Monday, March 8, 2021

RBI Office Attendent Recruitment: ఆర్‌బి‌ఐ నుండి 841 ఆఫీస్ అటెండెంట్ల నియామకానికి నోటిఫికే షన్ విడుదల.

 


ఆర్బీఐలో అటెండెంట్  పోస్టులు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కార్యాలయాల్లో ఆఫీసు అటెండెంట్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

ఎంపిక విధానం : ఆన్‌లైన్ టెస్ట్, లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్టుల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఖాళీలు: మొత్తం 841 పోస్టులు ప్రకటించారు. 

ఖాళీల వివరాలు:

అహ్మదాబాద్ లో - 50, బెంగుళూరు లో - 28, భూపాల్ లో - 25, భువనేశ్వర్ లో - 24, చండీఘర్ లో - 31, చెన్నై లో - 71, గౌహతి లో - 38, హైదరాబాద్ లో - 57, 

జమ్ము లో - 9, జైపూర్ లో - 43, కాన్పూర్ లో - 69, కలకత్తా లో - 35, ముంబై లో - 202, నాగపూర్ లో - 55, న్యూఢిల్లీ లో - 50, పాట్నా లో - 28, తిరువనంతపురంలో - 26 

ఇలా మొత్తం 841 ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు / సంస్థ నుంచి పదోతరగతి /మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. మరియు స్థానిక భాష (తెలుగు)లో చదవడం, రాయడం, మాట్లాడడం తెలిసుండాలి. 

అభ్యర్థుల వయసు: ఫిబ్రవరి 1 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. గ్రాడ్యుయేట్లు, ఉన్నత విద్యార్హతలు ఉన్నవారు దరఖాస్తుకు అనర్హులు.

 

(హైదరాబాద్ కార్యా లయంలో 57 ఖాళీలు ఉన్నాయి. జనరల్ అభ్యర్థులకు 24, ఓబీసీలకు 15, ఎస్సీలకు 8, ఎస్టీలకు 5, ఈడబ్ల్యుఎస్ వర్గానికి 5 ఖాళీలు ప్రత్యేకించారు. వీటికి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకో వచ్చు.)

పరీక్షా కేంద్రం : అభ్యర్థులకు సాధ్యమైనంత వరకు దరఖాస్తు చేసుకున్న కేంద్రం పరిధిలోనే ఎగ్జామ్ సెంటర్ కేటాయించడం కేటాయించడం జరుగుతుందని ప్రకటనలో పేర్కొన్నారు.

➥ ప్రమాదవశాత్తు అభ్యర్థులకు అతడు/ఆమె ఆన్లైన్ పరీక్ష నిమిత్తం ఏదైనా నష్టం జరిగితే బ్యాంక్ ఎటువంటి బాధ్యత వహించదని నోటిఫికేషన్లో  పేర్కొన్నారు.

➥ ఉన్న పరీక్ష కేంద్రాన్ని మరల మార్చడం కుదరదని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.

ఆన్ లైన్ టెస్టు వివరాలు: ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. 

➥ ఇందులో మొత్తం 120 మల్టిఫుల్ ఛాయిస్ ప్రశ్నలు ఇస్తారు. 

➥ రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్‌నెస్, న్యూమరికల్ ఎబిలిటీ విభాగాలనుంచి ఒక్కోదానిలో 30 ప్రశ్నలు ఇస్తారు. 

➥ ప్రశ్నలన్నీ పదో తరగతి స్థాయిలోనే ఉంటాయి. 

➥ ఒక్కో ప్రశ్నకు 1 మార్కు చొప్పున మొత్తం మార్కులు 120. 

➥ పరీక్ష సమయం 90 నిమిషాలు. 

➥ (-) రుణా త్మక మార్కులు ఉన్నాయి. 

➥ ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు. 

➥ అభ్యర్థులు ప్రతి విభాగంలో నిర్దేశిత మార్కులు సాధించాల్సి ఉంటుంది. 


➥ ఆన్లైన్ టెస్టులో అర్హత సాధిం చిన అభ్యర్థులకు స్థానిక భాష (తెలుగు)లో ప్రొఫిషియెన్సీ టెస్టు నిర్వహిస్తారు. 

➥ ఇందులో అర్హత పొందితేనే పోస్టింగు ఇస్తారు.

ముఖ్య సమాచారం: 

ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ : 24.02.2021

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 15.03.2021

ఆన్లైన్ టెస్టు తేదీలు : 9, 10 ఏప్రిల్ 2021

అదికారిక వెబ్ సైట్: https://www.rbi.org.in/

అదికారిక నోటిఫికేషన్ : ఇక్కడ క్లిక్ చేయండి

దరఖాస్తు చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇదే

 

నోటిఫికేషన్ పూర్తి వివరాలు దరఖాస్తు  విధానం కోసం వీడియో చూడండి.

https://youtu.be/d-8sg82kRXY