సెలవులు కదా! ఇంట్లోనే ఉన్నా... ఎక్కువగా నెట్టింట్లోనే విహారం! ఏం  చూస్తున్నారు? ఎక్కడ విహరిస్తున్నారు? తెలుసుకుంటే... బోల్డంత టైం  పాస్!బ్బా... ఎండలు మండిపోతున్నాయి! బయట తిరగడం కంటే నెట్టింట్లో  విహరించడమే నయం అనుకుంటూ సిస్టం ఆన్ చేస్తారు. నెట్‌కి కనెక్ట్ అవుతారు.  బ్రౌజర్ ఓపెన్ చేస్తారు. ముందు మెయిల్ చెక్ చేస్తారు. ఆ వెంటనే  ఫేస్‌బుక్‌లో అప్‌డేట్స్ చూస్తారు. తర్వాతే ఏం చేయాలో తెలియదు. కళ్లు  కాయలు కాసేలా కనిపించిన లింక్‌లపై క్లిక్ చేస్తారు. మౌస్ పాయింటర్‌ని  ఫాలో అవుతారు. విండోల మీద విండోలు ఓపెన్ చేస్తారు. కాసేపటికి బోర్  కొడుతుంది. షట్‌డౌన్ చేస్తారు. ఇదేనా టైంపాస్? అస్సలు కాదు. ఇవిగోండి  వేదికలు. ఫాలో అయిపోండి. బోల్డంత టైం పాస్!నెట్టింట్లో టైంపాస్ అంటే  ఎక్కువ శాతం సినిమాలో, ఏవైనా ఆసక్తికరమైన వీడియోలో చూస్తుంటాం. అందుకు ఉన్న  వేదికల్ని బ్రౌజ్ చేస్తుంటాం. ఇక యూట్యూబ్ గురించి వేరే చెప్పాలా?  నిత్యం ఏవొకటి చూస్తూనే ఉంటాం. సింపుల్‌గా సెర్చ్ ద్వారా చూడాలనుకునే  వీడియోని సెర్చ్ చేస్తాం. కానీ, మీరెప్పుడైనా యూట్యూబ్‌లోని ఛానల్స్‌ని  బ్రౌజ్ చేశారా? ఒక్కసారి యూట్యూబ్ హోం                 పేజీలోని మెనూలను గమనిస్తే మెనూ కనిపిస్తుంది. క్లిక్ చేస్తే ఛానల్స్  జాబితా కనిపిస్తుంది. వాటిల్లో యూట్యూబ్‌లో ఎక్కువ ఆదరణ పొందిన వాటిని  చూసేందుకు ఛానల్‌లోకి వెళ్లొచ్చు. వీడియోలను బ్రౌజ్ చేసి చూడొచ్చు. రోజూ  ఛానల్‌లోని అప్‌డేట్స్ మీ యూట్యూబ్ హోం పేజీలో కనిపించేలా చేసేందుకు  చేసుకోండి. ఇదే మాదిరిగా మీకు మ్యూజిక్ వీడియోలు చూడడం ఇష్టమైతే  ఛానల్‌లోకి వెళ్లి చూడొచ్చు. ఉదాహరణకు 'యష్ రాజ్ ఫిల్మ్స్'లోని పాటల్ని  చూసేందుకు ఛానల్‌ని చేసుకోవచ్చు.ఇక కామెడీ ఛానల్స్ చూస్తూ నవ్వుల పువ్వులు  పూయించేందుకు చాలానే యూట్యూబ్ ఛానళ్లు ఉన్నాయి. ఉదాహరణకు ఈటీవీలో  ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ ప్రోగ్రాంని చూసేందుకు ఛానల్‌ని  చేసుకోవచ్చు. ఇదే మాదిరిగా బ్రౌజ్ చేస్తే ఛానళ్లు అనేకం.యూట్యూబ్‌లో  ఐపీఎల్ అప్‌డేట్స్‌ని చూసేందుకు ఛానల్‌ని ఓపెన్ చేయండి.వినోదాన్ని  పక్కనపెట్టి విజ్ఞానాన్ని పొందేందుకు ఛానళ్లను బ్రౌజ్ చేసి చూడొచ్చు.  ఉదాహరణకు పిల్లలకు రైమ్స్‌ని యూట్యూబ్ ద్వారా బోధించేందుకు ఛానల్ ఉంది.  3డీలో వీడియో పిల్లల్ని భలే ఆకట్టుకుంటాయి. ఇంకా పిల్లలకు లాంటి మరిన్ని  ఛానళ్లు ఉన్నాయి.మీ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఏం చేయాలి? ఎలా కష్టపడాలి?  లాంటి విషయాల్ని తెలుసుకుని 'పర్సనాలిటీ డెవలప్‌మెంట్'ని  పెంపొందించుకునేందుకు చక్కని యూట్యూబ్ ఛానళ్లు ఉన్నాయి. కావాలంటే ఛానల్  చూడండి. దీంట్లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు చెప్పే వ్యక్తిత్వ వికాస  పాఠాల్ని చూడొచ్చు. ఆచరించేందుకు కావాల్సిన శక్తిని పొందొచ్చు.ఇంట్లో  బోరింగ్‌గా అనిపిస్తే మీరో శాస్త్రవేత్తగా మారి ప్రయోగాలు చేయవచ్చు. అందుకు  ఛానల్‌ని చూడొచ్చు. ఇంట్లోనే అందుబాటులో ఉండే వాటితో సృజనాత్మకంగా  ఎన్నెన్ని ప్రయోగాలు చేయవచ్చో చూడొచ్చు. ప్రతి ప్రయోగం వెనక ఓ ప్రయోజనం  ఉంటుంది.ఆలోచించాలేగానీ సృజనాత్మకమైన ఆలోచనలు ఒకటా, రెండా. ఆచరణలో పెడితే  ప్రయోజనాలు అనేకం. అలాంటి ఆలోచనల్ని ప్రపంచానికి పరిచయం చేసే వేదికే ఈ  ఛానల్‌లో ప్రపంచ వ్యాప్తంగా యువత పంచుకునే ఆలోచనల్ని వీక్షించొచ్చు.కాసేపు  ఆన్‌లైన్ పాఠ్యాంశాల్ని చూద్దాం అనుకుంటే ఛానల్ ఉంది. మీరు చదువుతున్న  తరగతి, ఇష్టమైన పాఠ్యాంశాల ఆధారంగానో వీడియోలను ఎంపిక చేసుకుని చూడొచ్చు.  ఇలాంటిదే మరో ఛానల్ ఆంగ్లంపై పట్టు సాధించేందుకు యూట్యూబ్‌లో చాలానే  ఛానళ్లు ఉన్నాయి. వాటిని చేసుకుని భాషపై పట్టు సాధించొచ్చు. ఛానళ్లు  కొన్ని... ఎప్పటికప్పుడు మార్కెట్‌లోకి కొత్త కంప్యూటర్ లాంగ్వేజ్‌లు  వస్తున్నాయి. అప్‌డేట్ అవుతూ అన్నీ నేర్చుకోవాల్సిందే. లాంటి కోర్సులకు  సంబంధించిన ట్యుటోరియల్స్ కోసం యూట్యూబ్ ఛానళ్లు చూడొచ్చు. వాటిల్లో  కొన్ని... కొత్త వంటల్ని నేర్పించే వంట ఛానళ్లూ అనేకం. ఇవిగోండి... మొబైల్  మెమొరీ కార్డ్‌లోనూ... సిస్టం హార్డ్‌డిస్క్‌లోనూ ఫొటోలు లెక్కకు  మిక్కిలే. నచ్చిన వాటిని ఎడిట్ చేస్తుంటాం. మీరెప్పుడైనా సైట్‌ని  ప్రయత్నించారా? ఉచితంగా వెబ్ సర్వీసుని వాడుకోవచ్చు. నెటిజన్లు యూజర్  ఫ్రెండ్లీగా వాడుకునేలా వెబ్ సర్వీసుని రూపొందించారు. దీంట్లో కేవలం ఫొటో  ఎడిటింగ్ మాత్రమే కాదు. ఫేస్‌బుక్ హోం పేజీలో పెట్టుకునేందుకు  'ఫేస్‌బుక్ కవర్స్'ని కూడా క్రియేట్ చేయవచ్చు. హోం పేజీలో విభాగాలు  ఉంటాయి. 'ఫొటో ఎడిటర్' ద్వారా క్రాప్, రిసైజ్ లాంటివే కాకుండా ఇంకా  చాలానే చేయవచ్చు. అందుకు అనువుగా ప్రత్యేక టూల్‌బార్ ఉంది. వెబ్  సర్వీసుని సాఫ్ట్‌వేర్ మాదిరిగా ఫుల్‌స్క్రీన్‌లో వాడుకునేందుకు  సెట్టింగ్స్‌మెనూలో ఉంది. వెబ్‌సైట్‌ని బ్రౌజర్ 'హోంస్క్రీన్'గా  పెట్టుకోవచ్చు కూడా. లోకి వెళ్లి ఎక్కువ ఫొటోలను ఆల్బమ్‌గా డిజైన్  చేసుకోవచ్చు. ఫొటోలతో 'ఫేస్‌బుక్ కవర్' క్రియేట్ చేసుకునేందుకు మెనూలోకి  వెళ్లండి. ఆప్స్ రూపంలోనూ మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.  ఆండ్రాయిడ్ మొబైల్ వాడుతున్నట్లయితే లింక్‌లోకి వెళ్లండి.యాపిల్  ఉత్పత్తుల్ని వాడుతున్నట్లయితే ఐట్యూన్స్ నుంచి పొందొచ్చు. డిజిటల్  ఫొటోని అప్‌లోడ్ చేసి దాన్ని పెయింట్ మాదిరిగా మార్చుకునేందుకు ప్రత్యేక  సర్వీసు ఉంది తెలుసా? బ్రెష్‌తో మీరే పెయింట్ వేయాలన్నమాట. అదెలాగో  చూద్దాం అనుకుంటే సైట్‌లోకి వెళ్లండి. ఫొటోని అప్‌లోడ్ చేసి బ్రెష్‌తో  తీస్తూ పెయింట్‌లా మార్చాలి. కావాల్సిన రంగుల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు.  బ్రెష్ సైజునీ మార్పులు చేసుకునే వీలుంది. ఇతరులు గీసిన వాటిని  'గ్యాలరీ'లోకి వెళ్లి చూడొచ్చు. పెయింట్‌లా గీసిన వాటిని ఇతరులకు షేర్  చేయవచ్చు కూడా.క్రోమ్ బ్రౌజర్ వాడుతున్నట్లయితే వినోదం పేరిట ఉన్న అన్ని  వెబ్ చిరునామాల్ని ఒకే చోట పెట్టుకోవచ్చు. అందుకు 'క్రోమ్ వెబ్  స్టోర్'లోకి వెళ్లండి. అక్కడ అందుబాటులో ఉన్న సర్వీసుల్ని ఎంపిక చేసుకుని  ఐకాన్ గుర్తులుగా బ్రౌజర్‌లోనే ఇన్‌స్టాల్ చేసుకుని ఫుల్ టైం పాస్  చేయవచ్చు. వినోదం, విజ్ఞానం... అన్నీ ఉన్నాయి. ఉదాహరణకు తెలుగు, హిందీ,  తమిళ్... పాటల్ని ఒకే క్లిక్‌తో వినేందుకు పాటల స్థావరాన్ని బ్రౌజర్‌లోనే  నిక్షిప్తం చేసుకోవచ్చు. ఇన్‌స్టాల్ చేశాక పై క్లిక్ చేస్తే చాలు సైట్  ఓపెన్ అవుతుంది. కావాలంటే లింక్‌లోకి వెళ్లండి.క్లిక్‌తో ఆన్‌లైన్‌లోనే  ఫొటోలు ఎడిట్ చేసేందుకు వెబ్ సర్వీసు ఉంది. దాన్నే ఆప్ రూపంలో క్రోమ్  బ్రౌజర్‌లోనే ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఎడిట్ చేసిన వాటిని క్లౌడ్  స్టోర్‌లో భద్రం చేసుకోవచ్చు. ఎంతసేపూ ఇంట్లో టీవీనేనా? నెట్టింట్లో  అందుబాటులో ఉన్న వీడియోలను వీక్షించేందుకు ఆప్‌ని బ్రౌజర్‌కి జత చేయవచ్చు.  ఇన్‌స్టాల్ చేయగా వచ్చిన ఐకాన్ గుర్తుపై క్లిక్ చేసి ఆయా టీవీ  ఛానళ్లలోని వీడియోలను చూడొచ్చు. నచ్చిన ఫొటోలతో ఎప్పటికప్పుడు ఫేస్‌బుక్  కవర్స్ క్రియేట్ చేసి మార్చడం అలవాటా? అయితే, ఆన్‌లైన్‌లో ఓ సులువైన  మార్గం ఉంది. బ్రౌజర్‌కి జత చేసి వాడుకోవచ్చు. ప్రయత్నించి చూద్దాం  అనుకుంటే సర్వీసుని యాడ్ చేయండి. ఐకాన్ గుర్తుపై క్లిక్ చేస్తే సైట్  ఓపెన్ అవుతుంది. కవర్‌లోకి ఫొటోని అప్‌లోడ్ చేసుకుని క్రియేట్ చేయాలి.  డిజైన్ చేసి ఉన్న కవర్స్‌ని బ్రౌజ్ చేసి ఫేస్‌బుక్ కవర్‌గా  పెట్టుకోవచ్చు. రజినీకాంత్ స్త్టెల్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది!  ఆయన ఏం చేసినా స్త్టెలే. ఏది మాట్లాడినా అదిరే డైలాగే. అందుకే రజనీపై ఏకంగా  ప్రత్యేక వెబ్‌సైటే ఉంది. కావాలంటే సైట్‌లోకి వెళ్లండి. ఫన్నీగా రజనీ  స్త్టెల్‌లో బోల్డన్ని డైలాగ్స్ ఉంటాయి. నచ్చితే లైక్ కొట్టొచ్చు.  ఫేస్‌బుక్‌లోనూ షేర్ చేయవచ్చు. విభాగంలోకి వెళ్లి ఆయనపై రూపొందించిన  యానిమేషన్ వీడియోలను చూడొచ్చు. నచ్చిన వాటిని షేర్ చేయవచ్చు కూడా. ఇక  రజనీ స్త్టెల్‌లో వీడియో గేమ్ కూడా ఆడొచ్చు. అందుకు 'గేమ్స్' మెనూలోకి  వెళ్లండి. పేర్లతో రెండు గేమ్స్ ఆడొచ్చు. మొదటి గేమ్ గన్ ఫైరింగ్.  రెండోది పజిల్ గేమ్. మీరు కూడా ఏదైనా డైలాగ్‌ని సైట్‌లో పోస్ట్  చేయవచ్చు. అందుకు మెనూలోకి వెళ్లి లాగిన్ అవ్వండి.ఇష్టమైన పాటల్లోని  పల్లవి లేదా చరణాన్ని రింగ్‌టోన్‌గా పెట్టుకోవాలనుకుంటున్నారా? ఖాళీనే కదా!  ఇదిగో ఆన్‌లైన్ సర్వీసు ప్రయత్నించండి. సైట్‌లోకి వెళ్లి ద్వారా  సిస్టంలోని పాటని సెలెక్ట్ చేసుకోవాలి. అప్‌లోడ్ అయ్యాక పాటలోని  కావాల్సిన భాగాన్ని ఎంపిక చేసుకుని ప్లే చేసి చూడొచ్చు. అంతా పూర్తయ్యాక  బటన్‌పై క్లిక్ చేసి రింగ్‌టోన్‌ని కట్ చేయవచ్చు. తర్వాత సిస్టంలోని  డౌన్‌లోడ్ చేసుకుని రింగ్‌టోన్‌గా వాడుకోవచ్చు.