Tuesday, April 6, 2021

మీ డేటా ఎవరైనా హ్యాక్ చేశారో లేదో తెలుసుకోండిలా?

 


 

ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో మొబైల్ ఒక భాగమైంది. దీని వల్ల ఎంత ,మంచి జరుగుతుందో, అంతే స్థాయిలో కీడు కూడా జరుగుతుంది. ఈ మధ్యనే ప్రముఖ సామజిక దిగ్గజం ఫేసుబుక్ సంస్థకు చెందిన 533 మిలియన్ల మంది డేటా బయటికి విడుదల అయింది. ఇలా మన డేటా ఎవరైనా హ్యాక్ చేశారా? లేదా మన డేటా ఎక్కడైనా లీక్ అయ్యిందా అనేది తెలుసుకోవచ్చు. మీ డేటా లీక్ అయ్యిందా లేదా అని తెలుసు కోవడానికి ప్రముఖ వెబ్‌సైట్ (https://haveibeenpwned.com/) అందుబాటులో ఉంది. ఈ వెబ్‌సైట్‌కి వెళ్లి ఫేస్‌బుక్‌ లాగిన్ ఇచ్చిన లేదా మీ ఈమెయిల్ చిరునామాను టైప్ చేయండి. ఈ వెబ్‌సైట్ మీ డేటా లీక్ అయిందో లేదా అనేది సూచిస్తుంది. ప్రస్తుతానికి, మీరు మీ ఇమెయిల్ చిరునామాను ఉపయోగించి మాత్రమే సెర్చ్ చేయగలరు.

 

Today Amazon offers Link