Tuesday, April 6, 2021

కేబుల్ కనెక్షన్ లేకుండా శామ్‌సంగ్ స్మార్ట్ టీవీలో ఉచితంగా ఛానెల్‌లను చూడవచ్చు.. ఎలా అనుకుంటున్నారా ?.

 

 


 

 ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్సంగ్ ఇండియాలో తాజాగా శామ్సంగ్ టివి ప్లస్ ;లాంచ్ గురించి ప్రకటించింది. అయితే శామ్సంగ్ టివి ప్లస్ తో టివి కంటెంట్ వినియోగదారులకు ఉచితంగా లభిస్తుంది.

సెట్ టాప్ బాక్స్ లేదా మరే ఇతర  డివైజెస్ లేకుండా ఎంచుకున్న ప్రత్యక్ష ఛానెల్‌లను ఇంకా ఆన్-డిమాండ్ వీడియోలను చూడవచ్చు. ఈ సర్వీస్ కోసం వినియోగదారులకు శామ్‌సంగ్ స్మార్ట్ టీవీ (2017 లేదా అంతకంటే పై మోడల్ ) ఇంకా ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం.

ఈ టీవీ ప్లస్ తో వినియోగదారులు వార్తలు, లైఫ్ స్టయిల్, టెక్నాలజి, గేమింగ్, సైన్స్, స్పొర్ట్స్, మ్యూజిక్, సినిమాలు, బింగిబుల్ షోలు వంటి వివిధ రకాలైన  కంటెంట్ ని కంటి రెప్పపాటు లో చూడవచ్చు అది కూడా ఎలాంటి సబ్స్క్రిప్షన్ లేకుండా.


Today Amazon offers Link


 ఈ టీవీ ప్లస్  అన్నీ శామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లలో ఇంకా టాబ్లెట్ డివైజెస్ లో అందుబాటులో ఉంటుంది. గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌ల కోసం ఈ సర్వీస్ ఏప్రిల్ 2021 లో ప్రారంభమవుతుందని  భావిస్తున్నారు. టీవీ ప్లస్ యాప్ శామ్‌సంగ్ గెలాక్సీ స్టోర్ ఇంకా గూగుల్ ప్లే స్టోర్ రెండింటి నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.  

 భారతదేశంతో పాటు శామ్సంగ్ టివి ప్లస్ ఇప్పుడు యు.ఎస్, కెనడా, కొరియా, స్విట్జర్లాండ్, జర్మనీ, ఆస్ట్రియా, యుకె, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, ఆస్ట్రేలియా, బ్రెజిల్, మెక్సికోలతో సహా 14 దేశాలలో అందుబాటులో ఉంది.

 ప్రపంచవ్యాప్తంగా శామ్సంగ్ టీవీ ప్లస్ వార్తలు, క్రీడలు, వినోదం ఇంకా అనేక ఇతర కంటెంట్ తో పాటు 800కి పైగా ఛానెల్‌లను శామ్‌సంగ్ స్మార్ట్ టీవీ, గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు అందిస్తుంది. 

Today Amazon offers Link