Thursday, July 27, 2023

మహిళలకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త! 1520 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ MHSRB Telangana 1

 


 మహిళలకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త!  1520 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ MHSRB Telangana 1520 General 

తెలంగాణ ప్రభుత్వం మహిళలకు భారీ శుభవార్త!

  • రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1520 శాశ్వత పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ..
  • ఆసక్తి కలిగిన అభ్యర్థులు వివరాలను వెంటనే తనిఖీ చేసే దరఖాస్తులు చేయండి.
తెలంగాణ ప్రభుత్వం, మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, తాజాగా మల్టీ-పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫిమేల్) విభాగాల్లో ఖాళీగా ఉన్న 1520 శాశ్వత పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ నేడే జారీ చేసింది. మొత్తం 100 మార్పుల ప్రాతిపాదికన నియామకాలు చేపడుతున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నది. ఇందులో భాగంగా రాత పరీక్షకు 80 మార్కులు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ప్రభుత్వ/ ప్రైవేటు ఇనిస్టిట్యూట్ లో అవుట్సోర్సింగ్/ కాంట్రాక్ట్ ప్రాతిపదికన విధులు నిర్వర్తించిన వారికి 20 పాయింట్లు కేటాయించింది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ వచ్చే నెల నుండి ప్రారంభం కానుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు; ఆన్లైన్ దరఖాస్తు లింక్, జీతభత్యాలు ఇక్కడ.


ఖాళీల వివరాలు:

  • మొత్తం పోస్టుల సంఖ్య :: 1520.


పోస్ట్ పేరు :: మల్టీ-పర్పస్ హెల్త్ అసిస్టెంట్(మహిళలు).


రాష్ట్రవ్యాప్తంగా జోన్ల వారీగా ఖాళీల వివరాలు:

  1. జూన్-1 (కాలేశ్వరం) - 169,
  2. జూన్-2 (బాసర) - 225,
  3. జూన్-3 (రాజన్న) - 263,
  4. జోన్-4 (భద్రాద్రి) - 237,
  5. జూన్-5 (యాదాద్రి) - 241,
  6. జూన్-6 (చార్మినార్) - 189,
  7. జూన్-7 (జోగులాంబ) - 196. మొదలగునవి.
  8. ఇలా మొత్తం 1520 శాశ్వత ఖాళీలు ఉన్నాయి.


విద్యార్హత:

  • ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుండి, తప్పనిసరిగా మల్టీ-పర్పస్ హెల్త్ వర్కర్ (మహిళ) ట్రైనింగ్ కోర్సులను పూర్తి చేసి ఉండాలి.
  • తెలంగాణ రాష్ట్ర నర్స్ మరియు మెడ్వైవెస్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.

లేదా

  • తప్పనిసరిగా ఇంటర్మీడియట్ అర్హతతో వోకేషనల్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (మహిళ) టైం కోర్సు పూర్తి చేసి, ఒక సంవత్సరం ప్రభుత్వ ఆసుపత్రి నందు క్లినికల్ ట్రైనింగ్ పూర్తి చేసి ఉండాలి.
  • ఒక సంవత్సరం అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ సంబంధిత ఆసుపత్రి నందు పూర్తి చేసి ఉండాలి.
  • అలాగే తెలంగాణ పారామెడికల్ బోర్డు నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.


వయో పరిమితి:

  • 01.07.2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44 సంవత్సరాలకు మించకూడదు.
  1. అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
  2. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.


ఎంపిక విధానం:

  1. రాత పరీక్ష ,అనుభవం, ధ్రువపత్రాల పరిశీలన ప్రకారం ఉంటుంది.
  2. మొత్తం 100 మార్కులు ప్రతిపాదికన ఎంపికలను నిర్వహిస్తారు.
  3. రాత పరీక్ష 80 మార్కులకు మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఓఎంఆర్ (లేదా) కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు.
  4. 20 మార్కులు రాష్ట్ర ప్రభుత్వ హాస్పిటల్/ ఇన్స్టిట్యూట్ లలో కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన విధులు నిర్వర్తించిన వారికి 6 నెలలకు 2.5 మార్కుల చొప్పున పాయింట్లను కేటాయిస్తారు.
  5. ధ్రువపత్రాల పరిశీలన, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.


రాత పరీక్ష సెంటర్ల వివరాలు:

  • హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్..


గౌరవ వేతనం: 
  • ఎంపికైన అభ్యర్థులకు స్కేల్ ఆఫ్ పే రూ.31,040 - 92,050/- ప్రకారం చెల్లిస్తారు.


దరఖాస్తు ఫీజు:

  1. ఆన్లైన్ రాత పరీక్ష ఫీజు రూ.500/-,
  2. ప్రాసెసింగ్ ఫీజు రూ.200/- చెల్లించాలి.


దరఖాస్తు విధానం:

  • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 25.08.2023 ఉదయం 10:00 గంటల నుండి,


ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 19.09.2023 సాయంత్రం 05:00 గంటల వరకు.


అధికారిక వెబ్సైట్ :: https://mhsrb.telangana.gov.in/


అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.