మార్చి నెలలో జరుపుకునే వివిధ జాతీయ దినోత్సవాలు మరియు అంతర్జాతీయ
దినోత్సవాల వివరాలు తెలుసుకోండి. ప్రముఖుల పుట్టిన రోజులు, మరణాల సమాచారం
కూడా పొందండి. వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఈ సమాచారం
ఉపయోగపడుతుంది.
జనౌషధి దివస్ వీక్ | మార్చి మొదటి వారం (1-7)
డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ ఆధ్వర్యంలోని ఫార్మాస్యూటికల్స్ & మెడికల్ డివైసెస్ బ్యూరో ఆఫ్ ఇండియా (PMBI) నిర్వహించే జనౌషధి దివాస్'ను మార్చి మొదటి వారంలో 1 వ తేదీ నుండి 7 వ తేదీ మధ్య దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ప్రజలకు సరసమైన ధరలలో మందులను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జన్ ఔషధి పథకం కోసం అవగాహనా కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.
వరల్డ్ సివిల్ డిఫెన్స్ డే | మార్చి 01ప్రపంచ పౌర రక్షణ దినోత్సవాన్ని ఏటా మార్చి 1న జరుపుకుంటారు. విపత్తు నిర్వహణ గురించి ప్రజలలో అవగాహన కల్పించడం కోసం ఈ వేడుక నిర్వహిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో తమను తాము రక్షించుకోవడానికి మరియు విపత్తు ప్రమాదాన్ని తగ్గించడానికి పౌర జనాభాను మెరుగ్గా సిద్ధం చేయడమే ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యం.
జీరో డిస్క్రిమినేషన్ డే | మార్చి 01వివక్ష రహిత దినోత్సవంను ఐక్యరాజ్యసమితి మరియు ఇతర అంతర్జాతీయ సంస్థలచే ప్రతి సంవత్సరం మార్చి 1న నిర్వహిస్తారు. ప్రభుత్వ వ్యవస్థల నుండి, న్యాయ వ్యవస్థల నుండి ప్రజలకు వివక్షత లేకుండా ఉండటం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.
వరల్డ్ హియరింగ్ డే | మార్చి 03చెవిటితనం మరియు వినికిడి లోపాన్ని నివారించడం మరియు చెవి మరియు వినికిడి కలిగిన వ్యక్తుల సంరక్షణను ఎలా ప్రోత్సహించాలనే దానిపై అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం మార్చి 3న ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) యొక్క అంధత్వం మరియు చెవుడు నివారణ కార్యాలయం ద్వారా ప్రతి సంవత్సరం నిర్వహించబడుతుంది.
వరల్డ్ వైల్డ్ లైఫ్ డే | మార్చి 03ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం (WWD) ను ప్రతి సంవత్సరం మార్చి 3వ తేదీన నిర్వహిస్తారు. వైవిధ్యమైన అడవి జంతు జాతులను మరియు వృక్ష జాతులను సంరక్షించేందుకు మరియు వాటి సంరక్షణ యందు అవగాహనా కల్పించేందుకు ఈ కార్యక్రమం నివహిస్తారు. ఈ కార్యక్రమంను 20 డిసెంబర్ 2013 నుండి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం ద్వారా ప్రారంభించబడింది.
ఎంప్లాయ్ అప్రిసియేషన్ డే | మార్చి 04ప్రతి సంవత్సరం మార్చిలో మొదటి శుక్రవారం నాడు జాతీయ ఉద్యోగుల ప్రశంసా దినోత్సవంను జరుపుకుంటారు. ఈ కార్యక్రమంను రికగ్నిషన్ ప్రొఫెషనల్స్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక బోర్డు సభ్యులలో ఒకరైన బాబ్ నెల్సన్ యొక్క ఆలోచనతో మొదలయ్యింది. ఈరోజున యజమానులు తమ ఉద్యోగులకు కృతజ్ఞతలు లేదా గుర్తింపును తెలియజేయడానికి ఉపయోగించుకుంటారు.
నేషనల్ సేఫ్టీ డే | మార్చి 04జాతీయ భద్రతా దినోత్సవంను ప్రతి ఏడాది మార్చి 4 న జరుపుకుంటారు. ఈరోజున జాతీయ భద్రతా మండలి అన్ని భద్రతా సూత్రాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. వీటిలో రహదారి భద్రత, పారిశ్రామిక భద్రత, మానవ ఆరోగ్యం మరియు పర్యావరణ భద్రత కూడా ఉన్నాయి. ఇండియన్ నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ 4 మార్చి 1966 లో స్థాపించిన తేదికి గుర్తుగా ఈ వేడుక నిర్వహిస్తారు. దీని ప్రధాన కార్యాలయం నేవీ ముంబాయిలో ఉంది.
వరల్డ్ ఒబేసిటీ డే | మార్చి 04ప్రపంచ ఊబకాయం దినోత్సవంను ఏటా మార్చి 4వ తేలిన నిర్వహిస్తారు. ప్రపంచ స్థూలకాయ సంక్షోభాన్ని అంతం చేయడానికి మరియు ఆచరణాత్మక పరిష్కారాలను ప్రోత్సహించే ఉద్దేశ్యంలో భాగంగా 04 మార్చి 2020 నుండి ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఊబకాయం నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద ఆరోగ్య సంక్షోభాలలో ఒకటిగా ఉంది, ఇది ప్రపంచవ్యాప్తంగా ఆరుగురి వ్యక్తులలో ఒకరిరు ఊబకాయంతో సతమౌతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వీరి సంఖ్యా 800 మిలియన్లకు దాటి ఉంటుంది.
ప్రపంచ టెన్నిస్ దినోత్సవం | మార్చి 07ప్రపంచ టెన్నిస్ దినోత్సవంను ఏటా మార్చి 07వ తేదీన నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం యొక్క మొదటి ఎడిషన్‌ను ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ మార్చి 4, 2013న ప్రారంభించింది. అలానే నేషనల్ ప్లే టెన్నిస్ డే ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 23 న జరుపుకుంటారు. ఇది టెన్నిస్ ఆడటానికి అంకితం చేయబడిన రోజు. అదేవిధంగా 20 జూన్ 1789 టెన్నిస్ కోర్ట్ ప్రారంభ తేదీని అంతర్జాతీయ టెన్నిస్ దినోత్సవంగా జరుపుకుంటారు.
ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే | మార్చి 08అంతర్జాతీయ మహిళా దినోత్సవంను ప్రతిఏటా మార్చి 8వ తేదీన అంతర్జాతీయంగా జరుపుకుంటారు. ఈ కార్యక్రమాన్ని మహిళల సాంస్కృతిక, రాజకీయ మరియు సామాజిక ఆర్థిక విజయాలను గుర్తుచేసుకోవడానికి మరియు వివిధ రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు నిర్వహిస్తారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మొదటిసారిగా 1975లో ఐక్యరాజ్యసమితి జరుపుకుంది. తర్వాత డిసెంబర్ 1977 లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ మహిళా హక్కులు మరియు అంతర్జాతీయ శాంతి కోసం ఈ తీర్మానాన్ని ఆమోదించింది.