monday, September 30, 2024

కాసేపట్లో 𝐃𝐒𝐂 ఫలితాలు విడుదల: 30-09-2024 -11:00am

 



కాసేపట్లో 𝐃𝐒𝐂 ఫలితాలు విడుదల
తెలంగాణ: టీచర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన DSC పరీక్ష ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. సచివాలయంలో ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేస్తారు. 11,062 పోస్టుల భర్తీకి జులై 18 నుంచి ఆగస్ట్ 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.



 *ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో ఎస్జీటీ పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా అభ్యర్థులు పోస్టులు*

 *RR -3231 -205- 1:15 పోటీ*

 *HYD- 2487 -285- 1:09 పోటీ*

 *MDCL -646- 41- 1:15 పోటీ*

 *VKB- 4630- 169 -1:27 పోటీ*

Today :   11:00 AM

 https://tgdsc.aptonline.in/tgdsc/

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) లో త్వరలోనే 3035 ఉద్యోగ నియామకాలు

 


 తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) లో త్వరలోనే 3035 ఉద్యోగ నియామకాలు చేపట్టనుంది. ఈ నియామక ప్రక్రియ త్వరలోనే మొదలవుతుందని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ ప్రకటించారు. ఆర్టీసీలో వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగాలను భర్తీ ప్రక్రియ వేగవంతమైంది. ఆదివారం కరీంనగర్ లో 33 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన సందర్భంగా మంత్రి పొన్నం రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఈ శుభవార్త చెప్పారు.

రాష్ట్రంలో మహాల‌క్ష్మి ప‌థ‌కం వ‌ల్ల బ‌స్సుల‌కు విప‌రీతంగా డిమాండ్ పెరిగింది. ర‌ద్దీకి అనుగుణంగా రాష్ట్ర ప్ర‌భుత్వ గ్రాంట్స్ ద్వారా కొత్త బ‌స్సుల కొనుగోలుకు టీజీఎస్ఆర్టీసీ యాజ‌మాన్యం ప్లాన్ చేస్తోంది. త్వరలోనే రాష్ట్రంలో 500 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకు వస్తోంది. కొత్త బ‌స్సులకు స‌రిప‌డా ఉద్యోగ ఖాళీల‌ భ‌ర్తీ చేపట్టేందుకు ఆర్టీసీ కసరత్తు చేసింది. ఇందులో భాగంగానే వివిధ విభాగాల్లో మొత్తం 3035 పోస్టుల నియామ‌క ప్ర‌కియ చేపట్టనుంది.ఇటీవలే ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 3035 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
వీటిలో

2000 డ్రైవర్‌ పోస్టులు ఉండగా.. 

743 శ్రామిక్‌,
114 డిప్యూటీ సూపరింటెండెంట్‌(మెకానిక్‌),
84 డిప్యూటీ సూపరింటెండెంట్‌ (ట్రాఫిక్‌),
25 డిపో మేనేజర్‌/అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌,
23 అసిస్టెంట్‌ ఇంజనీర్‌(సివిల్‌),
15 అసిస్టెంట్‌ మెకానికల్ ఇంజనీర్‌,
11 సెక్షన్‌ ఆఫీసర్‌(సివిల్‌),
7 మెడికల్‌ ఆఫీసర్‌(జనరల్‌),
7 మెడికల్‌ ఆఫీసర్‌(స్పెషాలిస్ట్‌) ఉద్యోగాలు ఉన్నాయి.

Sunday, September 29, 2024

ముఖ్యమైన రోజులు మరియు తేదీలు - మార్చి ( March )

 


       మార్చి నెలలో జరుపుకునే వివిధ జాతీయ దినోత్సవాలు మరియు అంతర్జాతీయ దినోత్సవాల వివరాలు తెలుసుకోండి. ప్రముఖుల పుట్టిన రోజులు, మరణాల సమాచారం కూడా పొందండి. వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది.

 జనౌషధి దివస్ వీక్ | మార్చి మొదటి వారం (1-7)

డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ ఆధ్వర్యంలోని ఫార్మాస్యూటికల్స్ & మెడికల్ డివైసెస్ బ్యూరో ఆఫ్ ఇండియా (PMBI) నిర్వహించే జనౌషధి దివాస్'ను మార్చి మొదటి వారంలో 1 వ తేదీ నుండి 7 వ తేదీ మధ్య దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ప్రజలకు సరసమైన ధరలలో మందులను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జన్ ఔషధి పథకం కోసం అవగాహనా కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.

వరల్డ్ సివిల్ డిఫెన్స్ డే | మార్చి 01

ప్రపంచ పౌర రక్షణ దినోత్సవాన్ని ఏటా మార్చి 1న జరుపుకుంటారు. విపత్తు నిర్వహణ గురించి ప్రజలలో అవగాహన కల్పించడం కోసం ఈ వేడుక నిర్వహిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో తమను తాము రక్షించుకోవడానికి మరియు విపత్తు ప్రమాదాన్ని తగ్గించడానికి పౌర జనాభాను మెరుగ్గా సిద్ధం చేయడమే ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యం.

జీరో డిస్క్రిమినేషన్ డే | మార్చి 01

వివక్ష రహిత దినోత్సవంను ఐక్యరాజ్యసమితి మరియు ఇతర అంతర్జాతీయ సంస్థలచే ప్రతి సంవత్సరం మార్చి 1న నిర్వహిస్తారు. ప్రభుత్వ వ్యవస్థల నుండి, న్యాయ వ్యవస్థల నుండి ప్రజలకు వివక్షత లేకుండా ఉండటం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.

వరల్డ్ హియరింగ్ డే | మార్చి 03

      చెవిటితనం మరియు వినికిడి లోపాన్ని నివారించడం మరియు చెవి మరియు వినికిడి కలిగిన వ్యక్తుల సంరక్షణను ఎలా ప్రోత్సహించాలనే దానిపై అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం మార్చి 3న ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) యొక్క అంధత్వం మరియు చెవుడు నివారణ కార్యాలయం ద్వారా ప్రతి సంవత్సరం నిర్వహించబడుతుంది.

వరల్డ్ వైల్డ్ లైఫ్ డే | మార్చి 03

             ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం (WWD) ను ప్రతి సంవత్సరం మార్చి 3వ తేదీన నిర్వహిస్తారు. వైవిధ్యమైన అడవి జంతు జాతులను ​​​​మరియు వృక్ష జాతులను సంరక్షించేందుకు మరియు వాటి సంరక్షణ యందు అవగాహనా కల్పించేందుకు ఈ కార్యక్రమం నివహిస్తారు. ఈ కార్యక్రమంను 20 డిసెంబర్ 2013 నుండి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం ద్వారా ప్రారంభించబడింది.

ఎంప్లాయ్ అప్రిసియేషన్ డే | మార్చి 04

         ప్రతి సంవత్సరం మార్చిలో మొదటి శుక్రవారం నాడు జాతీయ ఉద్యోగుల ప్రశంసా దినోత్సవంను జరుపుకుంటారు. ఈ కార్యక్రమంను రికగ్నిషన్ ప్రొఫెషనల్స్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక బోర్డు సభ్యులలో ఒకరైన బాబ్ నెల్సన్ యొక్క ఆలోచనతో మొదలయ్యింది. ఈరోజున యజమానులు తమ ఉద్యోగులకు కృతజ్ఞతలు లేదా గుర్తింపును తెలియజేయడానికి ఉపయోగించుకుంటారు.

నేషనల్ సేఫ్టీ డే | మార్చి 04

       జాతీయ భద్రతా దినోత్సవంను ప్రతి ఏడాది మార్చి 4 న జరుపుకుంటారు. ఈరోజున జాతీయ భద్రతా మండలి అన్ని భద్రతా సూత్రాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. వీటిలో రహదారి భద్రత, పారిశ్రామిక భద్రత, మానవ ఆరోగ్యం మరియు పర్యావరణ భద్రత కూడా ఉన్నాయి. ఇండియన్ నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ 4 మార్చి 1966 లో స్థాపించిన తేదికి గుర్తుగా ఈ వేడుక నిర్వహిస్తారు. దీని ప్రధాన కార్యాలయం నేవీ ముంబాయిలో ఉంది.

వరల్డ్ ఒబేసిటీ డే | మార్చి 04

       ప్రపంచ ఊబకాయం దినోత్సవంను ఏటా మార్చి 4వ తేలిన నిర్వహిస్తారు. ప్రపంచ స్థూలకాయ సంక్షోభాన్ని అంతం చేయడానికి మరియు ఆచరణాత్మక పరిష్కారాలను ప్రోత్సహించే ఉద్దేశ్యంలో భాగంగా 04 మార్చి 2020 నుండి ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఊబకాయం నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద ఆరోగ్య సంక్షోభాలలో ఒకటిగా ఉంది, ఇది ప్రపంచవ్యాప్తంగా ఆరుగురి వ్యక్తులలో ఒకరిరు ఊబకాయంతో సతమౌతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వీరి సంఖ్యా 800 మిలియన్లకు దాటి ఉంటుంది.

ప్రపంచ టెన్నిస్ దినోత్సవం | మార్చి 07

      ప్రపంచ టెన్నిస్ దినోత్సవంను ఏటా మార్చి 07వ తేదీన నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం యొక్క మొదటి ఎడిషన్‌ను ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ మార్చి 4, 2013న ప్రారంభించింది. అలానే నేషనల్ ప్లే టెన్నిస్ డే ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 23 న జరుపుకుంటారు. ఇది టెన్నిస్ ఆడటానికి అంకితం చేయబడిన రోజు. అదేవిధంగా 20 జూన్ 1789 టెన్నిస్ కోర్ట్ ప్రారంభ తేదీని అంతర్జాతీయ టెన్నిస్ దినోత్సవంగా జరుపుకుంటారు.

ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే | మార్చి 08

      అంతర్జాతీయ మహిళా దినోత్సవంను ప్రతిఏటా మార్చి 8వ తేదీన అంతర్జాతీయంగా జరుపుకుంటారు. ఈ కార్యక్రమాన్ని మహిళల సాంస్కృతిక, రాజకీయ మరియు సామాజిక ఆర్థిక విజయాలను గుర్తుచేసుకోవడానికి మరియు వివిధ రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు నిర్వహిస్తారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మొదటిసారిగా 1975లో ఐక్యరాజ్యసమితి జరుపుకుంది. తర్వాత డిసెంబర్ 1977 లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ మహిళా హక్కులు మరియు అంతర్జాతీయ శాంతి కోసం ఈ తీర్మానాన్ని ఆమోదించింది.

నో స్మోకింగ్ డే | మార్చి రెండవ బుధవారం

                  ప్రతి ఏడాది మార్చి నెలలో రెండవ బుధవారం ప్రపంచవ్యాప్తంగా ధూమపాన నిషేధ దినంగా జరుపుకుంటారు. ధూమపానం మానేయాలనుకునే వారికి సహాయం చేయడానికి అలాగే ఒక వ్యక్తి ఆరోగ్యంపై ధూమపానం వల్ల కలిగే ప్రభావాల గురించి అవగాహన పెంచడానికి ఈ రోజును జరుపుకుంటారు.

ప్రపంచ కిడ్నీ దినోత్సవం | మార్చి 10

        ప్రతి సంవత్సరం మార్చి 10 వ తేదీని ప్రపంచ కిడ్నీ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ కార్యక్రమం ప్రధానంగా కిడ్నీ వైద్యులపై అవగాహన పెంపొందించేందుకు నిర్వహిస్తారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని మొదటిగా ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ మరియు ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కిడ్నీ ఫౌండేషన్స్ ద్వారా సంయుక్తంగా ప్రారంభించబడింది.

అంతర్జాతీయ మహిళా న్యాయమూర్తుల దినోత్సవం | మార్చి 10

        ఏటా మార్చి 10వ తేదీని అంతర్జాతీయ మహిళా న్యాయమూర్తుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. అన్ని రంగాలతో పాటుగా న్యాయ వ్యవస్థలో కూడా మహిళల పూర్తి మరియు సమాన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ఈ దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆమోదంతో 2021 నుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ఇంటర్నేషనల్ డే ఆఫ్ మ్యాథమెటిక్స్ | మార్చి 14

అంతర్జాతీయ గణిత దినోత్సవం ( IDM) అనేది ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం మార్చి 14న జరుపుకుంటారు. యునెస్కో నవంబర్ 2019లో పై డేని అంతర్జాతీయ గణిత దినోత్సవంగా నిర్ణయించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు అంకగణితం మరియు సమస్య పరిష్కారంలో వారి నైపుణ్యాలను పదును పెట్టడానికి మరియు ప్రోత్సహించడానికి గాను నిర్వహిస్తారు. ఇదేరోజు సాపేక్షత సిద్ధాంత రూపకర్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ జన్మదినోత్సవం కూడా.

ఇంటర్నేషనల్ డే ఆఫ్ యాక్షన్ ఫర్ రివర్స్ : మార్చి 14

       అంతర్జాతీయ నదుల కార్యాచరణ దినోత్సవంను ప్రతి సంవత్సరం మార్చి 14 వ తేదీన జరుపుకుంటారు. ఈ కార్యక్రమం నదుల ప్రాముఖ్యత మరియు జల వనరుల ఆదాపై పై అవగహన కల్పించేందుకు నిర్వహిస్తారు.

వరల్డ్ కాంటాక్ట్ డే | మార్చి 15

     ప్రపంచ సంప్రదింపు దినోత్సవంను ఏటా మార్చి 15వ తేదీన జరుపుకుంటారు. దీనిని మొదటిసారిగా మార్చి 1953లో ఇంటర్నేషనల్ ఫ్లయింగ్ సాసర్ బ్యూరో (IFSB) అనే సంస్థ ప్రకటించింది. ప్రపంచ సంప్రదింపు దినోత్సవం అనేది టెలిపతిక్ గ్రహాంతరవాసులు ఉన్నారనే ఆశతో, గ్రహం మరియు మన ఆరోగ్యం మధ్య పరస్పర అనుసంధానంపై ఆశాభావం వ్యక్తపరుస్తూ వేడుక చేసుకుంటారు.

వరల్డ్ కంజ్యూమర్ రైట్స్ డే | మార్చి 15

           వినియోగదారుల హక్కులు మరియు అవసరాల గురించి ప్రపంచవ్యాప్త అవగాహనను పెంపొందించే లక్యంలో భాగంగా ప్రతి సంవత్సరం మార్చి 15వ తేదీని ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా జరుపుకుంటారు. వినియోగదారుల రక్షణ కోసం 09 ఏప్రిల్ 1985 లో ఐక్యరాజ్యసమితి విస్తృత నియమాలను ఆమోదించింది. ఆ తర్వాత వాటిపై అవగాహన పెంపొందించడంలో భాగంగా మొదటి ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం 1983లో నిర్వహించబడింది.

ఇంటర్నేషనల్ డే టూ కంబాట్ ఇస్లామోఫోబియా | మార్చి 15

                   ఏటా మార్చి 15వ తేదిని ఇస్లామోఫోబియాను ఎదుర్కోవటానికి అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమం 2022 లో ఇస్లామిక్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (OIC) తరపున పాకిస్తాన్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) ఏకాభిప్రాయంతో ఆమోదించడంతో ప్రారంభమైంది.

          ఇస్లామోఫోబియా అంటే ఇస్లాం పేరు వినగానే ద్వేషపూరిత మాటలు, వివక్ష మరియు హింస వంటివి ప్రదర్శించడం. ముస్లిం వ్యక్తులు మరియు వర్గాల పట్ల వివక్ష, శత్రుత్వం మరియు హింసాత్మక భావాన్ని పారదోలి, వారి యందు స్నేహపూర్వక భావాన్ని పొంపొందించే లక్ష్యంలో ఈ కార్యక్రమం జరుపుకోనున్నారు.

నేషనల్ వాక్సినేషన్ డే | మార్చి 16

           మానవ ఆరోగ్య వ్యవస్థలో వ్యాక్సిన్‌ల ప్రాముఖ్యతను పెంపొందించడానికి భారతదేశంలో ప్రతి సంవత్సరం మార్చి 16ని జాతీయ టీకా దినోత్సవం జరుపుకుంటారు. జాతీయ టీకా దినోత్సవాన్ని నేషనల్ ఇమ్యునైజేషన్ డే అని కూడా పిలుస్తారు. ప్రతి చిన్నారికి టీకాలు వేయించేందుకు ముందు వరుస ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు చేస్తున్న కృషిని ప్రభుత్వం గుర్తించి, ఈరోజున వారిని అభినందిస్తుంది.

గ్లోబల్ రీసైక్లింగ్ డే | మార్చి 18

               ప్రతి సంవత్సరం మార్చి 18 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ రీసైక్లింగ్ డే జరుపుకుంటారు. రీసైక్లింగ్ అనేది యూఎన్ యొక్క 2030 సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ లో ఒకటిగా ఉంది. ప్రస్తుతం ప్రపంచం ఏటా రెండు బిలియన్ మెట్రిక్ టన్నుల ఘన వ్యర్థాలను మరియు పునర్వినియోగ వస్తువులను ఉత్పత్తిచేస్తుంది. వీటిలో రీసైక్లింగ్ జరిగేది చాలా తక్కువ. ఈ వ్యర్దాల వలన గాలి, నీరు, నేల వంటి ప్రకృతి వనరులు కలుషితమౌతున్నాయి. వీటిపై అవగహన కల్పించేందుకే ఈ కార్యక్రమంను నిర్వహిస్తారు.

వరల్డ్ స్లీప్ డే : వసంత విషువత్తుకు ముందు శుక్రవారం

       ప్రపంచ నిద్ర దినోత్సవాన్ని ఏటా వసంత విషువత్తుకు ముందు శుక్రవారం జరుపుకుంటారు. ఈ వార్షిక కార్యక్రమంను వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ స్లీప్ మెడిసిన్, 2008 నుండి ప్రారంభించింది. ప్రజల్లో మంచి నిద్ర అలవాట్ల ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడం దీని ప్రధాన లక్ష్యం.

వరల్డ్ ఓరల్ హెల్త్ డే | మార్చి 20

              ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవంను ఏటా మార్చి 20వ తేదీన జరుపుకుంటారు. నోటి ఆరోగ్యం మరియు నోటి పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహనా పెంపొందించడంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంను మొదటిసారి 2013 లో వరల్డ్ డెంటల్ ఫెడరేషన్ ప్రారంభించింది.

వరల్డ్ స్పేరౌ డే | మార్చి 20

            ప్రతి సంవత్సరం మార్చి 20న ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని జరుపుకుంటారు. అంతరించిపోతున్న ఈ అరుదైన చిట్టి పక్షుల మనుగడను పెంపొందించడంలో భాగంగా ఈ వేడుక నిర్వహిస్తారు. ఇంటి పిచ్చుకులుగా పిలుచుకునే ఈ జాతి జనాభా గత దశబ్దకాలంలో 80% తగ్గిపోయింది. వీటి పరిరక్షణపై ప్రజలలో అవగహన పెంచేందుకు పక్షి ప్రేముకులు, ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి.

ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ | మార్చి 20

        అంతర్జాతీయ సంతోష దినోత్సవాన్ని మార్చి 20న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఇది 2012 నుండి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానంతో ప్రారంభించబడింది. అంతర్జాతీయ సంతోష దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమ జీవితంలో ఆనందం యొక్క ప్రాముఖ్యతను గ్రహించేలా చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

వరల్డ్ పప్పెట్రీ డే | మార్చి 21

            ప్రతి సంవత్సరం మార్చి 21వ తేదీని ప్రపంచ తోలుబొమ్మల దినోత్సవంగా జరుపుకుంటుంటారు. తోలుబొమ్మలాటను ప్రపంచ కళారూపంగా గుర్తించేందుకు మరియు ఆ కళాకారులను గుర్తించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ వేడుకను 2002 నుండి నిర్వహిస్తున్నారు. దీని ముందుగా ఇరాన్‌కు చెందిన పప్పెట్ థియేటర్ ఆర్టిస్ట్ జావద్ జోల్ఫాఘరి ద్వారా ఆచరణలోకి వచ్చింది. 2000లో మాగ్డేబర్గ్‌లోని యూనియన్ ఇంటర్నేషనల్ డి లా మారియోనెట్ యొక్క XVIII కాంగ్రెస్‌లో అతను దీనికి సంబంధించి చర్చ కోసం ప్రతిపాదన చేశాడు.

ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ | మార్చి 21

           అంతర్జాతీయ అటవీ దినోత్సవంను ఏటా మార్చి 21వ తేదీన జరుపుకుంటారు. ప్రజలలో అడవుల ప్రాముఖ్యతను తెలిపేందుకు మరియు వాటి సంరక్షణపై అవగాహన పెంపొందించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. దీనిని 28 నవంబర్ 2013న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం ద్వారా ప్రారంభించారు. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 1.6 బిలియన్ల ప్రజలు, తమ మనుగడ కోసం అడవులపై ప్రత్యేక్షంగా లేదా పరోక్షంగా ఆధారపడుతున్నట్లు తెలుస్తుంది.

వరల్డ్ వాటర్ డే | మార్చి 22

              ప్రపంచ నీటి దినోత్సవం, 1993 నుండి ప్రతి సంవత్సరం మార్చి 22 తేదీన నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంను మంచినీటి ప్రాముఖ్యత మరియు మంచినీటి వనరుల నిర్వహణపై అవగహన పెంపొందించేందుకు నిర్వహిస్తారు. ఈ అవగహన దినోత్సవం 1992లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో  జరిగిన ఎన్విరాన్మెంటల్ & డెవలప్మెంట్ కాన్ఫరెన్స్ ద్వారా తీర్మానించబడింది.

అమరవీరుల దినోత్సవం & షహీద్ దివాస్ | మార్చి 23

          భారతదేశంలో అమరవీరుల దినోత్సవం లేదా షహీద్ దివాస్ లను అనేక తేదీలలో జరుపుకుంటారు. బ్రిటిష్ పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యం కోసం పోరాడి, 1931 మార్చి 23న లాహోర్‌లో అమరవీరులైన భగత్ సింగ్,  సుఖ్‌దేవ్ థాపర్ మరియు శివరామ్ రాజ్‌గురుల త్యాగాలను స్మరించుకోవడానికి మార్చి 23 తేదీని ఏటా షాహిద్ దివస్ లేదా సర్వోదయ దినోత్సవంగా నిర్వహిస్తారు.

       అలానే 1948లో మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ హత్యకు గురైన జనవరి 30 వ తేదీన కూడా జాతీయ స్థాయిలో అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటారు. అదేవిధంగా ప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధుడు లాలా లజపత్ రాయ్ వర్ధంతి సందర్భంగా ఏటా నవంబర్ 17ని షహీద్ దివాస్ లేదా అమరవీరుల దినోత్సవంగా ఒడిశా ప్రభుత్వం జరుపుకుంటుంది.

ప్రపంచ వాతావరణ దినోత్సవం | మార్చి 23

ప్రపంచ వాతావరణ దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 23వ తేదీన జరుపుకుంటారు. 23 మార్చి 1950న ప్రపంచ వాతావరణ సంస్థ ఏర్పాటు జ్ఞాపకార్థంగా  1961 నుండి ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ ప్రతి సంవత్సరం ప్రపంచ వాతావరణ శాస్త్ర దినోత్సవం కోసం ఒక నినాదాన్ని ప్రకటిస్తుంది. పర్యావరణ పరిరక్షణే ద్యేయంగా ఈ కార్యక్రమాను ప్రపంచ అన్ని దేశాలు నిర్వహిస్తాయి.

ప్రపంచ ట్యూబర్ క్యూలోసిస్ (టీబీ)  డే | మార్చి 24

       ప్రతి సంవత్సరం మార్చి 24వ తేదీన ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం నిర్వహించబడుతుంది. ఇది ప్రధానంగా క్షయవ్యాధిపై అవగహన మరియు వ్యాధిని నివారించే ప్రయత్నాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి రూపొందించబడింది. టీబీ కారణంగా ఏటా 10 మిలియన్ల మంది ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు అందులో 1.5 మిలియన్ల మంది ఈ వ్యాధితో మరణిస్తున్నారు.

         క్షయవ్యాధి (టీబీ) అనేది ఒక తీవ్రమైన అంటు వ్యాధి, ఇది ప్రధానంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. క్షయవ్యాధిని కలిగించే మైకోబాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్ అనే బ్యాక్టీరియా దగ్గు మరియు తుమ్ముల ద్వారా గాలిలోకి విడుదలయ్యే చిన్న బిందువుల ద్వారా వ్యక్తి నుండి వ్యక్తికి వ్యాపిస్తుంది. ఈ వ్యాధిని మొదట 1882 లో డా. రాబర్ట్ కోచ గుర్తించారు.

వరల్డ్ థియేటర్ డే | మార్చి 27

      ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 27న జరుపుకుంటారు. 1961లో అంతర్జాతీయ థియేటర్ ఇన్‌స్టిట్యూట్ (ITI) ఈ వేడుకను మొదట ప్రారంభించింది. ఈ ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐటీఐ కేంద్రాలు, ఐటీఐ సహకార సభ్యులు, థియేటర్ నిపుణులు, థియేటర్ సంస్థలు, థియేటర్ విశ్వవిద్యాలయాలు ఏటా ఘనంగా జరుపుకుంటున్నాయి.

 

ముఖ్యమైన రోజులు మరియు తేదీలు- ఫిబ్రవరి

 


 ఫిబ్రవరి నెలలో జరుపుకునే వివిధ జాతీయ దినోత్సవాలు మరియు అంతర్జాతీయ దినోత్సవాల వివరాలు తెలుసుకోండి. ప్రముఖుల పుట్టిన రోజులు, మరణాల సమాచారం కూడా పొందండి. వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది.

 ప్రపంచ ఆస్పెర్‌జిలోసిస్ దినోత్సవం | ఫిబ్రవరి 01

ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీని ప్రపంచ ఆస్పెర్‌గజిలోసిస్ దినోత్సవంగా జరుపుకుంటారు. ఆస్పెర్‌జిల్లస్ ఫంగస్ వల్ల కలిగే తీవ్రమైన పల్మనరీ ఇన్‌ఫెక్షన్ (ఆస్పెర్‌గజిలోసిస్) సంబంధించి అవగాహనా కల్పించేందుకు దీనిని జరుపుకుంటారు.

"ఫంగస్ బాల్" గా పిలవబడే ఈ ఆస్పెర్‌జిల్లస్ ఇన్‌ఫెక్షన్, మానవుని ఉపిరితితిత్తులలో దీర్ఘకాలిక అనారోగ్యానికి కారణమవుతుంది. ఇది తరువాత దశలో శరీరంలోని ఇతర భాగాలకు, ముఖ్యంగా మెదడు, గుండె మరియు మూత్రపిండాలకు వ్యాప్తి చెందుతుంది.

ఇండియన్ కోస్ట్ గార్డ్ డే | ఫిబ్రవరి 01

ఏటా ఫిబ్రవరి 01 వ తేదీని ఇండియన్ కోస్ట్ గార్డ్ దినోత్సవంగా జరుపుకుంటారు. భారత కోస్ట్ గార్డ్ (ICG) దినోత్సవాన్ని 18 ఆగస్ట్ 1978న భారత పార్లమెంటు ఆమోదించింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ తీరప్రాంత జలాలపై గస్తీ నిర్వహిస్తుంది, అలానే సముద్ర అక్రమ రవాణా కార్యకలాపాలను నిరోధిస్తుంది, అలానే సముద్ర జీవావరణ జీవవైవిధ్యాన్ని పరిరక్షిస్తుంది, వేటగాళ్లను పట్టుకుంటుంది, మత్స్యకారులకు సహాయం చేస్తుంది.

రుమటాయిడ్ ఆర్థరైటిస్ అవేర్‌నెస్ డే | ఫిబ్రవరి 02

ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2న రుమటాయిడ్ అవేర్‌నెస్ డే నిర్వహిస్తారు. అలానే మే నేలను ఆర్థరైటిస్ అవగాహన నెలగా జరుపుకుంటారు. దీనిని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఆటో ఇమ్యూన్ మరియు ఆటోఇన్‌ఫ్లమేటరీ ఆర్థరైటిస్ స్పాన్సర్ చేస్తుంది. ఏటా 1.5 మిలియన్ల అమెరికన్లను ప్రభావితం చేసే ఈ ఆటో ఇమ్యూన్ మరియు ఆటోఇన్‌ఫ్లమేటరీ వ్యాధి కోసం ఈ రోజున అవగాహనా కల్పిస్తారు.

వరల్డ్ వెట్ ల్యాండ్స్ డే | ఫిబ్రవరి 02

చిత్తడి నేలల గురించి అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2న ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది 2 ఫిబ్రవరి 1971న ఇరాన్‌లోని రామ్‌సర్‌లో అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలలపై కన్వెన్షన్ (రామ్‌సర్ కన్వెన్షన్) సంతకం చేసిన వార్షికోత్సవాన్ని సూచిస్తుంది.

ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం అనేది పర్యావరణ సంబంధిత వేడుక. గత 2021 ఆగస్టు 30న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఆమోదించిన తర్వాత ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని ఏటా ఫిబ్రవరి 2వ తేదీన జరుపుకోనున్నారు.

అంతర్జాతీయ మానవ సౌభ్రాతృత్వ దినోత్సవం | ఫిబ్రవరి 04

2020లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఏటా ఫిబ్రవరి 4 వ తేదీని అంతర్జాతీయ మానవ సౌభ్రాతృత్వ దినోత్సవంగా ప్రకటించింది. విభిన్న సంస్కృతులు, మతాలు, నమ్మకాలు మరియు విశ్వాసాల వైవిధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ వేడుకను నిర్వహిస్తారు. విభిన్న విశ్వాసాల మధ్య పరస్పర గౌరవంతో మానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేలా ఈ వేడుకను జరుపుకుంటారు.

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం | ఫిబ్రవరి 04

ఏటా ఫిబ్రవరి 4వ తేదీని ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ వేడుకను యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ (UICC) నేతృత్వంలో ఏటా ఫిబ్రవరి 4న పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఈ వేడుక ప్రపంచ క్యాన్సర్ మహమ్మారికి వ్యతిరేకంగా, క్యాన్సర్ రహిత ప్రపంచం కోసం క్యాన్సర్ పై అవగాహన పెంపొందించడం కోసం నిర్వహిస్తారు.

ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా 10 మిలియన్ల మంది క్యాన్సర్‌తో మరణిస్తున్నారు. ఈ అవగహన దినోత్సవాన్ని 04 ఫిబ్రవరి 2000 సంవత్సరంలో పారిస్ యందు జరిగిన వరల్డ్ క్యాన్సర్ కాన్ఫరెన్స్ లో ప్రారంబించారు.

సేఫర్ ఇంటర్నెట్ డే | ఫిబ్రవరి 08

ఆన్‌లైన్ సాంకేతికత యందు మరియు మొబైల్ ఫోన్‌ల యొక్క సురక్షితమైన, మరింత బాధ్యతాయుతమైన వినియోగాన్ని ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 8వ తేదీని సురక్షితమైన ఇంటర్నెట్ డే గా జరుపుకుంటారు. మెరుగైన ఇంటర్నెట్ కోసం అనే నినాదంతో 2005 లో మొదటిసారిగా సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఇంటర్నెట్‌ను అందరికీ సురక్షితమైన మరియు మెరుగైన ప్రదేశంగా మార్చడానికి అందులో భాగస్వామ్యం అవుతారు.

ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవం | ఫిబ్రవరి 10

2019లో ఐక్యరాజ్యసమితి ప్రారంభించిన ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 10న జరుపుకుంటారు. స్థిరమైన ఆహార ఉత్పత్తిలో భాగంగా పప్పు దినుసుల పోషక మరియు పర్యావరణ ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ వేడుకను నిర్వహిస్తారు.

దీని మొదట 10 ఫిబ్రవరి 2019 లో ఐక్యరాజ్యసమితి ప్రారంభించింది. కానీ అంతకముందు నుండే 2009 నుండి యూఎస్ వంటి దేశాలలో ఈ వేడుక జరుపుకునే వారు. ఈ దినోత్సవాన్ని ప్రారంభించక ముందే ఐక్యరాజ్యసమితి 2023 ను ఇంటర్నేషనల్ 'ఇయర్ ఆఫ్ పల్సస్'గా ప్రకటించింది.

నేషనల్ డీవార్మింగ్ డే | ఫిబ్రవరి 10

1 నుండి 19 ఏళ్ళ మధ్య పిల్లలకు, అత్యంత హాని కలిగించే నులిపురుగుల నిర్మూలన యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడానికి ఏటా ఫిబ్రవరి 10 న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. నులిపురుగుల వలన పిల్లలు రక్తహీనతతో పాటుగా ప్రేగు ఇన్ఫెక్షన్‌, పోషకాహార లోపం వంటి అనారోగ్యాలకు గురవుతారు. భారత ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ అవగాహనా కార్యక్రమాలను దేశ వ్యాప్తంగా నిర్వహిస్తుంది.

ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ & గర్ల్స్ ఇన్ సైన్స్ | ఫిబ్రవరి 11

సైన్స్ మరియు టెక్నాలజీలో మహిళలు మరియు బాలికల భాగస్వామ్యాన్ని మరింతగా పెంపొందించేందుకు ఏటా ఫిబ్రవరి 11 తేదీని సైన్స్‌లో మహిళలు మరియు బాలికల అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ కార్యక్రమం 22 డిసెంబర్ 2015న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ చేసిన తీర్మానం ద్వారా ప్రారంభించబడింది.

భారత జాతీయ మహిళా దినోత్సవం | ఫిబ్రవరి 13

ది నైటింగేల్ ఆఫ్ ఇండియా (భారత్ కోకిల) సరోజినీ నాయుడు పుట్టినరోజు ఫిబ్రవరి 13ను, భారతదేశం ఏటా జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటుంది. సరోజినీ నాయుడు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నికైన మొట్టమొదటి మహిళగా నిలిచారు.

అలానే ఆమె భారతదేశపు మొదటి మహిళా గవర్నర్‌గా కూడా పనిచేసారు. మహాత్మా గాంధీ ప్రేరణతో భారత స్వాతంత్ర ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. ఒక రచయిత్రిగా అనేక పుస్తకాలు వ్రాసి ప్రసిద్ధి చెందారు.

ప్రపంచ రేడియో దినోత్సవం | ఫిబ్రవరి 13

ప్రపంచ రేడియో దినోత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13 న జరుపుకునే అంతర్జాతీయ దినోత్సవం. యూనెస్కో తన 36వ సదస్సు సందర్భంగా 3 నవంబర్ 2011న ఈ దినోత్సవాన్ని నిర్ణయించింది. 2012లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ద్వారా ఇది అంతర్జాతీయ దినోత్సవంగా ఆమోదించబడింది. రేడియో యొక్క ప్రాముఖ్యత మరియు ఔచిత్యానికి తెలియదజేసేందుకు ఈ వేడుక నిర్వహిస్తారు.

ఇంటర్నేషనల్ ఎపిలెప్సీ డే | ఫిబ్రవరి రెండవ సోమవారం

అంతర్జాతీయ మూర్ఛ దినోత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి రెండవ సోమవారం రోజున జరుపుకుంటారు. మూర్ఛ వ్యాధి గురించి అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో దీనిని ఏటా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంను ఇంటర్నేషనల్ బ్యూరో ఫర్ ఎపిలెప్సీ (IBE) మరియు ఇంటర్నేషనల్ లీగ్ ఎగైనెస్ట్ ఎపిలెప్సీ (ILAE) ఉమ్మడిగా రూపొందించాయి. ఇకపోతే జాతీయ మూర్ఛ దినోత్సవంను భారత ప్రభుత్వం ఏటా నవంబర్ 17వ తేదీన దేశ వ్యాప్తంగా నిర్వహిస్తుంది.

మూర్ఛ అనేది కేంద్ర నాడీ వ్యవస్థ (న్యూరోలాజికల్) రుగ్మత. ఇది గాయం లేదా స్ట్రోక్ వంటి మెదడు గాయం కారణంగా సంభవించవచ్చు. మూర్ఛ సమయంలో రోగిలో అసాధారణ ప్రవర్తన లేదా వింతైన అనుభూతులను అనుభవిస్తాడు, కొన్నిసార్లు స్పృహ కోల్పోవడం కూడా జరుగుతుంది.

ఇంటర్నేషనల్ చైల్డ్ హుడ్ క్యాన్సర్ డే | ఫిబ్రవరి 15

ప్రతి ఏడాది ఫిబ్రవరి 15వ తేదీని అంతర్జాతీయ బాల్య క్యాన్సర్ దినోత్సవంగా (ICCD) జరుపుకుంటారు. బాల్యదశలో వచ్చే వివిధ క్యాన్సర్లపైన అవగాహన పెంచడానికి మరియు మద్దతు తెలియజేయడానికి ఈ కార్యక్రమంను నిర్వహిస్తారు. అంతర్జాతీయ బాల్య క్యాన్సర్ దినోత్సవాన్ని (ఫిబ్రవరి 15) పురస్కరించుకుని, ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (IARC) ఏటా కొన్ని పరిశోధనలను హైలైట్ చేస్తోంది.

వరల్డ్ పాంగోలిన్ డే | ఫిబ్రవరి మూడవ శనివారం

ప్రపంచ పాంగోలిన్ దినోత్సవాన్ని ఏటా ఫిబ్రవరిలో మూడవ శనివారం జరుపుకుంటారు. పాంగోలిన్ యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచే లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. పాంగోలిన్‌లు పర్యావరణ వ్యవస్థలలో కీలక పాత్ర పోషిస్తాయి.

ఇవి భూమి యొక్క సహజ తెగులు నివారణిగా పనిచేస్తాయి. ఒక పాంగోలిన్ సంవత్సరానికి 70 మిలియన్ల కీటకాలను, ప్రధానంగా చీమలు మరియు చెదపురుగులను తింటుందని పరిశోధనలు చెప్తున్నాయి.

వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్ | ఫిబ్రవరి 20

ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 20 తేదీన ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం జరుపుకుంటారు. ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం అనేది పేదరికం, లింగ అసమానత, నిరుద్యోగం, మానవ హక్కులు మరియు సామాజిక రక్షణ వంటి సమస్యలను పరిష్కరించడానికి మరియు వాటి యందు ప్రజలలో అవగహన కల్పించేందుకు నిర్వహిస్తారు. ఈ వేడుకన 2008 నుండి ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తుంది.

ఇంటర్నేషనల్ మథర్ లాంగ్వేజ్ డే | ఫిబ్రవరి 21

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఏటా ఫిబ్రవరి 21వ తేదీన జరుపుకుంటారు. ఈ కార్యక్రమం భాషా వైవిధ్యం మరియు సాంస్కృతిక వైవిధ్యంపై అవగాహనను పెంపొందించడానికి మరియు బహుభాషావాదాన్ని ప్రోత్సహించడానికి నిర్వహిస్తారు.

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకోవాలనే ఆలోచన బంగ్లాదేశ్ చొరవతో 1999 లో యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్‌లో ఆమోదించబడింది. ఆ తర్వాత ఏడాది 2000 వ సంవత్సరం నుండి ఈ వేడుక ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు.

సెంట్రల్ ఎక్సైజ్ డే | ఫిబ్రవరి 24

భారతదేశం అంతటా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 24 న సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. దేశంలో సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని మెరుగ్గా నిర్వహించేందుకు మరియు వస్తువుల తయారీ వ్యాపారంలో అవినీతిని నిరోధించడానికి, అలానే ఎక్సైజ్ శాఖ ఉద్యోగులను ప్రోత్సహించడానికి గాను ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. దేశంలో సెంట్రల్ ఎక్సైజ్ చట్టం 1944 నుండి అమలులో ఉంది.

నేషనల్ ప్రోటీన్ డే | ఫిబ్రవరి 27

జాతీయ ప్రోటీన్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 27 న దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ఇది ప్రోటీన్-రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రారంభించబడిన ప్రజారోగ్య కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని 2020 నుండి నిర్వహిస్తున్నారు.

ప్రపంచ ఎన్‌జిఓ దినోత్సవం | ఫిబ్రవరి 27

ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 27న ప్రపంచ ఎన్‌జిఓ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ కార్యక్రమం సమాజానికి దోహదపడే వ్యక్తులను, సంస్థలను గుర్తించి, గౌరవించటానికి జరుపుకుంటారు. ఈ కార్యక్రమాన్ని అధికారికంగా 2014 నుండి నిర్వహిస్తున్నారు. ఎన్‌జిఓ అనగా నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజషన్ అని అర్ధం. ఇవి ప్రభుత్వంతో సంబంధం లేకుండా స్వతంత్రంగా ప్రజలకు సహాయ, సహకారాలు అందిస్తాయి.

అరుదైన వ్యాధుల దినోత్సవం | ఫిబ్రవరి 28

అరుదైన వ్యాధుల దినోత్సవంను ప్రపంచవ్యాప్తంగా ఏటా ఫిబ్రవరి 28వ తేదీన నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం ప్రధానంగా అరుదైన వ్యాధుల పట్ల అవగాహన పెంచడానికి మరియు అరుదైన వ్యాధులు ఉన్న వ్యక్తులు మరియు వారి కుటుంబాలకు చికిత్స మరియు వైద్య ప్రాతినిధ్యాన్ని మెరుగుపరచడం కోసం నిర్వహిస్తారు.

అరుదైన వ్యాధి అంటే ఏ సమయంలోనైనా 200,000 కంటే తక్కువ మందిని ప్రభావితం చేసే వ్యాధిగా పరిగణించబడుతుంది. ఈ అరుదైన వ్యాధుల కేటగిరిలో సుమారు 6,800 కంటే ఎక్కువ వ్యాధులు ఉన్నట్లు పరిశోధనలు చెపుతున్నాయి.

జాతీయ సైన్స్ దినోత్సవం | ఫిబ్రవరి 28

భారత భౌతిక శాస్త్రవేత్త సర్ సివి రామన్ యొక్క రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణకు గుర్తుగా ఏటా ఫిబ్రవరి 28ని జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో విద్యార్థుల యొక్క సైన్స్ సంబంధిత ప్రాజెక్ట్‌లు మరియు ఆవిష్కరణలను ప్రదర్శిస్తారు.

అలానే యువతలో సైన్స్ అంశాల యందు అభిరుచి, ఆసక్తిని పెంపొందించడానికి మరియు ప్రోత్సహించడానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణకు గాను సర్ సీవీ రామన్‌కు 1930లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది.

 

ముఖ్యమైన రోజులు మరియు తేదీలు - జనవరి

 


           జనవరి నెలలో జరుపుకునే వివిధ జాతీయ దినోత్సవాలు మరియు అంతర్జాతీయ దినోత్సవాల వివరాలు తెలుసుకోండి. ప్రముఖుల పుట్టిన రోజులు, మరణాల సమాచారం కూడా పొందండి. వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది.

 

గ్లోబల్ ఫ్యామిలీ డే | జనవరి 1

గ్లోబల్ ఫ్యామిలీ డే అనేది ఐక్యరాజ్యసమితి మిలీనియం వేడుక. ప్రజలలో శాంతి మరియు భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో భాగంగా నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు, ప్రతి సంవత్సరం మొదటి రోజున అన్ని కుటుంబాలు ఒకే సమాజంగా సమావేశమయ్యేలా చేయడం ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. గ్లోబల్ ఫ్యామిలీ' అనేది ప్రపంచంలోని వివిధ దేశాలను ఒకే సంఘంగా (వసుదైక కుటుంబం) చూసే గ్లోబల్ విలేజ్ భావనను సూచిస్తుంది.

ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం | జనవరి 4

లూయిస్ బ్రెయిలీ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జనవరి 4న ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ వేడుక ఇది అంధులను మరియు పాక్షిక దృష్టిగల వ్యక్తులను ఉత్సాహ పర్చేందుకు మరియు వారిలో ఆత్మవిశ్వసం నింపేందుకు నిర్వహిస్తారు. అలానే బ్రెయిలీ అక్షరాస్యత యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని జనవరి నెల అంతా జరుపుకుంటారు.

లూయిస్ బ్రెయిలీ ఫ్రెంచ్ విద్యావేత్తగా ప్రసిద్ధి. వ్యక్తిగతంగా అంధుడైన బ్రెయిలీ, తనలా దృష్టి లోపం ఉన్న వ్యక్తులు కోసం ప్రత్యేకంగా చదివే, వ్రాసే లిపిని సృష్టించాడు. ఈ లిపి ఆయన పేరుతో బ్రెయిలీ లిపిగా ప్రసిద్ధి చెందింది.

ప్రపంచ యుద్ధ అనాథల దినోత్సవం | జనవరి 06

యుద్ధాల కారణంగా అనాథలుగా మారిన చిన్నారులకు ఆసరా కల్పించేందుకు ప్రతి సంవత్సరం జనవరి 6 న ప్రపంచ యుద్ధ అనాథల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచ యుద్ధ అనాథల దినోత్సవాన్ని ఫ్రెంచ్ సంస్థ SOS ఎన్‌ఫాంట్స్ ఎన్ డిట్రెస్సెస్ ప్రారంభించింది. ఇది సంఘర్షణతో బాధపడుతున్న పిల్లలకు సహాయం చేయడానికి ఉద్దేశించబడింది.

ప్రవాసీ భారతీయ దివస్ | జనవరి 09

భారతదేశ అభివృద్ధికి విదేశీ భారతీయ సమాజం యొక్క సహకారానికి గుర్తుగా ఏటా జనవరి 9వ తేదీని ప్రవాసీ భారతీయ దివస్ గా జరుపుకుంటారు. మహాత్మా గాంధీ 9 జనవరి 1915న దక్షిణాఫ్రికా నుండి ముంబైకి తిరిగి వచ్చిన జ్ఞాపకార్థంగా ఆ తేదిన ఈ వేడుక నిర్వహిస్తారు.

ఈ వేడుక రోజున వివిధ రంగాలలో భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు సాధించిన విజయాలను స్మరించుకుంటారు. అదే సమయంలో వారి జ్ఞానాన్ని మరియు నైపుణ్యాన్ని వారి మాతృభూమికి తీసుకురావడానికి మరియు దాని అభివృద్ధికి దోహదపడేలా సహకరించడానికి వారిని ఒప్పిస్తారు.

ప్రపంచ హిందీ దినోత్సవం | జనవరి 10

ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ భాషగా హిందీ గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం జనవరి 10ని ప్రపంచ హిందీ దినోత్సవంగా (విశ్వ హిందీ దివస్) జరుపుకుంటారు. హిందీ భారత జాతీయ బాషా. ఇది ఉత్తర భారతదేశంలో ప్రధానంగా మాట్లాడే ఇండో-ఆర్యన్ భాష (దేవనాగరి లిపి). హిందీ అనేది హిందూస్థానీ భాష యొక్క ప్రామాణిక మరియు సంస్కృతీకరించబడిన రిజిస్టర్‌గా గుర్తించబడింది.

లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి | జనవరి 11

"ది మ్యాన్ ఆఫ్ పీస్" గా పిలుచుకునే భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి,  11 జనవరి1966 లో ప్రస్తుత ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్‌లో మరణించారు. ఆయన జ్ఞాపకార్థం ఏటా జనవరి 11 ను లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతిగా స్మరించుకుంటారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ముఖ్యమైన పోరాట యోధుడుగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి 1964 లో రిపబ్లిక్ భారతదేశానికి రెండవ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఆయన రూపొందించిన ‘జై జవాన్ జై కిసాన్’ అనే నినాదం భారతీయాల్లో ఈనాటికి గుర్తుండిపోయింది.

నేషనల్ యూత్ డే (స్వామి వివేకానంద జయంతి) | జనవరి 12

జాతీయ యువజన దినోత్సవాన్ని వివేకానంద జయంతి అని కూడా పిలుస్తారు. ఇది స్వామి వివేకానంద జన్మదినమైన జనవరి 12 న జరుపుకుంటారు. 1984లో భారత ప్రభుత్వం ఈ రోజును జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించింది, 1985 నుండి ప్రతి సంవత్సరం భారతదేశంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటారు.

ఆర్మ్‌డ్ ఫోర్సెస్ వెటరన్స్ డే | జనవరి 14

2017 నుండి ప్రతి సంవత్సరం జనవరి 14న ఆర్మడ్ ఫోర్సెస్ వెటరన్స్ డేని జరుపుకుంటున్నారు. భారత సైన్యం యొక్క మొదటి కమాండర్-ఇన్-చీఫ్ ఒబీఈ, ఫీల్డ్ మార్షల్ కేఎం కరియప్ప అందించిన సేవలకు గౌరవసూచకంగా మరియు గుర్తింపుగా ప్రతి సంవత్సరం జనవరి 14న 'సాయుధ దళాల వెటరన్స్ డే' స్మారకంగా జరుపుకుంటారు. దేశం కోసం అనుభవజ్ఞుల నిస్వార్థ భక్తి మరియు త్యాగాన్ని గుర్తించి గౌరవించడం లక్ష్యంగా ఈ వేడుకను నిర్వహిస్తున్నారు.

ఇండియన్ ఆర్మీ డే | జనవరి 15

1949లో చివరి బ్రిటీష్ కమాండర్-ఇన్-చీఫ్ జనరల్ సర్ ఎఫ్‌ఆర్‌ఆర్ బుచెర్ నుండి జనరల్ కెఎమ్ కరియప్ప భారత సైన్యానికి నాయకత్వం వహించిన సందర్భాన్ని గుర్తుచేసుకోవడానికి ప్రతి సంవత్సరం, జనవరి 15 ని "ఆర్మీ డే"గా జరుపుకుంటారు. ఎమ్ కరియప్ప స్వతంత్ర భారతదేశానికి మొదటి భారతీయ కమాండర్-ఇన్-చీఫ్ అయ్యాడు.

నేషనల్ స్టార్టప్ డే | జనవరి 16

దేశంలో వ్యవస్థాపకులను ఉత్సాహ పర్చేందుకు, యువతను వ్యవస్థాపకత వైపు ప్రోత్సహించడంలో భాగంగా ఏటా జనవరి 16 ను 'జాతీయ స్టార్టప్ డే' గా జరుపుకోనున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ 2022 లో ప్రకటించారు.

నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ - రైజింగ్ డే | జనవరి 19

నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) 2006లో సహజ మరియు మానవ నిర్మిత విపత్తుల సమయంలో తక్షణ ప్రతిస్పందన కోసం ఏర్పాటు చేయబడింది. ఏటా జనవరి 19 ను నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) రైజింగ్ డేగా జరుపుకుంటారు. ఈ వేడుక విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన ప్రాథమిక నియమాలపై అవగాహన కపిస్తుంది. ఇది జాతీయ విపత్తు నిర్వహణ అపెక్స్ బాడీ అయినా డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDMA) పరిధిలో పనిచేస్తుంది.

పరాక్రమ్ దివస్ (నేతాజీ జయంతి) | జనవరి 23

ప్రముఖ భారత స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు సందర్భంగా ఏటా జనవరి 23వ తేదీని 'పరాక్రమ్ దివస్'గా (శౌర్య దినం) జరుపుకుంటారు. సుభాష్ చంద్రబోస్  ఆజాద్ హింద్ వ్యవస్థాపకుడుగా, ఇండియన్ నేషనల్ ఆర్మీ ( ఆజాద్ హింద్ ఫౌజ్ ) అధిపతిగా భారతీయ యువకుల గుండెల్లో బలమైన ముద్రవేశారు. 2021లో అతని 124వ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం మొదటిసారిగా పరాక్రమ్ దివస్‌ జరుపుకుంది.

ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే | జనవరి 24

అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని ఏటా జనవరి 24 న జరుపుకుంటారు. 2018 లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఏటా జనవరి 24 ను అంతర్జాతీయ విద్యా దినోత్సవంగా జరుపోకోవాలని నిర్ణయించింది. ప్రపంచ శాంతి మరియు అభివృద్ధికి, ఎడ్యుకేషన్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ఈ వేడుకను ఏటా నిర్వహిస్తున్నారు.

జాతీయ బాలికా దినోత్సవం | జనవరి 24

భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటారు. భారతీయ సమాజంలో బాలికలు ఎదుర్కొనే అసమానతల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇది 2008లో మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు భారత ప్రభుత్వంచే ప్రారంభించబడింది.

నేషనల్ ఓటర్స్ డే | జనవరి 25

ఎన్నికల ప్రక్రియలో యువ ఓటర్లను భాగస్వామ్యం చేయడంలో భాగంగా భారత ఎన్నికల సంఘం ఏటా జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. 2011లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఎలక్షన్ కమిషన్ వ్యవస్థాపక దినోత్సవమైన జనవరి 25న 2011 నుండి ఏటా ఈ వేడుకను నిర్వహిస్తున్నారు.

జాతీయ పర్యాటక దినోత్సవం | జనవరి 25

దేశంలో పర్యాటకం యొక్క ప్రాముఖ్యతపై ప్రజలలో అవగహన కల్పించేందుకు ఏటా జనవరి 25 నుం జాతీయ పర్యాటక దినోత్సవంగా జరుపుకుంటారు. 1948వ సంవత్సరంలో దేశంలో మొదటిసారి పర్యాటక సంస్కృతిని ప్రోత్సహించడానికి టూరిజం ట్రాఫిక్ కమిటీని ఏర్పాటుచేశారు. 1958 నుండి టూరిజం మరియు కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ ఏటా ఈ వేడుకను నిర్వహిస్తుంది.

భారత గణతంత్ర దినోత్సవం | జనవరి 26

భారత రాజ్యాంగం 26, జనవరి 1950న అమలులోకి వచ్చిన తేదీని ఏటా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటారు. భారత స్వాతంత్ర్య ప్రకటన (పూర్ణ స్వరాజ్) 1930లో ఇదే రోజున జరిగినందున జనవరి 26ని భారత రాజ్యాంగం అమలకు ఎంచుకున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు ఏటా దేశ రాజధాని న్యూ ఢిల్లీలో రాజ్‌పథ్‌లో ఘనంగా నిర్వహిస్తారు. ఈ వేడుకలలో రాష్ట్రపతి భవన్ గేట్ల నుండి ఇండియా గేట్ దాటి నిర్వహించే పరేడ్ కార్యక్రమం భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకలలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా, భారత రాష్ట్రపతి ప్రతి సంవత్సరం భారతదేశంలోని పౌరులకు పద్మ అవార్డులను పంపిణీ చేస్తారు.

అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం | జనవరి 26

ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీన అంతర్జాతీయ కస్టమ్స్ డే నిర్వహిస్తారు. దేశ సరిహద్దు భద్రతను నిర్వహించడంలో కస్టమ్ అధికారులు మరియు ఏజెన్సీల గౌరవార్థం ఏటా ఈ వేడుకను జరుపుకుంటారు.

1953లో బెల్జియంలోని బ్రస్సెల్స్‌లో కస్టమ్స్ కోఆపరేషన్ కౌన్సిల్ (CCC) ప్రారంభ సెషన్ జరిగిన రోజు జ్ఞాపకార్థగా ప్రపంచ కస్టమ్స్ ఆర్గనైజేషన్ (WCO) ఈ రోజును ఏర్పాటు చేసింది. 1994లో కస్టమ్స్ కోఆపరేషన్ కౌన్సిల్, వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ (WCO)గా మార్చబడింది.

లాలా లజపతిరాయ్ జయంతి | జనవరి 28

ప్రముఖ భారత స్వాతంత్ర్య ఉద్యమకారుడు, భారత స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక భూమిక వహించిన లాలా లజపత్ రాయ్ 1865 జనవరి 28 న జన్మించారు. పంజాబ్ కేసరిగా పిలుచుకునే లాలా లజపతిరాయ్ 1928 లో లాహోర్‌లో సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా జరిపిన ప్రదర్శనకు నాయకత్వం వహిస్తూ అమరవీరుడుగా మరణించారు. ఈ తిరుగుబాటులో ఆయన లేవనెత్తిన 'సైమన్ గో బ్యాక్' నినాదం భారతీయలను ఎంతగానో ఉత్తేజపర్చింది.

నేషనల్ క్లీన్‌లినెస్ డే | జనవరి 30

భారతదేశంలో జనవరి 30న ఏటా జాతీయ పరిశుభ్రత దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడం తమ ప్రాథమిక కర్తవ్యంగా గుర్తు చేసేందుకు ఈ వేడుక నిర్వహిస్తారు. అలానే నివశించే ఇల్లు, పని చేసే ప్రదేశం, రోడ్లు/వీధులు మరియు బహిరంగ ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచడం వలన కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగహన కల్పిస్తారు.

ఇంటర్నేషనల్ లెప్రసీ డే | జనవరి 30

కుష్టు వ్యాధి లేదా హాన్సెన్స్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రతి సంవత్సరం జనవరి చివరి ఆదివారం నాడు ప్రపంచ కుష్టు వ్యాధి దినోత్సవాన్ని అంతర్జాతీయంగా పాటిస్తారు. కుష్టు వ్యాధితో బాధపడుతున్న ప్రజల పట్ల కరుణ చూపే మహాత్మా గాంధీ జీవితానికి నివాళిగా ఈ తేదీని ఫ్రెంచ్ మానవతావాది రౌల్ ఫోలేరో ఎంచుకున్నారు.

గాంధీ వర్ధంతి (అమరవీరుల దినోత్సవం) | జనవరి 30

ప్రతి సంవత్సరం జనవరి 30న షహీద్ దివస్ లేదా అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. మహాత్మా గాంధీ జనవరి 30, 1948న 78 సంవత్సరాల వయస్సులో నాథూరామ్ గాడ్సే చేత హత్య చేయబడ్డారు. మహాత్ముడు జ్ఞాపకార్ధం, భారతజాతి నివాళిగా ఏటా జనవరి 30 న అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటారు.