అవసరం ఏ రూపంలో ఎలా వస్తుందో తెలియదు. అందుకే ముందుగానే అన్ని విషయాల్లో జాగ్రత్త పడుతుంటాం. మరి, పీసీ వాడకం విషయంలోనూ మీ ఆలోచన ఇదేనా? అయితే, ఈ బుల్లి అప్లికేషన్లను భద్రం చేసుకోండి. అవసరానికి అందుబాటులో ఉంటాయి. అన్నీ ఉచితం కూడా!పేరు: విషయం: సిస్టం అన్నాక ఏవేవో సాఫ్ట్‌వేర్‌లు ఉంటాయి. మరి, మీకు తెలుసా? వాటికి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కూడా ఆన్‌లైన్‌లో విడుదల అవుతుంటాయని! అబ్బే... అవన్నీ చేసేంత సమయం మాకు ఎక్కడుంది అంటారా? అందుకే ఈ టూల్. దీన్ని నిక్షిప్తం చేసుకుని రన్ చేస్తే సిస్టంలోని సాఫ్ట్‌వేర్‌లను స్కాన్ చేసి చూపిస్తుంది. ఏమేం అప్‌డేట్ అయ్యాయి? వేటికి అప్‌డేట్స్ అవసరం అనే వివరాల్ని విశ్లేషించి ఫలితాల్ని అందిస్తుంది. ఏదైనా టూల్‌ని అప్‌డేట్ చేయాలనుకుంటే ద్వారా కొత్త వెర్షన్ని పొందొచ్చు. సిస్టం డ్రైవర్స్ వివరాల్ని కూడా అందిస్తుంది.సైట్:పేరు: ఇన్‌బాక్స్‌కి వచ్చిన ఫైల్స్ కావచ్చు... నెట్ నుంచి పొందినవి కావచ్చు... కొన్నిసార్లు వాటిని ఏయే సపోర్టింగ్ టూల్స్‌తో ఓపెన్ చేయాలో తెలియదు. అలాంటప్పుడు ఏం చేస్తారు? సింపుల్ 'ఫ్రీ' ఓపెనర్‌ని ఇన్‌స్టాల్ చేసుకుంటే సరి. ఆఫీస్ ఫైల్స్, ఇమేజ్ ఫైల్స్, వీడియోలు, పీడీఎఫ్‌లు, టొరెంట్ ఫైల్స్, కోడ్ ఫైల్స్, వెబ్ పేజీలతో పాటు సుమారు 80 రకాల ఫైల్ ఫార్మెట్‌లను సపోర్ట్ చేస్తుంది. అంటే... లాంటి ఫైల్స్‌ని ఓపెన్ చేసేందుకు అప్‌డేటెడ్ ఎమ్మెస్ ఆఫీస్ అక్కర్లేదన్నమాట. అలాగే... వీడియో, ఆడియో ఫైల్స్‌ని ఓపెన్ చేయాలంటే మల్టీమీడియా ప్లేయర్లే అక్కర్లేదు. ఫ్రీ ఓపెనర్‌తో చూడొచ్చు. వినొచ్చు.సైట్: పేరు:ఏదైనా ఆంగ్ల పదానికి అర్థం వెతకాలంటే? ఆన్‌లైన్ నిఘంటువునో... డెస్క్‌లో ఉన్న డిక్షనరీ కోసం వెతకక్కర్లేదు. 'వర్డ్‌వెబ్'ని ఓపెన్ చేయండి. ఎందుకంటే ఇది సాఫ్ట్‌వేర్ రూపంలో సిస్టంలో ఒదిగిపోతుంది. ఒక్కసారి ఇన్‌స్టాల్ చేశాక ఎప్పుడంటే అప్పుడు ఓపెన్ చేసుకుని పదాల అర్థాన్ని వెతకొచ్చు. అంతేకాదు... ఆ పదానికి సంబంధించిన 'వికీపీడియా'ని చూడొచ్చు. నెట్ కనెక్షన్ అందుబాటులో ఉంటే 'వర్డ్‌వెబ్ ఆన్‌లైన్' ద్వారా పదానికి సంబంధించిన ఇతర సమాచారాన్ని కూడా చూడొచ్చు. పదాన్ని ఎలా ఉచ్చరించాలో వినొచ్చు.సైట్: పేరు: గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ని వాడే ఉంటారు. దాంట్లోని ట్యాబ్ విండోల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదుగా! అదే మాదిరిగా 'విండోస్ ఎక్స్‌ప్లోరర్'ని వాడితే! అంటే... నిత్యం సిస్టంలోని ఫైల్స్‌ని చూడ్డానికి వాడే ఎక్స్‌ప్లోరర్‌లో ట్యాబ్ విండోలు ఓపెన్ చేసుకుని మరింత సులువుగా ఫైల్స్‌ని బ్రౌజ్ చేయవచ్చన్నమాట. కావాలంటే ఈ టూల్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇక ఎక్స్‌ప్లోరర్‌ని ఓపెన్ చేసి 'ప్లస్' గుర్తుపై క్లిక్ చేసి కొత్త ట్యాబ్ విండో ఫైల్స్‌ని బ్రౌజ్ చేయవచ్చు.సైట్: పేరు: విండోస్‌లో షార్ట్‌కట్‌ని దేనికి వాడతామని అడిగితే ఏం చెబుతారు? ఓపెన్ చేసి ఉంచిన ప్రోగ్రాంలు, ఫోల్డర్లు, ఫైల్స్‌లో ఒక దాంట్లో నుంచి మరో దాంట్లోకి వెళ్లేందుకు వాడతాం అని చెప్పేస్తారు! ఇలా చేసేప్పుడు ఆయా అప్లికేషన్లు, ఫోల్డర్ల ప్రివ్యూ చూసుకుని ఓపెన్ చేసుకోవచ్చు తెలుసా? అందుకే ఈ 'విస్టా స్విచ్చర్' టూల్. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీటల్ని కలిపి నొక్కితే అన్నింటినీ ఒకేచోట ప్రివ్యూ చూసుకుని ఓపెన్ చేయవచ్చు. విండోలో మౌస్ రైట్‌క్లిక్ ద్వారా ఓపెన్ చేసిన ఫోల్డర్లు, అప్లికేషన్లను మినిమైజ్, మ్యాక్సిమైజ్, రీస్టోర్... చేయవచ్చు. అక్కర్లేకుంటే 'క్లోజ్' చేయవచ్చు కూడా. సిస్టం ట్రేలోని ఐకాన్ గుర్తుపై క్లిక్ చేసి ద్వారా మార్పులు చేసుకునే వీలుంది.సైట్: పేరు: ఎక్కువగా సిస్టంపై పని చేసే వారి కళ్లు ఒత్తిడికి గురవుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో తెరని కళ్లకు అనువుగా మార్చుకోవచ్చు. అందుకు అనువైనదే ఈ టూల్. రోజులో వివిధ సమయాల్లో డిస్‌ప్లేని మార్పులు చేస్తుంది. సమయం, వాతావరణ వివరాల్ని ఇన్‌పుట్‌గా తీసుకుని తెర డిస్‌ప్లేని మార్చేస్తుంది.సైట్: పేరు: సిస్టంలో ఏదైనా వెతకాలంటే... విండోస్ ఓఎస్‌లో 'సెర్చ్' ఆప్షన్ ఉంది. అంతకంటే యూజర్ ఫ్రెండ్లీగా ఫైల్స్‌ని వెతికి చూసేందుకు అనువైన టూల్స్ చాలానే ఉన్నాయి. వాటిల్లో ఈ టూల్ ఒకటి. తక్కువ మెమొరీతో చిటికెలో ఇన్‌స్టాల్ అయ్యి సిస్టం ట్రేలో చేరిపోతుంది. రన్ చేసి సెర్చ్‌బాక్స్‌లో పేరు ఎంటర్ చేస్తే చాలు. మొత్తం ఫైల్స్, ఫోల్డర్లను ముందుంచుతుంది. విండోస్ ఎక్స్‌ప్లోరర్ మాదిరిగానే ఓపెన్ చేసి చూడొచ్చు. ఉదాహరణకు సిస్టంలో ఉన్న అన్ని మ్యూజిక్ ఫైల్స్‌ని చూడాలనుకుంటే సెర్చ్‌బాక్స్‌లో అని టైప్ చేస్తే చాలు.సైట్: పేరు: నెట్ కనెక్షన్ ఉందంటే ఏదో ఒక డౌన్‌లోడ్ చేస్తుంటాం. మరి, ఆయా డౌన్‌లోడ్స్‌ని మేనేజ్ చేసుకోవడానికి అనువైన వేదికే ఇది. సైట్ నుంచి నిక్షిప్తం చేశాక పై క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేయాలనుకునే మీడియా ఫైల్ తాలూకు సమాచారాన్ని ఎంటర్ చేయాలి. డౌన్‌లోడ్ ఫైల్ ఎక్కడ సేవ్ అవ్వాలనేది కూడా మీరే నిర్ణయించొచ్చు. ఇదే మాదిరిగా వీడియో షేరింగ్ సైట్స్ నుంచి కావాల్సిన వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అందుకు మెనూలోకి వెళ్లాలి. అక్కడి బాక్స్‌లో డౌన్‌లోడ్ చేయాలనుకునే ఫైల్ లింక్‌ని ఎంటర్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ క్వాలిటీని కూడా ఎంపిక చేసుకోవచ్చు. టూల్‌ని క్లోజ్ చేసినా డౌన్‌లోడ్ స్టేటస్‌ని తెరపై చూడొచ్చు. ద్వారా డౌన్‌లోడ్ ఫైల్స్‌ని మేనేజ్ చేయవచ్చు.సైట్: పేరు: అక్కర్లేని ఫైల్స్‌ని డిలీట్ చేస్తుంటారు. కొన్నిసార్లు అవి డిలీట్ అవ్వవు. ఏదో ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది. చదివేంత ఓపిక ఉండదు. డిలీట్ చెయ్యడానికి ఏం చేయాలో తెలియదు. అలాంటప్పుడు ఏంటి పరిస్థితి? సింపుల్ ఈ 'అన్‌లాకర్'ని వాడితే సరి. ఎప్పుడైనా డిలీట్ అవ్వకుండా మొరాయించే ఫైల్‌పై రైట్‌క్లిక్ చేస్తే మెనూలో అన్‌లాకర్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి ఆ ఫైల్‌కి ఉన్న మొత్తం కనెక్షన్స్‌ని అన్‌లాక్ చేస్తే ఫైల్ తొలగిపోతుంది.సైట్: పేరు: వివిధ అవసరాలకు కంప్యూటర్లను వాడుతుంటాం. కొన్నిసార్లు డిజైనింగ్ పనులు చేస్తాం... మరి కొన్నిసార్లు డాక్యుమెంట్ ఫైల్స్‌ని క్రియేట్ చేస్తుంటాం. ఇంకొన్నిసార్లు మల్టీమీడియా అవసరాలకు వాడుతుంటాం. వీటన్నింటికీ సంబంధించిన ఆప్స్‌ని డెస్క్‌టాప్‌పై ఐకాన్స్ రూపంలో పెట్టుకుంటాం. మరి, ఇవన్నీ కుప్పగానో, చిందర వందరగానో ఉంటే? పని చేయడం కష్టం అవుతుంది. అదే అవసరాలకు తగినట్టుగా విభజించి ఐకాన్లను అమర్చుకుంటే? పని సులువు అవుతుంది. మరెందుకాలస్యం ఈ టూల్‌ని నిక్షిప్తం చేసుకోండి.సైట్:పేరు: ఏదైనా ఫైల్, ఫోల్డర్‌ని ఓపెన్ చేయాలంటే? అది ఎక్కడుందో తెలియాలి. అంటే 'ఫైల్, ఫోల్డర్' పాత్ ఏంటో తెలుసుకోవాలి. ఆ పాత్‌ని చూడడం కూడా ఒక పనే. ఫైల్‌పై రైట్‌క్లిక్ చేసి 'ప్రాపర్టీస్'లోకి వెళ్లి 'లొకేషన్' ఏంటో చూస్తేగానీ తెలియదు. ఆ లొకేషన్‌న్ని కూడా ఉన్నది ఉన్నట్టుగా గుర్తుపెట్టుకోవడం కూడా కొంచెం కష్టమే. అందుకే నోట్ చేసుకుంటాం. ఇలాంటి సమస్య లేకుండా... ఫైల్, ఫోల్డర్ల పొందేందుకు ఈ 'పాత్ కాపీ' టూల్‌ని వాడొచ్చు. ఇన్‌స్టాల్ చేశాక ఏదైనా ఫైల్, ఫోల్డర్‌పై రైట్‌క్లిక్ చేస్తే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే పాత్ కాపీ అవుతుంది. ఇక ఎక్కడంటే అక్కడ పాత్‌ని పేస్ట్ చేసుకోవచ్చు.సైట్: పేరు: ఒక్కసారి సిస్టం ఆన్ చేశాక ఏమేం రన్ అవుతున్నాయి? ఏయే టూల్స్ ఎంతెంత మెమొరీ తీసుకున్నాయి? ఏ యూజర్ ఎకౌంట్‌తో అవి రన్ అవుతున్నాయి? వాటి ఫైల్ పాత్ ఎక్కడ?... లాంటి విషయాల్ని ఎప్పుడైనా ఆలోచించారా? అబ్బే... అవసరం రాలేదంటారా! అయితే, ఈ 'డీటాస్క్‌మేనేజర్'లో సులువుగా చూడొచ్చు. అంతేకాదు... ఏదైనా ప్రోగ్రాం వల్ల సిస్టం హ్యాంగ్ అవుతున్నట్లు అనిపిస్తే 'కిల్' చేయవచ్చు. లేదంటే... చేయవచ్చు. మరెందుకాసల్యం... ప్రయత్నించండి!సైట్: