సివిల్ సర్వీసెస్ మరియు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ - 2021
సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష
సివిల్ సర్వీసెస్ పరీక్ష నియమాలు 2021
ఉన్నత స్థాయి హోదా కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త!
మొత్తం
712 ఉద్యోగాల భర్తీకి సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ వెలువడింది, ఇందులో
నుండి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కు 110 పోస్టులు ఉంటాయి.
ఈ
క్రింది 19 రకాల సేవల్లో ఖాళీలను భర్తీ చేయడానికి సివిల్ సర్వీస్ కమిషన్
(యూపీఎస్సీ), సంబంధిత మంత్రిత్వ శాఖలతో మరియు కప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ శాఖల
అంగీకారంతో సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ (సిఎస్ఇ)-2021 రూల్స్ ప్రకారం
యూనియన్ పబ్లిక్ సర్వీస్ చేత నిర్వహించబడుతుంది.
సివిల్ సర్వీసుల వివరాలు:
1. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్
2. ఇండియన్ ఫారిన్ సర్వీస్
3. ఇండియన్ పోలీస్ సర్వీస్
4. ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ గ్రూప్-ఎ
5. ఇండియన్ సివిల్ అకౌంట్స్ సర్వీస్ గ్రూప్-ఎ
6. ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్ గ్రూప్-ఎ
7. ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్ గ్రూప్-ఎ
8. ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్ గ్రూప్-ఎ
9. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, జూనియర్ గ్రేడ్, గ్రూప్-ఏ
10. ఇండియన్ పోస్టల్ సర్వీస్ గ్రూప్-ఎ
11. ఇండియన్ పోస్టల్ అండ్ టెలీ కమ్యూనికేషన్ అకౌంట్ అండ్ ఫైనాన్స్ సర్వీస్ గ్రూప్-ఎ
12. ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీస్ గ్రూప్-ఎ
13. ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (కస్టమ్స్ అండ్ ఇన్ డైరెక్ట్ టాక్స్) గ్రూప్-ఎ
14. ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఇన్కమ్ టాక్స్) గ్రూప్-ఎ
15. ఇండియన్ ట్రేడ్ సర్వీస్ గ్రూప్-ఎ (గ్రేడ్-3)
16. ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ సివిల్ సర్వీస్ గ్రూప్-బి (సెక్షన్ ఆఫీసర్ గ్రేడ్)
17.
ఢిల్లీ, అండమాన్ అండ్ నికోబార్ ఐస్లాండ్, లక్షద్వీప్, డామాన్ & డియూ
అండ్ దాద్రా & నగర్హావేలి సివిల్ సర్వీస్(DANICS), గ్రూప్-బి
18. ఢిల్లీ,
అండమాన్ అండ్ నికోబార్ ఐస్లాండ్, లక్షద్వీప్, డామాన్ & డియూ అండ్
దాద్రా & నగర్హావేలి పోలీస్ సర్వీస్(DANIPS), గ్రూప్-బి
19. పాండిచ్చేరి సివిల్ సర్వీస్(PONDICS) గ్రూప్-బి
ద్యార్హత: ప్రభుత్వ
గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా డిగ్రీ
ఉత్తీర్ణత మరియు ప్రస్తుతం డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా
దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వయస్సు: ఆగస్టు
01, 2021 నాటికి అభ్యర్థుల వయస్సు 21 సంవత్సరాలకు తగ్గకుండా 32
సంవత్సరాలకు మించకుండా ఉండాలి. ఆగస్టు 2, 1989 ఆగస్టు 01, 2000 మధ్య
జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష (ప్రిలిమినరీ, మెయిన్స్), ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
రాత పరీక్షను రెండు విభాగాలుగా ఉంటుంది.
1. ప్రిలిమినరీ పరీక్ష
2. మెయిన్ పరీక్ష
రిలిమినరీ పరీక్ష : ఈ
పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్ 200 Marks ఉంటుంది. రెండు
పేపర్లలో ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటాయి.
పరీక్ష సమయం రెండు గంటలు. ప్రిలిమినరీ పరీక్షలో పేపర్-II జనరల్ స్టడీస్
క్వాలిఫైయింగ్ పేపర్ గా ఉంటుంది, దీనిలో 33 శాతం అర్హత మార్కులు
సాధించాల్సి ఉంటుంది. అభ్యర్థులు అత్యుత్తమ ప్రతిభను కనబర్చి ఎవరైతే ఈ
ప్రిలిమ్స్ అర్హత సాధిస్తారో వారిని మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేస్తారు.
మెయిన్స్ పరీక్ష: ఈ
పరీక్షను మొత్తం 2025 Marks లకు నిర్వహిస్తారు. మెయిన్ పేపర్ మార్పుల
యొక్క వివరణాత్మక విభజనను పూర్తిగా తెలుసుకోవడానికి అధికారిక నోటిఫికేషన్
ను చదవండి. నోటిఫికేషన్ పిడిఎఫ్ ఫైల్ లింక్ ఈ పేజి చివరలో అందుబాటులో
ఉన్నది డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి.
ప్రిలిమ్స్ పరీక్ష తేదీ: ఈ పరీక్షను జూన్ 27, 2021 న నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజు రూ. 100/-
మహిళలు/ ఎస్సి/ ఎస్టీ/ దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు లేదు.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: మార్చి 4, 2021 నుండి.
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: మార్చి 24, 2021.
అధికారిక వెబ్ సైట్ లింక్: https://upsconline.nic.in/
అధికారిక నోటిఫికేషన్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి