TSPSC Group 1 Prelims Results 2023 : తెలంగాణలో ప్రభుత్వ
ఉద్యోగాల భర్తీకి పోటీ పరీక్షలు నిర్వహిస్తున్న తెలంగాణ పబ్లిక్
సర్వీసెస్ కమిషన్ (TSPSC) ఆగస్టు నెలాఖరు లేదా సెప్టెంబరు మొదటివారం
నుంచి ఫలితాలను వెల్లడించేలా కసరత్తు చేస్తోంది. ఈ మేరకు న్యాయపరమైన
అడ్డంకుల్లేని నోటిఫికేషన్లకు వారంలోగా ప్రశ్నపత్రాల ఫైనల్ కీ
వెల్లడించి.. 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాలు ప్రకటించనుంది. వరుసగా
ఫలితాలు ప్రకటించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. TSPSC Group 1
ప్రిలిమినరీ పరీక్ష.. ప్రిలిమినరీ కీపై ఇప్పటికే అభ్యంతరాల్ని పరిశీలించిన
కమిషన్.. ఫైనల్ కీని బుధ లేదా గురువారాల్లో ప్రకటించే అవకాశం ఉంది.
TSPSC Group 1 Results 2023 వెల్లడికి కసరత్తు:
టీఎస్పీఎస్సీ ఇప్పటికే పరీక్షలు పూర్తయిన నోటిఫికేషన్లకు ఫలితాలు వెల్లడించాలని భావిస్తోంది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, ఉద్యానాధికారులు, లైబ్రేరియన్లు, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల ఫలితాలు త్వరలోనే వెల్లడవ్వనున్నాయి. ఇందులో కొన్ని పోస్టులకు ఫైనల్ కీ ఇప్పటికే వెల్లడయ్యాయి. ఏఈఈ పోస్టులకు త్వరలో ఫైనల్ కీ వెల్లడించాలని TSPSC కమిషన్ భావిస్తున్నట్లు సమాచారం. TSPSC Group 1 పరీక్ష.. ప్రిలిమినరీ కీపై ఇప్పటికే అభ్యంతరాల్ని పరిశీలించిన కమిషన్.. బుధ లేదా గురువారాల్లో ప్రకటించాలని భావిస్తోంది.
TSPSC Group 1 Results 2023 - ప్రభుత్వం నుంచి స్పష్టత వస్తేనే :
టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలను వెల్లడించడానికి ప్రభుత్వం నుంచి స్పష్టత రావాలి. గ్రూప్-1 ప్రిలిమినరీ తుది కీ ఇచ్చిన 15 రోజుల్లో ఫలితాలు ప్రకటించాలని కమిషన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు కొన్ని న్యాయ వివాదాలు అడ్డంకిగా మారాయి. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల్లో రిజర్వేషన్లను జీవో నెం. 55 ప్రకారం అమలు చేయడంపై కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తెలంగాణ స్థానికతపై న్యాయవివాదాలు పెండింగ్‌లో ఉన్నాయి.