Friday, April 9, 2021

HPCL Engineer Recruitment 2021..హెచ్‌పీ‌సీ‌ఎల్ లో 200 ఇంజనీర్ ఉద్యోగాల కు నోటిఫికేషన్ విడుదల...

 

 


 

 

హెచ్.పీ.సీ.ఎల్ లో 200 ఇంజనీర్ ఉద్యోగాలు...

ముంబైలోని ప్రభుత్వ సంస్థ అయిన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఇంజినీర్ పోస్టుల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది మొత్తం 200 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

 

పోస్టుల వివరాలు:

మొత్తం ఖాళీలు: 200 ఉన్నాయి.

విభాగాల వారీగా ఖాళీల వివరాలు: 

 

1. మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో మొత్తం 120 ఖాళీలు ఉన్నాయి.

విద్యార్హత: కనీసం 60 శాతం మార్కులతో మెకానికల్, మెకానికల్ మరియు ప్రొడక్షన్ సబ్జెక్ట్స్ లో నాలుగు సంవత్సరాల  రెగ్యులర్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలి.

2. సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో మొత్తం 30 ఖాళీలు ఉన్నాయి.

విద్యార్హత: కనీసం 60 శాతం మార్కులతో సివిల్ ఇంజనీరింగ్ నాలుగు సంవత్సరాల రెగ్యులర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

3. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో మొత్తం 25 ఖాళీలు ఉన్నాయి.

విద్యార్హత: కనీసం 60 శాతం మార్కులతో ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ లో నాలుగు సంవత్సరాల రెగ్యులర్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

4. ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ విభాగంలో మొత్తం 25 ఖాళీలు ఉన్నాయి.

విద్యార్హత: కనీసం 60 శాతం మార్కులతో ఇన్స్ట్రుమెంటేషన్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ లో నాలుగు సంవత్సరాల రెగ్యులర్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయస్సు: ఈ పై అన్ని రకాల పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 25 సంవత్సరాలకు మించకూడదు. మరియు రిజర్వేషన్ కేటగిరీలో అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుందని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.


ఎంపిక ప్రక్రియ: ఎంపిక ప్రక్రియ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్, గ్రూప్ టెస్ట్, మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.

ఆన్లైన్ పరీక్ష విధానం: దీనిలో రెండు విభాగాలు ఉంటాయి.

1. జనరల్ ఆప్టిట్యూడ్: ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్, కాంపిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంటలెక్చువల్ అండ్ పొటెన్షియల్ టెస్ట్ ఉంటాయి.

2. టెక్నికల్/ ప్రొఫెషనల్ నాలెడ్జ్: ఇందులో అభ్యర్థులు వారు దరఖాస్తు చేసుకున్న పోస్టులకు సంబంధించిన సబ్జెక్ట్ నుండి ప్రశ్నలు వస్తాయి.

➥ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అర్హత సాధించిన అభ్యర్ధులను పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ టాప్ కి పిలుస్తారు. అభ్యర్థులు అన్ని సంబంధిత పరీక్షల్లో కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది.

జీతాల వివరాలు: ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు జీతం రూ. 50,000/- నుండి 1,60,000/- రూపాయల వరకు ఉంటుందని అధికారిక ప్రకటనలో తెలిపారు.


దరఖాస్తు ఫీజు:

➥ UR, OBCNC, మరియు EWS అభ్యర్థులకు రూ. 1180/-

➥ SC, ST, PwBD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. (వీరికి ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.)

Notification

దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.

https://hindustanpetroleum.com/hpcareers/current_openings